మత్స్య మహా పురాణము
118 - పురూరవసు డత్ర్యాశ్రమమున కేగుట-తపమాచరించుట
సూతః : తత్రాయతే మహాశృజ్గే మహావర్షే మహాహమే ।
తృతీయంతు తయోర్మధ్యే శృజ్గ మత్య స్తముచ్ఛితమ్॥
నిత్యాతపో త పశిలం తథాపి శ్రమవర్జితమ్ ।
తస్యాధస్తా ద్వృక్షషణే దేశ భాగేతు పశ్చిమే॥
జాతీలతాపరిక్షిప్తం వివరం చారుదర్శనమ్ ।
దృష్వైవ కౌతుకావిష్ట స్తం వివేశ మహీపతిః॥
తమసా చాభినిర్విష్టం నల్వమాత్రం మహీపతిః ।
నల్వమాత్ర మతిక్రమ్య సుప్రభాభరణోజ్జ్వలమ్॥
సముచ్ఛిత మఠాత్య న గమ్భీరపరివర్తులమ్ ।
న తత్ర సూర్య స్తపతి న విరాజతి చన్దమాః ॥
తథాపి దీవసాకారప్రకాశం తమహర్నిశమ్ ।
క్రోశాధికపరిణాహసరసా విరాజితమ్॥
హిమాలయమునందలి ఇట్టి ప్రదేశములో చాల ఎత్తయిన రెండు శిఖరములు కలవు. వానియందు అధిక ముగా వర్షము కురియుచు మంచుపడుచు ఉండును. ఈ రేంటీ నడుమ వీనికంటె చాల ఎత్తయిన మూడవ శిఖరవి) కలదు, దాని శిలలు ఎడతెగక ఎండతో కాలు చుండును. అయినను ఆచట ! శ్రమతోచదు. ఆ శిఖరమునకు దిగువలో పడమటగా చెట్ల గుబురులో జాజి తీగలు క్రమ్మినదై చూడముచ్చటగా నున్న గొంది ఒటి కనబడగా కుతూహలము కలిగి పురూరవో రాజందు ప్రవేశించెను. చీకట్లు దట్టముగా కమ్మియున్న ఆ ప్రదేశము సర్వమాత్రము (నాలుగు వందల ధనువులు; ధనువు = నాలుగు మూరలు) పొడవుండెను. అది దాటిన తరువాత చక్కని కాంతులే ఆభరణములుగా ప్రకాశించునదిచాల ఎత్తైనది చాల లోతుక లది లోపలికి వ్యాపించినది) గుండ్రనిది ఒక చోటు కలదు. అచట సూర్యుడు తస ఎండను చంద్రుడు తన వెన్నెలను ప్రసరింపజేయరు. ఐనను అది అహర్నిశములు పగలువలె ప్రకాశించుచుండును. దానియందు క్రోశ ముకంటె ఎక్కువ వ్యాసముగల (క్రోశము = 1000 ధనువులు) సరస్సు అంద గించుచుండెను.
సమన్త త్సరస స్తన్య శైలలగ్నా తు వేదికా ।
సౌవర్ణైరాజతై ర్వృతై ర్విద్రుమై శ్చైవశోభితా॥
నానామాణిక్య సుమై స్సు! ప్రభాభరణోజ్వలై ।
తస్మి నరసి పద్మాని పద్మరాగచ్చదానిచ॥
వజ్ర కేసర యుక్తాని సుగన్టీని తథాప్యతి ।
పతై ర్మరకతై ర్నీలై ర్వేడూర్యైశ్చ మహీపతే॥
కర్ణికాశ్చ తథా తేషాం జాతరూపాశ్చ పార్థివ ।
తస్మి నరసి భూమిర్యా న సాపజసమాకులా॥
నానారత్నై రుపచితా జలజానాం సమాశ్రయా ।
కపర్దకానాం బ కీ నాం శజ్ఞానాంచ మహీపతే॥
మక రాణాంచ మత్స్యానాం జలజానాంచ కచ్ఛపైః ।
తత్ర మరకతఖణాని వజ్రాణిచ సహస్రశః॥
పద్మరాగేన్దనీలాని మహానీలాని పార్థివ ।
పుష్యరాగాణి రమ్యాణి తథా కార్కోటకానిచ॥
తుబుకస్యచ ఖడ్గాని తథా విష్ణుమణేరపి ।
రాజావర్తకముఖ్యాని రుధిరాక్షస్య చాప్యథ॥
సూర్యేనుకా స్తయో శ్చైవ పీలో ర్వైరాతలస్యచ ।
జ్యోతీరసస్య రమ్యస్య సమ స్యచ భాగశః॥
పురోరగబలాక్షాణాం స్ఫాటిక స్య తథైవచ ।
గోమేదవిత్తకానాం చ ధూళీమరకతస్యచ॥
వైడూర్యసౌగన్దిక యే స్తథా రాజమణే ర్నృప ।
అజ్ఞస్యచైవ ముక్తస్య తథా బ్రహ్మమణేరపి॥
ముక్తాఫలానాం శుద్ధానాం తారావిగ్రహధారిణామ్ ।
సుఖోష్ణంచైవ తత్తోయం స్నానా చ్ఛీతవినాశనమ్॥
ఈ సరస్సునకు అన్ని వైపులను వ్యాపించి కొండను అంటుకొని వేదిక (పొదరిండ్లతో నిండిన ప్రదేశము) ఒకటి కలదు. కన్నులకింపగు కాంతులే ఆభరణములై ప్రకాశించు మణి కుసుమములుకల బంగారు, వెండి పగడపు చెట్లనుండేను. ఆ సరస్సునందలి తామర పూవుల దళములు పద్మరాగములతో కేసరములు వజ్రములతో ఆకులు మరకతములతో వైడూర్యములతో దుద్దులు బంగారుతో ఏర్పడి సుగంధ యుతములై యుండెను. ఆ సరస్సునందును పరిసరములందును ప్రదేశము బురద లేక అది నానావిధ రత్నములతో పద్మములతో గవ్వలతో శంఖములతో ము తైపు చిప్పలతో మకరమత్స్య కూర్మాదులతో వెలయుచుండెను.
పద్మరాగేంద్ర నీలమ హేంద్ర నీలకార్కోటక తుబుక.విష్ణుమణి-రాజావర్తక-రుధిరాక్ష-సూర్యకాంత చంద్ర కాంత-పీలు -వై రాతల.జ్యోతీర స సమక పురోరగబలాక్ష-స్ఫటిక -గోమేదావిత్తక.మరకత-వైదూర్య-సౌగంధిక.రాజమణి ఖంజము క్ర-బ్రహ్మమణి తారాసదృశముక్తాఫల-రత్న ఖండములట నుం డెను. ఆ కొలని నీరు స్నానమాడినంతనే చలి పోగొట్టి హాయిగొల్పునంత వేడిగా నుండును.
వైడూర్యసుశీలా మధ్యే సరస శ్చోపశోభితా ।
ప్రమాణేచతథాభూతా ద్వేచ రాజ ధనుశ్శతే॥
చతుర శా తథారమ్యా నిర్మితాచ తథాత్రిణా ।
బిలద్వాంసమోద్దేశ సత్రచాపి హిరణ్మయః॥
ప్రదేశస్సలు రాజేన్ద ద్వీపే తస్మి న్మనోహరే ।
తథా పుష్కరిణీ రమ్యా తస్మి నాజచ్ఛిలాతలే॥
సుశీలామలపానీయా జలజైశ్చ విరాజితా ।
ఆకాశ ప్రతిమా రాజం శ్చతురశ్రా మనోహరా॥
తస్యా సదుదకం స్వాదు లఘు శీతం సుగన్దిచ ।
న క్షణోతి తథాకణం కుడి నాపూరయత్యపి॥
తృప్తిం విధత్తే పరమాం శరీరేచ మహత్సుఖమ్ ।
ఆ సరస్సు నడుమ వై దూర శిల ఉపశోభిల్లుచుండెను. దాని (ఒక్కొక్క భుజము) ప్రమాణము రెండు వందల ధనుపులు; అది చతురసమును రమ్యమునునై యుండునట్లు అత్రి మహాముని నిర్మించెను. (ఇచ్చటి, ఈ రమ్య సవిత్ర ప్రదేశములన్నియు అత్రి తపో నిర్మితములే. అచట నర స్సు నడుమ పర్వత బిలద్వార సదృశ ములగు ఉద్దే శములు చిన్న చిన్న ప్రదేశములు) గల హిరణ్మయ ప్రదేశపు ద్వీపమొకటి ఉండెను. ఆ మనోహర ద్వీపము నడుమ మిగుల ప్రకాశించు వైదూర్య శిలా తలము నడుమ కంటికింపగు చతురస్ర పుష్కరిణి కలదు. దానియందును పద్మములు కలవు. దాని మీరు మిగుల చల్లనిది స్వచ్చమయినది మధురమయినది తేలికయైనది. సుగంధయుతము. అది త్రావినచో కంఠము బాధ నొందదు; కడుపు నిండి బరువెక్కదు; కాని ఆనీరు పరమ తృ పిని శరీరమునకు మహా సుఖమును కలిగించును,
మధ్యేచ తస్యాశ్చ కృతః ప్రాసాద స్తవసాత్రిణా॥
రుక్మ సేతుప్రదేశశ్చ సర్వరత్నమయ శ్శుభః ।
శశాఙ్కరశ్మిసఙ్కాశః ప్రాసాద్ రాజతో సః॥
రత్న వైడూర్యసోపానో విద్రుమామలసాలకః ।
ఇన్దనీలమహాచతో జాతరూపవిభూషితః॥
పద్మరాగమహా సమ్బ స్తథామరకత వేదికః ।
రత్నాంశుజాలస్ఫురితో రష్యా దృష్టిమనోహరః॥
ప్రాసాదే తత్ర భగవాక్ దేవదేవో జనార్దనః ।
*భోగిభోగావళీసు ప్త స్సర్వాలజారభూషితః॥
జాను రాకుఇతశ్చైవ దేవదేవస్య చక్రిణః ।
ఫణీన్దసన్ని విష్ణోంఘి ర్ద్వితీయశ్చ సరాధిప॥
లక్ష్మ్యామాసక్తదృషేస్తు శేషభోగప్రశాయినః ।
ఫణీన్జభోగ విన్యస్త బాహుదళోపశోభితః॥
అబ్దుష్ఠపృష్టవిన్యస్త దేవశీర్ఘదరం శుభమ్ ।
ఏకస్తు దేవదేవస్య ద్వితీయ స్సుప్రసారితః॥
సమాకుక్చాతజానుస్థ మణిబన్ల సుశోభితః ।
కిడ్చా దాకుజాత శ్చైవ నాభిదే శే తథాస్థితః॥
తృతీయస్తు కర స్తస్య చతుర్థంతు తథా శృణు ।
ఆత్తసస్తానకుసుమ ఝణదేశానువర్తనమ్॥
లక్ష్మ్యా సంవాహ్యమానాజిః పద్మపత్రనిభై కరైః ।
సస్తానమాల్యమకుట హార కేయార భూషితమ్॥
భూషితచ తథా దేవ మజ్జదే రజ్ఞుళీయకై ।
ఫణీనఫణవిన్యస్త చారురత్న శిఖోజ్వలమ్॥
జ్ఞానినామప్యగమ్యం తం ప్రతిష్టిత మథాత్రిణా ।
సిద్దాభిపూజ్యం సతతం సతతం కుసుమాన్వితమ్॥
దివ్యగస్థానులిపాజం దివ్యధూ పేన ధూపితమ్ ।
సర సైస్సుఫలై ర్హృద్యై స్సీద్ధి రుపహృతై స్సదా॥
శోభితో త్తమపార్శ్వం తం దేవ ముత్పలశీర్షకమ్ ।
తత స్సమ్ముఖ ముద్వీక్ష్య వవందే స నరాధిపః॥
(*భోగిభోగసమాసీనస్సర్వాలజ్కార)
ఆ పుష్కరిణి నడుమ అత్రి మహాముని తన తపముచే నిర్మించిన ప్రాసాదము దేవాలయము) ఒక టీ కలదు, దాని నిర్మాణమున కై అమర్చిన చోటిని పుష్కరిణి నీటినుండి వేరుపరచుటకు నలువైపుల చతురస్రాకారమున నిర్మించిన అడ్డుకట్ట ( సేతువు) నానా రత్నములు పొదిగిన బంగారుతో న్మితమై శోభిల్లుచుండెను. ఆలయము చంద్ర కిరణములవలె వెలయు వెండితో దాని మెట్లు వైదూర్యము లతో ప్రాకారము పగడములతో లోపలి కప్పు పైనుండు మహాచక్రము బంగారు పొదిగిన ఇంద్రనీలములతో మహా సంభములు పద్మరాగములతో వేదికలు మరకతములతో నిర్మితములు; ఇట్లు ఆది రత్న కిరణరాశితో తళ తళ లాడుచు దృష్టిమనోహరము రమ్యమునై యుండెను.
ఇట్టి ఆలయమున దేవదేవుడు భగవానుడు నగు జనార్ధనుడు నారాయణుడు అర్చామూ ర్తియై ఉండెను. ఆ దేవుడు అనంతుని పడగల గమిపై పండుకొన్న వాడు. సర్వాలంకార భూషితుడు; ఆ దేవదేవుడగు చక్రి కుడి మోకాలు కొంచెముగ ముడుచుకొని రెండవ పాదము అనంతుని యందు ఉంచబడియుండెను. ఆ శేషశాయి దృష్టి లక్ష్మీ పై ఆస క్తమై యుం డేను. ఆ దేవదేవుని ఎడమ పైభుజము ఫణీంద్రుడగు ఆది శేషుని పడగల పై దిండుగా నుంచబడెను. కుడి పైభుజము పూర్తిగా చొచబడి దాని మణికట్టు దేవదేవుని ముడుచుకొనిన మో కాలి పై ప్రకాశించుచుండెను. ఎడమ దిగువ భుజమును కొంచెముగ ముడిచి ఆదేవుడు నాభి దేశమునకు ఉదరమునకు సూటిగా పాన్పు పై ఉంచుకొనెను. కుడి దిగువ చేతితో పారి జాత (కల్పవృక్ష) కుసుమమును వాసన చూచుటకై ముక్కునకు దగ్గరగా ఉంచుకొనెను. ఆ దేవదేవుని పాదములను లక్ష్మీదేవి పద్మపత్రములను బోలు కరములతో సం వాహనము చేయుచుండెను.
ఆ భగవానుడు కల్పవృక్షపు పూలతో మకుటముతో హారములతో అందేలతో భుజకీర్తులతో అంగుళీయకములతో శోభించుచుండెను. ఫణీంద్రుని పడగలయందలంకార ముగా ఉంచబడిన మనోహర రత్నశిఖలతో స్వామి ప్రకాశించు చుండెను. జ్ఞానులకును అగమ్యుడు అత్రి మహాముని చే ప్రతిష్టితుడు సిద్ధులకును సతతము అ పూజ్యుడు సతతము పూజో కుసుమాన్వితుడు దివ్య గంధానులిపొంగుడు దివ్య దూప ధూపితుడు సిద్ధులు సదా తెచ్చి కొనుక లిచ్చిన సర సములును హృదయమున కింపుగొల్పునవియునగు మంచి ఫలములతో ప్రకాశించు చుండు ఉ తమ పొర్వము కలవాడు కలువలు ఆలంకారముగానున్న శీరము కలవాడునగు ఆ నారాయణుని తన సమక్షమున గాంచి ఆ మద్రరాజగు పురూరవసుడు నిలువబడి ఉండియే నమస్కరించెను.
జానుభ్యాం శింసా చైవ గత్వా భూమితలం తదా ।
నామ్నాం సహస్రేణ తథా తుష్టావ మధుసూద నమ్॥
ప్రదక్షిణ మథో చ కే స తూత్థాయ పునః పునః ।
రమ్యమాయతనం దృష్ట్వా తత్రో వాసాశ్రమే పునః॥
జలాద్బహి ర్దుహాం కాంచి దాశ్రిత్య సుమనోహరామ్ ।
తపశ్చకార తతైవ పూజయ స్మధుసూదనమ్॥
నానావిధై సథాపుష్పైః ఫలమూలై స్సగోర సైః ।
నిత్యం త్రిషవణస్నా యీ వహ్ని పూజా పరాయణః॥
దైవవాదీజలై కుర్వ సతతం ప్రాణధారణమ్ ।
సర్వాపరపరిత్యాగం కృత్వా స మనుజేశ్వర॥
అనాశ్రీతగుహాశాయీ కాలం నయతి పార్థివః ।
త్యక్తాహారక్రియశ్చాపి కేవలం నియతో నృపః॥
న తస్య గ్లామాయాతి శరీరంచ తదద్బుతమ్ ।
ధ్రువం స రాజా తపసి ప్రసక్త సమ్పూజయకి దేవవరం సదైవ॥
తత్రాశ్ర మే కాలమువాస కించి త్స్వర్గోపమే దుఃఖమవిన్దమాసః॥
ఇతి శ్రీ మత్స్యమహాపురాణే భూగోళే పురూరవశ్చరితే పురూరవసోత్ర్యాశ్రమ
గమనాదికథనం నామాష్టాదశోత్తర శతత మోధ్యాయః॥
అంతట ఆతడు మోకాళ్ళను శిరస్సును నేలకానించి నారాయణుని నమస్కరించి సహస్ర నామములతో మధు సూదనుని స్తుతించెను. అనంతరమతడు లేచి ప్రదక్షిణమును నమస్కారమును మరల మరల చే నెను. ఆ ఆలయము అతి రమ్యముగా నుండుట చూచి ఆ ఆశ్రమమునందే తన నివాసము నేర్పరచుకొనెను. పుష్కరిణీ జలమునకు వెలుపల అతి మనోహరమగు ఒకానొక గుహను ఆశ్రయముగా ఏర్పరచుకొని దానియందే నానావిధ పుష్ప ఫలమూలము లతో గోర సముల (ఆవుపాలు పెరుగు నేయి మొదలగు వాని)తో మధుసూదన పూజా పూర్వకముగా తపమాచరించెను. ఆతడు అను దినమును త్రిషవణములందు స్నానము చేయును. అగ్నిని హోమముతో పూజించును. దేవ నిర్మితములగు (మనుష్యులు త్రవ్వియుండని) బావుల నీటితో ప్రాణధారణము చేయును. మరి ఆహారమును తీసికొనడు. ఇతరులు ఎవ్వరును ఆశ్రయించి ఉపయోగించుకొనుచుండని గుహలయందు నిద్రించును. కేవలము నియమపరుడై ఆహారగ్రహణము వీడిచియున్న ను ఆతని శరీరము శ్రమ చెందేడిది కాదు. ఇది ఆశ్చర్యము గొలుపు విషయ మగదా! ఇరాజు ధ్రువ నిశ్చయుడై దేవదేవుని విడువక సదా పూజించుచు తపమాచరించుచు స్వర్గతుల్యమగు ఆ ఆశ్రమమున ఏ దుఃఖమును ఎరుగక కొంతకాలము గడ పెను.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూ ద్వీపాంతర్గత భారత వర్గాంతర్గత భరతఖండ వర్ణనమున మద్రరాజగు పురూరవుడ త్యాశ్రమమేగి తపమాచరించుటయను సూట పదునెనిమిదవ అధ్యాయము.
Summary of chapter 118 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the western and northern supporting mountain peaks of Meru, known as Mount Vipula and Mount Supārshva. Bhagavān Matsya describes the giant cosmic trees standing upon these peaks, including the giant Banyan, Ashvattha, and Pippala trees whose vast branches span hundreds of Yojanas. The rivers flowing from these mountains carry fragrant juices from oversized cosmic fruits, nourishing the land and filling the air with divine aromas that bring peace to all living beings.