145 - తారకాసుర వధ కథారంభము - మరుత్తులు వజ్రాంగుడు మొదలగువారు జన్మించుట॥

ఋషయః : కథం మత్స్యేన కథిత స్తారకస్య వధో మహా

కస్మినాలే వినిర్వృత్తః కథయ నూతనస్థన

త్వన్ముఖక్షీరసిన్దూత్థా కథేయ మమృతాత్మికా

కర్ణాభ్యాం పిబతాం తృప్తి రస్మాకం న ప్రజాయతే

 ఇదం మునేః సమాఖ్యాహి మహాబుద్దే మనోగతమ్

సూతః : పృష్టస్తు మునా దేవో మత్స్యరూబీ జనార్దనః

కథం శరవణే జాతో దేవ షడ్వదనో విభుః

 ఏతత్తు వచనం శ్రుత్వా పార్థివస్యామిలౌజసః

ఉవాచ భగవాన్పీతో బ్రహ్మ సూనుర్మహామతిం

 వజ్రాజ్జోనామ దైత్యో భూ త్తస్యపుత్తస్తు తారకః

 సురా నుద్వాసయామాస పురేభ్య స్స మహాబలః

 తత స్తే బ్రహ్మణా భ్యాశం జగ్ము ర్భయనిపీడితాః

భీతాంశ్చ త్రిదశాస్త్రృష్ట్వా బ్రహ్మా తేషా ముపాచహ

 సన్యజధ్వం భయం దేవా శ్శ్కరస్యాత్మజ శ్శితుః

తుహినాచలదౌహిత్ర స్స హనీష్యతి దానవమ్

 కాలే కస్మింశ్చి దుద్వాహ్య శైలరాజసుతాం శివః

స్వరేతో వహ్ని వదనే వ్యసృజ తారణాన్తరే

 త తా పం వహ్నిర్వదనే రేతో దేవా నమర్పయత్

విదార్య జఠరాజ్యేషా మజీర్ణం నిర్గతం మునే

 పతితం తత్సరోవర్యే తస్మింస్తు శర కాననే

తస్మా త్సతు సముద్భూతో గుహో దినకరప్రభః

 స సప్తగివసో బాలో నిజ ఘ్నే తారకాసురమ్

 ఏవం శ్రుత్వా తతో వాక్యం తమూచు రృషిసత్తమాః

ఋషయః : అత్యాశ్చర్యవతీ రమ్యా కథేయం పాపనాశినీ

విస్తరేణ హి నో బ్రూహి యాథాతథ్యేన శృణ్వతామ్

 వజ్రాజో నామ దైత్యేన్తః కస్య వంశోద్భవః పురా

యస్యాభూత్తారకః పుత్త సురప్రమథనో బలీ

 నిర్మితః కో వధేభూచ్చ తస్య దైత్యేశ్వరస్య తు

గుహజన్మతు కార్డ్యేన అస్మాకం బ్రూహి మానద

ఋషయః : కథం మత్స్యేన కథిత సారకస్య వధో మహా

కస్మినాలే వినిర్వృత్తః కథయ నూతనస్థన

త్వన్ముఖరసిన్దూత్థా కథేయ మమృతాత్మికా

కర్ణాభ్యాం పిబతాం తృప్తి రస్మాకం న ప్రజాయతే

 ఇదం మునేః సమాఖ్యాహి మహాబుద్దే మనోగతమ్

సూత : పృష్టస్తు మునా దేవో మత్స్యరూబీ జనార్దనః

కథం శరవణే జాతో దేవ షడ్వదనో విభుః

 ఏతత్తు వచనం శ్రుత్వా పార్థివస్యామిలౌజసః

ఉవాచ భగవాన్పీతో బ్రహ్మ సూనుర్మహామతిం

 వజ్రాజ్జోనామ దైత్యో భూ త్తస్యపుత్తస్తు తారకః

 సురా నుద్వాసయామాస పురేభ్య స్స మహాబలః

 తత స్తే బ్రహ్మణా భ్యాశం జగ్ము ర్భయనిపీడితాః

భీతాంశ్చ త్రిదశాస్త్రృష్ట్వా బ్రహ్మా తేషా ముపాచహ

 సన్యజధ్వం భయం దేవా శ్శ్కరస్యాత్మజ శ్శితుః

తుహినాచలదౌహిత్ర స్స హనీష్యతి దానవమ్

 కాలే కస్మింశ్చి దుద్వాహ్య శైలరాజసుతాం శివః

స్వరేతో వహ్ని వదనే వ్యసృజ తారణాన్తరే

 త తా పం వహ్నిర్వదనే రేతో దేవా నమర్పయత్

విదార్య జఠరాజ్యేషా మజీర్ణం నిర్గతం మునే

 పతితం తత్సరోవర్యే తస్మింస్తు శర కాననే

తస్మా త్సతు సముద్భూతో గుహో దినకరప్రభః

 స సప్తగివసో బాలో నిజ ఘ్నే తారకాసురమ్

 ఏవం శ్రుత్వా తతో వాక్యం తమూచు రృషిసత్తమాః

ఋషయః : అత్యాశ్చర్యవతీ రమ్యా కథేయం పాపనాశినీ

విస్తరేణ హి నో బ్రూహి యాథాతథ్యేన శృణ్వతామ్

 వజ్రాజో నామ దైత్యేన్తః కస్య వంశోద్భవః పురా

యస్యాభూత్తారకః పుత్త సురప్రమథనో బలీ

 నిర్మితః కో వధేభూచ్చ తస్య దైత్యేశ్వరస్య తు

గుహజన్మతు కార్త్స్న్యెన అస్మాకం బ్రూహి మానద

 ఋషులు సూతుని ఇట్లడిగిరి : సూత కుమారా! తారకాసుర వధము ఎప్పుడు జరిగెను? ఈ మహావిషయమును మత్స్యరూపుడగు నారాయణుడు తెలిపిన విధమున మాకు నీవు తెలుపుము నీనోరు క్షీరసాగరము దానినుండి వెలువడు ఈకథ అమృతరూపమయినది మీరు చెప్పుచున్న కథలు ఎంత విను చున్న ను తృప్తి కలుగుటలేదు (చాలుననిపించుట లేదు) మహాబుద్ధిశాలియగు సూతమునీ! మామనోగతమగు కుతూహలము తీర్చుము

అనగా సూతుడు ఋషులతో ఇట్లు పలికెను : మనువు మత్స్యరూపుడగు నారాయణుని 'సర్వజగద్వ్యాపియు సర్వ సమర్థుడును (విభుః) అగు షణ్ముఖుడు (కుమారస్వామి) శరవణమున (జెల్లుగుబురులలో) ఎట్లు జన్మించెను?' అని అడిగెను అమితమగు ఓజస్సు (చిత్త దృఢత్వము) కల మను రాజడిగిన ప్రశ్న విని (సర్వ వేద మూర్తియగు బ్రహ్మ దేవునికి తండ్రియగు నారాయణుడు ప్రీతుడై తాను చెప్పినదాని తత్వమెరుగగల) మహామతియగు మనువుతో ఇట్లు పలికెను :

పూర్వము వజ్రాంగుడను అసురుడుండెను అతని కుమారుడు తారకుడు ఆ మహాబలుడు దేవతలను వారి పొరీ పురములనుండి వెడలగొటెను వారు భయ నిపీడితులయి బహ్మకడకు పోయిరి భీతులగు దేవతలనుచూచి బ్రహ్మ వారితో ఇట్లనెను : దేవత లారా! భయము విడువుడు శంకరునకు ఆత్మజుడును హిమవంతునకు దోహితుడును నగు శిశువు , ఆ దానవుని చంపును అనెను

తరువాత కొంతకాలమునకు శివుడు శైలజసుతను వివాహమాడెను అతడు కారణాంతరమున తన వీర్య మును అగ్ని నోటియందు వద లేను అగ్ని తన నోటపడిన ఆ రేతస్సు దేవతలకు అర్పించేను (వారది మ్రింగగా) అది వారి ఉదరము లందు జీర్ణము కాక వారి పాటలు చీల్చివచ్చి రెల్లుదుబ్బుల నడుమ పడెను, దానినుండి రవి తేజస్కు డగు గుహుడు (కుమారస్వామి) జనించెను ఏడు దినముల బాలుడుగా ఉండియే అతడు తారకాసుని చం పేను

అనగా సూతుని వచనమును విని ఋషులిట్లనిరి : ఈ కథ మిగుల ఆశ్చర్యకరమును రమ్యమును అగుటతోపాటు పాపనాశిని అని తోచుచున్నది (దీనియందు ఉపాసనాంశము కలదని సూచన) నీవు ఉన్న ది యున్నట్లు మాకు సవి స్త రముగ వినిపింపుము పూర్వమందుండిన వజ్రాంగుడను డై త్యేం దుడెవరి వంశముదుద్భవించెను ? దేవతలను నలుగ గొట్టినవాడును బలశాలియునగు తారకుడు అతని కుమారుడయ్యేననిన ఆ పజ్రాంగుడెంతటివాడో ఇట్టి పై దైత్యేశ్వరుని వధించువాడెవడయ్యెను స్కందుని జన్మమును మహనీయా! మాకు సమగ్రముగా వినిపింపుము

షష్టి సజ్ఖ్యాక దక్షక న్యా నాం ధర్మాదిభ్యో దానాదీకథనమ్

సూతః : మానసో బ్రహ్మణః పుత్త్రో దక్షనామ ప్రజాపతిః

షష్టిం సోజనయతన్యా వైరిణ్యామేవ నశ్శ్రుతమ్

 దదౌ స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ

సప్తవింశతి సోమాయ చతస్రోరిష్టనేమయే

 ద్వేచైవ భృగుపుత్రాయ ద్వేచాన్యేజ్గిర సే తథా

ద్వే కృశాశ్వాయ విదు షే ప్రజాపతిసుతాః ప్రభుః

 అదితి స్థితి ర్ధను ర్విశ్వారిష్టాహనాయుషా తథా

సురభి ర్వినతా చైవ తామ్రా క్రోధవతీ ఇరా

 కుహూర్ మునిశ్చ లోకస్య మాతరో గోషు మాతరః

తాసాం సకలలో కానాు జజ్ఞమస్థావరాత్మ నామ్

 జన్మనామప్రకారాణా తాభ్యోన్యే దేహిన స్మృతాః

దేవేశో పేన్హపూర్వాద్యా స్సర్వే హ్యదితిజా మతాః

 దితే సకాశా దైత్యాహి హిరణ్యకశిపాదయః

దానవాశ్చ దనోః పుత్తా గావశ్చ సుర భేస్సుతా

 పకిడో వినతాపుత్తా గరుడప్రముఖ స్స్మృతాః

నాగాః కద్రూసుతా జ్ఞేయా శ్శేషాభ్యోన్యేపి జన్తవః

 త్రైలోక్యనాథం శక్రంతు సర్వాసురగణప్రభుమ్

హిరణ్యకశిపు శ్చ కే జిత్వా రాజ్యం మహాబలః

 తతః కేనాపి కాలేన హిరణ్యకశిపాదయః

నిహతా విష్ణునా సణ్యే శేషా శ్చేన్డేణ దానవాః

దిత్యా మేకోనపఞ్చాశన్మరుదుత్పత్తిః॥

తతో నిహతపుత్తాచ దితిర్వర మయాచత

భర్తారం కశ్యపం దేవం పుత్తమన్యం మహాబలమ్

 సమయే శక్రహస్తారం స తస్యా మవద త్ప్రభుః

అనగా విని సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను : బ్రహ్మమానస పుత్తుడగు దముడను ప్రజాపతికి వై ర్ణియను పత్ని యందు అనువదిమంది కుమార్తెలు కలిగిరి అతడు వారిలో పదిమందిని ధర్మునకును పదు ముగ్గురను కశ్యపునకును ఇరువది ఏడు మందిని సోమునకును నలుగురను అరిష్టనేమికినీ ఇద్దరను భృగువుత్తునకును ఇద్దరను అంగి రసునకును ఇద్దరను కృశాశ్వునకును ఇచ్చెను

అదితి దితి దనువు విశ్వా అరిషాసురసా సురభి వినతా తామ్రా క్రోధవశా ఇరాకద్రూముని అను ఈ పదుముగ్గు రును కశ్యపుని పత్నులు; వీరు లోక మాతలు అని ప్రసిద్దలు గో(పశు , జాతియు స్థావర జంగమాత్మక మగు ఇతర ప్రాణి సమూహమును ఇతరములగు నానా ప్రకారములగు ప్రాణులును ఈ పదుముగ్గురనుండియే జనించేను దేవేంద్రుడు ఉపేంద్రుడు (వామన విష్ణువు) పూష ( మొదలగు ఆదిత్యులు) మొదలగు వారికి అందరకును అదితి తల్లియయ్యెను దితివలన హిరణ్యకశిపుడు మొదలగు దైత్యులు జన్మించిరి దనువు అనునా మె గర్భమున దానవులు జన్మించిరి సురభి ఆనునా మేకు గోవులు జన్మించెను వినతకు గరుడుడు మొదలగు పక్షులు కలిగేను కద్రువకు నాగులు కలిగెను మిగిలిన కశ్యప పత్నులకు మిగిలిన ప్రాణులు జనించెను

 మహాబలుడగు హిరణ్యకశిపుడు త్రైలోక్యనాథుడగు ఇంద్రుని గెలిచి ఆ రాజ్యమును తానే ఏలసాగెను తరు వాత కొంత కాలమునకు హిరణ్యకశిపుడు మొదలగువారు విష్ణుని చేతిలోను మిగిలిన దైత్యదానవులు ఇందుని చేతిలోను మరణించిరి తరువాత హతపుత్తయగు దితి తన భర్తయు దేవుడునగు కశ్యపుని మహాబలుడును శకుని చంపు వాడునునగు మరియొక కుమారుని వరముగా నిమ్మనెను సర్వసమర్థుడగు ఆ కశ్యపుడామెతో ఇట్లనెను :

నియమే వర్త హేదేవీ! సహస్రం శుచిమానసా

 వర్షాణాం లప్స్య సే పుత్తమిత్యుక్తా సా తథాకరోత్

వర్తంత్యా నియమే తస్యా స్సహస్రాక్ష స్సమాహితః

 ఉపాసా మాచరం స్తస్యాః సాచైన మనుమన్యత

దశవత్సర శేషస్య సహస్రస్య తదా దితిః

ఉవాచ శక్రం సుప్రీతా వర దా తపసి స్థితా

దేతిః : పుత్త్తీర్ణం వ్రతప్రాయాం విద్ధి మాం పాక శాసనః

భవిష్యతిచ తే భ్రాతా తేనసార్ధ మిమాం శ్రియమ్

భుజ్జ్వ వత్సః యథాకామం త్రైలోక్యం హతకణకమ్

 ఇత్యుక్త్వా నిద్రచూ విష్టా చరణాక్రా స్తమూర్ధజా

స్వయంసుష్వాప నియతా భావినోబర్థస్య గౌరవాత్

 తను రనం సమాసాద్య జవనా తాక శాసనః

చకార సప్తధా గర్బం కులి శేనతు మాయయా

 ఏకై కంతు పునః ఖడ్గం చకార మఘవాం స్తతః

సప్తధా సప్తధా కోపా దబుద్ద్యత తతో దితి;

 విబుచోవాచ మా శక ఘాతయేథాః ప్రజాం మమ

తచ్ఛుత్వా నిర్గతశ్శక్ర స్త్రీత్వా ప్రాప్షలిరగ్రతః

 ఉవాచ వాక్యం సస్లో మాతురై శనకై రిదమ్

శక్రః : దేవాసు ప్రిపరా మాతా పాదాక్రా నశిరోరుహా

 సప్తసప్తభిరాఘాత స్తవ గర్భః కృతో మయా

ఏకోనపడ్చొశ ద్బాగా వజైజై తేన తే శుభాః

 దాస్యామి తేషాం స్థానాని దివి దైవతపూజితే

కశ్యపంప్రతి దితేః పుత్రా న్తరప్రార్థనా॥

ఇత్యుక్తా సా తదాదేవీ నాభ్యభాషత వై దితిః

 పునశ్చ దేవం భర్తార మువాచ దితిర్ దుఃఖితా

పుత్తం ప్రజాపతే దేహి శక్ర జేతార మూర్జితమ్

 యేనాస్త్రశస్త్రావధ్యత్వం గచ్ఛేత్తిదివవాసినామ్

ఇత్యుక్తస్స తథోవాచ తాం పత్నీ మతిదుఃఖితామ్

 దశవర్ష సహస్రాణి తపోనిష్ణాప్రలప్స్య సే

వజ్రసారమయేరజ్జి శ్చాద్యైరవయవైర్దృడైః

 వజ్రాజ్గోనామ పుత్త్రస్తే భవితా పుత్త్రవత్సలే

దేవి! వేయేండ్లు శుచి మనస్కవై నియమముతో నుండుము కుమారుని పొందుదువు అనగా ఆమె అట్లే చేయనారంభించెను ఆ కాలమున ఇంద్రుడు నమాహతచిత్తుడై ఆమెను సేవింపసాగేను ఆమేయు ఆ సేవ అంగీక రించెను వేయిటికి పది ఏండ్లు కొరత ఉండగా తపస్సునందున్న దితి మీగుల ప్రీతురాలయి వరమునీయదలచి ఇంద్రునితో ఇట్లు పలికెను: పాకశాసనా! నావ్రతము దాదాపు ముగిసినదని ఎరుగుము నీకు భాత కలుగును అత నితో కలిసి వత్సా : తైలోక్యమును నిష్కంటకముగా యథేచ్చగా అనుభవించుము

ఇట్లు పలికి ఇన్నాళ్ళు నియమములతో ఉండిన దితి కానున్న విషయము బలవత్తరమగుటచే (కాబోలు) నిద్రా వేశమున తన జుట్టు ముడి వీడి వెంట్రుకల పై తన కాళ్ళు పడి తగులు చున్నను ఎరుగక గాఢ నిద్రపోయెను ఈ అశుచి త్వపు అవకాశము దొరుకగనే ఇంద్రుడు వేగముగా మాయతోవ జముతో దితిగర్భమును ప్రవేశించి గర్భమును ఏడుగా చేసెను అతడు కోపముకొలది వాటిలో ఒక్కొక్క దానిని మరల ఏడేసి ముక్కలు చేసెను

అంతలో దితికి మెలకువ వచ్చి 'ఇంద్రా నా సంతానమును చంపవలదు' అనెను అది విని ఇంద్రుడు బయటకు వచ్చి ప్రాంజలి ఎదుట నిలిచి భయపడుచు తల్లితో మెల్లగా ఈ వాక్యమును పలికేను : తల్లీ! నీవు కేశము లను పొదాలతో ఆక్రమించి పగలు నిద్రించుచుంటివి (రెండు దోషములు) ఈ ఆవకాశముతో నేను నీ గర్బమును ఈ వజముతో ఏడు ఏడులు నలువది తొమ్మిది ముక్కలుగా చేసితిని వారు శుభులు దేవతా పూజితమగు ద్యులోక మున వారికి స్థానముల నిచ్చెదను ఇంద్రుడిట్లు పలుకగా దితి ఏమియు మారు పలుకలేదు ఆమే మరల దేవుడగు తన భర్తతో దుఃఖముతో ఇట్లు పలికెను ప్రజాపతీ : ఇంద్రుని జయించగలవాడు స్వర్గ వాసుల శస్త్రాస్త్రముల కవధ్యుడు బలశాలియగు కుమారు (నింకొకని) నిమ్ము అది విని అతి దుఃఖితయగు పత్ని తో అతడిట్లనేను : పుత్తవత్సలా! నీవు పదివేలయేండ్లు నిష్టాపరురాలవయినచో అట్టి పుత్రుని పొందేద పు వజ్రసారమయములగు దృడావయవములతో వజ్రాంగుడను పుత్రుడు నీకు కలుగును

సాతు లబ్దవరా దేవీ జగామ తపసే వనమ్

 దశ వర్షసహస్రాణి సా తపో ఘోర మాచగత్

వజ్రాజ్గోత్పత్తిః॥

తపసో నే భగవతీ జనయామస దుర్జయమ్

 పుత్త మప్రతిక ర్మాణ మజేయం వజ్రదుశ్ఛిదమ్

స జాతమాత్ర ఏవాభూ త్సర్వశ స్తాస్త్రపారగః

 ఉవాచ మాతరం భక్త్యా మాతః కింకరవాణ్యహమ్

తమువాచ తతో హృష్టా దితి రౌత్యాధిపంచ సా

 బహవో మే హతాః పుత్తా స్సహస్రాక్షస్య వర్చసా

తేషాం త్వం ప్రతికర్తుంవై గచ్ఛ శక్రవధాయచ

 బాఢ మిత్యేవ తాము క్త్వా జగామ త్రిదీపం బలి

బద్ధ్వా తతః! సహసాక్షం పా శేనా మోఘవర్చసా

మాతుర స్త్రీకమాగచ్ఛద్ వ్యాధః కుద్రమృగం యథా

 ఏతస్మిన్న నరే బ్రహ్మా కశ్యపశ్చ మహాతపాః

ఆగతా తత్ర యత్రాస్తాం మాతాపుత్తావభీతకౌ

 తతో వాక్య మువాచేశం బ్రహ్మ కశ్యపఏవచ

 ము జ్ఞానం పుత్త దేవేన్దం కిమనేన ప్రయోజనమ్

 ఆపమానో వధః ప్రోక్తః పుత్ర: సమ్భవితస్యలు

ఆత్మవా క్యేన యో ముక్తో వితం మృత మేవచ

 పరస్య గౌరవా న్ముక్తః శత్తుణా స మహాహవే

జీవన్నేవ మృతో వత్స! దివ సేదివ సే సతు

 మహతాం వశమాయాతే వైరం నై వాస్తి వై రిణి

ఏతచ్చుత్వాతు వజ్రాజ్ఞః ప్రణతో వాక్యమబ్రవీత్ 1

న మే కృత్య మనేనా స్త్రీ మాతురాజై కృతా మయా

త్వం సురాసుర నాధోవై మమత ప్రపితామహః

 కరిష్యే త్వద్వచో దేవ! ఏష ముక్త శ్శతక్రతుః

తపసో మే రతిర్దేవ నిర్విఘ్నత్వంతు మే భవేత్

 త్వత్పసాదేన భగవ న్ని త్యుక్త్వా విర రామ సః

తస్మిం స్తూష్ణీం స్థితే దైత్యే ప్రోవాచేదం పితామహః

 బ్రహ్మాః యత స్త్వం క్రూరమాపన్నో అస్మచ్చాసన సంస్థితః

అనయా చిత్తశుద్ద్యా తే పర్యాప్తం జన్మనః ఫలమ్

 ఇత్యుక్త్వా పద్మజః కన్యాం చార్వాయతసులోచనామ్

వరము పొంది అదేవి తపమునకై వనమునకు పోయెను పదివేలయేండ్లు ఘోర తపమాచరించెను అది ముగిసిన పిమ్మట ఆ భగవతికి దుర్జయుడును ఎవరికి ఏమి చేయుటకు అలవికానివాడు వజ్రముతో ఛేదింప శక్యము కానివాడు అజేయుడునగు కుమారుడు కలిగెను అతడు పుట్టినంతనే సర్వశస్త్రాస్త్ర పారంగతుడయ్యెను వాడు భక్తితో తల్లితో తల్లీ: నీకై ఏమి చేయుదుననెను దితి హర్షముతో ఆ దై త్యాధిపతితో ఇట్లనెను : సహస్రాడు ఇంద్రుని వర్చస్సుతో నా బహుపుత్రులు హతులయిరి నీవు దానికి ప్రతీకారముగా పోయి ఇంద్రుని చంపిరమ్ము అనగా సరేయని ఆమెతో పలికి ఆ బలశాలి స్వర్గమునకు పోయేను అమోఘ శ క్తిగల పాశముతో ఇంద్రుని వ్యాధుడు కుద మృగమునువలే బంధించి తల్లి కడకు తెచ్చెను ఇంతలో ఆ తల్లి కొడుకులున్న చోటికి బ్రహ్మయు మహాతపస్వి కశ్యపుడును వచ్చిరి వారిద్దరును అతనితో నాయనో వీనితో ప్రయోజనమేమున్నది ఈ దేవేంద్రుని విడువుము లోకమున సంభావితుడగు వానికి అవమానము వధము వంటిది చెడుమాట అనిపించుకొని శత్రువునుండి విడిపించుకొనినవాడు చచ్చినవాడే; మహా యుద్ధమున శతుని చేజిక్కి వానినుండి ఆదర ముతో విడువబడినవాడు దిన దిన క్రమమున జీవన్మృతుడగుచుండును తనకంటే గొప్పవారగు శత్రువులకు వశీభూతుడైన శత్రువు విషయమున శత్రుత్వమింకేమున్నదీ ? ఆనిన బ్రహ్మకశ్యపుల మాట విని ప్రణతుడై వజ్రాంగుడు ఇట్లనెను: నాకు వీనితో పనిలేదు తల్లి ఆన నెరవేర్చితినంతే నీవు సురాసుర నాథుడవు నాకు ప్రపితామహుడవు; దేవా! నేను నీ మాట పాటింతును ఇదిగో ఇంద్రుని వదలుచున్నాను నాకు తపస్సునం దాస కీ కలదు నొకు అందు నిర్ని ఘ్నత కొవలయును భగవన్ ! ఇదియే నేను కోరు నీయనుగ్రహము అనగా బ్రహ్మ ఇట్లనెను : కూరత్వమును పొందియు నీవు నా శాసనమందు నిలిచితివి కావున నీ జన్మము ఈ చిత్తశుద్దిచే సఫల మయినది ఆని బ్రహ్మ మనోహర విశాల లోచనమగు ఒక కన్యను సృజించి ఆమే నతనికి భార్యగా ఇచ్చెను

తామస్మై ప్రదదౌ దేవః పత్న్యర్థం పద్మసమ్భవః

 వరాజ్గీతిచ నామాస్యాః కృత్వాయాతః పితామహః

వజ్రాగోసహితవజ్రాజ్ఞస్య తపోవనగమనమ్॥

వజాజ్ఞోపి తయార్ధం జగామ తపసే వనమ్

 ఊర్ధ్వబాహు స్స దైత్యేళోచరదష్టసహస్రకమ్

వీరి కాలం కమలపత్రాక్ష శ్శుద్దబుద్ధి ర్మహాతపాః

 తావద వాజ్ముఖః కాలం తావత్పఇగ్నిమధ్యగః

నిరాహారో మోరతపా సపోరాశీ రజాయత

 తతస్సో నర్ణలం చకే కాలం వర్షసహస్రకమ్

జలా స్తరంప్రవిష్టస్య తస్య పత్నీ మహావతా

 తస్యైవ తీరే సరస సత్పత్నీ మౌన మాస్థితా

నిరాహారా తపో ఘోరం ప్రవివేకమహాద్యుతిః

 నానారూపేణ ఇంద్రకృతవరాజ్గీ విభీషణమ్॥

తస్యాం తపసివ రన్యా మీనశ్చ కే విభీషితమ్

భూత్వాతు మర్కట స్తత్ర తస్యాశ్రమమహద్వనం

 చ కేవిలోలంని శ్శేషం తుమ్బీఘటకరణ్డకమ్

తతస్తు ఘోర రూపేణ కమ్పం తస్యాకరోన్మహత్

 తతోభుజజ్ఞరూ పేణ బద్ద్వా చ చరణద్వయమ్

అపాకర్ష త్తతో దూరం క్రమం స్తస్యా మహీ మిమామ్

 తపోబలాఢ్యా సాతస్య నవధ్యత్వంజగామ హ

ఆమె పేరు వరాంగి అని పలికి పద్మసంభవుడా బ్రహ్మ వెడలిపోయెను వజ్రాంగుడును ఆమెతో తపమున కైవనమేగేను కమల పత్రాక్షుడగు ఆదై త్యేంద్రుడు ఎనిమిది వేలఏండ్లు శుద్ధబుద్దియే మహా తపమాచరించెను మరి ఆంత కాలము తలవంచియు మరియు అంత కాలము పంచాగ్ని మధ్యగుడయ్యు నిరాహారుడే ఘోర తప్ప చరించీ తపోరాశీయయ్యెను పిమ్మట వేయేండ్లు వాడు నీటిలోపలనుండి తపమాచరించెను అతడు నీట ప్రవేశించగనే ఆతని పత్ని యు మహావ్రతయే ఆ సర సీర మున మౌనమవలంబించి నిరాహార యు మహా తేజోవంతురాలునై ఘోర తపమాచరించెను ఆమె తపమందున్న కాలమున ఇంద్రుడు ఆమెను భయ పెట్టు పనులు చే నేను; అతడు కోతియే ఆ మహావనమందలి ఆమె ఆశ్రమమున పనిముట్లుగా ఉన్న సొర బుర్ర నీటికడవ బరిణలు