35 - యయాతే ర్వనగమనమ్ - యయాతి వానప్ర్వ్రస్థవతానుష్ఠానము- అతనిస్వర్గప్రాప్తియు

శౌనకః : ఏవం స నాహుషో రాజా యయాతిః పుత్త్రమీప్సితమ్

రాజ్యేభిషిచ్య ముదితో వానప్రస్థోభవ న్మునిః

ఉషిత్వా వనవాసం స బ్రాహ్మణే స్సహ సంశితః

ఫలమూలాశ నో దాన్తో యయాతిః స్వ రితో గతః

 స గత స్సుఖవాసంచ వ్యవస నుదిత స్సుఖమ్

కాలస్య నాతీయహత శ్శ కేణ వినిపాతితః

 న్యపత తచ్యుత స్వర్గాదప్రాప్తో మేదినీతలమ్

 స్థిత ఆసీ దస్తరి జే స తదేతి శ్రుతం మయా

తత ఏవ పునశ్చాపి గత స్వర్గమితి శ్రుతిః

 రాజ్ఞా వసుమతా సార్ధ మష్ట కేనచ వీర్యవాన్

ప్రతర్దనేన శిబినా సమేత్య కిల సంసది

 శతానీకః  : కర్మణా కేన స దీవం పునః ప్రాప్తో మహీపతిః

 కథ మిశ్లేణ భగవన్పాతితో మేదినేతలే

 సర్వ మేత దశే షేణ శ్రోతు మిచ్ఛామి తత్త్వతః

 కథ్యమానం త్వయా విప్ర దేవర్షిగణసన్నిధౌ

దేవరాజసమో హ్యాపీ ద్యయాతిః పృథినీపతిః

వర్గనః కిల వంశ స్య విభావసుసమచ్యుతిః

 తస్య విస్తీర్ణవంశస్య(తస్యానికీర్ణవంశస్య) సత్యకీర్తే ర్మహాత్మనః

 చరితం శ్రోతు మిచ్ఛామి దివి చేహ చ సర్వశః

శౌనకః  : హస్త తే కథయిష్యామి యయాతే రుత్తమాం కథామ్

 దివి చేహచ పుణ్యార్థాం సర్వపాప్రమోచనీమ్

 యయాతి ర్నాహుషో రాజా పూరుం పుత్తం కనీయసమ్

 రాజ్యేభిషిద్య ముదితః ప్రవప్రాజ వనం తదా

 అన్యేషు స వినిక్షిప్య పుత్తా న్యదుపురోగమాన్

 ఫలమూలాశ నో రాజా వనే సౌ న్యవహ చ్చిరమ్

 సంశీతాత్మా జితక్రోధ సర్పయ నితృదేవతాః

 అగ్నించ విధివ జుహ్వ నాకానప్రస్థవిధానతః

 అతిథీ న్పూజయన్ని త్యం వన్యేన హవిషా విభుః

 శిలో ఇవృత్తి మాస్థాయ శేషాన్న కృతభోజనః

 పూర్ణం సహసం వరాణా మేవంవృత్తి రభూ నృపః

 అమ్బుభక్ష స మాసాం స్త్రీ నాసీన్ని యతవాజ్మనాః

 తతశ్చ వాయుభక్షోభూ త్సంవత్సర మతస్దాతః

పజ్చగ్నిమధ్యే చ తప స్తే పే సంవత్సరం పునః

 ఏకపాదస్థితో వాసీ తణ్మాసా ననిలాశనః

పుణ్యకీర్తి స్తత స్వర్గం జగామావృత్య రోదసీ 

ఇతి శ్రీమత్స్యమహాపురాణే శౌనక శతానీక సంవాదే చంద్రవంశానువర్ణనే

యయాతిచరితే పఞ్చత్రింశోధ్యాయః

శౌనకుడు శతానీకునితో ఇంకను ఇట్లు చెప్పెను: ఇట్లు యయాతి తనకు ప్రీతిపాత్రుడగు పుత్తుని పూరుని రాజపదమునం దభి షేకించి ముదితుడై వానప్రస్థుడె మునిగా నయ్యెను. అతడు వనవాసమును జరిపి అచటి బ్రాహ్మణులతో పాటుగా ఫలమూలము లాహారముగా ఇంద్రియముల నిగ్రహించి తుదకు స్వర్గమున కేగెను. అతడచట సుఖవాసమును పొంది ముదితుడై సుఖముగా నుండెను. కొంతకాలము నకు ఇంద్రు డతనిని క్రిందికి పడద్రో నేను. అతడు స్వర్గమునుండి జారిపడెను. కాని భూమికీ చేరలేదు. అప్పటిలో కొంతకాలమంత రీక్షమందే యుండి యజ్ఞ సంపత్ నందు ఉండిన వసు మాన్ అష్టకుడు ప్రతర్దనుడు శిబి అను రాజులతో కూడి అటనుండియే మరల స్వర్గమున కేగెను. అని నేను పరంపర లో వినియున్నాను.

శతానీకుడు శౌనకు నిట్లడిగేను: భగవన్! “యయాతి పృథివీ పాలకుడుగా శ్రేష్టుడు. వంశమునకు వృద్ధిని (శుభమును సంతోషమును అభివృద్ధిని కలిగించినవాడు. సూర్యుని ప్రకాశముతో అగ్ని ప్రకాశముతో సమమగు ప్రకాశము కలవాడు, వంశమును విస్తరింపజేసినవాడు. పో స్తవమును నిర్మలమున నగు కీ ర్తీగలపోడు. మహామనస్కుడు, స్వర్గమునందును దేవర్షి గణముల ప్రశంసలందుకొనుచు వారి సన్నిధియందు దేవరాజసముడై వెలుగొందెను." అందురు. గదా! అట్టి వాని నింద్రు డెట్లు ఏల స్వర్గమునుండి పడద్రో సెను? యయాతిచరితమునందలి ఈ యంశ ములన్నియు అతని ఐహిక పార లౌకిక వృత్తాంతమునందలి తత్వము నంతయు వినగోరుచున్నాను.

శౌనకుడు శతానీకున కిట్లు చెప్పెను: నాయనా! యయాతి కథ ఉత్తమ మయినది. సర్వపాపములను పోగొట్టి పుణ్యమును కలిగించునది. అతని ఐహ లౌకిక పారలౌకిక వృత్తాంతమును తాత్వికముగా వివరింతును. వినుము.

నహుష పుత్రుడగు యయాతి తన కడపటి కుమారుడగు పూరుని రాజ్యమునం దభి షేకించి ముదితుడై వనమునకు ప్రత్రాజితుడయ్యె నంటిని గదా! అంతకుముందే అతడు యదువు మొదలగు కుమారులను రాజ్యపు మేరల యందును అంతకు వెలుపలను నీలి పెను. వనమునందు ఈరాజు వానప్రస్థుడుగా ఫలమూలములు అహారముగా ఇంద్రియ నిగ్రహము క లిగి అరణ్యమునందు చాల కాలముండెను. చిత్తమును తీక్ష మొనర్చుకొని క్రోధమును జయించి పితృదేవతల తృప్తి నొందించుచు అగ్నియందు వానప్రస్థ విధానమున హోమాదికము జరుపుచుండెను. ఆ ప్రభువు వనములందు లభించు ఆహారాదిక మును దేవతలకు నివేదించిన తరువాత ఆ హవిష్యమునే అతిధులకు ఆహారముగా నిచ్చి వారి నాదరించుచుండెను. శిలవృత్తి పొలములు మొదలగుచోట్ల రాలిన ధాన్యకణముల నేరితెచ్చుట) ఉంఛవృత్తి (సేద్యపు పొలములలో రాలిన ధాన్యపు కంకులను ఏరి తెచ్చుట) అవలంబించి దేవతలకు అతిథులకు పితరులకు వినియోగించగా శేషించిన ఆహారమునే తినుచుండెను. ఇట్లారోజు వేయి నిండు సంవత్సరములు జీవితము గడ పెను. తరువాత మూడు మాసములు జలాహారుడై మనస్సును వాక్కును నియమించుకొనియుండెను. తరువాత సోమరితనము లేక సంవత్సరము పాటు వాయుభకు డయ్యెను. తరువాత సంవత్సరకాలము పంచాగ్ని మధ్యమున తప స్సాచరించేను. వాయు వాహారముగా ఆరుమాసములు ఏక పాదస్థితుడై తపస్సు చేసెను, పుణ్య కీ ర్తియగు ఆ యయాతి తన ప్రకాశ ముతో రోదసులను (ద్యుభూలోకముల నడుమ ప్రదేశమును) నింపివేయుచు స్వర్గము చేరెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను కీర్తనమున యయాతి చరితమున యయాతి వానప్రస్థ జీవితము -అతని స్వర్గప్రాప్తియను ముప్పదియైదవ యధ్యాయము.