74 - కల్యాణ సప్తమీ వ్రతము

బ్రహ్మా : భగవక దుఃఖసంసార సాగరోద్ధార కారకమ్

కిఞ్చిద్ర్వతం సమాచక్ష్వ స్వర్గారోగ్యఫలప్రదమ్

ఈశ్వరః సౌర ధర్మా న్పృవక్ష్యామి నామ్నా కల్యాణసప్తమీ

మన్దార సప్తమీ తద్వ త్ఫలాడ్యా సాపనాశనీ

శర్కరాసప్తమీ పుణ్యా తథా కమలసప్తమీ

మన్దార సప్తమీ తద్వ త్స ప్రమీ శుభస మీ

సర్వాఽనస్తఫలాః ప్రోక్తా స్సర్వా దేవర్షిపూజితాః

విధాన మాసాం వక్ష్యామి యథావ దనుపూర్వశః

యదాతు శుక్లసప్తమ్యా మాదిత్యస్య దినం భవేత్

సాతు కల్యాణినీ నామ విజయా భువి కథ్యతే

ప్రాత ర్గవ్యేన పయసా స్నాన మస్యాం సమాచరేత్

తత్ప్ర శ్శుక్లామ్బరః పద్మ మక్షతాభిః ప్రకల్పయేత్

ప్రాజ్ముఖోఽష్టదశే మధ్యే తద్వ ద్వృత్తాంచ కర్ణికామ్

పుష్పాక్షతాభి ర్దేవేశం విన్య సే త్సర్వతః క్రమాత్

బ్రహ్మ ఈశ్వరుని ఇట్లడిగెను. 'భగవన్! సంసార సాగర దుఃఖమునుండి ఉద్దరించు సాధనమగుచు స్వర్గారోగ్య ఫలప్రదమగు వ్రతమేదయిన తెలుపుము.' ఈశ్వరు డిట్లు చెప్పెను: సౌర (సూర్యోపాసన ప్రధానములగు) ధర్మములను చెప్పెదను. వాటి పేరులు ఒక ల్యాణ సప్తమి విశోక సప్తమి.ఫల సప్తమి.శర్కరా సస్తమి.కమల సప్తమి. మందార సప్తమి. శుభ స పమి. ఇవియన్నియు అనంతఫలదములును దేవరులచే కూడ పూజితములును. వీటి విధానమును కల్పోక్త ప్రకార మున నామక్రమమున చేప్పేను.

ఆదిత్య వారముతో కూడిన శుక్ల సప్తమికి కల్యాణ సప్తమియని లోకప్రసిద్ధి. ఈనాటి ఉదయమున గోక్షీర స్నానము చేయవలెను. పిమ్మట తెల్లని స్వచ్చ వస్త్రములు ధరించి అక్షతలతో అష్టదళ పద్మము వేయవలెను. దాని నడుమ గుండ్రని కర్ణికను వేయవలెను. ఈ పద్మమునందంతట నిండునట్లు పుష్పములతో అక్షతలతో నారాయణుని ఆకృతి వేయవలెను.

పూర్వేణ తపనాయేతి మార్తాణ్డాయేతి వై తతః

యామ్యే దివాక రాయేతి విధా త్రేతిచ నైరృతే

పశ్చి మే వరుణాయేతి భాస్కరాయేతి చానిలే

సౌమ్యే వికర్తనాయేతి రవయే చాష్టమే దళే

ఆదావ న్తేచ మధ్యేచ నమోస్తు పరమాత్మనే

మన్త్రై రేభి స్సమభ్యర్చ్య నమస్కారాన్తదీపితైః

శుక్లవస్త్రైః ఫలై ర్బక్ష్యై ర్దూపమాల్యానులేపనైః

స్థండిలే పూజయే ద్భక్త్యా గుడేన లవణేన చ

తతో వ్యాహృతిమన్త్రేన విసృజ్య ద్విజపుజ్గవాక్

శక్త్యా తం పూజయే ద్భక్త్యా గుడ క్షీరఘృతాదిభిః

తిలపాత్రం హిరణ్యంచ బ్రాహ్మణాయ నివేదయేత్

ఏవం నియమకృ త్సుప్త్వా ప్రాత రుత్థాయ మానవః

కృతస్నా నజపో విప్రై స్స హైవ ఘృతపాయసమ్

భుక్త్వాచ వేదవిదు షే బై డాలవ్రతవర్జితమ్

ఘృతపాత్రం సకనక సోదకుంభం నివేదయేత్

ప్రీయతా మత్ర భగవా నరమాత్మా దివాకరః

అనేన విధినా సర్వం మాసి మాసి సమాచరేత్

తతస్త్రయోదశే మాసి గాశ్చ దద్యా త్త్రయోదశ

వస్త్రాలజ్కారసంయుక్తా స్సువర్ణాస్యాః పయస్విసః

ఏకామపి ప్రదద్యా ద్వా విత్తహీనో విమత్సరః

న విత్తశాఠ్యం కుర్వీత విత్తమోహా త్పతత్యధః

ఆ నేన విధినా యస్తు కుర్వా త్కల్యాణసప్తమీమ్

సర్వపాపవినిర్ముక్త స్సూర్యలో కే మహీయతే

ఆయురారోగ్య మైశ్వర్య మసస్త మిహ జాయతే

సర్వపాపహరా నిత్యం సర్వదేవతపూజితా

సర్వదుష్టోపశమనీ సదాకల్యాణసప్తమీ

ఇమా మనన్తఫలదాం యస్తు కల్యాణసప్తమీ

శృణోతి పఠతే చేహ సోపి పాపైః ప్రముచ్యతే

ఇతి శ్రీమత్స్యమహాపురాణే కల్యాణసప్తమీవ్రతకథనంనామ చతుస్సప్తతితమోఽధ్యాయః

పూర్వస్యాం దిశి తపనాయనమః. ఆగ్నే యతః మార్తాండాయనమః-దక్షిణస్యాం దిశి దివాకరాయనమః- నైరృత్యాం విధాత్రేనమః.పశ్చిమాయాం వరుణాయనమః -వాయవ్యాం భాస్కరాయనమః- ఈ తరస్యాం వికర్తనాయనమః-ఐశాన్యాం రవయేనమః.ఆదౌ పరమాత్మనే నమః-మధ్యే పరమాత్మనేనమః.అంతే పరమాత్మనేనమః. ఈ మంత్రములతోను శుక్లవస్త్రల భక్ష్య ధూపమాల్యానులేపనములతో గుడ లవణములతో పరమాత్ముని పూజించవలెను.

పిమ్మట భూః భువః సువః అను వ్యాహృతి మంత్రములతో బ్రాహ్మణులను యథాశక్తిగా భ క్తి పూర్వకముగా గుడ క్షీర ఘృతాదికముతో పూజించవలెను. తలపాతమును హిరణ్యమును బ్రాహ్మణు నకర్పించవలెను. ఈ నియమముల పాటించి వ్రతము జరిపి నిద్రించి ఉదయమున మేలుకని స్నాన జపములాచరించి బ్రాహ్మణులతో కూడ మృతపాయసము భుజించవలయును. దంభమునకు కాక నిష్కపట భావముతో వేదవేత్తయగు విప్రునకు ఘృతపాత్రమును ఉదకుంభము ను బంగారమును దీనిచే పరమాత్ముడగు దివాకర భగవానుడు ప్రీతి చెందుగాక!' అను మంత్రముతో సమర్పించవలయును. ఈ విధముగా ప్రతీ మాసమునందును చేయవలయును. పదుచూడవ మాసమున మొగమునందు బంగారు పడే వస్తా లంకారములు కలిగిన పాడియావులను పదుమూడింటిని దానమీయవలయును. ధనము లేని వాడు ఇతరులతో పోటీపడక ఒక పాడి ఆవునై న ఈయవలయును. ధనము కలవాడు మాత్రము తనకు శ క్తియుండియు ధనలోభము చే తక్కువ ఈయరాదు. విత్త మోహము చూపుట చే అధఃపతితుడగును. ఈ విధానమున కల్యాణ సప్తమీ వ్రతము చేయువాడు సర్వ పాప వినిర్ముక్తుడై ఇహమున అనంతములగు ఆయురారోగ్యైశ్వర్యములను పొంది పరమున సూర్యలోకమున పూజితు డగును. ఈ కల్యాణ సప్తమి సదా సర్వపాప హరయును సర్వదేవతా పూజితయును సర్వ దోషోపశమనియునునై నది.

అనంత ఫలప్రదయగు ఈ కల్యాణ సప్తమీ విషయమును వినినను చదివినను పాపముక్తుడగును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున కల్యాణ సప్తమీ వ్రతకథనమను డెబ్బది నాలుగవ అధ్యాయము.