మత్స్య మహా పురాణము
41 - అష్టక ప్రతర్దనులు యయాతికి తమ పుణ్యలోకముల నిచ్చుట
అష్టకః : కతర స్త్వేత యోః పూర్వం దేవానా మేతి సామ్యతామ్ ।
ఉభయోర్దావతో రాజస్తూర్యాచంద్రమసో రివ॥
యయాతి : అని కేతం గృహ స్తేషు కామ వృత్తేషు సంయతః ।
గ్రామ ఏవ వస నిశు స్తయోః పూర్వతరం గతః॥
ఆప్రాప్య దీర్ఘ మాయుశ్చ యః ప్రాప్తో వికృతిం చరేత్ ।
త ప్యేత యది తత్కృత్వా చరే త్సోన్య త్తత స్తవః॥
కి యద్వై నృశంసం త దపథ్య మాహు ర్య సేవతే॥ధర్మ మనర్థబుద్ధిః ।
అక్టోప్యనీశ స తథైవ రాజం స్తదార్జవం స సమాధి స్త దార్యమ్॥
అష్టకః : కేనాద్య హూతః ప్రహితోసి రాజ న్యు స్రగ్వీ దర్శనీయ స్సువర్చాః ।
కుత ఆగతః కతమస్యాం దిశి త్వ ముతాహోస్వి త్పార్థివం స్థాన మస్తి॥
యయాతి: : ఇమం లోకం నరకం క్షీణ పుణ్యః ప్రవిష్ట ఊర్ధ్వం గగనా ద్విప్రకీర్ణః ।
ఉక్త్వాహం వః ప్రపతిష్యా మ్యన నరం త్వర నీ మాం బ్రహ్మణో లోకపాయే॥
సతాం సకా శే తు వృతః ప్రపాత స్తే సజ్ఞతా గుణవ న్తస్తు సర్వే ।
శక్రాచ్చ లజ్జా హి వరో మయెష పతిష్యతా భూమితలం నరేళో॥
అష్టకః : పృచ్చామి త్వాం మాప్రపత ప్రపాతే యది మే లోకాః పార్థివా స ని మేత ।
యద్య నరికే యది వా దివి స్థితాః క్షేత్రజ్ఞం త్వాం తస్య ధర్మస్య మన్యే॥
యయాతిః : యావ త్పృథివ్యాం విహితం గవాశ్వం సహారశ్యైః పశుభిః పక్షిభిశ్చ ।
తావ ల్లోకా దీవి తే సంస్థితా వై తథా విజానీహి నరేళోసింహ॥
అషకః : తాం స్తే దదామి మా ప్రపత ప్రపాతే యే మే లోకా దివి రాజేన్గ స ని ।
యే చా నరి క్షే యది వా దివి శ్రీతా సా నాక్రమ క్షిప్ర మమిత్రసింహ॥
యయాతిః : నా స్మద్విధో బ్రాహ్మణో బ్రహ్మ విచ్చ ప్రతిగ్ర హే వర్తతే రాజముఖ్య ।
యథా ప్రదేయం సతతం ద్విజేభ్య స్తథాదదం పూర్వ మహం నరేన్ద॥
నాబ్రాహ్మణః కృపడో జాతు జీవే ద్యా చాపి స్యా బ్రాహ్మణీ వీరపత్నీ ।
సోహం యదై వాకృత పూర్వం చ రేయం విపత్సమానః కిము తత్ర సాధు॥
ప్రతర్గసః : పృచ్చామి త్వాం స్పృహణీయ రూప ప్రతర్గనోహం యది మే సస్తా
లో కాః ।
యద్యన్తరిక్షే యది వా దివి శ్రితాః క్షేత్రజ్ఞం త్వాం తస్య ధర్మస్య మన్యే॥
యయాతిః ' స ని లోకా బహవ స్తే నరేన్హ అ ప్యేకైక సప్త సప్తా వ్యహాని ।
మధుచ్యుతో ఘృతసృక్షా విశోకా సేనా స్తవ స్తః ప్రతిపాలయ ని॥
ప్రతర్దనః : తాం స్తే దదామి మా ప్రపత ప్రపాతే యే మే లోకా స్తవ తే వై భవన్తు ।
యద్య నరిక్షే యదివా దివి శితా స్తానా క్రమ క్షిప్ర మ పేతమోహ॥
యయాతిః : న తుల్యతేజా స్సుకృతం కామయేత యోగ క్షేమం పార్థివ
పార్థివ స్సన్ ।
దేవాదేశా ద్విపదం ప్రాప్య విద్వాం శ్చరే న్నృశంసం హి న జాతు రాజా॥
ధర్మ మార్గం చేత యానో యశస్యం కుర్యా తపోధర్మ మమేక మాణః ।
న మద్విధో ధర్మబుద్ధి స్సదైవ కుర్యా దేవం కృపణం మాం యథాత్త॥
కుర్యా మపూర్వం న కృతం యదాన్యై ర్వివిత్సమానః కిము తత్ర సాధు ।
బ్రువాణ మేవం నృపతిం యయాతిం నృపోత్తమో వసుమా నబ్రవీ త్తమ్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే శౌనక శతానీక సంవాదే చంద్రదవంశానువర్ణనే యయాతిచరితే యయాత్యష్ట కాదిసంవాదో నామైక చత్వారింశోఽధ్యాయః॥
అష్టకుడు యయాతి నిట్లు ప్రశ్నించెను: "అయ్యా! . మీరు చెప్పిన ఈ రెండు విధములగువారును అంత రిక్షమున పరుగెత్తుచుండు సూర్యా చంద్రమసుల వంటివారు. ఇద్దరును ప్రకాశ స్వరూపులే). ఐనను ఈ ఇద్దరిలో ఎవరు మొదట దేవతలతో సామ్యమును పొందుదురు?” యయాతి: “గృహస్థుల నడుమనుండియు గృహమునందుండని పాడును కామములయందు ప్రవర్తిల్లు వారినడుమ నుండియు ఇంద్రియముల నిగ్రహించు కొనుచు గ్రామములయందు నివసించుచునే సంన్యాసియునై యుండువాడే వీరిద్దరిలో ముందుగా దేవతా సామ్యమును పొందును. ఎక్కువ వయస్సు రాకున్నను తపోవంతునివలే జీవించువాడు మరియొక తపస్సాచరించనక్కర లేదు. వయస్సు ఎక్కువగా వచ్చియును దానికి విరుద్దముగా నడుచువాడు మరే తపస్సు చేసినను ప్రయోజనము లేదు. ఇతరులకు బాధ కలిగించునది అనుసరించరాని మార్గము. అనర్థమేదియో ఎరుగక ఆధర్మమును ఆశ్రయించిన వానికి అర్థము కూడ సిద్దింపదు. ఇట్టి క్రూరత్వమును అధర్మమును విడిచి నడుచుటయే ఋజు ప్రవర్తనము-చిత్త స్టైర్యము. పెద్దలు మెచ్చునది." అష్టకుడు: రాజా! నీవు యువకుడవు; పూలమాలలు ధరించియు న్నా వు; చూడముచ్చటగా నున్నావు. గొప్ప వర్చస్సు గలవాడవు. ఇట్టి నిన్ను ఎవరు పిలిచి పంపగా వచ్చితివి? ఎక్కడినుండి వచ్చితివి? ఏ దిక్కు సందు ఉందువు? నీకు పృథివి పై ఉండదగిన స్థానము ఏదయిన కలదా?” యయాతి: “నేను క్షీణపుణ్యుడనై ఊర్వలోక మునుండియు గగనమునుండియు విసరి వేయబడి ఈ నరకలోకమున ప్రవేశించితిని. మీకు మీరడిగినవి చేప్పిన తరువాత వెంటనే క్రిందికి పడెదను. అదిగో! బ్రహ్మ మొదలగు లోకపాలురు నన్ను త్వర పెట్టుచున్నారు. నరేందా! నేను భూమి తలము పై పడ బోవుచు_సల్ జనుల నడుమ పడునట్లుగా ఇంద్రుని వలన వరము పొందితిని. అట్లే గుణవంతులగు మీ అందరతో సంగతి నాకు లభించినది " అష్టకుడు: “అయ్యా! ప్రపాతమునందు పడకుము. నీవు ధర్మక్షేత్ర తత్త్వము నెరిగిన వాడవని నానమ్మిక. నిన్నొకటి ప్రశ్నించుచున్నాను. నాకు భూమ్యంతరిక్ష దు, లోకములందు ఎచ్చటనైన నేను అనుభవింపదగిన పుణ్యలోకములు గలవా?" యయాతి: “రాజ శ్రేష్టా! పృథివి పై గోవులు అశ్వములు ఆరణ్యములగు పశువులు పక్షులును ఎంత వరకుండునో అంత వరకు అనుభవింపదగిన పుణ్యలోకములు నీకు ద్యులోక మునందు గలవు.” ఆషకుడు: “తండ్రీ! నీవు ప్రపాతమునందు పడవలసిన పనిలేదు. నాకు ద్యులోకమునందు గాని అంతరిక్షమునందుగాని కల ' పుణ్యలోకములన్నియు నీకు ఇచ్చు చున్నాను.” యయాతి: “బ్రహ్మవేత్తయగు బ్రాహ్మణుడు తప్ప నా (మన) వంటివాడు దానమును ప్రతిగ్రహింపరాదు. ఆదికాక నేను ఎట్లు ఎట్లు దానము చేయవలెనో అట్లు ఇంతకు పూర్వము దానము చేసియున్నా నే కాని ప్రతిగ్రహమెన్నడును చేయలేదు. బ్రాహ్మణుడు బ్రహ్మ వేత్త తప్ప మరెవ్వరును-బ్రాహ్మణస్త్రీ కాని క్షత్రియ స్త్రీ కాని దే న్యముతో దానము గ్రహింపరాదు. వివేకవంతుడనై యుండియు ఇదివర కెన్నడును చేయని పనిని నేనిపుడెట్లు చేయుదును? ఇది ఏమి బాగుగా నుండును?' ప్రతర్దనుడు: “రాజా! నా పేరు ప్రతర్దనుడు. నీవు మనోహర రూపుడవు. ధర్మ క్షేత్ర త త్త్వము నెరిగినవాడవు. నాకు అంతరిక్షమునగాని ద్యులోకమునగాని అనుభవింపదగిన పుణ్యలోకములు గలవా? చెప్పుము." యయాతి: “రాజేంద్రా! మధువును స్రవించునవియు నేతితో తడిసినవియు శోకరహితములునగు అనంతలోకములు ఒక్కొక్కటి ఏడేసి దివ్యదినములు అనుభవింపదగినవి కలవు. అవి అన్నియు నీకై ఎదురు చూచుచున్నవి.” ప్రతర్దనుడు: “తండ్రీ! నీవు వివేక శాలివి, నీవు ప్రపాతమునందు పడవలదు. నాకు అంతరిక్షమునందుగాని ద్యులోకమునందుగాని ఉన్న లోకములన్నియు నీకు ఇచ్చుచున్నాను.” యయాతి: “తేజశ్ళాలియగు వాడు తనకు సాటివాడగు తేజశ్శాలినుండి సుకృ తమును ప్రతిగ్రహింపరాదు. రాజు రాజునుండి అతని యోగ క్షేమములను తాను స్వీకరింపరాదు. దేవతల ఆదేశాను సారము విపత్తులనై న పొందవచ్చునుకొని వివేకియగు రాజు నింద్యమగు పనిని చేయరాదు. ధర్మ్యమగు మార్గమును కీర్తి ప్రదమగు మార్గమును ఎరిగి ధర్మఫలమును పొందగోరి తపస్సునే చేయవలెను. కాని నావంటి ధర్మజ్ఞుడు ఎట్టి సమయమునందును నీవు చెప్పినట్టి దీనమగు పనిని చేయరాదు. నేను వివేకవంతుడనై యుండి ఇదివరకు పెద్ద లెవరును చేయని పనిని చేయుట ఏమి బాగుగా నుండును?” అని ఇట్లు పలుకుచున్న యయాతితో అష్టకుని సోదరులలో నొకడగు వసుమాన్ ఇట్లనెను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున చంద్రవంశానువర్ణనమున యయాతి చరితమున అష్టక ప్రతర్దనులు యయాతికి తమ పుణ్యలోకముల నిచ్చుటయను నలువదియొకటవ అధ్యాయము.
Summary of chapter 41 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya describes how Ashṭaka, Pratardana, Vasumanas, and Śibi, deeply moved by the wisdom and venerable stature of their ancestor King Yayāti, each offered to donate their own accumulated sacrificial and ascetic merits to him so that he could re-ascend to heaven. King Śibi, renowned for offering his own flesh to protect a dove, offered his entire life's merit to his grandfather. However, King Yayāti steadfastly refused to accept merit earned by others, declaring that a righteous Kshatriya and true devotee of Dharma must never accept unearned charity or live off the spiritual labor of others. His unyielding adherence to truth and righteousness in the face of adversity instantly eradicated the remaining traces of his pride.