53 - పురాణ సంఖ్యానుక్రమము-పురాణ దాన వ్రతము

ఋషయః : పురాణసజ్ఖ్యా మాచక్ష్వ సూత విస్తరతః క్రమాత్

దానవ్రత మ శేషంచ యథావ దనుపూర్వశః

 సూతః : ఇదమేవ పురాణేస్మీ న్పురాణపురుష స్తథా

 యదుక్తవా న విశ్వాత్మా మనవే త న్ని బోధత

 శ్రీమత్స్యః పురాణం సర్వశాస్త్రాణాం ప్రథమం బ్రహ్మణాస్మృతమ్

అనన్తరంచ వ క్షేభ్యో వేదా స్తస్య వినిర్గతాః

పురాణ మేక మేవా నీ త్తదా కల్పా నరేనఘ

 త్రివర్గసాధనం పుణ్యం శతకోటిప్రవి స్తరమ్

నిర్ధగేషుచ లో కేషు జాజిరూపేణవై మయా

అజ్ఞాని చతురో వేదా పురాణన్యాయవిస్తర

 మీమాంసా ధర్మశాస్త్రంచ పరిగృహ్యాత్మసాతృతమ్

 మత్స్యరూపేణతు పునః కల్పాదా వుద కార్ణవే

 అశేష మేత త్కథిత ముదకా నర్గతేనచ

 శ్రుత్వా జగాదచ మునీ స్ర్వతి దేవాం శ్చతుర్ముఖః

ప్రవృత్తి స్సర్వశాస్త్రాణాం పురాణస్యా భవ త్తతః

 కాలే నాగ్రహణం దృష్ట్వా పురాణస్య తతో నృప

 వ్యాసరూప మహం కృత్వా సంహరామి యుగేయుగే

 చతుర్లక్షప్రమాణేన ద్వాపరే ద్వాపరే సదా

 తదష్టాదశ ధా కృత్వా భూలో కేస్మి ప్రకాశ్యతే

 అద్యాపీ దేవలో కేస్మిక్ శతకోటిప్రవి స్తరమ్

 తదర్ధోత్ర చతుర్లక్షం సంక్షే పేణ నివేశితమ్

 పురాణాని దశాస్టౌచ సామ్పతం తది హేర్యతే

నామత స్తాని వక్ష్యామి శ్రుణుధ్వ మృషిసత్తమాః

పురాణముల గ్రంథ సంఖ్యను వాటిని దానము చేయుట అను వ్రత విధానమును సవిస్తరముగా నిరవశేషముగా మాకు దెలుపుమని ఋషులడుగ సూతుడు ఈ విషయమును పురాణ పురుషుడగు మత్స్యరూప జనార్ధనుడు మనువునకు చెప్పిన విధముననే మీకు తెలి పెద నని ఇట్లు చెప్పనారంభించెను:

 మత్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: బ్రహ్మ(కు గల ఐదు ముఖములలో ఊర్ధ్వ) ముఖమునుండి సర్వ శాస్త్రములకు ఆది భూతమగు పురాణము వెలువడెను. పిమ్మటనే మిగిలిన) ముఖములనుండి వేదములు వెలువడేను. పూర్వక ల్పమున మొదట పురాణము ఒక్కటియే యుండెను. అపుడది శతకోటి గ్రంథ పరిమాణము కలది (ముప్పది రెండక్షరముల సముదాయమునకు గ్రంథమని వ్యవహారము.) లోకములు నిశ్శేషముగ దగ్గమైన తరువాత (ప్రళయా నంతరము నేను హయ (గ్రీవ రూపమున (ఆరు) వేదాంగములు నాలుగు వేదములు పురాణములు న్యాయవిస్తరము మీమాంస.ధర్మశాస్త్రము(లు) అను పదునాలుగు విద్యలను శబ్దాత్మక నిత్య తత్వమును) పరిగ్రహించి నాస్వాధీనము చేసికొంటిని. మరల కల్పాదియందు మహా ప్రళయ సముద్రమున మత్స్యరూపమున నేను నీటియందేయుండి పలుక గా విని చతుర్ముఖుడు మునులకును అవి దేవతలకును ప్రవచించేను. ఇట్లు సర్వశాస్త్ర రూపమగు పురాణము లోకమున ప్రవర్తిల్లెను. కాని కాలక్రమమున దానిని జనులు సులభముగా గ్రహింపలేక పోవుట చూచి నేను ప్రతి మహా యుగమునందలి ద్వాపరయుగమునను వ్యాసరూపుడనై చతుర్లక్ష గ్రంథ పరిమాణమునకు సంగ్రహించి ఈ మొ త్తమును పదునెనిమిదిగా విభజించి లోకమున ప్రకాశింపజేయుదును. దేవలోకమున మాత్రమది ఇప్పటికిని శత కోటి గ్రంథ పరిమితముగానే యున్నది. వాని వివరణమును వాటిని విభజించి దానము చేయవలసిన వ్రతవిధానమును తెలిపేదను.

బ్రహ్మణాభిహితం పూర్వం యావన్మాత్రం మరీచయే

 బ్రాహ్మం తద్దశ సాహస్రం పురాణం పరికీర్తితమ్

లిఖిత్వా తచ్చ యో దద్యా జ్జలధేను సమన్వితమ్

 వైశాఖే పౌర్ణమాస్యాంచ బ్రహ్మలో కే మహీయతే

 ఏతదేవ యదా పద్మ మభూ న్నీరమయం జగత్

 తద్వృత్తానాశ్రయం బ్రహ్మా పాద్మమిత్యు చ్యతే బుధైః

 పాద్మంతు పజ్చపథ్చాక తహస్వాణి నిగద్యతే

 తత్సురాణంచ యో దద్యా త్సువర్ణకమలాన్వితమ్

 జ్యేష్టమా సే తిలై ర్యుక్తం సోశ్వమేధఫలం లభేత్

 వారాహకల్పవృత్తి న మధికృత్య పరాశరః

 యత్రాహ ధర్మా నఖిలాం సదుక్తం వైష్ణవం విదుః

*త్రయోవింశతి సాహసం తత్పురాణం విదుర్బుధాః

తదాషాఢతు యో దద్యా దృతధేనుసమన్వితమ్

పౌర్ణమాస్యాం విశుద్దాత్మా స పదం యాతి వైష్ణవమ్

 శ్వేతకల్ప ప్రసజ్ఞేన ధర్మా న్వాయు రిహాబ్రవీత్

 యదేత ద్వాయవీయం స్యా ద్రుద్రమాహాత్మ్యసంయుతమ్

*ద్వాదశైవ సహస్రాణి పురాణం తదిహోచ్యతే

 శ్రావణ్యాం శ్రావణే మాసి గుడ ధేనుసమన్వితమ్

 యో దద్యా దధిసంయుక్తం బ్రాహ్మణాయ కుటుమ్బినే

శివలో కే స పూతాత్మా కల్పమేకం వస్తే న్నరః

 యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మవిస్తరః

 వృత్రాసురవధో పేతం తద్బాగవత ముచ్యతే

 సారస్వతస్య కల్పస్య కథా యాస్స్యు ర్నరాధిప

 తద్వృత్తానోద్భవం లో కే తద్బాగవత ముచ్యతే

 లిఖిత్వా తచ్చ యో దద్యా ద్దేమసింహసమన్వితమ్

 పౌర్ణమాస్యాం ప్రోష్టపద్యాం స యాతి పరమం పదమ్

 అష్టాదశ సహస్రాణి పురాణం త త్ప్రకీర్తితమ్

(*విష్ణ్వాఖ్యమష్టసాహస్రంతత్పురాణంవిదుర్భుధాః)

(*చతుర్వింశతిసాహస్రంపురాణం)

(చతుర్వింశతిసాహస్రం)

యత్రాహ నారదో ధర్మా న్భృహత్కల్పాశ్రయాం స్త్విహ

పఞ్చవింశత్సహస్రాణి నారదీయం త దుచ్యతే

 ఆశ్వయుజ్యాం వఞ్చదశ్యాం యో దద్యా ధేనుసంయుతమ్

పరాం సిద్ది మవాప్నోతి పునరావృత్తిదుర్లభామ్

యత్రాధికృత్య శకుని న్దర్మాధర్మవిచారణమ్

 వ్యాఖ్యాతం స్యాజ్జైమినయే పక్షిభి ర్ధర్మ చారిభిః

 మార్కణ్డేయేన కథితం తత్సర్వం విస్తరేణ తు

 పురాణం నవసాహస్రం మార్కణ్డేయ మిహోచ్యతే

 త త్ప్రయచ్ఛే ల్లిఖిత్వా య స్సౌవర్ణ క రిసంయుతమ్

 కార్తిక్యం పౌణ్డరీక స్య క్రతోశ్చ ఫలభా గ్భవేత్

 య త్త దీశానక ల్పస్య వృత్తాన్త మధికృత్య చ

 వసిష్ఠాయాగ్ని నా ప్రోక్త మాగ్నేయం త త్ర్పచక్షలే

 లిఖిత్వా తచ్చ యో దద్యా ద్దేమపద్మసమన్వితమ్

 మార్గశీర్యాం విధానేన తిలధేనుయుగం తథా

 తచ్చ షోడశ సాహస్రం సర్వక్ర తుఫలప్రదమ్

 యః ప్రదద్యా న్నర స్సోథ స్వర్గలో కే మహీయతే  

 బ్రహ్మ మరీచికి ప్రవచించినది బ్రాహ్మపురాణము. దీని గ్రంథ పరిమాణము పదివేలు. దీనిని లిఖించి వైశాఖ పూర్ణిమనాడు జలధేను సహితముగా దానమిచ్చినచో బ్రహ్మలోక ప్రాప్తి యగును.

జగత్తు అంతయు జలమయమై పద్మముగా జలస్థానముగా). నున్నప్పుడు బ్రహ్మ ప్రవచించినది పద్మ పురాణము. దీని గ్రంథ పరిమాణము ఏబది ఐదువేలు. దీనిని లిఖించి జ్యేష్టమాస పూర్ణిమనాడు సువర్ణ కమలముతోను తిలల తోను దానము చేసినచో అశ్వమేధ ఫలము లభించును.

పరాశరుడు వారాహ కల్ప వృత్తాంతము నాశ్రయించి అఖిల ధర్మములను ప్రవచించినది విష్ణు పురాణము. దీని గ్రంథ పరిమాణము ఇరువదిమూడు వేలు. దీనిని లిఖించి ఆషాఢ పూర్ణిమనాడు ఘృత ధేనువు తో దాన మిచ్చినచో విష్ణు లోకము ప్రాప్తించును.

వాయు దేవుడు శ్వేత వరాహ కల్ప వృత్తాంతము నాశ్రయించి రుద్రమాహాత్మ్య ప్రధానముగా ప్రవచించినది వాయు పురాణము. దీని గ్రంథ సంఖ్య పండ్రెండు వేలు. దీనిని లిఖించి శ్రావణ పూర్ణిమనాడు పెరుగుతో బెల్లముతో

ధేనువుతో కుటుంబియగు బ్రాహ్మణునకు దానము చేసినవాడు శివలోకమున ఒక కల్పకాల ముండును.

గాయత్రీ తత్వము నాశ్రయించి వృతాసుర వధతో కూడ సారస్వత కల్ప వృత్తాంత ప్రధానముగా ధర్మ విస్తరమును వర్ణించినది భాగవత పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునెనిమిదివేలు. దీనిని లిఖించి భాద్రపద పూర్ణిమనాడు బంగారు సింహముతో కూడ దానము చేసినచో పరమపదమును పొందును.

నార దుడు బృహత్కల్పాశ్రయములగు కథలను ప్రవచించినది నారద పురాణము. దీని గ్రంథ ప్రమాణము ఇరువది యెదువేలు. దీనిని లిఖించి ఆశ్వయుజ పూర్ణిమనాడు ధేనువుతో కూడ దానమిచ్చినచో పునరావృత్తి లేని దుర్ణభ మగు పరమ సిద్ది నందును.

పక్షులను ఆశ్రయముగా చేసికొని ధర్మానుష్టాన పరములగు పక్షులు జైమినికి ధర్మాధర్మ విచారణమును వ్యాఖ్యానించినట్లు మార్కండేయుడు ప్రవచించినది మార్కండేయ పురాణము. దీని గ్రంథ పరిమాణము తొమ్మిదివేలు. దీనిని లిఖించి సువర్ణ గజముతోకూడ కార్తిక పూర్ణిమ నాడు దానమిచ్చినచో యజ్ఞఫలము లభించును.

ఈశాన కల్పము నాశ్రయించిన వృత్తాంతములను అగ్ని వసిష్ఠునకు ప్రవచించినది. ఆగ్నేయ పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునారువేలు. దీనిని లిఖించి బంగరు పద్మముతో కూడ తిల ధేనువుతో కూడ మార్గ మనాడు దానము చేసినచో సర్వకతు ఫలము లభించి : సుఖములందును.

యత్రాధికృత్య మాహాత్మ్య మాదిత్యస్య చతుర్ముఖః

 అ ఘోరకల్పవృత్తాన్తప్రసంగేన జగత్థ్సితిమ్

 మనవే కథయామాస భూత గ్రామస్య లక్షణమ్

 చతుర్దశ సహస్రాణి తథా పఞ్చశతాని చ

 భవిష్యచరితప్రాయం భవిష్యం తదిహోచ్యతే

 తత్పౌషమాసి యో దద్యా త్పౌర్ణమాస్యాం వీమత్సరః

(గుడకుంభ) గుడధేనుసమాయుక్త మగ్నిష్టోమఫలం లభేత్

 రాథన్తరస్య కల్పస్య వృత్తాన్త మధికృత్య తు

 సావర్ణినా నారదాయ కృష్ణ మాహాత్మ్య ముత్తమమ్

యత్ర బ్రహ్మవరాహస్య చరితం వర్ణ్యతే ముహుః

 త దష్టాదశ సాహస్రం(బ్రహ్మ వైవర్త) బ్రహ్మ కైవర్త ముచ్యతే

 యో దద్యా న్మాఘమా సేతు బ్రాహ్మణాయ కుటుమ్బినే

 పౌర్ణమాస్యాం స భవనం బ్రహ్మలో కే మహీయతే

య తాగ్ని లిజ్గమధ్యస్థ ప్రాహ దేవో మహేశ్వరః

 య త్త దీశాసకల్పన వృత్తాన్త మధికృత్య చ

 కల్పితం లై జ్గ మిత్యు క్తం పురాణం బ్రహ్మణా స్వయమ్

త దేకాదశ సాహస్రం ఫాల్గున్యాం యః ప్రదాయేత్

తిలధేనుసమాయుక్తం సయాతి శివసాత్మతామ్

 అర్ధనారీశ్వరం దేవం కృత్వా దేయం తు తత్ఫలమ్

 మహావరాహస్య పున ర్మాహాత్మ్య మధికృత్యచ

 విష్ణునాఽభిహితం క్షోణ్వై త ద్వారాహ మిహోచ్యతే

 మానవస్య ప్రసంగేన కల్పస్య మునిసత్తమాః

 చతుర్వింశత్సహస్రాణి తత్పురాణ మిహోచ్యతే

 కాఞ్చనం గరుడం కృత్వా తిలధేనుసమన్వితమ్

 దద్యా చ్చైత్యాం పౌర్ణస్యాం బ్రాహ్మణాయ కుటుమ్బినే

వరాహస్య ప్రసాదేన పద మాప్నోతి వైష్ణవమ్

 యత్ర మాహేశ్వరా న్దర్మా నధికృత్యచ షణ్ముఖః

 కల్పే తత్పురుషే వృత్తచరితై రుపబృంహితమ్

 స్కాన్దం నామ పురాణం త న్నిర్మమే స త్రయోదశమ్

సహస్రాణాం శతం చైక మితి మర్త్యేషు వర్ణతే

 పరిలిఖ్యచ యో దద్యా ద్దేమశూల సమన్వితమ్

 స శైవం పద మాప్నోతి (ఉపరాగేగతేరవౌ)నరో విచ్చిన్న బన్దనః

 త్రివిక్రమస్య మాహాత్మ్య మధికృత్య చతుర్ముఖః

త్రివర్గ మభ్యధా త్తచ్చ వామనం త తకీర్తితమ్

(పురాణందశసహస్రం)చతుర్దశ సహస్రాణి కూర్మకల్పానుగం శివమ్

 యచ్చ త ద్విషువే దద్యా ద్వైష్ణవం యాత్యసౌ పదమ్

 యత్ర ధర్మార్థ కామానాం మోక్షస్యచ రసాతలే

 మాహాత్మ్యం కథయామాస కూర్మరూపీ జనార్దనః

ఇన్ద్రద్యుమ్న ప్రసజ్గేన మునిభ్య శ్శక్రసన్నిధౌ

(సప్తదశసహస్రానిలక్షీ)కూర్మంతు షట్సహస్రాణి లక్ష్మీకల్పానుషజ్గితమ్

 యో దద్యా దయనే కౌర్మం హేమకూర్మసమన్వితమ్

గోసహస్ర ప్రదానస్య ఫలం సంప్రాప్నుయా న్నరః

 శ్రుతీనాం యత కల్పాదౌ ప్రవృత్యర్థం జనార్దనః

 మత్స్యరూపేణ మనవే నర సింహోపవర్ణనమ్

 అధికృత్యాఽబ్రవీత్సప్త కల్పవృత్తం మునీశ్వరాః

 తన్మాత్స్యమితి జానీధ్వం సహస్రాణి చతుర్దశ

 (విషువే)యుగాదౌ హేమమత్స్యేన ధేన్వాచైవ సమన్వితమ్

ఆలజ్కృతాయ విప్రాయ కాంస్యపాత్రం సకల్పకమ్

 యో దద్యా త్సృథివీ తేన దత్తా భవతి సా కిల

 యదా చ గారుడే కల్పే విశ్వాణ్డా ద్ధరుడోద్భవమ్

 అధికృత్యాఽబ్రవీ ద్విష్ణు ర్గారుడం త దిహోచ్యతే

 త దష్టాదశ చై కంచ సహస్రాణిహ పఠ్యతే

(సౌవర్ణహంసమిథునసంయుక్తం విషువేనరః)సౌవర్ణహంససంయుక్తం

యో దదాతి పుమా నిహ

సిద్దిం స లభతే ముఖ్యాం శివలో కే చ సంస్థితిమ్

బ్రహ్మ మనువునకు ఆదిత్య మాహాత్మ్యము నాధారముగా చేసికొని ఆ ఘోర కల్ప వృత్తాంతమును భూత సమూహ లక్షణమును ప్రాసంగికముగా జగత్ స్థితిని విశ్లేషించి భవిష్య వృత్తాంతమును చెప్పినది భవిష్య పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునాలుగువేల ఐదువందలు.                                                                              (ప్రకృతము లభించు భవిష్య పురాణమున ఇంచుమించుగా ఇరువది ఏడువేల శ్లోకములున్నవి.) దీనిని లిఖించి పుష్యమాస పూర్ణిమనాడు విమత్సరుడై గుడ ధేనువుతో దానము చేసినచో అగ్ని షోమ యాగఫలము లభించును.

సావర్ణి మనువు నారదునకు రథంతర కల్ప వృత్తాంతమును ఆశ్రయించి ఉత్తమమగు కృష్ణ మాహాత్మ్యమును బ్రహ్మ వరాహ చరితమును చెప్పినది బ్రహ్మ వైవర్తపురాణము. దీని పరిమాణము పదునెనిమిది వేలు. దీనిని లిఖించి మాఘ పూర్ణిమనాడు కుటుంబియగు బ్రాహ్మణునకు భవనముతో కూడ దానము చేసినచో బ్రహ్మలోక ప్రాప్తియగును.

మహేశ్వరు డగ్ని లింగమధ్యముననుండి ఈశాన కల్ప వృత్తాంతము నాశ్రయించి ప్రవచించినది లైంగ పురాణమని బ్రహ్మ స్వయముగా చెప్పెను. దీని పరిమాణము పదునొకండు వేలు. దీనిని లిఖించి ఫాలున పూర్ణిమనాడు తిలలతోను నూవులతోను అర్ధ నారీశ్వర దేవుని ప్రతిమతోను దానము చేసిన చో శివసాయుజ్యము కలుగును.

విష్ణువు భూమికి మానవకల్పము నాశ్రయించి మహా వరాహ మాహాత్మ్యమును చెప్పినది వారాహ పురాణము. దీని పరిమాణ మిరువదినాలుగువేలు. దీనిని వాసి చైత్ర పూర్ణిమనాడు కుటుంబియగు బ్రాహ్మణునకు బంగారు గరుడునితో తిలలతో ధేనువుతో కూడ దానము చేసినచో వరాహదేవుని అనుగ్రహమున విష్ణు లోకము ప్రాప్తించును.

తతు రుషకల్పవృత్తాంత మాశ్రయించి మా హేశ్వర ధర్మములను షణ్ముఖుడు (స్కందుడు ప్రవచించినది స్కాందపురాణము. దీని గ్రంథ పరిమాణము లక్ష పై ఒక వేయి శ్లోకములు. దీనిని వ్రాసి బంగరు శూలముతో కూడ దానము చేసిన మానవుడు బంధముక్తుడై శివలోకము నందును.

త్రివిక్రమ మాహాత్మ్యము సాధారముగా గొని కూర్మ కల్ప వృత్తాంతమును పురుషార్థములను బ్రహ్మ ప్రవ చించినది వామన పురాణము. దీని గ్రంథ పరిమాణము పదునాలుగు వేలు. దీనిని వ్రాసి విషువ దినమున రాత్రింబగళ్ళు సమముగానుండు దినమున) దానమిచ్చినవారు విష్ణుసాన మందుదురు.

కూర్మరూపు డగు జనార్ధనుడు ఇంద్రపన్ని ధియందు మునులకు ఇంద్రద్యుమ్ను ని ప్రసంగము మూలముగా లక్ష్మీ కల్ప వృత్తాంతములతో నాలుగు పురుషార్థముల మాహాత్మ్యమును ప్రవచించినది కూర్మ పురాణము. దీని గ్రంథ పరిమాణము ఆరువేలు పదునెనిమిదివేలని మరియొక మతము.) దీనిని వ్రాసి ఆయన ప్రవేశ పుణ్యకాలమున బంగరు కూర్మముతో కూడ దానమిచ్చిన మానవునకు వేయి గోవుల దానము చేసినంత ఫలము కలుగును."

కల్పాదియందు మత్స్యరూపుడగు జనార్దనుడు సత్యవ్రత మనువునకు సప్త (ఋషి) కల్ప వృత్తాంత మాధార ముగా వేదముల ప్రవర్తిల్లజేయుట కై (కాలరూపుడగు) పురుషోత్తమ తత్వమును వర్ణించి చెప్పినది మత్స్యపురాణము. దీని గ్రంథ పరిమాణము పదునాలుగున్నర వేలు లోగడ చెప్పబడిన) యుగాది దినమున బంగారు మత్స్యముతో ధేనువుతో అన్ని అమరిక లు కల కాంస్య పాత్రముతోను కూడ దీని వ్రాతప్రతిని బ్రాహ్మణునకు అనేక భూషణములతో అతని నలంకరించి దానము చేసినచో భూమినంతటిని దానము చేసినంత ఫలము కలుగును.

గారుడ కల్పమున బ్రహ్మాండమునుండి గరుడు డుద్బవిల్లిన వృత్తాంతమును విష్ణువు ప్రవచించినది గారుడ పురాణము. దీని పరినూణము పందొమ్మిదివేలు. దీనిని లిఖించి బంగారు హంసతో కూడ దానము చేసినచో సాలోక్య ము క్తిగా శివలోకము లభించును.

బ్రహ్మా బ్రహ్మాణ్డ మాహాత్మ్య మధికృత్యాఽబ్రవీ త్పునః

తచ్చ ద్వాదశ సాహస్రం బ్రహ్మాణ్డo ద్విశతాధికమ్

 భవిష్యాణాంచ కల్పానాం శ్రూయతే యత్ర విస్తరః

 తద్భ్రహ్మాణ్డపురాణంచ బ్రహ్మణా సముదాహృతమ్

 యో దద్యా త్త ద్వ్యతీపాతే చౌర్ణాయుస్వర్ణసంయుతమ్

రాజసూయసహస్రస్య ఫల మాప్నోతి మానవః

(యత్ర నన్దీశ్వర స్సాక్షా దృషిభిః పృష్టవా న్పురా

 సృష్టిసంహారకర్తార మీశ్వరం యత్ర చోక్తవాక్

 దేవాసురాణాం సజ్గ్రామం పురాణం శైవ సంజ్ఞితమ్

 చతుర్వింశతిసాహస్రం పురాణం తత్ప్రకీ ర్త్యతే

మాఘమా సే చతుర్దశ్యాం కృష్ణపక్షే జనేశ్వర

 శివవ్రతాయ దాతవ్యం తత్ప్రలేపాదిభోజనైః

మన్వ న్తరశతం సాగ్రం రుద్రలో కే మహీయతే)

 చతుర్లక్ష మిదం ప్రోక్తం వ్యా సేనాధ్బుతకర్మణా

మత్పితు ర్మమ పితాచ మయా తుభ్యం నివేదితమ్

ఇదం లోక హితార్థాయ సంక్షిప్తం పరమర్షిణా

 ఇద మద్యాపి దేవేషు శతకోటిప్రవి స్తరమ్

 ఉపభేదా న్పృవక్ష్యామి లో కే యే సమతిష్ఠితాః

 పాద్మే పురాణే యత్ప్రోక్తం నరసింహోపవర్ణనమ్

 తచ్చాష్టాదశ సాహస్రం నారసింహ మిహోచ్యతే

 నన్దాపురాణం తత్ప్రో క్తం సజ్ఖ్యానమితి కల్ప్యతే

 నన్దాయ యత్ర మాహాత్మ్యం కార్తి కేయేన వర్ణ్యతే

 యత్ర సామ్బం పురస్కృత్య భవిష్యోపకథాత్మకమ్

 ప్రోచ్యతే తత్పునర్లో కే సామ్బమేవ శుచివ్రతాః

 ఏవమాదిత్యసంజ్ఞంచ తవ పరిగద్యతే

అష్టాద శేభ్యస్తు పృథ క్పురాణం యత్ర దృశ్యతే

 విజానీధ్వం ద్విజ శ్రేష్టా స్తదే తేభ్యో వినిర్మితమ్

 పఞ్చాజ్గానీ పురాణస్య వ్యాఖ్యాన మిత్రత్ స్మృతమ్

 సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశమన్వన్తరాణిచ

 వంశానుచరితం చేతి పురాణం పఞ్చ లక్షణమ్

 బ్రహ్మవిష్ణ్వర్కరుద్రాణాం మాహాత్మ్యం భువనస్యచ

సంహారంచ ప్రదృశ్యేత పురాణే పఞ్చవర్ణ కే

 ధర్మశ్చార్థశ్చ కామశ్చ మోక్షశ్చ పరికీ ర్త్యతే

 సర్వేష్వపి పురాణేషు తద్విరుద్దేషు యత్ఫలమ్

 సాత్త్వి కేషు చ కల్పేషు మాహాత్మ్య మధికం హరేః

 రాజ సేషుచ మాహాత్మ్య మధికం భ్రహ్మతో విదుః

 తద్వదగ్నేశ్చ మాహాత్మ్యం తామ సేషు శివస్యచ

 సజ్కీర్ణేషు సరస్వత్యాః పితృణాం చ నిగద్యతే

 ఇమ మష్టాదశానాంచ పురాణానా మనుక్రమమ్

 యః పఠే ద్దవ్యక వ్యేషు స యాతి భవనం హరేః

 అష్టాదశ పురాణాని కృత్వా సత్యవతీసుతః

భార తాఖ్యాన మతులం చక్రే తదుపబృంహితమ్

లక్షేణై కేన తత్ప్రోక్తం వధార్థపరిబృంహితమ్

 వాల్మీకినాచ యత్ప్రోక్తం రామోపాఖ్యాన ముత్తమమ్

 బ్రహ్మణాభిహితం తచ్చ శతకోటిప్రవి స్తరమ్

 ఆహృత్య నారదశ్చైవ తేన వాల్మీక యే పునః

 వాల్మీకినాచ లో కేతు ధర్మకామార్థ సాధనమ్

 ఏవం సపాదాః పఞ్చైతే లక్షా మర్త్యే ప్రకీర్తితాః

 పురాతనసోదరస్య పురాణం తద్విదుర్బుధాః

ధన్యం యశస్య మాయుష్యం పురాణానా మనుక్రమమ్

యః పఠేచ్ఛృణుయాద్వాపి సోపి యాతి పరాం గతిమ్

ఇదం పవిత్రం యశసాం నిదాన మిదం పితృణామపి వల్లభం స్యాత్

 ఇదంచ దేవేష్వమృతాయ నిత్య మిదం మహారోగహరం హి పుంసామ్

 ఇతి శ్రీ మత్స్యమహాపురాణే మత్స్యమనుసంవాదే పురాణసజ్ఞ్యానుక్రమణికాకథనం నామ  త్రిపఞ్చాశోఽధ్యాయః

బ్రహ్మ బ్రహ్మాండ వృత్తాంతము నాశ్రయించి భవిష్య కల్ప వృత్తాంత విస్తరమును ప్రవచించినది బ్రహ్మాండ పురాణము. దీని పరిమాణము పండ్రెండువేల రెండువందలు. దీనిని లిఖించి వ్యతీపాత యోగమున ఉన్ని వస్త్రములతో బంగారముతో కూడ దానము చేసినచో వేయి రాజసూయముల ఫలము లభించును.

(నందీశ్వరుడు ఋషులకు శివుని సృష్టి సంహార కర్తనుగాను దేవాసుర సంగ్రామ వృత్తాంతమునుకూడ ప్రవ చించినది శివ పురాణము. దీని గ్రంథ పరిమాణము ఇరువది నాలుగు (ఇరువదియైదు) వేలు. దీనిని లిఖించి మాఘ కృష్ణ చతుర్దశి (మహాశివరాత్రి నాడు గంధాది ద్రవ్యములతో భోజనములతో కూడ దానము చేసినచో సంపూర్ణముగా నూరు మన్వంతరముల కాలము రుద్రలోక నివాసము సిద్ధించును.)

 ఆశ్చర్యకర కర్మలు చేయ సమర్దుడగు వ్యాసుడు నేటికిని దేవలోకమునందు శతకోటి గ్రంథ పరిమాణము గల ఈ పురాణ (సముదాయమును లోక హితమునకై సంగ్రహించి నాలుగు లక్షల పరిమాణము గలదిగా చేసెను. దీనిని అతడు మాతండ్రికి చెప్పగా అతడు నాకు ప్రవచించగా నేను మీకు ప్రవచించితిని.

లోకమునందు ప్రతిష్ఠితములై యున్న ఉప పురాణముల సంఖ్య ప్రవచింతును. పొద్మ పురాణమునందు ప్రవచింపబడిన నరసింహ విషయ వర్ణనము కలది. నారసింహ పురాణము. దాని పరిమాణము పదునెనిమిదివేలు. కుమార స్వామీ నందునకు (శివ) మాహాత్మ్యమును ప్రవచించినది నందా పురాణము. సాంబుని గురించి భవిష్యోపాఖ్యాన రూపమున ప్రవచించినది సాంబ పురాణము. ఇట్లే ఆదిత్య పురాణమును గలదు. ఇట్లే అష్టాదశ పురాణములలో దేనికి సంబంధించిన వేరొక పురాణము కనబడునో అది ఈమూల పురాణమునుండి ఏర్పడిన ఉపపురాణమని ఎరుగ వలయును.

ఇది కాక పురాణములకు ఉండవలసిన పంచలక్షణములను పెద్దలు చెప్పియున్నారు. అవి.సర్గము - (ఆదిసృష్టి ప్రతినర్గము-(భూత పంచక సృష్టి వంశము (ప్రజాపతుల సృష్టి) మన్వంతరములు.వంశానుచంతము (ప్రజాపతుల నుండి కొనసాగిన ఆయా రాజరాజర్షి మహర్యాది పరంపర ); ఇట్లే పంచలక్షణములుకల పురాణములందు బ్రహ్మ విష్ణు రుద్ర సూర్యుల మహిమమును భువన సృష్టి సంహారములును ధర్మార్థ కామమోక్షముల ప్రకారములును ప్రవచింపబడును. అన్ని పురాణములయందును (శాస్త్రములకు ప్రతికూలముగా నడచిన దుష్టులకు) ఏతద్విరుద్ధ ఫలము కూడ (ఉదాహర ణములతో) చెప్పబడును. (పురాణములు సాత్వికములు రాజసములు తామసములు మిశ్రములునని నాలుగు విధములు) సాత్విక పురాణములందు విష్ణు మాహాత్మ్యము రాజసపురాణములందు బ్రహ్మ మహిమము తామసపురాణములందు అగ్ని శివుల మాహాత్మ్యము మీ శ్రములయందు సరస్వతీ మహిమ పితృదేవతా మాహాత్మ్యములు చెప్పబడును. ఈ అష్టాదశ పురాణాను క్రమమును దేవతా కార్యములందు పఠించినచో విష్ణులోక ప్రాప్తియగును.

వ్యాసుడు పదునెనిమిది పురాణములు రచించిన పిమ్మట వాటి యుపబలముచే కూర్చబడిన భార తేతిహాసమును లక్ష గ్రంథ పరిమాణముతో రచించెను. అది వధప్రధానమైనది. శతకోటి గ్రంథ పరిమాణముతో బ్రహ్మ రచించిన రామాయణ మును నారదుడు బ్రహ్మ నుండి ఎరిగి వాల్మీకికి బోధించగా దాని నొ ఋషి ధర్మార్థ కామ మోక్ష సాధకముగా రచించెను. ఇట్లు ఈ పురాణ వాజ్మయము సపాదపంచ లక్ష (525000) గ్రంథ రూపమయ్యెను. ఉదరము (అభ్యుదయము)ను కలి గించు పురాతన వృత్తాంతమునకు సంబంధించినది కావున ఈ వాజ్మయము ‘పురాణము' అనబడు చున్నది.

ఈ పురాణాను కమము ధన్యతను యశమును ఆయువును కలిగించునది. దీనిని చదివినను వినినను పరమ పదము లభించును. ఇది పవిత్రము కీర్తికి మూలము పితృప్రీతికరము. దేవతలకును అమృతమువలె ప్రీతికరము. మానవు లకు మహారోగహరము.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున ఫురాణ సంఖ్యానుక్రమ పురాణదాన వ్రతములను ఏబది మూడవ అధ్యాయము.