మత్స్య మహా పురాణము
154 - పార్వతి ఒడలి నలుపు విషయమున శివుడు ఆమెను పరిహసించుట॥
ఈశ్వరః : శరీరే మమ తన్వజ్గీ సితే భాస్యతితే ద్యుతిః ।
భుజజ్గీవాసీతా శుద్దా సంశ్లిష్టా చన్దనే తరౌ॥
చన్దాత పేన సమ్పృక్తా రుచిరామ్బరయా తథా ।
రజనీవాసితే పక్షే దృష్టి దోషం దదాసి మే॥
ఇత్యుక్తా గిరిజా తేన ముక్తకణా పినాకినమ్ ।
ఉవాచ కోపర క్తాక్షీ భ్రుకుటీవికృతాననా॥
దేవీ : స్వకృతేన జనససర్వో జాడ్యేన పరిభూయతే ।
అవశ్యమర్థాతాప్నోతి ఖణ్డనం శశిమజ్జన॥
తపోభిర్దీర్ఘచరిత్ర రచ్చ ప్రార్థితవత్యహమ్ ।
తస్యా మే నియత ధ్వేష హ్యవమానః పదేపదే॥
నై వాస్మి కుటిలా శర్వ విషమా నైవ ధూర్జటే ।
సవిష స్త్వం గతః ఖ్యాతిం వ్యక్తం దోషాక రాశ్రయః॥
నాహం పూష్ణోపి దశనా నేత్రే చాస్మి భగస్య హి ।
ఆదిత్యశ్చ విజానాతి భగవాన్గ్వాదశాత్మకః॥
మూర్ట్ని శూలం జనయసి స్వైర్డో షెర్మామధిక్షిపక్ ।
య స్వం మామాహ కృషేతి మహాకాలేతి విశ్రుతః॥
యాస్యామ్యహం పరిత్యక్తుమాత్మానం తపసా గిరిమ్।
నా స్త్రీ మే జీవితే కృత్యం ధూర్తేన పరిభూతయా॥
సూతః : నిశమ్య తస్యా వచనం కోపాతీక్ష్ణాక్షరం భవః ।
ఉవాచావిష్టసంభ్రంతిఃప్రణయే నేన్దు శేఖరః॥
“సుందరీ! తెల్లగా ప్రకాశించు నాదేహమున నీ మేని చాయ చందనవృక్షమును చుట్టుకొనిన నల్లని శుద్దమగు ఆడు త్రాచువలె నున్నది॥ మనోహరాకాశమున వెన్నెలతో కూడిన కృష్ణపక్ష రాత్రివలె నాకు దృష్టి దోషము కలిగించుచున్నావు॥” అనిన శివునితో పార్వతి కోపరక్త నేత్రయై కనుబొమలు వికృతముగా ముడివేసి బిగ్గరగా ఇట్లనెను॥ ప్రతివాడును తన బుద్ధి మాంద్యముచే తానే అవమానమందును॥ చంద్రభూషణా! యాచించిన వాడు ఖండనము (అవమానము) పొందక తప్పదు॥ ఏదో కోరి చిర కాలము నేనాచరించిన తపస్సునకు ఫలమీయవ మానము ఆడుగడుగున తగులుచున్నది॥ శర్వా! నేను కుటిలను కాను; ధూర్జటీ! నేను విషమనుకాను; నీవు విషము తల పై గంగా జలము-కంఠమున విషము) కలవాడవు; దోషాకరునకు (రాత్రిని ఏర్పరచు చంద్రునకు-దోషములకు గని యగు వానికి) ఆశ్రయుడవు; అని కీర్తిగాంచిన వాడవు; నేను పూషుడను ఆదిత్యుని దంతములును భగుడను ఆదిత్యుని కన్ను లును కాను! ద్వాదశాత్ముడగు ఆదిత్యు (సూర్యునకును ఇది తెలియును; నీ తప్పులు నీకు ఉండగా నన్ను నిందించు నీచే నాకు తలనొప్పిగా నున్నది; నన్ను కృష్ణ (నల్లనిది) అనిన నీకు మహాకాలుడు (చాల నల్లనివాడు) అని ప్రసిద్ధి లేదా! తపస్సుచే దేహము త్యజింప నేను గిరి కేగుచున్నాను॥ ధూర్తునిచే అవమానమందిన నాకు జీవితముతో పనిలేదు॥ ఇట్లు కోపముతో తీక్షాక్షరముగా పలికిన పార్వతి మాటలు విని తడబాటుతో మీ శ్రమయిన అనురాగమున చంద్ర శేఖరుడగు భవుడిట్లనెను:
ఈశ్వరః : అనాత్మజ్ఞాసి గిరిజే నాహం నింధాపర స్తవ॥
చాటూ క్తిబుద్ద్యా కృతం స్తవాహం నర్మసంశ్రయమ్ ।
వికల్పః స్వస్థచి త్తేపి గిరిజే నైవ విక్రియా॥
యద్యేవం కుపితా భీరు త్వం తవాహం న వై పునః ।
నర్మవాదీ భవిష్యామి జహి కోపం శుచిస్మితే॥
శిరసా ప్రణతేనైష రచిత స్తే మయాజ్జులిః ।
స్నే హెన్యా వమానేన నిన్దితే నైతి విక్రియామ్॥
అసతాం న సతాం తస్మా న్నర్మస్పృష్ణో జనః కిల ।
అనే కై శ్చాడుభిర్దేవీ దేవేన ప్రతిబోధితా॥
కోపం తీవ్రం న తత్యాజ సతీ మర్మణి ఘట్టితా।
అవష్ట బమథాస్ఫోట్య వాసశ్శజరపాణినా॥
విపర్యస్తాలకా వేగాద్యాతుమైచ్ఛత్తు శైలజా ।
తస్యా ప్రజక్త్యాః కో పేన పునరాహ పురా నక॥
జాతా సర్వైరవయవై సుతాఒసి సదృశీ పితుః ।
హిమాచలస్య శృణెస్తెర్మేఘజాలాకులైర్మనః॥
తథా దురవగా హ్యేభ్యో గహనేభ్య స్తథాశయః ।
కాఠిన్యాజత్వమభ్య స్తంవనేభ్యో బహుధా గతమ్॥
కుటిలత్వం హి వర్మభ్యో దు సేవ్యత్వం హిమాదిభిః
సజ్క్రా స్తంసర్వథైవే త త్తన్వ జ్గిహిమభూధరాత్॥
ఇత్యుక్తా సా పునః ప్రాహ గిరీశం శైలజా రుషా ।
కోపసంరక్తనయనా ప్రస్ఫురద్దశ నచ్ఛదా॥
గిరిజా! నీవు పర్వతరాజ పుత్రివికదా! నా విషయము నీకు తెలియదు॥ నేను నిన్ను నిందింతునా ? నిన్ను ప్రశంసించు తలపుతోనే విలాసమున కై ఆమాట అంటిని॥ స్వస్థ చిత్తము కలవానికి కూడ ఒకప్పుడు చిత్త వికారము కలుగవచ్చును॥ కాని నా చిత్తమున కట్టి వీకారము (మార్పు) ఎన్నడును కలుగదు॥ కాని పిరికిదానా ! ఒక వేళ నీకిందుల కై కోపమే వచ్చినచో మరెన్నడు వినోదములు పలుకను; శుచిస్మితా! (నిర్మలమగు చిరునవ్వు కలదానవు కమ్ము;) కోపము మానుము; దోసిలి వట్టి శిరసు వంచి నమస్కరించుచున్నాను॥ ఎంత స్నేహము కలవారై నను తను అవమానించినను నిందించినను వినోద వచనములు తగిలినను మనస్సు మార్పు పొందుట దుర్జనుల లక్షణము కానీ సజ్జన లక్షణముకాదు॥ కాని శివుడనిన పైమాట దేవికి మర్మమున తాకుట చే తరువాత శివుడేంత బుజ్జగించినను నచ్చ జెప్పినను ఆమే కోపము విడువలేదు॥ శంకరుడు చేతితో గట్టిగ పట్టిన వస్త్రపు కొంగు కూడ చట్టున కొట్టినట్లు వదలించు కొని గిరిజ చెదరిన ముంగురులతోనే పోవుటకు సిద్దపడెను॥ ఆమె ఆట్లు కోపముతో పోవుచుండ పురాంతకుడు మరల ఇట్లనెను: “నీవు అన్ని అంశములందును నీ తండ్రిని పోలిన కూతురవు; మేఘ సమూహములతో కల్లోలితముగా వ్యాప మయిన నీ తండ్రి శిఖరములతో నీ మనస్సును చోరశక్యముకాని ఆడవుల నుండి నీ హృదయమును ఏర్పడినవి; కఠినత్వము వనములందలి వృక్షముల నుండి నేర్చితివి; నీతండ్రియందలి త్రోవలనుండి వంకరలు నేర్చితివి; మంచు మొదలగువానినుండి ఎవరికిని సేవింపనలవి కాక పోవుట నీక బ్బినది॥ సుందరీ! ఇదియంతయు నీకు హిమవంతుని నుండి సంక్ర మించినది సుమా! అని శివుడు పలుక గిరిజ మరింత కోపముతో కన్ను లేరవడగా పెదవులు వణకుచుండ ఇట్లనెను:
ఉమా : మా సర్వాందోషదానేన నిష్ఠాన్యాన్గుణినో జనా ।
తే చాపి దుష్టసమ్పరాత్సజ్క్రనాస్సర్వ ఏవ హి॥
వ్యాలేభ్యోధిక జిహ్మత్వం భస్మనా స్నేహబన్దనమ్ ।
హృతాలుష్యం శశాఙ్కాత్తే దుర్వచ స్త్వం విషాదపి॥
అత్రాస్తి కిం బహూ కేన అలం వాచా క్రమేణ తే ।
శ్మశానవాసాన్నిర్భీ స్వం నగ్నత్వాన్న తవ త్రపా॥
నిర్ఘృణ స్త్వం కపాలిత్వాద్దయా తే విగతా చిరమ్ ।
సూతః : ఇత్యుక్త్వా మన్దిరా త్తస్మాన్నిర్జగామ హిమాద్రీజా॥
పార్వత్యాః గౌరీత్వప్రాప్త్యర్థం తపోవనగమనమ్॥
తస్యాం ప్రజర్ల్యాం దేవేశ గజై : కిలకిలే కృతే ।
క్వ మాతర్గచ్చ సీత్యు క్త్వా రుదన్త ధావితాః పునః॥
విష్టధ్య చరణా దేవ్యా దీర కో బాష్పగద్దదమ్ ।
ప్రోవాచ మాతః కింశ్వేతత్వ యాసి కుపితా స్తరా॥
అహం త్వామనుయాస్యామి వ్రజ క్లీం స్నేహవర్జితామ్ ।
నో చేత్పతి ష్యే శిఖరాబ్దిరేరస్య త్వయోజ్జితః॥
ఉన్నా మ్య వదనం దేవీ దక్షిణేన తు పాణినా ।
ఉవాచ వీరకం మాతా మాశోకం పుత్త భావయ॥
శైలాగ్రాత్పతితుం నైవ న చ గస్తుం మయా సహ ।
యుక్తం తే పుత్త వక్ష్యామి యేన కార్యేణ తచ్ఛృణు॥
కృష్ణత్యుక్తా హరేణాహం స్తమ్భితం మే మన స్తదా ।
సాహం తపః కరిష్యామి యేన గౌరీత్వమాప్నుయామ్॥
ఏష స్త్రీలమ్పట్లో దేవో యాతాయాం మయ్యనన్దరమ్ ।
ద్వారరక్షా త్వయా కార్యా నిత్యం రన్గాన వేక్షిణా॥
యథా న కాచితవి శేద్యోషిదన్యా హరా నికం ।
దృష్ట్వాపరాం శ్రియం చాథ వదేథా మమ పుత్తక॥
శీఘమేవ కరిష్యామి యథా యుక్తమన స్తరమ్ ।
ఏవమ స్వితి దేవీం స వీరకః ప్రాహ సాంప్రతమ్॥
మాతురాజ్ఞామృతాహ్లాదప్లావితాజో గతజ్వరః ।
జగామ కక్ష్యం సంద్రష్టుం ప్రణిపత్య తు మాతరమ్॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే దేవాసుర సజ్గ్రామే దేవ్యా స్తపోవనగమనం నామ చతుఃపఞ్చాశదుత్తరశతత మోధ్యాయః॥
“తప్పలారోపించి సద్గుణవంతులగు ఇతరులనెందులకు ఆడిపోసికొనెదవు? నీవనిన దోషములును మాకు దుష్ట సంసర్గము వలననే సంక్రమించినవి॥ నీకుగల) సర్పములనుండి వంకరతనమును నీ భస్మముతో స్నేహమును గట్టి పర చుటయు (బూడిద జిడ్డును॥ స్నేహమును-తొలగించును॥) నీ చంద్రుని వలన హృదయ మాలిన్యమును నీ కుత్తుక యందలి విషము వలన చెడు మాటలును మాకు వచ్చినవి; ఎక్కువ చెప్పవలసినదేమున్నది; నోటికి శ్రమ కలిగించు కొనవలదు; వల్లకాటియందు నివసించు నీకు భయమేమి ? దిసమొలతో సుండు నీకు సిగ్గేమి ? తల పు రైలు పట్టుకొని తిరుగు నీకు దయ ఏమి ? ఆదేప్పుడో పోయినది॥” అని పలుకుచు హిమాద్రి పుత్రి ఆ మందిరమునుండి వెడలిపోసాగెను॥ పార్వతి యట్టు పోవుచుండ ప్రమథులు కిలకిల (దుఃఖ) ధ్వని చేసిరి॥ అమ్మా ! ఎక్కడికి పోవుచున్నావని ఏడ్చిరి॥ వెంట పరుగెత్తి రి॥ వీరకుడు దేవి పాదములు పట్టుకొని కన్నీటితో డగ్గుత్తిక తో ఇట్లనెను: తల్లీ : ఇదియేమి ? కోపించిన మనస్సుతో ఎక్కడికి పోవుచున్నావు ? నీవు స్నేహము వదలిపోవుచున్నను నేను నీవెంట వత్తును॥ లేక నీవు నన్ను వదలినచో ఈగిరి శిఖరమునుండి క్రింద పడెదను॥ అనగా దేవి తన కుడి చేతితో వీర కుని మొగమెత్తి ప్రీతిచూపుచు) అతనితో ఇట్లనెను: నాయనా! శోకమును భావన చేయకుము॥ నీవు నా వెంట వచ్చుటకాని పర్వతాగ్రమునుండి పడుట॥ కాని తగదు॥ ఏ పనితో పోవుచున్నా నో చెప్పెద వినుము; హరుడు॥ నన్ను నల్లని దానవనెను; దానితో నామనస్సు గట్టిపడినది; కనుక నేను తపమాచరించి గౌరత్వము (తెల్లదనము) పొందుదును॥ ఈ దేవుడు స్త్రీలంకటుడనిపించు చున్నది॥ కనుక నేను వెడలిన తరువాత నీవు ఎట్టివారికి ఏ అవకాశమునీయక ద్వారరక్ష సేయుచుండవలయును॥ శిపునికడకు అన్యశ్రీ ఎవరును ప్రవేశింపరాదు॥ ఆ టైవరైన ప్రవేశించినచో నాకు చెప్పుము॥ తరువాత శీఘ్రమే నేను తగినట్లు చేయుదును॥ వీరకుడు వెంటనే సరే అనేను॥ తల్లి ఆజ్ఞ అమృతమయి కలిగించిన ఆహ్లాదముతో ఆతని నంతాపము తగ్గేను॥ శరీరమును మనస్సును చల్లనయ్యెను॥ అతడు వెంటనే అమ్మకు నమస్కరించి కడ్యాంతరమును కని పెట్టి చూచుటకై బయలుదేరెను॥
ఇది శ్రీమత్స్య మహాపురాణమున దేవాసుర సంగ్రామమున దేవీ తపోవన గమనమను నూట ఏబది నాలుగవ అధ్యాయము॥
Summary of chapter 154 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the profound dialogue between Mahādeva and the Devas on Mount Kailāsa. To counter the vast armies of darkness, Mahādeva summoned His divine energy and generated the sacred divine mothers known as the Mātṛkās from His supreme spiritual effulgence. These fierce, radiant divine goddesses, including Brāhmī, Māheshvarī, Kaumārī, Vaishṇavī, Vārāhī, Māhendrī, and Chāmuṇḍā, possessed immense physical prowess and supernatural weaponry. Mahādeva commissioned the Mātṛkās to spearhead the battle against the demon hordes, establishing them as protective divine guardians of cosmic righteousness.