189 - మం (యం) త్రేశ్వరాది తీర్థ మహిమాను వర్ణనము॥

 మార్కణ్డేయః : నార్మదే చోత్తరే కూలే తీర్థం యోజనవి స్తృతమ్

యంత్రేశ్వరేతి విఖ్యాతం సర్వపాపహరం పరమ్

తత్ర స్నా త్వా నరో రాజ ఛైవతై స్సహ మోదతే

పఞ్చవర్షసహస్రాణి క్రీడతే కామరూపధృక్

 గర్జనంచ తతో గచ్ఛేద్యత్ర మేఘ స్తథోత్తితః

 ఇన్దజిన్నామ సమాప్త స్తస్య తీర్థ ప్రభావతః

 మేఘనాదం తతో గచ్ఛే ద్యత మేఘానుగర్జితమ్

మేఘనాదో గణ స్తత్ర గణసమ్పన్న తాం గతః

 తతో గచ్ఛేత్తు రాజేన్ద తీర్థ మామాత కేశ్వరమ్

తత్ర స్నాత్వా నరో గాజ నోసహస్రఫలం లభేత్

 నార్మదే చోత్తరే కూలే ధారాతీర్థ మనుత్తమమ్

తస్మిం స్తీర్థే నరస్స్నా త్వా తర్పయే తిపితృదేవతా

 కామా నర్వా నవాప్నోతి మనసా యే విచి స్తితాః

 తతో గచ్ఛేత్తు రాజేంద్ర బ్రహ్మావర్త మితి స్మృతమ్

తత్ర సన్నిహితో బ్రహ్మా నిత్యమేవ యుధిష్ఠిర

 తత్ర స్నాత్వాతు రాజేన బ్రహ్మలో కే మహీయతే

తతో గాణేశ్వరం(తతో గాలేశ్వరం) గచ్చేంద్ర యతో నియతాసనః

సర్వపాపవిశుద్దాత్మా రుద్రలోకం స గచ్చతి

తతో గచ్ఛేచ్చ రాజేన్ద కపిలాతీర్థ ముత్తమమ్

 తత్ర స్నాత్వా నరో *రాజ నర్వదానఫలం లభేత్

కళ జతీర్ణం గచ్చేత్తు దేవర్షిగణ సేవితమ్

తత్ర స్నా త్వా నరో *రాజ స్రుద్రలోక మవాప్నుయాత్

తతో గచ్చేత్తు రాజేన కుళ్లలేశ్వర ముత్తమమ్

తత్ర సన్ని హితో రుద్ర క్రిష్ణతే హ్యుమయా సహ

 తత్ర స్నాత్వా తు రాజేన్హ హ్యవధ్య ద శై రపి

పిప్పలేశం తతో గచ్చే త్సర్వపాపప్రణాశనమ్

తత్ర స్నా త్వాతు రాజేన్గ రుద్రలో కే మహీయతే

 తతో గచ్ఛేత్తు రాజేక్ట్ర విమలేశ్వర ముత్తమమ్

తత్ర దేవశిలా రమ్యా చేశ్వరేణ నివేశితా

 తత్ర ప్రాణా న్పరిత్యజ్య రుద్రలోక మవాప్నుయాత్

 తతః పుష్కరిణీం గచ్ఛేత్తత్ర స్నానం సమాచరేత్

స్నా తమాత్రో నర స్తత్ర హీంద్రస్యార్ధాసనం లభేత్

(*రాజ స్కపిలాదాన మాప్నుయాత్)

(*రాజంగోలోకం సమవాప్నుయాత్)

మార్కండేయుడు ఇట్లు చెప్పెను: నర్మదానది ఉత్తరపుటొడ్డున యోజన :స్తారముగల మం (యం) త్రేశ్వర మను సర్వపాప హరమగు గొప్ప తీర్థము గలదు; దానియందు స్నానమాడినవారు ఐదువేల ఏండ్లు కామరూప ధరులై దేవ తలతో కూడి విహరించుచు నుఖింతురు; తరువాత గర్జనమను తీర్థము; దానియందు స్నానమాడిన మేఘ మొకటి దాని ప్రభా వమున ఇంద్రజిత నునామమునంది ఉన్నతి పొందెను తరువాత మేఘ గర్జనమువలె ధ్వనించు మేఘనాద తీర్థ ము; దాని యందు స్నానమాడి మేఘనాదుడను గణ ప్రమథుడు గణాధిపతియయ్యెను; తరువాత ఆమాత కేశ్వర తీర్థ ము; దాని యందు స్నానమాడినచో గోసహస్ర దాన ఫలము కలుగును; తరువాత ధారాతీర్ణము; ఆది నర్వోత్తమము; దానియందు స్నానమాడి పితరులకు తర్పణము చేసినచో సర్వ చింతిత కామసిద్ధి యగును; తరువాత బ్రహ్మ సదాసన్ని హితుడయి యుండు బ్రహ్మావర్త తీర్థము; దానియందు స్నానము బ్రహ్మలోక ప్రాప్తినిచ్చును; తరువాత గాణేశ్వర తీర్థము; ఆట కేగి నియతుడై నియతమగు ఆసనమున కూర్చుండినచో సర్వపాప విశుద్దాత్ము డే రుద్రలోక మేగును; తరువాత ఉత్తమ మగు కపిల తీర్థము; దానియందు స్నానముచే నర్వదాన ఫలము సిద్ధించును; తరువాత దేవర్షి గణ సేవితమగు కరంజ తీర్థము; దానియందు స్నానముచే రుద్రలోక ప్రాప్తి; తరువాత కుండలేశ్వర తీర్థము; అది యుత్తమము; ఆందు రుద్రుడు ఉమతో సదా సన్నిధిచేసి యుండును; ఆందు స్నానమాడినవాడు దేవతలకును ఆవధ్యుడగును; తరువాత సర్వపాప నాశక మగు పిప్పలేశ తీర్థము; దానియందు స్నానము చే రుద్రలోక ప్రాప్తి; తరువాత ఉత్తమమగు విమలేశ్వర తీర్థము; అందు ఈశ్వరుడు నిలిపిన రమ్యమగు దేవశిల యొకటి గలదు; అచట ప్రాణత్యాగము చే రుద్రలోక ప్రాప్తి; తరువాత పుష్కరిణీ తీర్థము; ఆందు స్నానమాడినవాడు ఇంద్రుని ఆర్ధాసనమునకు ఆధికారి యగును

నర్మదా సరితాం శ్రేష్టా రుద్రదేహా ద్వినిస్సృతా

 తారయే త్సర్వభూతాని స్థావరాణి చరాణిచ

  సర్వదేవాధిదేవేన త్వీశ్వరేణ మహాత్మనా

 కథితా ఋషి సజ్ఘే భ్యో హ్యస్మాకంచ విశేషతః

మునిభి స్సంస్తుతా హ్యేషా నర్మదా ప్రవరా నదీ

 రుద్రదేహా ద్వినిషాన్హా లోకానాం హితకామ్యయా

సర్వపాపహరా నిత్యం సర్వదేవనమస్కృతా

 సంస్తుతా దేవగన్దర్వైరపురోభి స్తథే వచ

 నమః పుణ్య జలేహ్యా ద్యే నమ స్సాగరగామిని

నమస్తే పాపశమని నమో దేవి వరాననే

 నమోస్తు తే ఋషిగణసజ సేవితే నమోస్తు తే శఙ్కర దేహనిస్సృతే

నమోస్తు తే ధర్మభృతాం వరాననే నమోస్తు తే సర్వపవితపావని

 య శ్చేదం పఠతే స్తోత్రం నిత్యం శుద్దమనా నరః

 బ్రాహ్మణో వేదమాప్నోతి క్షత్రియో విజయీ భవేత్

వైశ్యస్తు లభతే లాభం శూద్ర శ్చైవ శుభాం గతిమ్

 ఆర్థార్దీ లభతే హ్యర్థం స్మరణాదేవ నిత్యశః

నర్మదాం సేవతే నిత్యం స్వయం దేవో మహేశ్వరః

 తేన పుణ్యా నదీ జ్ఞేయా బ్రహ్మహత్యాపహారిణీ

 ఇతి శ్రీమత్స్య మహాపురాణే నర్మదామాహాత్మ్యే యంత్రేశ్వర తీర్థాది మహిమానువర్ణనం నామ ఏకోననవత్యుత్తర శతత మోధ్యాయః

నర్మద సాక్షాత్ రుద్ర దేహమునుండి వెలువడిన నదీ, శ్రేష్ట; అది స్థిర చర భూతములనన్నిటినీ తరింపజేయ గలది; ఆని సర్వ దేవాది దేవుడు మహాత్ముడునగు ఈశ్వరుడు ఋషులకును విశ్లేషించి మాకును చెప్పియుండెను; నదీ, శేష యగు ఈ నర్మద మునులచే స్తుతింపబడునది; లోకములకు హితము చేయుట కె రుద్ర దేహమునుండి వెలువడినది; ఇది సర్వపాప హరము; సర్వదేవ నమస్కృతము; దేవతాగంధర్వాపరోనుతులను అందు కొనునది; పుణ్యజలా! ఆద్యా! సాగర గామినీ! పాప నాశనీ! - సుందర ముఖీ! దేవీ! ఋషిగణ సేవితా! శంకర దేహనిరతా! ధర్మపోషకులలో మేలగు దానా! సర్వ పవిత్ర వస్తువులనుకూడ పావనము చేయు దానా! నర్మదా! నీకు నమస్కారము అను ఈ స్తోత్రమును నిత్యమును శుద్ద మనస్కుడే పఠించినచో బ్రాహ్మణులకు వేద విద్యయు క్షత్రియునకు విజయమును వైశ్యునకు ధన లాభ మును శూద్రునకు సద్దతియు కలుగును ధనార్జికి ధనమును లభించును; మ హేశ్వర దేవుడే స్వయముగ దీనిని సదా సేవించునన్న చో ఇది బ్రహ్మహత్యా దోషమునుకూడ పోగొట్టగలదని వేరుగా చెప్ప పని లేదు

ఇది శ్రీమత్స్య మహా పురాణమున నర్మదా మాహాత్మ్యమున మం (యం) త్రేశ్వరాది తీర్థ మహిమాను వర్ణనమను నూట ఎనుబది తొమ్మిదవ యధ్యాయము