48 - తుర్వసుడు మొదలగువారి వంశము

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పనారంభించెను. యయాతి పుత్రుడగు తుర్వసునకు గర్గుడు అతనికి గోభానుడు అతనికి ధీరుడు అపరాజితుడునగు త్రిశరి అతనికి అనంతుడు అతనికి పూరు వంశీయుడగు అకల్మషుడైన దుష్యన్లుడును కుమారులయిరి. (అనంతుడు పూరు వంశీయుడగు దుష్యంతునే తన కుమారునిగా స్వీకరించేను.) ఇట్లు జరా సంక్రమణము హేతువుగా యయాతి శాపము పాలైన తుర్వసు వంశము పూరు వంశములో కలిసిపోయెను.

ఈ దుష్యంతునకు వరూథుడు అతనికి ఆంగీరుడు అతనికి నలుగురు పాండ్యుడు కేరళుడు చోళుడు ఫల్గుడు అనువారును కుమారులయిరి. వీరి పాలిత జనపదములు పాండ్య కేరళ చోళములు చాల సమృద్ధితో నుండినవి.

యయాతికి ఇంకొక కుమారుడగు ద్రుహ్యునకు శూరుడు బభువు నేతువు ఆనువారు కుమారులు. సేతునకు భద్రుడు అతనికి గాంధారుడు కుమారులు. ఈ గాంధారుని పేరనే గాంధార దేశము ప్రసిద్దమయినది. ఆదేశపు గుర్రములు చాల మేలయినవి. అతనికి ధర్ముడు అతనికి మృతుడు అతనికి విద్రుముడు ఆతనికి ప్రచేతుడు కుమారులయిరి. ప్రచేతునకు నూరుమంది కుమారులు కలిగిరి. వారందరును ఉత్తర దిశ యందలి రాజ్యములకు పాలకులయిరి.

యయాతికి మరియొక కుమారుడగు ఆనువునకు పరమ కీ ర్తిమంతులు వీరులునగు సభానరుడు చాక్షుషుడు పర మేష్టి ఆను ముగ్గురు కుమారులు. సభానరునకు విద్వాంసుడగు కోలాహలుడు అతనికి ధర్మాత్ముడగు సంజయుడు అతనికి వీరుడగు పురంజయుడు అతనికి మహారాజగు జనమేజయుడు ఆరాజర్షికి మహాశాలుడు కుమారులయిరి. అతడు మహాకీర్తిశాలియు ఇంద్రునితో సమానుడును. అతనికి ధార్మికుడగు మహామనస్కుడు కుమారుడు. అతడు సప్తద్వీపాధి పతియగు చక్రవర్తి. అతనికి ధర్మజులగు ఉశీనరుడు తితిక్షుడు అనువారు పుత్రులు.

ఉశీనరస్య పత్న్యస్తు పఞ్చ రాజర్షిసమ్భవాః

భృశా నరా కృశీ దర్శా యాచ దేవీ దృషద్వతీ

ఉశీనరా త్సుతా స్తాసు జజ్జిరేచ కులోద్వహాః

తపసో నేచ మహతో జాతా వృద్ధస్య ధార్మికాః

భృశాయాంచ భృశః పుతో నరాలో నర ఏవచ

కృశ్యాః కృశిస్తు దర్శాయా స్సువ్రతో నామ విశ్రుతః

దృషద్వత్యా స్సుతశ్చాపి శిబి రౌశీనరో నృపః

శిబేస్తు శిబయః పుత్తా శ్చత్వారో లోక విశ్రుతాః

పృథుదర్భశ్చ సౌవీరః కేక యో భద్రక స్తథా

తేషాం జనపదా సీతాః కేకయా భద్రకా స్తథా

సౌవీరా శ్చైవ పౌరాశ్చ భృశస్య కేకయా స్తథా

సౌవీరస్య సుతో ఒమ్బష్ణః కృశేస్తు కృశ శా సుతాః

నరస్య నర రాష్ట్రస్తు తితిక్షా స్తనయాన్ఛృణు

తితిక్షు రభవ ద్రాజా పూర్వస్యాం దిశి విశ్రుతః

వృషద్రథ స్సుత స్తస్య తస్య ఫేనోభవత్సుతః(సేనో)

ఫేనస్య (సేనస్య) సుతపా జట్లే సుతప స్తనయో బలిః

జాతో మనుష్యయోన్యాం తు క్షీణే వంశ ప్రజేచ్చయా

మహాయోగీతు స బలి ర్బర్టో యో విష్ణునా పురా

పుత్తా నుత్పాదయామాస క్షేత్రజా నఆ పార్థివాక్

అజ్ఞం సజ్జునయామాస వజ్రం సుహ్మకమేవచ

పుణ్ణం కలిఱంచ తథా బాలేయం క్షముచ్యతే

బాలేయా బ్రాహ్మణా శ్చైవ తస్య వంశకరాః ప్రభో

బలయే బ్రహ్మణా దతో వరః ప్రీతేన ధీమతే

మహాయోగిత్వ మాయుశ్చ కల్పస్య పరిమాణకమ్

సంగ్రామే చాప్య జేయత్వం ధర్మే మతి మనుత్తమామ్

త్రైలోక్యదర్శనం చైవ ప్రాధాన్యం ప్రసవే తదా

జయంవా(చా) ప్రతిమం యుద్ధే ధర్మే తత్త్వార్థదర్శనమ్

చతురో నియతా న్వర్ణా న వై స్థాపయితా ప్రభుః

తేషాం వంశధరాః పఞ్చ అజ్గవజ్గా స్ససుహ్మకాః

పుణ్డ్రాః కశిజ్గశ్చ తథా అజ్ఞస్య చ నిబోధత

  రాజర్షి సుతలగు భృశ-నరకృశి-దర్శ-దృషద్వతి.అను ఐదుమంది ఉశీ నరుని భార్యలు. అతడు చాలకాలము చేసిన మహా తపఃఫలముగా అతనికి వార్ధకమున ఆ ఐదుగురియందు వరుసగా భృశుడు నరుడు కృశిసువ్రతుడు - శిబి అను ఐదుమంది కుమారులు కలిగిరి.

వీరిలో శిబికి శిబులు అను పేరున లోక విశ్రుతులగు పృథుదర్భుడు సౌవీరుడు కేకయుడు భద్రకుడు అను నలుగురు కుమారులు. వీరి పాలిత జనపదములు సర్వసమృద్ధములగు. కేకయ-భద్రక . సౌవీర -పౌర-జనపదములు. వీరిలో భృతుని కుమారులు కేకయులని ప్రసిద్ధులయిరి. సౌవీరుని కుమారుడు అంబష్ణుడు. కృశికుమారులు కృశశులు. నరుని కుమారుడు నరరాష్ట్రుడు. తితికుడు తూరుపున రాజయ్యెను. అతనికి పృషద్రధుడు అతనికి ఫేనుడు అతనికి సుతపుడు అతనికి బలియనువారు కుమారులయిరి. (సుతపుడు దైత్యుడగు బలిని తన కుమారునిగా స్వీకరించెను.) ఇతడు మహాయోగి. పూర్వము విష్ణునిచే బంధింపబడిన బలియే ఇతడు. మనుష్యుడుగా అయిన బలి మానవ జాతియందలి తన వంశము నశించునట్లున్న సమయమున క్షేత్రజులనుగా మానుషియగు తన భార్యయందు ఐదుమంది క్షత్రియ కుమారుల నుత్పాదించెను. వారు అంగుడు వంగుడు సుహ్ముడు పుండుడు కళింగుడు అనువారు. వీరు బలి సంతతిలోని క్షత్రియులు. వీరు కాక బలి సంతతివారు కొందరు బ్రాహ్మణులుగానై విప్ర వంశములను నిలిపి వృద్ధి చేసిరి. ఈ అంగుడు మొదలగు ఐదుమంది వంశములందు జన్మించి వారి వంశముల నిలిపిన వారికి అంగులు వంగులు సుహ్ములు పుండ్రులు కళింగులు అని పేరు. (వీరి జనపదములకును ఇదియే - పేరు.) -

పూర్వము బలి విషయమున బ్రహ్మ ప్రీతుడై అతనికి వరముల నొసగేను. వానిచే అతడు మహాయోగిత్వమున కల్పపరిమాణపు ఆయువును యుద్ధమున ఓటమి లేకుండుటయు ధర్మమునందు అత్యుత్తమ స్థిర బుద్ధియు త్రిలోకము లందలి సర్వవిషయముల చూచుట తన జాతి వారిలో ప్రధానుడగుట యుద్ధమున సాటిలేని గెలుపు ధర్మతత్త్వార్థమును దర్శించుట నాలుగు వర్ణముల వారిని వారివారి నియమములందు నిలుపుట అను యోగ్యతలను సంపాదించెను.

దీర్ఘతమస ఉత్పత్త్యాదికథనమ్.

ఋషయః: కథం బలే స్సుతాః పశ్చి జాతా స్తస్య మహాత్మనః

కింనామ్నీ మహిషీ తస్య జనితా కతమో మునిః

కథం చోత్పాదితా స్తేన తన్నః ప్రబ్రూహి పృచ్ఛతామ్

మాహాత్మ్యంచ ప్రభావంచ నిఖిలేన వదస్వ నః

సూతః: ఉచథ్యోజ్గిరసః పుత్రః ఖ్యాత ఆసీ దృషిః పురా

పత్నీవై మమతా నామ బభూ వాస్య మహాత్మనః

ఉచథ్యస్య యవీయాన్వై భ్రాతృపత్నీ మహిమయత్

తస్య చాసీ దవర జః పురోధా యో దీనౌక సామ్

బృహస్పతి ర్ర్బహ్మ తేజా మమతా మేత్య కామతః

ఉవాచ మమతా తం తు దేవరం వరవర్ణినీ

అనర్వత్న్యస్మి తే భ్రాతు ర్ణ్యేష్ట స్య చ విరమ్యతామ్

అయం తు మే మహాగర్భః కు ప్యే త్తవ బృహస్పతే

ఔచధ్యో భ్రాతృజన్య స్తే షడజం వేద ముద్గరః

అమోఘరేతా స్వం చాసి న మాం యభితు మర్ఘ సి

అస్మి న్నేవం గతే కాలే యథా వా మన్య సే భవాన్

ఏవ ముక్త సయా సమ్య గ్ర్బహ్మతేజా బృహస్పతిః

కామాత్మనో మహాత్మాపి న స కామ మహరయత్

సమ్బభూవాథ ధర్మాత్మా తయా సార్ధ మకామయా

ఉత్సృజ నం తు తవ్రేతో గర్భస్థ స్సోభ్యభాషత

భో తాత కష్ట మేతద్ది ద్వయో ర్నా స్త్రీహ సంస్థితి

అమోఘరేతా స్వంచాపి పూర్వం చాహ మిహాగతః

 శ శాప తం తతః క్రుద్ద ఏవ ముక్తో బృహస్పతిః

పుత్తం జ్యేష్ఠస్య వై భాతు ర్గర్భస్థం కామవా నృషిః

యస్మా త్వ మీదృశే కాలే సర్వభూతహితే స్థితే

మా మేవ ముక్తవాం స్తస్మా త్తమో దీర్ఘం ప్రవేక్ష్యతి

తతో దీర్ఘతమా నామ శాపా దృషి రజాయత

ఉత్పన్నో యో బృహత్కీర్తి ర్బృహస్పతి రివాపరః

ఊర్ధ్వరేతా స్తత సోథ వసన్వై భ్రాతు రాశ్రమే

గోధర్మాన్ సౌరభేయాంస్తు ఋష భాత్ శ్రుతవాంస్తు సః

తస్య భాతా పితుర్యోపై చకార భరణం తదా

తస్మి న్ని వసత స్తస్య యదృచ్ఛాగత్యగోవృషః

యజ్ఞార్థ మాహృతం బర్షి శ్చఖాద సురభీసుతః

జగ్రాహ తం దీర్ఘతమా శ్శృజ స్తం చతుష్పదమ్

తేనాసౌ నిగృహీతస్తు న చచాల పదాత్పదమ్

తతో ఒబ్రవీ ద్వృష స్తం వై ము ఇ్చ మాం బలినాం వర

న మయాసాదిత స్త్వోదృక్ బలవాంశ్చ వనే క్వచిత్

భవతో త్ర సమం వాపి న హి మే బల మక్షయమ్

ముఞ్చ తాతేతి చ పునః ప్రీత స్తేహం వరం వృణు

ఏవ ముక్తోబ్రవీ దేవం జీవక్ స త్వం క్వ యాస్యసి

ఏష త్వాం న విమోక్ష్యామి పున స్వాహ చతుష్పదః

ఋషభః: నాస్మాకం విద్యతే తాత పాతకం స్త్యమేవ వా

భక్ష్యాభక్ష్యం తథాచైవ పేయా పేయం తథైవచ

ద్విపదాం బహవో హ్యేతే ధర్మా నైతే గవాం స్మృతాః

కార్యాకార్యం న వై చిత్ర్యం గమ్యాగమ్యం తథైవ చ

సూత: గవాం ధర్మం స వై శ్రుత్వా సమ్రా స్తస్తు విసర్జితః

భక్త్యాన్న పానదానాత్తు గోపతిం తం ప్రసాదయత్

ఋషులు సూతుని ఇట్లు ప్రశ్నించిరి: “మహాత్ముడగు బలికి మానుషి అగు భార్యయందు ఐదుగురు కుమారులు ఎట్లు కలిగిరి? అతని భార్య (ఆగు మనుష్యశ్రీ) ఎవరు? వారిని ఆమెయందు కనిన ముని ఎవరు? ఎట్లు వారిని అతడు జన్మింపజే నెను? ఆ ముని మాహాత్మ్య ప్రభావములు ఎట్టివి? ఇది అంతయు మాకు తెలుపుము.”

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను: పూర్వము అంగిరోముని కుమారుడు ఉచ. (త) భ్యుడను ప్రసిద్దుడగు ఋషి ఉండెను. ఈ మహాత్ముని భార్య పేరు మమత. ఇతని తమ్ముడును . దేవగురువును బ్రహ్మ తేజస్సంపన్నుడును అగు బృహస్పతి ఒకమారు తన వదినెను. ఈ మమతను-కామించెను. ఆమె ఇట్లనెను: “నేను నీకు వదినేను. గర్భవతిని. నా గర్భమునందున్న నీయన్న కుమారుడు షడంగ వేదవేత్త. ఇట్టి ఈ మహాగర్భము నీ పై కోపించును. నీవును అమోఘ వీర్యుడవు. కనుక నీవు నన్ను కూడుట మంచిపనికాదు. కనుక తగని ఈ ప్రయత్నము మానుకొనుట మంచిది. . ఈ సమయమునకు తగిన విషయము ఇది. నీవు ఏమనుకొనినను సరియే.”

బృహస్పతి బ్రహ్మతేజస్సంపన్నుడే మహాత్ముడే కాని అతడు తన కామమును . నిగ్రహించుకొనలేక పోయేను. అందుచే అతడు ధర్మాత్ముడై యుండియు కామము లేని తన వదినెను కూడెను. సంయోగక్రమములో బృహస్పతి తన శుక్రమును మమతా గర్భమునందు విడుచు సమయమున ఆమె గర్భమునందున్న శిశువు ఇట్లు పలికెను: “ “తండ్రీ! నీవు చేయుచున్న ఈ పనీ చాల నీచమయినది. ఇచ్చటనో ఇద్దరు ఉండుటకు అవకాశములేదు. నీ రేతస్సును వ్యర్థముకానిది, (అదియు సఫలమై శిశువు ఆగును.) కాని నేను ముందుగా ఇచటకు వచ్చి ఉన్నాను.” ఈ శిశువు - ఇట్లనగా, బృహస్పతి క్రుద్దుడయి అతనిని శపించెను. ఆ. శిశువు తన అన్న గారి కుమారుడు. గర్భమునందున్న పసికందు. బృహస్పతి తానును - ఋషి. ఐనను కాముకుడు. “ఇటువంటి సమయమున నన్ను వారించితివి కావున నీవు దీర్ఘ మగు తమస్సును (అంధత్వమును) ప్రవేశింతువు.'' అని అతడు ఆతనిని శపించెను.

తరువాత మమతకు శిశువు జనించెను. అతడు రెండవ బృహస్పతి వంటివాడు. మహాకీర్తి సంపన్నుడగు ఋషి -అయ్యెను. కాని ఈ శాపముచే అతడు దీర్ఘతముడు అనబడెను. అతడు ఊర్ధ్వరేతస్కుడు (బ్రహ్మచర్య ధర్మమున ఇంద్రియమును నిగ్రహించుకొనిన వాడు.)

అతడు తన తండ్రి) సోదరుని ఆశ్రమమునందు నివసించుచు ఒకమారు - సురభి (కామధేనువు) వంశము వారికి సంబంధించిన గోధర్మములను ఒకానొక ఋషభము వలన వినెను. ఎట్లనగా--

ఈ దీర్ఘతముడు తన తండ్రికి సోదరుని పోషణలో అతని ఆశ్రమమున నివసించుచుండెను. ఒకనాడు దాని లోనికి దైవవశమున ఒక వృషభము వచ్చెను. యజ్ఞమున కై తెచ్చి ఉంచిన దర్భలను ఆది తినెను. దీర్ఘతముడు దాని కొమ్ములు బిగించి పట్టుకొనెను. అది కదలలేక పోయెను. “తండ్రీ! నన్ను విడువుము. నీవు బలశాలుర లో గట్టివాడవు. ఈ వనమున నీవంటి బలశాలి నాకు మరెవ్వరును కనబడలేదు. నా అక్షయ బలమును . నీ బలముతో సమానముకాదు. నీ బలమునకు నేను ప్రీతుడనై తిని. నన్ను విడువుము. నీకు వరముల నిత్తును.” అనీ అది మునితోననెను. “నీవు ప్రాణము లతో నన్ను తప్పించుకొని పోలేవు. నేను నిన్ను విడువను. (నీవు మాదర్భలను తీంటివి.)” అని ముని వృషభముతో ననేను. అంత వృషభము “నాయనా! మాకు ఇది దొంగతనము. ఇది చేయుట పాతకము. అనునది లేదు. ఇది భక్ష్యము - ఇది అభక్ష్యము. ఇది పేయము.ఇది ' ఆ పేయము (త్రాగదగినది త్రాగరానిది) అను నియమము మాకు లేదు. ఇవి అన్నియు మానవులకు మాత్రమే. ఇది చేయతగినది. ఇది చేయతగనిది. వీరిని కూడవచ్చును. వీరిని కూడరాదు. అను వ్యవస్థ కూడ మానవుల కే కాని మాకు లేదు.” అనెను.

దీర్ఘతముడు ఈ గోధర్మములను విని తడబాటు చెంది ఆ వృషభమును విడిచెను. దానికి భ క్తి పూర్వకముగా ఆన్న పానములనిచ్చి దానిని ఆనుగ్రహింపజేసికొనెను.

ప్రసాదితే గతే తస్మి నోధర్మాన్ భ క్తిత శ్శ్రుతాన్ మన సైవ సమాదధ్యే తన్నిష్ణ స్తత్పరాయణః

తతో యవీయసః పత్నీం గౌతమస్యాభ్యపద్యత

తస్యావలేపం మత్వా తు సోనత్వానివ న క్షమే

గోధర్మంతు పరం మత్వా స్నుషాం తా మభ్యపద్యత

నిర్భర్య తాం తథా మూర్ధ్నా బాహుభ్యాం సమ్ర్పగృహ్యచ

భావ్య మర్థం తు తం జ్ఞాత్వా మహాత్మా తా మువాచ హ

విపర్యయం తు తం బుద్ధ్వా మాహాత్మ్యా తమువాచ సా

విపర్యయం తు త్వం లబ్ద్వి అనడ్వ న్న నివర్త సే

గమ్యాగమ్యం న జానీ షే గోధర్మా త్పార్థయ న్నుపామ్

దుర్వృత్తత్వా త్యజామ్యద్య గచ్ఛవానేన కర్మణా

యస్మా త్వమంథో వృద్ధశ్చ భర్తవ్యో దుర నుష్ఠితః

కాష్ఠే సముద్గేఅ ప్రక్షిప్య గజామ్బసి సముత్సృజత్

త మూహ్యమానం వేగేన ప్రోతసోభ్యాశ మాగతః

అట్లు వృషభము అనుగ్రహముతో వెళ్ళిన తరువాత దీర్ఘతముడు - తాను గోవృషభమునుండి భక్తితో వినిన గోథర్మములను తనకు పరమార్థముగా ముఖ్యాశ్రయముగా భావించి వానినే ధ్యానింపసాగెను. అతని తమ్ముని పేరు గౌతముడు. అతని భార్యను ఈ దీర్ఘతముడు కలియగోరెను. ఆమే తనకు కోడలివంటిది. ఐనను అతడు గోధర్మములను జేష్టములనుగా తలచి ఆట్లు సంకల్పింనేను-(ఆమె అంగీకరించలేదు.) అది ఆమె గర్వము అని తలచెను. అతడది సహించ లేక పోయెను. అతడామెను బెదరించేను. ఆమె తలను తన బాహువులతో అదిమిపట్టెను. అతడు మహాత్ముడయ్యు జరుగవలసినది ఇట్లు ఉన్నదని నిశ్చయించి తన కోరిక ఆమెతో పలికెను: అతడు మహాత్ముడని ఆమెకు తెలియును. కాని అతడు విపర్యయమునకు సిద్ధపడినాడు. (మానవుడయియుండి పశు ధర్మమునకు పాల్పడుట - విపర్యయము-విరుద్ద ధర్మము.) ఆది చూచి ఆమె ఆతనితో ఇట్లు పలికెను: “నీవు విపర్యయమునకు పూనితివి. ఎద్దువలె ప్రవర్తించుచున్నావు. ఎవరిని కలియవచ్చునో ఎవరిని కలియరాదో ఎరుగకున్నావు. వృషభ ధర్మము నవలంబించి కోడలిని పొందగోరు చున్నావు. నీ నడువడి మంచిదికాదు. నీవు గ్రుడ్డివాడవు. వృద్దుడవు. నిన్ను మేము పోషించుచు కాపాడవలసిన మాట నిజమే. ఐనను నీ ప్రవర్తనము మంచిదికాదు. కావున నిన్ను విడుచుచున్నాము. ఇది నీ . ఈ కర్మమునకు ఫలితము; పొమ్ము." అని పలికి ఆమె అతనిని కొయ్య పెట్టెలో ఉంచి కట్టివేసి గంగా జలములో విడిచెను.

బలిభార్యాయాం దీర్ఘతమస స్సంతానోత్పత్తికి.

జగ్రాహ తం స ధర్మాత్మా బలి ర్వైరోచని స్తథా

ఆన్తఃపురే జుగో వైనం భక్ష్యభోజ్యైశ్చ తర్పయ

ప్రీతశ్చైనం వరేణాథ చ్చస్థయామాస వై బలిమ్

తస్మాచ్చ స వరం వవే పుత్రార్థ మసురోత్తమః

సంతానార్థం మహాభాగ భార్యాయాం మమ మానద

పుత్తా నర్మార్థతత్వజ్ఞా నుత్పాదయితు మర్హసి

ఏవ ముక్త స్స దేవర్షి స్తథా స్వీ త్యు క్షవా న్ర్పభుః

తత స్స రాజా స్వాం భార్యాం సుదేష్ణాం నామ ప్రాహిణోత్

అర్థం వృద్దం చ తం జ్ఞాత్వా న సా దేవీ జగామ హ

శూద్రీం ధాత్రేయికాం తస్మా అన్గాయ ప్రాహిణే త్తదా

తస్వాం కక్ష్మీవదాదీంశ్చ శూద్రయోన్యా మృషి ర్వశీ

జనయామాస ధర్మాత్మా శూదా నిత్యేవమాదికా

ఉవాచ తం బలీ రాజా దృష్ట్వా కక్ష్మీవదాదికాక్

అధీతా నృషిధర్మజ్ఞా నీశ్వరా స్ర్బహ్మ వాదినః

శుద్దా ప్రత్యక్షధర్మాణ శ్శుచిమద్బుద్దిసంయుతాక్

మమేవమితి హోవాచ తం దీర్ఘతమసం బలిఽ

నేత్యువాచ తత స్తం వై మమైవ మితి చాబ్రవీత్

ఉత్పన్నా శ్శూద్రయోనౌ తు న తే క్షేత్రేఒసురోత్తమ

అన్దం వృద్దం చ మాం జ్ఞాత్వా సుదేష్ణా మహిషీ తవ

ప్రాహిణో దవమానాన్మే శూద్రాం ధాత్రేయి కాం నృప

దీర్ఘతముడట్లు గంగా ప్రవాహమున కొట్టుకొనిపోవుచుండెను. ఆ. సమీపమునకు వచ్చియుండిన విరోచన పుత్రుడు ధర్మాత్ముడుగు బలి అది చూచి అతనిని తీసికొనెను. అతడతనిని భక్ష్య భోజ్యములతో తృప్తినందించుచు తన అంతఃపురమునందు దాచెను. దీర్ఘతముడు ప్రీతుడై బలిని వరము కోరుకొమ్మనెను. ఆ అసురోత్తముడు పుత్రులు కావలెనని కోరెను. పూజ్యమునీ! నావంశము (మానవులలో) కొనసాగునట్లు నాభార్యయందు ధర్మార్థ త త్వజ్ఞులగు కుమారు లను మీరు జన్మింపజేయవలయునని వేడెను. ఆ దేవర్షి సరేయనెను. తన భార్యలలో సుదేష్ణ యనునా మెను మునికడకు పొమ్మ నేను. ఆరాణి అతడు అంధుడును వృద్దుడును అనీ ఎరిగి ఆతనికడకు పోవక తన దాది కూతురగు శూద్రస్త్రీని పం పెను. చిత్త నిగ్రహముకల ధర్మాత్ముడు ఆ దీర్ఘతముడు ఆమెయందు క షీ వాన్ మొదలగు శూద్రులను జనింపజేసెను. వారందరును జాతిచే శూద్రులు. ఐనను వారందరును అధ్యయనము చేసినవారు. ఋషిత్వము నందినవారు. ఈశ్వరత్వము కలవారు. బ్రహ్మ వాదులు (వేద వేదాంగ వేదాంత తత్త్వము , నెరిగినవారు.) (శారీరకముగను. చిత్తమునను). శుద్దులు. ధర్మమును సాక్షాత్కరించుకొనినవారు. శుచియగు బుద్ధికలవారు. ఇట్టి వీరిని చూచి బలి ‘వీరు నా కుమారులే అగుదురా?” అని దీర్ఘతము నడుగగా ‘కాదు. నా కుమారులు.’ అని అతడనెను. ‘వీరు నావలన శూద్రయోనియందు జనించినారు. నీ భార్యయందు కలిగినవారు కారు.’ అని జరిగినదంతయు రాజునకు ముని చెప్పెను.

తతః ప్రసాదయామాస బలి స్త మృషిసత్తమమ్

బలి సుదేష్ణాం తాం దేవీం భర్త్సయామాన దానవః

పునశ్చైనా మలజృత్య ఋషయే ప్రత్యపాదయత్

తాం స దీర్ఘతమా దేవీ మలజృతవతీం తదా

దధ్నా లవణమి శ్రేణ అభ్యక్తం మధు కేన చ

లిహ మా మజుగుప్సనీ, త్వాషాడతలమ స్తకమ్ 

తత స్వం ప్రాప్స్య సే దేవి పుత్థాన్వై మన సేప్సితాక్

తస్య సా తద్వచో దేవీ సర్వం కృతవతి తదా (థా)

తస్య సాపాన మాసాద్య దేవీ పర్యహర త్తదా

తా మువాచ తత సోథ య తే పరిహృతం శుభే

విన్నాపానం కుమారం తు జనయిష్యసి పూర్వజమ్

సుదేష్ణా: నారసి త్వం మహాభాగ పుత్తం మే దాతు మీదృశమ్

తోషితస్తు యథాశక్తి ప్రసాదం కురు మే ప్రభో

దీర్ఘతమాః: తపోపచారా ద్దేవ్యేష నాన్యథా భవితా శుభే

దేవ్యపానం వినా జాతః పుత్ర స్తే దాస్యతే ఫలమ్

తస్యాపానం వినాచైవ యోగ్యో భావీ భవిష్యతి

తస్యా దీర్ఘతమాజేషు కుక్షౌ స్పృ ష్వేద మబ్రవీత్

ప్రాశితం దధి యదగ్రే మమాజస్థం శుచిస్మి తే

తేన తే పూరితో గర్భః పౌర్ణమాస్యామివోడురాట్

భవిష్య ని కుమారా స్తే ఇ్చ దేవసుతోపమా

తేజస్వినః పరాక్రాస్తా యజ్వానో ధార్మి కాశ్చ తే

సూతః: అజ్ఞా దజ్ఞ సుదేష్ణాయా జ్యేష్ఠపుతో వ్యజాయత

వజ స్తథా కలిజస్తు పుణస్సుహ్మ స్తథైవచ

అఙాదయస్తు పక్ష్చైతే బలేః పుత్తాస్తు క్షేత్రజాః

ఇత్యేతే దీర్ఘతమసా సుతా దత్తా స్తథా బలేః

ప్రతిష్టా మాగతా స్తస్య బ్రాహ్మణ్యం కారణం యతః

తతో మానుషన్యాం స జనయామాస వై ప్రజాః

తరువాత బలి మరల ఆఋషి సత్తముని అనుగ్రహింపజేసికొని తన భార్యను చీవాట్లు వేసెను. ఆమెను అలంకరింపజేసి ఋషికి అప్పగించేను. నీవు నా శరీరమునందంతటను పెరుగు ఉప్పు ఇప్పతేనె పూసి అసహ్యపడక శరీరమంతయు నాకవలయును. అపుడు నీకు మనస్సునకు ఇష్టులగు కుమారులు కలుగుదురు. అని ముని సుదేష్ణతో పలికెను. ఆమె అంతయు ఆట్టే చేసెను. కాని అపానప్రదేశమును నాకక విడిచెను. ఇందువలన నీకు. జ్యేష్టుడు అపానము, లేని కుమారుడు కలుగునని మునియనేను. “మహాభాగా! నిన్ను వేడుచున్నాను. నాకట్టి కుమారు నీయవలదు. నాయథాశక్తి నీమన సృప్తి కలిగించితిని. అనుగ్రహించుము.” అని రాణి వేడగా నీవు మంచిదానవే. కాని ఈ అపచారము వలన ఇది ఇట్లే జరుగును. అపానము లేనివాడయినను ఆ కలిగెడి, పుత్తుడు యోగ్యుడే అగును.” అని ముని , ఆమె కుక్షిని తన చేతితో స్పృశించి మరల ఇట్లు పలికెను: “శుచియగు చిరునవ్వు కలదానా! నీవు మొదట నా ఆంగమంచలి పెరుగు తింటివి. కావున నీ గర్భము నందు అది పూర్ణిమాతిథియందలి చంద్రుడువలె నిండి నది. దాని ఫలితముగా నీకు దేవ కుమారులవంటి కుమారు లై డుగురు జనింతురు. వారు తేజోవంతులు.పరాక్రమవంతులు యజ్ఞములు చేయు వారు ధార్మికులు నగుదురు.”

పిమ్మట సుదేష్ణ అంగము (గర్భము)నుండి జ్యేష్ఠుడుగా అంగుడును వంగ కలింగ పుండ్ర సుహ్ములను మరి నలుగురును ఐదుగురు బలి దైత్యునకు మానవియగు *భార్యకు క్షేత్రజులుగా కుమారులు కలిగిరి. దీర్ఘతముడు బలికి ఇచ్చిన వీరందరును అతని బ్రాహ్మణ్య ప్రభావమున లోకమున ప్రతిష్ఠ నార్జించి గొప్పవారయిరి. ఇట్లు బలి తాను దైత్యుడయ్యు మానవ స్త్రీయందు సంతానమును కనెను.

(*భర్త ఉండగా ఆతని అనుమతితో. కాని భర్త మరణించిన తరువాత నై నను అతని కుటుంబపు, పెద్దల అనుమతితో కాని అతని భార్యయందు పరునివలన జనించిన కుమారులు క్షేత్రజులు.)

తతస్తు దీర్ఘతమసం సురభి ర్వాక్య మబ్రవీత్

విచార్య యస్మా ద్గోధర్మం తే ప్రమాణీకృతం ప్రభో

భక్త్యా ప్రపద్య యోఒస్మాకం తేన పీతాస్మి తేనఘ

తస్మాత్తుభ్యం తమో దీర్ఘ మాఘాయాపనయా మ్యహమ్  

బార్హస్పత్యం తు విధివ తాప్మీ య తిష్ఠతి త్వయి

జరాం మృత్యుం తమ శ్చైవ మాఘాయాపను దామి తే

సద్య స్వాఘాతమాత్రే తు"హృతే' తమసి వై మునేః

ఆయుష్మా న్వపుషా చైవ చతుష్మాంశ్చ తతోభవత్

 గవా హృతే తమసి వై గోతమస్తు తతోభవత్

 కజీవానపి గత్వాసౌ సహ పిత్రా గిరివ్రజమ్

 దృష్ట్వా పితు సమీ పేవై ఉపాతిష్ట చ్చిరం తపః

 తతః కాలేన మహతా తపసా భావితస్తు సః

విధూయ(చాత్మనః కాయం)శూద్రాం తు తనుం బ్రాహ్మణ్యం ప్రాప్తవాన్పడుః

 తతోబ్రవీ త్పితా తం వై పుత్తవా నస్మ్యహం త్వయా

సత్పు శ్రేణతు ధర్మజ్ఞ కృతార్థాహం యశస్వినా

 ముక్త్వాత్మాన మసా వేవ ప్రాప్తవా స్ర్బహ్మణః ఓయమ్

బ్రాహ్మణ్యం ప్రాప్య కడీవా నహ స మసృజ త్సుతాన్

 కూశ్మాణా గౌతమా స్తే వై సుతాః కక్షీవత సృతాః

 ఇత్యేష దీర్ఘతమసో బలే ర్వైరోచనస్య చ

 సమాగమో వః కథిత స్సన్తతి శోభయో స్తథా

 బలి స్తా నభివాద్యాథ పఇ్చ పుత్తా నకల్మషాక్

కృతార్థ స్సోపి ధర్మాత్మా యోగమాయావృత స్వయమ్

అదృశ్య స్సర్వభూతానాం కాలా పేక్షీ సవై ప్రభుః

తరువాత సురభి (కామధేనువు) దీర్ఘతమునితో ఇట్లు పలికెను: “ప్రభూ! నీవు గోధర్మమును ఉత్తమముగా భావించి దానిని ప్రమాణముగా తీసికొంటివి. నీవు మాయందు ప్రప త్తి పూర్వకమగు భక్తి చూపితివి. అందుచే నేను నీయందు ప్రీతి చెందితిని. నేను నీన్ను ఆఘ్రాణించి నీయందు బృహస్పతి శాపము చేతను అతని రేతఃసంసర్గ పాపము చేతను సంక్రమించిన దోషమును జరామృత్యువులను దీర్ఘమగు తమస్సును దృష్టియందలి దోషమును). తోలగింతును.” ఇట్లు పలికి సురభి దీర్ఘతముని ఆఘ్రాణించి ముక్కుతో పీల్చి వేసి అతని యందలి ఈ దోషములన్నియు లాగి వే నెను. దానితో అతడు ఆయుష్మంతుడు వపుష్మంతుడు (సుందర శరీరుడు) చక్షుష్మంతుడు - (చూడగలవాడు) అయ్యెను. గోవుచే ఆతని 'తమస్సు' హరింపబడినందున అతనికి "గో-తముడు” అను ప్రసిద్ది వచ్చెను.

తరువాత ‘కక్షీవాన్' తన తండ్రి (దీర్ఘతముని)తో కూడ గిరివ్రజమునకు పోయి అచ్చటనేయుండి చిరకాలము తపము నొనరించెను. అనంతరము అతిదీర్ఘకాలమునకు ఆతడు తపస్సుచే భావితుడై (సంస్కారమునంది). శూద్ర (సంస్కారముకల) శరీరమును విడిచి బ్రాహ్మణ్యమును పొందెను. అంతట తండ్రి దీర్ఘతము డతనితో “నాయనా! నేను నీచే పుత్రవంతుడనై తిని. నీవు సత్పుత్తడవు. ధర్మజ్ఞుడవు. కీర్తిమంతుడవు. నీచే నేను కృతార్థుడనయితిని, నీవు ఈనీవుగా (ఈ దేహము కలవాడుగా) ఉండియే దేహమును (దేహమందలి సంస్కారములను విడిచి బ్రహ్మయొక్క స్థానమును (బ్రాహ్మణ స్థానమును బ్రాహ్మణత్వమును) పొందితివి.” అనెను.

కక్షీవాన్ ఇట్లు బ్రాహ్మణత్వమును పొందిన తరువాత అతనికి వేయిమంది కుమారులు కలిగిరి. వారికి కూశ్మాండులు గౌతములు అని నామము.

ఇట్లు మీకు దీర్ఘతమునికిని విరోచన సుతుడగు బలికిని సమాగమము కలుగుటయు ఇరువురి సంతానమును తెలిపితిని.

అనంతరము బలి అకల్మషులగు అంగుడు మొదలగు ఐదుమంది కుమారులను అభివాదము చేసి కృతార్ధుడయ్యెను. ఆ ధర్మాత్ముడు తాను యోగమాయచే కప్పువడి ఏ భూతములకును కనబడనివాడయి రానున్న కాలమును ఎదురు చూచుచు ఉండెను.

తత్రాజ్గస్య తు దాయాదో రాజేసీ ద్దధివాహనః

దధివాహనపుత్త్రస్తు రాజా దధిరథ స్మృతః

 ఆసీ ద్ధధిరథాపత్యం విద్వా న్జర్మరధో నృపః

 సహి ధర్మరథ శ్ర్శీమాం స్తేన విష్ణుపదే గిరౌ

 సోమ శ్శ కేణ వై రాజ్ఞా సహ పీతో మహాత్మనా

 సమో ధర్మథరస్యాపి పుత్ర శ్చిత్రరథః కిల

 తస్య చైత్రరథః పుత్ర స్తస్మాద్దశరథః కిల

రోమపాద ఇతి ఖ్యాతో యస్య శాస్తా సుతాభవత్

 అథ దాశరథి ర్వీర శ్చతురజో మహాయశాః

ఋశ్యశృష్ణ ప్రసాదేన జజ్జీ స్వకులవర్దనః

 చతురజస్య పుతస్తు పృథులాక్ష ఇతి స్మృతః

పృథులాక్షసుతశ్చాపి చమో నామ బభూవ హ

 చమస్య తు పురీ చమా పూర్వం యా మాలినీ భవత్

 పూర్ణభద్రప్రసాదేన హర్యష్ణోగ్య సుతోభవత్

 జజ్జీ విభాజ్ఞకా చ్చాస్య వరణ శ్శత్రువారణ

 అవతారయామాస మహీం మనౌ ర్వాహనముత్తమమ్

 హర్యజ్ఞస్య తు దాయాదో జాతో భద్రరథః కిల

 అథ భద్రరథస్యాసీ ద్బృహత్కర్మా జనేశ్వరః

 బృహద్భాను స్సుత స్తస్య తస్మా జ్ఞప్లే బృహన్మనాః

బృహన్మ నాస్తు రాజేశ్లో జనయామాసవై సుతమ్

 నామ్నా జయద్రథం వీరం యస్మా జ్ఞాతో బృహద్రథః

 ఆసీ ద్బృహద్రథస్యాపి విశ్వజి జనమేజయః

దాయాద స్తస్య చాళో వై యస్మా తగ్జభవ న్నృపః

కర్ణస్య వృష సేనస్తు వృష సేని స్తదాత్మజః

 ఏతేజజ్జా తమశ స్సర్వే రాజానః కీర్తితా మయా

 విస్తరేణానుపూర్వాచ్చ పూరోశ్చ శృణుత ద్విజాః

 ఋషయః : సూతాత్మజః కథం కర్ణః కథ మజస్య చాత్మజః

ఏత దిచ్ఛామహే శ్రోతు మత్యనకుశ లో హ్యసి

 సూతః : బృహాద్భావో స్సుతో జజ్ఞే నామ్నా రాజాబృహన్మనాః

తస్య పత్నీ ద్వయం హ్యారీ చ్చైడ్యస్య తనయే శుభే

 యశోదేవీచ సత్యాచ తయో ర్వంశ మిమం శృణు

జయద్రథంతు రాజానం యశోదేవీ వ్యజ్జనత్

సా బృహన్మనస స్సత్యా విజయం నామ విశ్రుతమ్

 విజయస్య బృహత్పుత్ర స్తస్య పు బృహద్రథః

బృహద్రథస్య పుతస్తు సత్యకర్మా మహామనాః

సత్యకర్మసుతశ్చాపి సూత స్వతి(ధి)రథ సృతః

యః కర్ణం ప్రతిజగ్రాహ తేన కర్ణస్తు సూతజః

 ఏత ద్వ స్సర్వ మాఖ్యాతం య త్కర్ణం ప్రతి చోదితమ్

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే చంద్రదవంశానువర్ణనే తుర్వస్వాదిసన్తతికథనం

నామాష్టచత్వారింశోధ్యాయః

వీరిలో అంగునకు దధివాహనుడు అతనికి దధిరథుడు అతనికి విద్వాంసుడగు ధర్మరథుడు కుమారులయిరి. ఇతడు చాల పూజ్యుడు. విష్ణుపదమను పర్వతమున ఇతడు దేవరాజగు ఇంద్రునితో కూడి సోమపానము చేసెను. అతనికి తండ్రితో సముడగు చిత్రరథుడు అతనికి చైత్రరథుడు అతనికి రోమపాదుడని ప్రసిద్ధుడును శాంతకు తండ్రియు అగు దశరథుడు (ఇతడు శ్రీరాముని తండ్రియగు దశరథునకు సనాము డేమో!) అతనికి ఋశ్యశృంగుని అనుగ్రహమున వంశ వర్ధనుడగు చతురంగుడు అతనికి పృథులాముడు అతనికి పూర్వపు మాలినీ నగరమును చంపానగరి యని ప్రసిద్ధికి తెచ్చిన చంపుడు అతనికి. పూర్ణ భద్రముని అనుగ్రహమున హర్యంగుడు విభాండకుని దయవలన వారణుడు. కుమారు లయిరి. ఈ సారణుడు శత్రువులను నిరోధించగల వీరుడు. మంత్రబలము తో ఉత్తమ వాహనమును (ఉచ్చైశ్రవమును) భూమికి దిగి వచ్చునట్లు చేసేను. హర్యంగునకు-భద్రరథుడు అతనికి బృహత్కర్మ - ఆతనికి బృహద్భానుడు అతనికి బృహన్మనసుడు అతనికి జయద్రథుడు అతనికి జనమేజయుడు అతనికి అంగుడు. అతనికి కర్ణుడు - (కుంతికి కానీన సుతుడు) అతనికి వృష సేనుడు. అతనికి వృష సేని, కుమారులయిరి. - ఇది అంగ వంశీయులగు - రాజుల పరంపర. ఇక పూరు వంశమును వివరింతును.

అనగా ఋషులు సూతు నిట్లడిగిరి: “కర్ణుడు సూతుని కుమారుడని విందుము. ఇతడు అంగుని కుమారు డేట్లయ్యెను? నీవు ఇవి బాగుగ ఎరిగినవాడవు. చెప్పగలవాడవు. కావున నీనుండి వినగోరుచున్నాము.” 

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: లోగడ చెప్పిన బృహద్భానునకు బృహన్మనసుడు కుమారుడంటినీక దా! అతనికి చైద్యుని కూతురు యశోదాదేవి.సత్య-అనువారు ఇద్దరు భార్యలు. యశోదాదేవికి జయద్రథుడును సత్యకు విజయుడును కుమారులయిరి. విజయునకు బృహత్ అనునతడు అతనికి బృహద్రథుడు అతనికి సత్యకర్మన్ అతనికి అతి(ధి)రథ సూతుడు కుమారులయిరి. ఈతడు కర్ణుని తన కుమారునిగా గ్రహించెను. అందుచే కర్ణునకు సూతపుత్తడను ప్రసిద్ది వచ్చెను.

మీరు కర్ణుని విషయమున ప్రశ్నించినదంతయు మీకు ఇట్లు తెలిపితిని.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున తుర్వసుడు మొదలగు వారి వంశముల  వృత్తాంతములనెడు నలువది ఎనిమిదవ అధ్యాయము.