110 - ప్రయాగ మాహాత్మ్యము

నన్ది కేశ్వరః : భాతృభి స్సహిత స్సర్వై రౌపద్యా సహ భార్యయా

ప్రయాగం సమనుప్రాప్య స్నా త్వా స కృతనై త్యకః

  బ్రాహ్మణేభ్యో నమస్కృత్వా గురుదేవా స్ప్రతర్ప్య చ

 వాసుదేవోపి తత్రైవ క్షణేనాథ్యగమ త్తదా

 పాణ్డవై స్సహితై స్సర్వైః పూజ్యమాన స్సమాధవః

 కృష్ణోథ సహితై సర్వే రభ్యషిఞ్చద్యుధిష్ఠిరమ్

 శ్రీ ఏతస్మి న్న నరేచైవ మార్కణ్డేయో మహామునిః

 తత స్స్వ స్త్రీతి చోక్త్వాచక్షణా దాశ్రమ మభ్యగాత్

 యుధిష్ఠిరోపి ధర్మా భాతృభి స్సహ సోవసత్

 మహాదానం తతో దత్వా ధర్మసూను ర్యుధిష్ఠిర

య స్విదం కల్య ఉత్థాయ మాహాత్మ్యం పఠతే నరః

 ముచ్యతే సర్వపాపేభ్యో రుద్రలోకం స గచ్చతి

నందికేశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను: అంతట యుధిష్ఠిరుడు మార్కండేయ వచనమున సోదరులతోను పత్ని యగు ద్రౌపదితోను కూడి ప్రయాగ కేగి స్నానమాడి నిత్యానుస్థానముదీర్చి బ్రాహ్మణుల నమస్కరించి గురువులకు (పూర్వులగు పెద్దలకు) దేవతలకు తర్పణము ఇచ్చెను. క్షణములో వాసుదేవుడును అక్కడ కేతెంచెను. మాధవుడును వారలందరచే పూజింపబడి పిమ్మట యుధిష్ఠిరు నభి షేకించేను. అంతలోనే మార్కండేయ మహా మునియు నతనికి స్వస్తి వచనము పలికి క్షణములో తన యాశ్రమమేతెంచెను. యుధిష్ఠిరుడు మాత్రము భ్రాత్రాదులతో కూడి యటనేయుండి మహా దానము లాచరించెను. ప్రాతః కాలమున మేల్కాంచి ఈ మాహాత్మ్యమును పఠించు నరుడు సర్వపాప వినిర్ముకుడే రుద్రలోక ప్రాప్తుడగును.

వాసు దేవః :  మమ వాక్యంచ కర్తవ్యం త్వయా స్నేహా ద్యుధిష్ఠిర

నిత్యం యజస్వ జుహ్వస్వ ప్రయాగే విగత జ్వరః

 ప్రయాగం స్మరవై నిత్యం తస్మా తురు యుధిష్ఠిర

స్వయం ప్రాప్స్యసి రాజేంద్ర స్వర్గలోకం న సంశయః

  ప్రయాగ మనుగచ్చేద్వా వసతే పాపి యో నరః

 సర్వపాపవిముక్తాత్మా రుద్రలో కే మహీయతే

 ఋషిభిః క్రతవః ప్రోక్తా దేవైశ్చాపి యథాక్రమమ్

 న హి శ క్యా దరిద్రేణ యజ్ఞాః కర్తుం మహీపతే

 బహూపకరణా యజ్ఞా నానాసమ్బారవి స్తరాః

 ప్రాప్య నే పార్థివై రేవ సమృధైర్వా నరై క్వచిత్

  యో దరిదైరపి విధి శ్శక్యః ప్రాపుం యుధిష్ఠిర

 తుల్యో యజ్ఞఫలై : పుణె స్తన్ని బోధ వదామితే

  ఋషీణాం పరమం గుహ్య మిదం రాజర్షిసత్తమ

 తీర్థానుగమనం పుణ్యం యజేభ్యోఒపి విశిష్యతే

  దశ తీర్థసహస్రాణి త్రింశత్కోట్య స్తథాపరాః

 మాఘమా నే గమిష్య ని గడ్డాయాం భరతర్షభ

  స్వస్ధా భవ మహారాజ భుజ్జ్వ రాజ్య మకష్టకమ్

 పునర్దాక్ష్యసి రాజేన్హ యజమానో విశేషతః

  నన్ది కేశ్వరః : ఇత్యుక్త్వా స మహాభాగో మార్కణ్డేయే మహాతపాః

యుధిష్ఠిరస్య నృపతే సతైవాన్తర ధీయత

 పున స్తత్ర సమాప్లావ్య గాత్రాణి సగణో నృపః

 యథో కేన విధానేన పరాం నిర్వృతి మాగతః

  తదా త్వమపి దేవరే ప్రయాగాభిముఖో భవ

 అభి షేకంతు కుర్యాద్యః కృతకృత్యో భవిష్యతి

  సూతః : ఏవముక్త్వాథ నన్దశ సతైవానరధీయత

 నారదోపై జగామాథ ప్రయాగాభిముఖ స్తథా 

ఇతి శ్రీమత్స్యమహాపురాణే నన్ది కేశ్వర నారదసంవాదే ప్రయాగ మాహాత్మ్యపరిసమాప్తిర్నామ దశోత్తరశతత మోధ్యాయః

* ఇతి ప్రయాగ మాహాత్మ్యమ్ *

 ఈ అనంతరము శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో ఇట్లనెను: యుధిష్ఠిరా! నాయందలి స్నేహముతో నొవాక్యమిది ఆచరించవలయును. నిత్యమును సంతాపర హిత చిత్తముతో ఈ ప్రయాగయందు దేవతల యజించుచు హోమములు జరుపుచుండుము. మరల మార్కండేయుడు యుధిష్ఠిరునితో ఇట్లనెను. రాజా! తరువాత కూడ నిత్యమును - ప్రయాగను స్మరించుచుండుము. నిస్సంశయముగా దాన నీవు స్వర్గ సుఖములనందగలవు. ఏలయన నరుడెవ్వడేని ప్రయాగ కేగినను నట వసించినను సర్వపాప విముక్తుడై రుద్రలోకమున పూజితుడై సుఖించును. మహీపతీ! ఋషులును దేవతలునెన్నియో యజ్ఞ క్రతువులు ప్రవచించిరి. దరిద్రుడవి చేయజాలడుక దా! యజ్ఞములకు బహూపకరణములును నానా సంభార వి సరములును కావలయును. అట్టివి భూపతులకు మాత్రముగాని ధనవంతులకుగాని లభ్యములగును. కాని దరిద్రులకును పొంద సులభమగు విధానము యజ్ఞఫలతుల్య ఫలప్రదమై పుణ్యప్రదమగునది కలదు; తేలి పెదను. ఇది ఋషులకును త త్వమెరుగరానీ గుహ్య విషయము. తీర్థయాత్రా గమనము యజ్ఞములకంటే విశిష్టతర పుణ్యప్రదము. ముప్పది కోట్ల పదివేల తీర్థములు మాఘచుసమున గంగయందు చేరియుండును. (ఇది ఎరిగి) నీవు స్వస్థతనందుము. అకంటకముగ రాజ్యము ననుభవించుము. నీవు యజమానుడవయి (యజ్ఞముల నాచరించుచు) నన్ను మరల చూతువుగాని; అని యిటు పలికి మార్కండేయుడు యుధిష్ఠిరుని పట్ల యెదుటనే అంతర్ధానమందెను. యుధిష్ఠిరుడును మరల యథావిధానముగ సపరివారముగ ప్రయాగయందలి గంగా యమునా సంగమమున స్నానమాడి పరమానందము నందెను. కావున దేవరీ! నారదా! నీవును బయలు దేరి ప్రయాగ కేగుము. ఆసీ నారదునితో పలికి నందికేశ్వరుడు అంతర్థానమందెను, నారదుడును ప్రయాగాభిముఖుడై బయలుదేరెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్య పరిసమాప్తియను నూట పదియవ అధ్యాయము.

క్రియా యోగ ప్రకరణము ముగిసినది.

 [ఈ క్రియా యోగము, 52వ అధ్యాయము నారంభమునుండి 110 అధ్యాయాంతము వరకు ఇచట ఈయబడినది. మరల 267వ అధ్యాయారంభమునుండి 288వ అధ్యాయాంతము వరకు ఇది ప్రతిపాదింపబడును.

  -అనువాదకుడు]