మత్స్య మహా పురాణము
225 - రాజు దండోపాయమును అవశ్యమాచరించవలెననుట. రాజునకు లోకపాలురతోడి సామ్యము.
శ్రీమత్స్యః : దణ్డప్రణయనార్థాయ రాజా సృష్ట స్వయమ్భువా ।
దేవభాగా నువాదాయ సర్వభూతాది గుప్తయే॥
తేజసా యద (దా)ముం కశ్చి నైవ శక్నోతి వీక్షితుమ్ ।
తదా భవతి లో కేషు రాజా భాస్కరవ త్ప్రభుః ॥
యదాస్య దర్శనే లోకః ప్రసాద ముపగచ్ఛతి ।
నయనానన్దకారిత్వా త్తదా భవతి చన్దమాః॥
యథా యమః ప్రియే ద్వేష్యే ప్రాప్తి కాలే ప్రయచ్ఛతి ।
తథా రాజ్ఞా విధాతవ్యాః ప్రజా సద్ది యమవ్రతమ్॥
వరుణేన యథా పాశై ర్బద్ధ ఏవ ప్రదృశ్యతే ।
తథా పాపా న్ని గృహ్లియా దత మేతద్ది వారుణమ్॥
పరిపూర్ణం యథా చన్దం దృష్ట్వా హృష్య ని మానవాః ।
తథా ప్రకృతయో యస్మి న చన్దప్రతిమో నృపః॥
ప్రతావయుక్త స్తేజస్వీ నిత్యం స్యా త్సర్వకర్మసు ।
దుష్టసామ స్తహింస్రేషు రాజా గ్నేయవ్రతే స్థితః॥
తథా సర్వాణి భూతాని బిభ్రతః పార్థివ వ్రతమ్ ।
ఇంద్రస్యార్కస్య వాతస్య యమస్య వరుణస్య చ॥
చంద్రస్యాగ్నేః పృథివ్యాశ్చ తేజోవతం నృపశ్చరేత్ ।
ఆ వార్షికాం శ్చతురో మాసా న్యణేశోప్యథ వర్షతి॥
తథాభివద్దే త్స్వం రాజ్యం కామ విన్హవ్రతం స్మృతమ్ ।
ఆప్టోమాసా న్యథాఒఒ దిత్య స్తోయం హరతి రశ్మిభిః॥
తథా హరేత్కరం రాష్ట్రాన్ని త్యమర్కవ్రతం హి తత్ ।
ప్రవిశ్య సర్వభూతాని యథా చరతి మారుతః॥
తథా చారై కి ప్రవేష్టవ్యం వ్రత మేతద్ది మారుతమ్॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే రాజధర్మే దణ్డోపాయ విచారే రాజ్ఞ స్సర్వదేవతా స్వరూప కథనం నామ పంచవింశత్యు త్తర ద్విశతతమోఽధ్యాయః॥
శ్రీ మత్స్య నారాయణుడు మనువుతో నిట్లు చెప్పెను: సర్వభూతములను అధిగోపనము (వాటియందు తాను అధిష్ఠాతగానుండి రక్షణము) చేయుటకై దండోపాయము నాచరించుటకుగా స్వయం భూబ్రహ్మ సకల దేవతాంశములను ఉపాదానకారణము (ముడి సరకు)గా తీసికొని రాజును సృష్టించెను; ఈతని తేజస్సుచే ఈతని నెవ్వరును తేరిపార చూడనైన జాలకు కావున రాజు భాస్కరుడువలేనే లోకములందు ప్రభువనబడుచు రాజు రవిగా వెలుగొందుచున్నాడు;
ఎపుడు (ఎందుచే) ఈతని దర్శనమున లోకము ప్రసాదమును హాయిని) పొందునో ఆపుడు (ఆందుచే) ఆతడు జన నయ నానందకరత్వ గుణముచే (రాజ) చంద్రుడగుచున్నాడు; ఎట్లు యముడు తగిన కాలము వచ్చినపుడు ప్రాణులకు ప్రియ (మగు సుఖమును ద్వేష్య(మగు దుఃఖమును ఇచ్చుచున్నాడో అట్లే ప్రజలకును రాజు యమ (వ్రతసమాన వ్రతమును ఆచరించవలసి యుండును; (రాజు ప్రజలలో మంచి పొరీ నాదరించవలెను; దుష్టులను దండించవలయును; వరుణుడు ఎల్లరను పాశములతో బంధించువాడుగానే కనబడు చున్నాడు; ఆపై రాజు కూడ పాపులను పారిపాపముల ననుసరించి నిగ్రహించ దండించవలేను: ఇది రాజాచరించ వలసిన దారుణవ్రతము కర్మము); పరిపూర్ణుడగు చంద్రుని చూచి నంతనే మానవుడు ఎట్లు హర్షమందునో అట్లే ఎవని విషయమందు ప్రకృతులు (ప్రజలును రాజోద్యోగులును హర్షింతురో అట్టివాడే చంద్ర సమానుడగు రాజు; రాజు ఆగ్నేయ (అగ్ని సమాన) వ్రతము నందుండి ప్రతాపయుక్తుడును తేజస్వియునై పాపకర్ములగు మానవుల విషయమందును దుష్టులగు సామంతుల విషయమందును హింసప్రాణుల విషయమందును. ప్రవర్తించవలయును: ధర భూమి తనంత తానై సర్వభూతములను ధరించునట్లే సర్వభూతములను ధరించు (పోషించు - రక్షించు - అదుపులోనుంచు) ఇంద్రార్క వాయు యమవరుణ చంద్రాగ్ని వృథివుల తేజోవ్రత రూపమగు పార్థివవ్రతమును రాజు ఆశ్రయించి చరించుచు వర్తించవలయును; ఇంద్రుడు వర్షర్తు మాసముల నాలుగింటి యందును వర్షించునట్లే రాజు కూడ తన రాష్ట్రమందు ఇచ్చకు వచ్చునట్లు మిక్కిలిగా వర్షించి ఇంద్ర వ్రతవర్తి కావలెను; ఆదిత్యుడు సంవత్సరమందలి ఎనిమిది మాసములపాటు కిరణములతో తోయమును లాగి కొనునట్లే రాజును తన రాష్ట్రమునుండి పన్ను లను లాగికొనవలెను: ఇది రాజు పూనవలసిన యరవ్రతము; మారుతుడు సర్వభూతములయందును ప్రవేశించి సంచరించునట్లే రాజుకూడ చారుల ద్వారమున సర్వభూతముల యందును ప్రవేశించవలయును; ఇది రాజవలంబించు మారుత(వాయు) వ్రతము.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున రాజధర్మమున రాజు దండోపాయమును ప్రయోగించుట ఆవశ్యక ర్తవ్యమనుటయు రాజునకు లోకపాలురతోడి సొమ్యమును అను రెండువందల ఇరువది యెదవ అధ్యాయము.
Summary of chapter 225 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon specialized neutralization rituals known as Utpāta-shānti, performed when extraordinary natural disasters or celestial portents occur. Bhagavān Matsya classifies portents into terrestrial, atmospheric, and celestial anomalies, such as unexpected earthquakes, meteors, unnatural weather, solar halos, or animal behavior shifts. Conducting elaborate fire sacrifices, feeding learned scholars, and distributing charity during such occurrences neutralizes impending calamities and shields the realm from destruction.