249 - క్షీరసాగరమథనమున చంద్రాదుల ఉత్పత్తి.

 సూతః : నారాయణవచ శుత్వా మమంథుస్తే మహోదధిమ్

తత్పయ స్సహితా భూత్వా చక్రిరే భృశ మాకులమ్

 తత శ్శతసహస్రాంశుసమాన ఇవ సాగరాత్

 ప్రసన్నా భస్సముత్పన్న స్సోమ శ్శీతాంశు రుజ్జ్వల

శ్రీ రనంతర ముత్పన్నా ఘృతా త్పాణ్డార వాసినీ

సురా దేవీ సముత్పన్నా తురగః పాణ్ణుర స్తథా

కౌస్తుభశ్చ మణిర్దివ్య శ్చాత్పన్నోఒమృతసమ్భవః

మరీచివికచ శీమా న్నారాయణ ఊరోగతః

పారిజాతశ్చ వికచకుసుమ స్తబకాన్వితః

ఆనన్తర మపశ్యం స్తే ధూమ మమ్బరసన్నిభమ్

 ఆపూరితదిశాభాగం దుస్సహం సర్వదేహినామ్

త మాఘ్రాయ సురా స్సర్వే మూర్ఛితాః పరిలమ్బితాః

కాలకూట విషోత్పత్తిః.

ఉపవిశ్యామ్బుధిత పే స్వశిరో గృహ్య పాణినా

తతః క్రమేణ దుర్వార సోనలః ప్రత్యదృశ్యత

జ్వాలామాలాకులాకారః సమన్హాద్భీషణార్చిషా

తేనాగ్నినా పరిక్షిప్తా ప్రాయశ స్తే సురాసురాః

దగ్ధాశ్చాప్యర్ధదగ్దాశ్చ బభ్రము స్సకలా దిశః

 ప్రధానా దేవదై త్యాశ్చ భీషితా స్తేన వహ్ని నా

సూతుడు ఋషులకిట్లు చెప్పెను: నారాయణువచనమును విని ఆ దేవదానవులు మహోదధి నింకను మథించిరి; ఒక్కుమ్మడిగ త జలమును మిగుల కల్లోలపర చిరి; అంతట సాగరమునుండి శతరవి సమానుడో యన గనవచ్చుచుండియు హాయిగొలుపు కాంతులు గల చల్లని కిరణముల సోముడుతన్నుడయ్యెను; తరువాత క్రమముగ ఘృతమునుండి తెల్లని వస్త్రముధరించిన లక్ష్మియు సురాదేవియు శ్వేతాశ్వమును అమృత సంభవమును కిరణవికాసియు నారాయణ వక్షోవిభూషణ మునునగు దివ్యకౌస్తుభమణియు వికసిత కుసుమ స్తబకసమన్వితమగు పారిజాత వృక్షమును ఉత్ప త్తినందెను; అనంతర మంబర సమానమును జపూరితదిశాభాగమును సర్వప్రాణులకును దుఃసహమునునగు ధూమము వారికి కనబడెను; దాని నాఘ్రాణించినంత సురులందరును మూర్చితులగుచు వ్రేలాడుచు చేతితో తలలు పట్టుకొని సముద్రతటమున కూర్చుండిరి. అనంతరము అది క్రమముగ దుర్వారమును జ్వాలామాలాకులా కారమునునగు అనలమయి కనబడెను; భయానక జ్వాలాయుతమయి ఆన్ని దిశల క్రమ్మిన ఆ అగ్నిచే క్రమ్మబడి ఆసురాసురులలో చాలమంది దగ్గులో ఆరదగ్గులోఐ అన్ని దిశలకు పరుగిడుచుండిరి. దేవదైత్య ప్రధానులును ఆవహ్నిచే భీషితులయిరి.

 అనన్తరం సముద్భూతా స్తస్మా డ్డుణ్డుభ జాతయః

 కృష్ణసర్పా మహాదంష్ట్రా రక్తాశ్చ పవనాశనాః

 శ్వేతపీతా స్తథా చాన్యే తథా గోనసజాతయః

మశకా భ్రమరా దంశా మక్ష్మి కా శ్శలభా స్తథా

 కర్ణశ ల్యాః కృకలాసా అనేకా శ్చైవ బభ్రముః

ప్రాణినో దంష్టితో రౌద్రా స్తథా హి విషజాతయః

శార్జహాలాహలా ము స్తవత్సకం గుల్మవత్సకాః

నీలపత్రాదయ శ్చాన్యే శతశో బహు భేదినః

 యేషాం గన్దేన దహ్య నే గిరిశృణోణ్యపి ధ్రువమ్

 అన స్తరం నీలరసౌఘభృఙభిన్నా జ్ఞానాభం విషమం శ్వసన్తమ్

 కాయేన లోకా స్తోరపూర కేణ కే శై శ్చ వహ్నిప్రతిమై ర్జ్వలద్భిః

సువర్ణముక్తాఫలభూషితాబ్దం కిరీటినం పీతదుకూలజుష్టమ్

 నీలోత్పలాభై  కుసుమైః కృతార్థం గర్జన మమ్భోధారభీమవేగమ్

అద్రాక్షు రమ్భోనిధిమధ్యసంస్థం సవిగ్రహం దేహిభయాశ్రయం తమ్

 విలోక్య తం భీషణ ముగ్రనేత్రం తేసుశ్చ భూతాని సురాశ్చ సర్వే

కేచి ద్విలోక్యైవ గతాహ్య భావం నిస్సంజ్ఞతాం చాప్యపరే ప్రపన్నాః

 వేము ర్ముఖేభ్యోఒపి చ ఫేన ముగ్రం త్వన్యే ని పేతుశ్చ మహార్ణవే చ

శ్వా సేన తస్య నిర్దగా స్తతో విష్ట్విస్త్ర దానవాః

దగ్గాడ్గార నిభా జాతా యే భూతా దివ్యరూపిణః

తతస్తు సమమా ద్విష్ణు స్తమువాచ సురాత్మకమ్

 శ్రీభగవా : కో భవా నస్తకప్రఖ్యః కిమిచ్చసి కుతోపి వా

కిం కృత్వాతి ప్రియం జాయే త్తదేవాచక్వ మేఖిలమ్

 తత్తు తస్య వచ శుత్వా విష్ణోః కాలాగ్ని సన్నిభః

ఉవాచ కాలకూటస్తు భిన్న దున్దుభినిస్వనః

కాలకూటః: అహం హి కాలకూటాభ్యో విషోమ్బుధి సముద్భవః

యదా తీవ్రతరామరైః పరస్పరవధే షిభిః

 సురాసురై ర్విమథితో దుర్గామ్భోనిధి రాదృతైః

సమ్భూతోహం తదా సర్వా హన్తుం దేవా నదానవా

 సర్వా నిహ హనిష్యామి క్షణమాత్రేణ దేహినః

మాం వా గ్రసధ్వం వై సర్వే యూయం దేవా స్సదానవాః 

అనంతరము దానినుండి  డుండుభ జాతులును మహాదంష్ట్రములగు కృష్ణసర్పములును రక్తసర్పములును శ్వేత సర్పములును పీత సర్పములును గోనసజాతి సర్పములును మశకభ్రమర దంశ మడి కాశ లభ కర్ణశల్యకృకలా సము(తొండ) లును కోరలు కల రౌద్ర ప్రాణులును విషజాతి సర్పములును శార్జ-హాలాహల - ముస్తక - గుల్మవత్సక - నీలపత్రాదిశత వీధపదార్థములును బయటకువచ్చెను; వాటిగంధ మాత్రమున గిరీశృంగములును నిశ్చయముగ దగ్గములగును; అనంతరము నీలరసమువలే తుమ్మెదలవలేచీల్చిన కాటుక కొండవలే మెరయుచు విషమమయి బుసలు కొట్టుచు లోకాంతరపూరకమగు దేహముతోను అగ్ను లవలే జ్వలించు కేశ ముల తోనుకూడి బంగరుతో ము తైములతో భూషిత శ రీర మయి కిరీటమును పీత దుకూలమును దాల్చి నల్లకలువలవంటి కుసుమముల ధరించి కృతార్థమయి మేఘమువలె గర్జించుచు భయానక వేగవంతమయి ప్రాణుల భయమెల్ల రూపొందేనోయనునట్లు సముద్ర మధ్యమందుండిన యొక విషరాజము వారికి కనబచేను. భయంకరా కృతియు భయానక నేత్రములునుకల అద్దానిని చూచినంతనే సకల భూతములును సకల సురులును భయమందిరి; దర్శన మాత్రమున అందరు నశించిరి; మరికొందరు నిస్సంజులయిరి; ఇంకను కొందరు నోళ్లనుండి నురుగులు కక్కిరి; ఇతరులు మహార్ణవమున పడిపోయిరి; దాని శ్వాసముతో నిర్ణగులయి బ్రహ్మ విష్ణ్వాంద్రాదులును దానవులును దివ్యరూపులు కూడ మాడిన బొగ్గులవలేనయిరి; అంతట సంభ్రమముతోనే నౌరాయణుడు దేవరూపుడగు ఆతనితో నిట్లనెను; యమ సముడవు నీవేవ్వడవు? నీకోరిక ఏమి? ఎటనుండి వచ్చితివి? ఏమిచేసినచో నీకు ప్రీతికలుగును? ఇదంతయు నాకు చెప్పుము; అనిన విష్ణుని వచనమునువిని కాలాగ్ని సమానమగు ఆ కాలకూటము మోయించిన ఢంకాధ్వనిసదృశమగు గంభీర ధ్వనితో ఇట్లనెను: నేను అంబుధి సముద్భూతమగు కాలకూటమను విషమను; తీవ్రతరంధశాలురు పరస్పర వధ కాంక్షులునగు దేవదానవులును ఒకటిగనే ఆదరమున క్షీరసాగరమును మథించు చుండ ఈ దేవదానవులనందర వధింపనై నేను జనించితిని; నర్వప్రాణులను నేను క్షణమాత్రమున వధింతును; ఇంద్రాదిదేవతలు మీరందరు నన్ను మ్రింగ నైనమ్రింగుడు.

కాలకూట విషభీత విష్ణ్వాది దేవతానాం శఙ్కరాలయగమనమ్.

శ్రుత్వైతద్వచనం తస్య తతో భీతా స్సురా సురాః

బ్రహ్మ విష్ణు పురస్కృత్య గతా స్తే శఙ్కరాంతికమ్

 నివేదితా స్తతో ద్వార్థ్సై ర్గణే శై స్తు సురాసురాః

అనుజ్ఞాతా శ్శివేనాథ వివిశు థిరిశా నికమ్

మగ్గర స్య గుహాం హైమీం ము క్తామణి విభూషితామ్

సుస్వస్థమణి సోపానాం వైడూర్య స్తమ్భమస్థితామ్

 తత్ర దేవాసురై సర్వై ర్జానుభి ర్ధరణీం గతైః

బ్రహ్మాణ మగ్రతః కృత్వా ఇదం స్తోత్ర ముదాహృతమ్ 

దేవదానవకృత శఙ్కరస్తుతిః. (నామ సప్తతిరూపా)

దేవదానవాః : నమస్తుభ్యం విరూపాక్ష నమస్తే తిగ్మచక్షుషే

నమః పినాకహస్తాయ ధన్వినే కామరూపిణే

 నమస్తే శూలహస్తాయ దణ్ణహస్తాయ ధూర్జటే

 నమ స్త్రైలోక్యనాథాయ భూత గ్రామశ రీరిణీ

 నమ సురారిహ శౌచ సోమారవహ్ని చక్షు షే

 బ్రహ్మణే చైవ రుద్రాయ నమస్తే విష్ణురూపిణే

బ్రహ్మణే వేదరూపాయ నమ స్తే విశ్వరూపిణే

సాజయోగాయ భూతానాం నమస్తే శమ్భపాయ తే

మన్మథాజ్ఞవినాశాయ నమః కాలక్షయజుర

రంహ సే దేవదేవాయ నమస్తే వసు రేత సే

ఏక వీరాయ సర్వాయ నమః పిజ్జికపర్దినే హర్త్రే కర్త్రే నమస్తుభ్యం నమ స్త్రీపుర ఘాతినే

 శుద్ధబోధప్రబుద్దాయ ముక్తికై వల్యరూపిణే

 లోకత్రయవిధాత్రే చ వరుణేన్గాగ్నిరూపిణే

ఋగ్యజుస్సామవేదాయ పురుషాయేశ్వరాయ చ

అగ్ర్యాయ చై వచోగ్రాయ విప్రాయ శ్రుతిచక్షు షే

రజ సే చైవ సత్త్వాయ నమస్తే తామసాత్మనే

 అనిత్యనిత్యభాసాయ నమో నిత్యచరాత్మనే

వ్యక్తాయ చై వావ్యక్తాయ వ్యక్తావ్యక్తాత్మనే నమః

 భక్తానా మా ర్తినాశాయ ప్రియనారాయణాయచ

ఉమాప్రియాయ శర్వాయ నందివక్త్రాఞ్చిర్చితాయ వై

ఋతుమన్వన్తర కల్పాయ పక్షమాసదీనాత్మనే

 నానారూపాయ ముణాయ వరూథపృథుదనే

 నమః కపాలహస్తాయ దిగ్వాసాయ శిఖణ్ణినే

 ధన్వినే రథినే చైవ యతయే బ్రహ్మ చారిణే

శివాయ దేవదేవాయ నమ స్తుభ్యం నమో నమః 

ఆతని ఈమాటవిని సురాసురులు భీతులై బ్రహ్మ విష్ణులను ముందుంచుకొని శంకరుని కడకుపోయిరి. ద్వారస్థు లగు గణేశులచే తెలుపబడి శివునిచే వారనుజ్ఞాతులై హేమమయము ముక్తామణి విభూషితము నిర్మలమణి సోపానయుతము వైడూర్యమణి స్తంభాలంకృతమునగు మందర గుహయందు ప్రవేశించి శివుని సమీపించిరి; ఆట దేవాసురులందరును బ్రహ్మను ముందుంచుకొని ఈ స్తోతముతో మహాదేవుని స్తుతించిరి.

 విరూపాక్షా! తీక్షనేత్రా! పినాక హస్తా! ధన్విన్! కామరూపిన్ ! శూలహస్తా: దండహహస్తాః త్రైలోక్యనాధా! భూత సమూహమూర్తీ! సురారిహంతో! సోమసూర్యవహ్ని నే తా! బ్రహ్మవిష్ణురుద్రరూపిన్! బ్రహ్మన్: వేద రూపా! విశ్వరూపిన్ ! సాంఖ్యయోగా! భూతశంభవా! మన్మథ దేహనాశ కాః కాలక్షయకరా! రంహో (వేగ)రూపా దేవదేవో; వసు రేతోరూపొ! ఏక వీరాః సర్వాః పింగజటాజూటా! హర్తా; కర్తా! త్రిపురఘాతిన్! శుద్ధబోధప్రబుద్దా! ముక్తికై వల్యరూపా! లోకత్రయవిధాతా! వరుణేంద్రాగ్ని రూపా! ఋగ్యజుఃసావురూపాః పురుషా! ఈశ్వరా! ఆగ్ర్యా! (శ్రేష్టా!) ఉగ్రా! విప్రాః వేద నేత్రా! సత్వరజ స్తమోరూపా! అనిత్యనిత్యభాసా (ప్రకాశా!) నిత్యచరాత్మకా! వ్యక్త రూపా! ఆవ్యక్తరూపా! వ్యక్తావ్యక్తరూపా భక్తార్తినాశకా! నారాయణప్రియాః ఉమాప్రియాః శర్వా! నందిముఖాంచితా! ఋతుమన్వంతర కల్పవృక్షమాసదీనాత్మక నానారూపాః ముండ రూపా వరూథ(కవచ)రూపా! పృధుదండిన్! కపాలహస్తా! దిగంబరా! శిఖండిన్ ధన్విన్ రథిన్! యతీ! బ్రహ్మచారిన్! శివా! దేవదేవా! నమస్తుభ్యం - నమస్తుభ్యమ్ (నీకు నమస్కారము).

ఏవం సురాసురై స్థాణు స్తుత స్తోషముపాగతః

ఉవాచ వాక్యం భీతానాం స్మితాన్విత శుభాక్షరమ్

శజ్కర : కీమర్థ మాగరా బ్రూత త్రాసగ్లానముఖామ్బుజాః

కిం వాభీష్టం దదామ్యద్య కామం ప్రబ్రూత మాచిరమ్

 ఇత్యుక్తా స్తేతు దేవేన బ్రోచు స్త మసురాసురాః

సురాసురాః : అమృతార్థ మహాదేవ మథ్యమనే మహోదధో

విష మద్బుత ముద్భూతం లోకసఙయకారకమ్

స ఉవాచాథ సర్వేషాం దేవానాం భయకారకః

 సర్వానా భక్షయిష్యామి యూయం వా భక్షతాథ మామ్

 తమశక్తి వయం గ్రస్తుం సోఒస్మా జ్ఛోత్తో మహోత్కటః

 ముఖనిశ్వాసమాత్రేణ శతపత్రసమద్యుతిః

 విష్ణుః కృష్ణః కృత స్తేన యమశ్చ విమనాత్మకః

 మూర్ఛితాః పతితాశ్చాన్యే విప్రణాళం గతాః పరే

అర్దానర్థక్రియాం యాతి దుర్భగానాం యథా విభో

దుర్బలానాం చ సజ్కుల్పో యథా భవతి చౌపది

 విషమే త త్సముద్భూతం తస్మా దమృత కాజ్ఞయా

 తస్మా దయా నోచయ త్వం గత స్వం చ పరాయణమ్

 భక్తానుకమ్పీ సర్వజ్ఞా భువనాధీశ్వరో విభుః

యజ్ఞాగ్రభు కర్వహవి స్సోమ సౌమ్యస్మరా నకృత్

త్వమేకో నో గతి ర్దేవ గీర్వాణగ్రామశర్మకృత్

 రక్షాస్మా నృక్త సజ్కల్పాద్విరూపాక్ష విషజ్వరాత్

ఇట్లు సురాసురులచే స్తుతించబడి సంతుష్టుడే శంకరుడు భయమందియున్న వారందర తో చిరునగవుతోను శుభా క్షరములతోను కూడిన ఈమాట పలికేను: మీరందరును భయముచే వాడిన ముఖపద్మములతోనున్నా రేల? ఏలవచ్చితిరి? మీ కేమియభీష్టము నిత్తును? తడవుచేయక నిర్భయముగ మీకోరిక తేలుపుడు; అన వారిట్లనిరి: మహాదేవా! అమృతార్థమై మేము మహోదధిని మథించుచుండ లోక సంక్షయ కారకమగు ఆద్బుత విషముద్బవిల్లినది; అది సర్వదేవ భయంకరమయి. “నేనై నమిమ్మందర భక్షింతును; మీరయిన నన్ను భక్షించుడు;” అనినది; మహోద్దతమగు అది మమ్ము మింగగలదేకాని మేము దానిని మింగజాలకున్నాము; దానిముఖ నిశ్శ్వాన మాత్రముననే శతక త్రోపద్మ సమానకాంతియగు విష్ణుడును కృష్ణు డయ్యేను - యముడు విమనస్కుడయ్యెను; కొందరు మూర్చితులై పడిరి; మరికొందరు పూర్తిగా నశించిరి; దురదృష్ట వంతులకు అర్థమును అనర్థమగును; దుర్బలుల సంకల్పములాపదల యందు మరియు వ్యర్థములగును; అట్లే అమృతము కోరి యత్నించు మాకీ విషము దాపురించినది; ఇపుడు నీవే మాకు గతియు పరమగమ్యమును ఆశ్రయమును; నీవు భక్తులను గుచుచునపుగ జుగువనభవనోధరుడి వివభుడవు యజమున ప్రథమభాగ భో కవు నర్వహవీ సోమాదిరూపుడవు. సౌమ్యుడవు; మన్మథాంతకరుడవు; దేవగణ సుఖప్రదుడవుఆగు నీవే మా సగతి; భక్తసంకల్పము నెరవేర్చుచు మమ్ము ఈ విషజ్వర(నంతాప)మునుండి రక్షించుము.

తచ్ఛ్రుత్వా భగవానాహ భగనేత్రా నకృ ద్భవః

దేవదేవః : భక్షయిష్యామి తం ఘోరం కాలకూటం మహావిషమ్

తథాన్యదపి యత్కృత్యం కృచ్ఛసాధ్యం సురాసురాః

తత్సర్వం సాధయిష్యామి తిష్ఠధ్వం విగతజ్వరాః

 తే సర్వే హృష్ట రోమాణా బాష్పగద్గద కణ్ఠినః

ఆనన్దాశ్రుపరీతాహ్ స్సనాథా ఇవ మేనిరే

 సురా బ్రహ్మాదయ స్సర్వే తే సమాశ్వ స్తమానసోః

కాలకూట భక్షణార్థ మీశ్వరాగమనమ్.

 తతో యయౌ ద్రుతగతినా కకుద్మినా హరోమ్బరే పవనగతి ర్జగత్పతిః

ప్రధావితై రసురసురేన్ద నాయకై స్వవాహనై ర్విచలితశుభ్రచామరై

పురస్సరై స్స తు శుశుభే శుభాశ్రయే శ్శివో వశీ శిఖికపిశోర్ధ్వజూటకః

ఆసాద్య దుగ్గ సిగ్గుం తం కాలకూటం విషం యతః

 తతో దేవో మహాదేవో విలోక్య విషయం విషమ్

ఛాయాస్థానం సమాస్థాయ సోపిబ ద్వామపాణీనా

 పీయమానే విషే తస్మిం స్తతో దేవా మహాసురాః

జగుశ్చ ననృతుశ్చాపి సింహనాదాంశ్చ పుష్కలాక్

 చకు శ్శతక్రతుముఖా హిరణ్యాక్షోదయ స్తథా

సంస్తువ నశ్చ దేవేశం ప్రసన్నా శ్చాభవం సథా

 కణదేశం తదా ప్రాప్తీ విషే దేవ మథాబ్రువః

విరిజ్చో ప్రముఖా దేవా బలిప్రముఖతోసురా

 శోభతే దేవ కణ స్తే గాత్రే కుగ్గనిభప్రభే

భృజమాలానిభం కట్టే తలైవాస్తు విషం తవ

 ఇత్యుక్త శ్శజ్కరో దేవై స్తథోత్యాహ పురా నకః

పీతే విషే దేవగణా న్విముచ్య గతో హరో మంధర శైల మేవ

 తస్మింగతే దేవగణాః పున స్తం మమస్థు రబ్ధం వివిధప్రకారై

 ఇతి శ్రీమత్స్య మహాపురాణే అమృతమథనే ఈశ్వరకృత కాలకూటభక్షణం నామ ఏకోనపంచాశదుత్తర ద్విశతతమోఽధ్యాయః

ఇది విని భగుడను ఆదిత్యుని నేత్రములు పోగొట్టిన భవుడగు భగవానుడా శంకరుడు ఇట్లనెను: ఆ ఘోర కాల కూటమహావిషమును భక్షింతును; అట్లే క్లేశ సాధ్యమగునదిం కేమియున్నను సురాసురులారా! అదిఎల్ల మీకై సాధింతును; విగతసంతాపులయుండుడు. అదివిని బ్రహ్మాదిసురులు గగుర్పాటు చేందిరి; బాష్పగద్దద కంఠులయిరి - ఆనందాశ్రు పూర్ణ నేతులయిరి; తాము సనాధులు (రక్షకులు కలవారు) అయినట్లు భావించిరి. వారి మనస్సులు ఓదార్పు చెందేను.

అంతట జగత్పతియగు హరుడు నంది పైనెక్కి వెడలెను; అసుర సురేంద్ర నాయకులు కదలియాడెడు నిర్మల బొమరయుతములగు స్వవాహనాశ్వములతో అతనిముందు పరుగెత్తుచుండిరి; నిర్మలహృదయులగు వారితోకూడి జ్వాలా యుక్తములగు పచ్చని నిట్టనిలువయిన జటాజూటములతో అలంకృతుడు జితేంద్రియుడునగు ఆ శివుడెంతగనో ప్రకాశించెను.

అంతట కాలకూట విషము ఉన్న క్షీరసాగర మును సమీపించి ఆమహాదేవదేవుడు విషమ విషమును చూచి దాని నీడయున్న చోట (దానికి వెనుకగా) నిలిచి తన ఎడమచేతితో దానిని త్రావెను. ఆపుడు ఇంద్రాది హిరణ్యాక్షాది