మత్స్య మహా పురాణము
75 - విశోక సప్తమీ వ్రతము
ఈశ్వరః : విశోకస ప్తమీం తద్వ ద్వక్ష్యామి మునిపుజ్గవ ।
యా ముపోష్య నరశ్శోకం స క దాచి దిహాశ్నుతే॥
మాఖే శుక్లతిలై స్స్నాత్వా పఞ్చమ్యాం శుక్లపక్షతః ।
కృతాహారః కృసపయా ద స్తధావనపూర్వకమ్॥
ఉపవాసవ్రతం కృత్వా బ్రహ్మచారీ భవే న్ని శి ।
తతః ప్రభాతే చోత్థాయ కృతస్నానజవ శ్శుచిః॥
కృత్వా తు కాఞ్చనం పద్మ మర్కాయేతి చ పూజయేత్ ।
కరవీరేణ ర క్తేన రక్తవస్త్రయుగేన చ॥
యథా విశోకం భువనం త్వయి చాదిత్య సర్వదా ।
తథా విశోకతా మే స్యా త్వద్భక్తిః ప్రతిజన్మని॥
ఏవం సమ్పూజ్య షష్ఠ్యాం తు శక్త్యా సమ్పూజయే ద్ద్విజా ।
సుప్త్వా సంప్రాశ్య గోమూత్ర ముత్థాయ కృతనై త్యకః॥
సమ్పూజ్య విప్రా నన్నేన గుడపాత్రసమన్వితమ్ ।
తద్వస్త్రయుగ్మం పద్మం చ బ్రాహ్మ ణాయ నివేదయేత్॥
అతై లలవణం భుక్త్వా సప్తమ్యాం మౌనసంయుతః ।
తతః పురాణ శ్రవణం కర్తవ్యం భూతిమిచ్ఛతా॥
అనేన విధినా సర్వ ముభయోరపి పక్షయోః ।
కుర్యా ద్యావ త్పున ర్మా ఘే శుక్లపక్షస్య సప్తమీమ్॥
వ్రతాన్తే కలశం దద్యా త్సువర్ణకమలాన్వితమ్ ।
శయ్యాం సోపస్కరాం దద్యా త్కపిలాం చ పయస్వినీమ్॥
అనేన విధినా యస్తు విత్తశాఠ్యవివర్జితః ।
విశోకసప్తమీం కుర్యాత్స యాతి పరమాం గతిమ్॥
యావజ్జన్మసహస్రాణాం సాగ్రం కోటిశతం భవేత్ ।
తావ న్న శోకమమృతం సుఖం ప్రాప్నోతి మానవః॥
యం యం ప్రార్థయతే కామం తం తం ప్రాప్నోతి పుష్కలమ్ ।
నిష్కామః కురుతే యస్తు స పరం బ్రహ్మ గచ్ఛతి॥
యః పఠేచ్ఛృణుయాద్వాపి వికాఖ్యాంచ చ సప్తమీమ్ ।
సోఽపీన్ద్రలోక మాప్నోతి న దుఃఖీ జాయతే క్వచిత్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే విశోకస ప్రమీవ్రతకథనం నామ పఇ్చసప్తతిత మోఽధ్యాయః॥
ఈశ్వరుడిట్లనెను: మునిపుంగవా! ఇట్టిదే యగు విశోక సప్తమి విషయము చెప్పెదను: ఈ సప్తమినాడుపవాస మున ఎప్పుడును శోకమునందడు. మాఘశుక్ల పంచమినాడు దంతధావన పూర్వకముగా తిల (చూర్ణము-తై లము)లతో స్నానము చేసి పులగము మా తము తిని ఉపవసించి రాత్రియందు బ్రహ్మచర్యము పాటించవలయును. తెల్లవారి లేచి స్నాన జపములు చేసి శుచియై 'ఆర్కాయ నమః' అను మంత్రముతో ఎర్రని కరవీర పుష్పములతో రవిని పూజించి ఆయనకు ఎర్రని వస్త్ర ద్వయమునర్పించవలెను. “మూడు లోకములకు విశోక త్వము (శోక ము లేక పోవుట) కలిగించు ఆదిత్యా! నాకును విశాక త్వమును జన్మ జన్మములందును నీయందు భక్తిని ప్రసాదింపుము." అను మంత్రముతో ప్రార్థించుచు షష్టినాడు రవిని పూజించి బ్రాహ్మణులను కూడ పూజించవలెను. ఆనాడు గోమూత్రము మాత్రము ఆహా రముగా గడపి రాత్రి నిద్రించిలేచి సప్తమి నాడుదయము నిత్యానుష్టానము ముగించుకొని విప్రుల నన్న దానపూర్వకముగా ఆరాధించి ఆ వస్త్రద్వయమును బంగారు పద్మమును బ్రాహ్మణున కీయవలయును. మౌనవ్రతముతో తె లలవణ రహి తముగా భుజించి పురాణ శ్రవణముతో ఆనాడు గడుపవలయును. ఇట్లు చేయుటచే సుఖమును ఐశ్వర్యమును కలుగును.
ఈ విధానమున అది మొదలు ప్రతి మాసమున పక్షద్వయమునను మరల మాఖ శుక్ల సప్తమి వచ్చువరకు చేయ వలయును. వ్రతాంతమున సువర్ణ కమలముంచిన కలశమును అన్ని పరికరములతోడి మంచమును పాన్పును పాడి కపిల గోవును దానము చేయవలెను.
ఈ విధమున విత్త శాఠ్యము ధనలోభముతో కొంటెతనము) చేయక ఈ వీశోక సప్తమీ వ్రతమును చేయు వాడు ఉత్తమ గతి చెందును. వేయి నూరుకోట్ల (కోటి 1000x100) జన్మముల కాలము శోకరహితుడై ఆమృతత్వా నందమును పొందును. కోరిక తో చేసినవానికి కోరినదెల్ల సిద్దించును. నిష్కాము డై చేసినవానికి పరబ్రహ్మ పదము లభించును. దీనిని చదివినను వినినను ఇంద్రలోక మునందును. విశోకుడగును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున విశోక సప్తమీ వ్రతకథనమను డెబ్బదియైదవ యధ్యాయము.
Summary of chapter 75 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the Vishoka-Saptamī-Vrata, a sacred vow observed on the seventh lunar day of the bright fortnight in the month of Māgha, specifically performed to eradicate all forms of sorrow, mental anxiety, and grief from human life. The practitioner worships Sūrya Deva by placing a golden or lotus-shaped image of the Sun upon a sanctified vessel filled with water, offering red sandalwood, red garlands, and sweet grains. The devotee abstains from salt, maintains mental calmness, and spends the day contemplating the divine light of the Sun that illuminates the universe and dispels all darkness. The Lord declares that this vow cleanses deep-seated emotional and spiritual afflictions, bestows unshakeable mental fortitude, and grants an unbroken life of peace and divine joy.