39 - యయాత్యష్టక సంవాదము

అష్టకః : యదావస న్నన్దనే కామరూపీ సంవత్సరాణా మయుతం శతానామ్

కిం కారణం కార్తయుగప్రధాన హిత్వా చ త్వం వసుధా మన్వపద్యః

యయాతిః : జ్ఞాతి సుహృత్స్వజనో వా యథేహ క్షీణే విత్తే మానవై స్య జ్యతే హీ

 తథా చ తత్ర క్షీణపుణ్యం మనుష్యం త్యజని సద్య సేశ్వరా దేవసజ్జాః

 అష్టకః : కథం తత్ర క్షీణపుణ్యా భవ ని సంముహ్యతే తత్ర మనోతిమాత్రమ్

కిం వా విశిష్టాః కస్య ధామోపయా న్త తద్వై బ్రూహి క్షేత్రవి త్వం మతో మే

 యయాతిః : ఇమం భౌమం నరకం తే పత ని లాలవ్య మానా నర దేవ సర్వే

తే కజ్కగోమాయు బిడాశనార్థం(బలాశనార్థం) క్షితౌ వివృద్ధిం బహుధా వ్రజ ని

 తస్మా దేత ద్వర్షనీయం నరేణ దుష్టం లోకే గర్హణీయంచ కర్మ

ఆఖ్యాతం తే పార్థివ సర్వమేవ భూయ శ్చేదానీం వద తే కిం వదామి

 అష్టకః : యథాతు తా న్వితుద నే వయాంసి తథా గృద్దా శితికజ్జాః పతజ్ఞాః

 కథం భవ ని కథం మా భవ ని న భౌమ మన్యం నరకం శృణోమి

 యయాతిః : ఊర్ధ్వం దేహా త్కర్మణా జృమ్భమాణా ద్వ్య క్తం పృథివ్యా మనుసచరని

ఇమం భౌమం నరకం తే పత ని నా వేక్ష త్తే వర్షపూగా ననేకాన్

 షష్టిం సహస్రాణి పత ని వ్యోమ్ని తథా శీతిం పరిసంవత్సరాణి

 తానై తుద నే పతతః ప్రపాతం భీమా భూమౌ రాక్షసా స్తీష్ణదంష్ట్రాః

 అష్టకః : యదేతాం స్తే సమ్పతన స్తుద ని భీమాకారా రాక్షసా స్తీష్ణదంష్ట్రాః

కథం భవ ని కథం మా భవ ని కథమ్భూతా గర్భభూతా భవ

 యయాతిః : అసృ గ్రేతః పుష్పఫలానుపృక్త మన్వేతి సద్యః పురు షేణ సృష్టమ్

 తథై తస్య రజ ఆపద్యతే వై గర్భభూత స్సము వైతి తత్ర

 వనస్పతీం శ్చోషధీన్వై విశ ని హ్యపో వాయుం పృథివీం చా నరిక్షమ్

చతుష్పదం ద్విపదం చాపి సర్వ మేవంభూతా గర్భభూతా భవంతి 

అష్ట కుడు: “కృతయుగపు వారిలో ప్రధానుడవగు యయాతీ: నీవు నందనవనమున కామరూపుడవయి నూరు పదివేల సంవత్సరములున్న తరువాత దానిని విడిచి భూలోకమునకు చేరుకొంటివిగదా! కారణమేమి?” యయాతి: “ఈ లోకములో మానవునకు ధనము క్షీణించిన తరువాత అతనిని అతని జ్ఞాతులును మీతులును స్వజనులును విడిచి పెట్టుదురు గదా! అట్లే ఆలోక ములందు లోక పాలురును దేవ సంఘములును మనుష్యుని పుణ్యము నశించగానే అతనిని వదలి వేయుదురు.” అష్టకుడు: “మానవులచట క్షీణపుణ్యు లేట్లగుదురు? ఈ విషయమున నా కేమియు తెలియుటలేదు. ఏ విష యమున ఎంత విశిష్టులు (ఇచట పడిన తరువాత మరల ఏలోకమును చేరుదురు? ఇది యంతయు నాకు చెప్పుము. నీవు క్షేత్ర తత్వమును (దేహము-దేహధారికి కలుగు ధర్మాధర్మఫలములు మొదలగునవి) ఎరిగినవాడవను విశ్వా సముతో అడుగుచున్నాను." యయాతి: “స్వర్గమునుండి ఈ భూలోకమును చేరుకొనిన జీవులు ఈ భౌమ భూలోక సంబంధి) నరకమున పడుదురు. వారందరును రాజా! (తమకు కలిగిన ఈ స్థితికై) విలపింతురు. భూలోకమున పడి వారు అనేక విధముల ప్రాణులుగా వృద్ధి పొంది రాబందులు నక్కలు పిల్లులు మొదలగు ప్రాణులకు ఆహారమగుదురు. కావున మానవుడు ఈ లోకములో దుష్టమును నింద నీయమును నగు కర్మమును చేయక విడువవలయును. నీవడిగిన దంతయును చెప్పితిని. ఇపుడిం కేమి చెప్పవలయును?" ఆప్షకుడు: “పాపకర్ములగు వారిని గ్రద్దలు నెమళ్ళు మొదలగు పక్షులు ఎట్లు బాధించును? ఈ నరక బాధలలో ఈ జీవులు ఎట్లు ఉందురు? ఎట్లు ఉండరు? భౌమమగు నరక మును గురించి ఇంకను వినగోరుచున్నాను.” యయాతి: “ఈ దేహము కర్మను అనుసరించి రూపొందుచుండును. ఎవరు చేసిన కర్మమునకు తగిన శరీరమును వారు పొందుదురు.) దేహమును విడిచిన తరువాత వారు దానిని బట్టియే పృథివి యందును ఆయా దేహములను ధరించి సంచరింతురు. స్వర్ణమునుండి పడినవారును అట్లే ఈ భౌమ నరకమున వారు పడుదురు. అనేక సంవత్సరములపాటు మరల వెనుకకు తిరిగి చూడనే న లేకుందురు. పుణ్యలోకములనుండి భ్రష్టులైన వారు క్రిందికి పడుచు ఆరువదివేలఎనుబదిసంవత్సరములపాటు అంతరిక్షమునందే యుందురు. వారిని ఆ కాలములో వాడి కోరలుగల భయంకర రాక్షసులు పీడించుచుందురు.” అష్ట కుడు: “ఇట్లు ఆ భయంకర రాక్షసుల పీడలు అనుభవించిన తరువాత ఈ జీవులు ఏఏ విధముల ఉందురు: ఎట్లుండరు? ఏయే స్థితుల పొంది ఈ జీవులు గర్బముగా రూపొందుదురు?” యయాతి: “(కొందరు జీవులు మానవులగుదురు. వారి విషయము.) పురుషుడు వదలిన రేతస్సు స్త్రీకి చెందిన పుష్ప ఫలముతో (రజోర క్తముతో కలిసి స్త్రీ రక్తమున ప్రవేశించును. ఇట్లు జీవుడు మానవ రజస్సును చేరును. పిమ్మట అచ్చట గర్భముగా అగును. మరికొన్ని జీవులు వనస్పతులను ఓషధులను వాయువును నీటిని పృథివిని అంతరిక్షమును చతుష్పాత్రాణులను ద్విపాత్రాణులను-దీనిలో వేటినై నను ప్రవేశించును.”

అష్టకః : అన్య ద్వపు ర్విదధాతీహ గర్భ ముతాహౌస్వి త్కేన కామేన యాతి

 ఆపద్యమానో నరయోని మేతా మాచక్ష్వ మే సంశయం పృచ్చత స్వమ్

 శరీర భేదాదిసముచ్ఛ్రయాంశ్చ చక్షుశ్రోత్రో లభతే కేన సంజ్ఞామ్

 ఏత త్వం న స్సర్వ మాచక్వ వృష్టః క్షేత్రజ్ఞం త్వాం తాత మున్యామ సర్వే

 యయాతిః : వాయు స్సముత్కర్షతి గర్భయోని మృతో రేతః పుష్పఫలానుపృక్తమ్

 స తత్ర తన్మాత్రకృతాధికారః క్రమేణ సంవర్ధయతీహ గర్భమ్

 స జాయమానో విగృహీతగాత్ర స్సంజ్ఞా మధిష్టాయ తతో మనుష్యః

స శ్రోత్రాభ్యాం వేదయతీహ శబ్దం సర్వం రూపం పశ్యతి చక్షుషా తు

 ఘ్రాణేన గన్ధం జిహ్వయాథో రసంచ త్వచా స్పర్శం మనసా వేద భావమ్

ఇత్యష్ట కేహోవచితం హి విద్ది మహాత్మనః ప్రాణభృత శ్శరీరే

 అష్టకః : య సంస్థితః పురుషో దహ్య తేవా నిఖన్యతే వాపి నిఘృష్యతే చ

అభావభూత స్స వినాశ మేత్య కథ మాత్మానం చేతయతే పరస్తాత్

 యయాతిః : హిత్వా స్కోసూ ను ప్రవ న్నిష్టనిత్వా పురోధాయ సుకృతం

దుష్కృతం చ

అన్యాం యోనిం పుణ్య పాపానుసారం హిత్వా దేహం విశ తే రాజసింహ

 పుణ్యాం యోనిం పుణ్యకృతో విశని పాపాం యోనిం పాపకృతో వ్రజ నీ

 కీటాః పతఙాశ్చ భవ ని పాపా న మే వివక్షా స్తి మహానుభావ

 చతుష్పదా ద్విపదా షట్పదాశ్చ తథాభూతా గర్భభూతా భవ స్తి

ఆఖ్యాత మేత న్ని ఖిలేన సర్వం భూయస్తు కిం సృచ్ఛసి రాజసింహ

 అష్టకః : కింస్వి తృత్వా లభతే తాత లోకా న్మ ర్య శ్శేప్లాం స్తపసా విద్యయాచ

 త న్మే పృష్ట శృంస సర్వం యథావ చ్ఛుభా శ్లోకా న్యేన గచ్ఛే త్రమేణ

 యయాతిః : తపశ్చ దానం చ శ మో గమశ్చ హీ రార్జవం సర్వభూతానుకమ్పా

స్వర్గ స్య లోకస్య వదన్తి సన్తో ద్వారాణి సప్తవ మహా స్త్రీ పుంసామ్

నశ్య స్తి మానేన తమోభిభూ తాః పుంస స్సదై వేతి వద నీ సన్తః

అధ్యమానః పద్గీతం మన్యమానో యో-విద్యయా హల్లి యశః పర స్య

 తస్యా నవ నసు భవ ని లోకా న చాస్య తద్బహ్మ ఫలం దదాతి

చత్వారి కర్మాణ్యభయంకరాణి భయం ప్రయచ్ఛ న్యయథాకృతానీ

 మానాగ్ని హోత్ర ముత మానమౌనం మానే నాధీత ముత మానయజ్ఞః

న మానమా న్యో ముద మాదదీత న సత్తాపం ప్రాప్నుయా చ్చావమానాత్

 స న స్తతః పూజయ స్త్రీహ లో కే నాసాధవ స్సాధుబుద్ధిం లభనే

 ఇతి దద్యా మితి యజ ఇత్యధీయ ఇతి వ్రతమ్

ఇత్యేతాని భయా న్యాహు స్తాని వర్జ్యాని నిత్యశః

 యే చాశ్రయం మానయనే పురాణం మనీషిణే మానస మార్గరుద్దమ్

త న్నిః శ్రేయ స్తైజసం రూప మేత్య పరాం శాంతిం ప్రాప్నుయు ఽప్రేత్య చేహ

 ఇతి శ్రీ మత్స్యమహా పురాణే శౌనక శతానీక సంవాదే చంద్రవంశానువర్ణ నే యయాతిచరితే ఏకోనచత్వారింశోధ్యాయః

అష్టకుడు: “మానవ లోకమునందలి ఆ యా శరీరములను జీవులు పొందుటలో వారు తమ సంకల్పము ననుసరించి తాము కోరిన శరీరమును పొందుదురా? లేక మరిఏదై న హేతువు వారిని గర్భముగా గర్భస్థ శిశువుగా) రూపొందించునా? సాకుగల ఈ సంశయమును తెలియగోరుచున్నాను. చెప్పుము. ఏ హేతువుచే హెచ్చు తగ్గులుగల వివిధ శరీర ములను వానియందలి చక్షుః స్రోత్రాందీంద్రియ భేదములను సంజ్ఞా అనుభూతి) భేదమును పొందగలుగుదురు? నేను ప్రశ్నించిన ఈ విషయములన్నియు చెప్పుము. ఏలయన నీవు క్షేత్ర శరీర సృష్టి) తత్వమును ఎరిగినవాడవని మేమందరము (అష్టక సోదరులు) అనుకొనుచున్నాము.” యయాతి: “ఋతుకాలమునందు రేతస్సుతో రజస్సుతో సంపర్కము చెందిన గర్బయోనిని గర్భము నిలిచియుండెడి ఉదర కోశమును) వాయువు లాగిపట్టి యుంచును. ఆ వాయువు ఆ గర్భకోశమునందు పంచ తన్మాత్రలకు తాను ఆశ్రయమైయుండి గర్భమును వృద్ధి పొందించును. అనంతరము జీవుడు వ్య క్తత పొందుచు అవయవములు స్పష్టములగుచురాగా అనుభవ జ్ఞానమును పొందుచు వచ్చును. క్రమముగ శోత్రముతో శబ్దమును చుస్సుతో రూపమును ఘాణముతో గంధమును జీహతో రసమును త్వక్కుతో స్పర్శమును మనస్సుతో భావమును తెలిసికొనును. అష్ట కా! ఈ జీవ లోకములో దేహియొక్క (మానవుల దేహవృద్ధి క్రమము ఈ విధముగ నుండును. అనీ ఎరుగుము.” అష్టకుడు: “మరణించిన మానవుడు దహింపబడీ కానీ హితీ వేయ బడి కాని ప్రాణులచే తినబడి కాని అభావమును పొంది నశించునుక దా! అతడు మరల తనుతాను చేతన పదార్థముగా ఎట్లు రూపొందించుకొనును?” యయాతి: “గాఢనిద్ర పోవువాడు గుర్రు పెట్టినట్లు మానవుడు మూలిగి ప్రాణములను విడుచును. అనగా ఈ దేహమును విడుచును. అతని సుకృత దుష్కృతములు మాత్రమతనికీ ముందు ఉండి అతనిని తమవేంటగోని పోవును. తరువాత మరల నతడు తన పుణ్యపాపముల ననుసరించి లభించిన మరియొక (మాతృ పితృ గర్భమును ప్రవేశించును. మహానుభావా! పుణ్యమును చేసినవారు పుణ్యమానిని జన్మమును) పాపము చేసినవారు పాప జన్మమును పొందురురు. అతి పాపులు కీటక ములుగా పక్షులుగా అగుదురు. వాటిని వివరించి చెప్పుశ క్తి నాకు లేదు. ఆయా భూతములు గర్భభూతులై గర్భమునందలి శిశువులుగానై) మరికొందరు నాలుగు పాదములు - రెండు పాదములు-ఆరుపాదములు-కల పాణి విశేషములుగా నగుదురు. నీవడిగిన ఈ విషయమంతయు ఏమియు వదలక చేప్పితిని. మరింకేమి యడుగుదువు?” అష్టకుడు: 'తండ్రీ! మర్త్యుడు ఏమి చేసినచో తపస్సును చేసియో-విద్యను ఆర్జించియో- శ్రేష్టములగు లోకమును పొందును? క్రమక్రమముగా ఉత్తరోత్తరము మేలగు లోకములను ఏ యుపాయముచే పొందవచ్చును? నేనడిగిన ఈ ప్రశ్నకు సమాధానము ఉన్నదున్నట్లు చెప్పుము.” యయాతి: “తపస్సు దానము శమము ( అంతఃకరణ నిగ్రహము) దమము (బహిరింద్రియ నిగ్రహము) సిగ్గు బిడియము ఋజు వంకరలేని) స్వభావము సర్వభూతములయందును దయ ఈ ఏడును మానవులకు స్వర్గలోకమునకు పోవు ద్వారములని వివేకులు చెప్పుదురు. మానవులు ఎల్లప్పుడును దురభిమానముచే అజ్ఞానము క్రమ్మగా నశింతురని పెద్దలు చెప్పుదురు. ఎవరు తాను విద్యలను అధ్యయనము చేసి తాను పండితుడయ్యేనని అహంకారపడుచు తన విద్యచే ఇతరుల కీర్తిని నశింపజేయునో అట్టివాని లోకములు (వాడు సుకృతము చేసి పుణ్య లోకములను సాధించుకొన్నను) అంతవంతములు ముగిసినవి నశించినవి) అగును. అంతేకాదు. అతడు అధ్యయనము చేసిన వేదము కూడ అతనికి ఫలము నీయదు. మానవునకు భయమును పోగొట్టి ఊ తమ లోకములకు కొనిపోవు కర్మ ములు నాలుగును .అగ్నిహోత్రము.మౌనము తపస్సు) అధ్యయనము-యజ్ఞము. చేయవలసినట్లు చేయనిచో అధమలోక ప్రాప్తి భయమును కలిగించును. అవి 1. మనాగ్ని హోత్రము 2. మానతపస్సు 3. మానాధ్యయనము 4. మానయజ్ఞము అను నవి ఇతరులు ఆదరించగా హరమునందక అవమానించిరని సంతాపపడకయుండు వానిని సత్ జనులు ఈ లోకమందును పైలోకమందును పూజింతురు. కాని అసాధుజనులు సాధు బుద్ధిని పొందుట దుర్ఘటము. (అది స్వాభావికముగ కలుగ వలెను.) ఈ ప్రయోజనమున కై దానము చేయు చున్నాను. ఇందుల కే యజ్ఞము దేవతారాధనము) చేయుచున్నాను. ఇందుల కై అధ్యయనము చేయుచున్నాను. ఇందులకై వ్రతములను (వైదిక సార్మ కర్మలను) అనుష్ఠించుచున్నాను. అని చేయు ఈ పనులన్నియు భయమును కలిగించునవి. కావున వాటిని ఎల్లప్పుడును అన్ని విధముల తప్పక విడువ వలయును. ఎవరు తత్వము నెరిగినవారై పురాణము (అతి ప్రాచీనము శాశ్వతము) అగు ఆశ్రయమును పరమాత్ముని తమ చిత్తవృత్తియందు స్థిరముగ నిలిపి ఆదరింతురో వారు తే జసమగు స్వయంప్రకాశమగు) రూపమును పొంది నిః శేయసమును ఇహమునను పరమునను పరమశాలతిని పొందుదురు.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశాను కీర్తనమున యయాతి చరితమున  యయాత్యష్టక సంవాదమను ముప్పది తొమ్మిదవ యధ్యాయము.