144 - దేవాసుర యక్ష గంధర్వ మనుష్య పశుపక్షి - వృక్షాదుల యుగానుగత పరిమాణాదికము

 సూతః : మన్వన్తరాణి యాని స్యుః కల్పే కల్పే చతుర్దశ

వ్యతీతానాగతాని స్యు ర్యాని మన్వన్తరే ష్విహ

విస్తరేణానుపూర్వ్యాచ్చ స్థితం వక్ష్యే యుగే యుగే

 తస్మిన్యుగేచ సమ్భూతి ర్యానాం యావచ్చ జీవితమ్

యుగమాత్రంతు జీవంతి న్యూనం తత్స్యాద్ద్వ యేనతు

 చతుర్ధశసు తావంతో జ్ఞేయా మన్వంత రేష్వాహ

 మనుష్యాణాం పశూనాంచ పక్షిణాం స్థావరైః సహ

 తేషా మాయు రుప క్రాంతం యుగధర్మేషు సర్వశ

తథై వాయుః పరిక్రాంతం యుగధర్మేషు సర్వశః

 అస్థితించ కలౌ దృష్ట్వా భూతానా మాయుష స్తథా

పర మాయుశ్శతం త్వేత న్మనుష్యాణాం కలౌ స్మృతమ్

  దేవాసురమనుష్యాశ్చ యక్షగన్దర్వరాక్ష సాః

 పరిణాహోచ్చ్రయై స్తుల్యా జాయ న్తే హ కృతే యుగే

షణ్ణవత్యజ్గుత్సీదో ఆష్టానాం దేవయోనినామ్

నవాజ్గుళ ప్రమాణేన నిష్పన్నే న తథాష్టకమ్

ఏతత్వాభావికం తేషాం ప్రమాణ మధికుర్వతామ్

మనుష్యా వర్తమానాశ్చ యుగసంధ్యాంశ కే ష్విహ

 దేవాసురప్రమాణంతు సప్తసప్తాజ్గుళం క్రమాత్

చతురాశీతికై శ్చైవ కలిజై రజ్గుళై  స్మృతమ్

ఆపాదతలమ స్త క్యే నవతాలో భవేత్తు యః

 సంహత్యా యా తు బాహుశ్చ దైవతైరపి పూజ్యతే

 గజాశ్వహస్తినాం చైవ మహిషస్థావరాత్మనామ్

 క్రమేణై తేన విజ్ఞేయా ప్రసవృద్ధి ర్యుగేయుగే  

షట్స ప్రత్యజ్గుళోత్సేధః పశు రాక కుదో భవేత్

అజ్గుళానా మష్టశత ముత్సేధో హస్తినాం స్మృతః

 ఆజ్గుళీ(ళా)నాం సహస్రంతు ద్విచత్వారింశదజ్గుళమ్

 శతార్ధ మజ్గుళానాంతు ఉత్సేద శ్శాఖినాంపర:

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పసాగెను. ప్రతి కల్పమునందును వచ్చు పదునాలుగు మన్వంతరములందును ఆయా యుగములందు దేవాది జాతుల జన్మము వారి శరీర ప్రమాణము వారి జీవిత కాలము ఆనుపూర్వితో విస్తరముగ చెప్పెదను.

పదునాలుగు మన్వంతరములందును కృతాదియుగములందు ఆ యుగ ప్రమాణము-సంధ్యా సంధ్యాంశములు కాక.దివ్యమానమున ఎన్ని సంవత్సరములో ఆ యుగపు మానవులు మానవ మాసమున అన్ని సంవత్సరములు జీవింతురు. సంధ్యా సంధ్యాంశములు కాక కృతయుగ ప్రమాణము నాలుగు వేల దివ్య వరములు కావున ఆ యుగపు మాన వులు మానవ మానమున నాలుగు వేల ఏండ్లు జీవింతురు. అని ఇట్లు అన్ని యుగముల విషయము గ్రహించవలెను.) యుగధర్మము ననుసరించియే ఆయా యుగములందలి మానవ పశుపక్షి వృక్షాదుల ఆయుః పరిమాణాదికము ఏర్పడినది. వాటి శరీర పరిమాణము ఎత్తుసరి కూడ అంతే. కాని కలియుగమున మాత్రము ప్రాణుల దౌర్భల్యము అస్థిరత చూచి మానవుల పరమాయువు నూరు సంవత్సరములేయని స్వయంభూ బ్రహ్మ నిర్ణయించెను. (ని చెప్పిన విధముగ నైనచో యుగానుసారము కలి మానవుల పరమాయువు ఒక వేయి ఏండ్లు ఉండవలయును.)

ఇక కృతాది యుగములలో దేవతాది ప్రాణుల శరీరపు ఎత్తుసరి మొదలగునవి: కృతయుగమున దేవాసుర మానవ యక్ష గంధర్వ రాక్షసులు దేహపు చుట్టు కొలతలో కాని ఎత్తుసరిలో కాని సమానులై యుందురు. విద్యాధరాదు లగు ఎనిమిది దేవజాతుల వారును మానవులును కూడ కృతయుగమున తొంబది యారుకృతయుగపు) అంగుళముల ఎత్తు కలిగియుందురు. ఆ యుగ సంధ్యాంశములయందు వీరి శరీరముల ఎత్తురి డెబ్బది రెండంగుళములే ఉండును. కలి యుగమున దేవతల ఎత్తుసరి నలువది తొమ్మిది-రాక్షసుల శరీరపు ఎత్తు ఎనుబది నాలుగు. కలియుగపు అంగుళములు ఉండును. కలియుగమున మానవుల శరీర పు ఎతు తొంబది యారంగుళములే-కాని ఇవి కలియుగపు మానవుల ప్రమాణము ననుసరించియని తెలియవలెను. ఇట్లన్ని యుగములందును మానవదేహ ప్రమాణము తొంబది యారంగు ళము లేయైనను యుగానుసారము దాని పరిమాణము తగ్గును. మానవుని కుడి చేతి బొటన వేలి నడిమి కణుపునొద్ద అర చేతివై పు తెల్లని వన్నె గల భాగపు కొలతను అంగుళముగా గ్రహించుట యొక పద్దతి. అడ్డముగా ఉంచిన ఎనిమిది యవలు ఆక్రమించు పొడవును అంగుళమనుట శాస్త్ర వ్యవహారము. కలియుగమున కాలి దిగువనుండి మస్తకాంతము వరకు తొమ్మిది తొలముల ఎత్తుకలిగి మోకాళ్ళవరకు బాహువులుగల మానవులను దేవతలును ప్రశంసింతురు-తాలము = కుడి చేతి బొటన వేలిని ఎడమకు. చూపుడు వేలిని కుడికి బాగుగా చాపగా ఈ రెంటినడుమ అగు పొడవు; దీనిని తెలుగులో ‘లుడితి' అందురు.)

ఈ చెప్పిన కొలతల ననుసరించియే ఆయా యుగములందలి గోవుల గజముల మహిషముల తదితర పశు మృగాదుల వృక్ష జాతుల పరిమాణము కూడ తగ్గుచు పేరుగుచు నుండునని ఎరుగవలెను. పశువు {బహుశ : వృషభము ) కాలి కొననుండి మూపురము పైవరకు డెబ్బది ఆరంగుళముల ఎత్తుండును. ఏనుగులు ఎనిమిదివందల అంగుళముల ఎత్తుండును. వృక్షముల ఎత్తు ఒక వేయి తొంబది రెండు అంగుళములుండును. ఆయా యుగములయందు మానవుల దేహపు ఎత్తుసరియే దేవతలకును ఉండును. బ్రాని బుద్ధి శక్తి విషయములో మానవులకంటే దేవతలు గొప్పవారు.

మానుష స్సన్ని వేశస్తు యాదృశః పరిదృశ్యతే

 తల్లక్షణంతు దేవానాం దృశ్యతేఽ న్వయదర్శనాత్

 బుద్ధ్యాతిశయసంయుక్తం దేవానాం కార్య ముచ్యతే

 తథా నాతిశయంచైవ మానుషం కార్య ముచ్యతే

 ఇత్యేవంహి పరిక్రాన్తా భావా యే దివ్యమానుషాః

 పశూనాం పక్షీణాం చైవ స్థావరాణాంచ సర్వశః

 గవాజాశ్వా శ్చ విజ్ఞేయా హస్తినః పక్షి ణో మృగాః

ఉపయుక్తాః క్రియా స్వేతే వి జ్ఞేయా స్త్విహ సర్వశ

యథాక్ర మోపభోగశ్చ దేవానాం పశుమూర్తయః

 తేషాం రూపాను రూపైశ్చ ప్రమాణై స్థిర జజ్గమాః

 మనోజ్ఞ సత తే భావై స్సుఖినో హ్యుప పేది రే

అథ శిష్టా న్ప్రవక్ష్యామి సాధూనథ సతశ్చ వై  

సాధ్వాచారధర్మా:

బ్రాహ్మణాః స్తుతిశబ్దాశ్చ దేవానాం పశుమూర్తయః

 సారూప్యం బ్రహ్మణో హ్య న్తే తేన సన్తః ప్రచక్షతే

సామాన్యేషుచ ధర్మేషు తథా వైశేషి కేషు చ

బ్రహ్మ క్షత్త్ర త్తవిశో హ్యు క్తా శ్చా న్తే వై హేతుకర్మణా

 వర్ణాశ్రమేషు యుక్తస్య సుఖోదరస్య స్వర్గతౌ

శ్రౌతస్మార్తస్య మార్గస్య జ్ఞానధర్మ స్స ఉచ్యతే

దివ్యా నాంచ సుసాధూనాం బ్రహ్మచారీ గురోర్హితః

కారణాత్సధనా చ్చైవ గృహస్థ స్సాధు రుచ్యతే

 తపసశ్చ తథాఽరణ్యే సాధు ర్వైఖానస స్మృతః

యతమానో యతి స్సాధు స్మృతో యోగస్య సాధనాత్

 ధర్మే ధర్మగతిః ప్రోక్త శ్శబ్ధో హ్యేషక్రియాత్మకః

 కుశలీ కుశలం ధర్మాధర్మాం స్తమబ్రవీత్ప్రభుః  

ధర్మాదిలక్షణమ్

అథ దేవాశ్చ పితరో ఋషయోఽథ చ మానుషాః

 అయం ధర్మోహ్యయoనేతి బ్రువతే మౌనమూర్తినా

 ధర్మేతి ధారణే ధాతు ర్మహ త్త్వేచైవ ఉచ్యతే

 ఆధారణే మహ త్వేవా ధర్మ స్సతు నిరుచ్యతే  

తత్రేష్టప్రాపకో ధర్మ ఆచార్యై రుపదిశ్యతే

అధర్మశ్చానిష్టఫల ఆచార్యై ర్నోవదిశ్యతే

 వృద్దా హ్యలోలుపా శ్చైవ ఆత్మవన్తో హ్యదామ్బికాః

 సమ్యగ్వినీతా గురుభి స్తానాచార్యా న్ప్రచక్షతే  

 ఆయా యుగములందలి దేవతలయు -మానవులయు పరిమాణాదికము ఇట్లుండునని తెలుపుటయైనది. పశు పక్షి వృక్షాదుల పరిమాణమును తెలిపితిని. గోపులు గొర్రెలు మేకలు గుర్రములు ఏనుగులు, పక్షులు మృగములు వృక్షాదికము ఆయా ప్రాణులకును మానవులకు ఆయా పనులయందును ఉపయుక్తములగుచున్నవి. దేవతలనుద్దేశించి చేయు యాగములందు వీనిలో కొన్ని యాగ పశువుల దేవత లకుపభోగ సాధనములగుచున్న వి. కాగా ఇవి ఇట్లు యాగాదులయందు దేవతల కై ఉపయోగపడిన పుణ్య విశేషమున అవి తమ దేహమును వదలిన తరువాత పర లోకమున స్వర్గము చేరి సుఖమును పొందును.

ఇక మీదట శిష్టులు. సాధులు.'సత్' శబ్దముతో చెప్పబడువారు ఎవరో తెలి పెదను. 'సత్' అనునది పర బ్రహ్మమునకు పేరు. బ్రాహ్మణులును వేద వచనములును యాగ పశువులును యజ్ఞాదుల కై దేవతలకుపయోగపడి తుదకు బ్రహ్మత్వమును పొందును. ఈ సామ్యముతో ఈ మూడిటిని 'సత్' అందురు.

ఆయా వర్ణముల వారియందును ఆయా బ్రహ్మచర్యాద్యాశ్రమములందును (ఉప) యుక్తము అయి స్వర్గమునకు పోయిన తరువాత అధిక సుఖము కలిగించు శ్రోతస్మార్త ధర్మమును జ్ఞాన ధర్మము అందురు. ఇవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులాచరించదగిన వారు. ఇవి సామాన్య ధర్మములు వి శేష ధర్మములు - ఆని రెండు విధములు; 'ఇవి ఆచరించవలెను.' అని ఈ తై వర్ణికులును (ని) యుక్తులు. నియోగింప-శాసింపబడినవారు. శాసింపబడుటచే వీరు శిష్టులు; (వాటిని ఆచరించువారు.)

బ్రహ్మచారి గృహస్థవానప్రస్థ సంన్యాసులు నలుగురును సాధువులని చెప్పబడుదురు. ఎట్లనగా బ్రహ్మచారి తన గురువునకు హితకరుడై విద్యలను సాధించుకొనును. గృహస్తుడు ప్రజాభివృద్ధికి సమాజపు సుఖవృద్ధికి కారణ భూతుడై తనకును లోకమునకును దేవతలకును సుఖమును సాధించును. అరణ్యమందు నివసించుచు వానప్రస్థుడు తపస్సును సాధించును. పరత త్వ పా పి కె యత్నించుచు(ప్రయత్నము చేయుచు తియగు సంన్యాసి యోగమును సాధించును. ఇట్లు సాధనము చేయు వీరందరును సాధువులగుచున్నారు.

ఇక ధర్మాధర్మ విషయము : ధర్మము అనునది ఒక వస్తువు అనుకొనరాదు. ధర్మగతినిధర్మపు నడకను. ధర్మమును ఆచరించుటను) ధర్మమనీ ఇచ్చట భగవానుడు చెప్పెను. కావున ఈ విధముగ ధర్మశ బము క్రియారూపము కానీ వస్తురూపము కాదు. సర్వలోకముల క్షేమమునకు ఉపయోగించు కర్మమును ధర్మమని స్వయంభూ బ్రహ్మ నిర్ణ

యించెను.

ఇక దేవతలును పితరులును ఋషులును మానవులును ఇది ధర్మము అని వ్యవహరించుచుందురు కదా! అట్లది నిర్ణయించుట మౌన మూ ర్తితో మాత్రమే.మునీయే తపోబలమున విషయ తత్వ విచారణము చేసినవారికి మాత్రమే శక్యమగును. 'ధర్మ' శబ్దమునకు మూలమగు 'ధృ(జ్"}' ధాతువునకు ధారణము తన యందు ఇతరములను నిలుపుకొనుట. తాను ఇతరములకు ఆశ్రయమగుట) అనియు గొప్పదనము అనియు అర్థములు. కావున ధర్మము అనగా లోక స్థితికి ఆధారము -అన్నిటికి మహ త్వమును కలిగించుచు తాను గొప్పదై యుండునది అని అర్థములు. ఇష్టములను పొందునట్లు చేయునది ధర్మము; కావున ఆది ఆచరించుడని ఆచార్యులు ఉపదేశింతురు. అనిష్ట ఫలప్రదము ఆధర్మము; కావుననే దాని నాచరించుడని ఆచార్యు లుపదేశించరు. మరి ఆచార్యులనగా ఎవరు ? అన్న విద్యావయో నుభవములందు వృద్ధులు ( పెరిగిన వారు). ధన సుఖాదులందు ఆసలేనివారు. హృదయదార్యము కలవారు-దంభము లేని వారు. పెద్దలవలన చాల తిన్న గా శిక్షణము నొందినవారు ఎవరో వారిని ఆచార్యులు అందురు.

శ్రౌతస్మార్త ధర్మవిభాగః-శిష్టాచార లక్షణమ్

ధర్మజ్ఞై ర్విహితో ధర్మ శ్శ్రౌత స్మార్తో ద్విధా ద్విజైః

దారాగ్ని హోత్రసమ్భన్ద ఇజ్యా శ్రాతస్య లక్షణమ్

 స్మార్తో వర్ణాశ్రమాచారో యమైశ్చ నియమైశ్చ సః

పూర్వేభ్యో వేదయిత్వేహ భౌతం సప్తర్షయోఽబ్రువన్

 ఋచో యజూంషి సామాని బ్రహ్మణోఽ జ్గాని సాధుభిః

మన్వంతరస్యాతీతస్య స్మృత్వా తం మను ర బ్రవీత్

 తస్మా త్స్మార్తః స్మృతో ధర్మో వర్ణాశ్రమవిభాగశః

 ఏవం వై ద్వివిధో ధర్మ శ్శిష్టాచార స్స ఉచ్యతే  

శి షేర్దాతోశ్చ నిష్టాన్తా చ్ఛిష్టశబ్దః ప్రవక్ష్యతే

 మన్వన్తరేషు యే శిష్టా ఇహ తిష్ఠన్తి ధార్మికాః

  మను స్స పర్షయ శ్చైవ లోకసస్తానకారిణః

 తిష్టన్తీహచ ధర్మార్థా స్తాఞ్చష్టా మచక్షతే

 తై శ్శిష్టై శ్చరితో ధర్మ స్థ్సాప్యతే వై యుగే యుగే

వార్తాపై దణ్డనీతిశ్చ ప్రజావర్ణాశ్రమేప్సయా

  శిష్టై రాచార్యతే యస్మా త్పున శ్చైవ మనుక్షయే

 పూర్వైః పూర్వై ర్మతత్వాచ్చ శిష్టాచార స్స శాశ్వతః

 దానం సత్యం తపో లోకో విద్యేజ్యా పూజనం దమః

అష్టౌ తాని చరిత్రాణి శిష్టాచారస్య లక్షణమ్

 శిష్టా యస్మా చ్చర న్త్యేనం మను స్సప్తర్షయస్తథా

 మన్వన్తరేషు సర్వేషు శిష్టాచార స్తత స్మృతః

 విజ్ఞేయ శ్శ్రవణా చౌతః స్మరణా తార ఉచ్యతే

 ఇజ్యా వేదాత్మక శ్శ్రౌత స్స్మార్తో వర్ణాశ్రమాత్మక

ప్రత్యజ్గాని ప్రవక్ష్యామి ధర్మస్యా హేతులక్షణమ్

 దృష్టానుభూత మర్థం యః పృష్టోఽనిష్ట న్న గూహతే

యథాభూతప్రవాదస్తు ఇత్యేత త్సత్య లక్షణమ్

ధర్మజ్ఞులగు ద్విజులు ధర్మమును శ్రాత ధర్మము స్మార్త ధర్మము అని రెండుగా విభజించిరి. దారలతో కూడినవారు (గృహస్థులు అనుష్ఠించు అగ్ని హోత్రాది కర్మలును యజ్ఞ ప్రభేదములును శ్రాతధర్మము. యమ నియమ సహితమగు వర్ణాశ్రమాచారము. స్మార్త ధర్మము; పూర్వులనుండి ఆమెరిగిన శ్రాతధర్మమును సప్తర్షులు లోకమున ప్రవచించిరి. గడచిన మన్వంతరము నందలి ఋగ్యజుః సామములను వేదాంగములను సాధు సముచితము యథాతథము నగు)రూపములతో స్మరించి తాము పూర్వమన్వంతరములలో ఏరిగి యున్నందున చిత్తమున నిలిచిన సంస్కార బలమున వానినే యథార్థ రూపములో ఇపుడు చిత్తమున గోచరింపజేసికొని) మనువు ప్రవచించినది కావున దీనికి స్మార(స్మృతిచే లభించిన) ధర్మమని వ్యవహారము. ఇది వర్ణాశ్రమ విభాగమున విభ క్షమై యున్నది.

ఈ రెండు విధములగు ధర్మమునకును శిష్టాచారమని వ్యవహారము. శిషి'ధాతువు(శాను. అనుశిప్టోనుండి వర మయి' క' అను'నిష్ణా' ప్రత్యయము చేరగా శిష్టశ బము (ఏర్పడును) సిద్ధించును.ఆయా మన్వంతరములయందు ఈ రెండు విధములగు ధర్మములను ఎరిగి ఆచరించుటచే శిష్టులనబడు ధర్మానుష్టాతలును లోక సంతానకారులగు లోక వ్యవస్థాప్రవృ తులను నిరంతరముగా కొనసాగించుటయే పరమ ప్రయోజనమని భావించు) మనుస పరి ప్రభృతులును ఇహలోకమంది ప్పుడు ధర్మానుష్టానము పరమ ప్రయోజనముగా నెంచి దానినెరిగి అనుష్టించు ధార్మికులును శిష్టులు అనబడుదురు.

ఇట్టి శిష్టులు ప్రజలయందు వర్ణాశ్రమ ధర్మములను నిలుపగోరి తాము శ్రాతస్మార్త ధర్మములను అనుష్టించి యుగయుగమునందును వార జీవన మార్గములు) దండనీతి మొదలగువానిని లోకమునందు నిలుపుదురు. పునఃపునః మనువుల తరు వాత మనువులుగా నడచు మన్వంతరములందు శిష్టులచే ఆచరింపబడుట చేతను అంతకంటె పూర్వులును పూర్వతరులునునగు శిష్టులకు సమ్మతమగుటచేతను ఈవిధమగు ఆచరణీయ ధర్మమునకు శిష్టాచారమని పేరు. ఇది శాశ్వతము (సార్వకాలికము సర్వదై శికము అయినది.

దానము సత్యము తపస్సు లోకము (లోక వ్యవస్థాక ర్తలగు పెద్దల నడువడి) విద్య ఇజ్యా (యాగాది దేవతా. లోకోపకారక-కర్మలు) పూజనము దమము ( ఇంద్రియనిగ్రహము) అను ఈ ఎనిమిది విధములగు చరితములు (నడు వడులు) శిష్టాచార సమగ్ర స్వరూపము. సర్వ మన్వంతరములందును మను సప్తర్షి ప్రభృతులగు శిష్టులు ఆచరించునది కావున దీనికి శిష్టాచారమని వ్యవహారము. శ్రవణమువలన (వేద శాస్త్రములనుండి గ్రహించగా) సిద్దించినది శ్రాతము; స్మృతివలన సిద్ధించినది స్మార్తము. యజనము వేదములు. అను రూపముతో నున్నది. శ్రాతము వర్ణాశ్రమాత్మకమయినది స్మార్తము.అని వినిస్వరూపకథనము. ఆ హేతు లక్షణమగు ( హేతువాదము చేయక శ్రద్ధతో ఆ సీక్య భావముతో గ్రహించవలసిన ధర్మ ప్రత్యంగములను ధర్మమునకు పుష్టి కలిగించు ప్రవృత్తులను , తెలి పెదను వినుడు. . మీరు చూచియు అనుభవించియు ఎరిగిన విషయమును మాకు తెలుపుడని ఎవరై నఅడిగినపుడు అనిష్టము చూపక దాచుకొనక యథార్థ వస్తు తత్త్వమును తెలుపుట సత్యము.

తపఃప్రభృతీనాం లక్షణమ్

బ్రహ్మచర్యం త్తపసో మౌనం నిరాహారత్వ మేవచ

 ఇత్యేత త్తపసో రూపం సు ఘోరంతు దురాసదమ్

 పశూనాం ద్రవ్యహవిషా మృక్సామయజుషాం తథా

 ఋత్విజాం దక్షిణాయాశ్చసంయోగో యజ్ఞ ఉచ్యతే

ఆత్మవ త్సర్వభూతేషు యే హితాయ శుభాయ చ

వర్తతే సతతం హృష్టః క్రియా యా సా దయా స్మృతా

ఆక్రుష్టోఽభిహతో యస్తు నాక్రోశే త్ప్రహరేదపి

 అదుష్టో వాజ్మనః కాయై స్తితిక్షు స్సా క్షమా స్మృతా

 స్వామినా రక్ష్యమాణానాం విసృష్టానాంచ సమ్బమే

 పర స్వానా మనాదాన మలో భఇతి సంజ్ఞితః

మైథునస్యాసమాచారో జల్పనా చ్చి న్తనా త థా

  నివృత్తిర్భ్రహ్మచర్యస్య తదచ్చిద్రస్య లక్షణమ్

ఆత్మా ర్థేవా పరార్థేవా ఇన్ద్రియాణీహ యస్య వై

 విషయే న ప్రవర్తన్తే దమ స్యైవతు లక్షణమ్

పంచాత్మకే యో విషయే కారణే వాఽష్టలక్షణే

 న క్రుధ్యేత ప్రతిహతో జితాత్మేతి స మన్యతే

యద్య దిష్టతమం ద్రవ్యం న్యాయేనై వాగతంచ యత్

 తత్త ద్గుణవతే దేయ మిత్యేత ద్ధానలక్షణమ్

 శ్రుతిస్మృతిభ్యాం విహితో ధర్మో వర్ణాశ్రమాత్మకః

 శిష్టాచార వీవృద్దశ్చ ధర్మోఽయంసాధుసమ్మతః

 అప్రద్వేషో హ్యనిష్టేషు ఇష్టంవై నాభినన్దతి

ప్రీతితాపవిషాదానాం వినివృత్తి ర్విర క్తతా

సన్న్యాసః కర్మణాం న్యాసః కృతానా మకృతై స్సహ

 కుశ లాకుశ లాభ్యాంతు ప్రహాణం న్యాస ఉచ్యతే

 అవ్యక్తాదివి శేషాన్తే వికారేస్మి న్నివర్తితే  

చేతనాచేతనం జ్ఞాత్వా జ్ఞానే జ్ఞానీ స ఉచ్యతే

ప్రత్యజ్గానాంతు ధర్మస్య ఇత్యేత ల్లక్షణం స్మృతమ్

 ఋషిభి ర్మతతత్త్వజ్ఞై: పూర్వైః స్వాయమ్బువేఽన్తరే

బ్రహ్మచర్యము తపస్సు (శరీరమును కఠిన నియమములకు పాలుపరచి శ్రమ పెట్టుట) మౌనము (విషయ తత్వ విచారణ చేయుట) నిరాహారత్వము అను ఇవి తపస్స్వరూపములు. ఇది ఘోరమును సామాన్యులకు చేర రానిదియు . యజ్జీయములగు పశువులు ద్రవ్యములు హవిస్సులు ఋక్సామ యజుర్మంత్రములు ఋత్విజులు . ప్రతి కల్పమందును ప్రవర్తిల్లు ధర్మాదుల స్వరూపము. ఆ దక్షిణలు. వీని కూడిక యే యజ్ఞము (ఇజ్యా) అనబడును. . ఏ చిత్తవృత్తి విశేషము ఉండుట చేత సర్వ భూతముల విషయమునను పురుషుడు తన విషయమునందువలెనే చూపుకలిగి హృష్ణుడే వానికి శుభమును హితమును కలిగింప గోరునో.అది దయ యనబడును. . ఇతరులు తిట్టినను తిట్టక కొట్టినను కొట్టక మనోవాక్కాయములందు ప్రతీకార దోషము లేక ఓర్పుతో నుండుట క్షమయనబడును. . ధనపు సొంతదారుడు కాపాడుకొనుచున్న దానినేకాని తొందర లలో పిడిచిన దానినే కాని పర ధనమును తీసికొన దలచకుండుట ఆలోభమనబడును. . శారీరకముగా మైథునము చేయకుండుట నోటితో ఆ మాటలాడుకుండుట మనస్సుతో అది తలచకుండుట అచ్చిద్ర (ఏదోష మును లేని) బ్రహ్మ చర్యమనబడును. . తన కై కాని ఇతరుల కై కాని విషయానుభవములందు ఇంద్రియములు ప్రవర్తిల్లకుండుట దమమనబడును. బహిరింద్రియ నిగ్రహము) . ఐదు విధములగు (శబ్ద స్పర్శరూప రస గంధములను) విషయముల విషయమునను ధనకనక వస్తు వాహనాది సుఖ) కారణ సాధనములేని మీదింటి విషయమునను ఎవరైన తన కడ్డము వచ్చినను కోపించకుండుట జితాత్మత్వము శమము) అనబడును. . తాను న్యాయము ఆర్జించినదియు తనకు మిగుల ఇష్టమును అగు వస్తువును కూడ గుణవంతులగువారికి ఇష్టముతో) ఇచ్చుట దానమనబడును. శ్రుతి స్మృతులు విధించిన వర్ణాశ్రమాత్మక ధర్మమును శిష్టాచార బలముచే వృద్ధిపొందిన ధర్మమును. సాధుజనులగు పెద్దలకు సమ్మతమగు ధర్మము. . ఇష్టములగు వానిని మెచ్చక.అనిష్టములగు వాని పై అధిక ద్వేషము చూపక ప్రీతి తాప విషాదములను పొందకుండుటయే వైరాగ్యమనబడును. . ఇదివరకు చేసిన.ఇక ముందు చేయనున్న కర్మల ఫల సంగమును విడుచుట సంన్యాసమనబడును. ి, తనకు ఇహముననే స క్షేమము కలిగించు కర్మములను కీడు కలి గించు కర్మములను సమ భావముతో విడుచుట న్యాసమనబడును. . ఆవ్య క (నామ రూప విభాగము లేని జగ నాది స్థితి) దశ మొదలుగా ఆయా.సకల సామరూప విశేషములవరకుగల వికారజాతమునుండి బుద్ధిని మరలించి చేతనమునకును అచేతన తత్వమునకునుగల భేదమును తెలిసికొని అటి జ్ఞానమందే యుండువాడు జ్ఞాని యనబడును. పూర్వపు స్వాయంభువ మన్వంతరమునందు ధర్మతత్వజులగు ఋషులు ధర్మ ప్రత్యంగముల స్వరూపము ఇదియని తెలిపియుండిరి.

అత్ర వో వర్తయిష్యామి విధిం మన్వన్తరస్య తు

 తథైవ చాతుర్హోత్రస్య చాతుర్వర్ణ్యస్య చై వహి

ప్రతిమన్వ న్తరంచైవ శ్రుతి రన్యా విధీయతే  

ఋచో యజూంషి సామాని యథావ  త్ప్రతీదై వతమ్

విధిస్తోత్రం తథాహౌత్రం పూర్వవ త్సoప్రవర్తతే

 ద్రవ్యస్తోతం గుణస్తోత్రం కర్మస్తోత్రం తథైవచ

 తథైవాభిజనస్తోత్రం స్తోత్ర మేవం చతుర్విషడ్విధమ్

మన్వన్తరేషు సర్వేషు యథా వేదా భవ న్తి హి

ప్రవర్తయతి తేషాం వై బ్రహ్మా స్తోత్రం పునఃపునః,

 ఏవం సర్వగుణానాంతు సముత్పత్తి శ్చతుర్విధా

 అథర్వ ఋగ్యజుస్సామ్నాం వేదేష్వాహ పృథక్ఫృథక్

ఋషీణాం తప్యతాం తేషాం తపః పరమదుశ్చరమ్

 మన్త్రాః ప్రాదుర్భవన్త్యాదౌ పూర్వమన్వన్తరస్య హ

అసన్తోషా ద్భయా ద్దుఃఖాన్మోహాచ్ఛోకాచ్చ పఞ్చిధా

 ఋషీణాం తార కాఖ్యేన లక్షణేన యదృచ్ఛయా

 ఋషీణాం యదృషిత్వంహి తద్వక్ష్యామీహ లక్షణమ్

అతీతా నాగతానాంతు పఞ్చధా హ్యార్షకం స్మృతమ్

తథా ఋషీణాం వక్ష్యామి ఆర్ష స్యైత త్సముద్భవమ్

గుణాః సామ్యేన వర్తన్తే సర్వే సంప్రళయే తదా  

మహదాదినిష్పత్తిః

అవిభాగేన వేదానా మనిర్దేశ్యత మోమయే

 ఆబుద్ధిపూర్వకం తద్వై చేతనార్థం ప్రవర్తతే

తేనార్షంబుద్ధిపూర్వంతు చేతనేనాప్యధిష్టితమ్

ప్రవర్తేతే తథా తౌతు యథా మత్స్యోదకా వుభౌ

 చేతనాధికృతం సర్వం ప్రవర్తేత గుణాత్మకమ్

కార్యకారణ భావేన తదా తస్య ప్రవర్తతే

 విషయో విషయిత్వం చ తథా హ్యర్థపదాత్మకమ్

కాలేన ప్రాపణీ యేన భేదావై కారణాత్మకాః

 సాంసిద్దికా స్తథా వ్య క్తాః క్రమేణ మహదాదయః

మహత స్స్యా రహజ్కార స్తస్మా ద్భూతేన్ద్రియాణి చ

ఇక ఇక్కడ మీకు ప్రతి మన్వంతరమునందును సమానరూపములో నడుచు ధర్మపు నడకను చాతురోత (బ్రహ్మ అధ్వర్యుడు కాక హోతతో కూడ నలుగురు ఋత్విక్కులతో నిర్వర్తించు యాగమును దాని విధానమును చాతు ర్వర్ణ్య ధర్మవ్యవస్థను వర్ణింతును.

ప్రతి మన్వంతరమునందును శ్రుతి వేరువేరుగా నుండును. (ఏ మన్వంతరమునకు ఆ మన్వంతరమునందు శ్రుతి మారును.) అప్పుడును ఋగ్ యజుః సామవేదము యుండును. ప్రతి దేవతను ఉద్దేశించిన మంత్రములు నుండును. విధి స్తోత్రము హోత్ర స్తోత్రము ద్రవ్యస్తోత్రము గుణస్తోత్రము కర్మస్తోత్రము అభిజనస్తోత్రము అనునవియును ఉండును. కాని అవి యును ప్రతి మన్వంతరమునందును వేరువేరుగా నుండును. బ్రహ్మ ఆయా వేదములకు సంబంధించిన స్తోత్రములను ప్రతి మన్వంతరమునందును వేరువేరుగా మరల మరల ప్రవర్తిల్ల చేయు చుండును. ఇది ఒక వేదమున కే కాదు; ఋగ్ యజుః సామాథర్వణ వేదములకు నాలుగిటికి సంబంధించిన స్తోత్రముల విషయమునందును మన్వంతర భేదమును బట్టి భేదము ఏర్పడును.

ఆయా మన్వంతరములందు మిగుల దుశ్చరమగు తపస్సాచరించిన ఋషులకు అతః పూర్వపు మన్వంతరము నందు వలెనే వేదమంత్రములు ప్రాదుర్భవించును. (వేదములును తదంశములును వెనుకటి మన్వంతరములందు వలెనే యున్నను వాటి రూపములందు భేదముండునని దీనిని బట్టి ఎరుగవలెను. )

ఆయా ఋషులకు ఆయా వేద-వేదాంశ ('వేదాంగ' అనికాదు.) మంత్రములు ప్రాదుర్భవించుటకు వారికి తమ యుగపు ప్రాపంచిక స్థితుల విషయమున కలిగిన అసంతోషము (వాటివలన కలిగిన) భయము దుఃఖము ( ఈ పరిస్థితుల నుండి జనుల కెట్లు విడుదల కలిగించవలెనో తెలియని స్థితి అనేడు) మోహము (ప్రజల క్లేశములు చూచి కలిగిన) శోకము అను ఈ ఐదు స్థితులును హేతువులగును.

ఋషులకు ఈ వేదవేదాంశములు సాక్షాత్కరించుట యాదృచ్చికముగ (అదృష్టవి శేషమున)ను తారకము అను (యోగ) లక్షణము చేతను సిద్ధించును.

ఋషులకు మంత్రద్రష్టలకు) ఋషిత్వమును కలిగించు లక్షణము తెలి పెదను. ఇదివరకు గడచిన మన్వంత రములందు కానీ రాబోవు వానియందు కాని ఆరకము (ఋషిత్వమునందలి ప్రభేదములు} ఐదు విధములుగా నుండును. ఋషులకు ఈ ఋషిత్వము ఏర్పడు విధముతోపాటు ఆ ఐదు ఋషిత్వ ప్రభేదములను మీకు తెలి పెదను.

ప్రళయకాలమునందు సర్వత్రిగుణములును సమతావస్థతో నుండును. వేదములును శబ్దార్ధ ప్రవీభాగములేక వాని ఆవాంతర ప్రవిభాగములును లేక ఏకై కా ఖండ శబ్దరూపము కూడ అవ్యక్త తత్వమున లయమంది యుండును. సర్వమును తమోమయమయి యుండును (ఈ దృశ్య ప్రపంచపు స్థూల రూపాంశములే కాదు సరియే కదా దీనికి మూలములగు సూక్ష్మత త్వములును అవ్యక దశయందుండును.) ఇది మూలప్రకృతి జడ తావస్థ. అది కొంత కాలము నకు తరువాత మరల అబుద్ధి పూర్వకముగానే తన సంకల్పము లేకయే - తాను జడము కావున తనకు సంకల్పించు శక్తియే లేదు.పరమాత్ముని చితి రూపశక్తి పేరణచే తనయందు చైతన్యమును వ్యాప్త మొనరించుకోనుటకును తాను చేత న్యమునకు ఆశ్రయమగుటకును ఉన్ముఖమయి) ప్రవర్తిల్లును.

ఇదియే ఆర్హతాస్థితి. అందుచేతనే ఆరత్వము అనునది చిదాత్మక (విశుద్ధ జ్ఞానాత్మక) త త్వపు శ క్తిచే పేరి తము కావున బుద్ధిపూర్వకము అనియు చేతనతత్వము చేత ఆధిష్టించబడినది (అనగా ఈ ఆర్తత్వమునందు చిదాత్మక లక్ష ణము వ్యాపించియున్న ది) అనియు చెప్పబడు చున్నది. ఇట్లు చేతనాచేతనములు.చిదాత్మక పరమాత్ముడును మూలప్రకృ తీయు - మత్స్యమును ఉదకమునువలె పరస్పరము విడదీయరాక ప్రవృత్తి నందు చుండును. ఇట్లే ప్రకృతి (జడ) పురుష చేతన)తత్వములు రెండును పరస్పరము కార్యకారణ భావమును పొంది చేతనవ్యా ప్తితో తనయందు చేతనత త్వము వ్యాపించగా) త్రిగుణమయ జడ ప్రకృతి సృష్టికి ప్రవర్తిల్లును.

ఈ విధముగ ప్రవర్తిల్లు సృష్టిలో శబ్దార్థ సృష్టియు వ్యక్తరూపము నందసాగును. అందు అర్థము విషయము. పదము (శబ్దము) విషయి. యగును. శబ్దమును వినగా తతభావమ న చిత్తమున ఆ శబ్దముచే ఉద్దేశించబడిన అర్థము (వస్తువుల సన్ని వేశము) గోచరమగును. ఇదియే శబ్దార్థముల విషయి విషయభావసుబంధము.

ఇట్లు అస్పష్ట రూపమున నైన శబ్దార్థవ్యక్తి స్పష్టీ భావము ప్రవ రిల్లుట) ఆరంభము కాగా కాలక్రమమున ప్రపంచ సృష్టికి మూల కారణత త్త్వములగు మహదాది తత్వములు. అవ్యక్త తత్వమునుండి వికాస క్రమమున వ్య క్తము కానారంభించును. మహ తత్వమునుండి అహంకారతత్వము దానినుండి సూక్ష్మభూతములు ఇంద్రియ తత్వములు వ్యక్తము లగును.

['నేను' అను సామాన్య కారపు 'అహం' తత్వ స్ఫురణచే ఈశ్వరుని యందు కలుగు బుద్ద్యాత్మక దశ ' మహత్త త్వము ' అనబడును. 'నేను ఇటీవాడను ఈ పేరుగల వాని కుమారుడను.” ఈ మొదలగు విశేష జ్ఞానముతో కూడిన 'అహం' స్ఫురణను అహంకారము అందురు. ఈశ్వరుని యందు జగత్సృష్టి ప్రవృత్తి కాలమున కలుగు ఇట్టి బుద్ధిదశ అహంకారతత్వ్తము. ]

భూత భేదాశ్చ భూతేభ్యో జజ్ఞిరేతు పరస్పరమ్

 సంసిద్ధిః కారణం కార్యం సద్య ఏవ నివర్తతే

యథోల్ముకా ద్విరుచయో ఏక కాలా ద్భవన్తిహి

 తథాప్రవృత్తాః క్షేత్రజ్ఞాః కాలేనై కేన కారణాత్

 యథాఽన్దకారే ఖద్యోత స్సహసా సంప్రదృశ్యతే

తథా వివృతో హ్యవ్య క్తః ఖద్యోత ఇవ సఞ్జ్వల

 స మహాత్మా శరీరస్థ స్తత్రైవ వరివర్తతే

మహత స్తమసః పారే వై లక్షణ్యా ద్విభావ్యతే

 తత్రైవ సంస్థితో విద్వా తమసోఽన్త ఇతి శ్రుతమ్

 బుద్ధి ర్వివర్దత స్తస్య ప్రాదుర్భూతా చతుర్విధా

 జ్ఞానం వైరాగ్య మైశ్వర్యం ధర్మ శ్చేతి చతుష్టయమ్

 సాంసిద్ధికా న్యథై తాని అప్రతీతాని తస్య వై

 మహాత్మనః శరీరస్య చైతన్యా త్సిద్ది రుచ్యతే

పురే శేతే యతః పూర్వం క్షేత్రజ్ఞానం తథాపిచ

 పు రేషు శయనా త్పురుషః క్షేత్ర జ్ఞానాద్ జ్ఞ ఉచ్యతే

 యస్మాద్ధర్మాన్ప్రసూతేహి తస్మా ద్వై ధార్మికస్తుసః

 సాంసిద్ధి కే శరీరేచ బుద్ద్యా వ్యక్తంతు చేత నమ్

ఏవం వివృత్తం క్షేత్రం జ్ఞః క్షేతం హ్యనభిసన్దితః

 వివృత్తిసమ కాలేతు పురాణం తదచేతనమ్

క్షేత్రజ్ఞేన పరిజ్ఞాతం భోగ్యోఽయం విషయో మమ

భూతతన్మాత్రలు అనేడు సూక్ష్మభూతములనుండి భూత భేదములు స్థూల భూతములు) మొదలగునవి ఒకదాని నుండి మరియొకటి అనుక్రమమున ఉత్పన్నము లగును. స్వాభావికముగా స్వయంసిద్ధమగు కారణతత్త్వమగు దాని నుండి ఏర్పడిన కార్యత త్వము మరియొక దానికి కారణమగుచు ఈ క్రమమున వెంట వెంటనే సృష్టి క్రమములో పరమాత్ముడు ఈ ప్రపంచ రూపమున రూపొందును. ఒక కొరవినుండి ఒకే సమయమున అనేకములగు చిన్న చిన్న నిప్పురవ్వలు చేదరి బయటికి వచ్చినట్లు ఒకే చైతన్యమునుండి ఒకే క్షణమున జీవు లనేకులు పరమాత్మనుండి వివృత మైన భూతము లతో ఏర్పడిన దేహము లందు సోనో దేహధారులు గా కనబడుదురు. ఇండరు క్షేత్రజ్ఞులకును జీవులకును) కారణమగు చేతనముల తత్వము ఒక్కటియే.

చీకటిలో అకస్మాత్తుగా మెరపు తళుక్కున మెరసినట్లు ఆవ్య క త త్వమునుండి వివృత్తమయిన జీవ సమూ హము కూడ దేహధారులయి ప్రకాశించుచు కనబడును. పరమాత్మ తత్వముకూడ అంతర్యామియై ప్రతి శరీరమునందు నుండును. మహాతమస్సునకు ఆవల పరమాత్ముడు ఈ సమ స్తసృష్టికి అతీతమయి త్రిపాతత్వముగా అంతర్యామి కంటే విలక్షణమయి ప్రకాశించుచుండును.

ఇట్లా పరమాత్ముడు అక్కడ నే. ఆయా దేహధారుల దేహములనెడు క్షేత్రములందే...ఉండును. అదే సమయమున తమస్సునకు ఆవలనుండును.ఆని శుతుల యందు వినబడు చున్నది. ఇట్లతడు ప్రకృతికి అధిష్టాతయై వివ ర్తము పొందు చుండ రూపవంతుడై భాసించుచున్న - కొలదీని అతని బుద్దిలో . జ్ఞానము - . వై రాగ్యము. . ఐశ్వర్యము . ధర్మము అనునవి కలిగెను. . ఇది మనవంటి వారి విరక్తి వంటిదికాదు; నేను పొందవలసిన దేదియు లేదు; నేను ఆవా ప్ల సకల కాముడను; నా వారు అనదగు వా రేవ్వరును లేరు; మమకారముతో నాకు పని లేదు.అను బుద్ది; . నేను సర్వేశ్వరు డను; నేనే ఎల్ల జగములకును దిక్కు; అనుబుద్ధి; . లోక ప్రవృత్తికి మూలమగు సత్కర్మానుష్టానము నేనే అను భావన.)_ఇవి అతనికి స్వతస్సిద్ధములే కాని కావ లేనని సంపాదించుకొన్న వి కావు. ఆ మహాత్మునికి మాయా శ కి కృత మగు శ రీరప్రాప్తివలన ఇవి సిద్ధించినవి.

ఇతడు 'పూర్ 'ఆనబడు ఆయాప్రాణుల శరీరముల యందు సాక్షి రూపుడై యుండును; “పురిశ>పురుష' అని వ్యవహరింపబడును. ఆయా దేహములందు ( క్షేత్రములందు) ఉండి వాని తత్వమును ఎరుగును కావున క్షేత్రజ్ఞుడు. జ్ఞుడు. అనబడును. ధర్మమును అవలంబించి లోకములను సృజించి పాలించును కావున అతడు ధార్మికుడనబడును.

ఇట్లు తనకు అనపాయిని అగు ఎన్నడును విడిపోని మాయాశ క్తిచే సిద్ధించిన దై స్వాభావికముగ లభించిన శ రీరము సందు ఈ చెప్పిన బుద్ధి లక్షణము చే చేతనుడయి పరమాత్ముడు మూల ప్రకృతికి కలిగిన సృష్ట్యభిముఖ ప్రజృత్తిని సఫ లము చేయును.

ఇట్లు పరమాత్మ క్షేత్రజ్ఞుడుగా వివర్తము పొందియు క్షేత్రము విషయమునను ఆందలి జీవుని ప్రవృత్తుల విషయ మునను వాటివలన కలుగు ఫలముల విషయమునను ఎట్టి అభిసంధియు (అహంకార మమకారములు) లు లేకుండును.

ఈ పరమాత్ముడిట్లు వివర్తము పొందుటకు సమకాలముననే పురాణము (అనాది) అగు ఆ అచేతన(జడ) ప్రకృతి షేత్రరూపమునను భోగ్యవస్తు జాత రూపమునను రూపొంది ఆ క్షేత్రజ్ఞుని చేత 'ఇది నాకు ఆశ్రయము' అనియు 'ఇదినాకు భోగ్యము' అనియు ఎంచబడుచున్నది.

ఋష్యాదిలక్షణమ్

 ఋషి ర్హింసాగత్యోర్ధితుర్విద్యా సత్యం తప శ్ర్శుతమ్

ఏష సన్ని చయో యస్మాద్ బ్రహ్మణస్తు తత స్త్వృషిః

 వివృత్తిసమ కాలాచ్చ బుద్ద్యా వ్యక్త మృషి స్స్వయమ్

ఋషతే పరమం యస్మాత్పరమర్షి స్తతః పునః

గత్యర్థా దృషతే ర్థాతో ర్నా మనిర్వృత్తకారణమ్

యస్మా దేష స్స్వయమ్భూత స్తస్మాచ్చ ఋషి తా మతా

  ఈశ్వరా స్స్వయముద్భూతా బ్రహ్మణో మానసా సుతాః

వివర్తమానై స్తైర్బుద్ద్యా మహా న్పరగతః పరః

యస్మా దృషి ర్మహ త్త్వేన సహ తస్మా న్మహర్షయః

ఈశ్వరాణాం సుతా స్తేషాం మానసా శ్చారసాశ్చ వై

 ఋషి స్తస్మా త్పర త్వేన భూతాది రృషయ స్తతః

ఋషిపుత్త్రా ఋషీ కాస్తు మైథునా ధ్గర్భసమ్భవాః

 పర త్వేన ఋషం తేవై భూతాదీ నృషికా స్తతః

ఋషి కోణాం సుతా యేతు విజ్ఞేయా ఋషిపుత్రకాః

 శ్రుత్వా ఋషం పర త్వేన స్మృతా స్తస్మా చ్చ్రుతర్షయః

అవ్యక్తాత్మా మహాన్తాత్మాఽహజ్కారాత్మా తథైవచ

భూతాత్మా చేన్ద్రియాత్మాచ తేషాం తద్జ్ఞాన ముచ్యతే

 ఇత్యేవ మృషిజాత్యస్తు పఞ్చధా నామ విశ్రుతాః

  భృగు ర్మరీచి రత్రిశ్చ అజ్గీరాః పులహః క్రతుః

 మను ర్దక్షో వసిష్ఠశ్చ పుల స్యశ్చాపి తే దశ  

బ్రహ్మణో మానసా హ్యేతే ఉత్పన్నా స్వయ మీశ్వరాః

పర త్వేన ర్షయో యస్మా న్మతా స్తస్మా న్మహర్షయః  

మన్త్రద్రష్టృఋషివరిగణనమ్

ఈశ్వరాణాం సుతా స్త్వేషా మృషయ స్తా న్నీ బోధత

 కావ్యో బృహస్పతిశ్చైవ కాశ్యప శ్చ్యవన సథా

 వత్సరో నగ్న హూ శ్చైవ భరద్వాజశ్చ వీర్యవాన్

 ఋషిర్దీర్ఘతమా శ్చైవ బృహద్వక్షాః శరద్వతః

వాజిశ్రవాః సుచింతశ్చ శావశ్చ సపరాశరః

శృంగీత శంఖపాచ్చైవ రాజావైశ్రవణ స్తథా

 ఇత్యేతే ఋషికాః సర్వే సత్యేన ఋషితాం గతాః

 ఈశ్వరా ఋషయ శ్చైవ ఋషికా యేచ విశ్రుతాః

జగత్సృష్టి పరమాత్మచైతన్య ఋషిత్వముల సంబంధము

ఋషీ - *హింసాగత్యోః; అను ధాతువునుండి ఋషి అను శబ్దము సిద్ధించును. బ్రహ్మ (చతుర్ముఖ బ్రహ్మ యును పరబ్రహ్మయును) విద్యా సత్యతపః శాస్త్ర జ్ఞానముల రాశి స్వరూపుడు కావున అతనికి ఋషి అని వ్యవహారము పరమాత్ముడు తాను నివృత్తి (సృష్టిగా రూపొందుట) పొందిన సమయమునందే బుద్ధి రూపమున వ్యక్తుడై (స్పష్ట రూపము నందినవాడై) నందున అతడు ఋషి; పర మము (సర్వోత్తమము) ఆగుదానిని 'ఋషతే' తెలిసికొనెను; కావున అతడు పరమఋషి; ఇట్లే 'గతి' 'గమనము - జ్ఞానము ' అను అర్థమును ఇచ్చు 'ఋష' ధాతువునుండి ఈ ఋషి శబ్దము ఏర్పడినది కావుననే - స్వయముగా తానే జ్ఞానము పరమాత్మగా స్వయం సముద్భూతమయినది కావున జ్ఞానమునకును ఋషి అని వ్యవహారము; ఇట్లే . బ్రహ్మ మానసపుత్రులగు మరీచి మొదలగువారు మైథున ప్రవృత్తితో పనిలేక స్వయముగా ఉత్పన్ను లయిరి. వారును ఋషులు; వీరును వివ ర్తను పొందుచునే న్యాయముగా బుద్ధి (జ్ఞానము) తో వ్యాపింపబడిరి కావున వీరు ఈశ్వర ఋషులు; జ్ఞానమునకు అధీశ్వరులు); . ఈ ఈశ్వర ఋషులకు మానస పుత్తులుగాను.ఔర (మైథునముతో జనించిన పుత్తులు గాను కలిగినవారు కొందరు తాము పుట్టుచునే మహాజ్ఞానముతో (ఋషితో) వ్యాక లయిరి; కావున వీరు మహర్షులు;  భూతాది సృష్టి కాలమున ఔరస సంతానముగా (మైథునముతో) జనించినవారు కేవః ఋషులు; . ఇట్లే మైథునముతో ఋషుల గర్బమునుండి జనించినవారు ఋషికులు; వీరు ఉత్కృష్టమగు విధమున భూతా సృష్టి విషయములను తెలిసినవారు. . ఋషికుల ఔరస పుత్తులు ఋషి పుత్రులు; వీరు తమ పూర్వులనుండి శ్రుతులన శ్రుతము (వినబడినవిగా చేసికొని లోకమున ప్రచారము చేయువారు; శ్రుతి తత్వము నెరిగినవారు; కావున వీరు శ్రుతరుల ఆనబడుదురు.

ఇక సృష్టి క్రమ దశల ననుసరించి పరతత్వము - . ఆవ్యక్తాత్మా . మహాన్హాత్మా . ఆహంకారాత్మా . సూక్ష్మ భూతాత్మా  ఇంద్రియాత్మా అని ఐదు విధములగును; ఈ చెప్పినవారిలో . ఈశ్వర ఋషుల అవ్యక్తాత్మను . మహర్షులు మహానాత్మను . ఋషులు అహంకారాత్మను . ఋషికులు భూతాత్మను . ఋషిపుత్తు ఇంద్రియాత్మను స్వయముగా జ్ఞాన విజ్ఞానములతో ఎరిగినవారు. ఇట్లు ఈ ఐదు తెగల ఋషులును పరతత్వము ఏదో రూపమున తాము ఎరిగియుండి ప్రజలకును ఎరుక పరచ గలిగినవారు.

(* పాణినీయ ధాతు పాఠమున “ఋషీ-గతా' అని మాత్రమున్నది. కాని ఇచట ఇచ్చిన హింసార్హము పాణినీయవ కాని.ఇతర వైయాకరణుల ధాతు పాఠమున నుండి యుండును. ఋషిత్వములో తపస్సు కూడ చే యున్న ది. ఇది శరీర హింసా రూపమయినది. అందుల కె ఈ ధాతువునకు ఈ యరము తగుననీతోచును.)

ఏవం మంత్రకృతః సర్వే కృత్స్న శశ్చ నిబోధత

 ఉచథ్యో వామదేవశ్చ అగ స్త్యఃకౌశిక స్తథా

కర్దమో వాలఖిల్యాశ్చ విశ్రవా శ్శక్తివర్ధనః

 ఇత్యేతా(తే)ఋషయః ప్రోక్తా స్తపసా ఋషితాం గతాః

తేషాం పుత్త్రా నృషీ కాంస్తు గర్భోత్పన్నా న్నిబోధత

 భృగుః కాశ్యపః ప్రాచేతా దధీచో హ్యాత్మ వానపి

ఊర్వోఽథ జమదగ్ని శ్చ వేదసార స్తత స్తథా

 ఆర్ష్టి షేణశ్చ శ్యావాశ్వో పితహవ్య స్స వేధసః

 వై న్యః పృథు ర్దివో దాసో బ్రహ్మాస్వా గృత్స్న శౌనకాః

  ఏకోనవింశతి హ్యేతే భృగవో మన్త్రకృత్తమాః

 అజ్గీరా బృహస్పతిశ్చ భరద్వాజో (థలక్ష్మణః) భవాత్మకః

తథా మృగధరోగర్గ శ్శితిభాకృతి రేవచ

*తుర వీతశ్చ మాన్దాతా అమ్బరీష సథై వచ

 యువనాశ్వః పురుకుత్స స్స్వశ్రవశ్చ తమస్యవాక్

అజమీడోస్వహార్థ్యశ్చ హ్యతల: కవిరేవచ

వృషదశ్వో విరూపశ్చ కణ్వశ్చైవాథ ముద్దలః

ఉచథ్యశ్చ శర ద్వాం( ఋషి జోబృహచ్చుక్ల) శ్చతథా వాజిశ్రవా అపి

  అవస్యోష స్సుచి త్తిశ్చ వామదేవ స్తథైవచ

ఉ బిల్లో బృహసిక్యశ్చ ఋషి ర్దీర్ఘతమా అపి,

 కక్ష వాంశ్చ త్రయస్త్రింశత్కృతా హ్యజ్గిర సాం వరాః

 ఏతే మన్త్రకృత స్సర్వే కశ్యపాంస్తు నిబోధత

కాశ్యప స్సహ వత్సారో నైధ్రువో నిత్య ఏవచ

అసితో దేవల శ్చైవ షడేతే బ్రహ్మ వాదినః  

ఆత్రీరర్ధస్వనా శ్చైవ శ్యావాశ్వోఽథ గవిష్ఠిరః

కర్ణిక శ్చ ఋషి సిద్ద స్తథా పూర్వాతిథిశ్చయః

 ఇత్యేతే త్వత్రయః ప్రోక్తా మన్త్రకృతో మహర్షయః

వసిష్ట శ్చైవ శ క్తిశ్చ తృతీయశ్చ పరాశరః  

తత్రస్తు ఇన్ద్రప్రమితిః పశ్చా మస్తు భరద్వసుః

 షష్టస్తు మిత్రావరుణ సప్తమః కుణ్డిన స్తథా

  ఇత్యేతే సప్త విజ్ఞేయా వాసిష్ఠా బ్రహ్మవాదినః

విశ్వామిత్రశ్చ గాధేయో దేవరాత స్తథాబలః

  తథా విద్వాన్మధుచ్ఛన్దా ఋషిశ్చానోఽఘమర్షణః

 అష్టకో లోహిత శ్చైవ భృతకీలశ్చ తా వుభౌ  

దేవశ్రవా దేవరాతః పురాణశ్చ ధనఞ్జయః

శిశిర శ్చమహాతేజాశ్శాలఙ్కాయన ఏ పచ

 త్రయోదశైతే విజ్ఞేయా బ్రహ్మీష్ఠాః కౌశికా వరాః

అగస్త్యోఽథ దృఢశ్వశ్చ ఇన్ద్రబాహు స్తథే వచ

 బ్రహ్మిష్ఠాగఽస్తయో హ్యేతే త్రయః పరమకీ ర్తయః

మను ర్వైవస్వత శ్చైవ ఐళో రాజా పురూరవాః

 క్షత్రియాణాం వరా హ్యేతే విజ్ఞేయా మన్త్రవాదినః

బలన్దశ్చ సవత్సశ్చ సజ్కీల శ్చైవ తే త్రయః  

ఏతే మన్త్రకృతో జ్ఞేయా వైశ్యానాం ప్రవరా ఇమే

 ఇత్యేక నవతిః ప్రోక్తా మన్త్రాయైశ్చ బహిఃకృతాః

  బ్రాహ్మణాః క్షత్రియావై శ్యాఋషిపుత్త్రాన్ని బోధత

ఋషి కాణాం సుతా హ్యేతే ఋషిపుత్తాస్సు(శ్శ్ర)తర్షయః

(*కృతవాచ స్తథా గర్గః కృతిస్సంకృతి రేవచ. (పాఠాం.)

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మన్వన్తరానువర్ణనే దేవాసురయక్షగన్గర్వమనుష్యాది పరిమాణోతేధాదికథనం నామ చతుశ్చత్వారింశదు త్తరశతత మోఽధ్యాయః

మంత్రద్రష్టలగు ఋషులు; త్రైవర్ణ కులందును ఋషులు కలరు

 భృగువు మరీచి అత్రి అంగిరుడు పులహుడు క్రతువు మనువు దక్షుడు వసిష్ఠుడు పులస్త్యుడు అను పదిమందియు బహ్మకు మానసపుత్రులు. వీరు ఈశ్వరులు; సర్వసమర్థులు; తమకు స్వయంభూ బ్రహ్మ అప్పగించిన ఆయా

స్పష్యంశము ల పై సంపూర్ణాధికారము కలవారు. పైన తెలిపిన ఐదు విధములగు ఆత్మల తత్వమును ఎరిగినవారు అగుటచే వీరు ఋషులనబడుదురు; ఋషులలో ఆందరలో మొట్ట మొదటివారును గొప్పవారును అగుటతో వారు మహరులు ఆనబడిరి. (పర -పరస్ = మహత్.)

ఇట్టి ఈశ్వరులగు మహర్షుల కుమారులు ఋషులు; వీరిని తెలి పేదను వినుడు; కావ్యుడు బృహస్పతి కశ్యపుడు చ్యవనుడు ఉతథ్యుడు వామదేవుడు అగస్త్యుడు కౌశికుడు కర్దముడు వాలఖిల్యులు విశ్రవసుడు శ క్తివర్తనుడు అనువారు ఋషులు. ఈ చెప్పబడిన ఋషులందరును తమ తపశ్శక్తిచే ఋషిత్వమును పొందిరి. వారి గర్భములనుండి ఉత్పన్ను లయిన ఋషికు'లనబడు 'ఋషులు' మైథునము చే జనించినవారు. ( వీరు “ఋషు' లను తెగకు చెందిన ఋషుల ఔరస పుత్రులు. వీరి పేరులు: వత్సరుడు (వత్సారుడు) నగ్నహూ భరద్వాజుడు వీర్యవాన్ దీర్ఘతమసుడు బృహ ద్వక్షసుడు శరద్వాన్ వాజశ్రవస్ సుచింతుడు పరాశరుడు శృంగిన్ శంఖపాత్ వైశ్రవణుడు వీరందరును ఋషికులు అనబడు ఋషులు; వీరెల్లరును సత్యమునందు సిద్ధినొంది ఋషిత్వమును పొందిరి.

ఈ చెప్పిన వారిలో ఈశ్వరులు మహర్షులు) ఋషులు ఋషికులు వీరెల్లరును మంత్రకృత్లు (మంత్రములను దర్శించినవారు. వారి పేరులన్నియు తెలి పెదను; తెలిసికొనుడు.

భృగువు కాశ్యపుడు ప్రచేతస్ దధీచుడు ఆత్మవాన్ ఊర్వుడు జమదగ్ని వేదుడు సారస్వతుడు ఆర్షి షేణుడు చ్యవనుడు వీతహవ్యుడు వేధసుడు వైన్యుడు పృథువు దివోదాసుడు బ్రహ్మస్వాన్ గృతుడు శౌనకుడు ఈ పందొమ్మిది మందియు భృగువంశము నందు జన్మించిన మంత్రకృత్మంత్రక ర-మంత్రద్రష్టలగు ఉత్తములు.

అంగీరస్ వేధసుడు భరద్వాజుడు లక్ష్మణుడు భవాత్మకుడు) కృతవాచుడు గర్గుడు స్మృతి సంకృతి (మృగ ధరుడు గర్గుడు శితిభా-కృతి) తుర వీతుడు మాంధాత అంబరీషుడు యువనాశ్వుడు పురుకుత్సుడు స్వశ్రవుడు సదస్యవాన్ (తమస్యవాన్) అజ మీఢుడు అస్వహార్యుడు ఉత్క లుడు కవి పృషద శ్వుడు విరూపుడు కావ్యుడు ముద్దలుడు ఉతచధ్యుడు శరద్వాన్ వాజిశ్రవస్ అవస్యోషుడు సుచిత్తి వామదేవుడు ఋషి జుడు బృహచ్ఛుక్లుడు (ఉబిల్లుడు బృహసిక్యుడు) దీరత మస్ క షీవాన్ - ఈ ముప్పది ముగ్గురును అంగిరో వంశమునందు జన్మించిన మంత్రద్రష్టలు.

ఇక మీదట కశ్యప వంశమునందలి మంత్రద్రష్టలు; వీరిని విని తెలిసికొనుడు; కాశ్యపుడు వత్సారుడు. నైధ్రువుడు నిత్యుడు అసితుడు దేవలుడు అనువారు వీ రారుగురు.

అత్రి అర్ధ స్యనుడు శ్యావాశ్వుడు గవిష్ఠిరుడు కనికుడు తపస్సిద్దుడగు పూర్వాతిథి ఈ ఆరుగురును అత్రివంశము నందలి మంత్రద్రష్టలు.

వసిష్టుడు శ క్తి పరాశరుడు ఇంద్రప్రమితి భరద్వసువు మిత్రావరుణుడు కుండినుడు ఈ ఏడుగురు వసిష్ట వంశ మందలి మంత్రద్రష్టలు. వీరందరు బ్రహ్మవాదులు (వేదతత్వము నెరిగినవారు.)

గాధిపుత్తుడగు విశ్వామిత్రుడు దేవరాతుడు బలుడు విద్వాంసుడగు మధుచ్ఛందుడు అఘమర్షణుడు అష్ట కుడు లోహితుడు భృతకీలుడు మాంబుధి దేవశ్రవస్ -ధసంజయుడు శిశిరుడు శాలంకాయనుడు - ఈ "పదు ముగ్గురును

బ్రహ్మిష్ఠులుబ్రహ్మతత్వవేత్తలలో ఉత్తములు)ను కౌశిక వంశోత్పన్ను లును అగు మంత్రద్రష్టలు.

అగస్త్యుడు దృఢద్యుమ్నుడు ఇంద్రబాహువు - ఈ ముగ్గురును బ్రహ్మిష్ఠులును అగస్త్య గోత్రజాతులునగు మంత్ర ద్రష్టలు; వీరు ఉత్తమ కీర్తిశాలురు.

వైవస్వత మనువు-ఇలాపుత్రుడును రాజు నగు పురూరవుడు క్షత్రియులలో శ్రేష్టులై మంత్రవాదులగు మంత్ర ద్రష్టలు. (మంత్రవాదులు = మంత్రత త్వవేత్తలు)

భలందకుడు వాసాశ్వుడు సంకీలుడు ఈ ముగ్గురును వైశ్యులలో ప్రవరు (శ్రేష్ఠులగు మంత్రద్రష్టలు.

(ఇచట చెప్పిన భృగ్వంగిరః కశ్యపాత్రి వసిష్ణ విశ్వామిత్రాగస్యుల గోత్ర ప్రవరములే ముందటి (.) అధ్యాయములందు వివరింపబడును.)

ఇట్లు మంత్రములను దర్శించి బయల్పరచిన మంత్రద్రష్టలలో తొంబది రెండు మంది నామములు ఇచట చెప్పబడినవి. వీరిలో బ్రాహ్మణులును క్షత్రియులును వైశ్యులును అను మూడు వర్ణములవారును కలరు. వీరిని ఋషి పుతు లందురు. 'ఋషికు'ల కుమారులకు ఋషిపుత్తులనియు శ్రుత సుత ఋషులనియు కూడ వ్యవహారము కలదు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున మన్వంత రాను వర్ల నమున- దేవాది పరిమాణం కథనము. శిష్ట సాధు ధర్మ తపోదా నాది లక్షణ –ఋష్యాది లక్షణ. మంత్రద్రష్టృ ఋషి పరిగణన మను నూట నలువది నాలుగవ అధ్యాయము.