92 - గ్రహయజ్ఞ విధానము -హోమవిధానము - ఇతరములగు వశ్యాభిచారప్రక్రియలును

సూతః : వైశమ్సాయన మాసీన మపృచ్ఛ చ్ఛౌనకః పురా

సర్వకామాప్తయే నిత్యం కథం శాన్తిక పౌష్టికమ్

 వైశమాయనః: శ్రీకామశ్శాన్తికామోవా గ్రహయజ్ఞం సమాచరేత్

 వృష్ట్యాయుః పుష్టి కామో వాతథైవాభిచర స్పునః

యేన గ్రహవిధానేన తన్మే నిగడత శ్శృణు

 సర్వశాస్త్రా ణ్యనుక్రమ్య సంక్షిప్తం(వ్య) గ్రస్థవిస్తరమ్

 గ్రహశాంతిం ప్రవక్ష్యామి పురాణ శ్రుతి చోదితామ్

 పుణ్యేహ్ని విప్రకథితే కృత్వా బ్రాహ్మణవాచనమ్

 గ్రహా నహాధిదేవాంశ్చ స్థాప్య హోమం సమాచరేత్

గ్రహయజ్ఞ ధా ప్రోక్తః పురాణశ్రుతికోవిదై

 ప్రథమోఓయుతహోమ స్యా ల్లక్షహోమ స్తతఃపరమ్

తృతీయః కోటిసమ స్యా త్సర్వకామఫలప్రదః

 అయుతేనాహుతీనాంచ నవగ్రహవిధి స్మృతః

తావ త్తస్య విధిం వ ష్యే పురాణ శ్రుతిభాషితమ్

 గృహస్యోత్తర పూర్వేణ మణపం కారయేద్బుధః

 *రుద్రాయతనభూమౌవా చతురస్ర ముదక్షవమ్

 దశహస్త మథాప్టో వా హస్తం కుర్యా ద్విధానతః

 తస్య ద్వారాణి చత్వారి కర్తవ్యాని చ దక్షిణే

గర్తం చోత్తరపూర్వేణ విత స్తిద్వయవిస్తృతామ్

వప్రద్వయయుతాం వేదిం వితస్త్యుచ్ఛయసమ్మితామ్

 సంస్థాపనాయ దేవానాం చతురస్రా ముదక్షవామ్

 అగ్నిప్రణయనం కృత్వా తస్యా మావాహయేత్సురా

 దేవతానాం తతస్దాప్యో వింశతిర్ద్వాదశాధికః

 (*రుద్రహస్తమితంచా స్యాత్)

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: పూర్వము శౌనకుడు ప్రశాంతుడై కూర్చుండియున్న వైశంపాయనుని సర్వకామములు పూర్ణములగుటకు ఉపక తెంచు శాంతిక పౌష్టిక కర్మముల నెట్లాచరించవలెనని యడిగెను. వైశం పాయనుడు శౌనకునకిట్లు చెప్పనారంభించెను: శ్రీ-శాంతి-వృష్టి. ఆయువు-పుష్టి -అను ఆభ్యుదయములను పొందుటకుగాని (తనకు ద్వేష్యులగు ఇతరులకు అపకారము కలిగించు తంత్రాచరణమును చేయుటకుగాని కోరువారు ఆచరించ వలసిన గ్రహ (ముల ఆరాధన విధానమును తెలి పెదను; వినుము. సర్వశాస్త్రములను పరిశీలించియు పురాణముల చేతను శ్రుతుల చేతను చెప్పబడిన వానిని గ్రహించియు క్రోడీకరించిన గ్రంథ విస్తరముతో గ్రహశాంతి విధానమును ప్రతిపాదింతును.

విజ్ఞులగు దైవజ్ఞ విప్రులు నిర్ణయించిన శుభదినమున బ్రాహ్మణుల చేత పుణ్యాహవాచనమును జరిపించవలేను. గ్రహములను వాటి *అధిదేవతలను మండపమున ప్రతిష్టించి వారినుద్దేశించి హోమము చేయవలెను. (ఇది గ్రహ శాంతి విధాన సంక్షే పము)

(ఇక మీదట దీని విస్తరణము చెప్పబడును:) పురాణములను శ్రుతులను బాగుగ ఎరిగిన మహనీయులు గ్రహ యజ్ఞము అయుత (పది వేల) హోమము -లక్షహోమము.కోటి హోమము. అని మూడు విధములని చెప్పుచున్నారు. ఇవి అన్ని యు ఆయా విషయములలో సర్వ కామ ఫలములను ఇచ్చు శ క్తి కలవి. మొదట వీనిలోని మొదటిదగు అయుత హోమ రూపమగు నవగ్రహయజ్ఞ విధానము తెలి పెదను.

యజమానుడు తన ఇంటికి ఉత్తర పూర్వదీశ ఈశాన్య దిశ )యందుకానీ శివాలయ ప్రదేశమునకాని చతు రంగస్రము ఉదక్సవము (ఉత్తరమునకు వాలుగనుండునదియు)ను పదికానీ ఎనిమిది కాని హస్తముల భుజము కలదియు నగు మండపమును విదానానుసారముగ నిర్మించవలయును. దానికి దక్షిణమున నాలుగు ద్వారములును - అదే మండపము నకు ఈశాన్యమున రెండు జేనల పొడవు-అంతే వెడలుపు.అంతే లోతు కలిగిన గుంటను హోమమునకు) దాని సమీప మున ఈశాన్యమునందే జేనేడు ఎత్తుగా నుండు వేదికను నిర్మించవలేను. ఈ వేదిక చతురస్రాకారముగ నుండవలెను. (దీని భుజముల కొలత ఈయబడలేదు). ఇది గ్రహములయు.వాటి అధిదేవతా ప్రత్యధి దేవతలయు ఆవాహనము కొరకు; ఈ వేదికకు చుట్టును నాలుగు వైపుల రెండు ప్రాకారములు (కొలది ఎత్తు కల గోడలవంటి కట్టలు) ఉండవలెను. ఇదీయు ఉత్తరమునకు పౌలు గా ఉండవలయును.

ఈ చేప్పిన గుంటయందు (హోమకుండమునందు అగ్ని ప్రణయనము (అగ్ని ని ప్రతిష్ఠించుటకు ముందు చేయవలసిన పరి స్తరణాది పూర్వకముగ అగ్ని ప్రతిష్టాపనము ప్రజ్వాలనము మొదలగునవి) చేసిన పిదప ముప్పది ఇద్దరు దేవతలకు ఆ వేదికయందు ఆవాహన ప్రతిష్టాపనములు జరుపవలెను. గ్రహములు 9+అధి దేవతలు 9+ప్రత్యధి దేవతలు 9+వినాయక దుర్గా వాయ్వాకాశాశ్వినులు అను 5=32; ఇచట అశ్వి దేవతలు జంట దేవతలు కావున ఇద్దరను ఒకటిగానే గణించవలెను.)

(*గ్రహములు ఆకాశమున-అంతరిక్ష లోకమున మనకు కనబడు జ్యోతిర్గోళ రూపములు; వీనికి సరిగా ద్యులోకమున నున్న దేవతా తత్త్వములే ఈ గ్రహముల అధిదేవతలును వారి అంగ దేవతలు ప్రత్యధిదేవతలును; వారి అనుగ్రహము సంపాదించనిదే ఈ గ్రహశాంతి కర్మము ఫలప్రదము కాదు. కావున గ్రహములతోపాటు వాని అధిదేవతా తత్త్వములను ప్రతిష్ఠ చేసి ఆరాధించవలయును)

నవగ్రహా వాహనాదిః

సూర్య స్సోమో భూమిసుతో బుధో జీవ సితో ర్కజః

 రాహు కేతురితి ప్రోక్తా గ్రహా లోక హితావహాః

 మధ్యేతు భాస్కరం విన్ద్యా  చ్చశినం పూర్వదక్షిణే

దక్షణే లోహితం విన్ద్యా ద్బుధం పూర్వోత్తరేణతు

 ఉత్తరేణ గురుం విన్ద్యా  త్పూర్వేణే వతు భార్గవమ్

 పశ్చిమేతు శనిం విన్ద్యా ద్రాహుం పశ్చిమదక్షిణే

పశ్చిమోత్తరతః కేతుం స్థాపయే చ్ఛుక్లతజ్ఞులైః

 భాస్కర స్యేశ్వరం విన్ద్యా దుమాంచ శశిన స్తథా

 స్కన్ద మజారకస్యాపి బుధస్యాపి తథా హరమ్

 బ్రహ్మాణం చ గురో ర్విన్ద్యా చ్ఛుక్రస్యాపి శచీపతిమ్

 శనైశ్చరస్యతు యమం రాహౌః కాలం తథైవచ

 కేతూనాం చిత్రగుప్తంతు సర్వేషా మధిదేవతాః

 అగ్ని రాపః క్షతి ర్విష్ణు రిస్ట్ర ఐఛీచ దేవతా

ప్రజాపతిశ్చ సర్పాశ్చ బ్రహ్మా ప్రత్యదేవతాః

 వినాయకం తథా దుర్గాం వాయు మాకాశ మేవచ

 ఆవాహయే ద్వ్యాహృతిభి స్తథై వాశ్వికుమార కౌ

 స్థాపయే ద్రక్త మాదిత్య మడ్గారకసమన్వితమ్

 సోమశుక్రా తథా శ్వేతో బుధజీవోచ పిజ్ఞశా

 మనరాహూ తథా కృష్ణా ధూమ్రం కేతుగణం విదుః

 గ్రహవర్ణాని దేయాని వాసాంసి కుసుమానిచ

ధూపమాత్రోత్ర సురభి రుపయుజ్యశ్చ నిర్మల

 ప్రత్యేకం ప్రాపయే ల్పౌజ్ఞః ఫలం పుష్పసమన్వితమ్

గుడోదనం రమే ర్ధద్యా తోమాయ ఘృతపాయసమ్

 అజ్ఞార కాయ సంయావం బుధాయ క్షీరపిష్టకమ్

 దధ్యాన్నం గురవే దద్యా చ్ఛుకాయతు ఘృతోదనమ్

 శనైశ్చరాయ కృసరం మాషం మాంసంచ రాహవే

చిత్రోదనంచ కేతుభ్య స్సర్వా నక్ష్యై స్తథార్చయేత్

ఎట్లనగా.1. సూర్యుడు 2. చంద్రుడు 3. అంగారకుడు 4. బుధుడు 5. గురుడు_6. శుక్రుడు 7. శని 8. రాహువు 9. కేతువు అను లోక హిత సంపాదకులగు గ్రహములు తొమ్మిది. (వీరి స్థానములు): 1. నడుమ. 2. ఆగ్నే యము 3. దక్షిణము 4. ఈశాన్యము 8. ఉత్తరము 6. తూర్పు 7. పశ్చిమము 8. నైరృతము 9. వాయవ్యము. వీరినందరను తెల్లని బియ్యముతో ప్రతిష్ఠించవలెను. వీరి అధిదేవతలు: 1. రుద్రుడు 2. ఉమ 3. స్కందుడు 4. విష్ణువు 5. బ్రహ్మ 6. ఇంద్రుడు 7. యముడు 8. కాలుడు 9. చిత్రగుప్తుడు. ఇక ప్రత్యధిదేవతలు: 1. అగ్ని 2. జలము 3. పృథివి 4. విష్ణువు 5. ఇంద్రుడు 6. ఐంద్రీ (ఇంద్రాణి _శ చి) 7. ప్రజాపతి 8. సరములు 9. బ్రహ్మ. వీరినే కాక వ్యాహృతిత్రయముతో ప్రత్యేక ముగా వినాయక దుర్గా వాయ్వాకాశాశ్వినుల కై దుగురకు ఆవాహన ప్రతిష్టాపనములు జరుపవలేను. నవగ్రహ వర్ణములు: 1. రక్తవర్ణ ము 2. శ్వేతము 3. రక్తము 4. పింగళ (ఎరుపు పసుపుల మిశ్రణము) 5. పింగళము 6. శ్వేతము 7. కృష్ణము 8. కృష్ణము 9. ధూమము పొగ రంగు) వీరి పూజయందు వస్త్రములును పుష్పములును వారి వారి రంగులు కలవి. ధూపము మాత్రము నిర్మలము సుగంధము కలది ఏదై నను సరియే. పూవు లతో పాటు ఫలముల గూడ అర్పించవలెను. వీరి నైవేద్యమునకు-1. బెల్లపు అన్నము 2. నేతిపాయసము 3. సంయా వము (గోధుమ రవ్వను పాలతో వండినది.) 4. పాలతో ఉడికించి పిండి 6. పెరుగన్న ము_6. నేతి అన్నము 7. పులగము 8. మినుప వంట 9. చిత్రాన్ని ము పులి యోగిర ము); ఈ తొమ్మిది గ్రహములకును ఇతర దేవతా ప్రత్యధి దేవతలకును వినాయకాదులకును భక్యములేవే నను నివేదించవచ్చును.

కలశస్థాపనాదిః

ప్రాగుత్తరేణ తస్మాత్తు దధ్యక్షత విభూషితమ్

 చూతపల్లవసణ్ఛన్నం ఫలవస్త్రయుగాన్వితమ్

 పఞ్చరత్న సమాయుక్తం పశ్చిపూగయుతం తథా

 స్థాపయే దవణం కుంభం వరుణం తత్ర విన్య సేత్

 గఙ్గాద్యా స్సరిత స్సర్వా స్సముద్రాశ్చ సరాసిచ

గజాశ్వరథవల్మీక సజ్గమహదగోకులాత్

 మృద మానీయ విపేన్జ సర్వేషధీసమన్వితమ్

 స్నానార్థం విన్య సే తత్ర యజమానస్య ధర్మవిత్

 సర్వే సముద్రా స్సరీత సీర్థాని జలదా నదాః

ఆయాను యజమానస్య దురితక్షయకార కాశి

 ఏవ మావాహయే దేతా నమరా న్ము నిసత్తమ

 హోమం సమారభే త్సర్పి ర్యవద్రోహితీలాదినా

 అర్క పలాశః ఖదిర ? అపామార్గోథ పిప్పలః

ఉదుమ్బర శ్శమీ దూర్వా కుశాశ్చ సమిధఃక్ర మాత్

 ఏకై కస్యా ప్య ష్టశత మష్టావింశతి రేవవా

 హోతవ్యా మధుసరిర్భ్యాం దధ్నా చైవ సమన్వితాః

 ప్రాదేశ మాత్రా ఆశిఖా అశాఖా ఆపలాశినీః

సమిధః కల్పయే ల్పౌజ్ఞ స్సర్వకర్మసు సర్వదా

 దేవానామపి సర్వేషా ముపాండు పరమార్థవిత్

 స్వేన స్వేనైవ మ నేణ హోతవ్యా స్సమిధః పృథక్

 హోతవ్యంచ ఘృతం త్వత చరుభక్ష్యాదికం పునః

 మంత్రై ర్దశాహుతీ ర్హుత్వా హోమో హ్యహృతిభి స్స్మృతః

 ఉదజ్ముఖాః ప్రాజ్ముఖి వా కుర్యు ర్భ్రాహ్మణపుజ్గవాః

 మంత్రవ నస్తు కర్తవ్యా శ్చరవః ప్రతిదైవతమ్

 హుత్వా పశ్చా చ్చరుం సమ్య క్షతో హోమం సమాచరేత్

(కలశ స్థాపనము) : ఈ గ్రహావాహన వేదికకు ఈ శాన్యమున పెరుగు అక్షతలు పంచరత్నములు పంచ పూగములు (పోక కాయలు) వేసి మామిడి చిగురాకులతో పండ్లతో నూతన వస్త్రద్వయముతో కప్పిన ఆరంధ్ర కలశమును ప్రతిష్టించి దానియందు వరుణు నావాహితునిగా జేయవలెను. దానియందు గంగాది నదులనుండి సముద్రములనుండి తెచ్చిన నీటిని పోయవలెను. ఆ నీటియందు గజాశ్వరథములుండు తావులనుండి గోవులు నిలుచుచోటి నుండి పుట్టనుండి నదీసంగమ ములనుండి ప్రదములనుండి (మడుగుల నుండి) సేకరించి తెచ్చిన మట్టిని కూడ వేయవలెను. ఈ నీరు యజమానుని స్నా నార్దము వినియుక్తమగును. అన్ని సముద్రములును నదులును తీర్థ ములును మేఘములును నదములును యజమానుని దురితములను క్షయింపజేయుట కే దీనియందు సన్నిహితములగుగాక! అను అర్థ మిచ్చు మంత్రముతో వీటినన్ని టినం దావాహనము చేయవలెను.

పిమ్మట నేయి యవలు వడు తిలలు మొదలగు వానితో హోమమారంభించవలెను. ఆ యాగ్రహములకు విహితము లగు సమిధలు. 1. (తెల్ల జిల్లేడు 2. మోదుగు 3. చండ్ర 4. ఉమ్మెత్త 5. రావి 6. మేడి 7. జమ్మి 8. గరిక 9. దర్భలు. ఈ సమిధలు ప్రాదేశ మాత్ర దైర్యము (ప్రాదేశము -లుడితి అని తెలుగులో వాడుక కుడిచేతి బొటన వేలు చూపుడు వేలు వీటిని రెండు వైపులకును చాచగా ఏర్పడు పొడవు) కలిగి కొసలుగాని కొమ్మలు (చిల్లలు) గాని ఆకులు గాని లేక సూటిగా ఉండవలెను. ప్రతియొక ఆవాహిత దేవతకును ఈ సమిధలను తేనెతో. నేతితో. పెరుగుతో వేరువేరుగా తడిపి వేరు వేరుగా నూట ఎనిమిది మారులుగాని నూట ఇరువది ఎనిమిది మారులుగాని వేల్చవలయును. (కనుక ఈ సంఖ్యకు సరిపోవునన్ని సమిధలు ఉండవలయును.)

కొసలు కొమ్మలు (చిల్లలు) ఆకులు లేకుండు సమిధలు సేకరించుట ఈ గ్రహయజ్ఞమునందే కాదు-ప్రతి హవన కార్యమునఁడును ఇంతే.

(హవన విధానము) : ప్రతి దేవతకును ప్రతి ఆహుతియందును ఋత్విక్కులు మంత్ర- దేవతా తత్త్వముల పర మార్థము తాత్వికారము) నేరిగి దానికి దానికి విహితమయిన వేరువేరు మంత్రములను ఉపాంశువుగా దగ్గర నున్న వారికి సూత్రము వినబడునట్లును. ఐనను స్పష్టముగా) ఉచ్చరించుచు సమిధలను వేల్చవలయును. ప్రతి ఆహుతితోను నేతిని చరుద్రవ్యమును భక్షములు మొదలగు వానినికూడ చేర్చవలయును. ఆయా గ్రహములకును దేవతలకును విహితము లగు మంత్రములతో పది ఆహుతులను - వ్యాహృతులతో మిగిలిన ఆహుతులను వేల్చవలెను. హోమము జరుపువిప్రులు పొజ్ముఖులుగానో ఉదజ్ముఖులు గానో కూర్చుండవలెను. మొదట ప్రతి దేవతకును సిద్దపరచిన చరుద్రవ్యమును ఆయా గ్రహములకును దేవతలకును విహితములగు మంత్రములతో ఆభిమంత్రించవలెను. పిమ్మట ఆ చరువుతో వేరు వేరు దేవ తలకు హోమము జరిపి పిమ్మటనే హోమమునారంభించవలెను.

నవగ్రహాదీనాం హోమమంత్రాః

ఆకృష్ణేతి సూర్యాయ హోమః కార్యో ద్విజన్మనా

 ఆప్యాయ స్వేతి సోమారు మంత్రేణ జుహుయా త్పు నః

అగ్నిర్మూర్దేతి భౌమాయ మ శ్రేణ జుహుయా త్తతః

 *ఉద్బుధ్య స్వేతీ మంత్రోయ ముక్త సోమసుతాయ వై

బృహస్పతే అతియదర్యమంత్రోణీతి (పరిదీయరాదేనెతి) గురోర్మతమ్

కయానశ్చిత ఆభువదితి (అన్నాత్పరిస్రుతేతి) రాహో రుదాహృతమ్

 కేతుంకృణ్వన్ని తి బ్రూయా త్కేతూనామపి శాన్తయే

 ఆవో రాజేతి రుద్రస్య బలిం హోమం సమర భేత్

 ఆపోహిషైత్యుమాయాస్తు స్యోనేతి స్వామిన స్తథా

 విష్ణోరిదం విష్ణురితి త్వామిచ్ఛేతి స్వయమ్భువః

 ఇన్దమిద్దరీవహత ఇతీవ్గాయ పరికీర్తితమ్

 తథా యమస్య చాయంగోరితి హోమః ప్రకీర్తితః

 కాలస్య బ్రహ్మ జజ్ఞానమితిమ నఃప్రశస్యతే

 చిత్రగుప్తస్య రాజానమితి వేదవిదో వియుః

 అగ్నిం దూతం వృణీమహఇతి వహ్నే రుదాహృతః

 ఉదు త్తమంవరుణమిత్యపాం మన్తః ప్రశస్యతే

 భూమేః పృథివ్య స్తరిక్ష మితి వేదేషు పఠ్యతే

సహనశీరా పురుష ఇతి విష్ణో రుదాహృతమ్

 ఇన్దియేన్హపరుత్వఇతి శక్రస్య శస్యతే

ఉత్తానపల్లే సుభగ ఇతి శచ్యా స్సమాచరేత్

 ప్రజాపతేః పున డ్రోమః ప్రజాపత ఇతి స్మృతః

*నమో అస్తు సర్పేభ్య ఇతి సర్పాణాం మ ఉచ్యతే

ఏష బ్రహ్మాయ ఋత్విజ ఇతి బ్రహ్మణ్యుదాహృతః

వినాయక స్య చానూన మితి మంత్రో బుధై స్మృతః

 జాతవేదసే సునవామ ఇతి దుర్గాయా మంత్ర ఉచ్యతే

 ప్రాణానాం గ్రస్థిర సితి ప్రాణస్య పరికీర్తితః

ఆదిత్ ప్రత్నస్య రేతస ఆకాశ స్య ఉదాహృతః

 ఏషా ఉషా ఆపూర్వ్యా ఇతి అశ్వినో ర్మనఉచ్యతే

 పూర్ణాహుతించ మూర్ధానం దివ ఇత్యభిపాతయేత్

 యజమానాభి షేకమంత్రాః

అథాభి షేకమంత్రేణ వాద్యమఙళ గీత కైః

 పూర్ణకు మేన తేనైవ హోమానే ప్రాగుద జ్ముఖైః

 అవ్యజ్ఞావయవేర్ర్బహ్మక్ హేమసగ్దామభూషితైః

 యజమానస్య కర్తవ్యం చతుర్భి స్నపనం ద్విజై కి

 సురా స్త్వా మభిషి ఇన్లు బ్రహ్మవిష్ణుమహేశ్వరాః

 వాసుదేవో జగన్నాధ స్తథా సజ్కర్షణో విభుః

 ప్రద్యుమ్న శానిరుద్ధశ్చభవన్తు విజయాయ తే

 ఆఖజ్జియాగ్ని రగవా న్యమోవై నిరృతి స్తథా

 వరుణః పవన శ్చైవ ధనాధ్యక్ష స్తథా శివః

 బ్రహ్మణా సహితా స్సర్వే దిక్పాలా పొత్తు తే సదా

 కీర్తి క్లష్మీ ర్ధృతి ర్మేధా పుష్టి శృద్ధా క్రియా మతిః

 బుద్ధి ర్లజ్జా వపు శ్శంతి సుష్టిః కా నిశ్చ మాతరః

 ఏతా స్త్వా మభిషి ఇ్చను ధర్మపత్న్య స్సమాగతాః

 ఆదిత్య శ్చన్దమా భౌమ బుధజీవసితార్కజాః

గ్రహా స్వా మభిషిణ్చాను రాహు కేతుశ్చ తర్పితాః

 దేవదానవగన్దర్వా యక్షరాక్షసవన్న గాః

 ఋషయో మునయో గావో దేవమాతర ఏవ చ

 దేవపత్న్యో ద్రుమా నాగా దైత్యా శ్చాప్సరసాం గణాః

 అస్త్రాణి సర్వశస్త్రాణి రాజానో వాహనాని చ

 ఔషధానిచ రత్నాని కాలస్యావయవాశ్చయే

 సరిత స్సాగరా స్సర్వే తీర్థాని జలదా నదాః

 ఏతా స్త్వా మభిషిఞ్చను సర్వకామార్థసిద్ధయే 

(*’అగ్నేవివస్వదషస’ఇతిసోమ)

(*నమోఆస్తునాగేభ్యాఇతినాగానామంత్ర ఉచ్యతే)

ఆయా గ్రహాదికమునకు హోమమంత్రములు : 1. సూర్యునకు-' ఆకృష్ణేన రజసా' 2. చంద్రునకు -'ఆప్యా యస' 3. అంగారకునకు 'అగ్నిర్మూర్గా' 4. బుధునకు-'ఉద్బుధ్యస్వలి. గురునకు-“బ్బహస్పతే అతియదర్యా” 6. శుక్రునకు 'శుక్రంతే అన్యత్' 7. శనికి. 'శంనోదేవీ'; 'శమగ్ని రగ్ని భిసరత్' అనునది వాడుక లో నున్న ది. 8. రాహు వునకు-‘క యానశ్చిత్ర ఆభువత్' 9. కేతువునకు- కేతుంకృణ్వన్'

అధి దేవతల హోమ మంత్రములు : 1. రుద్రునకు-' ఆవోరాజా' 2. ఉమకు.' ఆపోహిష్ణా' 8. స్కందునకు. ఓ సోనా పృథివీ' 4. విష్ణువునకు -'ఇదం విష్ణుః' 5. బ్రహ్మకు.' త్వామిచ్చా' 6. ఇంద్రునకు-- ఇంద్రమిద్దరీ' 7. యమునకు - ఆయంగౌః' 8. కాలునకు--బ్రహ్మజజ్ఞానం' 9. చిత్రగుప్తునకు 'రాజానమ్'.

ప్రత్యధి దేవతలకు హోమ మంత్రములు: 1. అగ్ని కి. 'అగ్ని దూతం వృణీమ హే.1 2. జలములకు. 'ఉదు తమగవరుణ' . భూమికి - 'పృథివ్యంతరిక్షమ్) 4. విష్ణునకు 'సహ సశీరా' 5. ఇంద్రునకు ‘ఇంద్రమరుత్వ' 6. శచికి.' ఉత్తానపర్లేసుభగే!' 1. ప్రజాపతికి – ‘ప్రజాపతే!' 8. సర్పములకు.“నమో అస్తు సర్వేభ్యః'- 9. బ్రహ్మకు “ఏష బ్రహ్మాయ ఋత్విజః'

వినాయకుడు మొదలగు ఐదుగురకు హోమ మంత్రములు: 1. వినాయకునకు. “అనూనమ్' 2. దుర్గకు ‘జాత వేదసే సునవామ' 8. వాయుపునకు ప్రాణానాం గ్రంథిరసి' 4. ఆకాశ మునకు 'ఆదిత్ ప్రత్న స్య రేతసః' 6. అశ్వినులకు - 'ఏషి ఉషా అపూర్వ్యా.'

పూర్ణాహుతికి మంత్రము. ‘మూర్ధానం దివః’

 (ఈ చెప్పినవి అన్నియు ఆయా మంత్రముల ఆరంభములు)

యజమానునకు అభిషేకము (స్నానము) జరుపు ప్రక్రియ:

హోమము ముగిసిన తరువాత అంగవైకల్యము లేకుండి బంగారు ఆభరణములతో పూలమాలలతో అలంకరించబడియున్న నలుగురు బ్రాహ్మణులు తూర్పునకో ఉత్తరమునకో మొగమై అభి షేక మంత్రములు పఠించుచు మంగళ పొద్యముల మోతల నడుమ లోగడ చెప్పిన పూర్ణ కుంభమందలి జలముతో యజమానునకు స్నానము చేయింతురు. (అభి షేక మంత్రముల అర్థము:) బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జగన్నాధుడగు వాసుదేవుడు సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్దుడు ఇంద్రాగ్ని యమ నిరృతి వరుణ వాయు కుబేరేశ్వరులు బ్రహ్మ కీర్తి లక్ష్మీధృతి మేధాపుష్టి శ్రద్ధా క్రియా మతి బుద్ధి లజ్జా వపుః శాంతి తుష్టి కాంతులు సప్తమాతృకలు ఆదిత్య సోమాంగారక బుధగురు శుక్ర శని రాహు కేతువులు దేవదానవ గంధర్వ యక్ష రాక్షస పన్న గులు ఋషిముని గోదేవమాతలు దేవపత్నులు వృక్షనాగ దైత్యాప్సరసలు అస్త్ర ములు శస్త్రములు రాజులు వాహనములు ఔషధములు రత్నములు కాలావయవములు నదీ సాగర పుణ్యతీర్థములు మేఘములు నదములు. ఇవి యన్ని యు నిన్న ఓ షేకించి జయమును సర్వ కామార్థ సిద్దులును కలిగించుగాక!

తత శ్శుక్లామ్బరధర శ్శుక్లమాల్యానులేపనః

సర్వౌషదై స్సర్వగన్దే స్స్నా పితో ద్విజపుజ్గవైః

 యజమాన స్సపత్నీక ఋత్విజస్తు సమాహితః

 దక్షిణాభిః ప్రయత్నేన పూజయే ద్గత విస్మయః

 సూర్యాయ కపిలాం ధేనుం శబ్దం సోమాయ దాపయేత్

 భౌమాయ రక్తవృషభం సోమపుత్రాయ కాక్చానమ్

 గుర వే పీత వాసాంసి శుక్రాయాశ్వంతు దాపయేత్

 కృష్ణాయ కృష్ణగౌ ర్దేయా శుభలక్షణసంయుతా

 ఆయసం రాహవే దద్యా తే తుభ్య శ్చాగ ముత్తమమ్

 సువరైన సమాః కార్యా యజమానేన దక్షిణాః

 సర్వేషా మథవా గావో దాతవ్యా హేమభూషితాః

 సువర్ణ మథవా దద్యా దురుర్వా యేన తుష్యతి

కపిలాదిగేనుదానమంత్రాః

 స్వమత్రైణైవ దాతవ్యా స్సర్వాస్సర్వత్ర దక్షిణాః

కపిలే సర్వధీనూనాం పూజనీయా_సిరోహిణీ

 సర్వతీర్థమయీ యస్మా దత శాస్త్రాం వయచ్చమే

 పుణ్య స్త్వం శబ్ద పుణ్యానాం మజ్గళానాంచ మజ్గళ

 విష్ణునా విధృతో నిత్యమత శ్శాంతిం ప్రయచ్ఛ మే

 ధర్మ త్వం వృషరూ పేణ జగదానన్దకారక

 అష్టమూ ర్తె రధిష్టాన మత శ్శాంతిం ప్రయచ్ఛ మే

 హిరణ్య గర్భగర్భస్థం హేమ బీజం విభావసోః

అనన్తపుణ్యఫలద మత శ్శాంతిం ప్రయచ్ఛ మే

 పీతవస్త్రయుగం యస్మా ద్వాసుదేవస్య వల్లభమ్

ప్రదానా త్తస్య మే విష్ణో రత శ్శాంతిం ప్రయచ్ఛ మే

 విష్ణో త్వమశ్వరూ పేణ యస్మా డమృతసమ్భవః

 ఇన్దారవాహనం నిత్య మత శ్శాంతిం ప్రయచ్ఛ మే

 యస్మా త్వం పృథివీ సర్వా ధేనుః కేశవసన్ని భా

 సర్వపాపహరా నిత్య మత శ్శాంతిం ప్రయచ్చ మే

 గవా మజేము తిష్టని భువనాని చతుర్దశ

 యస్మా త్తస్మా చ్చివం మే స్యా దత శ్శాన్తం ప్రయచ్చమే

 యస్మా దాయన కర్మాణి తవాధీనాని సర్వదా

లాజ్గలా న్యాయుధాదీని తస్మా చ్ఛాంతిం ప్రయచ్చమే

 యస్మా త్వం సర్వయజ్ఞానా మజ్ఞత్వేన వ్యవస్థిత

 యానం విభావసో ర్నిత్య మత శ్శాంతిం ప్రయచ్చ మే

 యస్మా దశూన్యం శయనం కేశ వస్య శివస్యచ

తస్మా న్మమావ్యశూన్యం స్యా ద్దానా జ్జన్మని జన్మని

 యథా సర్వేషు రత్నే షు సర్వే దేవా వ్యవస్థితాః

 తథా శా స్లిం ప్రయచ్ఛన్లు రత్న దానేన మే సురాః

 యథా భూమిప్రదానస్య కళాం నార్ఘ ని షోడశీమ్

 దానా న్యన్యాని యే శా నిర్భూమిదానా దృవత్విహ

*ఏవం సమ్పూజయిత్వాతు విప్రా న్మా త్సర్యవర్జితః

 వస్త్రాలజ్కోరరత్నా ద్యైర్మాల్యగస్ధానులేపనైః

 అనేన విధినా యస్తు గ్రహయజ్ఞం సమాచరేత్

 సర్వా నామా నవాప్నోతి పేత్య స్వర్ణే మహీయతే

 యస్తు పీడాకరో నిత్య మల్పవి త్తస్య హి గ్రహః

తంచ యత్నేన సమ్పూజ్య శేషా న ప్యర్చయే దహాక్

గ్రహా గావో నరేన్దాశ్చ బ్రాహ్మణాశ్చ విశేషతః

 పూజితాః పూజయ న్యేతే నిర్దహ న్యవమానితాః

తస్మా న్న దక్షిణాహీనం కర్తవ్యం భూతి మిచ్ఛతా

 సమ్పూర్ణయా దక్షిణయా యస్మాదేక్కోపి తృప్యతి

 సదై వాయుతహోమోయం నవగ్రహమఖే స్థితః

 వివాహోత్సవయజ్ఞేషు ప్రతిష్టాదిషు కర్మసు

నిర్విఘ్నర్థం ముని శ్రేష్ఠ తథోద్వేగాద్భుతేషు చ

(*ఏవం సంపూజయేద్భక్త్యా విత్తశాఠ్యవివర్జితః)

యజమానుడు ఇట్లు సర్వ గంధ యుక్తములును సర్వాషధీ సంస్కృతములునునగు జలములతో విప్రులు తను స్నానము చేయించగా శుక్ల వస్త్రములును శుక్ల మాల్యాను లేపనములను ధరించి తన భార్యతో కూడి శ్రద్దా యుక్తుడై ఋత్విజులను ప్రయత్న పూర్వకముగాను అభిమాన రహితముగాను దక్షిణలతో గౌరవించవలెను. సూర్యునకు కపిల ధేనువును ధేనువు అనగా పాడియావు) చంద్రునకు శంఖమును కుజునకు ఎర్రని వృషభమును బుధునకు బంగారును గురునకు పసుపు పచ్చని వస్త్రములను శుక్రునకు అశ్వమును శనికి శుభ లక్షణములు కల నల్లని యావును రాహువునకు ఇనుమును కేతువునకు మంచి మేక పోతును ఈయవలెను. ఇదికాక ద్రవ్య రూపమున దక్షిణగా ఋత్విజుల కందరకు సమాన పరిమాణములో బంగారమును కొని బంగారు కొమ్ములతో అలంకరించబడిన గోవును (ఒక్కొక్కరికి ఒక్కొక్కటి) కాని ఈయవలేను. గురునకు బంగారుగాని ఆవులనుగాని అతనికి సంతోషకరమైనది మరేదై న దక్షిణ కానీ ఈయవలేను.

ఏ దక్షీణనై నను వాటికి వేరువేరుగా విహితమయిన మంత్రముతో ఈయవలెను. 1. కపిల గోవునకు: కపిల గోవా! నీవు సర్వధేనువులలో పూజనీయవు; రోహిణివి (ఎర్రని వన్నె గల దానవు;) సర్వ తీర్థమయు రాలవు; ఇట్టి నీవు మాకు శాంతి నిమ్ము; 2. శంఖమునకు: శంఖమా! పుణ్యకరములైన వానిలో పుణ్యకరమయిన దానవు; శుభకరమయిన వానిలో శుభకరమయినదానవు; నిరతమును విష్ణునిచే ధరించబడుదానవు; ఇట్టి నీవు నాకు శాంతినిమ్ము. 3. వృషభము నకు: వృషభ రూపముననుండి జగదానంద కారకుడవగు ధర్మదేవా! నీవు అష్టమూర్తి యగు శివునకు ఆధిష్టాన (వాహన) మవు; ఇట్టి నీవు మాకు శాంతి కలిగింపుము. 4. స్వర్ణమునకు: సువర్ణము బ్రహ్మదేవుని గర్భము నందుండునది; అగ్ని కి బీజరూపమయినది; అనంతమగు పుణ్యఫలమునిచ్చునది; ఇట్టి నీవు నాకు శాంతినిమ్ము. 5. పీతాంబరములకు: పీతాం బరముల జత వాసుదేవునకు ప్రియమైనదీ; విష్ణుదేవుని దానవగు నిన్ను ఇచ్చుటవలన నీవు నాకు శాంతినిమ్ము. 6. అశ్వము నకు: అమృతముతోపాటు జన్మించిన అశ్వరూపమగు విష్ణ! నీవు సదా ఇంద్రునకును రవికిని వాహనమవు; ఇట్టి నీవు మాకు శాస్త్రినిమ్ము. 7. శనికి దానము చేయు కృష్ణ గోవునకు: నీవే భూమి యంతయు సయియున్నా వు; ధేను రూపమవు; విష్ణు సమానురాలవు; సర్వపాపహరవు; ఇట్టి నీవు మాకు శాంతిసమ్ము; చతుర్దశ భువనములును గోవుల అవయవముల యందే ఉండును. నీవలననే శుభము కలుగును; ఇట్టి నీవు మాకు శాంతినిమ్ము. 8. ఇనుమునకు ఆయసమా! అన్ని పనులును నాగళ్ళు ఆయుధములు మొదలగునవన్ని యును నీయధీనములై యున్నవి. ఇట్టి నీవు మాకు శాంతినిమ్ము; 9. ఛాగమునకు: నీవు అన్ని యజ్ఞములకును ఆంగమయి యున్నావు; అగ్నికి వాహనమవు; ఇట్టి నీవు మాకు శాంతి నిమ్ము; 10. శయ్యాదానమునకు: శివ కేశవుల శయనము ఎన్నడును ఆశూన్యమై యుండును. కావున వారి దయచే అట్లే జన్మజన్మముల నా శయనము కూడ అశూన్యమయి యుండుగాక! 11. రత్న దానమునకు: సర్వ రత్నములయందును సర్వదేవతలును సన్నిహితులై యుందురు; కావున వారందరును నేచేయు రత్న దానముచే నాకు శాంతినిత్తురుగాక ! 12. భూదానమునకు: ఇతర దానము లేవియు భూదానములోని పదునారవవంతునకు సరిపోలవు; కావున భూదానము చే నాకు శాంతి లభించుగాక !

యజమానుడు మాత్సర్యము (పోటీభావము) లేక భక్తితో విప్రులను వస్త్రాలంకార రత్న గంధ మాల్యాను లేపనములతో సంపూజించవలయును.

ఈ విధానమున గ్రహ యజ్ఞము నాచరించువాడు ఇహమున సర్వకామములను పూర్ణములనొనరించుకొని పర మున స్వర్గమున పూజితుడై సుఖించును.  ఎంత అల్పధనుడై నను తను ఎడతెగక పీడించుచుండు గ్రహమును యథాశక్తిగ పూజించి ఇతర గ్రహము లను కూడ అర్చించవలయును.

 గ్రహములును గోవులును ప్రభువులును విశ్లేషించి బ్రాహ్మణులును పూజితులయినచో తమ్ము పూజించినవారిని తామును పూజింతురు. (ప్రీతితో చూచెదరు.) అవమానింపబడినపుడు తమ్మవమానించిన వానిని తామును అవమానింతురు. (సుఖింప జేయవలెనని తలచరు.) కావున (ఏ కర్మమునగాని) క్షేమము కలుగవలేననుకొనినవాడెవ్వడు దక్షిణా హీనముగ కార్యము నాచరించరాదు. ఏలయన సంపూర్ణమగు దక్షిణ తో ఒక్కడే నను తృప్తినొందినను దానిచే యజమానునకు క్షేమము కలుగును.

నవగ్రహ మఖమను పేరుతో ప్రసిద్దమయియున్న ఈ *అయుత హోమము వివాహములు. ఉత్సవములు యజ్ఞములు ప్రతిష్టలు విఘ్నములు ఉద్వేగము అద్భుత దర్శనములు మొదలగు సందర్భములందు క్షేమమును శుభమును కలిగించును.

(*ఈ యాగ ప్రక్రియయందు ఆవాహన ప్రతిష్టాపన పూజనములందుకొను గ్రహ దేవతాదికము ముప్పది రెండు మంది. వీరికి దధి.మధు. సర్పి సు వేరువేరుగ ముంచిన సమిధలతో నూట ఎనిమిది కాని నూట ఇరువది ఎనిమిది కాని ఆహుతులను వేల్చవలెను. 32x3x108=10868; లేదా 32x3x128=12288 అగును; ఇది కొంచెమేక్కువగా అయుతము =10000 అగుచున్నది. కనుక ఈ హోమమునకు అయుత హోమమని వ్యవహారము ఏర్పడినది.)

లక్షహోమవిధిః - లక్షహోమమను గ్రహయజ్ఞము

కథితో యుత హో మోయం లక్షహోమ మత శ్శృణు

వైశమాయనః : సర్వకామాప్తయే యస్మా ల్లక్షహోమం విదు ర్భుధాః

పితృణాం వల్లభం సాక్షా ద్భుక్తిము క్తిఫలప్రదమ్

 గ్రహతారాబలం లబ్ద్వి కృత్వా బ్రాహ్మణవాచనమ్

 గృహస్యోత్తరపూర్వేణ మజ్ఞపం కారయేద్బుధః

 రుద్రాయతన భూమౌ చతురశ్ర ముదజ్ముఖమ్

 దశ హస్త మథాల్షివా హస్తా న్కుర్యా ద్విధానతః

 ప్రాగుదక్రవణాం భూమిం కారయే ద్యత్నతో నరః

 పాగు తరం సమాసాద్య ప్రదేశం మళ్తపస్య తు

 శోభనం కార యే త్కుణం యథావ ల్లక్షణాన్వితమ్

 నవగ్రహమ ఘే కుజ్ఞం హ స్తమాత్రం ప్రశస్యతే

చతురశ్రం సమం కుర్యా ద్యోనివం సమేఖలమ్

 చతుర జుళ విస్తారా మేఖలా తద్వ దు చ్చితా

 ప్రాగుదకవణా కార్యా సర్వత స్సమవిస్తృతా

 శాన్యం సర్వలోకానాం నవగ్రహమఘ స్మృతః

 మానహీనాధికం కుణమనేక భయదం భవేత్

 యస్మాత్తస్మా త్సుసమ్పూర్ణం శా నికుణ్ణం విధీయతే

 అస్మా దశ గుణః ప్రోకో లక్షహోమ స్వయమ్భువా

ఆహుతీభిః ప్రయత్నేన దక్షిణాభి స్తథైవచ

 ద్విహ స్తవిస్తృతం తద్వ చ్చతుర స్థాయతం పునః

లకహో మే భవే త్కుణం యోనివ కం సమేఖలమ్

 తస్యైవో త్తరపూర్వేణ విత స్తిత్రయసమ్మితమ్

 ప్రాగుదక్రవణం తద్వ చ్చతురశ్రం సమ స్తోతః

 విష్కమ్భస్యోచ్ఛితం ప్రోక్తం సజ్జలం విశ్వకర్మణా

 సంస్థాపనాయ దేవానాం వప్రత్రయసమావృతమ్

 ద్విరుళోచ్చితో వప్రః ప్రథమ స్సముదాహృతః

 ఆజ్ఞుచ్ఛయసంయుక్తం వప్రద్వయ మథోపరి

 త్ర్యజుళ స్తస్య విస్తార స్సర్వేషాం కథ్యతే బుధై

 దశాజ్గుశోచ్ఛితా భిత్తి స్ణ్డిలస్య తథోపరి

ఇంతవరకును అయుత హోమ గ్రహయజ్ఞ విధానము తెలిపితిని. ఇక మీదట లక్ష హోమ విధానమును తేలి పెదను. ఇది సర్వ కామముల నెరవేర్చునది. పితృదేవతలకు ప్రీతికరమయినది. సాక్షాత్ గా మరియొక కర్మ సాధనముతో పని లేక) భుక్తిము క్రిఫలము నిచ్చునది.

 శుభ దినమున తారాబల గ్రహబలములు కల శుభ సమయమున బ్రాహ్మణులచేత పుణ్యాహవాచనము జరిపించి ఈ కార్యమారంభించవలయును. యజమానుడు తన ఇంటికి ఈశాన్యమున గాని శివాలయ ప్రదేశమున గాని చతురస్రముగ ఉద జ్ముఖముగా (ఉదక్షవముగా ఉత్తరపు వైపునకు వాలుగా) ఉండు మండపమును నిర్మించవలయును. ఆ మండపపు భుజము పది హ స్తములుగానీ ఎనిమిది హ సములు - కాని ఉండవలయును. వీలునుబట్టి మండపపు నేల ఉత్తరమునకో తూర్పునకో పోలుగా ఉండునట్లు చూడవలయును. ఈ మండపమునకు ఈశాన్యమున లక్షణ యుక్తమును హస్త మాత్రము పొడుగు వెడల్పు ఆతులుకల కుండమును యోని రూపమగు ముఖముతో యోని = త్రిభుజము.) తో నిర్మించ వలయును. ఈ కుండమునకు నాలుగు వైపులను మేఖల (అంచుకట్ట) నాలుగు భారతీయాంగుళముల వెడల్పు ఎత్తులతో ఏర్పరచవలయును. (1 భార తీయాంగుళము = 8 యవోదరములు.యవలు అడ్డముగా ఒక దాని ప్రక్కను మరియొకటి ఉంచగా ఏర్పడు దూరము.) ఈ మేఖలయును ఉత్తరమునకుగాని తూర్పునకు గాని పొలుగాను అంతట ఒకే కొలత తో ఉండవలయును. (అనగా ఆ మేఖల వెంట వెలుపలకు గాని లోపలికి గాని నడుమ నడుమ పెంపుదల దిబ్బలవంటివి ఉండరాదు.) ఇంత చెప్పుట ఏలయన నవగ్రహ మఖము సర్వలోక శాంతికై చేయునది కావున ఆది కొలతలలో ఎక్కువగానీ తక్కువగాని యున్న చో శాంతి కలిగించకపోగా భయము కలిగించును. కనుక శాంతి ప్రక్రియ కై నిర్మించు కుండము మిక్కిలి సంపూర్ణముగను శాస్త్రీయముగను నుండవలయును. (దీనియందలి కొలతలు మాత్రము ఆయుత హోమ విధానమునకు సంబంధించినవి.)

ఆయుతహోమగ్రహయజ్ఞమునందలి ఆహుతులకు పది రెట్ల ఆహుతులు కలది లక్ష హోమ గ్రహయజ్ఞము. ఋత్విక్సంఖ్య కూడ పదింతలు ఉండును కావున యథాశ క్తిగ దక్షిణలును అయుతహోమమునందుకంటే పదింతలుగా ఉండవలయును. ఈ లక్ష హోమ గ్రహ యజ్ఞమునకై మండపమునకు ఈశాన్యమున రెండు హస్తముల వెడలుపు నాలుగు హస్తముల పొడవుగల దీర్ఘ చతురస్రాకారపు కుండము (లోతు చెప్పబడ లేదు.) త్రవ్వవలెను. దానికి ముందు యోని రూపమయిన ముఖమును కు డము చుట్టు పైని చెప్పినట్లు మేఖలయు ఉండవలయును. ఈ కుండమునకు ఈశాన్య మున మూడు జేనల కొలతతో చతురస్రాకారపు అరుగును ఉత్తరమునకుగాని తూర్పునకుగాని వాలుగా దేవతావాహన ప్రతిష్టాపనముల కై ఏర్పరచవలయును. దీనికి చుట్టును మూడు ప్రాకారములుండవలెను. అన్నిటిలో మొదటిది సండిలమునకు వెలుపల రెండు అంగుళములు దానికి వెలుపలిది (నడుమది)యు . దానికి వెలుపలిది (అన్నిటిలో బయ టిది)యు ఒక్కొక్క అంగుళము ఎత్తున ఉండవలెను. స్థండిలము పై దాని బయటి అంచుమీద పది అంగుళముల ఎత్తున ప్రాకారము ఉండవలెను. వెడల్పు మాత్రము అన్నిటికిని మూడంగుళములే.

తస్మి న్నా వాహయే ద్దేవా న్పూర్వవ త్పుష్పతణ్డు లైః

 ఆదిత్యాభిముఖా స్సర్వా స్సాధిప్రత్యధిదేవతాః

 స్థాపనీయా ముని శ్రేష్ఠ నా న్తరేణ పరాజ్ము భాః

 గరుత్మా నధిక స్తత్ర సమ్పూజ్య శ్శియ మిచ్ఛతా

 సామధ్వనిశ రీర స్వం వాహనం పర మేష్టినః

 విషపాపహరో నిత్య మతశ్శా స్లిం ప్రయచ్ఛమే

 పూర్వవత్కుమ్భ మామ స్త్యో తద్వ దోమం సమాచరేత్

సహస్రాణాం శతం హుత్వా సమిత్సజ్యొదికం పునః

 ఘృతకుమ్భం వసోర్దారాం పాతయే దనలోపరి

ఔదుమ్బరీ మథార్గాంచ ఋజ్వీం కోటరవర్జితామ్

బాహుమాత్రాం సుచం కృత్వా న్య సే తమ్బద్వయోపరి

ఘృతధారాం తత స్సమ్య గగ్నే రుపరి పాతయేత్

 శ్రావయే తూ క్షమాగ్నేయం వైష్ణవం రుద్రమైనవమ్

 మహావైశ్వానరం సామ జ్యేష్ణసామచ పాఠయేత్

స్నానంచ యజమానస్య పూర్వవ త్స్వ స్త్రీవాచనమ్

 దాతవ్యా యజమానేన పూర్వవ దక్షిణా పృథక్

 కామక్రోధ విమానేన ఋత్విగ్భ్య శ్శాస్త్రచేతసా

 నవగ్రహమ ఘే విప్రా శ్చత్వారో వేదవాదినః

 అథవా ఋత్విషో శాస్త్రా ద్వావేవ శ్రుతికోవిదో

కార్యా వయుతహో మేచ న ప్రసజ్యేత విస్తరమ్(రే)

 తద్వ ద్ద్వాదశ వాష్టౌ వా లక్షహోమే తు ఋత్విజః

కర్తవ్యా శ్శక్తి త సద్వ చ్చతురో వా విమత్సరాః

ఈ స్థండిలమునందు వెనుక టివలే పూవులతో తండులములతో గ్రహతదధిదేవతా ప్రత్యధి దేవతలు ఆవాహితులై వీరెల్లరును ఆదిత్యునకు అభిముఖులై యుండవలయును. అంతేకాని రవికి వీరిలో నేవరును పెడ మొగమయి యుండ రాదు. ఈ లక్ష హోమ విధానమునందు గరుత్మంతు నధికముగా నావాహనము చేయుటవలన అధిక తేమము కలుగును. గరుడ వాహన ముత్రార్థము:) “నీవు సామవేద శ రీరుడవు; పరమేష్ఠి (విష్ణునకు) వాహనమవు; సదా విషహరుడవు; పాపహరుడవు: కావున ఇట్టి నీవు మాకు శాంతిని కలిగింపుము.” వెనుక టివలేనే యజమానుని స్నానము నకై జలకుంభమును సిద్దపరచి ఆమంత్రించవలెను. పిమ్మట హోమమాచరించవలెను. లక్ష్య సమిధలను లెక్కించి ఆహుతులవేల్చి ఘృత కుంభమును వసు ధారను (ఆయా నాణెములు కాని వెండి బంగారు రత్నములు కాని ధారగా) అగ్ని పై పడవేయవలెను. వంకర లేనిదియు తొర్రలు లేనిదియు భుజ మాత్రము పొడవు కలదియునగు పచ్చి మేడి కర్రను స్రుక్ గా చేసి (మండపపు) రెండు స్తంభముల మీదకు వచ్చునట్లు ఉంచవలెను. అట్లే హోమ సమయమునందు చక్కగా నేతిధారను కూడ అగ్ని పై వదలవలేను. అగ్ని విష్ణు రుద్ర సూక్తములను మహా వైశ్వానర సామ జ్యేష్ట సామములను పఠించవలయును. వెనుక టివలెనే యజమానున : భి షేకమును స్వస్తి వాచనమును జరుపవలేను. వెనుకటి వలెనే యజమానుడు కామక్రోధ రహితమగు శాంత చిత్తముతో ఋత్విక్కులకు వేరువేరుగా దక్షిణల నీయవలెను.

అయుత హోమము అనేడు నవగ్రహ మఖ (యజ్ఞ) మునందు వేద వాదులు శాంతులగు నలుగురుగాని ఇద్దరే కాని ఋత్విక్కులు చాలును. ఆంతకం ఔ ఏ స్తరము పనికిరాదు. అట్లే లక్ష హోమ విధానమునందు పండ్రెండు మందికాని ఎనిమిది మంది కాని నలుగురేకాని చాలును.

నవగ్రహమ ఘే సర్వం లక్షహో మే దశోత్తరమ్

 భక్త్యా దద్యా న్ము నిశ్రేష్ట భూషణాన్యపి శ క్తితః

 సువస్త్రాణిచ హైమాని కటకానిచ శ క్తితః

కర్ణాజ్గుళీయచిత్రాణి కణసూత్రాణి శ క్తిమా

 న కుర్యాద్దక్షిణాహీనం విత్తశార్యేన మానవః

 అదద లోభమోహాత్తు కులక్షయ మవాప్నుయాత్

అన్న దానం యథాశ క్త్యా దాతవ్యం భూతి మిచ్చతా

అన్న హీనః కృతో యస్మా ద్దుర్భిక్షఫలదో భవేత్

 అన్న హీనో ద హే ద్రాష్ట్రం మన్తహీనస్తు ఋత్విజః

యజమాన మదా జ్యో నా స్త్రీ యజ్ఞసమో రిపుః

 అతో నాల్ప ధనః కుర్యా ల్లక్షహోమం నరః క్వచిత్

 తస్మా త్పీడాకరో నిత్యం య ఏవ భవతి గ్రహః

త మేవ పూజయే ద్భక్త్యా ద్వౌ వా తీన్వా యథావిధి

 ఏక మభ్యర్చయే ద్భక్త్యా బ్రాహ్మణం వేదపారగమ్

 దక్షిణాభిః ప్రయత్నేన బహూనస్యల్పవి త్తవాక్

లక్షహోమస్తు కర్తవ్యో యథా (దా) విత్తం భవే ధృహే

యత స్సర్వా నవాప్నోతి సర్వా నామా న్విధానతః

 పూజ్యతే శివలో కేచ వస్వాదిత్యమరుద్ధడైః

 యాపత్కల్పశతా న్యష్టా వథ మోక్ష మవాప్నుయాత్

సకా మో య స్విమం కుర్యా ల్లక్షహోమం యథావిధి

సర్వా నామా నవాప్నోతి పద మానన్య మశ్నుతే

 పుత్తాస్థీ లభతే పుత్తా ధనార్జీ లభతే ధనమ్

 భార్యార్జీ శోభనాం భార్యాం కుమారి శోభనం పతిమ్

 భ్రష్టరాజ్య స్తథా రాజ్యం శ్రీరామ శ్రియ మాప్నుయాత్

 యం యం కామయతే కామం సవై భవతి పుష్కలః

 నిష్కామః కురుతే యస్తు స పరం బ్రహ్మ గచ్ఛతి

మిగిలిన అంశములన్నియు లక్ష హోమ విధానమునందు అయుత హోమ విధానమునందుకంటే పది రెట్లుండ వలయును. భ క్తితో మంచి వస్త్రములను బంగారు సొమ్ములను కడియములను చెవి పోగులను ఉంగరములను కంఠసూత్ర ములను కూడ శ క్తియున్న చో ఈయవలయును. శక్తి ఉండియు కొం టేతనముతోను లోభముతోను దక్ష్మి ణల విషయమున కొరత చేయరాదు. లోభ మోహములచే సరిగా దక్షిణలనీయనిచో కులక్షయమగును.

తనకు క్షేమము కలుగవలెనని కోరువాడు యథాశక్తిగా అన్న దానమును చేయవలెను. ఏలయన అన్న దాన హీనముగా చేసిన కార్యము వలన దుర్భిక్షము కలుగును. అన్న హీనముగా జరిపిన యజ్ఞము రాష్ట్రమును మంత్ర హీన యజము ఋత్విక్కులను దక్షిణలు కొరతగా జరిగిన యజ్ఞము యజమానుని దహించును. కొరతలతో జరిగిన యజ్ఞము వంటి శత్రువు (అపకారకము) మరియొకటిలేదు.

(అశక్తుని విషయము ఈ కారణములచేత తగినంత ధనము లేనివాడు ఎప్పుడు ఎట్టి స్థితియందును లక్ష హోమగ్రహ యజ్ఞము చేయరాదు. తనకు పీడాకరములుగా నున్న ఒకటి రెండు మూడు గ్రహములను మాత్రమే (తనకు గల శక్తిని బట్టి యథావిధిగ పూజించవలెను. వేద పారంగతుడగు ఒకే బ్రాహ్మణునైస (ఎక్కువమందికి మారుగా) దక్షిణలతో అర్చించవలెను.

లక్ష హోమ గ్రహ యజ్ఞపు విశిష్టత: యజమానుడు తనకు ఇంటియందుగల ధనావకాశమును బట్టి లక్షహోమ గ్రహ యజ్ఞమును యథావిధిగా చేయవలెను. దీనిని సరిగా నాచరించినచో ఇహమున సర్వకామ పూర్తి యగును. పరము నను ఎనిమిది వందల కల్పముల కాలము వస్వాదిత్య మరుద్గణములచే పూజింపబడుచు శివలోకమున సుఖించును. పిమ్మట ముక్తిని పొందును. సకామముగా (అనగా-కోరికలు తీరవలేనని సంకల్పించి) ఈ లక్ష హోమ గ్రహయజ్ఞమును యథావిధిగా జరిపించుకొనినచో సర్వ కామములును నెర వేరి అనంతమగు (మోక్ష) స్థానమును పొందును. పుత్తార్థి పుత్తు లను ధనార్థి ధనమును భార్యార్థి శోభనయగు భార్యను కుమారి శోభనుడగు పతిని భ్రష్టరాజ్యుడు మరల రాజ్యమును శ్రీ రాముడు (కీర్తి.ఆయువు-ఆరోగ్యము మొదలగు వానిచే ప్రకాశము కోరువాడు) అట్టి శ్రీని పొందును. ఇట్లు ఏఏ కోరిక కోరినచో అది ఎల్ల పుష్కలముగ నెరవేరును. నిష్కాముడై ఆచరించువాడు పరబ్రహ్మ సాయుజ్యమును పొందును.

కోటి హోమవిధిః - కోటి హోమగ్రహ యజ్ఞము

తస్మా చ్చతగుణః ప్రోక్తః కోటిహోమ స్వయమ్బువా

 ఆహుతిభిః ప్రయత్నేన దక్షిణాభిః ఫలేనచ

 పూర్వవ ద్గ్రహదేవానా మావాహనవిసర్జనమ్

 హోమమాంత్రా స ఏవోక్తా స్నానే దానే తథైవచ

కుణ్డమణ్డపవేదీనాం వి శేషోయం నిబోధ మే

 కోటిహోమే చతుర్థ స్తం చతురశ్రం సమ స్తతః

యోనిచక్రద్వయో పేతం తద ప్యాహు స్త్రీ మేఖలమ్

 ద్వ్యజ్గుళాభ్యుచ్ఛితా కార్యా ప్రథమా మేఖలా బుదై 

త్ర్యజ్గుళాభ్యుచ్ఛితా తద్వ ద్వితీయా పరికీర్తితా

ఉచ్ఛయే విస్తరే చైవ తృతీయా చతురట్టు

ద్వ్యజుశ శ్చైవ విస్తారః పూర్వమేవ ప్రశస్యతే 

విత స్తిమాత్రా యోని స్స్యా క్షట్సప్రాజ్ఞుల విస్తృతా

కూర్మ పృష్ఠాన్నలా మధ్యే పార్శ్వయో శ్చాజ్జుల్ఛోతా

 గజాస్యసదృశీ తద్వ దాయతా చ్ఛిద్రసంయుతా

ఏతత్సర్వేషు కుణేషు యోనిలక్షణ ముచ్యతే

 మేఖలోపం సర్వత్ర అశ్వత్తదళ సన్నిథమ్

 వేదిశ్చ కోటిహోమే స్యా ద్విత స్త్రీనాం చతుష్టయమ్

 చతురశ్రం సమక్షాత్తు త్రిభి ర్వప్రై స్సమాసతః

 వప్రమానం చ పూర్వోక్తం వేదీనాంచ తథోచ్చయాః

తథా షోడశ హస్త స్స్యాత్మజ్ఞపశ్చ చతుర్ముఖః

ఈ చేప్పిన లక్ష హోమగ్రహ యజ్ఞమునకు నూరింతలగునది కోటి హోమగ్రహ యజమని స్వయంభూ బ్రహ్మ చేప్పేను. ఆహుతులు-దక్షిణలు కలుగు ఫలము. అన్ని విషయములందును ఇది దానికి నూరింతలుగానుండును.

దీనియందును గ్రహములు.తదధిదేవతా ప్రత్యధిదేవతలు-వీరి ఆవాహన విసర్జనములందు హోమమునందు స్నాన దానములందు వినియోగించవలసిన మంత్రములును జరుపవలసిన ప్రక్రియయు లక్ష హోమమునందువలేనే యుండును. కుండము మండపము-వేదికలు-వీని విషయమున మాత్రము భేదము కలదు; అది తెలి పెదను.

కోటీహోమమునందు కుండము చతురస్రముగా నాలుగు హస్తములు పొడవు వెడలుపు లోతులు కలిగి ఉండ వలెను. దానికి అంగములుగా యోని చక్రములు రెండుండవలెను. కుండమునకు చుట్టును మేఖలలు (వప్రములు.కుండ మునకు నలువై పులనుండు అంచు కట్టలవంటి చిరుగోడలు) మూడుండవలెను. వీనిలో (లోపలినుండి) మొదటిది రెండంగు శములు రెండవది మూడంగుళములు చూడవది నాలుగంగుళములు ఎత్తు కలిగియుండవలెను. వెడల్పు వరుసగా రెండు - రెండు నాలుగు అంగుళములుండవలెను. యోని లక్షణము: ఏనుగు ముఖమువలే త్రిభుజాకారము కలిగి తాబేటి వీపు వలే నడుమ ఎత్తుగను రెండు ప్రక్కలందును తక్కువ ఎత్తుతో నుండవలెను. దీని ఎత్తు (నడుమ భాగమున)_విత స్త్రీ (జేనెడు పం డెండంగుళములు) ఒక్కొక్క భుజపు కొలత ఆరు కాని ఏడు కాని అంగుళములుండవలెను. రంధ్రములు నుండవలెను. ఇది అన్ని కుండముల విషయమునను కుండమునకు ముందుండవలసిన యోనుల లక్షణము. ప్రతియొక మేఖలమీదను అచటనచట రావి ఆకు ఆకృతిని ఏర్పరచవలెను. కోటి హోమగ్రహ యజ్ఞమునందు వేది నాలుగు వితస్తుల (వితస్తి = 12 భారతీయాంగుళములు) కొలతకల భుజములతో చతురస్రముగా ఉండవలెను. వప్రముల (మేఖలల) ఎత్తును వేదికల ఎత్తును లోగడ నే చెప్పబడినది. మండపము పదునారు హస్తముల భుజములతో చతురస్రముగా ఉండవలెను.

పూర్వద్వారేచ సంస్థాప్య బహ్వృచం వేదపారగమ్

యజుర్విదం తథా యామ్యే పశ్చిమే సామవేదినమ్

 అథర్వవేదినం తద్వ దుత్తరే స్థాపయే ద్బుధః

 అష్టాచ హౌమికాః కార్యా వేద వేదాజ్గవేదినః

ఏవం ద్వాదశ తా న్విపో న్వస్త్రమాల్యానులేపనై

 పూర్వవ త్పూజయేద్భక్త్యా సర్వాభరణభూషణైః

 రాత్రిసూక్తంచ రౌద్రంచ పావమానం సుమజ్గళమ్

 పూర్వతో బహ్వృచ శాన్తం పఠ న్నా స్త ఉదజ్ముఖః

శా క్తం రౌద్రంచ సౌమ్యంచ కూశ్మాణం శాస్త్రి మేవచ

 పాఠయే దక్షిణద్వారి యజుర్వేదిన ముత్తమమ్

సౌవర్ణమథ వై రాజ మాగ్నేయం రౌద్రసంహితామ్

 జ్యేష్టసామ తథా శా స్లిం ఛన్లోగః పశ్చిమే పఠేత్

శా నిసూక్తంచ సౌరంచ తథా సంవరణం శుభమ్

 పౌష్టికం సమహారాజ ముత్తరేణా ప్యథర్వవిత్

పఞ్చభి స్స ప్రభి ర్వాపి హోమః కార్యో థ పూర్వవత్

స్నానే దానేచ మన్రా స్స్యు స్త ఏవ మునిసత్తమ

వసోర్గారా విధానంచ లక్ష హోమవదిష్యతే 

అనేన విధినా యస్తు కోటిహోమం సమాచరేత్

 సర్వాన్కామా నవాప్నోతి తతో విష్ణుపదం వ్రజేత్

 యః పఠేచ్ఛృణుయాద్వాపి గ్రహయజ్ఞత్రయం నరః

 సర్వపాపవిశుద్ధాత్మాపదమిస్ట్రస్య గచ్ఛతి

 అశ్వమేధసహస్రాణి దశ చాప్టాచ ధర్మవిత్

కృత్వా యత్ఫల మాప్నోతి కోటిహోమా త్తదశ్ను తే

 బ్రహ్మహత్యాసహస్రాణి భ్రూణహత్యార్బుదాన్యపి

కోటిహో మేన నశ్యంతి యథావ చ్ఛివభాషితమ్ 

(ఋత్విక్కుల స్థానములు): ఈ మండపమున ఋగ్వేద పారంగతుని తూర్పు ద్వారమునను యజుర్వేదిని దక్షిణ ద్వారమునను సామవేదిని పశ్చిమ ద్వారమునను అథర్వవేదిని ఉత్తర ద్వారమునను నిలుపవలెను. హోమమునకు ఎనిమిది మంది వేద వేదాంగ వేత్తలగు విప్రులను నియమించవలెను. ఈ పండ్రెండు మందిని వస్త్రమాల్యగం ధాను లేపనములతో సర్వాభరణములతో పూజించవలెను. (మండపమునందలి ఋత్విక్కులలో) ఋగ్వేది. తూర్పు ద్వారమునందు ఉత్తరపు మొగమై ఉండి రాత్రి సూక్త-రుద్రసూక్త-పవమానసూక్తములను శుభకరములగు శాంతి సూక్తములను పఠించు చుండును. దక్షిణ ద్వారమునందలి యజుర్వేది శ క్తి సూక్త రుద్ర సూక్త సౌమ్య సూక్తములను శాంతి సూక్తములను పఠించుచుండును. పశ్చిమ ద్వారమునందలి సామవేది సౌపర్ణ వై రాజాగ్నేయ రౌద్ర జ్యేష్ఠ సామములను శాంతి మంత్రము లను పఠించుచుండును. ఉత్తర ద్వారమునందు అథర్వ వేది శాంతి. సౌర-సంవరణ పౌష్టిక-మహారాజ-సూక్తములను పఠించుచుండును. వెనుకటివలెనే ఏడు మంది కాని ఐదుమంది కాని హోమము జరుపుదురు. స్నాన దాన మంత్రములును (పూర్ణాహుతియందు) ఘృత కుంభ వసు ధారా వీధనములును లక్ష హోమమునందు వలెనే యుండును.

ఈ విధానమున కోటి హోమము నాచరించినవాడు ఇహమున సర్వకామపూ ర్తినొంది పరమున ముక్తి నొందును. ఈ చేప్పిన మూడు విధములగు గ్రహ యజ్ఞముల విషయమును పఠించిసను వినినను సర్వపాప విముక్తుడు శుద్దాత్ముడు నే ఇంద్ర పదమునందును. పదునెనిమిది వేల అశ్వ మేధములను చేసినందువలన పొందునంత ఫలములను ఈ కోటి హోమము నాచరించుటవలననే పొందును. వేల కొలది బ్రహ్మ హత్యలును అర్బుదముల భ్రూణ (సొంగ ముగ వేదాధ్యయనము చేసిన విప్రుని) హత్యలును చేసినందున కలిగిన పాపములును ఈ కోటి హోమగ్రహ యజ్ఞమునాచరించుటచే నశించునని శివుడే చెప్పెను.

వశ్యాభిచారాదిహోమః - వశ్యాభిచారాది హోమములు  

వశ్యకర్మాభిచారాది తథై వోచ్చాటనాదికమ్

 నవగ్రహమఘం కృత్వా తతః కామ్యం సమాచరేత్

 అన్యథా ఫలదం పుంసాం న కామ్యం జాయతే క్వచిత్

తస్మా దయుతహోమ్య విధానం పూర్వవ చ్చరేత్

 వృత్తం చోచ్చాటనే చాపి తథాచ వశ్యకర్మణీ

 త్రిమేఖలం చైకపక్త్రం త్ర్యరశ్నిం విస్తరేణతు

 పలాశ సమిధ శ్శస్తా మధుగోరోచనాన్వితాః

చన్దనాగరుణా తద్వ తుజు మే నాభి షేచితాః

 హావ యే న్మధుసరిర్భ్యాం బిల్వాని కమలాని చ

సహస్రాణి దశై వోక్తా స్వర్వథైవ స్వయమ్భువా

వశ్యకర్మణి బిల్వానాం పద్మానాం చైవ ధర్మవిత్

 సుమిత్రియా న ఆపఓషధయ ఇతి హావయేత్

నచాత స్థానం కార్యం నచ కుమాభి షేచనమ్

స్నానం సర్వౌషదైః కృత్వా శుక్లపుష్పామ్బరో గృహీ

కణ్ఠసూత్రై స్సక టకై రంగుళీయైః పవిత్ర కై

సూక్ష్మ వస్త్రాణి దేయాని శుక్లా గావ సకాఞ్చ నాః 

 [వశ్యకర్మ-ఇత రులను లోబరుచుకొనుట; ఆభిచారము. ద్వేష్యులగువారికి అపకారము చేయుట; ఉచ్చాటనము - పిశాచములు మొదలగువానినుండి విడిపించుట] వశ్య కర్మము ఆభిచార కర్మము ఉచ్చాటన కర్మము నవగ్రహమఖము మొదట జరిపిన తరువాతనే కామ్య కర్మముల నాచరించవలెను. లేనిదే కామ్య కర్మముల నాచరించినను ఫలితము నీయవు. కనుక కామ్యములగు లక్షహోమ కోటిహోమ గ్రహయజ్ఞముల నాచరించుటకు ముందు వెనుక చెప్పినట్లు అయుత హోమమును ఆవశ్యకతను బట్టి వశ్యమునకు అభిచారమునకు ఉచ్చాటనమునకు జరుపవలేను. ఉచ్చాట నాభిచార వశ్య కర్మములయందు ఒకే ముఖమును మూడు పీడి మూరల వ్యాసమును మూడు మేఖలలును కల కుండమును నిర్మించవలేను. ఈ కర్మములకై సమిధలు పలాశ మోదుగు సమిధలు తేనె గోరోచనము చందనము అగురు కుంకుమము-వీనితో తడిపినవియును తేనెతోను నేతితోను తడిపిన బిల్వ ఫలములును కమలములును ప్రశస్తములు. ఇట్టివి పది వేల సమిధలు వేల్చవలయును. వశ్య కర్మాదీకమునందు దాని సంప్రదాయము నేరిగి బిల్వ ఫలములను పద్మములను సుమిత్రియా న ఆప ఓషధయః' అను మంత్ర ముతో హోమము చేయవలయును. వశ్యాది కర్మత్రయమునందును గ్రహ ప్రతిష్ట చేయు యజమానుడు కుంభ జలముతో స్నానముచేసి శుక్ల పుష్పములను శుక్ల వస్త్రములను ధరించవలయును. ఋత్విక్కులకు బ్రాహ్మణులకు బంగారుతో చేసిన కంఠసూత్రములు కడియములు మురుగులు ఉంగర ములు పవిత్రములు సన్నని నూతన వస్త్రములు బంగారుతో అలంక రించిన తెల్లని యావులు దానమీయవలెను.

అవశ్యాని వశం కుర్యా త్సర్వశత్రుబలాన్యపీ

అమిత్రాణ్యపి మిత్రాణి హోమా దేవం భవంతి హీ

 విద్వే షేణాభిచారే చ త్రికోణం కుణ్డ మిష్యతే

ద్వి మేఖలం ద్రోణముఖం హస్తమాత్రంతు సర్వతః

 హోమం కుర్యు స్తతో విప్రా ర క్తమాల్యానులేపనాః

 నివీతా లో హితోషీషా లోహితామ్బర ధారిణః

 నరవాహనయుక్తా స్స్యు ర్జపాకుసుమసన్ని భాః

సమిధో వామహస్తేన శ్యేనాస్థిలవసంయుతాః

 హోతవ్యా ముక్త కే శైస్తు ధ్యాయద్బి ర శివం రిపోః

దుర్మిత్ర్య సస్మె సల్లు తథా హుంఫడితిచ

 శ్యేనాభిచారమ శ్రేణ మురం సప్తాభిమ శ్రితమ్

 ప్రతిరూపం రిపోః కృత్వా క్షు రేణ పరికర్తయేత్

 ద్వేష్యరూపస్య శకలాం స్తథైవాగ్నౌ వినిక్షి పేత్

 గ్రహయజ్ఞ విధానంతు సహైవాభిచర న్నరః

 విద్వేషిణం తథాకుర్వ న్నైత దేవం సమాచరేత్

ఇ హైవ ఫలదం పుంసా మేత న్నౌ ముత్ర శోభనమ్

తస్మా చ్ఛా నిక మేవాత్ర కర్తవ్యం భూతి మిచ్ఛతా

 గ్రహయజ్ఞశ్రయం కుర్వా ద్వితశార్యేన వర్జితః

 స విష్ణోః పద మాప్నోతి పునరావృత్తిదుర్లభమ్

య ఇదం శృణుయా న్నిత్యం  శ్రావయేడ్వా(పఠేద్వాపి) సమాహితః

 న తస్య గ్రహపీడా స్యా న్న చ బన్దుజనక్షయః

 గ్రహయజత్రయం గేహే లిఖితం యస్య తిష్ఠతి

 పీడా నచైవ బాలానాం న లోగో న చ బన్దనమ్

 అ శేషయజ్ఞఫలద మ శేషాఘవినానమ్

 కోటిహోమం విదుః ప్రాజ్ఞాః భుక్తిముక్తి ఫలప్రదమ్

అశ్వమేధఫలం ప్రాహు ర్లక్షహోమం ద్విజోత్తమా

 ద్వాదశాహసమ స్తద్వ నవగ్రహ మఖ స్స్మృతః

ఇతి కథిత మిదానీ ముత్సవానన్ద హేతు స్సకలకలుషహారీ దేవయజ్ఞాభిషేక

 పరివఠతి య ఇత్థం య శ్శృణోతి ప్రసజ్గా దభీభవతి స శత్రూ నాయురారోగ్యయు క్తః

ఇతి శ్రీమత్స్యమహాపురాణే వైశంపాయనశౌనక సంవాదే గ్రహయజ్ఞశాంతివిధా వయుతహోమాదికథనం నామ ద్వినవతినమోధ్యాయః

ఇట్లాచరించుట చే వతులు కాని వారిని వశుల చేసికొనవచ్చును. సర్వశత్రు బలములును లొంగిపోవును: అమిత్రులును మిత్రులగుదురు. విద్వేషముతోచేయు ఆభి చారిక కర్మములందు ఆన్ని యు (మూడును) హ మాత్ర భు జములుక లిగి ద్రోణము ( ఒక విధమగు జలపాత్రము) వంటి ముఖము కలిగి రెండు మేఖలలు కలిగిన త్రిభుజాకృతి కుండము కావలయును. విపులు ఎర్రని వస్త్రములు మాల్యములు గంధానులేపనములు తలపాగలు ధరించి జపాపుష్పములవలె వెలుగుచు. నరవాహనులే హోమము చేయవలయును. వారు యజ్ఞోపవీతము నీవీతముగా ధరించి జుట్టు విరియబోసికొని 'దురిత్యా సస్మెసను' ఇత్యాది మంత్రములను ‘హుం ఫట్’ ఇత్యాది శబ్దములతో ముగియునట్లు ఉచ్చరించుచు యజమానుని శత్రువునకు అశు భము కలుగవలెనని తలంపుకలిగి డేగ ఎముక ముక్కలతో జతపరచిన సమిధలను ఎడమచేతిలో పట్టుకొని వేల్చవల యును, యజమాన శత్రు ప్రతి రూపము (బొమ్మను చేసి యుంచుకొని  శ్యేనాభిచార' మంత్రముతో ఏడుమారులు మంత్రించిన క్షురము (చురక తితో ఆ ప్రతిరూపమును కత్తిరించి ఆ ముక్కలనుకూడ ఆభిచారిక మంత్రములతో వేల్చ వలయును. కానీ ఈ విధమగు ఆభిచారిక గ్రహ హోమమును శాంతీక పౌషి కొది కామనలతో చేయు గ్రహ యజముతో సమన కాలమున చేయరాదు. దానికి ముందుగా వేరుగా చేయవలయును.) ఒక వేళ దానినట్లు వేరుగానే చేసినను ఇవి శత్రు నాశము మొదలగు దుష్టము క్రూర మునైన ఐహిక ఫలములనిచ్చు నేకాని పార లౌకికముగ శుభము కలిగించక పోగా అశుభమును కలిగించును. కావున ఇహమునను సరమునను వాస్తవమగు శుభమును కోరువారు శాని యజ్ఞమునే ఆచరించవలయును.

 ధనము విషయములో శాఠ్యము (ఉండియు లోభము చే లేనట్లు నటించి వ్యయము తగినట్లు చేయక కొరత చేయుట) చూపక యథా శ క్తిగా అయుత హోమ.లక్షహోమ.కోటి హోమములనెడు మూడు విధములగు గ్రహ యజ్ఞములను చేయవలయును. అట్లాచరించినవాడు పునరావృత్తి రహితమును దుర్లభమునునగు విష్ణు స్థానమును పొదును. సమాహితుడై దీనిని వినినను ఇతరులకు వినిపించినను అట్టి వారికి గ్రహపీడ కాని బంధు జనులకు అరిష్టముకాని కలుగదు. ఈ గ్రహ యజ్ఞ తయ విధానమును లిఖించి ఇంటిలో ఉంచుకొనినచో అట్టి వారికి బాలుర కనారోగ్యము కాని పీడ కాని ఆ కుటుంబము వారికి రోగముకాని బంధనముకాని కలు గదు. ఆందునను కోటిహోమ యజ్ఞము భుక్తి ముక్తి ఫలదము: లక్ష హోమ గ్రహ యజ్ఞము ఆశ్వమేధయాగ ఫలదము. ఆయుత హోమ నవగ్రహ మఖము ద్వాదశాహమను గౌతయజ్ఞమునంత ఫలము నిచ్చును.

 ఈ చేప్పిన గ్రహయజ్ఞ విధానమంతయు ఉత్సవము చేసిన ఆనందమును కలిగించును; సకల కలుషముల హరించును; ప్రాసంగికముగ దీనిని చదివిన వారును వినిన వారును ఆయురారోగ్య యుక్తులగుదురు; శత్రువులనణగ ద్రోక్కుదురు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున అయుత హోమాది గ్రహయజ్ఞ త్రయకథనమను తొంబది రెండవ అధ్యాయము.