మత్స్య మహా పురాణము
127 - త్రిపురాసురోపాఖ్యానము-మయాదులకు బ్రహ్మవర ప్రాప్తి
ఋషయః : కథం జగామ భగవానురారిత్వం మహేశ్వరః।
దదాహ స కథం దేవ స్తన్నో విస్తరతో వద॥
పృచ్చామ స్త్వాం వయం సర్వే బహుమానా త్పునః పునః ।
త్రైపురంచ యథా దుర్గం మయమాయా వినిర్మితమ్॥
దేవేనై కేషుణా దగ్ధం తథా త్వం వద మానవ ।
సూతః : శృణుడ్వం శ్రీపురం దేవో యథా దాహితవా నవః॥
మయోనామ మహామాయీ మాయానాం జనకో ఒసురః ।
నిర్జిత సతు సజ్జామే తతాప పరమం తపః॥
తపస్య నంతు తం విప్రా దైత్యేశోవర్యనుగ్రహాత్ ।
తస్యైవ కృతముద్దిశ్య తేపతుః పరమం తపః॥
విద్యున్మాలిచ బలవాం స్తార కాక్షస్తు వీర్యవాక్ ।
మయతేజ స్సమా కాస్తో తేపతు ర్మయపార్శ్వగౌ॥
లోకా దేవా యథా మూర్తి స్త్రయ స్త్రయ ఇవాగ్నయః ।
లోకత్రయం తాపయ న స్తే పు ఠాన స్తపః ॥
హేమ నే జలశయ్యాసు గ్రీష్మే పడ్చాతపా స్తథా ।
వరాసుచ తథాకా శే క్షపయస్త స్తపఃప్రియాః॥
సతే)వనా త్ఫలమూలాని స్వాధూనిచ మృపూనిచ ।
అన్యథా రచితాహారాః పం కేనావృతవల్కలాః॥
మగ్నా శైవాలూ శేషు సమలే ష్వమలేషుచ ।
నిర్మాంసాశ్చ తథా జాతాః కృశా గమనిసన్తతాః॥
తేషాం తపఃప్రభావేన నాబభౌ విద్రుమం తథా ।
నిమ్ర్పభంచ జగత్సర్వం మన్జతేజా విభావసుః॥
దహ్యమానేషు లో కేషు తే స్త్రీభి ర్గానవాగ్ని భిః ।
తేషాంమధ్యే జగద్భనుః ప్రాదుర్భూతః పితామహః॥
మయాదీనాం వరప్రదానార్థం బ్రహ్మావిర్భావః॥
తత స్తే లోకకర్తారం తందృష్ట్వా సహసాగతమ్ ।
స్వయం పితామహం దైత్యా నేము స్తుష్టపు రేవత॥
అథ తాజా దానవా న్బహ్మా తపసా తపనప్రభా ।
ఉవాచ హరపూర్ణాజ్ఞాక్ హరపూర్ణముఖేక్షణః॥
వర దోహం హి వో వత్సా స్తపస్తోషిత ఆగతః ।
భవతా మీప్సితం యద్వా నవిచారం తదుచ్యతామ్॥
[విశేషము: దేవాసుర యుద్ధములు మొత్తము పండ్రెండు అని లోగడ నలువది ఏడవ అధ్యాయమున చెప్ప బడినది. వానిలో ఈ త్రిపుర యుద్దము ఏడవది. మిగిలిన వానిలో వృత్రవధము మాత్రము (పురాణములలో) భాగవతమునందును భారతము నందును (ఇతిహాసమున) వర్ణింపబడినది. మిగిలిన దానిలో పండ్రెండవది లోగడ నలువది ఏడవ అధ్యాయములో చెప్పబడినది. నారసింహ వామనవరాహామృతమంథన తారకామ యాడీవధాంధకారములును ఈ మత్స్య పురాణము నందేయున్నవి. ఈ దేవాసుర సంగ్రామములన్నియు శాస్త్రీయాశాస్త్రీయ చిత్తవృత్తులకును జ్ఞానా జ్ఞానములకును వివేకా వివేకములకును నడుమ జరిగిన పోరాటములు. వీనిలో చివరకు శాస్త్రీయ చిత్తవృత్తికే గెలుపు కలిగి భగవదుపాసనముతో ప్రాణులు తరించు మార్గమే పైచేయిగా మిగులుట ఈ దేవాసుర యుద్ధముల పరమ తాత్పర్యము. వీనియందు వేదిక సంప్రదాయ తత్వములు రహస్యాత్మక ములుగ అంతర్ని హితములై యున్నవి. వానిని సంప్రదాయజ్ఞులవలన తెలిసికొనదగును. ప్రకృత మీ శ్రీ పురవధమను దేవాసుర సంగ్రామమున ఉపాసన విధానముల సంకేతము గూఢముగను శాస్త్రీయా శాస్త్రీయ చిత్తవృత్తులపోరు బాహ్యముగను ప్రతిపాదింపబడినది.]
ఋషులు సూతునిట్లడిగిరి: భగవానుడగు మహేశ్వరుడు పురారి ఎట్లయ్యెను? (పుర + అరి = పురములకు శత్రువు.). ఆదేవుడు పురములనెట్లు దహించెను? మాకది విస్తరించి చెప్పుము. ఆ కథయందును అది చెప్పగల వాడవని నీయందును గల ఆదరముతో మేము నిన్ను మరల మరల (బ్రతిమాలి) అడుగుచున్నాము. మయమాయా వినిర్మితమగు శ్రీ పుర దుర్గమును మహాదేవుడొకే బాణముతో నెట్లు దహించెను? ఆ విధము ఆదరణీయుడవగు సూతా! మాకు తెలుపుము. అనగా సూతుడు ఇట్లు చెప్పనారంభించెను: దేవుడగు భవుడు తై పుర దుర్గములనేట్లు దహించెనో తెలి పెద; వినుడు. మహామాయాశాలియు మాయలకు జనకుడునగు మయుడను అసురుడుండెను. వాడు దేవతలతో సంగ్రామమున ఓడి పరమ తపమాచరించెను. అతడు తపమాచరించుచుండగా ఆ మయ తేజస్సునకు లోబడిన వారు బలవంతుడగు విద్యున్మొలి వీర్యశాలియగు తార కాక్షుడునను అసురులును మయుని యందలి అనుగ్రహబుద్ధితో ఆతని సంకల్పమునే తామును ఉద్దేశించి మయుని సమీపముననే ఉండి పరమతప చూచరించిరి. రూపొందిన లోకత్రయము వలె (బ్రహ్మ విష్ణు రుద్రులను) దేవత్రయమువలే అగ్నిత్రయమువలె కనబడుచు లోకత్రయమును సంతాపింపజేయుచు ఆ దానవులుతపమాచరించుచుండిరి. వారు తపః ప్రియులై హేమంతమున జలశయ్యల పైనుండీ గ్రీష్మమున పంచాగ్ని మధ్యమందుండి వర్షర్తువుసం:కు నిరవరణమగు ఆకాశము క్రింద నిలిచి గడ పుచుండిరి. వారు క్రమముగా వనమునుండి సంపాదించుకొనిన రుచ్యములు మృదువులునగు ఫలములు మూలములు పిమ్మట మరియొక విధమగు కఠినమగు) ఆహా రములు తీసికొనుచుండిరి. సమలములును అమలములును సగు జలములందు నాచు తోళ్ళయందు నిలిచియు తమ వల్కలములు బురదతో కప్పుపడియు ఉండుచు శరీరములు చిక్కిపోయి ధమనులతో వ్యాపము కాగా మాంసమే రేక తపమాచరించసాగిరి. వారి తపోగ్ని ప్రభావమున పగడ మేదియో గుర్తింపరాక పోయెను. సర్వజగత్తును కాంతిహీన మయ్యెను. అగ్ని సూర్యులు మంద తేజస్కులయిరి. దానవులనెడు ఆమూడు అగ్ను లచే ఇట్లు లోకములు దహింప బడుచుండ జగద్బంధుడగు బ్రహ్మ వారి నడుమ సాక్షాత్కరించెను. అంతట ఆకస్మికముగ స్వయముగ వచ్చిన లోక కర్తయగు పితామహుని చూచి దైత్యులు సమస్కరించి స్తుతించిరి. తపస్సుచే రవివలే వెలుగుచు తనుగాంచి హర పూర్ణముఖ నేత్రులగు ఆ దానవులతో హర పూర్ణముఖ నేత్రుడగుచు బ్రహ్మ ఇట్లు పలికెను: నాయనలారా! నేను మీ తపమునకు తుష్టుడనై వర మీయవచ్చితిని. మీకోరిక ఏమి యా సంకోచిపక తెలుపుడు.
ఇత్యేవముచ్యమానస్తు ప్రసన్నం ప్రపితామహమ్ ।
విశ్వకర్మా మయః ప్రాహ ప్రహర్షోత్బుల్లలోచనః॥
దేవః దైత్యాః పురా దేవై స్సజ్గ్రామే తార కాహ్వయే ।
నిర్జితాశ్చ హతా శ్చైవ నిస్త్రాం శై రాయుధై రపి॥
దేవై సదాశివిద్దాజ్ఞి బాధితో భయపితాః ।
శరణం నైవ జానీయు స్సర్వధా శరణార్థినః॥
సోహం తపఃప్రభావేన భవద్భక్త్యా తథైవచ ।
ఇచ్చామి దుర్గం తత్కర్తుం యద్దేవైరపి దుర్సమమ్॥
తస్మింశ్చ త్రిపురే ది వ్యే మత్కృతే కృతినాంవర ।
కృత్యానాం జలజానాంచ దోషాణాం వహ్ని తేజసామ్॥
దేవప్రహరణానాంచ దేవానాంచ ప్రజాపతే ।
అలజనీయం భవతు త్రిపురం యది తే ప్రియమ్॥
విశ్వకర్మా ఇతివోక్త స్సదా విశ్వకర్మణా ।
ఉవాచ ప్రహసన్వాక్యం మయదై త్యగణాధిప॥
సర్వాయర త్వం నై నొ స్తి ససద్వృత్తస్య దాసవ ।
తస్మాద్దుర్గ విధానం క్షణాదపి విధీయతామ్॥
పితామహవచ శ్రుత్వా ఇత్యేవం దానవో మయః ।
ప్రాజ్ఞులిః పునరప్యాహ బ్రహ్మాణం పద్మసమ్భవమ్॥
యత్త దేకేషుణా దుర్గం సకృన్ము క్తేన నిర్ద హేత్ ।
సచన స్సంయుగే హన్యా దవధ్య శ్శేషతో భవేత్॥
ప్రసన్నుడయి ఇట్లు పలికిన బ్రహ్మతో విశ్వకర్మయగు మయుడు ప్రహర్షమున కనులు విప్పార ఇట్లనెను. దేవా! పూర్వము తారక యుద్ధమున దైత్యులు దేవతల చేతిలో ఓడిరి. ఖడ్గములతో ఆయుధములతో కొట్టి చంపబడిగి. ఎడ తెగక మావారి దేహములు దెబ్బతినేను. వారు బాధితులు భయకంపితులు నేరి. వారు శరణార్థులేరికాని తమకు శరణమేదియో వారెరుగరైరి. ఇట్టి స్థితిలో నేను తపఃప్రభావము చేతను నీ సేవకు ఫలము గాను దేవతలకును చొరరాని దుర్గము నిర్మింపదలచు చున్నాను. నిర్మాతలలో శ్రేష్టుడవగు ప్రజాపతీ! నేను నిర్మించు ఆ త్రిపుర మను దివ్యదుర్గము ఎట్టి కృత్యములకును కృత్య అనేడు ఆభిచారిక శక్తులకును జలదోషములకును అగ్ని తేజస్సులకును దేవతల ఆయుధముల కును దేవతలకును కూడ చేర రానిది కావలయును.
ఈ మాట విని విశ్వ సృష్టికర్తయగు బ్రహ్మ నవ్వుచు విశ్వకర్మయగు మయునితో ఇట్లు పలికెను: దైత్యగణా ధిపా! మయా! సద్వర్తనము లేని నీ కెవ్వనికిని సర్వామరత్వము లభింపదు. కనుక (అమరత్వము కోరక) క్షణ కాల ములో దుర్గ నిర్మాణమే చేసికొనుము. బ్రహ్మ మాట విని మయుడు ప్రాంజలియై పద్మసంభవుడగు బ్రహ్మతో మరల ఇట్లనెను: “ఒ కేసారి విడిచిన ఒకే బాణముతో మాత్రమే నేను నిర్మించు దుర్గమును కాలవలయును; మేమును చావవల యును. మరియొక విధమున మాకు వధ్యత్వ ముండరాదు.
ఏవమ స్వీతి చాప్యుక్త్వా మయం దేవః పితామహః ।
స్వప్నే లబ్ధో యథార్థాచు స్తథైవదర్శనం యయౌ॥
గతే పితామ హే దై త్యా గత్వా వహ్నిరవిప్రభాః ।
వరదృప్తా బభూవు స్తే తపసాచ మహాబలాః॥
మయ స్వథ మహాబుద్ధి ఫొనవో ఋషిసత్తమాః ।
దుర్గం వ్యవసితః కర్తుమితి చి నయతే తడా॥
కథంనామ భవేద్దుర్గం తస్మయా త్రిపురం కృతమ్ ।
వత్స్యతే తత్పురం దివ్యం మత్తః కోన్యో న సంశయః॥
యథా చై కేషపాతేన తత్పురం న విహన్యతే ।
దేవై స్తథా విధాతవ్యం మయా మతివిచారణాత్॥
విస్తరో యోజనశత మేకై కస్య పురస్యతు ।
కార్యం తేషాంచ విషమ్బ మేకైకం శతయోజనమ్॥
పుష్యయోగేచ నిర్మాణం పురాణాంచ భవిష్యతి ।
పుష్యయోగేనచ దివి సమేష్య ని పరస్పరమ్॥
పురాణ్యేకప్రహారేణ స తానిచ హనిష్యతి ।
ఆయసంతు క్షితితలే రాజతంతు సభస్టలే॥
రాజతస్యోపరిష్టాచ్చ సౌవర్ణం భవితా పురమ్ ।
ఏవం త్రిభిః పురై ర్యుక్తం త్రిపురం తద్బవిష్యతి॥
శతయోజనవిష్కమ్భైర నరై(విస్తారైరస్తరై) సద్దురాసదమ్ ।
అట్టాల కై ర్య శతఘ్ని భిశ్చ సశ క్తిశూలోపలకమనైశ్చ॥
ద్వారై ర్మహామన్దర మేరుక ల్పైః ప్రాకార శృజైశ్చ విరాజమానమ్ ।
సతార కా షేణ మయేన గుప్తం ఖస్థంచ గుప్తం తటిన్ మాలినాచ॥
కోనామ హన్తుం త్రిపురం సమర్టో ముక్త్వా త్రిణేత్రం భగవన మేకమ్॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే త్రిపురోపాఖ్యానే మయాదీనాం బ్రహ్మదత్త వరాది కథనం నామ సప్తవింశత్యుత్తరశతతమోఽధ్యాయః॥
'అట్లే యగుగాక!' అని మయునితో పలికి బ్రహ్మదేవుడు స్వప్న మందు లభించిన ధనమువలె అదృశ్యు డయ్యెను. పితామహుడు ఏగిన తరువాత ఆగ్ని భాస్కర తేజులగు ఆ రాక్షసులును అటనుండి వెడలిరి. నాటినుండి వారు తపముచే మహాబలులగుటతోపాటు వరముచే మదించిరి. విస్తారైర నరై
ఋషి సత్తములారా! పిమ్మట మహాబుద్ధిశాలియగు ఆ మయుడు దుర్గము నిర్మింప సంకల్పించి ఇటు లాలోచించ సాగెను: నేను తప్ప మరి ఎవరును నివసింప అలవి కాని త్రిపుర దుర్గమును నేను ఎట్లు నిర్మింతును! నేను నా మతి విచా రణశ క్తి నుపయోగించి దేవతలు ఏక బాణపాతముతో దానిని విహతము చేయజాలకుండునట్లు ఆ దుర్గ మును నిర్మింపవల యును. ప్రతియొక పురమునకు పొడవు వెడల్పులు ఏక శత యోజనము లుండునట్లు నిర్మించును. పుష్యయోగమునందు ఆ పురముల నిర్మించి పుష్యయోగముననే అవి పరస్పరము కలియునట్లు చేయుదును. పుష్యయోగమున వానిని సమీపించి చేరినవాడు మాత్రమే వానిని ఏక శర ప్రహారముతో కొట్టివేయగలుగును. వానిలో అయోదుర్గము క్షితితలమున రజత దుర్గ మంతరిక్షమున సౌవర్ణ దుర్గ మంతకును మీద ఉండునట్లు ఆ త్రిపుర దుర్గ ము నిర్మితమగును. శతయోజన విస్తరము గల ఆంతరములతో ఆట్టాలకములతో యంత శతఘ్నులతో శకులు శూలములు ఉపలకంపనములు (డాలను కదలించు యంత్రములు) మహాద్వారములతో మేరు మందర సదృశ మహాప్రాకారములతో విరాజమానమగుచు ఏరికీని చేర రానిదయి తారకాక్ష మయ విద్యున్మాలులు కాపాడుచుండు ఆ త్రిపుర దుర్గమును భగవానుడగు త్రిణేత్రుడు కాక ఆన్యు డెవ్వడు నశింప జేయగలుగును ?
ఇది శ్రీమత్స్య మహాపురాణమున త్రిపురోపాఖ్యానమున మయాదులకు బ్రహ్మపరప్రా ప్తియను సూట ఇరువది ఏడవ అధ్యాయము.
Summary of chapter 127 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya reveals the structural mechanism holding the planetary sphere in space, centered upon Dhruva, the Pole Star. Bhagavān Matsya explains that all stars and planetary spheres are tied to Dhruva by invisible ropes of wind known as Vāyu-rashmi. As Dhruva rotates, it draws the entire celestial wheel along with it, ensuring that the stars and planets maintain their precise orbits without colliding or falling.