266 - దేవ స్నపనవిధి.

 సూతః : అథాత స్సంప్రవక్ష్యామి దేవస్నపన ముత్తమమ్

 ఆర్ఘ్యస్యాపి సమానేన శృణుధ్వం విధి ముత్తమమ్

 దధ్యతతకుశాగ్రణి క్షీరం దూర్వా తథా మధు

యవా సిద్ధార్థకా స్తద్వ దష్టాజ్కోర్ష్యః ఫలై స్సహ

 గజాశ్వరథ్యావల్మీక వరాహోత్ఖతమణ్డలాత్

అగ్న్యాగారా తథా తీర్థా ద్వజా ధోమఱ్ఱలా దపి

 కుమ్భేతు మృత్తికాం దద్యా దుర్ఘృతానీతి మ శ్రోతః

శన్నో దేవీత్యపాం మ మాపోహిషీతి వై తథా

 సావిత్ర్యోదాయ గోమూత్రం గన్జద్వారేతి గోమయమ్

 ఆప్యాయ స్వేతి చ క్షీరం దధిక్రాప్టేతి వై దధి

 తేజోనీతి ఘృతం తద్వ ద్దేవస్య త్వేతి చోదకమ్

 కుశ మిశ్రం & పే ద్విద్వా న్చగవ్యం భవేత్తతః

 సంస్నాప్య పజ్చగ వ్యేన దర్నా శుద్ధేన వై తతః

 దధిక్రాప్టేతి మన్రోణ కార్యం తస్యాభిమ ణమ్

ఆస్యాయ స్వేతి వయసా తేజోఒసీతి ఘృతేన చ

మధువాతేతి మధునా తతః పుష్పోద కేన తు

 సరస్వత్యై భేషజ్యేన కార్యం తస్యాభిమ ఘ్రాణమ్

 హిరణ్యాక్షేతి మ శ్రేణ స్నాపయే ద్రత్న వారిణా

 కుశామ్బసా తత స్నానం దేవస్యత్వేతీ కార యేత్

 కుశోదకేన చ స్నాన మగ్న ఆయా హి కారయేత్

 తతస్తు గన్లతోయేన సావిత్యా చాభిమ స్త్రీతమ్

 తతో ఘటసహ సేణ సహస్రార్దేన వా పునః

తస్యాస్య ర్దేన వా కుర్యా దథవాయిష్టత తేన వా

 చతుష్టష్ట్యా తతో ధేన తదర్ధార్దేన వా పునః

 చతుర్భి రథవా కుర్యా ద్ఘటానా మల్పవి త్తవా

 సౌవర్ణై రాజతై ర్వాపి తామ్రైర్వా రీతికోద్భవే

కాం స్యై ర్వా పార్థివై ర్వాపి స్నపనం శ క్తితో భవేత్

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: దేవతాప్రతిషా విధానము నింతవరకును తెలిసికొంటిరి కావున దానికి అంగ భూతముగా తెలిసికొనవలసిన ఊ తమమగు దేవ న్న పన విధానము తెలి పెదను. దధి అక్షతలు కుశాగ్రములు క్షీరము దూర్వ తేనె యవలు తెల్ల ఆవలు అనేడు ఎనిమిది అంగములతో కూడిన అర్ఘ్య సామగ్రియును ఫలములును సమకూర్చు కొనవలయును. గజములు అశ్వములు ఉండు ప్రదేశములు.రథ్య చతుష్పథము-నాలుగు బాటలు కలియుచోటు) వల్మీ కము.వరాహములు త్రవ్విన ప్రదేశములు. అగ్ని గృహము-పుణ్యతీర్థము. గొల్లపల్లె గోమండలము. ఈ ప్రదేశములనుండి నంపాదించి తెచ్చిన మృత్తికను కుంభమునందు ‘ఉద్ధృతాసి' అను మంత్రముతో వేయవలెను. ఆపై 'శంనోదేవీ” ‘అపోహిష్ణా’ అను మంత్రములతో జలమును 'సావిత్రి'తో (గాయత్రీ మంత్రముతో) గోమూత్రమును 'గంధ ద్వారాం' ఆను మంత్రముతో గోమయమును ‘ఆప్యాయస్వ' అను మంత్రముతో క్షీరమును 'దధిక్రావో' అను మంత్రముతో పెరుగును ‘తేజోఒసి' అను మంత్రముతో ఘృతమును “దేవస్యత్వా' అను మంత్రముతో కుశ మిశోదకమును కుంభమందు వేయ వలెను. దీనితో పంచగవ్యమగును. ఈ పంచగవ్యముతో దేవుని న్న పనము చేయించవలయును. తరువాత దధి క్రావ్ణో అను మంత్రముతో అభిమంత్రించుచు శుద్ద (కేవల) దధితో స్నానమాడించవలయును. 'ఆప్యాయన్వ' అను మస్త్రముతో గోక్షీరముతోను ‘తేజోసి' అను మంత్రముతో ఘృతముతోను 'మధువాతా' అను మంత్రముతో తేనెతోను 'నరస్వత్యైభేషజ్యేన' అను మంత్రముతో పుష్పోదకముతోను 'హిరణ్యాక్ష' అను మంత్రముతో రత్న జలముతోను 'దేవ స్యత్వా' అను మంత్రముతో కుశోదకముతోను 'అగ్న ఆయాహి' అను మంత్రముతో ఫలోదకముతోను 'సావిత్రి' మంత్ర ముతో గంధజలముతో (పన్నీటితో)ను దేవుని ఆర్చామూర్తిని స్నానమాడించవలయును. తరువాత యథాశ క్తిగ వేయి - ఐదు వందలు-నూట ఎనిమిది ఆరువది నాలు-ముప్పది రెండు పదునారు - ఎనిమిది నాలుగు - సంఖ్యగల బంగరు- వెండి రాగి-ఇత్తడి కంచు- మట్టి కడవలలో వేనీతోనైన స్నానమాడించవలయును.

సహదేవీ వచా వ్యాఘ్రీ బలా చాతిబలా తథా

 శజ్ఖపుష్పి తథా సింహీ హ్యష్టమీ చ సువర్చలా

 మహౌషధ్యష్టకం హ్యేత న్మహాస్నా నేషు యోజయేత్

 యవగోధూమ నీవార తిలశ్యామాక శాలయః

 ప్రియజ్ఞవో వీహయశ్చ స్నా నేషు పరికల్పితాః

స్వస్తికం పద్మకం శబ్దముత్పలం కమలం తథా

శ్రీవత్సం దర్పణం తద్వ న్న న్యావర్త మథాష్టకమ్

 ఏతాని గోమయైః కుర్యా న్మృదా చ శుభర తతః

పణవర్ణాదికం తద్వ త్ప్చ వర్ణం రజ సథా

 దూర్వాకృష్ణతిలా న్జద్యా న్నీ రాజనవిధిం తతః

 ఏవం నీరాజనం కుర్యా ద్దద్యా దాచమనం తతః

 మన్దాకిన్యాస్తు యద్వారి సర్వపాపహరం శుభమ్

 తతో వస్త్రయుగం దద్యా న్మ శ్రేణానేన సువతః

వేదసూత్ర సమాయు కే యజ్ఞదానసమన్వితే

సర్వవర్ణ శుభే దేవ వాసనీ తవ నిర్మితే

తతస్తు చన్దనం దద్యా త్సమం కర్పూర కుజుమైః

ఇమ ముచ్చారయే న్మం దర్భపాణిః ప్రయత్నతః

 శరీరం తే న జానామి చేష్టాం నైవ చ నైవ చ

 మయా నివేదితో గన్దః ప్రతిగృహ్య విలిప్యతామ్

 తత స్వేతేన మ శ్రేణ ధూపం దద్యా ద్విచక్షణః

 వనస్పతిర సో దివ్యో గన్గాఢ్య స్సుమనోహరః

 మయా నివేదితో భక్త్యా ధూపోయం ప్రతిగృహ్యతామ్

చత్వారింశ ద్వరా ఛీపా న్జద్యాచ్చైవ ప్రదక్షిణాక్

 త్వం సూర్యచన్దజ్యోతీంషి విద్యు దగ్ని స్తథైవచ

త్వమేవ సర్వజ్యోతీంషి దీపోయం ప్రతిగృహ్యతామ్

 తత స్త్వాభరణం దద్యా న్మహాభూషాయ తే నమః

 అనేన విధినా కుర్యా త్స పరాత్రం మహోత్సవమ్

 దేవకు మ్బై స్తతః కుర్యా ద్యజమానోభిషేచనమ్

 చతుర్బి రష్టభి ర్వాపి ద్వాభ్యా మే కేన వా పునః

 సపజ్ఞ్చరత్నకలశై సీతవస్త్రాభివేష్టితైః

 దేవస్య త్వేతి మంత్రేణ సామ్నా చాథర్వణేనమ

 అభిషే కేచ యే మంత్రా నవగ్రహమఖే స్మృతాః

ఈ మహాస్నాన విధానములో ఉపయోగింపవలసిన అష్టమహౌషధులు: 1. సహదేవి 2. వచా 3. వ్యాఘి 4. బలా 5. అతిబలా 6. శంఖపుష్పి 7. సింహీ 8. సువర్చలా: ఆష్టధాన్యములు: 1. యవలు 2. గోధుమలు 3. నీవార ములు 4. తిలలు 5. శ్యామాకములు 6. శాలిధాన్యము 7. ప్రియంగుపు 8. ద్రోహి: ఇక మృధోమయ కు థాష్టకము: 1. స్వస్తి కము 2. పద్మకము 3. శంఖము 4. ఉత్పలము 5. కమలము 6. శ్రీవత్సము 7. దర్పణము 8. నంద్యావర్తము: పంచ వర్ణములను పంచవర్ణములుకల తళుకు చూర్ణములను దూర్వలను నల్ల నూవులను అర్పించవలయును; సర్వపాపహరమును శుభమును నగు మందాకినీ(గంగా)జలముతో ఆచమనము నీయవలయును: తరువాత సువ్రతుడగు యజమానుడో స్థాపకుడో ఈ మంత్రముతో వస్త్ర మర్పించవలేను “వేద సూత్రములతో కూడినవియు యజ్ఞదాన సమన్వితములును నర్వ వర్ణయుత ములును శుభములును నీకై నిర్మింపబడినవియు నగు వస్త్రములు రెండు దేవా! ఇవిగో!” తరువాత దర్భపాణియే కర్పూర కుంకుమపుష్పములతో కూడ యత్నముతో గంధము నీయవలేను: మంతము: “దేవా? నీ శరీరము కాలనీ చేష్టకాని మరి ఏదియు నాకు తెలియదు; కనుక నేను నివేదించు ఈ గంధమును ప్రతిగ్రహించి నీవే విలేపన మొనరించుకొనుము.”. తరువాత విచక్షణుడై ధూపము నీయవలయును. మంత్రము: “వనస్పతి రనరూపమయి ఉత్తమమును సుగంధాఢ్యమును చాల మనో హరమును అగు ధూపమును నీకు నివేదించు(అర్పించు)చున్నాను: స్వీకరించుము: తరువాత ప్రదక్షిణ క్రమమున నలువది దీపములను వెలిగించి ఆర్పేంచవలేను: మంత్రము: “సూర్యచంద్రాగ్ని విద్యుద్రూప జ్యోతిస్సులును ఇతరములగు సర్వ జ్యోతిస్సులును ఆగునీవు దేవా! ఈ దీపమును ప్రతిగ్రహించుము.” తరువాత “మహాభూషణుడవగు నీకు నమస్కారము.” అనుచు ఆభరణములర్పించవలయును. ఈ విధానముతో ఏడహోరాత్రములు మహోత్సవము జరుపవలయును: తరువాత యజ మానుడు ఐదు విధములగు రత్న ములను వేసి పైని తెల్లని వస్త్రము చుట్టినటువంటి ఎనిమిదియో నాలుగో రెండో ఒకటియో ‘దేవస్యల్వా’ అను మంత్రముతోను సామాథర్వణ వేదమంత్రములతోను అభి షేకమునందును నవగ్రహ మఖమందును విహితములగు మంత్రములతోను ఈ దేవకలశములతో అభి షేకము జరుపవలయును.

సితామ్బరధర స్స్నా త్వా దేవా నమ్పూజయే త్తతః

 స్థాపకం పూజయే ద్భక్త్యా వస్త్రాలజ్కారభూషణైః

 యజ్ఞభాజ్ఞాని సర్వాని మణ్డపోవస్కరాదికమ్

 యచ్ఛాస్య దయితం గేహే తదాచార్యాయ దాపయేత్

 సుప్రసన్నే గురౌ యస్మా తృప్య నే సర్వదేవతాః

నైత ద్విశీలేన తు దామ్బి కేన న లిజ్జినా స్థాపన మత్రకార్యమ్

విపేణ కార్యం శ్రుతిపార గేణ గృహస్థ ధర్మాభిరతేన నిత్యమ్

 పాషజ్ఞనం యస్తు కరోతి బుద్ధ్వా విహాయ విప్రా ఇతిధర్మయుక్తాక్

 గురుం ప్రతిష్ఠాదిషు తత్ర నూనం కులక్షయ స్స్యా దచిరా దపూజ్యః

 స్థానం పిశాచైః పరిగృహ్యతే వా అపూజ్యతాం యా త్యచి రేణ లో కే

వివైః కృతం యచ్చుకదం కులే స్యా తపూజ్యతాం యాతి చిరంచ కాలమ్ 

ఇతి శ్రీమత్స్య మహాపురాణే దేవతాస్నపనవిధి ర్నామ షట్ షష్ట్యుత్తర ద్విశతతమోధ్యాయః

తరువాత యజమానుడు స్నానమాడి తెల్లని గుద్ద వస్త్రములను ధరించి దేవులను స్థాపకుని వస్త్రాలంకార భూషణములతో భక్తితో పూజించవలయును. నర్వయజ్ఞ భాండ(ద్రవ్యములను మండపమును ఉపన్కరములను తన ఇంటి యందలి ఇష్టమగు ద్రవ్యములను కూడ అతనికి ఈయవలయును. ఏలయన గురుడు. సు ప్రసన్ను డే నచో నర్వదేవత లును తృప్తులగుదురు. ఈ దేవతా ప్రతిష్టాపన కార్యము శీలరహితుడును దాంభికుడును వేషధారియును అగువారు చేయ రాదు. ఏ యజమానుడు ఎరిగియుండియు వైదిక ధర్మయుక్తులగు విప్రులనువదలి పాషండియగు వానిని ఆలయ దేవతా ప్రతిష్టాది కార్యములందు ఆచార్యునిగా చేసికొనునో అట్టివానికడ వంశ నాశము జరుగును. ఆచిర కాలమునందే అందలి దేవుడు ఆపూ జ్యుడగును. ఆ దేవాలయము కూడ శీఘ కాలమునందే పిచములచే స్వీకరించబడును. (పిశాచములకు ఆవాసమగును.) లేదా లోకమునందు అపూజ్యమగును. ఉత్తమ విప్రులచే ప్రతిష్టాకార్యము జరుపబడిన దేవాయతనము శుభకరమగును. అట్టి ఆలయమందలి దేవుడు చిరకాలము పూజ్యతనందును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవతా స్నపన విధియను రెండు వందల అరువదియారవ అధ్యాయము.