మత్స్య మహా పురాణము
247 - వరాహోత్పత్తి-ధరణీ సముద్ధరణము.
శౌనకః : జగదణ్డ మిదం సర్వ మానీ ద్దియం హిరణ్మయమ్ ।
ప్రజాపతే రియం మూర్తి రితీయం వైదికీ శ్రుతిః॥
తత్తు వర్షసహస్రా నే బిభేదోర్ధ్వముఖం విభుః ।
లోకసర్జన హేతోశ్చ విభేదాధోముఖం తతః॥
భూయో ఒషధా బిభేదాజ్ఞం విష్ణుర్వె లోక జన్మకృత్ ।
చకార జగతశ్చాత్ర విభాగం స విభాగకృత్॥
యచ్ఛిద్ర మూర్ధ్వ మా కాశం వివరాకృతితాం గతమ్ ।
విహితం విశ్వయోగేన యదధ సద్రసాతలమ్॥
యదణ్డ మకరో త్పూర్వం దేవో లోక చికీర్షయా ।
తత్ర యత్సలిలే స్కన్న ముల్బం తత్కాజ్చనో గిరిః॥
శై లై స్సహస్ర ర్గహనా విషమా మేదినీ తథా ।
తైశ్చ పర్వతజాలో ఘ ర్బహు యోజనవి సరైః॥
పీడితా గురుభి ర్దేవీ వ్యథితా మేదినీ తదా ।
సహామరై ర్బూరిబలం దివ్యం నారాయణాత్మకమ్॥
హిరణ్మయం జగత్సృష్టం తేజో వై జాతరూపిణమ్ ।
అశక్తా వై ధారయితు మధస్తా త్ప్రవివేళ సా॥
పీడ్యమానా భగవత స్తేజనే తస్య సా క్షితిః ।
పృథ్వీం విశ క్లీం దృష్ట్వా తు తా మధో మధుసూదనః॥
ఉద్గారార్థం మన శ్చకే తస్యా జై హితకామ్యయా ।
శ్రీభగవా : మత్తేజ ఏషా వసుధా సమాసాద్య తపస్విని॥
రసాతల ప్రవిష్టాఒసి పజ్కే గౌరవ దుర్బలా ।
శౌనకుడర్జునునితో ఇట్లు చేప్పేను: ఈ జగమంతయు పూర్వము హిరణ్మయమగు అండముగ నుండెను; ప్రజాపతి మూర్తి ఇదియే అని వేదమున వినబడుచున్న దీ; వర్ష సహస్రానంతరమా విభుడు దానిని సృష్టిని మీ తమే మొదట ఊర్ధ్వాధః. కపాలములుగా భేదించెను; లోక జన్మకర్తయగు విష్ణుడు దానిని మరల ఎనిమిది గా విభజించెను; విభాగకర్తయగు అతడు దీనియందు జగద్విభాగ మొనర్చెను; వానితో ఊర్ధ్వముఖావకా రంధ్ర మాకాశమును ఆధోరంధ్రము రసాతలమునుగా విశ్వ యోగయోగియగు ఆ దేవుడు ఏర్పరచెను; ఆ దేవుడు లోక సృష్టి సంకల్పముతో నిర్మించిన యండముతో ఏర్పడిన మావి బ్రహ్మాండాశ్రయమగు సలిలమందుపడి స్వర్ణమయ (మేరు) పర్వతమయ్యెను; వేలకొలది పర్వతములతో గహనమును విషమమునునగు మేదిని (భూమి) ఏర్పడెను; బహుయోజన విస్తరములును బరువునునగు సహస్ర పర్వతగణ సమూ హముతో పీడితయై భూదేవి పీడిత యయ్యెను; భూరి బలయుతమును దివ్యమును నారాయణాత్మక మును హిరణ్యమయ మును సువర్ణ రూపమునునగు విష్ణు సృష్టమయిన ఆ తేజస్సును మోయజాలక ఆ భగవ త్తేజః పీడితయగు క్షితిదేవత క్రిందకు క్రుంగి పోయెను; పాతాళమున ప్రవేశించేను; మధుసూదనుడట్లామే అధఃప్రవిష్టయగుచుండుట చూచి ఆమెకు హితమాచరించు తలంపుతో ఆమెను ఉద్దరించ (పైకేత) దలచెను; అతడామెతో ఇట్లనెను: వసుధా దేవీ! పాపము (తప స్విని –దయనీయ-జాలిపడదగినది ఆగు) ఈ నీవు నా తేజస్సు నీయందు నిలువగా మోయజాలక దుర్బలయగు గోవు బురదయందువలే రసాతలమందు దిగబడితివి; అన పృథివి విష్ణునిట్లు స్తుతించెను.
భుదేవీకృతవిష్ణుస్తుతిః.
పృథివీ: త్రివిక్రమాయామిత విక్రమాయ మహావరాహాయసురోత్తమాయ॥
శ్రీశార్జ్గచక్రాసిగదాధరాయ నమోఽస్తు తే దేవవర ప్రసీద ।
తవ దేహాజ్జగజ్ఞాతం పుష్కర ద్వీప ముత్తితమ్॥
బ్రహ్మాణ మిహ లోకానాం భూతానాం శాశ్వతం విదుః ।
తవ ప్రసాదా ద్దేవోఒయం దివం భు జ్కే పురస్ధరః॥
*తవ క్రోధా ద్వినిర్ధూతా స్సర్వే దైత్యా జనార్దన ।
ధాతా విధాతా సంహర్తా త్వయి సర్వం ప్రతిష్ఠితమ్॥
మనుః కృతాన్తో నియతం జ్వలనః పవనో ఘనః ।
వర్ణాశ్చాశ్రమ ధర్మాశ్చ సాగరా స్తర వోచలాః॥
నద్యో ధర్మశ్చ కామశ్చ యజో యజ్ఞస్య యాః క్రియాః ।
విద్యా వేద్యంచ స త్వం చ హీశీః కీర్తి ర్హృతిః క్షమా॥
పురాణం వేద వేదాజ్ఞం సాజ్ఞ్యం యోగో భవాభవో ।
జజ్జమం స్థావరం చైవ భవిష్యం చ భవచ్చ యత్॥
సర్వం తచ్చ త్రిలో కేషు ప్రభావోపహితం తవ ।
త్రిదశోదారఫలదః స్వర్గశ్రీ చారుపల్లవః॥
సర్వలోకమనః కాస్త స్సర్వసత్త్వ మనోహరః ।
విమానానేక విటమ స్తోయదామ్బుమధు సవః॥
దివ్యలోక మహాసస్థ స్సత్యలోకప్రశాఖవాక్ ।
సాగరాకార నిర్యాసో రసాతలజలాశ్రయః ।
నాగేన్దపాదపో పేతో జన్లుపక్షిని షేవితః॥
శిలాచారార్యగన్దశ్చ సర్వలోకమయో ద్రుమః ।
ద్వాదశార్కమయద్వీపో రుదైకాదశప త్తనకి॥
వస్వష్టాచలసంయుక్త లో క్యామ్భోమహోదధిః ।
సిద్ధసాధ్యోర్మిసలిల స్సువర్ణానిల సేవితః॥
దైత్యలోక మహాగ్రాహో యజోరగగణాకులః ।
పితామహ మహాధైర్య స్వర్గ స్త్రీ రత్న భూషితః॥
ధీప్రీశ్రీ కా స్తిభిర్నిత్యం నదీభి రుపశోభితః ।
కాలయోగ మహాపర్వ, పయోగపతి రేక రాట్॥
త్వం స్వయోగ మహావీర్యో నారాయణ మహార్ణవః ।
త్వయా సృష్ట్రా ప్రయో లోకా స్వయైవ ప్రతిసంహృతాః॥
విశంతి యోగిన స్సర్వే త్వామేవ ప్రతియోజితాః ।
యుగే యుగే యుగాంతాగ్నిః కాలమే ఘే యుగేయుగే॥
(*తవ క్రోధాద్ధి బలవా జనార్దన జితో బలిః)
త్రివిక్రమా! అమిత పక్రనూ! మహావరాహా! సురోత్తమా! శ్రీ శార్జచ క్రాసిధరాః గదాధరా; నీకు నమస్కారము; దేవో తమా! ప్రసన్నుడవుగమ్ము; దేవా! నీ దేహమునుండి జగము జనించినది; పుష్కర ద్వీపము ఉత్తీతమయినది: లోకము లను సృష్టించు బ్రహ్మయు సకల భూతములతో శాశ్వతుడవును నీవే యని వేదములనును; నీయనుగ్రహముననే ఈ పురందరుడు స్వర్గమనుభవించుచున్నాడు. జనార్ధనా! నీక్రోధముననే సర్వదే శ్యులును (బే) చెదరిపోవుచున్నారు; ధాత (సష్ట) విధాత (స్థితికర్త) సంహర్త.ఇందరును ఇదియంతయు నీయందే నిలిచియున్నది; మనువు యముడు ఆగ్ని వాయుపు పర్జన్యుడు వర్ణములు ఆశ్రమ ధర్మములు సాగరములు పర్వతములు వృక్షములు నదులు ధర్మము కాముడు యజ్ఞములు యజ్ఞ క్రియలు విద్యయు తెలియవలసినది) సత్వము.ప్రీ-శ్రీ -కీర్తి ధృతి -క్షమ పురాణములు వేదములు వేదాం గములు సాంఖ్యము యోగము భవము (సృష్టి) ఆభావము (ప్రళయము) స్థావర జంగమ (చర) భూతములు భూతము వర్తమానము భవిష్యము ఇంకను త్రిలోకముల యందున్న దంతయును నీ ప్రభావమును ఆశ్రయించియున్నవి; త్రిదశుల (దేవతల)నేడు ఉదార ఫలమునిచ్చునదియును స్వర్గస్త్రీలనేడు మనోహర పల్లవములుకలదియును సర్వలోకమనోహరమును విమానములను అనేక శాఖలు కలదియు మేఘజలమను తేనెను స్రవించునదియు దివ్యలోక ములను మహాస్కంధము ( పెద్ద బోదె) సత్యలోక మను చిగురు కొమ్మ సాగర జలములనేడు నిర్యాసము (జిగురు ఊట) రసాతలమనెడు పొతు ఆది శేషుడ నేడు తల్లివేరు జంతువులు పక్షులు ననెడు ఆశ్రితులు శీలము ఆచారము ఆర్యులు అనేడు సుగంధము కలదియు నగు దివ్య నర్వలోక మయ వృక్షరూపుడవు నీవు; ద్వాదశార్కులనేడు ద్వీపములు ఏకాదశ రుద్రులనేడు పత్తనములు అష్ట వసువులనేడు పర్వతములు త్రైలోక్యమనేడు నీరు సిద్దసాధ్యులనేడు జలోర్ములు సుపర్లు గరుడు)లనెడు వాయువులు యజ్ఞోరగ దైత్యలోక గణమనేడు మహాగ్రాహములు పితామహుడు (బ్రహ్మ) అనేడు మహా ధీరత్వము స్వర్గస్త్రీలనేడు రత్నములు ధీహీ శ్రీకాంతులనెడు నదులు కాలాంశములు యోగములు మహాపర్వములు ఆనేడు ప్రయోగములు పొటులు పోటులు) ఆత్మయోగమనేడు మహావీర్యము కల ఏకరాట్ ధర్మముతో నుండు నారాయణుడను మహా సముద్రమవు; లోక తయమును నీచే సృష్టింపబడును; లయింపబడును; సర్వయోగులును నీచే బయటికి తేబడి నిన్నే ప్రవేశింతురు; యుగ యుగమందును నీవే ప్రళయకాలాగ్ని మేఘరూపుడవగుదువు.
మహాభారావతారాయ దేవ త్వం హి యుగేయుగే ।
త్వం హి శుక్లః కృతయుగే త్రేతాయాం చంపకప్రభః॥
ద్వాపరే రక్తసఙ్కాశః కృష్ణః కలియుగే భవా ।
వై వర్ణ్య మభిధత్సే త్వం ప్రాప్తేషు యుగసన్దిషు॥
వై వర్ణ్యం సర్వధర్మాణా ముత్పాదయసి వేదవిత్ ।
భాసి వాసి ప్రతపసి త్వం చ పాసి విచేష్ట సే॥
క్రుధ్యసి జాగ్రి మాయాసీ త్వం దీపయసి వర్షసి ।
త్వం హాస్యసి న నిర్యాని నిర్వాపయసి జాగ్ర॥
నిశ్శేషయసి భూతాని కాలో భూత్వా యుగక్షయే ।
శేష మాత్మాన మాలోక్య వి శేషయసి త్వం పునః॥
కాలో భూత్వా ప్రసన్నా భి రద్భిర్హ్లాదయ సే పునః॥
యుగాస్తాగ్యవలీడేషు సర్వభూతేషు కిఞ్చన ।
యాతేషు శేషో భవసి తస్మా చ్చేపోసి సన్తతమ్॥
చ్యవనోత్పత్తియుక్తేషు బ్ర హేన్దవరుణాదిషు ।
యస్మా న్న చ్యవ సే స్థానా త్తస్మా దచ్యుత ఉచ్య పే॥
బ్రహ్మాణ మిన్దం రుద్రంచ యమం వరుణ మేవచ ।
నిగృహ్య హర సే యస్మాత్తస్మా ద్దరి రిహాచ్య సే॥
సనా(దా)నయసి భూతాని వపుషా యశసా శ్రీయా ।
చిరేణ వపుషా దేవ తస్మా చ్చాసి సనాతనః॥
యస్మా ద్బహ్మాదయో దేవా మునయ శోగ్రతేజసః ।
న తే త్వా మభిగచ్చ స్తి తేనానక్త స్వముచ్య సే॥
న క్షీయ సేన క్షర సే కల్పకోటిశతై రపి ।
యస్మా త్వ మక్షర త్వాచ్చ తస్మా ద్విష్ణుః ప్రకీర్త్య సే॥
విష్టం య త్వయా సర్వం జగ శౌవర జజ్జిమమ్ ।
జగద్విష్టమ్బనా చ్చైవ విష్ణు దేవేతి కీర్త్యసే॥
విష్ణభ్య తిష్ఠ సే నిత్యం త్రైలోక్యం సచరాచరమ్ ।
యక్షగన్షర్వనగరం సుమహాభూతపన్న గమ్॥
వ్యాప్తం త్వయి ప్రవిశతి త్రైలోక్యం సచరాచరమ్ ।
తస్మా ద్విష్ణు రితి ప్రోక్త స్స్వయమేవ స్వయమ్భువా॥
దేవా! నీవు యుగయుగమున మహీభారావతారణమునకై ఆవతరింతువు; కృత త్రేతా ద్వాపర కలియుగములందు వరుసగా శుక్ల (చంపక కుసుమ) హరితరక్త కృష్ణవర్ణుడవు: ఆయా యుగ సంధికాలములు వచ్చినపుడు వై వర్ణ్యము నుదుదువు; వేదవేత్తవయి ఆయా కాలములందు సర్వధర్మములకును వైవర్ణ్యము సాంకర్యము కూడ కలిగింతువు; నీవే ప్రకాశింతువు వీచెదవు తపింపజేయుదువు రక్షింతువు కృత్యము లాచరింతువు క్రుద్ధుడవగుదువు క్షాంతినందుదువు దీపింపజేయుదువు వర్పింతువు విడుతువు వెలువడుదువు చల్లార్చేదవు మేలుకొందువు; యుగక్షయమున కాలుడవయి సకల భూతములను నిః శేష మొనరింతువు; అదే కాలరూపుడవై తేటయగు నీటితో ఆనంద పర చేదవు; సర్వభూతములును యుగాం తాగ్ని చే నాకీ వేయ (దహించ) బడగా అన్ని యు పోగా నీవే శేషింతువు; కనుకనే సంతతమును శేషుడవనబడేదవు; శేషించిన ఆత్మను నీ స్వస్వరూపమును చూచికొని మరల విశేష (భేద)మును నీరూపమునందును కలిగించుకొందువు; ఈ హేతువుచేతను నీవు (వి) శేషుడవు; బ్రహ్మేంద్ర వరుణాదులు చ్యవనము (చ్యుతి-నాశము) - ఉత్పత్తి కలవారు. నీవు మాత్రము స్థానమునుండి చ్యుతుడవుకావు. కనుక అచ్యుతుడవు. బ్ర హ్మేంద్ర రుద్ర యమ వరుణులను గూడ నిగ్రహించి హరింతువు కావున హరివి. సనా (ఎల్లపుడు) భూతములను శ రీరకీర్తి శ్రీలతో కూర్చుచు నీవు చిరస్థాయి వపువు (శరీ రము)తో కూడియుందువు. కావున నీవు 'సనా(దా)తనుడు' (ఎల్లపుడు ఉండువాడు) అయితివి. బ్రహ్మాది దేవతలును ఉగ్ర తేజస్కులగు మునులును నిన్ను అందుకొనజాలరు. కావున అనంతుడవు (అంతము-అంతకము- సమీపమునకు వచ్చుట) శతకోటి కల్పములకయిన నీవు క్షయించవు-క్షరించవు-(కరుగపు-తరుగవు) కావున అక్షరుడవు. స్థావర జంగ మాత్మక జగత్తును విష్టబము (నిలుపబడినది)గా చేయుదువు కావునను సచరాచర త్రైలోక్యమును విష్టంభించి (ఆశ్ర యముగా చేసికొని) ఉందువు.యక్ష గంధర్వ నగరములతో మ హాభూత నాగులతో నిండిన సచరాచర త్రైలోక్యమును వ్యా ప్రమయి నీయందు ప్రవేశించియున్నది కావునను నీవు విష్ణుడవు (విశంతి సర్వభూతాని ఏనం-విశంతి సర్వభూతానీ ఆయమ్) 'సర్వభూత ములును ఇతనియదు ప్రవేశించును. సర్వభూత ములదు ఇతడు ప్రవేశించును.' అని స్వయం భువు చేప్పేను.
నారా ఇత్యుచ్యంతే హ్యాపో ఋషిభి స్తత్వదర్శిభిః ।
ఆయనం తస్య తాః పూర్వం తేన నారాయణ స్మృతః॥
యుగే యుగే ప్రణష్టాం గాం విష్ణో విందసి తత్వతః ।
గోవిందేతి తతో నామ్నా ప్రోచ్య సే ఋషిభి స్తథా॥
హృషీ కాణిన్డియాణ్యాహు స్తత్వజ్ఞాన విశారదాః ।
ఈశ త్వే వర్త సే తేషాం హృషీ కేశ సర్డోచ్య ॥
వస ని త్వయి భూతాని బ్రహ్మాదీని యుగక్షయే ।
త్వం వా వససి భూతేషు వాసుదేవ స్తథోచ్య సే॥
సజర్షయసి భూతాని కల్పే కల్పే పునః పునః ।
తత స్సజ్కరణః ప్రోక్త స్తత్వజ్ఞానవిశారదైః॥
ప్రతీప్యూ హేన తిష్టస్తి సదేవాసుర రాక్షసాః ।
ప్రవిద్యు స్సర్వధర్మాణాం ప్రద్యుమ్న స్తేన చోచ్య సే॥
నిరోద్దా విద్యతే యస్మా న్న తే భూతేషు కశ్చన ।
అనిరుద్ధ స్తతః ప్రోక్తః పూర్వమేవ మహర్షిభిః॥
య త్వయా ధార్యతే విశ్వం త్వయా సంప్రియతే జగత్ ।
త్వం ధారయసి భూతాని భువనం త్వం బిభర్షి చ॥
య త్వయా ధార్యతే కిళ్చా తేజసా చ బలేన వా ।
మయా హి ధార్యతే పశ్చా న్నాధృతం ధార్యతే త్వయా॥
న హి తద్విద్యతే భూతం త్వయా య న్నాత ధార్యతే ।
త్వమేవ కురు షే దేవ నారాయణ యుగే యుగే॥
మహీభారావతరణం జగతో హితకామ్యయా ।
తవైవ తేజసా కానాం రసాతలతలం గతామ్॥
త్రాయస్వ మాం సురశ్రేష్ట త్వామేవ శరణం గతా ।
దానవై ః పీడ్యమానాఒహం రాక్షసైః క్రోధతత్పరైః॥
త్వామేవ శరణం నిత్య ముపయామి సనాతనమ్ ।
తావన్మే స్తి భయం దేవ యావ న్న త్వాం కకుద్మినమ్॥
శరణం యామి మనసా శతతోపులపలకయే ।
ఉపమానం న తే శ క్తాః కర్తుం సేంద్రా దీనౌక సః॥
త్వమేవ సతతం వేతి నిరుత్తర మతః పరమ్ ।
తత్త్వదర్శులగు ఋషులు అప్పు(జలము)లను 'నారములు' ఆందురు; (సృష్టికి) పూర్వమతనికవి ఆయనము (ఆశ్రయ - లయ - స్థానము) కావున నారాయణుడవు; యుగయుగమునందును ప్రణాశ మందిన గోవును (ధర్మమును - భూమిని - నన్ను ) తాత్వికముగా యథాస్థితిని పొందింతువు; (గో-విద్) కావున నీవు ఋషులచే గోవిందుడనబడెదవు; త త్వన విశారదులు ఇంద్రియములను హృషీకములందురు; వానికి ఈ గుడవై వర్తిల్లుదువు కావున హృషీ కేశుడవు; యుగ క్షయమందును బ్రహ్మాది భూతములు నీయందు వసించును; నీవును వానియందు వసింతువు; కావున వాసుదేవుడవు; ప్రతికల్పమునందును భూతములను సంకర్షింతువు (దగ్గరకు లాగిందువు -లయింతువు) కావున సంకర్షణుడవు అని తత్వజ్ఞాన విశారదులందురు; దేవాసుర రాక్షసులు ప్రతివ్యూహము (అమరిక)తో నీబలముననే యున్నారు: సర్వధర్మ ముల తత్వములను ఎరుగుచున్నారు: కావున (ప్ర-దివ్: ప్ర-విద్) ప్రద్యుమ్నుడవు; భూతములయందు ఏయొకడును ఇతని కంటేమించి నిరోధము (ఆటంకము) ఒనరించువాడు తన ఆదుపునందుంచుకొవాడు) లేడు కావున మహర్షులచే అనిరుద్ధుడన బడెదవు; విశ్వము నీదే ధరించబడును; సంహరించబడును; నీవు భూతములను ధరింతువు - భువనమును భరింతువు; ఏ కొంచె(తత్వ)మయినను తేజము చేకాని బలము చేకాని మొదట నీచే ధరించబడును; తరువాత నాచే ధరించబడును: నీచే ధరించబడనీదే నాచే ధరించబడదు; ఈ విశ్వమందు నీచేత ధరించబడనిది ఏదియు లేదు;నారాయణా! యుగయుగమునను జగములకు హితము చేయు కామనతో నీవే మహీభారమునవతరించ(దీగునట్లు) చేయుదువు: నీ తేజస్సుతోనే ఆక్రాంతికై (వ్యాప్తికై) రసాతలతలమును చేరియున్న నన్ను రక్షించుము; సుర శేషా! నిన్నే శరణందితిని: క్రోధతత్పరులగు దానవులచే రాక్షసులచే పీడింపబడుచున్న నేను సనాతనుడవగు నిన్నే శరణు పొందుచున్నాను: కకుద్మి (దేవవృషభుడు) అగు నీన్ను మనసా శరణందనంతవరకు నాకు భయము ఉండనేయున్నది. నూరు విధములుగా ఆలోచించినను నీకు ఉపమానము నాకు కనబడుటలేడు. ఇంద్రాది దేవతలును నిన్నే వరితోను పోల్చుటకును శక్తులు కారు. ఎల్లపుడును ఈ విషయము లన్నియు నీవే ఎరుగుదువు. ఇక మీదట (ఇంతకుమించి) పైగా చెప్పవలసినది ఏమియులేదు.
శౌనకః : తతః ప్రీత స్స భగవా నృథివ్యా శ్శార్జ్గచక్రభృత్॥
కామ మస్యా యథా కామ మభిపూరితవా హరిః ।
అబ్రవీచ్చ మహాదేవి మాధవీయం స్తవో త్తమమ్॥
ధారయిష్యతి యో మర్త్యో నాస్తి తస్య పరాభవః ।
లోకా న్నిష్కల్మషాం శ్చైవ వైష్ణవా నతిపత్స్యతే॥
మహదాశ్చర్య సర్వస్వం మాధవీయం స్తవో త్తమమ్ ।
అధీతవేదః పురుషో మునిః ప్రీతమనా భవేత్॥
శ్రీభగవా : మా భైర్ధరణి కల్యాణి శాంతిం వ్రజ మమాగ్రతః ।
ఏష త్వా ముచితం స్థానం ప్రాపయామి మనీషితమ్॥
వరాహోత్పత్తిః.
శౌనకః : తతో మహాత్మా మనసా దివ్యం రూప మచింతయత్ ।
కిన్ను రూప మహం కృత్వా ఉద్దరేయం ధరా మీమామ్॥
జలక్రీడారుచి స్తస్మా ద్వారాహం రూప మాస్థితః ।
అదృశ్యం సర్వభూతానాం వాజ్మయం బ్రహ్మ సంస్థితమ్॥
శతయోజనవి సీర్ణ ముచితం ద్విగుణం తతః ।
నీలజీమూతసఙ్కాశం మేఘ స్తనితనిస్వనమ్॥
గిరిసంహననం భీమం శ్వేతతిష్ణోగ్రదంష్టిణమ్ ।
విద్యుదగ్నిప్రతీకాశ మాదిత్యసమతేజసమ్॥
పీనవృత్తాయతస్కన్దం ధృష్టశార్దూలగామినమ్ ।
పీవోన్నతక టీ దేశం వృషలక్షణ మూర్జితమ్॥
విపులం రూప మాస్థాయ వారాహ మమితౌజసమ్ ।
పృథివ్యుద్ధరణార్థాయ ప్రవివేశ రసాతలమ్॥
అంతట జార్జ్గచక్రధారియగు భగవానుడు హరి పృథివియందు ప్రీతుడే ఆమె కామములను యథాకామముగ పూరించెను. అంతేకాక - మహాదేవీ! మాధవుని ఈ సవో తమమును మనస్సున ధరించు మర్త్యుడు పరాభవమునందడు; నిష్కల్మషములగు వైష్ణవ లోకమునందును. ఆపురుషుడు వేదముల నధ్యయనము చేసినంతటి వాడును ప్రీతచిత్తుడును మునియంతటి వాడునగును. ఏలయన ఈ మాధవీయ స్తవోత్తమము మహాశ్చర్యకర విషయ సర్వస్వము. కల్యాణీః ధరణీ! నాముందుగా నడువుము. భయమందకుము. ఇదిగో! ఇపుడే నిన్ను నీకు ఈప్సితమగు సముచిత స్థానమునకు చేర్చెదను. అని మహాత్ముడు విష్ణుడు ‘నేను ఏరూపమును ధరించి ఈ ధరను ఉద్దరించగలను.’ అని తదనుకూలమగు దీవ్యరూపమును గూర్చి యేజించేను. వెంటనే మొదటినుండియు జలమున విహరించుటయందు ఆస క్తికల ఆ నారాయణుడు తదనుకూలమగు వారాహరూపము దాల్చేను. ఆరూపము ఏ భూతములకును కనరానిది. వాగ్రూపమయినది - పరబ్రహ్మ మందు నిలుచునది. శతయోజన విస్తీర్ణము - ద్విశతయోజనోన్న తము. నీలమేఘ సమానము మేఘగర్జిత సమానధ్వని, యుక్తము - పర్వతమువలె దృఢనిర్మాణయుతము –భయంకరము- శ్వేత తీక్ష భయంకర దంష్ట్రాయు క్తము- విద్యుదగ్నులతో సమానము - రవి సమాన తేజనము , బలిసిగుండ్రనే పొడవైన భుజమూలములు కలది. గర్వించిన పులివలే నడుచు నది. పీనమయి ఉన్నతమయిన కటిప్రదేశము కలది. మహావృషభలక్షణయుక్తము. ఊర్జితము (పుష్టికలది). పృథివి నుద్దరించదలచి నారాయణుడు అమిత శక్తిమంతము విపులమునగు ఇట్టి వారాహరూపము ధరించి రసాతలమును ప్రవేశించెను.
వేదపాదో యూపదంష్ట్రః క్రతుదంత శ్చితీముఖః ।
అగ్ని జిహ్వా దర్భరోమా బ్రహ్మశీర్షో మహాతపాః॥
అహోరాత్రేక్షణధరో వేదాజ్గ శ్రుతిభూషణః ।
ఆజ్యనాస స్రువతుణ్ణి స్సామ ఘోషస్వనో మహాక్॥
సత్యధర్మమయ శ్రీమత్క్రమవిక్రమసత్కృతః ।
ప్రాయశ్చిత్తనఖో ఘోరః పశుజాను ర్మఖాకృతిః॥
ఉద్గాతా హోతృలిజో2థ బీజౌషధిమహాఫలః ।
వాయ్వ నరాత్మా యజ్ఞస్థివికృతి సోమశోణిత ॥
వేదసన్లో హవిర్గనో హవ్యకవ్యవిభాగవాక్ ।
ప్రాగ్వంశ కాయో ద్యుతిమా న్నా నాదీక్షాభి రన్వితః॥
దక్షిణా హృదయో యోగీ మహాసతమయో మహాక్ ।
ఉపాకర్మాష్టరుచకః ప్రవర్గ్యావర్తభూషణః॥
నానాఛనోగతిపథో గుహ్యోపనిషదాసనః ।
ఛాయాపత్నీ సహాయా వై మణిశృఙ ఇవోత్తితః॥
రసాతలతలే మగ్నాం రసాతలతలం గతామ్ ।
ప్రభు ర్లోక హితార్థాయ దంష్ట్రాగ్రేశోజ్జహార తామ్॥
తత స్స్వస్థాన మానీయ పృథివీం వృథివీధరః ।
ముమోచ పూర్వం మనసా ధారయిత్వా వసున్దరామ్॥
తతో జగామ నిర్వాణం మేదినీ తస్య ధారణాత్ ।
చకార చ నమస్కారం తస్మై దేవాయ శమృవే॥
ఏనం యజ్ఞవరా హేణ భూత్వా భూత హితార్థనా ।
ఉద్ధృతా పృథివీ దేవీ సాగరా నర్గ ఆ పురా॥
అథోద్ధృత్య క్షితిం దేవో జగత స్థాపనేచ్ఛయా ।
వృథివీప్రవిభాగాయ మన శ్చ కేజమ్బుజేక్షణః॥
రసాం గతా మవని మచి స్త్యవిక్రమ స్సురో త్తమః ప్రవరవరాహరూపధృక్ ।
వృషాకపిః ప్రసభ మథై కదంష్ట్రయా సముద్ధర ధరణి మతుల్యవిక్రమః॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే వరాహావతార చరిత్రే ధరణీ సముద్ధరణం నామ సప్తచత్వారింశదుత్తరద్వి శతతమోఽధ్యాయః॥
ఈ వరాహుడు యజ్ఞరూపుడు. అందుచే అతనికి వేదములు పాదములును యూప స్తంభములు దంష్ట్రాలును క్రతువులు దంతములును వేదిక ముఖమును అగ్నులు జిహ్వయును దర్భలు రోమములును బ్రహ్మము (ప్రణవము) శీరమును అహోరాత్రములు కన్నులును వేదాంగములు కర్ణాభరణములును ఆజ్యము నాసికయు సువము తుండమును సామ ధ్వని సత్యధర్మములును క్రమగతములగు పాదవిన్యాసములును ప్రాయశ్చిత్తములు గోళ్లును యజ్ఞపశువులు జానువులును యజ్ఞము శరీరాకృతియు ఉద్దాతయు హోతయు లింగమును బీజములును ఓషధులును మహావృణములును వాయువు అంతరాత్మయు యజ్ఞ విశేషములు వివిధాస్థులును సోమము రక్తమును వేదివి శేషములు స్కంధములును హవ్యకవ్యరూప. హవిస్సులు గంధమును ద్యుతిమంతమును నానా దీక్షాయుతమునగు ప్రాగ్వంశము కాయమును దక్షిణలు హృదయమును ఉపాక రాష్టకము రుచకములుఅను ఆభరణములును ప్రవర్గ్యావృత్తులు భూషణములును నానా ఛందోగతులు మార్గములును గుహ్య(రహస్య)ములగు ఉపనిషత్తులు ఆసనమును ఛాయయను పత్నియునయ్యెను. ఇట్టి మహాసత్ర (యాగ) మయుడగు ప్రభుడా వరాహుడు ఉన్నతమయిలేచిన మణిశృంగమువలె ఉన్న తుడై లేచి రసాతలతలమునమునిగి ఆడుగువరకు చేరిన ధరణిని తన కోర కోనతో లోక హితార్థమయి పైకి లేవనే త్రేను. తరువాత ఆ పృథివీధరుడు వసుంధరయగు పృథివిని మనస్సుతో ధరించి తరువాత ఆమెను స్వస్థానమునకుతెచ్చి విడిచెను. ఆ దేవుడు ధరించినందున మేదినీ సుఖమునందెను. మొదటశంభు (సుఖకారణు)డగు ఆ దేవునకు నమస్కారము చేసెను.
ఇట్లు పూర్వము భూత హితార్థియగు యజ్ఞ వరాహుడు సాగరాంతర్గత యగు. పృథివిని ఉద్దరించెను; ఇట్లా దేవుడును అంబుజనేత్రుడునగు విష్ణుడు జగత్సంస్థావన వాంఛతో భూమినుద్దరించి యనంతరము పృథివిని ప్రభక్తమొనరించ సంకల్పించేను. ఆతులాచింత్య విక్రముడును సురోత్తముడును ఉత్తమ యజ్ఞ వరాహ రూపధారియునగు పృషాకపి (ధర్మరక్షకుడు) నారాయణుడు ఒకేకోరతో మహాబలముతో ధరణీ నిట్లుద్దరించేను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున వరాహావతార చరితమున ధరణీ సముద్ధరణమను రెండు వందల నలువది ఏడవ అధ్యాయము.
Summary of chapter 247 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya narrates the supreme surrender of King Bali, who offered his own head for the third step, preferring to uphold his vow of truth rather than preserve his own freedom. Moved by King Bali's unyielding truthfulness, humility, and absolute devotion, Bhagavān Vishṇu released him from symbolic binding, granting him the sovereign rule of the subterranean Sutala realm, which is more opulent than Svarga. Bhagavān Vishṇu pledged to serve personally as the eternal gatekeeper of King Bali's palace, immortalizing the Asura king as an eternal archetype of total surrender.