మత్స్య మహా పురాణము
6 - కశ్యప సంతతి
సూతః : కశ్యపస్య ప్రవక్ష్యామి పత్నీ భ్యః పుత్త్రపౌత్త్రకమ్ ।
అదితిశ్చ దితిశ్చైవ అరిష్టా సురసా దనుః॥
సురభి ర్వినతా తద్వ తామా క్రోధవశా ఇళా ।
కద్రూ ర్విశ్వా ముని స్తద్వ త్తాసాం పుత్తా న్ని బోధత॥
తుషితా నామ యే దేవా శ్చా కుషస్యా న్తరే మనోః ।
వైవస్వతే న రే చైతే ఆదిత్యా ద్వాదశ స్మృతాః॥
ఇంద్రో ధాతా భగ స్వష్టా మిత్రోథ వరుణో యమః ।
వివస్వా నవితా పూషా అంశుమా న్విష్ణు రేవచ॥
ఏతే సహస్రకిరణా ఆదిత్యా ద్వాదశ స్మృతాః ।
మారీచా త్కశ్యపా త్ర్పాప్తా పుత్రా నదితి రుత్త మాక్॥
కృశాశ్వస్య ఋ షేః పుత్తా దేవప్రహరణా స్సృతాః ।
ఏతే దేవగణా విప్రాః ప్రతిమన్వన రాదిషు॥
ఉత్పద్యనే ప్రలియ నే కల్పేకల్పేపి తేచ హి ।
దితిః పుత్రద్వయం లేభే కశ్యపాదితి నశ్ర్శుతమ్॥
హిరణ్యకశిపు శ్చైవ హిరణ్యాక్షస్త థైవచ ।
హిరణ్యకశిపో సర్వ జ్ఞాతం పుత్తచతుష్టయమ్॥
ప్రహ్లాదశ్చ్యా నుహ్లాద సంహోదో హోదఏవచ ।
ప్రహ్లాదపు ఆయుష్మా నిర్రేబి ర్బాహుల ఏవచ॥
విరోచన శ్చతుర్థశ్చ స బలిం పుత్తమా ప్తవాక్ ।
బలేః పుత్తశతం త్వాసీ ద్బాణో జ్యేష్ట స్తతో ద్విజాః॥
ధృతరాష్ట్ర స్తథా సూర్య చన్ద దుర్యోధనాదయః ।
నికుమ్బనాభై గుర్వక్షః కుమ్బీ షీబో విభీషణః॥
ఏతే సుతా స్సుబహవో బాణో జ్యేష్ణో గుణాధికః ।
బాణ స్సహస్రబాహుశ్చ సర్వా గుణసంయుతః॥
తపసా తోషితో యస్య పురే వసతి శూలభృత్ ।
మహాకాలత్వ మగమ త్స మోభూచ్చ పినాకినః॥
హిరణ్యాక్షస్య పుత్తాంభూ దుర్దుర శ్శకుని స్తథా ।
భూతసస్తాపన శ్చైవ మహానాభ స్తథైవ చ॥
ఏతేభ్యః పుత్రపౌత్రాణాం కోటయ స్సప్తసప్తతిః ।
మహాబలా మహాకాయా నానారూపా మహౌజసః॥
సూతుడు ఋషులతో ఇంకను ఇట్లు చెప్పెను. మరీచి పుత్రుడగు కశ్యపునిపత్ను లనుండి కలిగిన పుత్ర పౌత్రాది సంతతిని ప్రవచింతును. అదితి.దితి-అరిష్ట-సురస-దనుపు-సురభి.వినత. తామ-క్రోధవశ - ఇళకద్రువ-విశ్వ-ముని అను పదుముగ్గురును కశ్యపుని పత్నులు. వీరి సంతతిని తెలి పెదను. చాతుష మన్వంతరమున తుషితులు అను దేవతలు వైవస్వతమన్వంతరమున అదితికి కుమారులై ఆదిత్యు లనబడుదురు. ఇంద్రుడు ధాత.త్వష్ట -మిత్రుడు-వరుణుడు-యముడు. వివస్వాన్-సవిత-పూష-అంశుమాన్-విష్ణువు-అను పండ్రెండు మంది సూర్యులే వీరు.
కృశాశ్వుడను ఋషికి పుత్రులు దేవగణములు దేవ విప్రులు. వీరు ప్రతి మన్వంతరారంభములందును జన్మించుచు కల్ప కల్పమునందును పుట్టుచు లయించుచుందురు.
కశ్యపునకు దితియందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులను ఇద్దరు కుమారులు కలిగిరి. హిరణ్యకశిపునకు ప్రహ్లాదా నుహ్లాద సుహ్లాద హోదులను నలుగురు కుమారులు. ప్రహ్లాదుని కొడుకులు ఆయుష్మాన్ శిబి బాహులుడు విరోచనుడు అను వారు. విరోచనుని కుమారుడు బలి. బలి కుమారులు నూరుమంది. వారిలో పెద్దవాడు బాణుడు. అతడు మంచిగుణములు కలవాడు. వేయి భుజములు కలవాడు. ధృతరాష్ట్రుడు సూర్యుడు, చంద్రుడు దుర్యోధనుడు నికుంభుడు నాభుడు గుర్వక్షుడు కుంభి షీ బుడు విభీషణుడు మొదలగువారు అనేకులు అతని తమ్ములు. అతడు అన్ని అస్త్రములను ఎరిగిన వాడు. తపస్సు చే శివుని మెప్పించి అతడు తన పురమునందు వసించునట్లు వరము పొందెను. బాణుడు మహాకాలత్వమును పొంది శివునితో సము డయ్యెను.
హిరణ్యాక్షునకు దుర్దరుడు శకుని భూత సంతాపనుడు మహానాభుడు అను వారు కుమారులు. వీరి పుత్ర పౌత్రాది సంతతి డెబ్బది ఏడు కోట్లమంది. వీరందరు మహాకాయులు మహాబలులు నానా రూపములు ధరించగలవారు. మహా శక్తి సంపన్నులు.
దనుః పుత్త్రశతం లేభే కశ్యపా ద్బలదర్పితమ్ ।
విప్రచిత్తిః ప్రధానోభూ దేషాం మధ్యే మహాబలః॥
ద్విమూర్ధా శకుని శ్చైవ తథా శమ్బరత స్తథా ।
మరీచి ర్మథన శ్చైవ ఇరో గర్గతర స్తథా॥
విద్రావణశ్చ ఫేనశ్చ కేతువీర్య శ్శతహ్రదః ।
ఇన్దజి త్సత్యజిచ్చైవ వజ్రనాభ స్తథా మయః॥
ఏకవక్షో మహాబాహు రజాక్ష స్తారక స్తథా ।
అసిలోమా విలోమా చ రిపు ర్భాజో మహాసుర ॥
స్వర్భాను ర్వృషపర్వా చ ఏవమాద్యా దనో సుతాః ।
స్వర్భానో స్సుప్రజా కన్యా శచీ చైవ పులోమజా॥
ఉపధా చ మయస్యాపి తథా మన్జోదరీ కుహూః ।
శర్మిష్ఠా సున్దరీ చైవ చన్హా చ వృషపర్వణః॥
పులోమా కాలకా చైవ వైశ్వానరసుతే హితే ।
బహ్వపత్యే మహాసత్వే మారీచస్య పరిగ్ర హే॥
తయో షష్టిసహస్రాణి దానవానా మభూ త్సదా ।
పౌలోమా నాల కేయాంశ్చ మారీచోజనయ త్పునః॥
అవధ్యా యే నరాణాం వై హిరణ్యపుర వాసినః ।
చతుర్ముఖా ల్లబ్దవరా నిహతా విజయేన తే॥
విప్రచిత్తి స్సింహికాయాం సైంహికేయ మజ్జనత్ ।
హిరణ్యకశిపో ర్యే వై భాగినేయా స్త్రయోదశ॥
వత్స శ్శల్యశ్చ రాజేందో బలో వాతాపి రేవచ ।
ఇల్వలో నముచి శ్చైవ ససర్టోశ్వాన్షన స్తథా॥
నరకః కాలనాభశ్చ సరమాభ స్తథైవ చ ।
అల్పవీర్యశ్చ వీణ్యాతా చనువంశస్య వర్ధనాః॥
సంహ్లాదస్య తు దైత్యస్య నివాతకవఛా సుతాః ।
అదాక్షా స్సర్వదేవానాం గన్దర్వోరగరక్షసామ్॥
యే హతా బల మాశ్రిత్య అర్జునేన రణాజిరే ।
షట్కన్యా జనయామాస తామ్ర నామాని మే శృణు॥
శుకీ శ్యేనీ చ భాసీ చ సుగ్రీవా గృద్ధికా శుచిః ।
శుకీ శుకా నులూకాంశ్చ జనయామాస ధర్మత॥
శ్యేనం శ్యేనీ తథా భానీ కురరాన వ్యజ్జనత్ ।
గృద్రో గృద్ధా న్కపోతాంశ్చ పారావతవిహజమా॥
హంససారసకారణ్డప్లవా న్ఛుచి రజీజనత్ ।
అజాంశ్చ మేషోష్ట్రఖరా నుగ్రీవా చావ్యజీజనత్॥
దనుపు అను కశ్యపుని పత్ని యందు బలదర్పితులగు నూరుమంది కుమారులు కలిగిరి. మహాబల సంపన్నుడగు విప్రచి త్తి వీరిలో ముఖ్యుడు. ఇంకను ద్విమూర్ధ శకుని శంబరుడు మరీచి-మథనుడు ఇరుడు గర్గత రుడు విద్రావణుడు ఫేనుడు కేతువీర్యుడు శత ప్రదుడు ఇంద్రజిత్ సత్యజిత్ వజ్రనాభుడు మయుడు ఏకవకుడు మహాబాహుడు అజాముడు తారకుడు అసిలోముడు విలోముడు రిపుడు బాణుడు స్వర్భానుడు వృషపర్వుడు మొదలగు వారు దనుపుత్తులు. స్వర్భాను నకు సుప్రజా-పులో మునకు శచీ-మయునకు ఉపధా-మండోదరీ.కుహూ అనువారు. వృషపర్వునకు శర్మిష్ణ-సుందరి-చంద్ర అనువారు. పులోమ. కాలక అను ఇద్దరును వైశ్వానరునికి కుమార్తెలు. వీరు ఇరువురును హితకరులు గొప్ప బలము కల వారు బహు సంతానము కలవారును; వీరు మారీచుడు అను మునికి పత్నులైరి వీరివలన మారీచునకు పౌలోములు కాల కేయులు అను రాక్షసగణము జనించెను. వీరు నరుల చేత చావకుండ బ్రహ్మవలన వరము పొందిరి. హిరణ్యపురము వారి నివాసము. వారు అర్జునుని చేతిలో మరణించిరి. ఏ పచి త్తికి సింహిక యందు సైంహికేయుడు కోడు కయ్యెను. హిరణ్యకశిపునకు మేనల్లుండగు వత్సుడు శల్యుడు రాజేంద్రుడు బలుడు వాతాపి ఇల్వలుడు నముచి ససర్టుడు అశ్వాంజనుడు నరకుడు కాలనాభుడు పరమాభుడు అల్పవీర్యుడు అను పదుముగ్గురును దనువంశములోనివారే. వీరు దేవ గంధర్వోరగ రాక్షసులకు లొంగనివారు. వీరును బలశాలియగు అర్జునుని చేతిలో రణరంగమున మరణించిరి.
తామ్ర అనునామేకు శుకి - శ్యేని-భాసీ-సుగ్రీవా-గృధికా-శుచి-అను ఆరుగురు కుమార్తెలు. శుకి-చిలుక లను గ్రుడ్ల గూబలను శ్యేని-డేగలను భాసి కురర పక్షులను గృధీ గ్రద్దలను పావురములను పావురపుజాతి పక్షులను కనెను. శుచి హంసలను బేగ్గురులను నీరు కోడులను నీరు కాకులను కనెను. సుగ్రీవ ఆను ఆమె మేకలను గొట్టెలను ఒ0 టెలను గాడిద లను కనెను. ఇది తామ్ర సంతానము.
ఏష తామ్రాన్వయః ప్రోక్తో వినతాయా నిబోధత ।
గరుడః పఠతాం నాథ అరుణశ్చ పతత్రిణామ్॥
సౌదామినీ తథా కన్యా యేయం నభసి విశ్రుతా ।
సమ్పాతీశ్చ జటాయుశ్చ అరుణస్య సుతా వుభౌ॥
సమ్పాతిపుత్త్రా బహ్వశ్వ శ్శీఘగ శ్చాతివిశ్రుతః ।
జటాయుః కర్ణికారశ్చ శీఘ్రగామీ చ విశ్రుత ॥
సార సో రజ్జుపాలశ్చ అరుణశ్చాపి తత్సుతః ।
తేషా మనన్త మభవ త్పణాం పుత్తపౌత్రకమ్॥
సురసాయా స్సహసం తు సర్పాణా మభవ త్పురా ।
సహస్రశిరసాం కదూ స్సహస్రం నృప సువత॥
ప్రధానా స్తేషు విఖ్యాతా షడ్వింశతి రరిస్ధమాః ।
శేష వాసుకి కార్కోట శంఖైరావత కమ్బళాః॥
ధనశ్లోయ మహానీల పద్మావతర తక్షకోః ।
ఏలాపుత్రో మహాపద్మ ధృతరాష్ట్ర వలాహకాకి॥
శబ్ధపాల మహాశబ్ద పుష్పదంష్ట్ర శుభాననాః ।
శజరోమా చ నహుషో వామనః పాణిని స్తథా॥
కపిలో దుర్ముఖో వాపి పతంజలి రీతి స్మృతాః ।
ఏషా మన న మభవ త్సరాణాం పుత్రపౌత్రకమ్॥
ప్రాయశో య త్పురా దగ్గం జనమేజయమన్దిరే ।
రక్షోగణం క్రోధవశా సా త్వమాన మజ్జనత్॥
దంష్ట్రాణాం నియుతం తేషాం భీమః క్షయ మనీనయత్ ।
రుద్రాణాం చ గణం తద్వ దోమహిష్యో వరాజు నాః॥
సురభి ర్జనయామాస కశ్యపా నృపతేః పురా ।
ముని ర్మునీనాం మహతాం గణ మప్సరసాం తథా॥
తథా కిన్నరగశర్వా నరిష్టాజసయద్బహూక్ ।
తృణవృక్షలతాగుల్మ మీరా సర్వ మజ్జనత్ ॥
విశ్వా తు యక్షర క్షాంసి జనయామాన కోటీశ ।
ఏతే కశ్యపదాయాదా శ్శతశోథ సహస్రశః॥
ఏష మన్వన్తరే రాజ నర్గ స్స్వారోచి షే స్మృతః ।
తత స్వేకోనప్చశ న్మరుతః కశ్యపోదితేః॥
జనయామాస ధర్మజ్ఞా నర్వా నమలవల్లభాన్॥
ఇతి శ్రీమత్స్య మహా పురాణే మత్స్యమనుసంవాదే మత్స్యప్రోక్త కశ్యపస న్తతికథనం నామ షష్ఠోధ్యాయః॥
ఇక వినత సంతానమును వినుడు. పక్షులకు నాథులగు అరుణుడు (సూర్యుని రథమునకు సారథియగు అనూరుడు గరుడుడును ఆకాశమున కనబడుచు ప్రసిద్ధురాలగు సౌదామిని ( మెఱపు) అను కన్యయు కలిగిరి. అరుణు సకు సంపాతి జటాయువులు సుపొతికి బహశ్వుడు అతి ప్రసిద్దుడగు శీఘ్రగుడు జటాయువు కర్ణికారుడు వి శ్రుతుడగు శీఘ్రగామీ సారసుడు రజుపాలుడు అరుణుడు అను వారు కుమారులు. ఈ పక్షులకు అనంతమగు పుత్రపౌత్రాది సంతో నము కలిగేను.
సురస అను కశ్యప భార్యకు వేయేసి శిరసులు కల వేయి సర్పములు సంతానమయ్యెను.
కద్రువకు వేయి సర్పములు కలిగెను. వారిలో ఇరువది ఆరు మంది ప్రసిద్ధులు; వారు : శేషుడు వాసుకి కర్కో టుడు శంఖుడు ఐరావతుడు కంబళుడు ధనంజయుడు మహానీలుడు పద్ముడు అవతరుడు. తక్షకుడు ఏలాపుతుడు మహా పద్ముడు ధృతరాష్ట్రుడు వలాహకుడు శంఖపాలుడు మహాశంఖుడు పుష్పదంష్ట్రుడు శుభాననుడు శంఖరోముడు నహుషుడు వామనుడు పాణిని కపిలుడు దుర్ముఖుడు పతంజలి అనువారు. వీరి పుత్ర పౌత్రాది సంతతి అనంతముగా ఆయ్యెను. వీరిలో చాలమంది జనమేజయుని గృహమున దగ్దులేరి.
క్రోధవశ అనునా మేకు అపరిమిత సంఖ్యగల. వక్షసులు జన్మించిరి. వారు అందరు కోరలు గలవారు. వారిలో లక్షమందిని భీముడు చంపెను.
సురభి అను కశ్యప పత్నికి రుదులగణమును గోవులు గేదేలును కలిగెను.
ముని అనునా మెకు మహాముని గణమును అప్పదోగ ణమును కలిగేను.
అరిష్టకు కిన్నరులు గంధర్వులు అనేకులు గలిగిరి.
ఇర అను ఆమెకు తృణజాతులు వృక్షములు లతలు గుల్మములు (గుబురు పొదలు మొదలగునవి) సంతాన మయ్యెను.
విశ్వకు కోట్లకొలది యక్షరాక్షసులు కలిగిరి.
ఇట్లు కశ్యపునకు నూర్ల-వేల-లక్షల కోట్లకొలది సంతతి కలిగేను. ఇది స్వారోచిష మన్వంతరమునందలి సృష్టి క్రమము. అనంతరము దితికి కశ్యపుని వలన నలువది తొమ్మిది మంది మరుత్తులను కుమారులు కలిగిరి. వారందరును ధర్మము ననుసరించి నడచువారును దేవతలకు ఇష్టులు నైరి .
ఇది శ్రీమత్స్యమహాపురాణమున కశ్యప సంతతి అను షష్ఠాధ్యాయము.
Summary of chapter 6 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the expansive progeny of the great progenitor Maharshi Kaśyapa and his wives, who were the daughters of Daksha Prajāpati. From Aditi, Maharshi Kaśyapa begot the twelve Ādityas, including Indra, Dhātā, Bhaga, Tvashṭā, Mitra, Varuṇa, Aryamā, Vivasvān, and Bhagavān Vishṇu Himself in His Vāmana manifestation, who represent divine light, law, and cosmic order. From Diti were born the powerful Daityas, including Hiraṇyāksha and Hiraṇyakashipu, whose immense strength frequently challenged the Devas. From Danu descended the ninety-nine Dānavas led by Viprachitti, renowned for their mastery over illusions and warfare. The chapter documents how Maharshi Kaśyapa's other wives gave birth to various categories of living beings, where Kadrū brought forth the Nāgas, Vinatā bore Garuḍa and Aruṇa, Surabhi produced cows and quadrupeds, Krodhavashā birthed carnivorous creatures, and Muni generated the celestial Apsaras, illustrating the unified divine origin of all creation.