29 - శుక్ర వృషపర్వ సంవాదము

శౌనక: తతః కావ్యో భృగు శ్రేష్ఠ స్సమన్యు రుపగమ్య హ

వృషపర్వాణ మాసీన మిత్యువాచ త్వరాన్వితః

నాధర్మ శ్చరితో రాజ న్త్సద్యః ఫలతి గౌరవ

శ నై రావ ర్త్యమానస్తు మూలాన్యపి నికృన్తతి

యో హి నాత్మని పుత్రేషు న చే త్పశ్యతి న ప్తృషు

పాప మాచరితం కర్మ త్రివర్గ మతివర్తతే

ఫలత్యేవ ధ్రువం పాపం గురు భుక్త మవోద రే

యదా ఘాతయతా విప్రంచ మాజ్గిరసం తదా

అపాపశీలం ధర్మజ్ఞం శుశ్రూషం మధ్గృహే రతమ్

వధా దనర్హత స్తస్య వధాచ్చ దుహితు రమ

వృషపర్వ నిబోధ త్వం త్యక్ష్యామి త్వాం సబాన్ధవమ్

స్థాతుం త్వద్విషయే రాజ న్న శక్ష్యామి త్వయా సహ

అదైవం మాఽభిజానాసి దైత్యం మిథ్యా ప్రలాపినమ్

యత స్త్వ మాత్మనో ధీర్ణాం దుహితాం సము పేక్ష సే

వృషపర్వా : స్వధర్మ మమృషావాదం త్వయి జానామి భార్గవ

త్వయి సత్యం చ ధర్మం చ తత్ప్ర సీదతు నో భవాన్

యద్యస్మా నపహాయ త్వ మితో యాస్యసి భార్గవ

సముద్రం సంప్ర వి క్యామ నాన్యద స్తి పరాయణమ్

శుక్రః : సముద్రం ప్రవిశధ్వం వా దిశో వా వ్రజతాసురాః

దుహితు ర్నా ప్రియం శ్రోతుం శక్తోఽహం దయితా హి మే

ప్రసాద్యతాం దేవయానీ జీవితం హ్యత్ర మే స్థితమ్

యోగ క్షేమకర స్తే ఽహ మిన్ద్రస్యేవ బృహస్పతిః

వృషపర్వా : యత్కి ఞ్చిచ్చాసు రేన్ద్రాణాం విద్యతే వసు భార్గవ

భువి హస్తి గవాశ్వం చ తస్య త్వం మమ చేశ్వర :

శుక్రః : యత్కి ఞ్చ ద స్తి ద్రవిణం దైత్రేంద్రా ణాం మహాసురాః

త స్యేశ్వరోఽస్మి యది తే దేవయాని ప్రసాద్యతామ్

శౌనకుడు శతానీకునితో ఇట్లు చెప్పెను : తరువాత కవిముహామునికి కుమారుడును భృగువంశ శేష్టుడును అగు శుక్రుడు మిగుల త్వర తో పోయి కొలువుదీరి యున్న వృషపర్వునితో ఇట్లు పలికేను : “రాజా! భూమిలో విత్త్రనము వేసినను వెంటనే ఫలించనట్లు ఆచరించిన అధర్మము కూడ వెంటనే ఫలించదు. మెల్లగా ఆవృత్తి చేయుచు పోగా అది వేళ్ళను కూడ పెకలించివేయును. తాను ఆచరించిన పాపకర్మము తనయందో తన కుమారులయందో మనుమలయందో ముని మనుమలయందో ఫలింపకున్న ను మూడు తరముల దాటి తరువాతివారి కే నను తగిలితీరును. తినిన బరువయిన ఆహారము ఉదరములో రోగి ముగా పరిణమించినట్లు పాపము కూడ ఫలించియే తీరును. ఆనాడు నీవు పుణ్యశీలుడును ధర్మజుడును సా శుశ్రూష చేయుచు నా యింటిలో ఉన్న వాడును అంగిరసుని మనుమడును బ్రాహ్మణుడును ఏ విధము గను చంపరానివాడును అగు కచుని చంపించుటవలనను. నా కూతును కొట్టించుట వలనను నేను నిన్ను ను నీ వారినెల్ల రను కూడ విడిచివేయు చున్నాను. నీతో కలిసి నీ దేశమునందుండ జాలను. నీవు ఇపుడు నన్ను ను మిథ్యా ప్రలాపియగు అనినంత పనిని చేయజాలని) దైత్యునిగా భావించుచున్న ట్లున్నది. ఆగదు చేతనే నీ పొగరుబోతు కుమార్తెను ఏమియు అనక ఊరకున్నావు.”

వృషపర్వుడు ఇట్ల నేను: “భార వా! నీవు స్వధర్మ పరుడవు. మృషలు పలుకవు. అని నాకు తెలియును. నీవు సత్యమునకును ధర్మమునకును ఆధారమవు. కనుక నీవు మమ్ముల ననుగ్రహింప వేడుచున్నాను. నీవు ఇపుడు మమ్ములను విడిచి వెళ్ళినచో మేము సముద్రములోనికి పోయి దాగవలసినదే. మాకంతకంటె వేరే దిక్కులేదు.”

శుక్రుడు: “సముద్రములో ప్రవేశించినను సరియే. మీరందరును దిక్కులకు పారిపోయినను సరియే. నాకు మిగుల ప్రీతిపాత్రురాలగు నా కుమా ర్తెకు అప్రియము జరిగే ననునది నేను వినజోలను. నా జీవితమునకు ఆధారమగు దేవయానిని నీవు అనుగ్రహింపజేసికొనినచో ఇంద్రునకు బృహస్పతివలె నేను నీ గ క్షేమములను చూతును.”

వృషపర్వుడు : "భార్గవా! ఈ భూగో: మున రాక్షసుల ఆ స్త్రీగా ఏనుగులు గుర్రములు గోవులు ధనము మొదలయినది ఏది యేది గలదో దానికంతటికిని రాక్షసులకును సాకును నీవే ప్రభువవు."

శుక్రుడు : “రాక్షస రాజా! మహాసురులారా! మీరశ్నట్లు దే త్యేంద్రుల ద్రవ్యమంతటికిని నేనే ప్రభుడననుట నిజమయినచో దేవయానిని బ్రతిమాలి ఆమెను అనుగ్రహింపజేసికొనుడు.''

శౌనకః : తతస్తు త్వరిత శ్శుక్ర స్స రాజ్ఞా సమ మాయయౌ

ఉవాచ చైనాం సుభగే ప్రతిపన్నం వచ స్తవ

శర్మిష్ఠాయా దాసీత్వ ప్రాప్తికథనమ్

దేవయానీ : యది త్వ మీశితా తాత రాజ్ఞో విత్త స్య భార్గవ

నాభిజానామి త త్తేహం రాజా వదతు మాం స్వయమ్

వృషపర్వా : యం కామ మభిజానాసి దేవయాని శుచిస్మితే

త త్తేహం సమ్ర్పవక్ష్యామి యద్యపి స్యా త్సుదుర్లభమ్

దేవయానీ; దాసీంక న్యాసహస్రేణ శర్మిష్ఠా మభికామయే

అనుయాస్యతు మాం తత్ర యత్ర దాస్యతి మే పితా

వృషపర్వా : ఉ త్తిష్ఠ ధాత్రి గచ్ఛ త్వం శర్మిష్ఠాo శీఘ్ర మానయ

యం చ కామయతే కామం దేవయానీ కరోతు తమ్

శౌనక: తతో ధాత్రీ తత్ర గత్వా శర్మిష్ఠా మిద మబ్రవీత్

ఉత్తిష్ట భధ్రే శర్మిష్ఠే జ్ఞాతీనాం సుఖ మావహ

త్యజతి బ్రాహ్మణ శిష్యా న్దేవయాన్యా ప్రచోదితః

యం సా కామయతే కామం స కార్యోఽత్ర త్వయాన ఘే

దాసీత్వ మభిజానాసి దేవయాన్యా సుశోభనే

శర్మిష్ఠా : యం చ కామయతే కామం కరవాణ్యహ మద్య తామ్

మాగా న్మన్యువశం శుక్రో దేవయానీ చ మత్కృతే

శౌనకః : తతః కన్యాసహస్రేణ వృతా శిబికయా తదా

పితుర్ని దేశా త్వరితా నిశ్చక్రామ పురోత్త్రమాత్

శర్మిష్ఠా : అహం కన్యాసహ స్రేణ దాసీభిః పరివారితా

అను త్వాం తత్ర యాస్యామి యత్ర రాస్యతి తే పితా

దేవయానీ: సువతో దుహితా చౌహం యాచతః ప్రతిగృహ్ణ త

స్తూయమానస్య దుహితా కథం దాసీ భవిష్యసి

శర్మిష్ఠా: యేన కేనచి దౌర్తానాం జ్ఞాపానాం సుఖ మావ హేత్

అను యాస్యా మ్యహం తత్ర యత్ర దాస్యతి తే పితా

శౌనకః: ప్రతిశ్రుతే దాసభావే దుహిత్రా వృషపర్వణః

దేవయానీ నృప శ్రేష్ఠ పితరం వాక్యమబ్రవీత్

ప్రవిశామి పురం తాత హృష్టాస్మి ద్విజసత్తమ

అమోఘం తవ విజ్ఞాన మ స్తి విద్యాబలం చ తే

ఏవముక్తో ద్విజ శ్రేష్ఠో దుహిత్రా సుమహాయశాః

ప్రవి వేశ పురే హృష్టః పూజిత స్సర్వదానవై కి

ఇతి శ్రీ మత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదా నత శౌనక శతానీకసంవాదే చన్ద్రవంశానువర్ణనే యయాతిచరితే శర్మిష్ఠాయాః దేవయానీ దాసీత్వప్రాప్తికథనం నామైకోనత్రింశోఽధ్యాయః

తరువాత వెంటనే శుక్రుడు త్వరితగమనముతో వృషపర్వునితో కలిసి దేవయాని ఉన్న చోటికి వచ్చి “పు శ్రీ ! నీవు ఆదృష్టవంతురాలవు. రాజు నీ మాటను అంగీకరించినాడు.” అనెను. దేవయానియు “తండ్రీ! భార్గవా! రాజ ధన మునకంతటికిని నీవు స్వామివి అగునో కాదో నా కేమి తెలియును? నీ మాట నేనెట్లు అంగీకరింతును? రాజే నాతో స్వయ ముగా ఆ మాట చెప్పనిమ్ము." అనెను. వృషపర్వుడు! దేవయానీ! నీ హృదయము. నిర్మలమయి నీవు ఒక చిరునవ్వు నవ్విన మాకంతియ చాలును. నీవేది ఏది కోరిన సది ఎంత సుదుర్లభమయినను దానిని నెర వేర్చుదును. దేవయాని : “తన దాసీ కన్యా సహనముతో శర్మిష్ట నాకు దాసి కావలయును. నా తండ్రి నన్నే చ్చటికిచ్చిన నచ్చటి కామెయు నా వెంట రావల యును." వృషపర్వుడు : “దాడీ! నీవు పొమ్ము. శీఘమే శర్మిష్ఠను పిలిచికొని రమ్ము, దేవయాని ఏది కోరిన నది ఆమె చేయవలయును.

వెంటనే దాది శర్మిష్ఠకడకు పోయి ఇట్ల చెప్పెను: అమ్మాయీ! శర్మిష్ఠా: లెమ్ము. మీ పుట్టింటి వారికి సుఖము కలిగించుము. దేవయాని పేరణచే శుక్రుడు తన శిష్యులను ఏడు చుచు క్నాడు. అందుల కై నీవు ఇపుడు దేవయాని కోన దెల్ల చేయవలసియున్నది. నీవు ఎంతయో శోభన రూపురాలవు. ఐన దేవయానికి దాసీత్వమును అంగీక రింపవలసి యున్నది. శర్మిష్ఠ: “ఆమే ఏది కోరిన నేనిపుడది చేయుదును. నా దూల మున శుకుడుగాని దేవయానీ కాని కోపింప కుండుట కావలయును.”

వెంటనే తన తండ్రి ఆజ్ఞతో శర్మిష్ట వేయి మంది తన దాసీ కన్యలు తనవెంట రాగా పాలకి నెక్కి తన తండ్రి వురమునుండి బయలు వెడలెను. శర్మిష్ట దేవయానితో: “నేను నా దాసీ కన్యా సహస్రము నావెంట రాగా నిన్ను నీ తండ్రి ఇచ్చిన చోటికి నీ వెంట వత్తును.” దేవయాని: "స్తుతించుచు యాచించుచు ప్రతి గ్రహించుచు ఉండువాని కూతు రను నేను. స్తుతించబడు వాని కూతురు నీవు నాకు దా వెట్లగుదువు?” శర్మిష్ఠ: “ఏ విధము గనై నను కన్య తన పుట్టి నింటివారికి సుఖము కలిగి ”పవలెను. కనుక నీ తండ్రి నిన్నె చ్చటి కిచ్చిన అచ్చటికి నీ వెంట వత్తును.”

ఇట్లు వృషపర్వుని కూతురు తనకు దాసి యగుటకు అంగీకరించగా దేవయాని తన తండ్రితో ఇట్లనెను: “ద్విజ శ్రేష్టుడవగు తండ్రీ! నేను హర్షముతో పురము లో ప్రవేశిస్తును. మీ విజ్ఞానమును విద్యాబలమును అమోఘమయినవి.” తన కూతురు ఇట్లు పలికిన మీదట మిగుల గొప్పకీర్తి కల ఆ శుక్రుడు తను రాక్షసులు ప్రశంసించుచుండ వృషపర్వుని పురము ప్రవేశించేను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున యయాతి చరితమున శర్మిష్ట దేవయానికి దాసియగుట యను ఇరువది తొమ్మిదవ అధ్యాయము.