142 -  త్రేతాయుగమున యజ్ఞ ప్రవృత్తి స్వరూపము - యజ్ఞములకంటే లోకోపకారకమగు తపస్సే గొప్పదియనుట

ఋషయః :  కథం  త్రేతాయుగము ఖే యజ్ఞస్యాసీ త్ర్పవర్తనమ్

పూర్వే స్వయంభువే సరే యథాచ ప్రబ్రహీహి నః,

 సూత  :  అ నంతర్హి తాయాం సన్ద్యాయాం సార్ధం కృతయుగేన తు

కాలా ఖ్యాయాం ప్రవృత్తాయాం ప్రాప్తే త్రేతాయుగే తథా

 ఓషధీషు చ లీనాను ప్రవృత్తే వృష్టిసర్జనే

ప్రతిష్టి తాయాం వార్తాయాం గ్రామేషుచ పురేషుచ

 వర్ణాశ్రమసమస్థానం కృత్వా మన్త్రాశ్చ నః పునః

 సహితా స్తాస్తు సంహృత్య కథం యజ్ఞం ప్రవర్తయేత్

దైవతై స్సహ సంహృత్య సర్వసాధన సంభృతః

 తస్యాశ్వమేధో వితతే సమాజగ్ము ర్మహర్షయః

ఏ యజస్తం పశుభి ర్మేధ్యై రూచు స్సర్వే మహర్షయః

యజ్ఞకర్మణ్యపి తతే కర్మణ్యగ్రే తథా ర్త్విజి  

హూయమానే దేవహో త్రే అగ్నౌ బహువిధః క్రతుః

సంప్రతీతేషు దేవేషు సామగేషుచ సుస్వనమ్ 

పరిక్రా న్తేషు లఘుషు అధ్వర్యు పురు షేషు చ

 ఆలబ్ధేషుచ ముఖ్యేషు తదా పశుగణేషు వై

ఆహూతేషుచ దేవేషు యజ్ఞ భుక్షు తదా తతః

య ఇ న్ద్రియాత్మకా దేవా యజ్ఞభాగభుజస్తు తే

తా న్యజన్తి తదా దేవాః కల్పాదిమ భవ న్తియే

 అధ్వర్యు ప్రైషకాలేతు వ్యుత్థాయ ఋషయ స్త్వథ

ఋషీణా మిన్ద్రస్యచ యజ్ఞవిషయక వివాదః

మహర్షయశ్చ తాన్దృష్ట్వా దీనా న్దేవ(న్పశు) గణాం స్తథా

 విశ్వంచ భుఞ్జతే కోఽత్ర కోయంయజ్ఞవిధి స్తథా

 అధర్మో బలవానేష హింసా ధర్మేప్సయా తవ

 పశుబన్దవధ స్త్విష్ట స్తవ యజ్ఞి సురోత్తమ

అధర్మో ధర్మఘాతాయ ప్రారబ్దః పశుభి స్త్వయా

నాయం ధర్మో హ్యధర్మోఽయం న హింసా ధర్మ ఉచ్యతే

 ఆగమేన భవాన్దర్మం ప్రక రోతు యదేచ్ఛసి

విధిదృష్టేన యజ్ఞేన ధర్మేణాత్యయ సేతునా

యజ్ఞబీజై స్సుర శ్రేష్ఠ త్రివర్గ పరిమోషితైః

 ఏష యజ్జో మహానిన్ద్రః స్వయమ్బువిహిత: పురా

ఏవం విశ్వభుగిన్ద్రస్తు ఋషిభి స్తత్త్వదర్శిభిః

ఉక్తోన ప్రతిజగ్రాహ మానమోహసమన్వితః

పూర్వము స్వాయంభువ మన్వంతరమున త్రేతా యుగారంభమున యజ్ఞ ప్రవృత్తి ఎట్లుండెను? ఎట్లు జరిగేను? కృతయుగమును దాని సంధ్యా సంధ్యాంశములును ముగిసి కాలనామము ననుసరించిన ప్రవృత్తులతో త్రేతాయుగమారంభమయ్యేను. తద్ యుగానుసారము ఓషధులు మొలచెను. పొనలు కురియసాగెను. గ్రామములందును పురములందును జనుల జీవన ప్రవృత్తికి వలసిన వృత్తిధర్మపు నడక ఆరంభమయ్యెను. ఇట్టి దశ లో పరమేశ్వరుడు వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను లోకమున ఎట్లు నిలి పెను? మంత్రము లను ఎట్లు ఏకత్ర కూర్చెను? వాటితో వేద సంహితలనేట్లు కూర్చెను? వాటితో యజ్ఞములను ఎట్లు ప్రవర్తిల్లజే నేను? ఇదియంతయు మాకు తెలుపుమని ఋషులడుగ సూతుడిట్లు వారికి చెప్పసాగెను. ఋషులారా! మీరడిగిన ప్రశ్నకు సమాధానమును తెలిపేదను; వీనుడు; సమర్థుడగు వాడును విశ్వమందలి ప్రాణులను తమ ఆహార మును భుజించునట్లు అనుగ్రహించి వారిచ్చిన హవిరాదులను అనుభవించువాడును నగు ఇంద్రుడు ఐహ లౌకిక పార లౌకిక స్వర్గపద) కర్మానుష్టానమునకు ఉపయుక్తములగు మంత్రములను సమకూర్చి వాటితో లోకమున యజ్ఞములను ప్రవర్తిల్లజే నేను. అందుల కై ఇంద్రుడు తానే యజమానుడై సర్వ సాధనములను సమకూర్చుకొని దేవతలందర తో కూడి ఆశ్వమేధయాగ మాచరించ పూనెను. యజ్ఞమును వితతము చేయు సమయమునకు మహరులును వచ్చిరి. ఆ యజ్ఞ కర్మమునందలి ఆరంభ కర్మము ననుష్ఠించుటకై ప్రవర్తిల్లసాగిరి. దేవతలనుద్దేశించి హవనము చేయుట కే ప్రణయనము చేయబడిన అగ్నియందు బహువిధములగు హవిస్సుల హోమము చేయబడుచుండెను. దేవతలందరును సంతుష్టులయిరి. సుస్వరముతో సామ వేదము గానము చేయబడు చుండెను. ఆధ్వర్యు పురుషులు మిగుల వేగముగా ఆటునిటు తిరుగు చుండిరి. యజ్ఞ పశువులును ఆలంభము మంత్రపూర్వకముగ ప్రాణములు తీయబడుట) చేయబడెను. యజ్ఞభాగముల ననుభవించవలసిన దేవతలును ఆహ్వానించబడిరి. ఇండియాభిమానులగు దేవులు ఎవరెవరో వారు పోరు మాత్రము యజ్ఞ భాగములను అనుభవించు వారయిరి. మిగిలిన దేవతలందరును ఆ ఇంద్రియాధిష్టాన దేవతల నారాధి 'చిరి. ప్రతి కల్పాదులయందును యజ్ఞ భాగ భోక్తలగు దేవతలు ఈ ఇంద్రియాభిమాని దేవతలే. కాని ఈ యజ్ఞమున విశేషము ఒకటి జరిగెను.) ఆధ్వర్యువులు ' ప్రెష' మంత్రములతో ఆయా దేవతలను ఆహ్వానించిన సమయమున ఋషులును మహర్షులును లేచి నిలువబడిరి. యజ్ఞమున ఆలంభము చేయబడిన (చేయబడుచున్న) దీనములగు పశు దేవ) గణములను చూచిరి. విశ్వభుక్ గా నున్న ఇంద్రుని వారు ఇట్లు ప్రశ్నించిరి: “నీ ఈ యజ్ఞ విధానము ఎటువంటిది? (ఇది ఏమి యజ్ఞ ప్రక్రియ?) దీనియందు విశ్వభుక్ ఎవరు? సహజముగా . ఇతరులు చేయు యజ్ఞమున విశ్వభుక్ గా నున్న నీవే యజమానుడవై యుండగా దీనియందు ఎవరు 'విశ్వభుక్' స్థానమునందుండును? ధర్మ ఫల) మును పొందగోరి నీవు చేయు ఈ పశు) హింస మిగుల బలవత్తరమగు అధర్మము; సురోత్తమా నీ ఈ యజ్ఞమునందు పశు బంధమును వాని వధయును నీకు ఇష్టమయినట్లున్న ది. పశువులు ఉపకరణములుగా నీవు అచరించు ఈ ఆధర్మము నీ ధర్మమును నశింపజేయును. ఇది ధర్మముగాదు; ఇది అధర్మము; హింస ధర్మము అని ఎవరును అనరు. నీకు ఇట్టి యజ్ఞము నాచరించుటయే ఇష్టమైనచో ఇది తగునని ఆగమ శాస్త్రవిధి) ప్రమాణమును చూపి ఇది ధర్మమని నిశ్చయించుము. సురశ్రేష్టా! ఇంద్రా! ప్రజలను ధర్మమునుండి నివారించు సేతువు అగు ధర్మమును అవలంబించినదియు శాస్త్రవిధియందు కనబడుచున్న దియు ఆగు యజ్ఞ ప్రక్రియతోను ధర్మార్థ కామములచే ఆకర్షింపబడిన వాటిని సాధించగల) యజ్ఞ బీజముల (వేదమంత్రములతోను స్వయంభూబ్రహ్మ పురాతన కాలమునందే ఈ యజ్ఞమును వేదములందు విధించెను. అనిరి. విశ్వభుక్ ప్రతియొక విధమగు దేవతారాధనములందును ప్రజలర్పించిన దానియందలి భాగమును తప్పక అనుభవించువాడు ) అగు ఇంద్రునితో త త్వద్రష్టలగు ఋషులిట్లు పలుకగా మానమునకును మోహము (అజ్ఞానము) నకును వశీభూతుడయియున్న ఇంద్రుడు వారి మాటలను అంగీకరించలేదు.

తేషాం వివాద స్సుమహా న్యజ్ఞే ఇన్ద్రమహర్షిణామ్

 జజ్గమై స్థావరై: కేన యష్టవ్యమితి చోచ్యతే

 తే తు ఖిన్నా వివాదేవ శ క్త్యా ముక్తామహర్షయః

 సన్దాయ సమమిన్ద్రేణ పప్రచ్చు: ఖచరం వసుమ్

  ఋషయః : మహాప్రాజ్ఞ కథం దృష్ట స్తవ యజ్ఞవిధి ర్నృప

ఔత్తానపాదే: ప్రబ్రూహి సంశయన్నో నుద ప్రభో

 సూతః : శ్రుత్వా వాక్యం వసు స్తేషా మవిచార్య బలాబలమ్

వేదశాస్త్ర మనుస్మృత్య యజ్ఞే విధిమువాచహ

యథోపనితై ర్యష్టవ్య మితి హోవాచ పార్థివః

యష్టవ్యం పశుభి ర్మే ధ్యై రథ మూలఫలై రపి

 హింసా, స్వభావో యజ్ఞస్య ఇతి మే దర్శనాగమః

 యథేమే భాషితా మన్త్రా హింసాలిజ్గా మహర్షిభిః

 దీర్ఘేణ తపసా యుక్తా స్తార కాదనిదర్శనైః

 తత్ప్రమాణం మయా చోక్తం తస్మాత్ క్షమితు మర్హథ

 యది ప్రమాణంస్వాన్యేవ మన్త్రవాక్యాని వో ద్విజాః

తదా ప్రవర్తతాం యజ్ఞో అన్యథా మాఽనృతం వచః

ఏవంకృతోత్తరా స్తేతు యుజ్యాఽఽత్మానం తతో ధియా

 ఆశప న్భావినం దృష్ట్వా తమర్థ మృషయ స్తథా

ఇత్యుక్తమాత్రో నృపతి: ప్రవిపేశ రసాతలమ్

ఊర్ధ్వచారీ నృపో భూత్వా రసాతలచరోఽభవత్

 వసుధాతలచారీ తు తేన వా క్యేన సోఽభవత్

ధర్మాణాం సంశయచ్చేత్తా రాజా వసు రధో గతః

 తస్మాన్న వ్యా హ్యే కేన బహుజ్ఞేనాపి సంశయః

బహుద్వారస్య ధర్మస్య సూక్ష్మా దురనుగా గతి

 తస్మా న్న నిశ్చయాద్వక్తుం ధర్మః శక్యోహి కేనచిత్

దేవానృషీ నువాదాయ స్వాయమ్భువమృతే మనుమ్

యజ్ఞము నాచరించవలసిసది జంగమ ప్రాణులగు పశువులతోనా -స్థావర ప్రాణులగు వృదులనుండి లభించు కందమూల ఫలాదులతో నా? అను విషయమున ఇంద్రునకును మహర్షులకును గొప్ప పాదము నడచెను. మహర్షులు ఈ వాదముతో శ క్తిహీనులై మిగుల భేదము (ఆలసట) చెందిం. చివరకు వారు ఇంద్రునితో (వసుని మధ్యవర్తిగా గ్రహించి అతడు చేపిన మాట ఇరుపక్షములవారును అంగీక రింతమని) ఒప్పందమునకు వచ్చి ఆంతరిక్ష సంచారియగు వసుని ఇట్లడిగిరి. ఉత్తానపాదుని పుత్రుడవును మహాప్రాజ్ఞుడవును అగు వసురాజా ఈ రెండు విధములలో ఏ యజ్ఞము విధివిహితమని నీవు తలంచుచున్నావో తెలిపి మాసంశయమును పోగొట్టుము. అనిరి. అది వినిన వసురాజు ఈ రెండు పక్షముల బలాబలములను విచాపంచక యే తనకు స్పురించిన) వేద శాస్త్రము ననుసరించి యజ్ఞ త త్త్వమునిట్లు చెప్పేను: యజమానుడు తన శక్తిననుసరించి ఏవి సమకూర్చుకొన్నచో వానితోనే యజ్ఞము చేయుట సమంజసము; పవిత్రములగు పశువులతోనై ననుసరే కందమూల ఫలాదులతోనైనసరే. యజ్ఞము నహజముగనే హింసా స్వభావము కలది; ఆని శాస్త్రములనుండి నాకు తెలిసిన విషయము. అదికొక మహరులు కూడ మంత్రములు హింసారూపము లగు ఆర్థములనే ప్రతిపాదించునని వివరించుచున్నారు. ఆ ప్రమాణమునే నేను చెప్పితిని. కావున మీరు శాంతింప వేడుచున్నాను. విప్రులారా!మీరు అంగీకరించుచున్న మంత్రవాక్యములు మీకు ప్రమాణములయినచో యజ్ఞమును జరుగ నిండు; కాదందురా; కాదనుట తగదు; ఏలయన-నేను చెప్పినది ఆనృతము కాదు. వసురాజిట్లు తమకు నమా ధానము చెప్పగా ఆ మహర్షులు తమ బుద్ధిని హృదయమును సంయోజనము చేసి (యోగ దృష్టితో ఆలోచించి) రాబోవు విషయము ఇదియని ఎరిగి ఆది సత్యమగునట్లు వారు ఆవసుని శపించిరి. వారు శాపవచనమును వలుకగనే రాజు రసాతలమును ప్రవేశించెను. అంతవరకును ఆకాశచరుడుగా నుండిన ఆతడిప్పుడు రసాతలచరు డయ్యెను. ఈ శాప వాక్యముతో ఆతడు వసుధాతలమున చరించు వాడు కూడ నయ్యెనుకాని ఖేచరత్వము లేకపోయెను. ఇట్లు ఆతడు ధర్మ విషయక సంశయమును ఛేదింప యత్నించి అధోగతి నందెను. కావున తానెంతగా బహు విషయముల నేగిన వాడై నను ఒక్కడే (ఇతరులతో సంప్రతించక) సంశయమును నిర్ణయించరాదు. ఏలయన ధర్మ నిశ్చయమును చేరుటకు వాకిండ్లు ఎన్నో యున్నవి. వానిలో ఏ ద్వారమునుండి పోయినచో ధర్మమును సరిగా చేరవచ్చునో నిర్ణయించి సరియగు మార్గమున నడుచుట సుకరము కాదు. కావున దేవతలును ఋషులును స్వాయంభువ మనువు అంతటివారు తప్ప మరో ఎవ్వరును సంశయాస్పద విషయమున నిశ్చయము చేసి చెప్పజాలరు.

తస్మా న్న హింసా యజ్ఞే స్యాద్యదుక్త మృషిభి స్స్వయమ్

ఋషికోటిసహస్రాణి స్వై స్తపోభి ర్దివం గతాః

  తస్మా న్న దానయజ్ఞంచ ప్రశంసన్తి మహర్షయః

అంభో మూలం ఫలం శాకముదపాత్రం తపోధనాః

 ఏతద్దత్వా విభవత స్స్వర్గలో కే ప్రతిష్టితాః

 అద్రోహశ్చా వ్యలోభశ్చ దమో భూతదయా తపః

 బ్రహ్మచర్యం తవ స్సత్య మనుక్రోశః క్షమా ధృతిః

 సనాతనస్య ధర్మస్య మూల మేత దిదం నవ

  ద్రవ్యమన్తాత్మకో యజ్ఞ స్తపశ్చ సమతాత్మకమ్

యజ్ఞైశ్చ దేవా నాప్నోతి వై రాజం తపసా పునః

 ఏవం వివాద స్సుమహా న్యజ్ఞస్యాసీ తవర్తనమ్

ఋషీణాం దేవతానాంచ పూర్వంస్వాయమ్బువేయిఽన్తరే

 తతస్తే ఋషయో దృష్ట్వా హృతం ధర్మం బలేన తు

 వసోర్వాక్య మనాదృత్య జగ్ము స్తే వై యథాగమమ్

గతేషు ఋషిసజ్ఘేషు దేవాయజ్ఞమవాప్నుయుః

శ్రూయ న్తేహి తపస్సిద్దా బ్రహ్మక్షత్త్రాదయో సృప

 ఏతే చాన్యేచ బహవ స్తే తపోభి ర్దివం గతాః

రాజర్షయో మహాత్మానో యేషాం కీర్తి ప్రతిష్ఠితా

 తస్మాద్విశిష్యతే యజ్ఞా త్తపస్సర్వైస్తుకారణైః

 బ్రహ్మణా తపసా సృష్టం జగద్విశ్వమిదం పురా  

తస్మాన్నా త్యేతి తద్యజ్ఞ స్తపోమూలమిదంస్మృతమ్

 యజ్ఞప్రవర్తనం హ్యేవహసీత్స్వాయంభువే నరే

 తదాప్రభృతి యజ్ఞోఽయం యుగై సార్ధం ప్రవర్తితః

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మన్వన్తరా నువర్ణ నే చతుర్యుగకల్పానుకీర్తనే యజ్ఞవిషయక దేవర్షిసంవాద కథనం నామ ద్విచత్వారింశదు త్తరశతతమోఽధ్యాయః

ఈ చెప్పిన దానిని బట్టి ఋషుల అభిప్రాయానుసారము యజ్ఞమున హింస యుక్తము కాదు. హింస లేకుండగనే పూర్వము వేలకోట్ల ఋషులు (మరి వేరు సాధనములతో) స్వర్గము చేరిరి, పై చెప్పిన కారణముననే మహర్షు లెల్లరును యజ్ఞమే కాదు.దానము కూడ- హింసా సాధ్యమయినచో తగనిదని తలచిరి. దానిని వారు మెచ్చరు. నీరు మూలములు-దుంపలు-వేళ్లు, ఫలములు శాకములు జలపాత్రము ఇట్టివి తమ శక్యనుసారము దానము చేసి స్వర్గ మును సంపాదించి అచట స్థిరముగా నిలిచిరి. ద్రోహము (ఆపకారము) చేయకుండుట లోభము లేకుండుట బహిరింద్రియ నిగ్రహము భూతదయ ఆనెడు తపము బ్రహ్మచర్యమను తపము సత్యము జాలి ఓర్పు నిబ్బరము ఈ తొమ్మిదియు సనాతన (సనా సదా; సనాతన = ఎల్లప్పుడు ఉండునది; శాశ్వత మయినది) ధర్మమునకు మూలమగు అంశములు; ఋషుల అభిప్రాయానుసారము . (హింసాయు క్తము కాకుండ) కేవలము యజ్ఞ విహిత ద్రవ్యములును మంత్రములును యజ్ఞపు వా స్తవరూపము; అట్లే . సర్వభూతములందును సమతాదృష్టితో నుండుట వాస్తవమగు తపస్పు; ఇట్లు యజ్ఞముల నాచ రించుటచే దేవత్వప్రాప్తియు తపస్సు చేత విరాడ్రూపతాప్రా ప్రియు సిద్ధించును. . కర్మల ననుష్ఠించుచుండియు తత్ఫల ములు తాను పొందవలే నను నభి సంధి లేకుండి కర్మఫల సంన్యాసము చేయుటచే బ్రహ్మలోక హిరణ్య గర్భస్థాన) ప్రాప్తియు . వైరాగ్యముతో జీవించుట వలన ప్రకృతి లయమును . జ్ఞానము వలన కైవల్యమును పొందును. ఇట్లు ఉత్తమగతి ప్రాప్తికి ఈ ఐదును మార్గములు ఆని ఋషులు సిద్ధాంతీక రించిరి.

ఈ విధముగా స్వాయంభువ మన్వంతరమునందే (హింసా సహితమగు) యజ్ఞమును ప్రవర్తిల్లజేయుట విషయ మున ఋషులకును దేవతలకును మహా వివాదము జరిగెను.

తరువాత ఋషులు బలముతో ధర్మము నెట్టివేయబడుట చూచి వసురాజు చెప్పిన వాక్యమును లెక్క పెట్టక యే (ఆ దేవ ప్రవర్తిత యజ్ఞమును విడిచి తమ ఇచ్చ వచ్చిన చోటికి వెళ్లిరి.

ఋషి సంఘములు ఇట్లు శాలనుండి వెళ్లి పోయిన తరువాత దేవతలు యజ్ఞమును జరిపీరీ. కాని బ్రాహ్మణులు కానీ శ శ్రీయులు కాని రాజులు కాని చాలమంది హింసాత్మక యజ్ఞములతో పని లేక యే తపస్సుతోనే సిద్ధి పొందిరి. అట్టి వారిలో ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు ధ్రువుడు మేధాతిథి వసువు (ఋషులతో హింసాత్మక యజ్ఞము తగునని చెప్పిన యాతడు) సుధామన్ విరజస్ శంఖపాత్.రాజసుడు. ప్రాచీనబర్తి -పర్జన్యుడు. హవిరానుడు మొదలగు రాజులును ఇంకను ఇట్టివారే మరికొందరును తపశ్చర్యతోనే స్వర్గమునకు పోగలిగిరి. వీరందరును లోకమున ప్రతిష్టిత కి ౩శాలురును మహా త్ములు సగు రాజర్షులే.

కావున సర్వ హేతువులచేతను హింసాయుత యజ్ఞము కం టెను తపస్సే విశిష్టతర మయినది. పూర్వము బ్రహ్మ ఈ విశ్వమును తపస్సుతోనే సృష్టించెను. కావున తపస్సుతో సృష్టింపబడిన ఈ విశ్వస్థితికిని తపస్సే మూలము. కావున తపస్సు చే కలుగు సిద్ది యజ్ఞము వలన కలుగదు. అని సిద్ధాంతము.

స్వాయంభువ మన్వంతరమున యుజము మొదటిసారిగా ఇట్లు ప్రవరిల్లెను. అది మొదలు కొని ఈ విధమగు యజ్ఞము యుగముల క్రమమున ప్రవ రిల్లుచు కొనసాగుచున్నది.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున మన్వంతరాలు శ్రీ వనమున యజ విషయమున దేవ ఋషి సంవాదమను నూట నలువది రెండవ అధ్యాయము.