మత్స్య మహా పురాణము
13 - పితృవంశానువర్ణనము - వైరాజపితరుల చరితము
మనుః: భగవ న్ఛోతు మిచ్ఛామి పితృణాం వంశముత్త్రమమ్ ।
రవేశ్చ శ్రాద్ధదేవత్వం సోమస్య చ విశేషతః॥
మత్స్యః: అహం తే కథయిష్యామి పితృణాం వంశ ముత్త్రమమ్ ।
స్వర్గే పితృగణా స్సప్త త్రయ స్తేషా మమూర్తయః॥
మూర్తిమన్తోథ చత్వార స్సర్వేషా మమితౌజసః ।
అమూర్తయః పితృగణా వై రాజస్య ప్రజాపతేః॥
యజ న్తి యా న్దేవగణా వై రాజా ఇతి విశ్రుతాః ।
దీవి తే యోగవిభ్రష్టాః ప్రాప్తుం లోకాన్సనాతనా॥
పున ర్ర్బహ్మదినాన్తే తు జాయ నే బ్రహ్మవాదినః ।
సంప్రాప్య తాం స్మృతిం భూయో యోగం సాజ్ఞ్య మను త్తమమ్॥
సిద్ధిం ప్రయా న్తి యోగేన పునరావృత్తి దుర్లభామ్ ।
యోగినామేవ దేయాని తస్మా చ్చ్రాద్దాని దాతృభిః॥
ఏతేషాం మానసీ కన్యా పత్నీ హిమవతో మతా ।
మైనాక స్తస్య దాయాద:( క్రౌఞ్చస్తస్యాగ్రజోఽభవత్) క్రౌఞ్చ స్తస్య సుతోభవత్॥
క్రౌఞ్చ ద్వీప స్స్మృతో యేన చతుర్థో ఘృతసంవృతః ।
మేనా తు సుషువే తిసః కన్యా యోగవతీ స్తతః॥
ఉమైక పర్ణాఽపర్ణా చ తీవ్ర వ్రతపరాయణాః ।
రుద్రస్త్యై కా భృగో శ్చైకా జై గిషప్యస్య చాపరా॥
మనువు మత్స్యనారాయణునితో ఇట్లు పలికెను : భగవన్! ఉత్త్రమమగు పితరుల వంశమును విన కుతూహల పడు చున్నాను, విశేషించి రవియు సోముడును శ్రాద్ధదేవులయిన వృత్తాంతమును వినగోరుచున్నాను.
మత్స్యనారాయణుడు ఇట్లు చెప్పనారంభించెను: అత్యంత ప్రధానమగు పితృవంశ వృత్తాంతమును నీకు తేలు పుదును. వినుము. స్వర్గలోకమునందు పితృదేవతాగణములు ఏడు కలవు. వీనిలో మూడు గణములు మూర్తి రూపము లేనివి. మరి మిగిలిన నాలుగును మూ ర్తి కలవి. ఈ ఏడు గణముల పితరులును ప్రాణులందరలో అమిత మగు ఓజస్సు (సామర్థ్యము) కలవారు.
చూర్తిలేని పితరులు వైరాజుడు అను ప్రజాపతికి (కుమారులు) సంబంధించిన వారు. వీరు ద్యులోకమునందు ఉందురు. (మూర్తి లేని పితరులు బుద్దిత త్వదశ లోనివారును ఆమూ ర్తములగు ఆకాశ వాయు భూతములతో రూపొందినవారును. మూర్తి కల.-పితరులు మూ ర్తములగు తేజో భూతముతో కూడ నిర్మితమయిన శరీరము కలవారు. జలపృథివీ భూతములు కూడ కలిసి వారి దేహమును నిర్మించినచో వారును భూలోకమునందలి మనవంటి ప్రాణులలోనివారే అగుదురు. కాని దేవతలు కారు. వీరినే ఎల్లవారును , ఆరాధించుచుందురు. వే రోజులు అని ప్రసిద్ధిపొందిన ఈ , ఆమూ ర్తములైన . పితృ గణములవారు శాశ్వతములగు లోకములను పొందగోరి ఒకప్పుడు యోగసాధనము చేసి యోగమునుండి శ్రష్టులైనవారు. వీరిట్లు చాలకాలము పితృ దేవతలుగా నుందురు. కల్పావసానమైన తరువాత మరల సృష్టి ఆరంభము కాగానే వేదత త్వ జులుగా జన్మింతురు. చారపుడు తమ పూర్వ స్మృతి కలిగియుండి యోగసాధనమునకై సంకల్పింతురు. సర్వో తమమగు . సాంఖ్యయోగమును ఆశ్రయించి పునరావృత్తి (మరల సంసారములోనికి వచ్చుట) లేని శాశ్వతగతిని పొందుదురు. ఇట్లు పితరులు యోగిరూపులు అని తెలియుచున్నది. కనుక లోకమునందు మానవులు కూడ శ్రాద్ధమునందు చేయు ఏదానము నై నను యోగము నేగి అనుష్ఠించువారి కే చేయవలెను.
ఈ పితరుల మానసీ (మనస్సంకల్పము చేతనే కలిగిన) కన్య మేన అనునా మె. ఆమె హిమవంతుని పత్ని యెనది. హిమవంతుని కుమారుడు మైనాకుడు. అతని కొడుకు క్రౌంచుడు. అతని పేరుతోనే ఘృత సముదముతో చుట్టబడిన క్రౌంచద్వీపము ఏర్పడినది. ఇది ద్వీపములలో నాలుగవది.
'మేన'కు ముగ్గురు కుమా రెలు కలిగిరి. వారు ఉమ-ఏకపర్ణ-అపర్త -అనువారు. వారు ముగ్గురును యోగసిద్ధి కలవారు. తీవవత పరాయణలు. తమ తపస్సుచే సర్వలోక జనులకంటే గొప్పవారు ఆగువీరిలో హిమవంతుడు ఉమను రుద్రునకును ఏక పర్లను భృగువునకును అపర్ణను జై గీషవ్యునకును ఇచ్చి వివాహము చే నేను.
దత్తా హిమవతా బాలా స్సర్వలోక తపోధికాః ।
ఋషయః: కస్మా ద్దాక్షాయణీ పూర్వం దదాహాత్మాన మాత్మనా॥
హిమవద్దుహితా తద్వత్కథం జాతా మహీతలే ।
శ జ్కరస్య కృతాఽవజ్జా కథం వై బ్రహ్మసూనునా॥
సంహర న్తీ కిముక్తాఽసౌ సుతా వా బ్రహ్మసూనునా ।
దక్షేణ లోక జననీ సూత విస్తరతో వద ।
సూతః: దక్షస్య యజ్ఞే వితతే ప్రభూతవర దక్షిణే॥
(సమాహుతేషు) సమాగతేషు దేవేషు పోవాచ పితరం సతీ ।
కిమర్థం తాత భర్తా మే యజ్ఞేఽస్మి న్న నిమన్త్రితః॥
అయోగ్య ఇతి తా మాహ దక్ష యజ్ఞేషు శూలభృత్ ।
ఉపసంహారకో రుద్ర స్తేనామజ్గళ భా గయమ్॥
చుకోపాథ సతీ దేహం త్యక్ష్యామీతి తదుద్భవమ్ ।
దశానాం త్వం చ భవితా పితృణా మేకపుత్రకః॥
త్వత్కృతే త్వశ్వమేధశ్చ రుద్రాద్వై నాశ మేష్యతి ।
ఇత్యుక్త్వా యోగ మాస్థాయ స్వదేహోద్భవతేజసా॥
నిర్దహన్తీ తదాత్మానం సదేవాసుర కిన్నరై: ।
కిం కి మేత దితి ప్రోక్తో గన్దర్వగణగుహ్య కైః॥
ఉపగమ్యాబ్రవీ ద్దక్షః ప్రణిపత్యాథ దుఃఖితః ।
త్వమస్య జగతో మాతా జగత్సౌభాగ్యదేవతా॥
దుహితృత్వం గతా దేవి మమానుగ్రహకామ్యయా ।
న త్వయా రహితం కించి ద్ర్బహ్మాణ్డేఽ స్త్రీ చరాచరమ్॥
ప్రసాదం కురు ధర్మజ్ఞే మా మాం త్యక్తు మహార్హసి ।
ప్రాహ దేవీ యథారబ్దం తత్కార్యం మే న సంశయః॥
కిం త్వవశ్య మహం మన్యే హతో యజ్ఞశ్చ శూలినా ।
ప్రసాద్య లోక సృష్ట్యర్థం తపః కార్యం మమా న్తికే॥
ప్రజాపతి స్త్వం భవితా దశానాం మజ్గళప్రదః ।
మదం నాజ్ఞనా షష్టి ర్భవిష్య న్యజ్ఞజా స్తవ॥
మత్సన్నిధౌ తపః కుర్వ న్రాప్స్య సే యోగ ముత్త్రమమ్ ।
ఏప ముక్తేఽబ్రవీద్దక్షః కేషు కేషు మయాన ఘే॥
తీర్ధేషు చ త్వం ద్రష్ట వ్యా స్తోతవ్యా కైశ్చ నామభిః ।
దేవీ సర్వదా సర్వభూతేషు ద్రష్టవ్యా సర్వతో భువి॥
సప్తలో కేషు యత్కిఞ్చ ద్రహితం న మయా హి తత్ ।
తథాపి యేషు స్థానేషు ద్రష్టవ్యా సిద్ది మీపుభిః॥
స్మర్తవ్యా భూతికామైర్వా తాని వక్ష్యామి తత్త్వతః ।
శౌనకాది ఋషులు సూతుని ఇట్లడిగిరి: “పూర్వము దాక్షాయణి (దక్షుని కూతురు అగు సతి) తన దేహమును తానే ఏల కాల్చుకోనేను? ఆమె భూతలమున హిమవంతుని కూతురుగా ఎట్లు జన్మించేను? దక్షుడు బ్రహ్మమానస సుతుడై యుండియు శంకరుని ఎట్లు ఏల అవమానించెను? తన కూతురును లోక జననియు అగు సతి తెన దేహమును చాల్చుకొను నప్పుడు దక్షుడు ఏమనెను? మాకు విస్తరించి చెప్పుడు.”
సూతుడు ఋషులతో ఇట్లు పలి కెను: అధిక సంఖ్యగల శ్రేష్ఠములగు ద.క్షిణలతో, దక్షుడు యజ్ఞమును వితతము (శ్రాతకల్పమున చెప్పిన విధమున జరుపబడునది) చేయుచుండెను. (శివుడు . తప్ప మిగిలిన దేవతలు అందరును యజ్ఞమునకు వచ్చియుండిరి. అపుడు సతీదేవి తన తండ్రిని “నాయనా! ఈ యజ్ఞమునకు నాభర్తను ఏల పిలువలేదు?” అని అడిగెను. శూలధారి యగు రుద్రుడు నీభర్త యజ్ఞములందు . వచ్చుటకు యోగ్యుడు కాడు. అతడు సృష్టిని ఉపసంహరించు నశింపజేయు) వాడు. అందుచేత అతడు అశుభములను ఆశ్రయించి యున్న వాడై నాడు. (శుభములకు పనికిరాడు. ) అనీ దక్షుడు పలికెను. అంతట సతి కోపించేను. నీవలన ఉత్పన్నమైనందున నా ఈ దేహ మును విడిచెదను. అని ఆమె పలి కెను. నీవు పదిమంది తండ్రులకు ఒక్కడవే కుమారుడవు అయ్యేదవు. నీవు చేసిన ఈ దోషమునకు ఫలముగా నీ ఈ అశ్వమేధము రు దుని చేతిలో నాశమునందును. అని పలికీ సతీదేవి యోగమును పూనీ తన దేహమునుండి ఉత్పన్నమయిన అగ్ని తోనే తన శరీరమును దహింపజేసికోనుచుండెను. అది చూచి దేవతలు అసురులు గుహ్యకులు కిన్నరులు గంధర్వులును దక్షునితో ఇది ఏమి? ( ఇట్లు జరుగనిచ్చితివి?) అనిరి. అంతట దక్షుడు ఆమె దగ్గరకు వచ్చి దుఃఖించుచు నమస్కరించి ఇట్లు పలికేను: “నీవు ఈ జగత్తునకు మాతవు. జగత్తులకు సౌభాగ్య దేవతవు. నన్ను అనుగ్రహించు తలంపుతోనే నీవు నాకు పుత్రికవయితివి. నీవు లేనిది నీవు కానిది ఈ బ్రహ్మాండము నందు చరము కాని అచరము కా ') (కదలునది కదలనిది) అగు ఏపదార్తమును లేదు. నీవు ధర్మము నెరిగినదానవు. నన్ను అనుగ్రహించుము. సన్ను విడువవలదని వేడుచున్నాను.”
దేవి దక్షునితో ఇట్లు పలికెను: “నేను ఏమి చేయ సంకల్పించి ఆరంభించితివో అది నేను చేసియే తీరుదును. అందు సందేహము లేదు. దేవి వస్తు స్థితిలో ఇచ్చా దిశ క్తి త్రయ స్వరూపురాలు. ఇచ్చ అనగా సంకల్పము. ఆమే తాను సంకల్పించిన దానిని తన జ్ఞానశ క్తితో ఆలోచించి క్రియా శక్తితో నిర్మాణము చేయును. అని తత్వమున అర్థము. ) (నీవు నన్ను భక్తితో ప్రార్థించుచున్నావు.) కాని నా సంకల్పానుసారము శివుని చేతిలో నీ యజ్ఞము నాశము కాక తప్పదు. నన్ననుగ్రహింప జేసికొని నా దయచే లోక సృష్టిని సాధించుట కై నీవు నా సన్నిధిలో ఉండి తపస్సు ఆచ రించుము. పదిమంది ప్రజాపతులలోను నీవు శుభకరుడవు అయ్యెదవు. సో ఆంశ ముతో నీకు ఆరువదిమంది కూతుండ్రు కలిగెదరు. నా సన్నిధిలో తపమాచరించినచో నీవు ఉత్త్రమమగు యోగసిద్ధిని పొందేదవు.”
దేవి - మాటలు విని దక్షు డామెతో “ఏయే తీర్థములందు నీవున్నట్లు భావించి నిన్ను దర్శించవలెను? ఏ నామములతో నిన్ను స్తుతి చేయవలెను?" అనెను.
దేవి ఇట్లు పలికెను: సర్వకాలములందును భూమియందలి (భూమి పై) సర్వ ప్రదేశములందు సర్వభూతము లందును నేనున్నట్లు దర్శించవలయును. ఏలయన స పలోకములందును ఏయే వస్తువులు కలవో పొనిలో ఏయొక్కటియు నేను లేనిదియు నేను కానిదియు లేదు. ఐనను తాము కోరిన ఫలములు సిద్ధింపగోరినవారు కాని అభ్యుదయమునో నిః శ్రేయసమునో కోరినవారు (ఇహపర సుఖముల కోరినవారు) కాని ఏయే స్థానములందు నన్ను (ఏరూపమున) స్మరింప వలెనో వాటిని వాస్తవ స్థితిలో చెప్పుచున్నాను.
దక్షాయ దేవీప్రో క్తస్వీయాష్టోత్తరశతస్థానాని॥
వారాణస్యాం విశాలాక్షీ, నైమి శే లిజ్గధారిణీ॥
ప్రయాగే లలితా దేవి కాముకా గన్ధమాడనే ।
మాన సే కుముదా నామ విశ్వా విశ్వేశ్వరే విదుః॥
మా నామ విశ్వకాయాం తు ఇచ్ఛాయాం మదనోత్కటా ।
గోమన్తే గోమతీ నామ మన్దారే కామచారిణీ॥
మదోత్కటా చిత్రరథే జయన్తే హస్తినాపురే ।
కన్యాకుబ్జే తథా గౌరీ రమా మలయపర్వతే॥
నన్దా హిమవతః పృష్టే గోకర్ణే భద్రకర్ణికా ।
స్థాణ్వీశ్వరే భవానీతి బిల్వ కే బిల్వపత్రికా:॥
శ్రీ శైలే మాధవీ నామ భద్రా భద్రేశ్వరే తథా ।
జయా వరాహ శైలే తు కమ్బళా కమలాలయే॥
పుష్కరే పురుహూతేతి కేదారే మార్గ దాయినీ ।
రుద్రకోట్యాం తు రుద్రాణీ కాళీ కాళఞ్జరే గిరౌ॥
మహాలిజ్గేతు కపిలా మకుటే మకుటేశ్వరీ ।
సాలగ్రామే మహాదేవీ శివలిజ్గే శివ ప్రియా॥
మాయాపుర్యాం కుమారీ తు సన్తతా లలితే తథా ।
ఉత్పలాక్షే సహస్రాక్షి హిరణ్యాక్ష మహోత్పలే॥
గయాయాం మజ్గళా నామ విపులా పురుషోత్తమే ।
విపాశాయా మమోఘాక్షీ పాటలా పుణ్డ్రవర్దనే॥
నారాయణీ సుపార్శ్వేతు త్రికూటే భద్రసున్దరీ ।
విపులే విపులా నామ కల్యాణీ మలయాచలే॥
కోట్యక్షీ కోటితీర్దే తు సుగన్దా మాగధే వనే ।
కుబ్జామ్ర కే త్రిసన్ద్యా తు గజ్జా ద్వారే రతిప్రియా॥
శివకుణ్డే సుసన్దా చ నన్దినీ దేవికాత టే ।
రుక్మిణీ ద్వారవత్యాం తు రాధా బృన్దావనే వనే॥
దేవకీ మథురాయాం తు పాతాళే పరమేశ్వరీ ।
చిత్రకూటే తథా సీతా విన్ద్యే విన్ద్య నివాసిని॥
సహ్యాద్రి వేక వీరాతు హరిశ్చన్ద్రేతు చన్ద్రికా ।
రమణా రామతీర్థేతు యమునాయా మృగావతీ॥
కరవీరే మహాలక్ష్మీ రుమాదేవీ వినాయ కే ।
ఆరోగ్యా వైద్యనాధేతు మహాకాళే మహేశ్వరీ॥
అభయా శుక్ల తీర్దే తు స్మృతిర్వా విన్ద్యకన్దరే ।
మాణ్డవ్యే మాణ్డకీనామ స్వాహా మా హేశ్వరే పురే॥
చాగలాణ్డే ప్రచణ్డచ చణ్డికాఽమరకణ్డ కే ।
సోమేశ్వరే వరారోహా ప్రభాసే పుష్కరావతీ॥
దేవమాతా సరస్వత్యాం పారావారత టే మతా ।
మహాలయే మహాభాగా పయోష్ణే పిజ్గళా పతీ॥
సింహికా కృతశౌచే తు కార్తి కేయే(తుశాజ్కరి) ఆయశ స్కరీ ।
ఉత్పలావర్త కే లోలా సుభద్రా సిన్దుసజ్గమే॥
మాతా సిద్ధవనే లక్ష్మీ రనజ్గ భరతాశ్రమే ।
జాలన్దరే విశ్వముఖీ తారా కిష్కిన్దపర్వతే॥
దేవదారువనే పుష్టి ర్మేధా కాశ్మీరమణ్డలే ।
(భీమాదేవి)ఉమాదేవీ హిమాద్రౌ తు షష్ఠే వస్తేశ్వరీ తథా॥
కపాలమోచనే శుద్ధి ర్మాణా కాయావరోహణే ।
శజ్ఖద్వారే ధ్వనిర్నామ భృతిః పిణ్డార కే తథా॥
కలాతు చన్ద్రభాగాయా మచ్ఛోదే శూలధారిణీ ।
వైణాయా మమృతా నామ బదర్యా మూర్వశీ తథా॥
ఓషధీ చోత్తరకురౌ కుశ ద్వీ పే కుశోదకీ ।
మన్మథా హేమకూటే తు కుముదే సత్యవాదినీ॥
అశ్వత్థే వన్దనీయాతు (ని) విధి ర్వైశ్రవణాలయే ।
గాయతీ వేదవదనే పార్వతీ శివసన్నిధౌ॥
దేవలోకే తథేన్ద్రాణి బ్రహ్మాంగేతు సరస్వతీ ।
సూర్యబిమ్బే ప్రజానా మ మాతృణాం వైష్ణవీ తథా॥
అరున్దతీ సతీనాంతు రామాసుచ తిలోత్త్రమా ।
చితే బ్రహ్మకలా నామ శ క్తి స్సర్వశ రీరిణామ్॥
1. వారాణసియందు విశాలాక్షి -2. నె మిశమున లింగధారిణి-8. ప్రయాగయందు శ్రీలలితాదేవి.4. గంధ మాదన పర్వతమున కాముక.5. మానససరః క్షేత్రమున కుముద-6. విశ్వేశ్వరమున విశ్వ.7. విశ్వకయందు మా లక్ష్మీ)-8. ఇచ్ఛా క్షేత్రమున మడ నోత్కట 9. గోమంతమున గోమతి-10. మందార మున కామచారిణి-11. చిత్రరథమున మదోత్కట-12. హస్తినాపురమున జయంతి. 13. కాన్యకుబ్జమున గౌరి.14. మలయపర్వతమున రంభ- 1 6. హిమ వత్పర్వత సానువునందు నంద-16. గోకర్ణమున భద్రకర్ణిక-17. స్థాణ్వీశ్వరమున భవాని.18. బిల్వకమున బిల్వపత్రిక - 19. శ్రీ శైలమున మాధవి.20. భద్రేశ్వర మున భద్ర-21. వరాహ శ్రీ లమున జయ-22. కమలాలయమున కంబళ . 28. పుష్కర క్షేత్రమున పురుహూత.24. కేదార క్షేత్రమున మార్గదాయిని 25. రుద్రకోటియందు రుద్రాణి-26. కాలంజర పర్వతమున కాళి-27. మహాలింగ క్షేత్రమున కపిల.28. మకుట క్షేతమున మకుట-29. సాలగ్రామ క్షేత్రమున మహాదేవి. 80. శివలింగ క్షేత్రమున శివప్రియ-81. మాయాపురి (జగన్నాధ క్షేత్రము) యందు కుమారి-2. లలితమునందు సంతత. 8. ఉత్పలాక్షమున సహస్రాక్ష -34. మహోత్పలమున హిరణ్యాక్ష85. గయయందు మంగళ_36. పురుషో త్త్రమమున విపుల.37. విపాశా నదీ క్షేతమున ఆ మోఘాక్షి -28. పుండ్రవర్తనమున పాటల.89. సుపార్శ్వమున నారాయణి - 40. త్రికూట పర్వతమున భద్రసుందరి-41. వివుల క్షేతమున విపుల.42. మలయాచలమున కల్యాణి-48. కోటి తీరమున కోట్య క్షి - 14. మాగధవనమున సుగంధ -4). కుబ్జమక క్షేత్రమున త్రిసంధ్య-46. గంగాద్వారము (హరిద్వార మున రతిప్రియ.47. శివకుండ తీరమున సునంద-48. దేవికానదీతటమున నందిని-4:). దో రకయందు రుక్మిణి_50. బృందా వనమున రాధ. 51. మథుర యందు దేవకి -52. పాతాళమున పరమేశ్వరి. 58. చిత్రకూటమున సీత -54. వింధ్యమున వింధ్యవాసిని.55. సహ్యపర్వతమున పడ మటి కనుమలు) ఏక వీర -56. హరిశ్చంద్రమున చంద్రిక - 57. రామతీర్థమున రమణ- 58. యమునాతీరమున మృగావతి 59. కరవీర మున మహాలక్ష్మి-60. వినాయకమున ఉమ.61. వైద్యనాథమున ఆరోగ్య.62. మహాకాళ మున మహేశ్వరి-63. శుక్ల తీర్థమున అభయ-64. వింధ్య కందరమున స్మృతి 65 మాండవ్యమున మాండకి-66. మ హేశ్వరపురమున సాహా_f7. ఛాగలాండమున ప్రచండ-68. అమరకంటక మున చండిక -69. సోమే శ్వరమున వరారోహ70. ప్రభాసమున పుష్కరావతి-71. సము, దతీరమునందు సరస్వతీతీరమున దేవమాత-72 మహా లయమున మహాభాగ-73. పయోషమున పింగళావతి. 74. కృతశాచ క్షేత్రమున సింహిక, 16. కార్తికేయ క్షేత్రమున యశస్కరి-76. ఉత్పలావ రకమున లోల-77. సాగర సంగమమున సుభద్ర-78. సిద్దవనమున లక్ష్మీమాత-79. భరతా శ్రమమున అనంగ.80. జాలంధరమున విశ్వముఖి-81. కిష్కింధ పర్వతమున తార -82. దేవదారువనమున పుష్టి 83. కాశ్మీరమండలమున మేధ-84. హిమాద్రియందు ఉమాదేవి.86. షష్ణ క్షేత్రమున వస్తేశ్వరి-86. కపాల మోచనమున శుద్ది-87. కాయావరోహణమున మాత .88. శంఖద్వారమున ధ్వని-89. పిండారకమున భృతి-90. చంద్రభాగాతీరమున కల_91. ఆచ్చోదమున శూలధారిణి -82. వేణా క్షేత్రమున అమృత.98. బదరీ క్షేత్రమున ఊర్వశి-94. ఉ త్త్రకురువు లందు ఓషధి-95. కుశ ద్వీపమునందు కుశోదకి_96. హేమకూటమున మన్మథ_97. కుముదమున సత్యవాదిని-98. అశ్వత్త్ర మున వందనీయ-99. వైశ్రవణాలయమున ని)విధి-100. వేదవదనమున గాయత్రి.101. శివ సంనిధియందు పార్వతి. 102. దేవలోకమునందు ఇంద్రాణి 108. బ్రహ్మశ రీర మున, సరస్వతి-104. సూర్యబింబమునందు ప్రభ-106. సప్త మాతృకలయందు వైష్టవి. 106. పతివ్రతలయందు ఆరుంధతి.107. సుందరులగు స్త్రీలయందు తిలోత్త్రమ.108. సర్వ ప్రాణుల చిత్త్రములందును బ్రహ్మక లయను శ క్తి.
ఏతదుద్దేశ తః ప్రోక్తం నామాష్టశత ముత్తమమ్ ।
అష్టోత్తరంచ తీర్థానాం శత మేత దుదాహృతమ్॥
యస్స్మ రే చ్ఛృణుయాద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే ।
ఏషు తీర్దేషు యః కృత్వా స్నానం పశ్యతి మాం నరః॥
సర్వపాపవినిర్ముక్తః కల్పం శివపురే వ సేత్ ।
యస్తు మత్పరమః కాలం నయ త్యేతేషు మానవః॥
న హిత్వా బ్రహ్మ సదనం పద మభ్యేతి శాఙ్కరమ్ ।
మన్నా మాష్టశతం యస్తు శ్రావయే చ్ఛిపసన్నిధౌ॥
తృతీయాయా మథాష్టమ్యాం బహుపుత్రో భవే న్నరః ।
గోదానే శ్రాద్ధదానే వా అహన్యహని వా పునః॥
దేవతార్చా విధౌ విద్వా న్పఠ న్భ్రహ్మాధిగచ్ఛతి ।
సూతః: ఏవం వదన్తీ సా తత్ర దదాహాత్మాన మాత్మనా॥
స్వాయమ్భవోపి కాలేన దశ: ప్రాచేత సోఽభవత్ ।
పార్వతీ చాభవద్దేవీ శివదేహార్ధధారిణీ॥
మేనాగర్భసముత్పన్నా భుక్తిము క్తిఫలప్రదా ।
ఆరున్దతీ జప నేత దవాప్తి యోగముత్త్రమమ్॥
పురూరవాశ్చ రాజర్షి ధోకానిష్టా నగాత్పరా ।
యయాతిః పుత్రలాభం చ ధనలాభంచ భార్గవః॥
తథాన్యే దేవదై త్యాశ్చ బ్రాహ్మణాః క్షత్రియా స్తథా ।
వైశ్యా శ్శూదాశ్చ బహవ స్మృత్వా సిద్ధిం యథేప్సితమ్॥
యత్రైత ల్లిఖితం తిష్ఠే త్పూజ్యతే దేవసన్నిదౌ ।
న తత్ర శోకో దౌర్గత్యం కదాచిదపి జాయతే॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మత్స్య మనుసంవాదే గౌరీనామాష్టోత్త్రర
శతకథనం నామ త్రయోదశోఽధ్యాయః ॥
ఇట్లు ఇచ్చట శ్రీదేవి నామములను నూట ఎనిమిదింటిని పేర్కొనుట మా తము { వాటి ఆర్థములతో శ్రీదేవీ తత్త్వమును వివరించక యే) ఐనది. ఈ పేర్కొన్న నూట ఎనిమిది తీర క్షేత్రములను విన్న ను స్మరించినను సర్వ పాపములను 'డి ముక్తి లభించును ఈ తీర్థములయందు స్నానము చేసి నన్ను దర్శించినవారు సర్వపాపముక్తులై కల్ప మంత కాలమును శివపురమున వసింతురు. నాయందు తత్పరత కలిగి ఈ క్షేత్రములందు నివసించువారు బ్రహ్మలోకము ను గూడ దాటి ఈ లోకమును చేరుదురు శుక్ల పక్షమున తృతీయయందుగాని అష్టమినాడుగాని శివ సన్నిధియందు నో ఈ అష్టోత్త్రర శ : నామములను వినిపించినవారు బహుపుత్రవంతులగుదురు. గోదాస కేశాది దాన కాలములందుగాని అటు దినముననుగాని దేవతార్చనా సమయము • గాని దీనిని పఠించు వివేకులు బ్రహ్మపదమును పొందుదురు.
ఇట్లు పలుకుచునే శ్రీ సతీదేవి తన దేహమును స్వయముగా దహించుకొనెను. (చిత్స్వరూపగా అయ్యెను.)
మొదట స్వయం భూ బ్రహ్మయొక్క దక్షిణాంగుష్ట మునుండి జనించి స్వాయంభువుడనబడిన ఈ దముడే ( తన కుమార్తెయగు సతీదేవి శాపము చే) ప్రచేతసులనబడు పది మందికి కుమారుడుగా దక్షుడి మరల) పుటేను. సతీ దేవియు పార్వతియై పుట్టి శివుని అర్ధాంగమునకు " మినీయ య్యెను. ఈ రెండవ జన్మమున ఆమే మేన గర్భమున దు జనించి భు కి ముక్తి ఫలప్రదయైనది. అరుంధతి ఈ విషయమును ( ఈ అష్ణోత్త్రర శత : మములను) జపించుచు ఉత్త్రమ యోగసిద్ధి పొందెను. రాజ యగు పురూరవుడును ఇష్టములును ఉత్త్రమములును అగు లోకములు పొందెను. భార్గవు (ని అలు)డు అగు యయాతియు పుత్రలాభమును ధనలాభమును పొందెను. ఇట్లే ఇతరులగు దేవతలును దైత్యులును బ్రాహ్మణ క్ష తియ వైశ్య శూద్రులును ఈ నామాష్టోత్త్రర శతకమును స్మరించి తమ ఇష్టముల సిద్దింపజేసికొనిరి. ఇది వ్రాయబడియున్న చోటును దేవ సన్నిధిలో ఇది పఠింప-పూజింపబడు చోటునను శోక ముగాని దారిద్ర్యముగాని ఎన్నడును కలుగదు
ఇది శ్రీ మత్స్యమహా పురాణమున మత్స్యమను సంవాదమున శ్రీ గౌరీనామాష్టోత్త్రర శత కథనమను త్రయోదశాధ్యాయము.
Summary of chapter 13 of the Matsya Mahā Purana is as follows:
In response to King Vaivashvata Manu's inquiry regarding the divine powers that protect devotees across sacred locations, Bhagavān Matsya reveals the one hundred and eight sacred names of Goddess Gaurī and her corresponding holy shrines across the sacred land of Bhārata. The text enumerates how the Supreme Goddess is worshipped as Vishālākshī at Vārāṇasī, Lalitā at Prayāga, Kāmākshī at Kāñchī, Rukmiṇī at Dvārakā, Mādhava-priyā at Ujjayinī, Gāyatrī at Pushkara, Bhavānī at Sthāneshvara, and Devahūti at Mathurā. Reciting these one hundred and eight divine names with unyielding faith purifies a devotee from all karmic transgressions, grants marital harmony, long life, and spiritual wisdom, and ensures permanent residence in the divine realm of Śiva and Pārvatī.