278 - కనక కామధేను దాన విధానము.

శ్రీమత్స్యః : అథాత శ్శృణు భూపాల కామధేనువిధిం పరమ్ ।

సర్వకామఫలం నృణాం మహాపాతక నాశ నమ్॥

 లో కేశావాహనం తద్వ ద్గామః కార్యోధీవాసనమ్ ।

తులాపురుష వత్కుర్యా తుణ్డమణ్దపవేదికమ్॥

 స్వల్పే తేకాగ్నివ తుర్యా దురురేక స్సమాహితః ।

 కాఞ్చనస్య విశుద్ధస్య ధనుం వత్సంచ కారయేత్॥

ఉత్తమా పలసాహస్రి తదఫ్ఘనతు మధ్యమా ।

 కనీయసీ తద ర్దేన కామధేనుః ప్రకీర్తితా॥

శ క్తిత స్త్రీపలాదూర్ధ్వ మశక్తో ఒపీహ కారయేత్ ।

 వేద్యాం కృష్ణాజినం న్యస్య గుడప్రస్థసమన్వితమ్॥

న్య సే దుపరి తాం దేనుం మహారత్నై రలజ్కృతామ్ ।

కుమ్బాష్టకసమో పేతాం నానాఫలసమన్వితామ్॥

తథాష్టాదశ ధాన్యాని సమస్తా త్పరికల్పయేత్ ।

ఇక్షుదణాష్టకం తద్వ న్నా నాఫలసమన్వితమ్॥

భాజనం చాసనం తద్వ త్తాత్రదోహనకం తథా ।

కౌశేయవస్త్రద్వయ సంయుతాం గాం దీపాతపత్రాభరణాభిరామామ్॥ 

సచామరాం కుణ్ణలినీం సఘట్టాం సువర్ణశృణీం పరి రూప్యపాదామ్ ।

రసైశ్చ సర్వైః పరితో ఒభిజుష్టాం హరిద్రయా పుష్పఫలై రనే కై॥

ఆజాజికుస్తుమ్బురుశర్కరాదిభి ర్వితానకం చోపరి పఇ్చవర్ణమ్ ।

స్నాత స్తతో మజళ వేద ఘోషైః ప్రదక్షిణీకృత్య సపుష్పహస్తః॥

ఆవాహయే త్రాం గురుణ్ క్షమ ర్ద్విజాయ దద్యాదథ దర్భపాణిః ।

 త్వం సర్వదేవగణమన్దిర మజ్ఞభూతా విశ్వేశ్వరి త్రిపథగోదధి పర్వతానామ్॥

 త్వద్దానశస్త్రశక లీకృతపాతకౌఘః ప్రాప్లోస్మి నిర్వృతి మతీవ పరాం నమామి ।

లోకే యథేప్సితఫలార్థ విధాయినీం త్వా మాసాద్య కోహి భువి దుఃఖము పైతి మర్త్యః॥ 

సంసారదుఃఖశమనాయ యతస్వ కామం త్వాం కామధేను మితి దేవగణా

 వదంతి ।

ఆమంత్రితాయ గుణశీలగుణాన్వితాయ విప్రాయ యః కనక ధేను మిమాం ప్రదద్యాత్॥

 ప్రాప్నోతి ధామ స పురస్గర దేవజుష్టం కన్యాగణైః పరివృతః పద మిన్దుమౌళే॥

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మహాదానానుకీర్తనే కనక కామధేను ప్రదానికో

నామ అష్టసప్తత్యుత్తర ద్విశతత మోధ్యాయః॥

శ్రీమత్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: భూపాలా ఇపుడిక షోడశ మహాదాన క్రమమునందలి కనక కామ ధేను దాన విధానమును వినుము; ఇది పరమమయినది-మానవులకు సర్వకామములను ఇచ్చునది-మహాపాతక నాశనమయి నది; తులాపురుష దానమందువలేనే ఇందును కుండములు మండపము వేదికలు లో కేజా వాహనము హోమము ఆధివాసనము జరుపవలయును; అల్ప ప్రక్రియయే నచో ఎక్కువమంది ఋత్విజులతో పనిలేక ఏకాగ్ని విధానమున ఆచార్యుడు ఒక్కడే సమాహితుడై ఆయా కార్యములు జరుపవలేను; మేలిమి బంగారుతో ఆవును దూడను చేయించవలయును; వేయి ఐదు వందలు. రెండు వందల ఏబది-పలముల బంగార ము దీనికే ఉపయోగించుట ఉత్తమ మధ్యమాధమ విధానములు; ఎంతో ఆశ క్తుడై నచో మూడు పలములకు తక్కువ కాని ఎంత బంగారుతోనే న ఇవి చేయించవచ్చును; వేదికయందు కృష్ణాజిన మును పరచి ప్రస్థ పరిమాణక గుడమును దాని పై నుంచి నూతన వస్త్రము దాని పై పరచి దానిపై మహార త్నా లంకృత మగు ఆ ధేను వత్సముల నుంచవలయును; ఆ దగ్గరలో ఎనిమిది పూర్ణ కుంభములు నానా ఫలములు అష్టాదశ ధాన్యములు ఎనిమిది చెరకు గడలు ఆసనము పాత్రలు పాలు పితుకుటకు రాగి పాత్రము రెండు పట్టు వస్త్రములు దీపములు ఛత్త ములు ఆభరణములు చామరములు కుండలములు ఘంటలు బంగరు కొమ్ముల సొమ్ములు వెండికాలి గిట్టలు సర్వ విధ రసములు పసుపు-అనేక పుష్ప ఫలములు నుంచవలయును; జీలకర్ర ధనియాలు చక్కెర (కలిపి చేసిన పొడి) ఉంచ వలేను; ఐదు వన్నెల వితాసక మును (మేలుకట్టును) అమర్చవలయును.

తరువాత మంగళ వేదధ్వనులతో యజమానుడు స్నానమాడి అగ్న్యాదికమును బ్రాహ్మణులను ధేనువత్సములను ప్రదక్షిణించి పూవులు దోసిట పట్టుకొని దర్భపాణియే గురువు చెప్పు మంత్రములతో ధేనువు నామంత్రించి తరువాత అవి విప్రునకు ఈయవలేను.

‘‘విశ్వేశ్వరివగు కామధేనూ! నీవు సర్వదేవ గణములకును గృహ భూతురాలవు; (నీయందు సకల దేవతలు నివసింతురు) గంగానదికిని సముద్రములకును పర్వతములకును నీవు అంగ (శరీర) భూతురాలవు; నిన్ను దానముచేయుట ఆయుధముగానే నాపాతక రాసులు ఖండితములు కాగా అత్యంతము ఉత్తమమగు ఆనందమును పొందుచున్నాను; ఇట్టి నిన్ను నమస్కరించుచున్నాను; యథేష్ట ఫల ప్రదాయినివి నీవుండగా ఈ భూలోకమునందలి ఏ మానవుడు దుఃఖములను పొందును? నీవు మా సంసార దుఃఖములను శమింపజేయుటకై మిక్కిలిగ ప్రయత్నింపుము; అట్లు ప్రయత్నింతువు; కామము లను తీర్తువు; కొవుననే నిన్ను దేవతలు కూడ కామధేనువు అనుచున్నారు.”

ఇట్లు ధేనువును ఆమంత్రించిన తరువాత యజమానుడు తాను ఆమంత్రించి ఆహ్వానించి) తెచ్చుకొన్న గుణశీల సమన్వితుడగు వి పునకు ఈ కనక కామధేనువును దానమీయ వలయును; దాని ఫలముగా నతడు దేవకన్యా గణములతో కూడి నవాడయి ఇంద్రాది దేవతలు కూడ ఆశ్రయింపగోరు శివ స్థానమును పొంది సుఖించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున కనక కామధేను ప్రదానీకమను రెండు వందల డెబ్బది ఎనిమిదవ అధ్యాయము.