24 - బుధోత్పత్తి - పురూరవో - రజి - యయాతి వృత్తాంతములు

సూతః: తత సంవత్సర స్యాన్తే ద్వాదశాదిత్యసన్నిభః

 దివ్య పీతామ్చరధరో దివ్యాభరణభూషణః

 తారోదరా ద్వినిష్క్రాన్తః కుమార శ్చంద్రనన్ని భః

 సర్వార్థశాస్త్రవి ద్ధీమా న్త్సర్వశాస్త్ర ప్రవర్తకః

 నామ్నా యద్రాజపుత్రీయం విశ్రుతం గజవైద్యకమ్

రాజ్ఞ స్సోమస్య పుత్రత్వా త్తస్య పుత్రో బుధస్స్మృతః

జాతమాత్ర స్స తేజాంసి సర్వాణ్యే విజయ ద్బలీ

బ్రహ్మాద్యా సత్ర చాజగ్ము ర్దేవదేవర్షిభి స్సహ

 బృహసృతిగృహే సర్వే జాతక ర్మోత్సవోద్యతాః

 అపృచ్ఛంస్తే సురా స్తారాం కేన జాతః కుమారకః

తత స్సా లజ్జితా తేషాం న కిఞ్చి దవదత్త్రదా

 పునఃపున సదా పృష్టా లజ్జయన్తీ వరాజ్గనా

సోమస్యేతి చిరా దాహ తతోఽ గృహ్ణా ద్విధు సుతమ్

 బుధ ఇత్యకరో న్నామ ప్రాదా ద్రాజ్యంచ భూతలే

 అభిషేకం తతః కృత్వా యువాన మకరో ద్విభుః

గ్రహసామ్యం ప్రదాయాథ బ్రహ్మా బ్రహ్మర్షిసంయుత

పశ్యతాం సర్వలోకానాం తత్రై వానరధీయత

 ఇలోదరేతు ధర్మిష్ఠం బుధః పుత్త్ర మజీజనత్  

పురూరవశ్చరితమ్

అశ్వమేధశతం సాగ్ర మకరో ద్య స్వతేజసా

పురూరవా ఇతి ఖ్యాత స్సర్వలోక నమస్కృతః  

సూతుడు ఋషులతో ఇంకను ఈ విధముగా చెప్పెను: సంవత్సరము గడచిన తరువాత తారా గర్భము నుండి కుమారుడు జనించెను. అతడు పండెండు మంది ఆదిత్యుల తేజస్సులను పోలిన తేజస్సుతో దీపించుచుండెను. దివ్యమగు పీతాంబరమును ధరించియుండెను. దివ్యములగు ఆభరణములతో అలంకరించుకొని యుండెను. రూపమునందు చంద్రుని పోలియుండెను.

అతడు అర్థ శాస్త్రమును సమగముగా ఎరిగినవాడు. చాల బుద్ధిశాలి. సర్వశాస్త్రములను ప్రవర్తిల్లజేసినవాడు. రాజ పుత్రీయము అను పేరున సిద్దమయియున్న గజ వైద్యశాస్త్రము ఈ తారా పుత్త్రడు పవరిల్లజేసినదే. సోమునకు (చంద్రునకు) రాజు అనియు పేరుగలదు. చంద్రుని కుమారుడగుటచే ఇతడు రాజపుత్రుడు. అతడు పవ రిల్లజేసిన శాస్త్రము కనుక రాజ పుత్రీయము అని దానికి పేరు వచ్చెను. సర్వశాస్త్రముల నెరిగిన పండితుడు కావున బుధుడని అతనికి పేరు ప్రసిద్ధమయ్యెను.

అతడు పుట్టుక తోనే లోకములందలి సకల తేజస్సులను తన తేజస్సుతో జయించువాడును బలశాలియు నయి యుండెను. ఈతని జనన సమయమున బ్రహ్మదేవుడును దేవతలును దేవ ఋషులును బృహస్పతి గృహమునకు వచ్చిరి. అచ్చట వారందరును పుట్టిన కుమారునకు జాత కర్మమును జరుపుటకు పూనుకొనిరి. ఆ దేవతలందరును ఈ కుమారుడు ఎవరి వలన కలిగినవాడు ? అని తారను అడిగిరి. ఆమె సిగ్గుపడి ఏమియు మాటాడక యూర కుండెను. వారును మరల మరల అదే ప్రశ్నము నడుగసాగిరి. ఆ ఉత్త్రమాంగన సిగ్గుపడుచు చందుని కుమారుడే అని చాల సేపటి తరువాత సమాధానము ఆచ్చెను. అంతట ఆ కుమారుని చందుండు తీసికొనెను. అతడు ఆతనికి బుధుడు  అని నామకరణము చేనేను. భూలోకమునందు రాజ్యమును కూడ ఇచ్చెను. తరువాత అతనిని యువరాజునుగా చేసి అభి షేకము జరిపెను.

తరువాత బహ్మ బహరులతో కూడి ఆలోచించి బుధునకు గృహత్వమును ఇచ్చి సర్వ లోక ములును చూచుచుండ ఆచ్చటనే అంతర్ధానమునందెను.

బుధునకు లోగడ తెలిపినట్లు ఇలాగర్భమున కుమారుడు కలిగేను. అతడు పురూరవసుడు అను పేర ప్రసిద్ధుడయి సర్వలోక జనుల నమస్కారములను అందుకొను వాడయ్యెను. తన ప్రతాపముతో అతడు సమగముగా నూరు అశ్వమేధ యాగములు చేసెను.

హిమవచ్ఛిఖరే రమ్యే సమారాధ్య జనార్దనమ్

లోకైశ్వర్య మగా ద్రాజా(సప్తద్వీపానిసప్తదా) సప్తద్వీపాధిప స్తథా

 కేశిప్రభృతయో దైత్యాః కోటిశో యేన ఘాతితాః

ఊర్వశీ యస్య పత్నీ త్వ మగమ ద్రూపమోహితా

సప్తద్వీపా వసుమతీ స శై లవనకాననా

 ధర్మేణ పాలితా తేన సర్వలోకహితైషిణా

చామరగ్రాహిణీ కీర్తిస్సదా చైవా జ్గవాహికా

 విష్ణుప్రసాదా ద్దేవేన్ద్రో దదా వర్గాసనం పదా

ధర్మార్థకామా న్దర్మేణ సమమే వాభ్యపాలయత్

ధర్మార్థకామా స్తం ద్రష్టు మాజగ్ముః కౌతుకా త్పురా

జిజ్ఞాసవ స్తచ్చరితం కథం పశ్యతి న స్సమమ్

 భ క్త్యా చ కే తత స్తేషా మ ర్ఘ్యా పాద్యాదికం నృపః

 ఆసనత్రయ మానీయ దివ్యం కనక భూషణమ్

నివేశ్యాభాకరోత్పూజా మీషద్ధర్మేఽధికాం పునః

జగ్మతు స్తే తు కామార్థా వతికోపం నృపం ప్రతి

 అర్థ శ్శాప మదా తస్మై లోభా త్వం నాశ మేష్యసి

కామోఽప్యాహ తవోన్మాదో భవితా గన్దమాదనే

 కుమారవన మాశ్రిత్య వియోగా (దూ) దుర్వశీభవాత్

ధర్మోఽప్యాహ చిరాయు స్త్వం ధార్మికశ్చ భవిష్యసి

 సన్తతి స్తవ రాజేంద్ర యావచ్చ న్ద్రార్క తారకమ్

శతశో వృద్ధి మాయాతు న నాశం భువి యాస్యతి

త్యుక్త్వా ఽ న్తర్దధు స్సర్వే రాజా రాజ్యం త దాన్వభూత్  

ఆ పురూరవుడు మనోహరమగు హిమవత్పర్వత శిఖరమునందు (తపస్సు చేసి) శ్రీ మహావిష్ణుని మెప్పించేను. జనార్దనుని వరపభావమున లోకేశ్వరుడయ్యెను. భూలోకమునందలి సప్త ద్వీపములకును అధిపతి అయ్యేను. ఈతడు కేశి మొదలగు కోట్లకొలదిగా రాక్షసులను చం పెను. ఆతని రూపమును చూచి మోహితురాలయి ఊర్వశి అతనికి భార్య అయ్యెను. అతడు సర్వలోక ములహితమును కోరి సప్త ద్వీపములతోను పర్వతములతో కాననముల (చిన్న అడవుల లేదా చెట్ల తోపుల) తోను కూడిన భూమిని అంతటిని ధర్మానుసారముగా పాలించేను. కీర్తి అతనికి వింజామరను పట్టి వీచెడి సేవిక గా ఒడలు పట్టెడి సేవకురాలుగా అయ్యెను. విష్ణుని అనుగ్రహ ప్రభావమున దేవేంద్రుడు అతనికి తన ఆర్గాసనమును ఇచ్చెను. ధర్మము అర్థము కామము అనెడి మూడు పురుషార్ధములను ధర్మానుసారము సమభావముతో అతడు పాలించేను. పూర్వము ఒకానొకప్పుడు ధర్మార్థ కామములకు మూవురకు ఈతడు మనలను ముగ్గురను ఎట్లు సమానముగా చూచుచున్నాడో పరీక్షింపవలెనని కుతూహలము కలిగెను. అందుచే వారు ఆతని నడువడిని తెలిసికొనగోరి ఆ పురూరవుని కడకు వచ్చిరి. రాజపుడు బంగారు తొడుగుతోను అలంకారములతోను కూడిన దివ్యములగు పీఠములను తెప్పించి వారిని వాటి పై కూర్చుండ బెటెను. భక్తి పూర్వకముగా అర్యము పాద్యము మొదలగు వానితో వారిని పూజిం చెను. వారిని పీఠముల పై కూర్చుండ బేటి పూజించుటలో ఆ రాజు ధర్మమునందు అధికము అగు భ కిని చూపేను. దానిచే కోపించి అరము నీవు లోభము చేత నశింతువు. అని పురూరవుని శపించెను. కామమును గంధమాదన పర్వతమున కుమార వనమునందు ఊర్వశితోడి వియోగము కారణముగా నీకు ఉన్మాదము కలుగును. అని అతనిని శపించెను. ధర్మము అతనితో ఇట్లు పలికెను : “నీవు దీర్ఘాయువవును ధార్మికుడవును అయ్యెదపు. నీ సంతానమును చంద్రార్క నక్షతములు ఉన్నంత వరకును నూరుల కొలదిగా వృద్ధి పొందుచుండును. అది ఎన్నటికీని భూలోకమునందు నశించదు. ఇట్లు పలికి ధర్మార్థ కామములు మూడును అంతర్థానము నందెను. ఆనాటి నుండియు ఆ పురూరవుడు రాజ్యమును ధర్మానుసారముగా అనుభవించెను.

అహన్యహని దేవేన్ద్రం ద్రష్టుం యాతి స రాజరాట్

కదాచి దారుహ్య రథం దక్షిణామ్బర చారిణమ్

సార్దమర్కేణ సోఽపశ్య న్నీ యమానా మథామ్బరే

కేశినా దానవే న్ద్రేణ చిత్రలేఖా మథోర్వశీమ్

 తం వినిర్జిత్య సమరే దదౌ బౌధి స్స్వపాణినా

 బుధపు త్త్రేణ వాయవ్య మస్త్రం ముక్త్వా యశోర్థినా

 తథా శక్రోపి సమరే యేన వ జీ వినిర్జితః

 మిత్రత్వ మగమ ద్దేవై రదా ది న్ద్రాయ చోర్వశీమ్

తతః ప్రభృతి మిత్రత్వ మగమ త్పాక శాసనః

సర్వలోకాతీశాయిత్వం బల మూర్జం యశశ్శ్రియమ్

 ప్రాదా ద్వ జ్రీ తు స న్తుష్టో గేయతాం భర తేన చ

సా పురూరవసః ప్రీత్యై గాయన్తీ చరితం మహత్

లక్ష్మీస్వయంవరం నామ భర తేన ప్రవర్తితమ్

మేనకా ముర్వశీం రంభాం నృత్యతేతి తదాదిశత్

ననర్త సలయం తత్ర లక్ష్మీరూపేణ చోర్వశీ

 సా పురూరవసం దృష్ట్వా నృత్య న్తీ కామపీడితా

విస్మృతాఽభినయం సర్వం త త్పురా భర తోదితమ్

శ శాప భరతః క్రోధా ద్వియోగా దస్య భూతలే

 పఞ్చాపఞ్చాశదబ్దాని లతా సూక్ష్మా భవిష్యసి

 పురూరవాః పిశాచత్వం తత్రైవానుభవిష్యతి

 తత స్త ముర్వశీ గత్వా భర్తార మకరో చ్చిరమ్

 శాపా న్తే భరతస్యాథ (ఊ) ఉర్వశీ బుధసూనుతః

అజీజన త్సుతా నష్టౌ నామత స్తాన్ని బోధత

ఆయుర్దృఢాయు రణ్వాయుధ్ధ నాయుశ్చ ధృతి ర్మతిః

శుచి ర్వీర శ్శతాయుశ్చ సర్వే దివ్య బలౌజనః

 ఆయుషో నహుషః పుత్రో వృద్ధశర్మా తథైవచ

 రజీ రసో విపాహ్మచ వీరాః పఞ్చ మహారథాః

 రజేః పుత్త్రశతం జజ్ఞే రాజేయా ఇతి విశ్రుతాః  

రాజరాజగు ఆపురూరవుడు ప్రతి దినమునను స్వర్గమునకు పోయి దేవేంద్రుని దర్శించి వచ్చుచుండెడివాడు. అట్లు జరుగుచుండ ఒకనాడు ఆ రాజు దక్షిణాయన గతిలోనున్న సూర్యునితో పాటు దక్షిణపు ఆకాశ ముస సంచరించు చున్న తన రథమును ఆరోహించి పోవుచు దానవరాజగు కేశియను వాడు ఊర్వశిని చిత్రలేఖను కొని పోవుచుండుట చూచెను. బుధ పుత్రుడగు ఆపు రూరవసుడు ఇంద్రుని కూడ జయించియుండిన ఆ కేశి పై వాయ వ్యాస్త్రమును ప్రయోగించి వానీని జయించెను. ఇట్లతడు యుద్ధమున కేశి రాక్షసుని జయించి వానిని తన హ స్తముతో పట్టివే నేను. తరువాత ఆ రాజు ఊర్వశిని ఇంద్రునికి ఒప్పగించెను. ఈ కారణముగా ఆతడు ఇంద్రాది దేవతలతో మైతిని సంపాదించేను. ఆనాడు మొదలుకొని దేవేంద్రుడు పురూరవునితో మైత్రిని అంగీక రించుటయే కాక అతని పయి పీతి చెంది అతనికి సర్వ లోకాధికుడుగా నుండునట్లును బలమును సామర్థ్యమును యశస్సును ఐశ్వర్యమును శోభను భరతునిచే గానముచే కీ ర్తింప బడుటను వరముగా ఇచ్చెను. ఆ ఊర్వశియును నోటి నుండి పురూరవుని పూజ్యచరితమును పాడుచు ప్రీతి కలిగించు చుండెడిది. ఇట్లుండ ఒక నాడు దేవేంద్రుడు ఊర్వశీ మేనకా రంభలను భరతుడు రచించి ప్రవర్తిల్ల జేసిన లక్ష్మీ స్వయం వరమను నృత్య రూపకమును నృత్యమున నభినయించవలసినదిగా ఆజ్ఞాపించేను. ఆనృత్యాభినయ ప్రసంగములో ఊర్వశి లక్ష్మీ రూపము ధరించి లయను గుణముగా నాట్యము చేయుచుండెను. ఆమె పురూరవసుని చూచుచు నాట్యము చేయుచు కామపీడితురా లయ్యెను. ఈ హేతువుచే నా మే తనకు భరతుడు ఉపదేశించి యుండిన అభినయము అంతయు మరచెను. భరతుడును అందులకు కోపించి ఈ రాజుతోడి వియోగమున నీవు భూలోకమున మీగుల సన్నని తీగవై ఉండుమని ఊర్వశిని భూలోకమునందే ఊర్వశి తీగయె యున్న పరిసరములందే పిశాచమయియుండునని పురూ రవసుని శపించెను. వెంటనే ఊర్వశియును శాపానుసారము భూలోకమున శావకాలమంతయు లతగా నుండి చాల కాలము నకు శాపము తీరి ఆ పురూరవసుని తన పతిగా చేసి కొనెను. శాపావసానమున ఆమెకు పురూరపనునివలన ఎనమండు కుమారులు కలిగిరి. వారు ఆయువు దృఢాయువు ఆశ్వాయువు ధనాయువు ధృతిమతి శుచి శతాయువు అను వారు. వీరందరును వీర లును దివ్యములగు బలమును సామర్థ్యమును కలవారు. వీరిలో ఆయువు అనునతనికి నహుషుడు వృద్ధశర్మ రజీ-రసుడు విప్మా అను వారు కుమారులై రి. వారు ఐదుగురును మహారథులు అగు వీరులు. వారిలో రజికి నూరుగురు కుమారులు కలిగిరి వీరి కందరకును రాజేయులు అని ప్రసిద్ధి.

రజి రారాధయామాస నారాయణ దుకల్మషమ్

తపసా తోషితో విష్ణు ర్వరం ప్రాదా న్మహీపతేః

 దేవాసుర మనుష్యాణా మభూ త్స విజయీ తదా

అథ దైవాసురం యుద్ద మభూ ద్వర్షశ తత్రయమ్

ప్రహ్లాదశక్రయో ర్బీమం న కశ్చి ద్విజయీ తయోః

తతో దేవాసురైః పృష్టః ప్రాహ దేవ శ్చతుర్ముఖ

 అనయో ర్విజయీ క స్స్యా ద్రజి ర్జేతేతి సోఽబ్రవీత్

 జయాయ ప్రార్థితో రాజా సహాయ స్త్వం భవస్వ నః

దై త్యైః ప్రాహ యది స్వామీ వో భవామి తత స్త్వలమ్

నాసురైః ప్రతిపన్నం తత్ప్రతిపన్నం సురై స్తదా

స్వామీ భవ త్వ మస్మాకం సజ్గామే నాశయ ద్విషః

తతో వినాశితా స్సర్వే యేఽవధ్యా వజ్రపాణినా

పుత్త్రత్వ మగమ తుష్ట స్తస్యన్దః కర్మణా విభుః

దత్వేన్ద్రాయ త రాజ్యం జగామ తపసే రజి

 రజిపుత్రై స్త దాచ్ఛిన్నం బలా దిగ్దస్య వైభవమ్

 యజ్ఞభాగం తు రాజ్యం చ తతో గుణబలాన్వితై

 రాజ్యా దష్ట స్తథా శక్రో రజిపుత్తైర్ని పీడితః

 ప్రాహ వాచస్పతిం దీనః పీడితోఽస్మి రజేస్సుతే

 న యజ్ఞభాగా రాజ్యం చ రాజేయానాం బృహస్పతే

 రాజ్యలాభాయ మే యత్నం విధత్స్వ ధిషణాధిప

 తతో బృహస్పతి శ్శక్ర మకరో ద్బలదర్పితమ్

 గ్రహశాన్తి విధానేన పౌష్టి కేన చ కర్మణా

 స గత్వా మోహయామాస రజిపుత్తా న్బృహస్పతిః

యేనాధర్మం సమాస్థాయ వేద బాహ్యం స వేద విత్

వేగ మార్గపరిభ్రష్టాం శ్చకార ధిషణాధిపః

వేద బాహ్యా న్పరిజ్ఞాయ హేతువాద సమన్వితాక్

 జఘాన శ క్రోఽథ రణే సర్వా న్దర్మబహిష్కృతాక్

రజి పాపనాశకుడగు నారాయణుని ఆరాధించెను. అతని తపమునకు మెచ్చి  నారాయణుడు ఆ మహీపతికి వరము నిచ్చెను. తత్పరిభావమున అతడు దేవతలను అసురులను కూడ జయించగలవాడయ్యెను.

ఇట్లుండ గొంత కాలమునకు దేవాసురులకు యుద్ధము సంభవించేను. అది మూడు నూరుల సంవత్సరములు ప్రవర్తిల్లెను. ప్రహ్లాదునకును ఇందునకును జరిగిన యుద్ధములో ఎంతకాలమునకును ఎవరికిని గెలుపు కలుగక యుద్దము సాగుచునే యుండెను. అపుడు దేవాసురులు ఇరువురును చతుర్ముఖునికడకు పోయి మాలో ఎవరికి గెలుపు కలుగునని ప్రశ్నించిరి. ఈ ఇక వురిలో ఎవరు జయింతురు అని చెప్పగలను? రజి జయించును. అని బహ్మ పలి కెను. దైత్యులు రజి కడకు పోయి నీవు మాకు సహాయుడపు కమ్ము. అని అతనిని ప్రార్థించిరి. జయించిన తరువాత నేను మీకు అధిపతిగా ఉండుటకు అంగీకరించిన చో నేను మీకు యుద్ధమున సాయము చేయుదునని రజి పలికెను. అది రాక్షసు లంగీరింపలేదు. దేవతలు అందులకు ఒప్పుకొనిరి సీపు యుద్ధమున మా శత్రువుల నశింపజేయుము. తరువాత నీవే మా అధిపతిఏ కమ్ము . అ దేవత లనిరి. ఆంతట రజి అంతవరకును వజపాణియగు దేవేంద్రునకును అవధ్యులుగా నుండిన రాక్షసులనందరను నశింపజేసెను. రజి తమకు చేసిన ఈ సాహాయ్యకృత్యమునకు మెచ్చి ఇందుండు తానతనికి కుమారుడుగా ఉండ సంగీకరించెను. అంత రజియును తన రాజ్యము నంతయు దేవేంద్రున కప్పగించి తాను తపస్సునకు పోయెను.

రజిపుత్తులు నూరుమందియు, సద్గుణములును బలమును కలవారు. వారు తమ తండ్రి తపోవనమునకు పోయిన తరువాత ఇంద్రుని వైభవమును యజ్ఞభాగమును కూడ హరించిరి. ఇట్లు రజిపుత్తులచేత విశేషముగా, బాధింపబడి ఇంద్రుడు రాజ్యభ్రష్టుడై పోయెను. అతడు తన గురువగు బృహస్పతి దగ్గరకు పోయేను. నేను రజిపుత్తులచేత మిగుల పీడింపబడియున్నాను. నాకిపుడు రాజ్యము లేదు. యజ్ఞభాగమును లేదు. అవి రెండును ఇప్పుడు రజి కుమారుల కే చెందియున్న వి. నీవు బుద్దిమంతులలో ఉత్త్రముడవు. నాకు మరల నారాజ్యము లభించుటకై యత్నము చేయ ప్రార్థించు చున్నాను. అని ఇంద్రుడు గురుని ప్రార్థించెను.

బృహస్పతి తన నీతి బలమునను మంత్రబలమునను ఇంద్రుని మరల బలదర్పితునిగా జే నెను. శాస్త్రవిధానము ననుసరించి ఆతడు గ్రహశాంతిని పౌష్టిక కర్మలను ఆచరించెను. అంతేకాక ఆ బృహస్పతి పోయి తన బుద్ధిబలమున రజిపుత్తులను మోహ పెట్టెను. వారి బుని నూర్చెను. దానిచే వారు వేదబాహ్యమగు అధర్మమును ఆశ్రయించిరి. ఇట్లు పండిత శ్రేష్ఠుడును వేదవే త్రయు అగు బృహస్పతి రాజేయులను వేద మార్గమునుండి పరిశ్రమలనుగా చేసెను. వారందరును వేద బాహ్యులుగా హేతువాదపరులుగా ఐరి. ఇది ఎరిగిన దేవేంద్రుడు ధర్మమార్గ బహిష్కృతులగు ఆ రజిపుత్రులనందరను చంపెను.

నహుషస్య ప్రవక్ష్యామి పుత్త్రాన్సప్తైవ ధార్మి కా

యతి ర్యయాతి సంయాతి రుద్భవః పాఞ్చి రేవచ

 సయాతి ర్మేఘసంయాతి స్సప్తైతే వంశవర్ద నాః

యతిః కుమార భావేపి యోగీ వైఖానసోఽ భవత్

 యయాతి రకరో ద్రాజ్యం ధర్మైకశరణ స్తదా

 శర్మిష్ఠా తస్య భార్యాఽ భూ దుహితా వృషపర్వణః

భార్గవస్యాత్మజా తద్వ ద్దేవయానీ చ సువ్రతా

 యయాతేః పఞ్చ దాయాదా స్తా నవక్ష్యామి నామతః

దేవయానీ యదుం పుత్త్రం తుర్వసుం చాప్యజీజనల్

తథా ద్రుహ్య మనుం పూరుం శర్మిష్ఠాజనయ త్సుతా

 యదుః పూరుశ్చ భవత ఏషాం పై వంశవర్ధనౌ

యయాతి ర్నా హుష శాసీ ద్రజా సత్యపరాక్రమః

పాలయామాస చ మహీ మీజే చ వివిధై ర్మఖి

 అతిభ క్త్యా పిత్య నర్చ్య దేవాంశ్చ ప్రయత స్సదా

 అథాఽసృజ త్ర్పజా స్సర్వా యయాతి రపరాజితః

స శాశ్వతీ స్సమా రాజా ప్రజా ధర్మేణ పాలయ  

జరా మార్ఛ న్మహా ఘోరాం నాహుషో రూపనాశినీమ్

జరాభిభూతః పుత్త్రాన్త్స రాజా వచన మబ్రవీత్

యదుం పూరుం తుర్వసుం చ ద్రుహ్యం చానుంచ పార్థివః

యౌవనేన చ వః కామా న్యువా యువతిభి స్సహ

విహర్తు మహ మీ చ్చామి సాహ్యం కురుత పుత్త్రకాః

తం పుత్త్రో దేవయానేయః పూర్వజో యదు రబ్రవీత్

 కిం సాహ్యం భవతః కార్య మస్మాభి ర్యౌవనేన తు

యయాతి రబ్రవీ త్పుత్త్రాన్జరా మే ప్రతిగృహ్యతామ్ః

యౌవనేన త్వదీయేన చరేయం విషయా నహమ్

యజతో దీర్ఘసత్రై ర్మే శాపా చ్చోశన మునేః

కామార్థి పరిణామాద్య తప్తోహం తేన పుత్రకాః

తాం స్వ కేన శరీ రేణ జరా మేకః ప్రశాస్తు వః

 అహం తన్వాఽభినవయా యువా కామా నవాప్ను యామ్

న తే తస్య ప్రతీత్యగృహ్ణ న్యదుప్రభృతయో జరామ్

 చత్వార స్తా న రాజర్షి రశ వచ్చేతి నశ్రుతమ్

 తమబ్రవీ త్త్రతః పూరుః కనీయా నృత్యవిక్రమః

 రాజ నృహీత్వాభినవం యౌవనం త్వం సుఖీ చర

అహం జరాం తవాదాయ రాజ్యే స్థాస్యామి తేఽఽజ్ఞయా

ఏవ ముక్త స్స రాజర్షి స్తపోవీర్యసమాశ్రయాత్

 సఞ్చయామాస జరాం తదా పుత్రో మహాత్మని

 పౌర వేణాథ వయసా రాజా యౌవన మాస్థితః

యాయాతేన ప్రవయసా రాజ్యం పూరు రకారయత్

తతో వర్షసహస్రాన్తే యయాతి రపరాజితః

అతృప్త ఇవ కామానాం పూరుం పుత్త్ర మువాచ హ

 త్వయా దాయాదవానస్మి త్వం మే వంశకర స్సుతః

పౌరవో వంశ ఇత్యేష ఖ్యాతిం లో కే గమిష్యతి

తత స్స నృపశార్దూలః పూరు రాజ్యేఽభిషిచ్య చ

 కాలేన మహతా పశ్చా త్కాలధర్మ ము పేయివాక్

 పూరువంశం ప్రవక్ష్యామి శృణుధ్వ మృషిసత్త్రమాః

యత్ర తే భారతా జాతా భరతాన్వయవర్ధనాః

ఇతి శ్రీమత్స్యమహా పురాణే మత్స్యమనుసంవాదే చన్దవంశానువర్ణనే యయాతిచరితే బుధాద్యుత్పత్తికథనం నామ చతుర్వింశోఽధ్యాయః

ఇక నహుషుని కుమారులను పేరుకొందును. వారు యతి యయాతి సంయాతి ఉద్బవుడు పాంచి సయాతి మేఘ సంయాతి అను వారేడుమంది. వీరు ధార్మికులును వంశవృద్ధికరులును. యతి అను నాతడు చిన్న తనమునందే యోగియే వానప్రస్థుడయ్యెను. యయాతి ధర్మమునకు తాను ఆశ్రయమై ధర్మమును తానాశ్రయించి రాజ్యమును పొలించేను. వృష పర్వుడను దానవరాజు కుమార్తెయగు శర్మిష్టయు  శుక్రుని కూతురగు దేవయాని యు ఆతని భార్యలు. యయాతికి దేవయానివలన యదువు తుర్వసుడు అనువారును శర్మిష్టవలన ద్రుహ్యుడు అనువు పూనుడు ఆనువారును మొ త్త్రము ఐదు మంది కుమారులు కలిగిరి. వీరై దుమందిలోను యదువు పూరుడు అనువారు ఇద్దరును వంశవృద్ధికరు లయిరి.

నహుషపుత్రుడగు ఈ యయాతి రాజుగా సత్యపరాక్రముడై (ధర్మము మొదలగు సత్ర్పవృత్తులయందు పూనిక కలిగి) భూమిని పాలించేను. వివిధములగు యజ్ఞములతో దేవతల నారాధించేను. అతిభ క్తితో ప్రయతుడయి (శరీరమునందును చిత్త్రమునను శుచియై) పితరులను దేవతలను కూడ అర్చించేను. అటువలెనే ప్రజలను అందరను శత్రువులవలన ఓటమి నెరుగని ఆయయాతి దృఢ బుద్దితో పాలించేను.

ఇట్లు ఆ యయాతి ధర్మానుసారము ప్రజలను పాలించుచుండ మహా ఘోరమును సౌదర్యమును దేహ దార్థ్యమును నశింపజేయునదియు నగు వార్ధకము ఆతనిని ఆదేశించెను. ముసలితనము తను క్రమ్ముకొనగా నాతడు తన కుమారులగు యదుపూరుతుర్వసు ద్రుహ్య్వనువులను పిలిచి ఇట్లు పలికెను. “యౌవనముతో మీరు అనుభవించు కామ సుఖముల ననుభవింపవలెనను కోరికతో నున్నాను. కుమారులారా! నాకు ఈ విషయమున సాహాయ్యము చేయుడు.” అనగా దేవయానీ జ్యేష్ట కుమారుడగు యదువు-యావనముతో మేము మీకు చేయదగిన సాహాయ్యము ఏమి? అని ప్రశ్నించెను. యయాతి కుమారులతో ఇట్లు పలికెను. “నావార్ధకమును మీరు తీసికొనవలయును. మీ మౌవనముతో నేను విషయ సుఖములను అనుభవింతును. నేనింతవరకును దీర్చ సత్రయాగములు (దీర్ఘ కాలము దీక్ష వహించి ఆచరించ . వలసిన సత్రయాగములు) అనేకములు ఆచరించుచుండుటతోను శుక్ర మహాముని ఇచ్చిన శాపముతోను ఈ వయఃపరిణామము (ముసలితనము) కలిగినది. “ఐనను అది ఇంకను కామ సుఖములను కోరుచున్నది. నాయనా! నేను ఈ హేతువు తపించిపోవుచున్నాను. కనుక మీలో నేవరైన ఒకరు ఈ నా వార్ధకమును తన శరీరములో గ్రహించి స్వాధీనపరచుకొన వలెను. నేను సరికొత్త్ర శ రీరమును పొంది దానితో పడుచువాడనై కామములను అనుభవింతును.”

కాని యదువు మొదలగు కుమారులెవ్వరును తమ తండ్రియగు యయాతి యొక్క వార్ధకమును స్వీకరించలేదు. ఆ హేతువుచే ఆ రాజర్షి యదుతుర్వసు ద్రుహ్య్వనువులు అను నలుగురను శపించెను. అని పరంపరలో వినబడుచున్నది.

కాని వారిలో ఐదవ వాడగు పూరుడు సత్యవిక్రముడు (ధర్మ ప్రధానమగు ప్రవృత్తికి సత్యమని పేరు. దానియందు తన శక్తిని ప్రయోగించి ప్రవర్తిల్లు వాడు సత్య విక్రముడు.) కావున అంతట తన తండ్రితో “తండ్రి! నా అభినవ యౌవనమును నీవు తీసికొని సుఖములను అనుభవించుము. నీ ఆజ్ఞానుసారముగా నీవారక మును గ్రహించి నీ అనుమతితో రాజ పదమునందు నిలిచియుందును. (రాజ్యమును పాలించుచుందును,) అనేను.

పూరుడు ఇట్లు చెప్పగానే రాజర్షియగు యయాతి తన తపసామర్థ్య బలమును ఆధారముగా చేసికొని తన దేహమునందలి ముసలితనమును మహాత్ముడు (ఉన్నతమగు మనస్సు కలవాడు) అగు పూరుని శరీరమునందు వ్యాపింప జేసెను. పూరుని వయస్సును తాను గ్రహించి యౌవనమును పొందెను. యయాతినుండి గ్రహించిన వార్ధకముతో పూరుడు రాజ్యమును పాలించెను.

ఇట్లు వేల కొలది సంవత్సరములు గడచెను. మహా పరాక్రమ శాలియగు యయాతి కామ సుఖముల విషయమున తృప్తి పొందలేదేమో! అనున జై యుండి తన కుమారుడగు పూరునితో ఇట్లు పలికెను. “నేను నీ మూలముననే పుత్రులు కలవాడ నయితిని. నా వంక మును నిలు ) ఇమానుడవు నీవే. ఈ వంశమునకు లోకమున పౌరవవంశము అను ఖ్యాతి కలుగును.”

ఇట్లు పలికి ఆ రాజ శేష్టుడు పూరుని రాజ్యమున అభి షేకించేను. చాల కాలము జీవించి అతడు యయాతి కాల ధర్మము నందెను.

ముని శ్రేష్టులారా! ఇక మీదట పూరు వంశ మును మీకు వివరించి తెలుపుదును. వినుడు. భరత వంశమును వృద్ధి చేయు థారతులు అనబడు పాండవ కౌరవులు ఆవంశమునందే కదా జన్మించిరి!

ఇది శ్రీమత్స్యమహా పురాణమున మత్స్యమను సంవాదమున చంద్రవంశాను వర్ణనమున

బుధోత్ప తి మొదలగు వృత్తాంతములు అను ఇరువది నాలుగవ అధ్యాయము.