85 - సువర్ణ పర్వత దానము

 ఈశ్వరః : అథ పాపహరం వక్ష్యే సువర్ణాచల ముత్తమమ్

యస్య ప్రసాదా ద్బవనం వైరిఞ్జం యాతి మానవః

ఉత్తమః పలసాహస్రం మధ్యమః పఞ్చభి శృతైః

తద ర్దేనాధమ సర్వ దల్పవిత్తోపి శ క్తితః

 దద్యా దేకపలా దూర్ధ్వం యథాశక్త్యా వియత్సరః

 ధాన్యపర్వతవ త్సర్వం విదధ్యా న్ము నిపుజ్గవ

 విష్కమ్భ శై లాం స్తద్వచ్చ ఋత్విగ్బ్యః ప్రతిపాదయేత్

 నమస్తే బ్రహ్మవిద్యాయ(బ్రహ్మబీజాయ) బ్రహ్మగర్భాయ తే నమః

 యస్మా దనన్తఫలద స్తస్మా త్పాహి శిరోచ్చయ

యస్మా దగ్నేరపత్యం త్వం యస్మా దల్పం జగత్పతే

 హేమపర్వతరూపేణ తస్మా తాహి నగోత్తమ

 అనేన విధినా యస్తు దద్యాత్కనక పర్వతమ్

 స యాతి పరమం బ్రహ్మలోక మానన్దకారకమ్

 తత్ర కల్పశతం తిష్ఠే త్తతో యాతి పరాం గతిమ్  

ఇతి శ్రీ మత్స్యమహాపురాణే కనకపర్వత దానమాహాత్మ్య కథనం నామ పశ్చా శీతిత మోఽధ్యాయః

 ఈశ్వరుడు నారదునకిట్లు చెప్పెను : ఇప్పుడిక సువర్ణ పర్వత దాసమును తెలుపుదును. అది పాపహరమును ఉతమమును. దానిని చేసిన పుణ్య ప్రభావమున మానవులు బ్రహ్మలోకమున సుఖింతురు. దీని కై బంగారు వేయి పలములు కాని ఐదు వందల పలములు కాని దానిలో సగముకొని మరియు శ క్తిలేనివాడు యథాశ క్తిగ బంగారు వినియోగించ వచ్చును. ఒక పలమునకు తక్కువ కాకుండవలెను. కాని ఈ విషయమున ఇతరులతో పోటీపడరాదు. ప్రతి అంశము నందును ధాన్య పర్వతమునందువలెనే చేయవలెను. అట్లే విష్కంభ శైలములను ఋత్విక్కులకు దానమీయవలెను. సువర్ణ పర్వతమా! బ్రహ్మ విద్యా స్వరూపమవు; బ్రహ్మదేవుని గర్భమవు; (బీజమవు;) అనంత ఫలమునిచ్చు దానవు; అగ్ని కి సంతానమవు; పరమాత్ముని ఆల్ఫాంశ రూపమపు; కావున స్వర్ణ పర్వత రూపమున నీవు నన్ను రక్షించుము. ఈ విధాన మున సువర్ణ పర్వత దానము చేయువాడు - పరమానంద ప్రచ మగు బ్రహ్మ లోక మునుచేరి అచట నూరుకల్పములపాటు సుఖించి చివరకు మోక్షమునందును.

ఇది శ్రీ మత్స్య మహా పురాణమున కనక పర్వత దాన మాహాత్మ్య కథనమను ఎనుబది ఐదవ అధ్యాయము.