మత్స్య మహా పురాణము
262 - లింగ ప్రతిష్ఠ స్థాన నిర్ణయము - లింగ లక్షణము.
సూతః : అథాత స్సంప్రవక్ష్యామి లిజ్గలక్షణ ముత్తమమ్ ।
సుస్నిగ్ధంచ సువర్ణం చ లిజ్గం కుర్యా ద్విచక్షణః॥
ప్రాసాదస్య ప్రమాణేన లిజమనం ఏధీయతే ।
లిజమానేన వా విద్యా తాసాదం శుభలణమ్ ॥
చతురశ్రే సమే గర్జే బ్రహ్మసూత్రం నిపాతయేత్ ।
వామేన బ్రహ్మసూత్రస్య అర్చాం వా లిజ్ఞమేవ చ॥
ప్రాగుత్తరేణ లీనంతు దక్షిణాపర మాశ్రితమ్ ।
పురస్యాపరదిగ్భాగే పూర్వద్వారం ప్రకల్పయేత్॥
పూర్వేణ చాపరం ద్వారం మా హేన్దం దక్షిణా త్తరే ।
ద్వారం విడజ్య పూర్వం తు ఏక వింశతిభాగీకమ్॥
తతో మధ్యగతం జ్ఞాత్వా బ్రహ్మసూత్రం ప్రకల్పయేత్ ।
తస్యార్ధం తు త్రిధా కృత్వా భాగం చోత్తరత స్త్యజేత్॥
ఏవం దక్షిణత స్య క్త్వా బ్రహ్మస్థానం ప్రకల్పయేత్ ।
భాగా ధేన తు యల్లిజం కార్యం తదిహ శస్యతే॥
పణభాగవిధ కే వా త్రిభాగే జ్యేష్ఠ్య ముచ్యతే ।
భాజి తే నవధా గర్ళే మధ్యమం పాజ్ఞ్చభాగికమ్॥
పజ్చధిగవిభ క్షేన కనీయా నేక భాగిక ।
ఏకస్మిన్నేవ నవధా గర్బే లిజ్ఞాని కారయేత్॥
సమమాత్రం విభజ్యాథ నవధా గర్భభాజితమ్ (జనమ్) ।
జ్యేష్ఠ మర్ధం కనీయార్ధం తథా మధ్యమమధ్యమమ్ (మర్ధకమ్)॥
ఏవం గర్భ స్సమాఖ్యాత స్త్రిభి ర్భాగై ర్విభాజయేత్ ।
జ్యేష్ఠం తు త్రివిధం జ్ఞేయం మధ్యమం త్రివిధం తథా॥
కనిష్ఠం త్రివిధం తద్వ ల్లిజ్గభేదా న్నవై వ తు।
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పేను; ఇంతవరకును దేవతా పీఠ కాలక్షణమును తెలిసికొంటిమి; కనుక ఇప్పుడు ఆందు ప్రతిష్ఠించవలసిన లింగపు లక్షణమును తెలి పెదను: ఇది ఉత్తమమయినది; శాస్త్ర సంప్రదాయముల నెరిగిన విద్వాంసుడగు శిల్పికొని ఆగమ శాస్త్రవేత్త కాని లింగమును బొల నునుపుగాను చక్కని వన్నెతో మెరయుచుండునట్లును నిర్మించవలయును; ప్రాసాదము (దేవతాగృహము. దేవాలయము)ను ముందుగా నిర్మింపజేసి దాని కొలతను దృష్టియందుంచు కొని దానికి అనుగుణముగా లింగమునై న చేయవలయును; లేదా ప్రతిష్టించదలచిన లింగపు ప్రమాణమును మనస్సు నందుంచుకొని దాని కొలతకు అనుగుణముగా దేవాలయమును నిర్మించనే సవచ్చును; ఎటులయినను లింగము కానీ ప్రాసా దముకాని ఈ రెండును శుభలక్షణములు కలిగి చూచుటకు అందముగా నుండవలయును.
దేవాలయపు గర్భ గృహమందు అర్చామూర్తినో లింగముచే ప్రతిష్టించుటకు ఉద్దేశించిన ప్రదేశమునందు చతురసమయి లోతుకూడ చతురసపు భుజ పరిమాణమంతయే యున్న (సమఘనాకారపు) గుంతను త్రవ్వవలయును; ఆ గుంతయందు ముందు చెప్పబోవు కొలతలను అనుసరించి బ్రహ్మసూత్రమును (ఆలయ గర్భగృహ మధ్యభాగమును నిర్ణయించు సూత్రమును – దారమును. రజ్జువును) ప్రసాదించవలయును; ఈ బ్రహ్మ సూత్రము మీదుగ సరిగాలింగపు నడుమ బిందువు వచ్చు నట్లు కాక లింగపు నడుమ బిందువు ఈ బ్రహ్మసూత్రమునకు కొంచెము ఎడమవైపుగావచ్చునట్లు లింగమును గానీ అర్చామూర్తినిగాని ప్రతిష్ఠించవలయును.
పుర (గ్రామ)మునకు పశ్చిమ దిశగా ఆందును కొంచెము దక్షిణమున దేవాలయమును నిర్మించవలయును; అది కొలదిగ ఈశాన్యమునకు మలుపుగా నుండవలయును: ఆలయపు ద్వారము తూర్పుదిశ యందుండవలయును; ఈ ద్వారమునకు తూర్పుగా మరియొక ద్వారముకూడ ఉండవలయును; ఈ ద్వారమును ‘మహేంద్రము’ అని వ్యవహ రింతురు; ఈ రెండిటిలో మొదటి వాకిటి దక్షిణా త్తర మానమును ఇరువదియొక భాగ*ములుగా విభజించవలయును; వానిలో నడిమి భాగపు నడిమి బిందుస్థానమును గుర్తించి దానిమీదు గా బ్రహ్మ సూత్రమును నిలుపవలయును.
1. తరువాత (ఈ ద్వారపు దక్షిణా త్తరాయామమును నాలుగు చతుర్థాంశములుగా విభజించి వానియందలి దృక్ష్మణ్ త్తర చతుర్థాంశములను రెంటిని వదలి నడుమ మిగిలిన చతుర్థాంశములను రెంటిని కలుపగా అర్ధ భాగమగును కావున ఆ) ద్వారాయామపు ఆర్గ భాగమును మూడు భాగములుగా చేయవలయును; వీనియందలి దక్షిణ తృతీయాంశమును ఉత్తర తృతీయాంశమును వదలి నడుమనున్న తృతీయాంశములో ఆర్థాంశ మును గ్రహించవలెను. ఈ నడిమి తృతీయాంశపు రెండు అవధుల నడిమి కొలతను బ్రహ్మ స్థానమందురు; దీనికే గర్భ స్థానమనియు వ్యవహారము. లింగపు అడ్డుకొలత వ్యానము ఈ పరిమాణములో నుండునట్లు చేయించవలయును; ఇదియొక విధమగు లింగ పరిమాణ నిర్ణయప్రకారము. ఇది సర్వసాధారణ ప్రకారము.
2. లేదా ద్వార దక్మిణోత్తరాయామమును ఐదు భాగములుగా చేయవలయును. వానియందలి దక్షిణా త్తర భాగద్వయమును వదలవలయును. నడిమి భాగత్రయమును గ్రహించవలయును! ఈ నిడివిని బ్రహ్మ స్థానము (గర్భ స్థానము)గా గ్రహించి ఇంత అడ్డుకొలతతో అడ్డు వ్యానములో లింగమును నిర్మింపజేయవలయును; ఇది జ్యేష్ఠ పరిమాణము.
3. లేదా-ద్వారదక్షిణా త్తరాయామమును తొమ్మిదిగా విభజించవలయును; వానియందలి దక్షిణ భాగద్వయ మును ఉత్తర భాగద్వయమును వదలవలయును; నడిమి భాగవంచకమును గ్రహించవలయును. ఇది బ్రహ్మస్థానముగా గ్రహించి ఈ ప్రమాణమును లింగపు ఆడ్డుకొలత వ్యాసముగా గ్రహించి ఆట్టికొలతతో లింగమును నిర్మింపజేయ వలయును. ఇది మధ్యమ పరిమాణము. .
4. ద్వారదక్షిణోత్తరాయామమును ఐదు భాగములు చేసి ఉత్తర భాగద్వయమును దక్షిణ భాగద్వయమును వదలవలయును: నడిమి పంచమాంశ పరిమాణమును లింగపు ఆడువ్యానముగా గ్రహించి ఆ పరిమాణముతో లింగ మును నిర్మింపజేయవలయును. ఇది కనిష్ట పరిమాణము.
ఇది కాక జ్యేష్ట మధ్యమ కనిష్ట పరిమాణక లింగములను మూడింటిని కూడ మరల ఉపవిభాగములతో తొమ్మిది విధములుగా నిర్మించు పద్దతియు కలదు. ఆది ఎట్లన-జ్యేష్ఠ పరిమాణక లింగపు పరిమాణమును మధ్యమ పరిమాణక లింగపు పరిమాణమును కనిష్ఠ పరిమాణక లింగపు పరిమాణమును కూడ వేరువేరుగా తొమ్మిదేసి భాగములుగా చేసి యుంచుకొనవలయును. వీనియందలి ప్రతియొక జ్ఞానవమాంశ మును మరల రెండుగా విభజించవలెను;
ఇపుడు - (1) జ్యే 8/9 + జ్యే 1/18 + జ్యే 1/18 = జ్యేష్ఠ జ్యేష్ఠము; (2) జ్యే 8/9 = జ్యేష్ఠ 1/18 మధ్యమము; (3) జ్యె 8/9- + జ్యే 1/18 + క 1/18 = జ్యేష్ఠ కనిష్ఠము; (4) మ 8/9 + మ 1/18+ జ్యే 1/18 =మధ్యమ జ్యేష్ఠము; (5) మ 8/9 + మ 1/18 + మ 1/18 = మధ్యమ మధ్యమము; (6) మ 8/9 + మ 1/18 + క 1/18 = మధ్యమ కనిష్ఠము; (1) క 8/9 + క 1/18 +జ్యే 1/18 = కనిష్ఠ జ్యేష్ఠము; (8) (క) 8/9 + క 1/18+మ= కనిష్ఠ మధ్యమము; (9) క 8/9 + క 1/18+క 1/18 = కనిష్ఠ కనిష్టము. (ఆని ఇట్లు నవధాలింగ భేద నిర్మాణమని మూల శ్లోకముల యన్వయమునుబట్టి స్ఫురించు చున్నది; దీనిని సంప్రదాయజ్ఞులవలన తెలిసికొని నిశ్చయించుకొన వలెను.
(* ఆలయ ప్రాగ్ద్వారపు ఉత్తర దక్షిణాయామమును ఇరువదియొక సమభాగములు చేయవలెను అనుటనుబట్టి.సాధార ణముగా వీరు (ప్రాచీనులు) ఆలయద్వారమును 84 అంగుళములు దక్షిణా త్తరాయామముతో పెట్టెడి వారనియు ఆనాటివారి ప్రమాణదండము (కొలత కర్ర) మీద 4 ఏసి అంగుళములకు ఒకటి చొప్పున గీతలు గీచి ఉంచు కొనెడివార నియు తోచును.)
నాభ్యర్ధ మష్ట భాగేన విభజ్యాథ సమం బుధైః ॥
భాగత్రయం పరిత్యజ్య విష్కమ్భం చతురశ్రకమ్ ।
అష్టాశ్రం మధ్యమం జ్ఞేయం వృత్తభాగం తదూర్ధ్వతః॥
వికీర్ణ చేత్తతో గృహ్య కోణాభ్యాం లాఞ్చయే ద్బుధః ।
అష్టాశ్రం కారయే త్తద్వ దూర్ధ్వ మ ప్యేవ మేవతు॥
కిక్చచ్చ పూజనం జ్ఞాత్వా షోడశాశ్రం ప్రదర్శయేత్ ।
షోడశాక్రం కృతం వశ్చా ద్వర్తులం కారయే తతః॥
ఆయామం తస్య దేవస్య నాభ్యాం వై కుష్ఠలీకృతమ్ ।
మా హేశ్వరం త్రిభాగం తు ఊర్ధ్వవృత్తం తు యష్ఠాతమ్॥
అధస్తా ద్బహ్మదాగస్తు చతురస్రో విధీయతే ।
ఆష్టాశ్రో వైష్ణవో భాగో మధ్య స్తస్య ఉదాహృతః॥
ఏవం ప్రమాణయుక్తం చ లిజ్గం వృద్ధిప్రదం భవేత్ ।
లింగరూప విశేష కథనము: లింగలక్షణము నెరిగి శిల్పి లింగమునందలి నాభి(నడుమ)నుండి క్రింది నగమును ఎనిమిది సమభాగములు చేయవలెను; దానియందు పైనుండి మూడు అష్టమాంకములను వదలి మిగిలిన ఐదు ఆష్టమాంశ ములను చతురస్రముగా చేయవలెను; పైమూడు అష్టమాంకములను అష్టాగ్రముగా నిర్మించవలేను: అందులకై పద్దతి ఏమనిన వికీర్ణ• (వెడల్పుగా - చతురస్రముగా చేయబడిన) ముఖములలో ప్రతిదానియందును రెండు చివరలయందలి కొంత కొంత భాగమును కోణములుగా చెక్కవలేను. అపుడది సహజముగా ఆష్టా సముగా అగును; . ఇపుడిక మిగిలిన లింగపు నాభ్యూర్వ భాగమును గూడ ఎనిమిది సమభాగములుగా చేసి దానియందు నాభినుండి పైకిగల మొదటి మూడుభాగములను కూడ అష్టా సముగా చేయవలెను. సౌభూర్వమందలి పూజాయోగ్య దేశమందు ఆరంభించి షోడశాస్రముగా రూపొందించుచు క్రమముగా దానిని వర్తులముగా చేసి ముగించవలయును. కాని నడిమి గురుతున కై నాభి భాగమునందు కుండలీకరణము (గుండ్రని రేఖను కొంచెములోతుగా చెక్కుట) చేయవలయును; (ఇపుడిట్లు మొత్తము లింగము 16 భాగములై ఆందు క్రింది5/16 చతురస్రముగా దానికి పైగా 6/16 భాగములు అష్టాగ్రముగా మిగిలిన 5/16 లో కొంత భాగము షోడశాస్రముగా కొంతభాగము వర్తులముగానై నది; కాని షోడశాస్రముకూడ వర్తులముగానే భావించ వలయును; ఇందు చతురస్రము బ్రహ్మాంశము; అష్టానము విష్ణునంశము; వర్తుల ము ఈశ్వరాంశము; ఇట్లు మొత్తము లింగము మూ ర్తిత్రయాత్మకమయినది; ఇట్లు ఈ చెప్పిన ప్రమాణములతో నిర్మించబడిన లింగము యజమానునకును ప్రజలకును వృద్ది క్షేమప్రదము.
(* మత్స్య.అధ్యా-262; శ్లో. 14; లింగ లక్షణాధ్యాయము
“వికీర్ణేచే త్రతోగృహ్య-కోణాభ్యాంలాంఛయేద్బుధః" వికీర్ణం-విస్తారితం - వ్యాపితం; తస్మిన్ వికీర్ణే; అనగా వెడల్పుగానున్న; పార్శ్వే-చతురస్రస్య - ఇతి శేషః; చ+ఇత్ = చేత్ యది అను ఆర్థమున- చేత్-కాదు; ఇత్- ఏవార్థకము; చ-ఇత్ =చ- ఏవ; కాగా విస్తారితే-చతురస్రస్య పార్వే ఏవ గృహ్య-గృహీత్వా-బుధః లింగనిర్మాణశాస్త్రజ్ఞః-కోణాభ్యాం లాంఛ యేత్ - అని అన్వయము.
లింగమును రూపొందించుటకై నిర్దేశించుకొనినశిలకు దిగువభాగమునందలి చతురస్రపు ప్రతియొక పార్శ్వమును తీసికొని అట్టి ప్రతియొక పార్శ్వమునందును రెండేసి కోణములను ఏర్పరచవలెను. ఆ కోణములతో ఆ శిల' లాంఛితము' 'లక్షణము గుర్తుక లది'గా ఆగును; దీనితో ఈ చతురస్రము అష్టానముగా మారును; ఇట్లే అష్టాగ్రమును షోడశాక్షముగా మార్చవచ్చును; ఆది క్రమముగా వర్తులమగును. ఇట్లు మొత్తము లింగమును 16 భాగములు చేయగా అందు-క్రిందినుండి మొదటి 5/16 భాగములు చతురస్రమగును; నడిమీ 6/16భాగములు అష్టానమగును. మిగిలిన పై 5/15లో కొంత భాగము షోడశాస్రమై అది క్రమముగా వర్తులమగును.)
అథాన్యదపి వక్ష్యామి గర్బమాన ప్రమాణతః॥
గర్బమానప్రమాణేన లిజ్గం యదుచితం భవేత్ ।
చతుర్ధా తడ్విభజ్యాథ విషమం తు ప్రకల్పయేత్॥
తదేవ చాయతం సూత్రం జాగత్రయ వికల్పితమ్ ।
ఆధస్తా చ్చతురశ్రం తు అష్టాశ్రం మధ్య భాగతః॥
పూ బౌభాగ స్తతో ఒరైన నాభిభాగ స్తథోచ్యతే ।
ఆయామే తద్భవేత్సూత్రం నాహస్య చతురశ్ర కే॥
చతురశ్రం పరిత్యజ్య అష్టాశ్రస్య తు యద్భవేత్ ।
తస్యావ్యర్ధం పరిత్యజ్య తతో వృత్తం తు కారయేత్॥
శిరః ప్రదక్షిణం తస్య సజ్జప్తం వర్ణతో భవేత్ ।
జ్యేష్ఠం పూజ్యం భవేల్లిజ మధస్తా ద్వీపులం చ యత్॥
శిరసా సదా నిమ్నం మనోజ్ఞం లక్షణాన్వితమ్ ।
సౌమ్యం తు దృశ్యతే లిజం లిజం తద్వృద్ధిదం భవేత్॥
అథ మూలేచ మధ్యేచ ప్రమాణం సర్వత స్సమమ్ ।
ఏవం విధం తు యల్లిజం భవే త్త త్సార్వకామికమ్॥
అన్యథా యద్భవేల్లిజం త దస త్సమచక్షతే ।
ఏవం రత్నమయం కుర్యా త్స్ఫాటికం పార్థివం తథా॥
శుభం దొరుమయం వాపి యద్వా మనసి వర్తతే॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే లిజ్గలక్షణం నామ ద్విషష్ట్యుత్తర ద్విశతతమోధ్యాయః॥
గర్బాలయపు ప్రమాణము ననుసరించి తగినట్లు నిర్మించదగిన లింగలక్షణ మును మరియొకదానిని తెలి పెదను; ఎట్లనగా పైని చెప్పినట్లు గర్బాలయద్వార ప్రమాణముననుసరించి జ్యేష్ట మధ్యమ కనిష్ట పరిమాణములలోను వానినుండి ఏర్పడు నవధాభేదములలోను ఏ పరిమాణమునే నను గ్రహించి ఆ పరిమాణము మొత్తపు లింగపు నిలుపుదీత్తులో నాలుగవ వంతగునట్లు చూడవలేను. అనగా ఈ గ్రహించిన పరిమాణమునకు నాలుగింతల పొడవుతో లింగముండ వలెను. ఈ మొ త్తము ఎత్తును మూడు సమ భాగములుగా చేసి మొదటి క్రింది భాగమును చతురస్రముగా నుంచవలేను; నడిమి భాగమును అష్టాగ్రముగా మలచవలేను. ఈ అష్టానభాగమందలి నగము (ఇది మొత్తము లింగపుటెత్తులో సగమే కదా!) దగ్గర రేఖనిర్మించి దానిని పూజాభాగముగా గుర్తించవలేను. ఇపుడు ఆష్టానభాగము రెండు ఆర్ధభాగములయినది; అష్టాద్రపుపే ఆరభాగమునకు పైని మిగిలియుచ్న భాగమును క్రమముగ వరులముగా చేయవలెను. లింగశిరోభాగము అన్ని ప్రక్కలకును పల్లముగా వాలుచు ఆందముగా నుండవలెను; లింగము దిగువ భాగముకంటే పైనుండు భాగము తక్కువ క్యానముతో నుండవలెను; ఇట్లున్న జ్యేష్ట పరిమాణక లింగము పూజ్యమగును: మొత్తముమీద చూడగా లింగపు చతురనభాగపు నాలుగు భుజములచుట్టు కొలత (*నాహస్య-పరిణాహస్య - సూత్రం-ఆయామే స్యాత్) ఎంతయో లింగపు ఎత్తు అంత ఉండవలెను. ఇట్లు మనోహరమగుటతోపాటు లక్షణయుక్త మగుచు సౌమ్యముగా కనబడు లింగము వృద్ధి ప్రదముగానుండును; ఇట్లు క్రింది వ్యాసపు కొలతకంటే పై వ్యాసపుకొలత తక్కువకాక- మూలమందును నడుమను అంతమందును సమానముగానుండు లింగము సర్వకామ ఫలప్రదమగును; ఈ రెండు విధములలో ఏదియు కాని లింగము ఆనత్ (మంచిదికాని) లింగము అని పెద్దలందురు.
ఇట్లు లింగమును రత్న ములతోనో స్పటికముతోనో మృత్తిక తోనో శిలతోనో దారువుతోనో తన మనస్సునకు నచ్చిన ఏ పదార్థముతోనై నను చేయించవచ్చును.
ఇది శ్రీమత్స్య మహా పురాణమున లింగలక్షణ ప్రతిపాదనమను రెండు వందల అరువది రెండవ అధ్యాయము.
(* పరిణాహ <పరి(ఉపసర్గ)+నాహ; అని రూపనిష్పతి; ఇచట ఆరప్రయోగముగా 'పరి' అను ఉప సర్గము లేకయే ఆ ఉపసర్గ ఉన్న చో ఇచ్చు ‘పరిణాహము’ అను అర్థమున ‘నాహ’ పదము ప్రయోగించబడినది. అని విజ్ఞులు గ్రహింతురుగాక.)
Summary of chapter 262 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya outlines the precise iconographic guidelines for sculpting images of Sūrya Deva and Bhagavān Brahmā. Bhagavān Matsya describes Sūrya Deva clad in northern protective armor, holding two lotus blossoms at shoulder height, wearing a radiant crown, seated upon a single-wheeled chariot drawn by seven glowing horses driven by Aruṇa, flanked by his consorts Rājñī and Nikshubhā. Bhagavān Brahmā is depicted with four heads, four arms holding the Vedic manuscripts, rosary, water pot, and sacrificial ladle, seated upon a sacred lotus or riding His divine swan vehicle.