236 - మృగపక్షి వైకృత శాంతి.

గర్గః : ప్రవిశంతి యదా గ్రామ మారణ్యా మృగపక్షిణః

ఆరణ్యం యాంతి వై గ్రామ్యా స్స్థలం యాంతి జలోద్భవాః

స్థలజాశ్చ జలం యా న్త ఘోరం వాశంతి నిర్బయాః

 రాజద్వారే పుర ద్వారే శివా చావ్య శివప్రదా

 దివా రాత్రించరా వాపి రాత్రోవపి దివాచరాః

గ్రామ్యా స్త్యజని గ్రామం వా శూన్యతాం తస్య నిర్ధి శత్

 దీప్తా వాశ ని సన్గ్యాసు మడ్డలాని చ కుర్వతే

 వాశ స్త్రీ విస్వరం యత్ర తదా ప్యేతత్ఫలం లభేత్

 ప్రదోషే కుక్కుటో వాళే థేమ నే చాపి కోకిలః

 ఆరోదయే త్వభిముఖీ శివా రౌతి భయం భవేత్

 గృహే కపోతః ప్రవి శే తవ్యాడో మూఠీ లీయతే

మధు వా మక్షి కాః కుర్యు ర్మృత్యు కృహపతే ర్భవేత్

ప్రాకార ద్వారగేహేషు తోరణావణపీథిషు

 కేతుచ్చత్తాయుధాధ్యేషు క్రవ్యాదః ప్రపతే ద్యది

 జాయతే వాథ వల్మీకో మధు వా సవతే యది

 స దేశో నాశ మాయాతి రాజా చ ప్రియతే తథా

 మూషకా ఇలభా నృష్ట్వా ప్రభూతం క్షుద్భయంభవేత్

కాషోల్ముకాస్థి శృజ్జాడ్యా శ్శ్వానౌ మారక వేదనాః

 దుర్భిక్ష వేదనా ప్లేయాః కాకా ధాన్యముఖా యది

 జనానభిభవ క్లీహ నిర్భయా రణవేదనః

 కాకో మైథునయు క్షస్తు శ్వేతస్తు యది దృశ్యతే

 రాజా వా ప్రియతే తత్ర స చ దేశో వినశ్యతి

ఉలూకో పసతే యత్ర నృపద్వారే తథా గృ హే

 జ్ఞేయో గృహపతే ర్మృత్యు ర్ధననాశ స్తథైవచ

 మృగపక్షి వికారేషు కుర్యా దోమం సదక్షిణమ్

 'దేవాః కపోతా' ఇతి చ జప్తవ్యా పశ్చాభి ర్ద్విజైః

 గావశ్చ దేయా విధివ ద్ద్విజేభ్య స్సకాఞ్చానా వస్త్రయుగో త్తరీయాః

ఏవం కృతే శాంతి ము వైతి పాపం మృగై ర్విజై ర్వా విని వేదితం యత్

 ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే మృగపక్షి వైకృత శాంతి కథనం నామ షట్ త్రింశదు త్తర ద్విశతతమోఽధ్యాయః

గరుడత్రితో ఇట్లు చెప్పెను: ఆరణ్య మృగ పక్షులు గ్రామములందును గ్రామ్యమృగపక్షులరణ్యములందును ప్రవేశించుటయు స్థలచర ప్రాణులు జలములందును జలచర ప్రాణులు స్థలమునందును ప్రవేశించుటయు అవి నిర్భయము లయి ఘోరధ్వనులు చేయుటయు అశుభకరములగు గుంటనక్క రాజద్వారమందును పురద్వారమందును చేరి కూయుటయు రాత్రించర ప్రాణులు పగళ్ళయందును దివాచర ప్రాణులు రాత్రులందును సంచరించుటయు గ్రామ్య ప్రాణులు గ్రామములను విడుచుటయు జరిగినచో ఆ గ్రామము (నగరము) శూన్యమగునని తెలియవలయును; సంధ్యాకాలములందు గుంట నక్కలు చెల రేగి క్రూరముగా కూయుటయు మండ లాకొర మున తిరుగుచుండుటయు వికృత స్వరముతో కూయుటయు జరిగినను ఇదే ఫలమగును; ప్రదోషమందు కోడియు హేమ నమందు కోకిలయు కూసినను సూర్యోదయాభిముఖముగా గుంట నక్క కూసినను భయము కలిగించును; ఇంటియందు పావురము దూరినను మాంసాహారి పడి ఇంటిపై వాలినను (మండ లాకృతిగా తిరిగినను) ఇంటియందు తేనెటీగలు తేనెపట్టు పెట్టినను గృహస్వామి మరణించును; ప్రాకారములందును ద్వారములందును గృహములందును పుర ప్రధాన ద్వారములందును అంగడి వీథులందును ధ్వజములు (జెండాలు) ఛత్త ములు ఆయుధములు మొదలగు వానియందును (మీదను) మాంసాహారి పక్షి వాలినను పుట్టి పెరిగినను తేనె స్రవించినను ఆదేశము నశించును; రాజు మృతుడగును; మూషికములు మిడుతలు అధికమయి కనబడినచో మద్బయమగును; కుక్కలు క టెలనో కోరవుల ఎముకలనో కొమ్ములనో నోట కరచుకొని తిరుగుచో మృత్యువును సూచించును; కాకులు ధాన్య మును ముక్కున కరచుకొని కనబడినచో దుర్భిక్షము కలుగును; అవి భయములేక జనులను క్రమ్మి భయ పెట్టు చున్న చో యుద్దము కలుగును; కాక మైథునముకాని తెల్లని కాకి కాని కనబడినచో రాజ మరణమును దేశ నాశమును జరుగును; రాజ ద్వారమందును గృహమందును గుడ గూట నివాసమారంభించినచో గృహస్వామికి మృత్యువు కాని ధననాశము కానీ కలుగును. ఇట్టి మృగపక్షి వైకృతములు సంభవించుచో దక్షిణా యు కముగా హోమము జరిపించవలెను; ఐదుమంది బ్రాహ్మణులచే 'దేవాః కపోతా.' ఇత్యాది మంత్రములు జపింపజేయవలయును; విప్రులకు యథావిధిగ బంగారు వస్త్ర ద్వయము గోవును దానము చేయవలెను; ఇట్లు ఈ దోషము శాంతించును.  

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున మృగపక్షి వైకృత శాంతి ప్రతిపాదనమను రెండు వందల ముప్పది ఆరవ అధ్యాయము.