238 -  గ్రహయజ్ఞవిధానము – లక్షహోమ - కోటీహోమములు.

మనుః : గ్రహయజ్ఞః కథం కార్యో లక్షహోమః కథం నృపైః ।

         కోటిహోమోపి వా దేవ సర్వపాపప్రణాశనః॥        

క్రియతే విధినా యేన యద్దృష్టం శాస్త్రచింతకైః ।

 తత్సర్వం విస్తరా ద్దేవ కథయస్వ జనార్దన॥

 మత్స్యః : ఇదానీం కథయిష్యామి ప్రసజ్ఞాదేవ తే నృప ।

 రాజ్ఞా ధర్మప్రసక్తేన ప్రజానాం చహీతేప్పునా॥

లక్షహోమవిధిః॥ గ్రహయజ్ఞ స్సదా కార్యో లక్షహోమసమన్వితః ।

 నదీనాం సజమే చైవ సురాణా మగ్రత స్తథా॥

 సుసమే భూప్రదే శేతు దైవజ్ఞాధిష్ఠితో నృపః ।

గురుణాచ ద్విజైశ్చైవ సార్ధం భూమిం పరీక్షయేత్॥

 ఖనేద్వై తత్ర కుళ్లింతు సుగమం హ స్తమాత్రకమ్ ।

 ద్విగుణం లక్ష హో మేచ కోటిహోమే చతుర్గుణమ్॥

 యుగ్మాస్తు ఋత్విజః ప్రోక్తా ఆ వై వేదపారగాః ।

కగ్గమూలఫలాహారా దధీ॥క్షీరాశినోపి వా॥

 వేద్యాం నిధాయేచ్చైవ రత్నా ని వివిధాని చ ।

 సికతాభి స్సమా వేష్ట్య తతోగిం చ సమిన్జయేత్॥

 గాయత్ర్యా దశ సాహసం మానస్తో కేన షడ్గుణః ।

 త్రింశద్రోహాణాం మనైశ్చచత్వారో విష్ణుదేవతై ॥

 కూశ్మాణె ర్జుహుయా త్ప్చ కుసుమాద్యైను షోడశ ।

 హోతవ్యా దశ సాహస్రం బాద రై ర్జాత వేదసి॥

 శ్రీయో మ శ్రేణ తవ్యాస్సహస్రాణి చతుర్దశ ।

శేషాః పశ్చిసహస్రాస్తు హోతవ్యా స్విన్దదై వతై కి॥

 హు త్వా శతసహస్రంతు పుణ్యస్నానం విధీయతే ।

 కుమై షోడశ సజ్ఖ్యైశ్చ సహిరణ్యై స్సుమజ్గళైః॥

 స్నాపయేద్యజమానంతు తత శ్శాంతి ర్భవిష్యతి ।

 (ఇవి లోగడ 92వ అధ్యాయమున మరియొక విధముగా తెలుపబడినవి.)

నృపులు గ్రహయజ్ఞలక్షహోమ కోటిహోమములు సర్వపాప ప్రణాశనమగునవి ఎట్లు జరుపవలయునో జనార్ధనా! సవి స్తరముగ చెప్పుమన మత్సుడిట్లు చెప్పెను: రాజా! ప్రాసంగికముగా ఇపుడు నీకు నీవడిగినది తెలి పెదను; ధర్మ ప్రసక్తుడును ప్రజాహితై షియునగు రాజు లక్షహోమ సమన్వితమగు గ్రహయజ్ఞము జరుపవలేను .

దాని కై నదీసంగమమందో దేవాలయముల ముందో సమప్రదేశమున దైవజ్ఞులను గురువులను ద్విజులను తోడుగ తీసికొనిపోయి భూపరీక్ష చేయవలెను. అచట గుంటలు మిట్టలులేని హస్తప్రనూణచతురస్రముగా కుండముత్రవ్వవలెను; ఇది అయుతహో మరూప సాధారణ గ్రహయజ్ఞమునకు; లక్షహోమమున దీనికి ద్విగుణమును.కోటిహోమమున చతుర్గుణమును అయియుండవలయును; నరిసంఖ్యతో అనగా ఎనిమిదిమంది.వేదపారగులగు ఋత్విజులనియమించవలెను; వారొకాలమున కందమూల ఫలదధిక్షిరాహారులై యుండవలయును; వేదికయందు వివిధ రత్నములను వేయవలెను; వాని పై ఇసుకతో కప్పవలెను; అగ్ని ని ప్రజ్వలింపజేసి హోమము జరుపవలెను; గాయత్రీ మంత్రముతో పదివేలు ‘మానస్తో కే' మంత్ర ముతో ఆరువేలు గ్రహదేవతాక మంత్రములతో ముప్పదివేలు విష్ణుదైవత్య మంత్రములతో నాలుగువేలు కూశ్మాండములతో ఐదువేలు కుసుమములతో వదు నారువేలు బదరీ సమిధలతో పదివేలు శ్రీ దేవతాక మంత్రములతో పదునారువేలు ఇంద్ర దైవత్య మంత్రములలో ఐదు వేలు హవనము చేయవలెను. (10+6+30+4+5+16+10+14+5=100వేలు) ఇది ఐన తత్యువాత యజమానుడు హిరణ్యసహిత షోడశ మంగళ కుంభముల జలముతో పవిత్రస్నా నమాచరించవలెను. ఇట్లు జరిపినచో శాంతియగును.

ఏవం కృతేతు యత్కి ఞ్చిద్గహపీడాసముద్భవమ్॥

తత్సర్వం నాశ మాయాతి దత్వా వై దక్షిణాం తతః ।

తస్మా త్సర్వప్రయత్నేన ప్రదేయా దక్షిణాః స్మృతాః॥

 హ స్త్యశ్వరథయానాని భూమివస్త్రయుగానిచ ।

అనడుదోశతం దద్యా దృత్విజాం చైవ దక్షిణామ్॥

 యథావిత్తానుసారాత్తు విత్తశాఠ్యం న కారయేత్ ।

 మా సేపూర్ణే సమా ప్రస్తు లక్షహోమో నరాధిప॥

కోటిహామవీధిః.

 లక్షహోమస్య రాజేంద్ర విధానం పరికీర్తితమ్ ।

 ఇదానీం కోటిహోమస్య శృణు త్వం కదాయా మ్యహమ్॥

 గత మేథ యమునాసరస్వత్యో ర్న రేశ్వర ।

 నర్మధా రూం దేవికాయాం తటే హోమో విధీయతే॥

 తత్రాపి ఋత్విజః కార్యా రవిన్దన షోడశ ।

 సర్వహోమేతు రాజేన్ద దద్యా ద్వి పేథవా ధనమ్॥

 ఋత్విగాచార్యసహితో దీక్షాం సాంవత్సరీం స్థితః ।

 జైతే మా సే తు సమాప్తి కార్తికే వా విశేషతః॥

ప్రారమ్భః కరణీయే వా వత్సరం వత్సరం నృప ।

 యజమానః పయోభక్ష్మీ ఫలాశీ చ తథా నృప॥

 యవాదిన్రీహయో మాషా స్త్రీలాశ్చ సహ సర్ఘ వైః ।

 పలాశ సమిధ శస్తా వసోర్గారా స్తథోపరి॥

మా సేథ ప్రథమే దద్యా, దృత్విగ్భ్యః క్షీర భోజనమ్ ।

ద్వితీయే కృసరా దేయా సర్వకార్యార్థసాధనీ॥

 తృతీయే మాసి సంయావో దేయో వై రవినన్దన ।

 చతుర్దే మోదకా దేయా విప్రాణాం ప్రీతి మాహరేత్॥

 పథ్చామే దధిభక్తంతు షషే వై సర్దుభోజనమ్ ।

 అపూపో సప్తమే దేయాహ్యష్టమే ఘృతపూపకాః॥

 షష్ణ్యోదనంచ నవమే దశ మే యవషష్టికాః ।

 ఏకాదశే సమాషంతు భోజనం రవినన్దన॥

 ద్వాదశే త్వథ సమాప్తే మా సే రవికు లోద్వహ ।

 షడ్రసై స్సహ భవ్యైశ్చ భోజనం సార్వకామికమ్॥

ఈ విధముగా జరిపినచో గ్రహపీడా సముద్భవములగు ఉపద్రవములు అన్నియు శమించును; శాంతి పరిపూ ర్తికి హోమానంతరము దక్షిణల నీయవలెను; ఈయబడునది కావుననే దక్షిణయని వ్యవహారము; కావున సర్వప్రయత్నముతో శక్తివంచనలేక దక్షిణలు ఈయవలెను; ఈయవలసినవి: ఏనుగులు గుర్రములు రథములు యాసములు (బండ్లుపాలకీలు మొదలగునవి) భూములు పంచల జతలు ఎద్దులు గోవులు మొదలగునవి; ఇది మాసకాలము జరిపినచో ముగియునది; ఇట్లు నీకు లక్షహోమ విధానము తెలిపితిని.

ఇక కోటిహోమ విధానము తేలి పేదను వినుము; గంగాతటయమునాతట సరస్వతీతీర నర్మదాతీర దేవికాతీరము అందిది జరుపవలెను; దీని కై పదునారుమంది ఋత్విజులను నియమించవలెను; సర్వహోమములును ముగియగనే విప్రునకు ధనమీయవలెను; దీనికై ఋత్విజులతోను ఆచార్యునితో అధ్వర్యునితో - పురోహితునితో, నుకూది సంవత్సర కాలము సాగించు దీక్షను గ్రహించవలయును; ఈ దీక్షను చైత్రమాసమునగాని కార్తిక మాసమునగాని స్వీకరించవలెను; ఇది ఇట్లు ప్రతీవర మందును జరిపినను జరుపవచ్చును; ఈ దీక్షాకాలమున యజమానుడు పాలుపండ్లు మాత్రము ఆహారముగా గ్రహించుచుండవలెను; హోమమున కై యవలు వరిధాన్యము మినుములు తిలలు ఆవలు పలాశ సమిధలు వసుధార ఉప యోగించవలెను; బ్రాహ్మణులకు భోజనము- ప్రథమ మాసమున క్షీర భోజనము రెండవనెలలో సర్వకార్యార్ధ సాధనియగు పుల గము రెండవనెలలో సంయావము (గోధుమరవ్వతో వండిన పాలఅన్న ము) నాల్గవనేలలో లడ్డులు ఐదవనెలలో పెరుగన్న ములు ఆరవనెలలో నర్తుభోజనము ఏడవనెలలో అపూపములు(అప్పములు - బూరెలు - ఆరి నెలు) ఎనిమిదవనెలలో నేతిబూరెలు తొమ్మిదవనెలలో షష్టికము అను రెండు నెలల పంటవరి)బియ్యపు అన్న ము పదవ నెలలో షష్టిక యవల అన్న ము(యవలపిండి రొట్టె) పదునొకండవ నెలలో మినుము (మినుప గారెలు మొదలగు పిండివంటల)తో కూడిన భోజనము పండ్రెండవ నెలలో అన్ని కోరికలను తృప్తిపరచు షడ్రసోపేత భక్ష్యనహితభోజనము పెట్టించవలయును.

దేదూ ద్విజానాం రాజేంద్ర మాసి మాసి చ దక్షిణామ్ ।

 అహతవాసా స్సంవీతో దినార్ధం హోమయే చ్ఛుచిః॥

 తస్మా త్సదోష్ఠితై ర్భావ్యం యజమానస్య ఋత్విజైః ।

ఇంద్రాదీనాం సురాణాం చ ప్రీణనం సార్వకామికమ్॥

 కృత్వా సురాణాం రాజేంద్ర పశుఘాత సమన్వితమ్ ।

 సర్వదా సాధిదేవానా మగ్నిష్టోమం చ కారయేత్॥

 ఏవం కృత్వా విధానేన పూర్ణాహుతి శతేశ తే ।

 సహసే ద్విగుణా దేయా యావచ్చత సహస్రకమ్॥

 పురోడాశ స్తతస్సాధ్యో దేవతార్థచ ఋత్విజైః ।

యుక్తో వన న్మానవై శ్చ పునః ప్రాప్తార్చనా నిజాక్॥

 ప్రిణయిత్వా సురా నర్వా నితృదేవం తతః క్రమాత్ ।

 కృత్వా శాస్త్రవిధానేన పిజ్ఞానాంతు సమర్పణమ్॥

సమాహై తస్య హోమస్య విప్రాణా మథ దక్షిణామ్ ।

సమాం చైవ తులాం కృత్వా బద్ధ్వా శిక్యద్వయం పునః॥

 ఆత్మానం తోలయే తత్ర పత్నీం చైవ ద్వితీయకామ్ ।

 సువర్ణేన తథాత్మానం రజతేన తథా ప్రియామ్॥

తోలయిత్వా దదే ద్రాజా విత్తశాఠ్య వివర్జితః ।

దదే చ్ఛత సహస్రంతు రూప్యస్య కనకస్య తు॥

 సర్వస్వం వా దదే తత్ర రాజసూయఫలం లభేత్ ।

 ఏవం కృత్వా విధానేన విప్రాం స్రాంశ్చ విసర్జయేత్॥

 ప్రీయతాం పుణరీ కాక్ష స్సర్వ యక్షేశ్వరో హరిః ।

తస్మిం సుషే జగత్తుష్టం ప్రీణితే ప్రీణితం భవేత్॥

 ఏవం సర్వోపఘాతేషు దైవమానుషకారణే ।

 ఇయం శాస్త్రి స్తవాఖ్యాతా యాం కృత్వా సుకృతీ భవేత్॥

 న శోచే జన్మ మరణే కృతాకృత విచారణే ।

 సర్వతీర్దేషు యత్స్నా నం సర్వయజ్ఞేషు యత్పలమ్॥

 తత్ఫలం సమవాప్నోతి కృత్వా యజ్ఞత్రయం నృప॥

ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే గ్రహయజ్ఞ కోటిహోమ కథనం నామ ఆష్టాత్రింశదుత్తర ద్విశతతమోఽధ్యాయః॥

ప్రతిమానమందును బ్రాహ్మణులకు (ఋత్విజులకు) దక్షిణలియవలెను; యజమానుడును ఋత్విజులతో కూడి అహతవానసుడై (చించని జత వస్త్రములు - అనగా దోవతుల జతను చించక ఒక దానిని కట్టువస్త్ర ముగాను రెండవ దానిని ఉత్తరీయముగాను అమర్చికొని ధరించిన వాడు అయి)దినార్త కాలము హోమము చేయవలెను; ఇది ఇంద్రాదిదేవతా ప్రీతికరమును సర్వకామ - ప్రదమును; ఇట్లు సర్వదేవతోద్దేశకమగు ఈ యజ్ఞమును జరిపి పశువిశసన పూర్వకముగా అగ్ని షోమమును సర్వదానాది పూర్వకముగా జరుపవలయును; ఇట్లు యథావిధిగ జరుపుచు నూ రేసి హవనముల కొకసారి పూర్ణాహుతి జరుపవలెను; వేయి హవనములు కాగానే ద్విగుణదక్షిణల నీయవలెను; ఇట్లు లక్షహోమములు ముగియు వరకు చేయవలెను. తుదకు ఋత్విజులు పురోడాశమును సిద్ధపరచి దానితో దేవతోద్దేశమున హవనము జరుపవలయును. యజమానుడును మానవ యోగ్యములగు హవిష్యాన్న ములతో జితేంద్రియుడై యుండి ద్విజులను దేవతలను అర్చించి ప్రతి నందించవలెను; తరువాత పితరులనర్చించి శాస్త్రోక్త విధానమున పిండప్రదానము జరుపవలయును; ఇట్లు హోమ సమాప్తికాగానే బ్రాహ్మణులకు (ఋత్విజులకు) దక్షిణలు సమృద్ధిగా ఈయవలెను; తరువాత సరియగు తుల చేయించి దానికి రెండువైపులను రెండు ఉట్టులను వేలాడదీయ వలయును; రాజు తాను బంగారుతో తులలో తూగి. తన భార్యను వెండితో తూకము చేయించవలయును; ఈ ధనమును దానము చేయవలయును; వెండిగాని బంగారుగాని లక్ష నాణెములు ఈతులో భారమునందుండునట్లు యథాశక్తిగ ఇతర ద్రవ్యములనైన తూకముచేసి దానమీయవలెను; రాజు తనకున్న దంతయు  (సర్వస్వము)నైన ఈయవచ్చును; దీనిచే రాజసూయ యాగఫలము లభించును; ఇట్లు యథావిధానముగ లక్షహోమ కోటీహోమముల జరిపి ఆ ఋత్విగాది బ్రాహ్మణులకు వీడ్కోలు ఇచ్చిపంపవలయును; యజ్ఞాంతమున పుండరీకాక్షుడును సర్వ యక్షేశ్వరుడునునగు హరీప్రీతిసందుగాక ! అను మంత్రమునుచ్చరింపవలయును; ఆతడు తుష్టుడైనచో జగత్తు సంతుష్టమగును; అతడు ప్రీణితు (ప్రీతినందించబడినవాడై నచో జగము క్షీణితమగును; దైవ హేతుకములును మానుష హేతుకములునగు - సర్వోపఘాతములందును జరుపవలసిన శాంతివిధానము ఇది; నీకు తెలిపిన ఈ యజ్ఞమాచరించినచో   సుకృతమాచరించినవాడగును; జన్మమరణముల గూర్చి కాని కృతాకృతములను (నేను ఏపుణ్యమాచరించతిని ఏ పుణ్యమాచరించలేదు. అను విషయమును గూర్చి కాని విచారించ శోకింప-పనిలేదు; సర్వతీర్థ స్నానము చేతను సర్వయజ్ఞాచరణము చేతను కలుగు ఫలమంతయు ఈగ్రహయజ్ఞశ్రయము అయుత  హోమలక్షహోమ -కోటిహోమముల)తో  లభించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజ ధర్మమున గ్రహయజ్ఞ లక్షహోమ కోటిహోమ విధాన ప్రతిపాదనమను రెండు వందల ముప్పది ఎనిమిదవ అధ్యాయము.