241 - దుఃస్వప్న ములు - సుస్వప్నములు-వానీ ఫలము.

మనుః ; స్వప్నా ఖ్యానం కథం దేవ గమనే ప్రత్యుపస్థితే

దృశ్యంతే వివిధాకారో కథం తేషాం ఫలం భవేత్ 

శ్రీమత్స్యః : ఇదానీం కథయిష్యామి నిమిత్తం స్వప్న దర్శనే

నాభింవినాఒన్యగా త్రేషు తృణవృక్షసముద్భవః

 చూర్ణనం మూఠి కాంస్యానాం ముష్ఠనం నగ్న తొ తథా

 మలినాన్బురధారిత్వ మభ్య జ్ఞః పజ్కదిగ్ధతా 

ఉచ్చా తపతనం చైవ డోలారోహణ మేవ చ

 అర్జనం పక్వమాంసానాం హయానా మపి మారణమ్

రక్తపుష్పద్రుమాణాం చ చుమ్బనం స్యా తథైవచ

 వరాహర్షఖరోష్ట్రాణాం తథా చారోహణ క్రియా

 భక్షణం పక్వమాంసానాం శైలస్య కృసరస్య చ

 నర్తనం హసనం చైవ వివాహో గీత మేవచ

 త స్త్రీవాద్యవిహీనానాం వాద్యానా మపి వాదనమ్

 స్తోతో ఒవగాహగమనం స్నానం గోమయవారిణా

పజోద కేన చ తథా మహీతోయేన చావ్యథ

 మాతుః ప్రవేశో జఠరే చితారోహణ మేవచ

 శక్రధ్వజాభిపతనం పతనం శశిసూర్యయోః

దివ్యా న్తరిక్షభౌమానా ముత్పాతానాం చ దర్శనమ్

 దేవద్విజాతి భూపాలగురూణాం క్రోధ ఏవ చ

 ఆలిజనం కుమారీణాం పురుషాణాం చ మైథునమ్

 హాని శ్చైవ స్వగా త్రాణాం విరేకవమన క్రియా

 దక్షిణా శాభిగమనం వ్యాధినా భీభవ స్తథా

 ఫలాపహానిశ్చ తథా పుష్పహాని స్తథైవచ

గృహాణాం చైవ పాతశ్చ గృహసమ్మార్జనం తథా 

క్రీడా పిశాచక్రవాద వానరర్షనరై రపి

పరా దభీభవశ్చైవ తస్మాచ్చ వ్యసనోద్భవః

కాషాయవస్త్రధారిత్వం తద్వ తీక్రీడనం తథా

స్నేహపానావగాహౌ చ ర క్తమాల్యానులేపనమ్

 ఏవమాదీని చాన్యాని దుస్స్వప్నాని వినిక్టి శేత్

 ఏషామకథనం ధన్యం భూయః ప్రస్వాపనం తథా

 కల్క స్నానం తిలై ర్హోమో బ్రాహ్మణానాం చ పూజనమ్

 స్తుతిశ్చ వాసుదేవస్య తథా తస్యైవ పూజనమ్

 నాగేంద్రమోక్షశ్రవణం జ్ఞేయం దుస్స్వప్న నాశనమ్

రాజు యుద్ధ యాత్ర కై పోవుటకు ముందుగా కలుగు స్వప్నముల ఫలముల ప్రతిపాదనము ఎట్టిది దేవాః స్వప్న ములు వివిధ రూపములలో కనబడును గదా! వాని ఫలములు ఎట్లుండును? అనిన మనువుతో మత్సుడిట్లనెను: ఇక మీదట స్వప్న దర్శన నిమిత్తక ఫలములను తెలి పెదను! నాభియందుకాక అన్యావయవములలదు తృణములు వృక్ష ములు మొలచుట తల పై కాంస్య (కంచు) పొతాదికము పడి పగులుట తల బోడియగుట నగ్నత్వము మలిన వస్త్రధారణము నూనేతో తలంటుకొనుట బురద పూసికొనుట ఎత్తునుండి పడుట ఊయెల నెక్కుట ఉడికించిన మాంసము తెచ్చుకొనుట గుర్రములను చంపుట ఎర్రని పూలను చెట్లను ముద్దు పెట్టుకొనుట పందులను ఎలుగుబంట్లను గాడిదలను ఒంటెలను. ఎక్కుట పక్వమాంసములనో తైలమునో ఫలములనో తినుట నర్తించుట నవ్వుట పెండ్లి జరుగుట పాడుట తంత్రరహిత పాద్యములను మ్రోగించుట నదిలో స్నానమాడక పోవుట గోమయ జలముతో బురద నీటితో మట్టి కలిసిన నీటితో స్నానమాడుట మాతృగర్భమున ప్రవేశించుట చితి పై ఎక్కుట ఇంద్రధ్వజము పడుట చంద్రసూర్యులు పడుట దివ్యాంతరిక్ష భౌమోత్పాతములు కనబడుట దేవతలు విప్రులు రాజులు గురువులు కోపించుట కన్యలను కౌగిలించుట పురుషులతో సంభో గించుట తన అవయవములకు హానీయగుట (రాలుట -విరుగుట) తనకు విరేచనమగుట వాంతియగుట దక్షిణముగా పయ నించుట వ్యాధి వచ్చుట పండ్లు రాలుట పూలు రాలుట ఇండ్లు పడుట ఇండ్లు ఊడ్చుట పిశాచములతో మాంసాహార ప్రాణు లతో వానరులతో ఎలుగు బంట్లతో నరులతో ఆడుకొనుట పరులవలన అవమానము వ్యసనము కలుగుట తాను కాషాయ వస్త్రములు ధరించుట స్త్రీలు క్రీడించుట నూనేత్రాగుట నూనెతో, స్నానమాడుట ఎర్రని పూలు దాల్చుట ఎర్రని గంధములు పూసికొనుట. ఈ మొదలగునవి దుఃస్వప్నములు; వీని సితరులకు చెప్పక మరల ని దించుట మంచిది; కల్కముతో (ఓషధీ చూర్ణముతో) స్నానము తిలలతో హోమము బ్రాహ్మణ పూజనము వాసుదేవస్తుతి పూజనములు గజేంద్ర మోక్ష కథాశ్రవణము చేయుటచే దుఃస్వప్న దర్శనదోష శాంతి.

స్వప్నా స్తు ప్రథమే యామే సంవత్సర విపాకినః 

షడ్భిర్మా సెర్ద్వితీయే చ త్రిభి ర్మాసే స్తృతీయ కే

 చతుర్థే మాసమాత్రణ పద్య నే నాస్తి సంశయః

 అరుణోదయవేళాయాం దశా హేన ఫలం భవేత్

ఏక స్యాం యది వా రాత్రే శుభం వా యది వాశుభమ్

 పశ్చాద్దృష్టస్తు య స్స్వప్న స్తస్య పాకం వినిర్ధి శేత్

 తస్మాత్తు శోభనే స్వ ప్నే పశ్చా శ్వాపో న శస్యతే

 శైలప్రాసాద నాగాశ్వ వృషభారోహణం హితమ్

 ద్రుమాణాం శ్వేతపుష్పాణాం గమనే చ తథా ద్విజ

 ద్రుమతృణోద్భవో నాభౌ తథా చబహుశీర్ష

 తథైవ బహు బాహుత్వం పలితోద్భవ ఏవ చ

 సుశుక్లమాల్య ధారిత్వం సుశుక్లామ్బర ధారణమ్

 చన్దార తారాగ్రహణం పరిమార్గణ(ర్జన) మేవచ

 శక్రధ్వజాలిజనం చ తదుచ్ఛాయక్రియా తథా

 భూమ్యమ్బుధీనాం గ్రసనం శత్రూణాం చ వధక్రియా

 జయో వివాదద్యూ తేషు సమే చ తథా నృప

 భక్షణం చార్టమాంసానాం మత్స్యానాం పాయసస్య చ

 దర్శనం రుధిర స్యాపి స్నానం వా రుధిరేణవా

 సురారుధిర మద్యానాం పానం క్షీరస్య వాజప్యథ

 ఆనైర్వా వేష్టనం భూమౌ నిర్మలం గగనం తథా

 ముఖేన దోహనం శ స్తం మహిషీణాం తథా గవాయ్

 సింహీనాం హస్తినీనాం చ బడబానాం తథైవచ

ప్రసాద్ దేవవి పేభ్యో గురుభ్యశ్చ తథా శుభః

 ఆమ్బసా త్వభి షేకస్తు గవాం శృణో శ్రీతేన చ

 చన్దాదషేన వా రాజక్ షైయో రాజ్య ప్రదో హి సః

 రాజ్యాభి షేక శ్చ తథా భేదనం శిరస స్తథా

మరణం వహ్ని దాహశ్చ వహ్ని దాహోగృహాదిషు

 లబ్దిశ్చ రాజ్యలిఙానాం త స్త్రీవాద్యాభివాదనమ్

 తథోద కానాం తరణం తథా విషమలజ్జ నమ్

 హస్తినీబడబానాం చ గవాం చ ప్రసవో గృ హే

ఆరోహణ మథాశ్వానాం రోదనం చ తథాశుభమ్

 వర స్త్రీణాం తథా లాభ స్తదాలిజన మేవచ

 నిగ శై ర్బన్దనం ధన్యం తథా విష్టానులేపనమ్

 జీవతాం భూమిపాలానాం సుహృదా మపి దర్శనమ్

 దర్శనం దేవతార్చానాం విమలానాం తథామ్బసామ్

 శుభాన్యథై తాని నరస్తు దృష్ట్వా ప్రాప్నోత్యయత్నా ద్ధ్రువ మర్థలాభమ్

 స్వప్నా ని వై ధర్మభృతాం వరిష్ట వ్యాధే ర్విమోక్షం చ తథాతురోపి

 ఇతి శ్రీమత్స్య మహాపురాణే మత్స్యమనుసంవాదే స్వప్నానుకీర్తనం నామఏక చత్వారింశదు త్తర ద్విశతతమోఽధ్యాయః

రాత్రి ప్రథమయామమున వచ్చిన స్వప్నములు సంవత్సరమునకును ద్వితీయయామ మందలివి ఆరుమాసముల కును తృతీయయామమందలివి మూడు మాసములకును చతుర్థయామ మందలివి మాసమునకును అరుణోదయ వేళ యందలివి పదినాళ్ళకును ఫలమునిచ్చును; ఒ కేరాత్రియందు రెండువిధములగు కలలు వచ్చిన వానిలో తరువాత వచ్చినదే ఫలము నిచ్చును; కావున మంచికల వచ్చిన తరువాత మరల నిద్రించుట మంచిదికాదు.

పర్వతములను మేడలను గజాశ్వ వృషభములను ఆరోహించుట తెల్లని పూవులుగల వృక్షముల నెక్కుట తన నాభియందు వృక్షములుగాని గడ్డి కాని మొలచుట తనకు అనేక శిరస్సులు కలుగుట బహు బాహువులేర్పడుట జుట్టునరయుట మిగుల తెల్లని వస్త్రములనో మాల్యములనో ధరించుట చంద్రుని అర్కుని తారలను అందుకొనుట వానిని చేతితో తుడుచుట ఇంద్రధ్వజమును కౌగిలించుకొనుట దానిని పైకెత్తుట భూమిని సముద్రములను మింగుట శత్రువులను వధించుట వివాద ద్యూత యుద్ధములందు జయము పచ్చిమాంసమునో చేపలతో పాయసమువో భక్షించుట రుధిరపాన స్నానములు సురా రుధిరమద్య క్షీరపానములు పేవులు చుట్టుకొని నేలపై దొరలుట ఆకాశ ము నిర్మలమగుట గేదెల . ఆడు ఏనుగుల.సింహ ములగుర్రముల-పాలను తన నోటిలోనికి పిదుకుకొనుట దేవవిప్రగురువులనుండి ప్రసాదము (అనుగ్రహము) పొందుట ఇవి శుభస్వప్న ములు; గోశృంగము నుండీయో చంద్రుని నుండి యో స్రవించునీటితో స్నానము రాజ్యప్రద ము; రాజ్యా భి షేకము. స్వశిర శ్ఛేదము స్వమరణము - తాను దహింపబడుట - గృహాదికము దగ్గమగుట రాజలాంఛనములు లభించుట తంత్రీవాద్యములు మోయించుట ఉదక మును దాటుట (ఈదుట) విషమ ప్రదేశములను లంఘించుట ఇంటియందు ఆడు ఏనుగులో గుర్రములో గోవులో ప్రసవమగుట ఆశ్వారోహణము రోదనము పరస్త్రీలాభాలింగనములు సం కెలలతో బంధన మందుట మలము పూసికొనుట కాలమున జీవించియున్న రాజులనో మిత్రులనో దర్శించుట దేవతారా మూర్తులనుగాని విమల జలమునుగాని చూచుట శుభములు; అయత్నముగా ధనలాభమును రోగికి రోగము క్తియు ఇట్టి శుభస్వప్నములకు ఫలములు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున స్వప్నాను కీర్తనమను రెండు వందల నలువది యొక టవ అధ్యాయము.