మత్స్య మహా పురాణము
206 - వృషోత్సర్గ వృషలక్షణము.
మను: భగవఞ్చ్రొతు మిచ్ఛావి వృషభస్య తు లక్షణమ్ ।
వృషోత్సర్గవిధిం చైవ తథా పుణ్యఫలం మహత్॥
మత్స్యః : ధేను మాదౌ పరీ క్షేత సుశీలాం చ గుణాన్వితామ్ ।
అవ్యజ్జా మపరిక్లిష్టాం జీవవతా మరోగిణీమ్॥
స్నిగ్ధవర్ణాం స్నిగ్ధఖురాం స్నిగ్ధశృజీం తథైవచ ।
మనోహరాకృతిం సౌమ్యాం సుప్రమాణా మనుద్దతామ్॥
ఆవర్తె ర్ధక్షిణావర్తె ర్యుక్తాం దక్షిణతశ్చ యా ।
వామావరై ర్వామతశ్చ విస్తీర్ణజఘనాం తథా॥
మృదుసంహత తామ్రోఢీం రక్తగ్రీవాం సుశోభితామ్ ।
ఆశ్యామదీర్ఘస్ఫుటితా ర క్తజిహ్వా తథా చ యా॥
విస్తారామలనేత్రా చ శ ఫై రవిర శై ర్దృడై ।
వైడూర్యమధువర్టైశ్చ జలబుద్బుదసన్నిభై కి॥
రక్తస్ని ధైశ్చ నయనై స్తథా రక్త కనీనికైః ।
స ప్రచతుర్దశదస్తాం తథా బాశ్యామ తాలుకామ్॥
షడున్న తా సుపార్శ్వేరుః పృథుపంచ సమాయతా ।
అష్టాయత శిరోగ్రీవా యా రాజ నా సులక్షణా॥
మనుః షడున్న తాః కే భగవ నేచ పఇ్చ సమాయతాః ।
ఆయతాశ్చ తథై వాష్టో ధేనూనాం కే శుభావహాః॥
మత్స్యః : ఉరః పృష్ఠం శిరః కుక్షి శోణీచ వసుధాధిప ।
షడున్న తాని ధేనూనాం పూజయ ని విచక్షణాః॥
కర్ణా నేతే లలాటంచ పజ్చ భాస్కర నన్దన ।
సమాయతాని శస్య నే పుచ్చం సాన్ని చ సజ్జీనీ॥
చత్వారశ్చ స్తనా రాజ జ్ఞేయా హ్యష్టా మనీషిభిః ।
శిరోగ్రీవాయలా శ్చైతే భూమిపాల స్మృతా దశ॥
భగవన్! వృషోత్సర్గమున వదలవలసిన వృషభపు లక్ష మును వృషోత్సర్జన విధానమును దాని మహాఫలమును వినగోరుదుననిన మనువుతో మత్సుడిట్లు చెప్పెను: మొదట ఆ వృషభమునకు తల్లియగు ధేనువును పరీక్షించవలయును; ఆ ధేనువు సుశీల యు గుణవతియు అంగవైకల్యము లేనిదియు నలిగి చిక్కి పోనిదియు పుట్టిన దూడలన్ని యు బ్రదికి యున్నదియు రోగములు లేనిదియు నున్న ని వన్నె యు గిట్టలును కొమ్ములును కలదియు మనోహరాకృతి కలిగి సౌమ్యయై సరియగు ప్రమాణముతో నుండి పొగరులేనిదిగా నుండవలయును; దాని కుడివైపు సుడులు కుడివైపునకును ఎడమవైపు సుడులు ఎడమవైపునకును తిరిగియుండవలెను; విశాలమగు మలుగు (జఘనము) మెత్తనై దట్టమగు ఎర్రని పెదవులు ఎర్రని మెడ కలిగి చక్కగ ఒప్పుచుండవలయును; ఆ ధేనువు కొంచెము చామనచాయ కలిగి దేహమున ముడుతలు లేక విప్పారిన ఎర్రని నాలుకయు విశాలములు నిర్మలములు ఎరనివీ వైడూర్యపు వన్నె యే తేనేవన్నె యో కలవి నీటి బుడగల వలె ఎత్తుగా కనబడునవి ఎర్రని కనుపాపలు కలవి నున్న నివి అగుకన్నులును ఒత్తయిన గట్టి గిట్టలును ఏడు కానీ పదు నాలుగు కాని దంతములును చామనచాయ గల లో దౌడలును కలిగి యుండవలయును; ఆరు ఉన్న తములయి చక్కని పార్శ్వములు తొడలు కలిగి. విశాలమయి ఐదు సమములు ఆయతములునయి ఎనిమిది ఆయతములయిన తలయు మెడయు ఉన్న ధేనువులు మంచి లక్షణములు కలవి; ఆనగా మనువు - భగవన్! షడున్న తములు పంచనమాయతములు ఆష్టాయతములు ఆననేవేవి? ఆవి యుండుట ధేనువులకు శుభకర మంటిరిక దా! తెలుపుడన మత్యుడిట్లు పలికెను: ఉరము వీపు శిరము పొట్ట పిరుదులు రెండు. మొత్తమీయారును ఉన్న తములయి యున్న ధేనువులు మంచివని పండితులు ప్రశంసింతురు; రెండు చెవులు రెండు కన్నులు లలాటము ఈ ఐదును నమములై పొడవై యుండవలెను. తోక గంగడోలు రెండు తొడలు నాలుసనములు ఈ ఎనిమిదియు వీనితో పాటు శిరము కంఠము కలిసి మొ త్తము పదియు పొడవయి యుండవలెను.
తస్యా స్సుతం పరీ క్షేత వృషభం లక్షణాన్వితమ్ ।
ఉన్న తస్కన్దక కుదం ఋజులాజ్ఞూలకమ్బళమ్॥
మహాకటీతటస్కన్దం వైడూర్యమణిలోచనమ్ ।
ప్రవాళ శృజకర్ణాగ్రం సుదీర్ఘపృథువాలధిమ్॥
నవాష్టాదశసజ్యైర్వా తీక్షాగ్రైర్దశ శ్శుభైః ।
మల్లికాక్షశ్చ మోక్తవ్యో గృ హేపి ధనధాన్యకృత్॥
వర్ణత సామ్రక పిలో బ్రాహ్మణస్య ప్రశస్యతే ।
శ్వేతో రక్తశ్చ కృష్ణశ్చ గౌరః పాటల ఏవచ॥
శృణ గ్రామపృష్ణశ్చ శబలః పణ్చావాల కై ।
పృథుకర్లో మహాస్కన్ద శ్ర్మక్షరోమా చ యో భవేత్॥
రక్తాక్షః కపిలో యశ్చ రక్తశృజతలో భవేత్ ।
శ్వేతోదరః కృష్ణపార్శ్వే బ్రాహ్మణస్య ప్రశస్యతే॥
స్నిగా వర్ణేన ర క్తేన క్షత్రియస్య తు శస్య తే ।
కొహ్చొనాణేన వైశ్యస్య కృషే నాప్య న్య జన్మనః॥
యస్య ప్రాగాయతే శృజే భూముఖాభిముఖే సదా ।
సర్వేషామేవ వర్ణానాం సర్వ స్సర్వార్థసాధకః॥
మార్జారపాదః కపిలో ధన్యః కపిలపిజళ ।
శ్వేతో మార్జారపాదస్తు ధన్యో మణినిభేక్షణః॥
కరటః పిజ్య శ్చైవ శ్వేతపొద స్తథైవచ ।
సర్వపాదసితో యశ్చ ద్విపాద శ్శ్వేత ఏవచ॥
కపిజ్జాలని ధన్య స్తథా తిత్తిరిసన్ని భః ।
ఆకర్లమూలం శ్వేతంతు ముఖం యస్య ప్రకాశ తే॥
నర్గీముఖ స్స విషైయో రక్తవర్ణో విశేషతః ।
శ్వేతం తు జఠరం యస్య భవే తృష్ణం తు గోపతేః॥
వృషభ స్స సముద్రాఖ్య స్సతతం కులవర్ధనః ।
మల్లికాచిత్రపుష్పశ్చ ధన్యో భవతి పుజువః॥
కమలై ర్విమలై శ్చాపి చిత్తో భవతి భాగ్యతః ।
ఆతసీపుష్పవర్ణశ్చ తథా ధన్యతర స్మృతః॥
ఏతే ధన్యా స్తథాధన్యా నీర్తయిష్యామి తే నృప ।
కృష్ణ తాలోష్ఠదశ నా రూక్షశృఙశ ఫాశ్చ యే॥
అవ్యక్తవర్ణా హ్రస్వాశ్చ వ్యాఘసింహనిధాశ్చ యే ।
వ్యాఘగృధ్రసవర్ణాశ్చ తథా మూషకసన్ని భాః॥
కృష్ణాః కాణా స్తథా ఖక్షోః కేక రాక్షా స్తథైవచ ।
విషమ శ్వేతపాదాశ్చ ఉదా ననయనా స్తథా॥
నైతే వృషాః ప్రయోక్తవ్యా న చ ధార్యా స్తథా గృహే ।
మోక్తవ్యానాం చ ధార్యాణాం భూయో వక్ష్యామీ లక్షణమ్॥
తరువాత ఆ ధేనువునకు కుమారుడగు వృషభమును పరీక్షించవలెను; ఆది లక్షణవంతము కావలెను; దాని మూపును మూపుర మును ఎత్తుగా తోక యు గంగడోలును వంకరలేక ఉండవలెను; ఆది పెద్దకటి స్థలము మూపులు వైడూర్యమణి వంటికన్ను లు పవడము వంటి కొమ్ముల కొనలు చెవుల కొనలు - చాల పొడవై విశాలమగు తోక కుచ్చు తొమ్మిది కానీ పదునెనిమిదికాని వాడి మొనలుగల చక్కని దంతములు కలిగియుండవలెను; మల్లె మొగ్గలవంటి . కన్ను లుకల దానిని వదలిన చో వదలినవాని ఇంట ధనధాన్య వృద్ధియగును; ఎర్రని కపిల వర్ణపుది తెల్లనిది రాగివన్నెది నల్లనిది గౌరవన్నె ది. పాటల వర్ణపుదీ (తెలుపు ఎరుపు సమముగ కలిసినవన్నె ది) లావు కొమ్ములు ఎర్రనీ వీపు ఐదు వన్నె లు కలిసిన తోక కుచ్చు వెంట్రుకలు విశాలములగు చెవులు విశాలములగు మూపులు దట్టములై నున్న నైన రోమములు ఎర్రని కన్నులు కల కపిల వృషభము ఎర్రని , కొమ్ముల పైవన్నె తెల్లని పొట్టనల్ల డొక్కలు కల పృషభమును బ్రాహ్మణులు, విడువవలయును; చిక్కని ఎరుపు. వన్నె కలది. క్షత్రియులు విడువదగినది; బంగరువన్న ఎద్దును వైశ్యులు నల్లని దానిని శూద్రులు విడువవలయును;. ముందువై వునకు వంగి పొడవై కనుబొమల వైపునకు చూచుచున్న కొమ్ములు కలది సదా సర్వవర్ణముల వారును విడువ దగినది. (వృషభముల లక్షణములబట్టి నామ విశేషములు కలవు; ఎట్లన-) పిల్లి పాదముల వంటి పాదములు కపిలవర్ణము - కపిల పింగళ వర్ణము - కలదియు తెల్లనిదై మార్జాల పాదనహితము మణులవంటి కన్నులు కలదియు పింగళ వర్ణము తెల్లని పాదము - సర్వత్ర తెల్లని పాదములు - తెల్లని రెండు పాదములు కలదీ యు - ఇట్టి కోడెదూడలను ధన్యజాతి అందురు; చెవి మొదళ్లయందు తెలుపు కలిగి ప్రకాశించు మొగము ర క్తవర్ణ ముఖము -శరీరమంతయు రక్తవర్ణము - కల కోడెను నందీ ముఖమందురు; శరీర మంతయు ఎక్కువ భాగము ఎర్రనై పొట్టయు వీపును తెల్లగా నున్న కోడెదూడను సముద్రము అందురు; ఇదియు వంశ వృద్దిక లిగించును; మల్లెపూవువలె నుండియు పలువన్నె లు కలదియు పద్మమువలే నుండియు పలువన్నె లు కలదియు భాగ్యవృద్ధి కలిగించును; అవిసిపూవన్నె కలదియు మరియు ధన్యతరము; ఈ చెప్పిన వన్నియు ధన్య వర్గమునకు చెందినవి; (మేలయినవి); ఇక అధన్యములు: నల్లని దౌడలు పెదవులు దంతములు బిరుసు కొమ్ములు గిట్టలు అస్పష్ట వర్ణము కలవియు పొట్టివి పులివలే సింహమువలె కనబడునవి పులివన్నె గ్రద్దవన్నె కలపి ఎలుకవన్నే కలవి చాల నల్లనివి మెల్లకంటివి కొంకికొళ్ళవి ఓర చూపులవి ఎగుడుదిగుడైన తెల్లని పాదములు కలవి గ్రుడ్లు త్రిప్పునవి మీడిగ్రుడ్లవి ఇట్టి వృషభములను విడువరాదు; ఇంటనుంచు కొనరాదు; వృషోత్సర్గమున విడువదగినవీయు - ఇంటనుంచు కొనదగి నవియు నగు వృషభముల లక్షణమును మరల జెప్పెదను; వినుము.
స్వస్తికాకార శృజ్గాశ్చ తథా మేఘాఘనిస్వనాః ।
మహా ప్రమాణాశ్చ తథా మత్తమాత జ్గగామినః॥
మహోరస్కా మహో చ్ఛ్రాయా మహాబలపరాక్రమాః ।
శిరః కర్ణా లలాటంచ వాలధి శ్చరణా స్తథా॥
నేత్రే పార్శ్వే చ కృష్ణాని శస్య నే చన్దసప్రభమ్ ।
శ్వేతాన్యే తాని దృశ్య నే కృష్ణస్యతు వి శేషతః॥
భూమౌ లమ్బతి లాజూలం ప్రలమ్బస్థూలవాలధిః ।
పురస్రా దుద్యతో నీలో వృషభ స్స ప్రశస్యతే॥
శ క్తిధ్వజపతాకాడ్యా యేషాం రాజీ విరాజతే ।
అనడ్వాహస్తు తే ధన్యా శ్చిత్రసిద్దిజయావహాః॥
ప్రదక్షిణం త్రివర్తనే స్వయం చ వినీవర్తితాః ।
సమున్నత శిరోగ్రీవా ధన్యా స్తే ధనవర్గ నా॥
రక్తశృణోగ్రనయన శ్వేతవర్ణో భవే ద్యది ।
శ ఫైః ప్రవాళ సదృశై ర్నా స్త్రీ ధన్యతర స్తతః॥
ఏతే భార్యాః ప్రయత్నేన మోక్తవ్యా యది వా వృషాః ।
ధారితాశ్చ తథా ముక్తా ధనధాన్య వివర్ధనాః॥
చరణాని ముఖం పుచ్చం యస్య శ్వేతాని గోపతేః ।
లాక్షారససవర్ణశ్చ తం నీల మితి నిర్ధి శత్॥
వృష ఏష స మోక్తవ్యో న స ధార్యో గృ హేభవేత్ ।
తదర్థమేషా చరతి లో కే గాథా పురాతనీ॥
ఏష్టవ్యా బహవః పుత్తా యద్యేకోపి గయాం ప్రజేత్ ।
గౌరీ ముద్వాహమే తన్యాం నీలం వా వృషముత్సృజీత్॥
ఏవం వృషం లక్షణసమ్పయుక్తం గృహోద్భవం క్రితమథాపి రాజ ।
ముక్త్వా న శోచే న్మరణం మహాత్మా మోక్షం గత శ్చాస్య తవాభిధా స్యే॥
ఇతి శ్రీ మత్స్యమహాపురాణే వృషోత్సర్గ వృషభ లక్షణాదికథనం
నామ షడు త్తర ద్విశతత మోద్యాయః ॥
స్వస్తికాకారపు కొమ్ములు ఉరుమువంటి కంఠధ్వని పెద్ద కొలత మదపుటేనుగునడక వలె నడక వేడలుపు రోమ్ము పెద్ద ఎత్తు మహాబల పరాక్రమములు కలవియు శరీరమంతయు తెల్లనై తల-చెవులు. లలాటము తోక కుచ్చు-పాదములు. కన్నులుడొక్కలు నల్లగా నుండినవియు తోక వెంట్రుకలు నేలకు తాకుచు వ్రేలాడుచుండ తోక మాత్రము లావై ముందుకు సాగినట్లుండునవియు ప్రళ స్తములు; రోమ శ్రేణియందు శక్త్యాయుధమును.ధ్వజమును (పెద్ద జెండా) పతాకను (చిన్న జెండాను) పోలిన గుర్తులుకలవియు మరలించినపుడు కుడివైపుగా మరలునవియు చాల ఎత్తగు తలయు మెడయు కలవీయునగు కోడెలు వృద్ధిని పలువిధములగు సిద్దులను జయమును కలిగించును; శరీరమంతయు తెల్లనై కొమ్ముల కొనలు కన్నులు మాత్రము ఎర్రనై పగడములవంటి గిట్టలు కల వృషభముకంటే మేలగునది మరి ఏదియును ఉండదు; ఇట్టివానిని వదలినను ఇంట ఉంచుకొనినను మంచిదే; ఇవి ధనధాన్య వృద్ధికరములు; పాదములు ముఖము తోక తెల్లనే శరీరమంతయు ఎర్రనే న దానిని నీల వృషభమందురు; దీనిని వృషభముగా విడువదగునేకాని ఇంట ఉంచుకొనదగదు; దీని విషయముననే పురాతనమగు గాథ (గీతము) ఇట్లు కలదు; చాలమంది పుత్తులు కావలెనని గృహస్థులు కోరుకొన వలెను; వారిలో ఒక డైన గయకు పోవునేమో! గౌరియగు (రజస్వల కాక ముందు) కన్యకు వివాహము చేయునే మో! నీల వృషోత్సర్గము చేయునేమో!
రాజా! ఇట్లు సల్లక్షణము గల వృషభమును తన ఇంట పుటిన దానినేకానీ కొనిన దానిని కాని ఉత్సర్గము (వదలుట) చేసినవాడు తన మరణ విషయమున శోకింపవలసిన పనియుండదు; అట్టి మహాత్ముడు తుదకు ము క్తికూడ పొందును; ఇందువలననే నేనిది ఇంత గా చెప్పుచున్నాను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున మను మత్స్య సంపాద రూపమగు వృషోత్సర్గ వృషభ లక్షణమను రెండువందల ఆరవ అధ్యాయము.
Summary of chapter 206 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya delivers a profound discourse on Pūrta-dharma, the sacred spiritual practice of constructing public utility works, excavating water reservoirs, ponds, wells, and irrigation canals for the welfare of all living beings. Bhagavān Matsya emphasizes that while internal meditation purifies the mind, selfless public works establish lasting merit that sustains a soul across multiple lifetimes. The text details the precise Vedic consecration rituals for new water bodies, including Varuna oblations and releasing aquatic life into the sanctified waters, declaring that providing clean water to humans, animals, and birds satisfies all celestial Deities and grants imperishable heavenly abodes.