17 - సాధారణ శ్రాద్ధ విధానము - ఆభ్యుదయిక శ్రాద్ధ విధానము

సూతః: అతఃపరం ప్రవక్ష్యామి విష్ణునా య దుదీరితమ్

శ్రాద్ధం సాధారణం నామ భుక్తిము క్తిఫలప్రదమ్

అయనే విషువే యుగ్మే సామాన్యే చార్కసజ్క్రమే

 అమావాస్యాష్టకా చైవ కృష్ణపక్షచతుర్దశి

ఆర్ద్రా మనోహిణీషు ద్రవ్య బ్రాహ్మణసన్నిధౌ

 గజచ్ఛాయావ్యతీపాతే విష్టి వైధృతివాసరే

 వైశాఖస్య తృతీయాయాం నవమ్యాం కార్తికస్య తు

 ప్రఞ్చదశ్యాం తు మాఖస్య నథ స్యేచ త్రయోదశీ

యుగాదయ స్మృతా "హ్యేతే దత్త్రస్యాక్షయకారకాః

 తథా మన్వన్తరాదౌ చ దేయం శ్రాద్ధం విజానతా

 ఆశ్వయుక్ఛుక్లనవమీ ద్వాదశీ కార్తికే తథా

 తృతీయా చై! తమాసస్య తథా భాద్రపదస్య చ

అమావాస్యా ఫాల్గునస్య పౌష స్యైకాదశీ తథా

 ఆషాఢస్యాపి దశ మీ మాఘమాసస్య సప్తమీ

శ్రావణే చాష్టమీ కృష్ణా తథాషాఢేచ పూర్ణిమా

కార్తికీ ఫాల్గునీ చైత్రీ జ్యేష్ఠ పఞ్చదశీ తథా

మన్వన్తరాదయశ్చైతా దత్తస్యాక్షయకార కాః

యస్మా న్మన నరస్యాదౌ రథ మాప దివాకరః

మాఖమాసస్య సప్తమ్యా మథ సారథసప్తమీ

పానీయమ ప్యత్ర పాలై ర్విమిశ్రం దద్యా త్పితృభ్యః ప్రయతో మనుష్యః

 శ్రాద్ధం కృతం తేన సమా స్సహసం రహస్య మేత త్పితరో వదన్తి

 వైశాఖ్యా ముపరాగేషు రథోత్సవమహాలయే

 తీర్థాయతనగోష్ఠేషు ద్వీపోద్యానగృహేషు చ

వివి క్తేషపలి ప్తేషు శ్రాద్ధం దేయం విజానతా 

సూతుడు ఋషులతో ఇంక ను ఇట్లు చెప్పనారంభించెను. (ఇంతవరకు నేను మీకు మూడు విధములగు నైమిత్తిక శ్రాద్దములలో మొదటిదగు పార్వణ శ్రాద్ధపు విధానమును తెలిపితిని.) ఇక మీదట మత్స్యరూప నారాయణుడు మనువునకు చెప్పిన సాధారణ శ్రాద్ధ విధానము తెలి పెదను. ( ఇది నైమిత్తిక శ్రాద్దములలో రెండవది.) . దీని వలన భుక్తి ముక్తులు లభించును.

 (ఈ శ్రాద్ధము జరుపవలసిన కాలమును - దేశమును) ఉత్త్రరాయన దక్షిణాయన ప్రవేశ పుణ్య కాలములును రెండు విషువ దినములును (రాత్రింబవళ్ళ పం: మాణము సమముగా ఉండు దినములు సూర్యుడు ఆయా రాశులయందు ప్రవేశించు దినములును అమావాస్య అష్ట కా (మాసమున కృష్ణపక్ష సప్తమీ) కృష్ణపక్ష చతుర్దశి "తిథులును ఆర్గామఖా రోహిణీ నక్షత్ర దినములును శ్రాద్ధమునకు యోగ్యములగు ద్రవ్యములును యోగ్యులగు బ్రాహ్మణులును లభించిన దినములును గజచ్ఛాయా వ్యతీపాత్ విష్టి వై ధృతి యోగములున్న దినములును యుగాది (మన్వంతరాది : దినములును అనేది ఈ దినము లందు జరిపిన శ్రాద్ధము, అక్షయమగును. ( అనంత ఫలమును ఇచ్చును.) : (వీనిలో, గజచ్ఛాయావ్యతీపాత విష్టి వైధృతి యోగములు జ్యోతిశ్శాస్త్రమునుండి తేలియవలెను.) వైశాఖ తృతీయా కార్తిక నవమీ మాఘ.. పంచదశీ బాద్రపద త్రయో దశీ-ఇవి యుగాదులు. అశ్వయుజ శుక్ల నవమీ కార్తిక ద్వాదశీ చైత్ర తృతీయా. భాద్రపద .. తృతీయా ఫాలునామావాస్యా పుష్యైకాదశీ ఆషాఢ దశ మీ మాఘ సప్తమీ శ్రావణ కృష్ణాష్టమీ ఆషాఢ పూర్ణిమా కార్తిక ఫాల్గున చైత జ్యేష్ఠ పూర్ణిమలు మన్వంతరాది దినములు. (ఇచట కొన్ని తిథుల విషయమున పక్ష మును చెప్పలేదు. మరియు పంచాంగములలో మన్వన రాదులు ఈ విధముగా నున్నవి. కార్తిక శుక్ల ద్వాదశీ .. స్వాయంభువ-ఆశ్వయుజ శుక్ల నవమీ స్వారోచిష-పైత్ర శుక్ల తృతీయా-ఉత్త్రమ - భాద్రపద శుక్ల తృతీయా తామస-పుష్య శు కైకాదశీ రైవత-ఆషాడ శుక్ల దశ మీ చాక్షుష-మాఖ శుక్ల సప్తమీ వైణవస్వత శ్రావణమావాస్యా అగ్ని సావర్ణి-ఫాల్గున పూర్ణిమా, బ్రహ్మసావర్ణి-కార్తిక పూర్ణిమా దక్షసావర్ణి భాద్ర పద కృష్ణాష్టమీ సూర్యసావర్ణి.ఆషాడ కృష్ణాష్టమీ.రుద్రసావర్ణి-జ్యేష్ఠ పూర్ణిమా బౌత్య చైత్ర శుక్ల పూర్ణిమా రౌచ్య . వీనిలో వైవస్వత మన్వంతరాదియగు మాఖ శుక్ల సప్తమీ తిథినాడు సూర్యుడు తన రథమును ఆరోహించెను. సంపాదించుకొనెను. కనుక దీనికి రథ సప్తమీయని వ్యవహారము ఏర్పడినది. ఈ దినమున మనుష్యుడు ప్రయతుడై దేహమున చిత్త్రమున శుచియై తిలలతో మిశ్రితమయిన ఉదకమును మాత్రమైనను పితృ దేవతల నుద్దేశించి అర్పించినచో వేయి సంవత్సరముల కాలము శ్రద్ధతో యథావిధిగ శ్రాద్ధము పెట్టినంత ఫలము కలుగును. వైశాఖామావాస్య నాడును గ్రహణ దినములందును ఉత్సవ దినములందును మహాలయ దినములందును తీర్థములందును క్షేత్రములందును గోవులు నిలుచు ప్రదేశములందును ద్వీపములందును ఉద్యాన గృహములందును (ఉద్యానవనములు వేరు. లేదా ఉద్యాన వసములందును తనకు అనుకూలమయిన గృహములందును వివి క్రమగు (ఎట్టి అపవిత్రతకును కలవరపాటునకును అవ కాశము కలుగనీయని ప్రదేశమునందును చక్కగా అలికి ఆ ప్రదేశమున శ్రాద్ధము జరుపుట శాస్త్రమును సంప్ర దాయమును ఎరిగిన వారు చేయవలసిన పని.

విప్రా న్పూర్వేఽపరే చాన్ని వినీతాత్మా నిమన్త్రయేత్

శీలవ్రత గుణోపేతా న్వయోరూపసమన్వితాక్

సాధారణ శ్రాద్దే విశ్వేదేవాద్యర్చావిధిః

ద్వౌ దై వే పితృకార్యే శ్రీ నే కైక ముభయత్ర వా

 భోజయేత్సుసమృద్ధోఽపి న ప్రసజ్యేత విస్తరే

 విశ్వా న్దేవా న్యవైః  పుష్పై: రభ్య ర్యాసనపూర్వకమ్

పూరయే త్పాత్రయుగ్మం తు స్థాప్య దర్భపవిత్రకమ్

శన్నో దేవీ త్యపః క్షిప్త్వా యవోసీ యవా నపి

 గన్దపుష్పైశ్చ సమ్పూజ్య విశ్వ దేవం ప్రతి న్య సేత్

విశ్వేదేవాస ఇత్యాబ్యా మావాహ్య వికిరే ద్యవాక్

గన్దపుష్పైరలజ్కృత్య యా దివ్యత్యర్ఘ్య ముత్సృజేత్

 అభ్యర్చ్య తాభ్యా ముత్సృష్టః పితృయజ్ఞం సమారభేత్

 దర్భాసనాని కృత్వాఽఽదౌ త్రీణి పాత్రాణి పూరయేత్

 సపవిత్రాణి కృత్వాదౌశ న్నో దేవీ త్యపః క్షిపేత్

తిలోతి తిలా న్షిప్త్వా గన్దపుష్పాదికం పునః

 పాత్రం వనస్పతిమయం తథా పర్ణమయం పునః

జలజం చాపి కుర్వీత తథా సాగరసమ్భవమ్

 సౌవర్ణం రాజతం వాపి పితృణాం పాత్ర ముచ్యతే

 రజతస్య కథా వాపి దర్శనం దాన మేవ చ

 రాజతై ర్భాజనై రేషా మథవా రాజతాన్వితైః

వార్యపి శ్రద్దయా దత్త మక్షయాయోపకల్పతే

 తథార్ఘ్యపాత్రే పిజేపి పితృణాం రాజతం మతమ్

శివనేత్రోద్భవం యస్మాత్తత స్త త్పితృవల్లభమ్

 ఆమజ్గళం తద్యత్నేన దేవకార్యేషు పర్జయత్

 ఏవం పా! త్రాణి సజ్కల్ప్య యథాలాభం విమత్సర

యా దివ్యేతి పితు ర్నామ గోత్రైర్దర్భకరో న్య సేత్

పితృ నావాహయిష్యామి తథోత్యు క్తస్తు తైః పునః

 ఉశ న్తస్త్వా తథాఽఽయంతు ఋ చా ప్యావాహయే తృతవాక్

యా దివ్యత్యర్ఘ్య ముత్సృజ్య దద్యా ద్గన్దాదికం తతః

 వస్త్రోత్తరం దేవపూర్వం గత్వా సంశ్రవణాదితః

 పితృపాత్రే నిధాయాథ శేష ముత్త్రరతో న్య సేత్

 పితృభ్య స్థానమనీతి నిధాయ పరి షేచయేత్

తత్రాపి పూర్వవ తుర్యా దగ్ని కార్యం విమత్సరః

 ఉభాభ్యామపి హస్తాభ్యా మాహృత్య పరివేషయేత్

 ప్రశాన్తచిత్త స్సతతం దర్భపాణి ర శేషతః  

 శ్రాద్ధకర్త శ్రాద్ధమునకు ఒక దినము ముందుగా గాని రెండు కాళ్లు ముందుగాగాని మంచిశీలము సత్కర్మాను స్థానము నధుణములు కలిగిన వారిని తగిన వయస్సు రూపము కలవారిని శ్రాద్దమున భోక్తలుగా నియంత్రించవలెను. విశ్వదేవస్థానమున ఇద్దరను పితృ స్థానమున ముగ్గురిని మాత్రమే భుజింపచేయవలెను. లేదా ఒక్కొక్క స్థానమునకు ఒక్కొక్కరై నను చాలును. కర్త తానెంత ధనవంతుడై నను ఆంతకంటే ఎక్కువమందిని పిలువరాదు.

మొదట విశ్వదేవులకు ఆసనమునిచ్చి వారిని యవలతో పుష్పములతో పూజించవలెను. దర్భపవిత్రములను ధరించి రెండు పాత్రలను జలముతో నింపవలేను. 'శన్నో దేవీ?' అను మంత్రముతో నీటిని ఆ పా తలలో పోయవలెను. 'యవోస్" అను మంత్రము తో పాత్రలో యవల వేయవలెను. గంధ పుష్పములతో పాత్రలను పూజించి విశ్వేదేవులముందుంచవలెను. ‘వి శ్వేదేవాసః' అను మంత్రముతో విప్రులయందు వి శ్వేదేవతల నావాహనము చేయవలెను. తరువాత వారిమీద యవలను విదలించవలెను. తరువాత బ్రాహ్మణులను గంధ పుష్పములతో అలం : ఓంచి 'యా దివ్యా?' అను మంత్రముతో వారి చేతుల యందర్యము విడువవలెను. మరల వారిని అర్చించి వారినుండి వీడ్కోలు అనుమతి పొందవలెను. పిమ్మట పితరులను అర్చించుటకు రావలెను. దర్భలతోడి ఆసనములను పితృస్థానమునందలి బ్రాహ్మణులకు వేయవలెను. వీరిముందున్న మూడు పాత్రలను నీటితో నింపవలేను. పవిత్రములను ధరించవలెను. 'శ న్నో దేవీ?' అను మంత్రముతో పాత్రలయందు నీటిని పోయవలెను. 'తిలోసి' అను మంత్రముతో పాత్రలందు తిలలను వేయవలెను. గంధ పుష్పాదులను కూడ పాత్ర లలో వేయవలెను. ఈ అర్య పాతములు రావివంటి వనస్పతుల కొయ్యతో చేసినవి కాని ఆకుల దొన్నెలు కాని సముద్రమునుండి లభించు శంఖము మొదలైనవి కాని అయియుండవలెను. లేదా వెండిదో బంగారపుదో కావచ్చును. రజతము అను మాటయు రజతమును చూపుటయు దానము చేయుటయు పితృ ప్రీతికరము. వెండి పాత్రలతో కాని వెండి కలిసిన లోహపు పాత్రలతో కాని శ్రద్ధతో పితరులకు ఇచ్చినది అక్షయమై అనంతఫలము నిచ్చును. ఆర్యముంచుటకును విడుచుటకును కాని పిండముల నుంచుట మొదలగు పనులలో కాని పితృదేవతలకు వెండి చాల ప్రీతికరమైనది.

వేడి శివుని కంటినుండి పుట్టినది. కనుక నే అది పితృ ప్రీతికరము. అది శుభకరము మా తము కాదు. కనుక దానిని దేవ కార్యములందు ఉపయోగించరాదు.

ఈ విధముగా తనకు లభించునంతలో (శ్రాద్ధమున కై) పాత్రలను సమకూర్చుకొనవలెను. మత్సరము మొదలగు మనోదోషము లేమియు లేక యుండవలెను. ‘యా దీవ్యాః' అను పు తముతో పితరుల సొమ గోత్రములను చెప్పుచు. దర్బలను చేత పట్టుకొని “పితరులను మీయందు ఆవాహనము చేయుచున్నాను.' అను అర్థ, నిచ్చు మంత్రముతో ఆదర్భా లను బ్రాహ్మణుల చేతియందుంచవలెను. ఆసమయములో ' మీయందావాహనము చేయుచున్నాను.' అని కర్త అనగా 'తథా! • అట్లే కానిమ్ము.' అని ఆ విప్రుడ నును. 'ఈ శంతస్త్వా' అను మంత్రముతో కాని 'ఆయంతు' అను మంత్రముతో కాని వారియందు పితరులను ఆ.వాహనము చేయవలెను. 'యా దివ్యా' అను మంత్రముతో వారిచేతిలో అర్యమును విడువవలెను. గంధ పుష్పవస్త్రములీయవలెను. అర్యము మొదట విశ్వేదేవులకు.తరువాత పితరులకు. సంశ్రవ మంత్రము కూడ చెప్పుచుండవలెను. అర్షమును విడిచిన తరువాత న్యుస్టుడే (ముందునకు వ"గినవాడై ! ఆ అర్ఘ్యపాత్రలను భో కకు ఉత్త్రరముగా ఉంచవలెను. 'పితృభ్యః స్థానమసి' అను మంత్రముతో ఆ పాత్రలను భో కకు ఎడమ దిక్కుగా శుచి ప్రదేశమున ఉంచి వాటిని నీటితో పరి షేచనము చేయవలెను.

 ఈ సాధారణ శ్రాద్దమందు కూడ పార్వణ శ్రాద్ధమునందు వలేనే నిర్మలచిత్తుడై అగ్నిగౌకరణమును జరుప వలెను. తరువాత ప్రశాస్త్ర చిత్తుడై నిరంతరముగా దర్భలను చేత ధరించియేయుండి రెండు చేతులతోను పదార్థములను అన్నిటిని తెచ్చి భోక్తల పాత్రలయందు వడ్డించవలెను.

సాధారణ శ్రాద్ధే దేవమాంసభేదాః

గుణైస్తు సూపశాకాద్యై ర్నా నాభక్షైస థైవచ

అన్నంతు స్వాదువ త్క్షీరం గోఘృతం శర్కరాన్వితమ్  

మాసం ప్రీణాతివై సర్వా న్పితౄ నిత్యాహ కేశవః

ద్వౌ మాసౌ మత్స్యమాం సేన త్రీన్మాసాక్ హారిణేన తు

 ఔర భ్రేణాథ చతుర శ్శాకు న్తేనాథ పఞ్చాకమ్

 షణ్మాసాం శ్చాగమాం సేన తృప్యన్తి పితర స్తథా

 సప్త లోహస్య మాం సేన ఆష్టౌ వైణీయజేన తు

 పృషతస్య తు మాం సేన తృప్తి ర్మాసా నవై వ తు

 దశ మాసాంస్తు తృప్య న్తి వరాహమహిషామి షేః

 శశ కూర్మకయోర్మాంసం మాసా నేకాదశై వతు

 సంవత్సరంతు గవ్యేన వయసా పాయ సేన తు

 రౌర వేణ తు తృప్యన్తి మాసా స్పద శైవతు

 వార్ధాణసస్య మాం సేన తృప్తి ర్ద్వాదశ వార్షికీ

కాలశా కేనవాఽఽనన్యం ఖడ్గమాం సేన చైవతు

 యత్కించి న్మధునా మిశ్రం గోక్షీరఘృతపాయసమ్

 దత్త మక్షయ మిత్యాహుః పితర: పూర్వదేవతాః

శ్రాద్దే అభిశ్రవణావిధిః

స్వాధ్యాయం శ్రావయే త్పిత్ర్యం పురాణాన్యఖిలాని చ

 బ్రహ్మ విష్ణ్వర్క రుద్రాణాం స్తవాని వివిధానిచ

ఇన్ద్రాగ్ని సోమసూక్తాని పావమానా న్తి శ క్తితః

బృహద్రథ స్తరం తద్వ జ్జ్యేష్ఠ సామ సరౌహిణమ్

 తథైవ శాన్తి కాధ్యాయం మహాబ్రాహ్మణమేవచ

మణ్డల బ్రాహ్మణం తద్వత్ప్రీతి కారిచ యత్పునః

 పితృణా మాత్మనశ్చాపి తత్సర్వం సముదీరయేత్

పితృ దేవతలను ఉద్దేశించి భోక్తలచే భుజింపజేయు అన్న ము శుచియై రుచికల మంచి ఆహారమునకు ఉండ వలసిన అన్ని గుణములును కలిగి ఉండవలెను. నానా విధములగు భక్ష్యములతో చేరి ఉండవలెను. పప్పు ఆకు కూరలు కాయ గూరలు ఉండవలెను. పదార్థములన్నియు చాల రుచిక లపై ఉండవలెను. ఆవు పాలు ఆవు నేయి శర్కర ఉండ వలేను. ఇటువంటి అన్న మును మాంసమును పితరులకు తృప్తి కలిగించును. అని సాక్షాత్ విష్ణువే చెప్పెను. మాంసము లలో మత్స్య మాంసము రెండు మాసముల పాటు లేడి మాంసము మూడు మాసములపాటు పొట్టేలు మాంసము నాలుగు మాసముల వరకు పాలపిట్ట మాంసము ఐదు మాసముల వరకు మేక మాంసము ఆరు మాసముల వరకు ఎర్ర మేక మాంసము ఏడు మాసముల వరకు ఇట్టి మాంసము ఎనిమిది మాసముల వరకు తెల్లని మచ్చలు గల ఇట్టి మాంసము తొమ్మిది మాసముల వరకు అడవి పంది-అడవి దున్న-మాంసములు పది మాసముల వరకు తాబేటి మాంసములు పదు నొకండు మాసముల వరకు ఆవు పాలతో చేసిన పాయసము సంవత్సరము వరకు రురు మృగపు మాంసము పదునై దు మాసముల వరకు పొడవు చెవులు గల అడవి మేక మాంసము పం డెండు సంవత్సరముల వరకు ఖడ్గ మృగపు మాంసము కానీ బలుసాకు కూర గాని అనంత కాలము వరకు పితరులకు తృప్తి కలిగించును. కాని ఆవు పాలతో వండి తేనె కలిపి ఆవు నేతితో సంస్కరించిన పాయసము పితృదేవతలనుద్దేశించి పెట్టిన చో అక్షయమై యుండును. అని పితృ దేవతలే స్వయముగా చెప్పిరి. (దీనిని బట్టి శ్రాద్ధములయందు ఈ చెప్పిన విధమగు పాయసముతో భోక్తలను భుజింపజేయుట సర్వోత్త్రమమని తేలుచున్నది.]  భోక్తలు భుజించు సమయమున వేదము నుండి పితృదేవతా విషయమును ప్రతిపాదించు అనువాకములను మంత్రములను సమ స్తములగు పురాణములను బ్రహ్మ విష్ణు సూర్య రుద్రుల వివిధ స్తోత్రములను ఇంద్రుడు అగ్ని సోముడు దేవతలుగా గల సూక్తములను పవమాన సూక్తములను బృహద్రథంతరము రౌహిణము జ్యేష్టము అనబడు సామవేద భాగములను శాంతికాధ్యాయము (వేదమునందలి భాగము )ను మహాబాహ్మణము మండల బ్రాహ్మణము అను వేద భాగము లను పఠించుచు వారికి వినిపించుచుండవలెను. ఇంతేకాదు. తనకును పితరులకును ఏయే స్తోత్రములు పురాణాదులు వేద భాగములు మొదలైనవి ప్రీతికరములో అవి ఏవై నను పఠించి వినిపించవలెను. (దీనినే అభిశ్రవణము అందురు.. మ-పు-9)

 భుక్తవత్సు తత స్తేషు భోజనోపాన్తి కే నృప

 సార్వవర్ణికమన్నా ద్యం కనీయాంసావధారణాత్

 సముత్సృజే ద్బుక్తవతా మగ్రతో వికి రే ద్భువి

 అగ్ని దగ్దాస్తు యే జీవా యేఽవ్య దగ్ధా కులే మమ

 భూమౌద త్తేన తృప్యన్తు తృప్తా యాన్తు పరాం గతిమ్

యేషాం న మాతా న పితా న బన్దు ర్న గోత్ర శుద్ధి ర్నతథాగతేషు

తత్ తృప్తయేఽన్నం భువి దత్త మేత త్ప్రయాన్తు లోకాయ సుఖాయ తద్వత్

 అసంస్కృతప్రమీతానాం త్యాగినాం కులయోషితామ్

 ఉచ్చిష్టభాగధేయస్య దర్భేషు వికి రేచ్చయః

 తృప్తాన్జ్ఞత్వోదకం దద్యా త్సకృ ద్విప్రకరే తదా

ఉపలిప్తే మహీపృష్ఠే గోశ కృన్మూత్రవారణా

 నిధాయ దర్భా న్విధివ ద్దక్షిణాగ్రా నయత్నతః

సర్వవర్ణేన చాన్నేన పిణ్డాంస్తు పితృయజ్ఞవత్

అవనేజనపూర్ణంతు నామగోత్రేణ మానవః

గన్ధధూపాదికం దద్యాత్కృత్వా ప్రత్యవనేజనమ్

 కృత్వాపసవ్యం సవ్యేన ప్రణిపత్య ప్రదక్షిణమ్

 పిత్ర్య మానియ తత్కార్యం విధివ దర్భపాణినా

 దీపప్రజ్వలనం తద్వ త్కుర్యా త్పుష్పార్చనం బుధః

 అథాచాన్తేషు చాచమ్య దద్యాదావ స్సకృత్సకృత్

తథా పుష్పాక్షతః పశ్చా దక్షయ్యోదక మేవచ

 సతతం నామగోత్రేణ దద్యా చ్చక్త్యా చ దక్షిణామ్

 గోభూహిరణ్యవాసాంసి భవ్యాని శయనాని చ

దద్యాద్యదిష్టం విప్రాణా మాత్మనః పితు రేవచ

 విత్తశాఠ్యేన రహితః పితృభ్యః ప్రీతి మాహ రేత్

తత స్వధావాచరికం విశ్వేదేవేష్వధోదకమ్

 దత్వాశీ: ప్రతిగృహ్ణీయా ద్ద్విజేభ్వః స్రాజ్ముఖో బుధః

 ప్రీతా నః పితర స్సన్తు సన్త్విత్యుక్తః పునర్ద్విజై:

 గోత్రం తథా వర్ధ తాం న స్తథోత్యుక్తశ్చ తైః పునః

దాతారో నోఽభివర్ధనా మితి వ ముదీరయక్

 ఏతాన్సత్యాశిషస్సత్తు స న్విత్యుక్తశ్చ త్రైః పునః

 స్వస్తివాచనికం కుర్యా త్పిణ్డా నుద్దృత్య భక్తితః

 ఉచ్చేషణంతు త త్తిష్ఠే ద్యావ ద్వీప్రా విసర్జితాః

తతో గృహబలి కుర్యా దితి ధర్మో వ్యవస్థితిః

 ఉచ్ఛేషణం భూమిగత మజిహ్మస్యాశఠస్యచ

దాసవర్గస్య తత్పిత్ర్యం భాగధేయం ప్రచక్షతే

పితృభి ర్నిర్మితం పూర్వ మేత దాప్యాయనం తదా

 అపుత్త్రాణాం సపుత్త్రాణాం స్త్రీణామపి నరాధిప

 తత్రస్థా నగ్రతఃస్థిత్వా పరిగృహ్యోదపాత్రకమ్

 వాజేవాజే ఇతి జప న్కుశాగ్రేణ విసర్జయేత్

 బహిః ప్రదక్షిణం కుర్యా త్పాదా నృష్ట్వా త్వనువ్రజేత్

 బన్దువర్గేణ సహితః పుత్త్రభార్యాసమన్వితః

 నివృత్య ప్రణిపత్యాథ ప్రపూజ్యాగ్నిం సమ స్త్రవత్

వైశ్వదేవం ప్రకుర్వీత నైత్యకం బలిమేవచ

 తతస్తు వైశ్వదేవా న్తే సగోత్రసుతబాన్ధవః

భుంజీతాతిథిసంయుక్త స్సర్వం పితృని షేవితమ్

 ఏతచ్చానుపనీతోపి కుర్యా త్సర్వేషు పర్వసు

శ్రాద్ధం సాధారణం నామ సర్వకామఫలప్రదమ్

 భార్యావిరహితోఽప్యేత త్ర్పవాసస్థోపి శ క్తిమాక్

శూద్రోఽప్యమన్త్రవత్కుర్యా దనేన విధినా బుధః

ఇట్లు భోక్తలు భుజించిన తరువాత ఆ భోజన సమీపమున భోజనపు ఆకులలో (పాత్రలలో మిగిలిన అన్నము మొదలగు అన్ని పదార్థముల నుండియు చాల కొంచెము కొంచెము అంశ మును ఎత్తి తీసికొని భోక్తల ముందు భాగమున నేల పై వెదజల్లినట్లు వేసి ఉచ్చిష్ట భాక్కులకొరకై దానిని విడువవలెను. వికిర పిండమును అక్కడ ఉంచ వలెను. ఉంచుచు ఈ ఆర్థమును ఇచ్చు మంత్రమును చెప్పవలెను. “నా వంశమున పూర్వులలో ఎవరైన అగ్నిచే దహింప బడినవారు గాని (మరణానంతరము) ఆగ్ని చే దహన సంస్కారము పొందనివారు గాని తల్లిదండ్రులు, బంధువులు గోత్ర శుద్ధి లేనివారు గాని ఎవరైన నున్న చో వారును కుల స్త్రీలై యుండియు ఎవరును పట్టించుకొనక పోవుటచే మరణించిన .

సాధారణ శ్రాద్ధ విధానము.11 అ. తరువాత ఏ (పైతృక) సంస్కారములను పొందని స్త్రీ లెవరై న నున్న చో వారును నేను భూమి పై వేసిన ఈ వికిరాన్న ముతో తృప్తి చెంది ఉత్త్రమగతిని పొందుదురు గాక !” భోక్తలు తృప్తిగా భుజించినారని తెలిసికొనిన తరువాత వారి చేతులందు ఒక మరుగా మాత్రమే నీరు (ఉత్త్రరాపోశనమున కై) వేయవలెను. తరువాత గోమూత్ర గోమయములతో అలికిన నేల పై దక్షిణపు కొనలుగా దర్బలను పరచవలేను. వాని పై అన్ని పదార్థములతో కలిపి చేసిన పిండములను పితరుల సామగోత్రములతో అవనేజన పూర్వక ముగా (నీటితోను నేతితోను తడిపి శుద్ధి చేసి ఉంచవలయును. అపసవ్యముతో పిండములను దర్భల పై ఉచ వలెను. సవ్యముగా చేసికొని వాటిని ప్రదక్షిణించి నమస్కరించవలెను. ఈ పిండములు ఆయా పితరులకు చెందుగాక అని మంత్రమును చెప్పవలెను. తరు వాత దర్బలను చేత ఉంచుకోని యథావిధిగా పిండములకు ధూపదీవ పుష్ప నైవేద్యము లతో అర్చన చేయవలెను.

పిమ్మట భోక్తలు పాత్రల దగ్గర నుంచి లేచి కాలు చేతులు కడుగుకొని) ఆచమనము చేయుదురు. కర్తయు ఆచమనము చేయవలెను. అపుడు వారికి ఒక్కోక్కమారు మాత్రమే హస్తము పై నీరు వేయవలెను. పూవులను అక్షతలను అక్షయ్వోదక మును వారి చేతులయందు వదలవలెను. తన గోత్ర నామములను చెప్పుచు (ఈ గోత్రమున పుట్టి ఈ నామము గల నేను ఇచ్చుచున్నాను అనుచు తన శ క్తికొలది తనకును ఆ బ్రాహ్మణులకును తన పితరులకును ప్రీతికరమైనవి గోవు-భూమి-బంగారము-వస్త్రములు.మంచి పడకలు- ఏవే నను దక్షిణగా ఈయవలెను. తన శక్తికి తగినట్లు ధన లోపము చేయక దక్షిణలనీయవలేను. ఇచ్చినచో పితరులకు తృప్తి కలుగును. కనుక ఆ విధముగా చేసి పితృ దేవతలను తృప్తి పరచవలయును.

తరువాత పితృదేవతా స్థానమున భుజించిన బ్రాహ్మణుల దగ్గర స్వధావాచనికమును ('స్వదోచ్యతాం' ఇత్యాది . మంత్రమును పఠించుట) విశ్వేదేవస్థానమున భుజించిన బ్రాహ్మణుల దగ్గర ఉదక దానమును జరుపవలెను. తరువాత సంప్రదాయమును ఎరిగి కర్త తూర్పు ముఖముగ కూర్చుండి వారి నుండి ఆశీస్సుల గ్రహీంపవలెను. పితృ దేవతలు మా యందు ప్రీతికల వారగుదురు గాక !' అని క ఁ అనగా ' అగుదురు గాక !' అని ! బ్రాహ్మణులు అందురు. 'అస్మదో త్రం వర్ధ తామ్' 'మా గోత్రము వర్ధిల్లుగాక !' అని కర్త అనగా 'అట్లే అగుగాక !' అని భోక్తలు అందురు. లోగడ చెప్పినట్లు 'మాకు అడుగక యే ఇచ్చు దాతలు ఉందురుగాక !' ఇత్యాది మంత్రమును కర్త చెప్పవలెను. ' ఈ ఆశీస్సులు సత్యములు అగుగాక !' అని భోక్తలు అందురు. పిమ్మట భ క్తితో పిండములను ఎత్తి ఉంచి స్వస్తి వాచ నిక ము జరుపవలెను.  భోక్తలగు బ్రాహ్మణులు ఇంటియందు ఉన్నంతవరకును ఎంగిళ్లు తీయరాదు. తరువాత తీయవలెను. అట్లు వారు తినిన ఎంగిళ్లు తీసి పిమ్మట గృహబలిని వైశ్వదేవమును , చేయవలెను. అని ఇట్లు ధర్మ వ్యవస్థ చేయబడియున్నది.

భోక్తలు భుజించునపుడు భూమిపై పడిన ఉచ్ఛేషణము (మిగిలిన పదార్థము) శ్రాద్ధకర్త ఇంటిలో ఊడిగము చేయు వారిలో కపటము కొంటెతనము లేని సేవకులకు పితృ శేషముగా తినుటకు ఈయవలెను. అని పెద్దలు చెప్పుచున్నారు.

ఈ చెప్పిన విధముగా జరిపిన శ్రాద్ధకర్త వంశములోను బంధుమిత్రాది జనములోను పుత్తులున్న వారికిని లేని వారికిని అట్టి స్త్రీలకును (పూర్వము మరణించియున్న వారికి) అందరకును తృప్తి కలిగించును. అని పూర్వము పితృదేవతా గణము వారు వ్యవస్థ చేసియున్నారు.

ఇక ఈ శ్రాద్ధ ప్రక్రియ అంతయు ముగిసిన తరువాత భోక్తలగు బ్రాహ్మణులకు వీడ్కోలు చెప్పుట ఎట్లనిన) శాబ్దిక ర్త భోక్తలు భుజించిన ప్రదేశమున శ్రాద్ధము జరిపిన ప్రదేశమున నిలువబడి చేత ఉదక పాతమును పట్టుకొని యుండి 'వాజీ వాజే' ఈ మొదలగు మంత్రమును చెప్పుచు దగ్భకొనతో వారిని తాకుచు వారిని విసర్జించ (వీడ్కోలు చెప్ప) వలేను. వారిని ప్రదక్ష్మి ణించి వారి పాదములను స్పృశించవలేను. వారు బయలు దేరి పోవుచుండ వారివెంట కొంత దూరము పుత్ర భార్యా బంధువర్గముతోకూడ పోవలెను. తరువాత వారికొక మారు నమస్కరించి వెనుకకు మరలివచ్చి అగ్ని ని పూజించి వైశ్వదేవమును నిత్యబలిని జరుపవలెను. తరువాత పితృ శేషమును శ్రాద్ధకర్త తన సగోత్రులతో సుతులతో బాంధవులతో ఆతిథులతోపాటుగ తానును భుజించవలెను.

ఈ విధమగు శ్రాద్దము అన్ని పర్వములయందును ఈ పైని చెప్పిన వానిలో ఏ పర్వమునందై నను) జరుప వలెను. జరుపవచ్చును. దీనిని ఉపనయనము కానివాడై నను భార్య లేనివాడై నను విదేశమునందు ఉన్న వాడై నను శక్తి యున్న చో (తనశ క్తికి తగినట్లు) చేయవలెను. శూద్రుడై నను మంత్రహీనముగా ఇదే ప్రక్రియతో శ్రాద్ధము జరుపవలెను. ఇది సాధారణ శ్రాద్ధ విధానము.

తృతీయ మాభ్యుదయికం వృద్ధి శ్రాద్ధం తదుచ్యతే

ఉత్సవానన్దసమ్బారే యజ్ఞోద్వాహాదిమజ్గళే

 మాతరః ప్రథమం పూజ్యాః పితర స్తదనన్తరమ్

 తతో మాతామహా రాజ న్వి శ్వేదేవా స్తథైవచ

ప్రద క్షీణోపచా రేణ దధ్యక్షత ఫలోదకైః

 ప్రాజ్ముఖో నిర్వ పేత్పీణ్డా ఛూర్వయాచ కు నైర్యుతాక్  

సమ్పన్నమి త్యభ్యుదయే ప్రీయతా మిత్యుదీరయేత్

 యుగ్మా ద్విజాతయః పూజ్యా వస్త్రకార్తస్వరాదిభిః

 తిలార్థేతు యవైః కార్యం నాన్దీశబ్దానుపూర్వకమ్

 మజ్గళ్యా న్యపి సర్వాణి పాఠ యే ద్విజపుజ్జవాన్

 ఏవం శూద్రోపి సామాన్యం వృద్ది శ్రాద్దేపి సర్వదా

నమస్కారాది మ న్త్రేణ కుర్యాత్మ స్త్రం వినా బుధః

దానప్రదానం శూద్రస్య ఇత్యాహ భగవాన్ప్రభుః

దానేన సర్వకామాప్తి స్తస్య సజ్జాయతే యతః

  ఇతి శ్రీమత్స్య పురాణే మత్స్యమనుసంవాదే శ్రాద్దకల్పే సాధారణ శ్రాద్దాది విధిర్నామ సప్తదశోఽధ్యాయః

మూడవ నైమిత్తిక శ్రాద్దమునకు ఆధ్యుదయికము అని పేరు. దానికే వృద్ధి (శుభ) శ్రాద్దమనియు పేరు గలదు.

ఉత్సవములు మొదలగు ఆనందకరమగు కార్యములు జరుపునపుడును యజ్ఞములు వివాహములు మొదలగు శుభ కార్యముల సమయములందును ముందుగా ఈ ఆభ్యుదయిక శ్రాద్దమును జరుపవలయును.

దీనియందు మాతృపితామహీప్రపితామహ్యాది స్త్రీలను మొదట పూజించవలెను. పితృ పితామహాదులను తరువాత పూజించవలెను. తరువాత మాతామహుడు మొదలగు వారిని పిమ్మట విశ్వేదేవులను పూజించవలెను. ప్రదక్షిణ ముగా (సవ్యముగా ఆయా ఉపచారములు జరుపవలెను. (ఈ వృద్ధి శ్రాద్దమునందు అపనవ్యము చేసికొనకూడదు). పెరుగు అక్షతలు ఫలములు ఉదకము మొదలగునవి వినియోగించవలెను. (తిలలు కూడదు . తూర్పు మొగముతో పిండము లను నిర్వహణము చేయవలెను. (దక్షిణముఖము కూడదు . “సంపన్నం' అనియు ప్రీయతాం' అనియు మాత్రము చెప్ప వలెను. (స్వధా అని చెప్పరాదు), సరి సంఖ్య లోనే (బేసి సంఖ్య కూడదు !. బ్రాహ్మణులను అర్చించ (భుజింపజేయ వలెను. వస్త్రములు బంగారు మొదలగునవి వారికిచ్చుటకును కర్మానుష్టానములోను వినియోగించవలెను. వెండి పాత్రలు -దర్భలు కూడదు.) తిలలకు మారుగా యవలను ఉపయోగించుచు నాందీ శబ్దముతో ఈ కార్యమును జరుపవలెను. శుభమునకు సంబంధించిన మంత్రములను స్తోత్ర ములను పఠించి బ్రాహ్మణులకు వినిపింపవలెను. (పిత్యములగు వేద భాగములు కూడదు. ఇది ద్విజులు వృద్ధి నాందీ-శ్రాద్ధము-జరుపవలసిన విధానము. శూద్రులు కూడ పైవారివలెనే నమస్కారపూర్వక మయిన మంత్రములతోను ఇతర మంత్రములేవియు లేకుండగను ఈ వృద్ది శ్రాద్ధము జరుపవలెను. కాని శూద్రులు భోజనా దికము లేకుండ ఆయా పదార్థములను దానము చేయుటతోనే జరుపవలెనని భగవానుడు ప్రభువు అగు నారాయణుడు చెప్పెను. ఏలయన శూద్రునకు దానమాత్రముతోనే అన్ని కోరికలు ఫలించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మత్స్యమను సంవాదమున శ్రాద్దకల్పమున సాధార ణాభ్యుదయిక శ్రాద్ధ విధాన కథనమను సప్తదశాఽధ్యాయము.