199 - వసిష్ఠ గోత్ర ప్రవరానుకీర్తనము॥

మత్స్యః : వసిష్ఠవంశజా న్విప్రా న్ని బోధ గదతో మమ

ఏకార్షేయశ్చ ప్రవరో వాసిష్టానాం ప్రకీర్తితః

 వసిష్ణా ఏవవాసిష్ఠ అవివాహ్యా వసిష్ణజైః

వ్యాఘ్రపాదా ఔపగవా వై క్లబా శ్శాడ్వలాయనా

 కపిష్ఠలా ఔపలోమా అలబ్ధశ్చ శతాః కఠాః గౌపాయనా బోధపాశ్చ దాక వ్యాశ్చైవ బాహ్యకాః

 బాలిశయాః పాలిశయా స్తతో వాగ్గన్దయశ్చ యే

ఆపస్థూణా శీతవృత్తా స్తథా బ్రాహ్మ్యపురేయకాః

మాయనా న్వ స్తిశరా శ్శాజ్ఞలీ రౌడిని స్తథా

పాడోహలిశ్చ సుమనా శ్చోపావృద్ధి స్తథైవచ

 చౌలి ర్వౌలి ర్భ్రహ్మ బలః పౌలిశ్రవస ఏవచ

పౌలవో యజ్ఞదత్తశ్చ ఏకార్షేయా మహర్షయః

 వసిష్ఠ ఏషాం ప్రవర స్త్వవే వాహ్యాః పరస్పరమ్

మత్స్య జనార్దనుడు వైవస్వత మనువుతో ఇట్లు చెప్పెను: వసిష్ఠ వంశజులగు ఋషుల గోత్రములవారికి ప్రవర ఋషి ఒక్కడే; పసిష్ఠులకే వాసిష్ఠులనియు వ్యవహారము; ఈ వసిష్ఠ వంశ జులగు ఋషుల గోత్రములవారు అదే వర్గమునకు చెందిన గోత్రములవారితో వివాహ సంబంధములు చేసికానరాదు

 వీరిలో మొదటి వర్గము వారు: వ్యాఘ్రపాదులు ఔపగపులు వై క్లబులు శాద్వలాయనులు కపిష్ఠలులు ఔపలో ములు అలబులు శఠులు కఠులు గౌపాయనులు బోధపులు దాకవ్యులు వాహ్యకులు బాలిశయులు పాలీశయులు వాగ్గంధులు ఆపస్థూణులు శీతవృత్తులు బ్రాహ్మ్యపు రేయకులు లోమాయనులు స్వస్తిశ రులు శాండలి గోడిని పాడోహలి సుమనస్ ఉపా వృద్ధి బౌలి బౌలి బ్రహ్మబలుడు పౌలిశ్రవసుడు పౌలవుడు యజ్ఞదత్తుడు ఈ ఋషుల (గోత్రముల వారల)కు వసిష్టుడు ఒక్కడే ప్రవర ఋషి; ఈ గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు

శైలాలయే మహాకర్ణః కౌరవ్యః క్రోధిన స్తథా

 కపిజ్జులా వాలఖిల్యా భాగ విత్తాయనాశ్చ యే

కీలాయనః కాలశిఖః కోరకృష్ణా స్సురాయణః

 శాకాహార్యా శ్శాక ధియః కాణ్వా ఉపలపాశ్చ యే

శాకాయనా ఉహాకాశ్చ అథ నషశ రావయః

దాకాయనా బాలవయో వాకయో గోరథా స్తథా

 లమ్బాయనా శ్శ్యామవయో యేచ కోడోదరాయణాః

ప్రలమ్బా శ్శజ్కరాశ్చాపి ఔపమన్యవ ఏవచ

సాళ్యెయనాశ్చ ఋషయస్తథావై వేద శేర కాః

 పాలజ్ఞాయన ఉద్ధాహా ఋషయశ్చ బలేక్షవః

మాతేయా బ్రహ్మబలినః పర్జాగారి స్తథైవచ

త్ర్యార్షయోభిమతశ్చైషాం సర్వేషాం ప్రవర శ్శుభః

భగ ద్వసు ర్వసిష్ఠశ్చ ఇన్హప్రమద ఏవచ

 పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః

ఔపస్థలా: స్వస్థల పాలోహా లోహలాశ్చ యే

 మాధ్యప్టినా మా క్షతయః వైప్పలాది ర్విచకుషః

 శైశృఙ్ఞాయన శైవల్యాః కుష్ఠానశ్చ నరోత్తమాః

 త్ర్యారేయాభిమత శ్చైషాం సర్వేషాం ప్రవరా శ్శుభాః

 వసిష్ఠ మిత్రావరుణా కుట్టినశ్చ మహాతపాః

దానకాయా మహాచర్యా నాయాః పరమా స్తథా

అలంబావాయనా శ్చాపి యే చ క్రోడోదరాయణాః

 పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః

శివకర్ణో వయ శ్చైవ పాదపశ్చ తథైవచ

 త్ర్యార్షేయాః ప్రవరా స్తేషాం సర్వేషాం ప్రవరా స్తథా

జాతూకర్ణో వసిష్ఠశ్చ తథై వాతిశ్చ పార్థివ

 పరస్పర మవై వాహ్యా ఋషయః పరికీర్తితాః

వసిష్ఠవంశోభిహితో మయా తే ఋషి ప్రధానా స్సతతం ద్విజేంద్రా

 యేషాం తు నామ్నా పరికీర్తి తేన పాపం సమగ్రం పురుషో జహాతి

ఇతి శ్రీ మత్స్యమహాపురాణే గోత్రప్రవరానుకీర్తనే వసిష్ఠ గోత్రప్రవర వివరణం

నామ ఏకోనద్విశతత మోధ్యాయః

రెండవ వర్గమువారు: శై లాలయుడు మహాకర్ణుడు కౌరవ్యుడు కౌధినుడు కపింజలులు వాలఖిల్యులు భాగ విత్తాయనులు కీలాయనుడు కాలశిఖుడు కోరకృష్ణలు సురాయణుడు శాకాహార్యులు శాక ధియులు (శాకధులు) కాణ్వులు ఉపలపులు శాకాయనులు ఉహాకులు మాషశ రావులు దాకాయనులు బాలపులు వాకులు గోరథులు లంబాయనులు శ్యామపులు కోడోదరాయణులు పలం బులు శంకరులు ఔపమన్యులు సాంఖ్యాయనులు ఋషయులు వేద శేరకులు పొలంఘయనులు ఉద్ఘాహులు బలేశులు మాతేయులు బ్రహ్మబలులు పర్ణగారి అను ఈ ఋషుల గోత్రముల వాగల)కు భరద్వసుడు వసిష్టుడు ఇంద్రప్రమదుడు జనువారు ప్రవర ఋషులు; ఈ ఋషుల గోత్రముల వారు పరస్పరము వివాహ సంబంధములు చేసికొనరాదు

మూడవ వర్గము వారు: ఔపస్థలులు స్వస్థలులు పాలుడు హాలుడు హలులు మాధ్యందినుడు మాక్షతులు పైప్ప లాది విచక్షుషులు శ్రీశృంగాయనులు శ్రీ వల్క్యులు కుండలులు (కుండినులు) అను నరోత్తములు ఈ ఋషుల (గోత్రముల వారల)కు వసిష్టుడు మిత్రావరుణుడు కుండినుడు అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పరము తమలో తామును దానకాయులు మహాచ(వీ)ర్యులు నాగేయులు పరములు అలంబులు పొయనులు అను వర్గముల గోత్రములవారు పరస్పరమును వివాహ సంబంధములు చేసికొన తగదు

 నాలుగవ వర్గమువారు: శివకుడు వయుడు పాదపుడు అను ఋషుల (గోత్రముల వార ల)కు జాతూకర్ణుడు వసిష్ఠుడు ఆత్రి అనువారు ప్రవర ఋషులు; ఈ గోత్రములవారు పరస్పరము వివాహ సంబంధములు చేసి కొనరాదు

ఈ చెప్పిన వసిష్ఠ వంశజులగు ఋషుల నామ సంకీర్తనమున నరుడు సకల పాప విముక్తుడగును

ఇది శ్రీమత్స్యమహాపురాణమున వసిష్ఠ గోత్ర ప్రవరాను కీర్తనమను నూట తొంబది తొమ్మిదవ యధ్యాయము