మత్స్య మహా పురాణము
176 - కాలనేమి విజయము
శ్రీమత్స్యః : దానవానామనీ కేషు కాలనేమిర్మహాసురః !
వివర్ధిత మహాతేజా స్తపాన్తే జలదో యథా॥
తం త్రైలోక్యా న్తర గతం దృష్ట్వా తే దానవేశ్వరాః ।
ఉత్తస్థురపరిశ్రాన్తాః పీత్వేవామృత ముత్తమమ్॥
తే వీతభయసన్త్రాసా మయతారపురోగమాః ।
తారకామయసజ్గ్రామే సతతం జితకా శినః॥
రేజు రాయోధనగతా దానవా యుద్ధ కాజ్క్షిణః ।
మన్త్రమభ్యస్యతాం యేషాం వ్యూహం చ పరిధావతామ్॥
సముద్భూతా ఘనా యే చ ప్రావృషీవ బలాహకాః ।
ప్రేక్షతాం చాభవత్ప్రీతి ర్దానవం కాలనేమినమ్॥
యే తు తత్ర మయ స్యాస న్ముఖ్యా యుద్ధపురస్సరాః ।
తే తు సర్వే భయం త్యక్త్వా హృష్టా యోద్దుముపస్థితాః॥
మయ స్తారో వరాహశ్చ హయగ్రీవశ్చ వీర్యవాక్ ।
విప్రచిత్తిసుత శ్వేతః ఖరలంభావుభావపి॥
అరిష్టోబలిపుత్త్రశ్చ కిశోరశ్చ తథైవచ ।
స్వర్భానుశ్చామరప్రఖ్యో వక్త్రయోధీ మహాసుర॥
ఏతేఽస్త్రవేదినః సర్వే సర్వే తపసి సుస్థితాః ।
దానవాః కృతినో జగ్ముః కాలనేమి తమద్బుతమ్॥
శ్రీమత్స్య నారాయణుడు మనువునకు "ఇంకను ఇట్లు చెప్పెనని సూతుడు ఋషులకు వచించేను॥ దానవుల సేనల నడుమ కాలనేమి మహా సురుడు వృద్ధినందిన తన మహా తేజస్సుతో నిండియు తన వర్ల ముచే గ్రీష్మాంతమున (వర్షాసమయా॥ రంథమందలి మేఘమువలే కనబడుచుండెను॥ త్రిలోకాంతర్బాగమున నిండియున్న అతనిని చూడగానే ఆదాన వేశ్వరు, లందరును " ఉత్తమమగు అమృతమును త్రాగినందుచేతవలే శ్రమయంతయు తీరి లేచిరి॥ మయుడు తారుడు మొదలగు దొన, వులు ఆ జరుగుచుండిన తారకామయ సంగ్రామమున ॥ అంతవరకు ఎడ తెగని జయము తో ప్రకాశించుచుండిన ట్లే ఇపుడు ఏమాత్రమును భయ సంత్రాసములు లేక యుద్ధము చేయగోరుచు ప్రకాశించిరి॥ వర్షా కాలమందు విజృంభించిన దట్టమగు మేఘములవంటి ఆ దానవులు కొందరు మంత్రములను ఆ వృత్తి చేయుచుండిరి॥ మరి కొందరు వ్యూహములందు ఆటు నిటు పడగెత్తు చుండిరి॥ ॥ వారి కందరకును ఈ కాలనేమిని చూచిన కొలది హరమధికమగు చుండెను॥ మయుని సహచరు లలో అ యుద్ధమున అగ్రగాములును ముఖ్యులును అగు దానవులందరును ఏమాత్రమును భయము లేక హర్షముతోనిండి యుద్ధము చేయుట కె సిద్దులయి నిలిచిరి॥ మయుడు తారుడు వరాహుడు వీర్యశాలియగు హయగ్రీవుడు విప్రచిత్తి దానవుని కుమారుడగు శ్వేతుడు ఖరుడు లంబుడు బలి పుత్తడగు ఆరిష్టుడు కిశోరుడు దేవతలలోనివాడు వలె ప్రకాశించువాడును నోటితో యుద్ధము చేయు వాడునగు స్వర్భాను (రాహు) మహానురుడు॥ ఈ దానవులందరును అస్త్ర వేత్తలును మహా తపో వంతులును కార్యనిపుణులును నగువారు; వీరందరును తమ కే ఆశ్చర్యము గొలుపుచున్న ఆ కాలనేమీ దగ్గరకుపోయి ఆత నిని పరివేష్టించి యుండిరి॥
తే గదాభిశ్చ గుర్వీభి శ్చక్రైరథ పరశ్వథైః ।
కాలక ల్పైశ్చముసలై: క్షేపణీయైశ్చముద్గరైః॥
అశ్మభిశ్చాద్రి సదృ శైర్గ ణ్డ శైలైశ్చ దారుణే ।
పట్ట సైర్భిణ్డివాలై శ్చ పరిఘై రుత్తమాయ సైః॥
ఘాతనీభి స్సుగుర్వీభి శ్శతఘ్నీ భిశ్చ సర్వతః ।
యుగైర్యన్త్రైశ్చ నిర్ముక్తై ర్మార్గణై రుగ్రతాడితైః॥
దోర్చియతదీప్తైశ్చ ప్రాసైః పాశై శ్చ మూర్ఛనైః ।
భుజజ్గైర్లేలిపోనై॥శ్చ విసర్పద్భిశ్చసాయకై:॥
చక్రైః ప్రహరణీయైశ్చ దీప్యమానైశ్చ తోమరై ।
వికోశై రసిభి స్తీక్ష్ణై శూలై శ్చ సీత నిర్మలై॥
దైత్యాన్సన్దీ పమనసః ప్రగృహీతశరాసనాః ।
తతః పురస్కృత్య తథా కాలనేమిం మహాహవే॥
సా దీ ప్తశస్త్రప్రవరా దైత్యానాం రురుచే చమూః ।
ద్యౌర్ని మీలితసర్వాజ్గా ఘనానీవామ్బుదాగమే॥
దేవతానామపి చమూ ర్ముముదే శక్రపాలితా ।
ఉపేతానీతకృష్ణాభ్యాం తారాభ్యాం చన్ద్రసూర్యయోః॥
వాయు వేగవతీ సౌమ్యా తారాగణపతాకినీ ।
తోయదావిద్దసవనా గ్రహనక్షత్రహాసినీ॥
యమేన్ద్రవరుణైర్గుప్తా ధనదేన చ ధీమతా ।
సా ప్రదీప్తాగ్ని సదనా నారాయణపరాయణా॥
సా సముద్రోఘసదృశీ దివ్యా దేవమహాచమూః।
రరాజాస్త్రవతీ భీమా యక్షగన్దర్వశాలినీ॥
తయే శ్చమ్వో స్తదానీం చ బభూవ స సమాగమః ।
ద్యావాపృథివ్యో సంయోగో యథా స్యాద్యుగపర్యయే॥
తద్యుద్ద మభవద్ఘోరం దేవదానవహజ్కులమ్ ।
క్షమాపరాక్రమపరం దర్పస్య వినయస్యచ॥
నిశ్చక్రము ర్బలాభ్యాంతు భీమా స్తత్ర సురాసు రాః ।
పూర్వాపరాజ్యాం సంరబ్ధా స్సాగరాభ్యామీవామ్బుదాః॥
పారు బరువయిన గదలు చక్రములు రథములు గండ్ర గొడ్డండ్రు యమదండములవంటి ముసలములు వడి నెలలు ముద్దరములు కొండలవంటి రాళ్లు భయంకరములగు గండ శైలములు ( పెద్ద పెద్ద బండలు) పట్టసములు భిండి పొలములు ఉత్తమమగు ఉక్కుతో చేసిన పరిఘలు బరువగు ఘాత నీ ఆయుధములు శతఘ్నులు కాండ్లు॥॥వదలుటకు సిద్దముగా నుంచిన యంత్రములు భయంకరముగా దెబ్బ కొట్టు బాణములు పొడవయి యొప్పు భుజములు పాసములు పాశములు మూర్చనములు (మూర్ఛవచ్చునట్లు చేయుటకు వనికివచ్చు యుద్దసాధన విశేషములు) నాలుకలు క్రోయుచున్న నర్పములు ప్రాకుచున్న పాములవలే కనబడు మెలికలశరములు ప్రహరించుటకు పనికివచ్చు చక్రములు ప్రకాశించుతోమరములు ఒర నుండి తీసియుంచిన తీక్ష ఖడ్గములు తెల్లని నిర్మల శూలములుక లిగి దైత్యులు చురుకయిన మనస్సులతో ధనువులు పట్టి నిలిచిరి॥ ఇట్లా మహా యుద్ధమున దైత్య సేన ప్రకాశించు ఆయుధ శ్రేష్టములు దాల్చి కాలనేమిని ముందుంచుకొని నీల మేఘములు క్రమ్మగా పూర్ణముగా మూతపడిన ఆకాశ మువలె (కారునలుపుతో) ప్రకాశించేను॥
చంద్ర సూర్యుల తెల్లని నల్లని కనుపాపలతోకూడి వాయు వేగముక లిగి సౌమ్యమయి తారాగణములు పతాకలు కాగా మేఘములను వస్త్రములు దాల్చి గ్రహములతో నక్షత్రములతో నవ్వుచు దేవ సేన ప్రకాశించు చుండెను॥ శకుడు పాలించుచుండ యమేంద్ర వరుణకుబేరులు కాపాడుచుండ అగ్ని తన సదనములందు వేదికలందు)॥ ప్రకాశించుచుండ నారాయణుడు పరమశరణమైయుండ ఆ సేన సముద్ర జలరాశివలె దివ్యరూపముతో ఒప్పుచుండెను॥ వారికిని అస్త్రములు కలవు॥ యక్ష గంధర్వులు (తమ చేష్టలతో) పరులకు భయము గొలుపు చుండిరి॥ అంతలో ఆ రెండు సేనలును ప్రళయ కాలమందు భూమ్యంతరిక్షములు తారసిల్లినట్లు పరస్పర మేదుర్కొనేను॥ దేవ దానవులకు జరిగిన ఆ యుద్దము సంకుల మును ఘోర మునునయి ॥క్షమాపరాక్రమములకును దర్పవినయములకును జరుగు రణమువలె నుండెను॥ అందు దేవతలును దానవులును ఇరు సేనలనుండియు తూర్పు పడమటి సముద్రములనుండి వెలికివచ్చి కలియు మేఘములవలె వెలికివచ్చి తారసిల్లిరి॥ వారుకోపావిష్టులును భయంకరులును నై యుండిరి॥
తాభ్యాం బలాభ్యాం సన్దృష్టాశ్చరుస్తే దేవదానవాః ।
వనా భ్యాం పర్వతీయాభ్యాం పుష్పితాభ్యాం యథా గజాః॥
సమాజఘ్ను స్తతో భేరీ శ్శజ్ఖా న్దధ్ము రనేకశః ।
స శబ్ధో చ్యాం భువంఖంచ దిశశ్చ సమపూరయత్॥
జ్యాఘాతతలనిర్ఘోషో ధనుషాం కూజితానిచ ।
దున్దు బీనాంచ నినదో దైత్య మన్తర్దదు స్స్వనమ్॥
తేఽన్యోన్య మభిసమేతుః పాతయన్తః పరస్పరమ్ ।
బభఞఞ్చర్బాహుభి ర్బాహూ న్ద్వన్ద్వ మన్యేయుయుత్సవః॥
దేవాస్తు చాశ నిం ఘోరం పరిఘాం శోత్తమాయసాక ।
నిస్త్రిం శాన్త్ససృజు స్సజ్ఖ్యే గదా గుర్వీశ్చ దానవాః॥
గదానిపాతై ర్భగ్నాజ్గా బాణైశ్చ శకలీకృతాః ।
పరి పేతుర్భృశం కేచి త్పునః కేచి న్ని జఘ్ని రే॥
తతో రథై స్సతురగై ర్విమానై శ్చాశగామిభిః ।
సమీయు స్తే తు సంరబ్ధా రోషాదన్యోన్య మాహవే॥
సంవర్తమానాస్సమరే సన్దష్టాష్ఠపుటాననాః ।
రథా రథై ర్ని యుధ్యన్తే పదాతాశ్చ పదాతిభిః॥
తేషాం రథానాం తుముల స్స శబ్ద శ్శబ్దవాహినామ్ ।
నభోగభస్యౌ హి యథా నభస్యై ర్జలదస్వనై॥
బభఞ్చరే రథా నేచి తేచి త్సమ్పాటితా రథైః ।
సమ్బాధ మన్యే సమ్రాప్య న శేకు శ్చలితుం రథాక్॥
అన్యోన్యమన్యే సమరే దోర్బ్యాముత్క్షిష్య దంశితాః ।
సంప్రదమానాభరణా జఘ్ను స్తత్రాసిచర్మిణః॥
అస్త్రైరన్యైర్వినిర్బిన్నా రక్తం వేము ర్హతా యుధి ।
తరజ్జలానాం సదృశా జలదానాం సమాగమే॥
తైరస్త్రశస్త్రైర్గ్రకథితం క్షిప్రోత్ క్షిప్తగ దావిలమ్ ।
దేవదానవసజ్క్రుద్ధం సజ్కు లం యుద్ధమాబభౌ॥
తద్దానవమహా మేఘం దేవాయుధ విరాజితమ్ ।
అన్యోన్యశస్త్రవర్షేణ యుద్ధదుర్దిన మాబభౌ॥
దేవతలును దానవులును అటువంటి రెండు సేనలతో కూడి పర్వతములందలి పూచిన వనద్వయముతో కూడిన గజములవలె అందముగా కనబడుచు నంచరించుచుండిరి॥ ఆంతలో భేరులను మోగించిరి॥ ఆనేకములగు శంఖములను పూరించిరి॥ ఆ ధ్వనితో భూమ్యాకాశములును దిక్కులును నిండిపోయేను॥ అలై లాటిని కంపింపజేయుటచే కలిగిన ధ్వనులును ధనువుల కూతలును దుందుభుల ధ్వనులును దైత్యుల (అరపుల) ధ్వనులను తమయందు ఇముడ్చుకోనేను॥ వారు పరస్పరము ఎదుర్కొనిరి; పడ వేసికొనుచుండిరి॥ భుజములతో భుజములను విరుగగొట్టుకొనుచుండిరి॥ మరి కొందరు ద్వంద్వయుద్ధము చేయగోరి సిద్ధమగుచుండిరి॥ దేవతలు దానవుల పై ఘోరములగు వజ్రములను (పిడుగులను మేలగు ఉక్కుతో చేసిన పరీఘలను ఖడ్గములను బరువగు గదలను యుద్ధమునందు ప్రయోగించుచుండిరి॥ దానవులు గదా పాతములతో ఆవయవములు విరిగి బాణములతో ముక్కలయి మిక్కిలిగా పడిపోవుచుండిరి॥ మరికొందరు చంప బడుచుండిరి॥ ఇంకను కొందరు ఎదురు నిలిచి దేవతలనే కొట్టుచుండిరి॥ వారు శీఘ గమనముగల రథములతోను॥ అశ్వములతోను విమానములతోను సంచరించుచు రోషావిష్ణులే ఆవేశముతో పరస్పరము తలపడి పోరుచుండిరి॥ పేదవు లను కొరుకుచు వికృతముఖములతో వారు రణమున భయంకరులుగా నుండిరి॥ రథికులు రథికులతో పదాతులు పదాతులతో పోరుచుండిరి॥ ధ్వని జనక ములగు ఆ దేవదానవ రథముల తుముల శబ్దము శ్రావణ భాద్రపద మాసము లందు కలుగు వర్షాకాల మేఘముల ధ్వనివలే నుండెను॥ కొందరు రథములను విరుగగొట్టిరి॥ కొందరను రథములు విరుగగొట్టేను॥ కొందరు ఇరుకు ప్రదేశములందు చిక్కుకొని రథములను కదలించలేకుండిరి॥ కవచ ధారులగు వీరులు కొందరు ఒకరినింకొకరు పైకెత్తి వేయుచుండిరి॥ మరికొందరు తమ ఆభరణములు ధ్వని చేయుచుండ కత్తులు పలక లు డాళ్ళు) ధరించిన వీరులను కూడ కొట్టుచుండిరి॥ కొందరు అస్త్రముల దెబ్బలుతిని ర క్తము కక్కుచు చచ్చుచు వర్షి కాలమున నీరు వర్షించు మేఘములవలె కనబడుచుండిరి॥ ఆ దేవ దానవులకు తుములయుద్దము అస్త్రశస్త్రముల" ఆల్లికతో ఎత్తి విసర బడుచున్న గదలతో క్రుద్దులయిన దేవదానవులతో భయంకరమయి యొ ప్పెను॥ అట్టి ఈ యుద్ధమున దాన వులు మహామేఘములును దేవతలు ప్రయోగించు ఆయుధములు ఇంధ్రధనువులుగా పరస్పర ప్రయుక్త శస్త్ర ప్రయో గములు వర్షముగా దుర్దినమయి (మేఘములాకసమావరించిన దినమయి) ప్రకాశించెను॥
ఏతస్మిన్తరే క్రుద్దః కాలనేమి స్స దానవః ।
వ్యవర్దత సముద్రౌఘైః పూర్యమాణ ఇవామ్బుదః॥
తస్య విద్యుచ్చలాపీడై: ప్రదీప్తాశ నివర్షిణః ।
గాత్రై ర్నాగగిరిప్రఖ్యా విని పేతుర్బలాహకాః॥
క్రోధా న్ని శ్వసత స్తస్య భూభేద స్వేదవర్షిణః ।
(సాగ్నిస్పులిజ్గవ్రతతా)సాగ్ని ధూమయుతా స్తస్య
ముఖాన్ని ష్పేతు రర్చిషః॥
తిర్యగూర్ధ్వంచ గగనే వవృధు స్తస్య బాహవః ।
పర్వతాదివ నిష్క్రాన్తః పఞ్చాస్యా ఇవ పన్న గాః॥
శస్త్రజాలై ర్బహువిధౌ ర్ధనుర్భిః పరిఘైరపి ।
దివ్యమాకాశ మావవ్రే పర్వతై రుచ్చ్రితై రివ॥
సోఽనిలోద్ధూతవసన స్తస్థౌ సజ్గ్రామలాలసః ।
నన్ద్యాతవగ్ర స్తశిల స్సాక్షాన్మేరురివాచలః॥
ఊరు వేగప్రమథితై శ్శైలశృజ్గాగ్రపాదపైః ।
పాతయ ద్దేవగణా న్వజ్రేణేవ మహాగిరీ:॥
బహు భిశ్శస్త్రనిస్త్రo శై శ్చిన్న భిన్న శిరోరుహాః ।
న శేకుశ్చలితుం దేవాః కాలనేమి హతా యుధి॥
ముష్టిభిర్ని హతాః కేచి త్కే చిత్తు విదళీకృతాః ।
యక్షగన్దర్వ పతయః పేతు స్సహ మహోరగై:॥
తేన విత్రాసితా దేవాస్సమరే కాలనేమినా ।
న శేకుర్యత్నవన్తోఽపి యత్నం కర్తుం విచేతసః॥
తేన శకస్సహస్రాక్ష స్సన్దిత శ్శర బన్దనైః ।
ఐరావతగత స్సజ్ఖ్యే చలితుం న శశాకహ॥
ఇంతలో కాలనేమి మహాసురుడు సముద్రజలములు లావిన మబ్బువలే వృద్ధిపొందెను॥ మెరపులవలే చంచల మయి “మెరయు ఆభరణములు కల అవయవము(తో)నుండి ప్రజ్వలించు పిడుగులను వర్షించుచు ఏనుగులవంటివియు పర్వతమంతటివియు మేఘములు వెలువడసాగెను॥ క్రోధమువలన, శ్వాస వదలుచున్న వాని ముఖమునుండి కనుబొమల ముడులను చేమటను వర్షించుచు పొగలతో నిండి అగ్నితో కూడిన జ్వాలలు బయటకు రాసాగేను॥ వాని బాహువులు ఆక నమునందు అడ్డముగను నిలువుగను పెరుగుచు పర్వతములందుండి వెలువడు ఐదుతలలసర్పములవలే కనబడు చుం డేను॥ బహు విధములగు శస్త్రజాలములును ధనువులును పరిఘలును ఆకసమునందంతటను నిండి ఉన్నత పర్వతములవలె కనబడుచుండెను॥ వాడు ఆందు గాలికి చేదరి ఎగురుచున్న వస్త్రముతో యుద్ధ కాంక్షియై సంధ్యాకాలపు ఎండతో వ్యాప్త మయిన శిలలుగల సాక్షాత్ మేరు పర్వతమో యనునట్లు ఒప్పుచుండెను॥ వాడు తన తొడల ఒత్తిడిచే నలుగగొట్టు చుండిన పర్వత శిఖరాగ్రములతోను వృ క ములతోను వజముతో ఇంద్రుడు) మహాగిరులను వలే దేవతలను పడగొట్టు చుండెను॥ ఇట్లు కాలనేమిచే తగులు దేబ్బలతో సురలు అనేక శస్త్రములతో ఖడ్గములతో తమ తలలు పగులగా కేశములు తెగి పోగా బాధపడుచు కదలనైన లేకుండిరి॥ కొందరు వాని పిడికిళులతో గద్దబడియు మరికొందరు చీల్చబడియు పడి పోయిరి॥ దేవతలు తామెంత పరాక్రమవంతులయియును కాలనేమి వలన కలిగిన భయముతో తెలివి తప్పినందున ఆ సమరమునందు ఏ యత్నమును చేయలేకుండిరి॥ సహ సాక్షుడగు శకుడును వానిచే శరబంధనములతో బంధిశు డై ఐరావత గజము పై కదలలేకుండేను॥
నిర్జలామ్భోదసదృశో నిర్జలార్ణవసప్రభః ।
నిర్వ్యాపారః కృత స్తేనవిపాశో వరుణో మృథే॥
రణేవైశ్రవణ స్తేనవరి ఘైః కామరూపిణా ।
విత్తదోఽపి కృతస్సజ్ఖ్యే(నిర్జితఃకాలనేమినా)త్యాజితో ధనదక్రియామ్॥
యమ స్సర్వహర స్తేన మృత్యుః ప్రహరణై రణే ।
యాహ్యమవస్థాం సన్త్యజ్య భీత స్వాం దిశ మావిశ త॥
స లోకపాలానుత్సార్య కృత్వా తేషాం చ కర్మ తత్ ।
దిక్షు సర్వాసు దేహం స్వం చతుర్ధా విదధే తదా॥
స నక్షత్రపథం గత్వా దివ్యం స్వర్భానుదర్శనమ్ ।
జహార లక్ష్మీం సోమస్య తందాస్య విషయం మహత్॥
చాలయామాస దీప్తాంశుం స్వర్గద్వారాత్స భాస్కరమ్ ।
సాయనం చాస్య విషయం జహార దినకర్మచ॥
సోఽగ్నిం దేవముఖం దృష్ట్వా (చకారాత్మముఖాశ్రయం) చకారాత్మవశానుగమ్ ।
పాయుంచ తరసా జిత్వా విదధేఽ స్యవశానుగమ్॥
స సముద్ర న్త్సమానీయ సర్వాశ్చసరితో బలాత్।
చకారాత్మముఖేవీర్యా ద్దేహభూతాశ్చ సిన్ధవః॥
అపస్వవశ గాః కృత్వాదివిజా యాశ్చ భూమిజాః ।
స్థాపయామాజగతీం సుగుప్తాం ధరణీధరై:॥
స స్వయంధూరీవాభాతి మహాభూతపతి ర్యథా ।
సర్వలోకమయోదై త్య స్సర్వభూతభయావహః॥
స లోకపాలై కవపుశ్చన్ద్రసూర్యగ్రహాత్మవాన్ ।
పావకానిలసంయోగో రరాజ యుధి దానవః॥
పార మేష్ఠ్యే స్థితఃస్థానే లోకానాం ప్రభవోపమే ।
తే తుష్టువు ర్ధైత్యగణా దేవా ఇవ పితామహమ్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే దేవదానవసఙామే కాలనేమివిజయా నాము షట్స ప్రత్యుత్తర శతతమోఽధ్యాయః॥
వరుణుడును వాని చేత తినిన దెబ్బలతో జలరహిత మేఘమువలేను జల మేండిన సముదమువలేను ఏమియు నేయ షోలకుండెను॥ కామ రూపుడు అగు ఆకాలనేమి విశవః ప్రజాపతి కుమారుడు అగు కుబేరుని పరిఘ లతో చావ మోది ధనదుడు (విత్తమును ఇచ్చువాడు) అనుయోగ్యతకు దూరము చేసెను॥ సర్వుల ప్రాణములను హరించు మృత్యురూపుడగు యముడును వాని దెబ్బలు తిని యముడుగా తనకుగల యోగ్యతను కోల్పోయి తన { దక్షిణ దిశకు పారిపోయేను॥ పాడట్లు లోక పాలురను తరిమి వారివారి అధికార కృత్యములను హరించి తన దేహమును నాలుగు దిక్కులందును నాలుగుగా నిర్మించెను॥ వాడు రాహువు తనకు చూపిన దివ్య నక్షత్ర మార్గమునకుపోయి సోముని లక్ష్మినీ (కాంతిని॥ఐశ్వర్యమును॥ ఆధికారమును) ఆతని పాలన మహాదేశమును హరించేను॥ వాడు స్వర్గ ద్వారమునుండి భాస్కరుని తరిమివేసి ఆతనికి గల ఆయనములను పగళ్ళను ఏర్పరచు ఆధికారమును తన ఆధీనముగా చేసికొనెను॥ దేవతలకు ముఖము (నోరు) ఆగు అగ్ని ని వాయుదేవుని తన శ క్తితో జయించి తన ఇచ్చ చొప్పున నడుచునట్లు చేసెను॥ వాడు తన వీర్య బలము లతో సర్వములగు నదులను సముద్రమును తన దగ్గరకు రప్పించుకొని తన ముఖమునందు తన ఎదుట॥తన అధీనములో) ఉండునట్లు చేసికొనెను॥ సముద్రములన్నియు వాని దేహమయ్యెను॥ భూమ్యంతరీక్ష ద్యులోకములందెక్కడెక్కడ నున్న జలమును తన వశమున నడుచుకొనునట్లు చేసి వాడు భూమినంతను తన యాజ్ఞలో నడుచు పర్వతములతో భద్ర పరచి కదలకుండునట్లు చేసేను॥ వాడు తాను స్వయంభూ బ్రహ్మయు మహాభూతపతియునై నట్లు ప్రకాశించుచు సర్వలోక మయు దై సర్వభూత ॥ భయంకరుడై ప్రకాశించుచుండెను॥ ఇట్లు లోకపాలైక శ రీరుడు చంద్ర సూర్యాది గ్రహ రూపుడు వాయ్వగ్ని శ రీరుడునై ఆయుద్దమునం దాదానవుడు ప్రకాశించు పర మేష్టి బ్రహ్మ స్థానమునందు నిలిచి లోకముల ఉత్పత్తికే తాను మూలకారణుడై ప్రకాశించుచుండగా దేవతలు బ్రహ్మను స్తుతించునట్లు దైత్యులు వానిని స్తుతించిరి॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవదానవ సంగ్రామమున కాలనేమి విజయమును నూట డెబ్బది యారవ యధ్యాయము॥
Summary of chapter 176 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya narrates the climactic moment when Mahādeva struck Andhakāsura with His mighty Trishūla, piercing the demon king's chest and lifting his giant body high into the air. Trapped upon the glowing tines of the trident, Andhakāsura was held above the earth for thousands of years while the divine Mātṛkās consumed every drop of his blood, completely draining his mystical regeneration power and breaking his pride.