మత్స్య మహా పురాణము
281 - హిరణ్య హస్తి (గజ) రథ దాన విధానము.
శ్రీమత్స్యః : అథాత స్సమ్పవశ్యామీ హేమహ స్తిరథం శుభమ్ ।
యస్య ప్రదానా ద్భువనం వైష్ణవం ప్రాప్యతే నరైః॥
పుణ్యాం తిథి మథాసాద్య తులాపురుషదానవత్ ।
విప్రవాచనకం కుర్యా ల్లో కేశావాహనం బుధః॥
ఋత్విజ్మణ్ణపసమ్భార భూషణాచ్ఛాదనానిచ ।
ఆత్రాప్యుపోషిత స్తద్వ బ్రాహ్మణే స్సహ భోజనమ్॥
కుర్యా తుష్పరథాకారం కాజ్చానం మణిమజ్జితమ్ ।
వలభీభిర్విచిత్రాభి శ్చతుశ్చక్రసమన్వితమ్॥
కృష్ణాజినే తిలద్రోణం కృత్వా సంస్థాపయే ద్రథమ్ ।
లోకపాలాష్టకో పేతం బ్రహ్మాఒరశివ సంయుతమ్॥
మధ్యే నారాయణ్ పేతం లక్ష్మీపుష్టిసమన్వితమ్ ।
తథాష్టాదశ ధాన్యాని భోజనాసనచన్దనై॥
దీపకోపానహచ్ఛత్రపాదుకాదర్పణాన్వితమ్ ।
ధ్వజేతు గరుడం కుర్యా తూబరా వినాయకమ్॥
నానాఫలసమాయుక్త ముపరిష్టా ద్వితానకమ్ ।
కౌశేయం పణవర్ణం చ అమ్లానకుసుమాన్వితమ్॥
చతుర్భిః కలశై సార్ధం గోభి రషాభిరన్వితమ్ ।
చతుర్భి క్షేమమాతణ్ణి ర్ముక్తాదామవిభూషితై॥
స్వరూపతః కరిభ్యాంచ యుక్తం కృత్వా నివేదయేత్ ।
కుర్యా త్పఇ్చపలాదూర్ధ్వ మాభారాదపి శ క్తితః॥
తథా మజళ శబేన స్నా పితో వేదపువే ।
త్రిః ప్రదక్షిణ మావృత్య గృహీతకుసుమాక్జాలిః॥
ఇమ ము చ్చొరయేన శ్రం బ్రాహ్మణేభ్యో నివేదయేత్ ।
నమో నమ శ్శజ్కరపద్మజార్కలో కేశ విద్యాధర వాసుదేవై@॥
త్వం సేవ్య సే వేదపురాణయజ్ఞే స్తేజోమయ స్యన్దన సాహితస్మాత్ ।
య త్తత్పదం వర మగుహ్యతమం మురారే హ్యానన్ద హేతు గుణరూపవిముక్తమ న్తః॥
యోగైక తారస్వదృశో మున్వయ స్సమాధే పశ్య ని తత్త్వమసి నాథ పదేధిరూఢ ।
యస్మా త్వమేవ భవసాగర సమ్ల్పుతానా మానన్దభా గమృతమధ్వర సానపాత్రమ్॥
తస్మా దమౌఘశమనేన కురు ప్రసాదం చామీక రేభరథ మాధవ సమ్ర్పదానాత్ ।
ఇత్తం ప్రణమ్య కన కేభరథప్రదానం యః కారయే త్సకల పాపవిముక్తదేహః॥
విద్యాధరామరమునీన్తగణాధిజుష్టం ప్రాప్నోత్యసౌ పద మనుత్తమ మినుమౌ శేః ।
కృతదురితవితాన ప్రజ్వలద్వహ్ని జాల వ్యతికరకృతదేహోద్వేగ భాషోపి బంధూ॥
నయతి చ పితృపౌత్త్రా నాన్తవాన వ్య శేషా నృతగజరథదానా చ్ఛాశ్వతం సద్మ విష్ణోః॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మహాదానానుకీర్తనే హేమహ స్తిరథ ప్రదానికో
నామ ఏకాశీత్యుత్తర ద్విశతతమోధ్యాయః॥
శ్రీమత్యుడు మనువునకు ఇట్లు చెప్పెను: ఇపుడిక శుభమగు సువర్ణగజ రథ దాన విధానము తేలిపెదను: ఆ ప్రదానము చే వివేకులగు నరులు వైష్ణవపదస్థానము నందగలరు; శుభదినమందు తులాపురుష దానమందువలేనే విప్రు లచే స్వస్తిపుణ్యాహవాచన లోకపాలావాహనాదికము జరుపవలేను; ఋత్విజులను మండపమును సం భారములను భూషణ వస్తాదికమును కూడ ఆయై నమకూర్చుకొనవలయును; ఇందును ఆ పై ఉపవసించి బ్రాహ్మణులతో కూడి భోజనము జరుపవలయును; పుష్ప రథాకారమగు బంగరు రథము చేయించవలయును; అందు మణ్యలంకారములు వింతగొలుపు వలభులు (చూరులవంటి కూర్పులు) నాల్గుచక్రములుఉండవలెను; ఆప్షలోకపాలురు బ్రహ్మరవి శివులు నడుమ లక్ష్మీ పుష్టి దేవీసహితుడగు నారాయణుడు నుండవలెను; ఇవియన్నియు కృష్ణాజినము పై తిలద్రోణమందుంచవలయును; దగ్గరలో అష్టాదశ ధాన్యములు పాత్రములుఆసనములు చందననము దీపికలు పాదుకలు పాదరక్షలు ఛత్రములు అద్దములు ఉండ వలెను; రథపు ధ్వజమందు గరుడుడు కూబరపు కొన పై వినాయకుడు నుండవలెను; దాని పై మేలుక ట్టును దగ్గరలో నానాఫల ములును ఐదు వన్నెల పట్టువస్త్రమును వాడని పూవులును కుళ చతుష్టయమును అష్ట గోవులును సువర్ణగజ చతుష్టయమును ముత్తెముల దండలును రెండు వాస్తవ గజములును. ఇన్ని యుఉంచి దానమీయవలెను; బంగరు రథము మాత్రము ఐదు పలములనుండి బారువ వరకుగల బంగారుతో చేయించవలయును; మంగళ వాద్య వేదధ్వనులతో కూడ వేదవేత్తలగు బ్రాహ్మణ పుంగవులచే స్నానము చేయించుకొని యజమానుడు పూవులు దోసిట పట్టుకొని అగ్న్యాదులను త్రిప్రదక్షిణము చేసి ఈ మంత్రముచ్చరించుచు బ్రాహ్మణులకుఅవి దానము చేయవలెను :
“తేజోమయ రథమా! నమోనమః; బ్రహ్మ విష్ణు రుద్ర రవి లోకపాల విద్యాధరులును వేద పురాణ యజ్ఞ ములును నిన్ను సేవిం(ఆశ్రయిం)చును; కావున ఇట్టి నీవు మమ్ము కాపాడుము; పరమ గుహ్యతమమును ఆనంద హేతువును గుణరూప రహితమును నగు ఏ విష్ణు స్థానమును యోగై కావలంబనమగు స్వదృక్కులుగల యోగులు తమ హృదయ మధ్య మందు చూతురో ఆ మహాతత్వము నీవే 'నాథుడవు' 'రక్షకుడవు' అను పదమందు నిలిచినవాడవు; భవసాగర మున ముంచబడినవారికి ఆనందకరమగు అమృతమును త్రోవుటకుపయోగించు యజ్ఞాంగ పానపాత్రమవు (చమసము) నీవే; కావున బంగరు టేనుగుల అరదమురూపున నుండు మాధవా! పాపరాశినీ శమింపజేసి ఈ దానము చే మాయందనుగ్రహమును చూపుము.”
ఇట్లు పలికి నమస్కరించవలయును; ఇట్లు హిరణ్యగజ రథ ప్రదానము చేయువాడు నకల పాప విముక్త దేహుడై విద్యాధర మునీంద్రదేవతా గణముల కాశ్రయమగు మహోత్తమ శివస్థాన మందును; తాము చేసిన ఆనేక పాప రాసు లనెడు మంటలగముల నంపర్కముచే మండుచు బాధలనందు దేహములు కలిగి బాధలను ఉద్వేగమును అందుతున్న బంధువులను పితృపౌత్తులను ఇతరాజ శేష బంధువులను కూడ ఈ దాత విష్ణు లోకమునకు తీసికొనిపోవును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున హిరణ్య హస్తిరథ ప్రదానిక మను రెండు వందల ఎనుబది యొకటవ అధ్యాయము.
Summary of chapter 281 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents the systematic ritual for Hema-hastiratha-dāna, the seventh Mahādāna involving the gift of a golden chariot pulled by four sculpted golden elephants. Bhagavān Matsya describes crafting the golden elephants with silver tusks, gemstone bells, and silk coverings, supporting a magnificent golden chariot holding an icon of Indra or Bhagavān Vishṇu. Gifting this opulent golden elephant chariot to elevated Vedic scholars cleanses severe karmic transgressions, bestows unshakeable royal power, and grants residence in Indra's celestial capital Amarāvatī.