221 - సామోపాయ విచారము. 

మనుః : ఉపాయాన్మే సమాచక్ష్వ సామపూర్వా న్మహాద్యుతే

రక్షణం చ తథా తేషాం ప్రయోగం చ సురోత్తమ

మత్స్యః : సామ భేద స్తథా దానం దణ్డశ్చ మనుజోత్తమ

ఉ పేక్షాచ తథా మాయా ఇంద్రజాలంచ పార్థివ

ప్రయోగాః కథితా స్సప్త తన్మే నిగదత శ్శృణు

ద్వివిధం కథితం సామ తథ్యం చాతథ్య మేవచ

శ్రీ తత్రాప్యతథ్యం సాధూనా మాక్రోశాయైవ జాయతే

తత్ర సాధుః ప్రయత్నేన సామసాధ్యో నరోత్తమ

మహాకులీనా ఋజవో ధర్మనిత్యా జితేన్డియాః

సామసాధ్యా నచాతథ్యం తేషు సామ ప్రయోజయేత్

తథ్యంచ సామ కర్తవ్యం కులశీలాది వర్ణనమ్

తథా తదుపచారాణాం కృతానాం చైవ వరర్ణనమ్

అనయైవ తథా యుక్త్యా కృతజ్ఞాఖ్యాపనం స్వకమ్

ఏవం సొమ్నాచ కర్తవ్యా వశగా ధర్మతత్పరాః

సామ్నా యద్యపి రక్షాంసి గృహనీతి పరా శ్రుతిః

తథా పేత దసాధూనాం ప్రయుక్తం నోపకారకమ్

అతిశ జిత మిత్యేవం పురుషం సామవాదినమ్

ఆసాధవో విజ్ఞాన ని తన్త త త్తేషు వర్జయేత్

యే శుద్ధవంశ్యా ఋజవః ప్రతీతా ధర్మే స్థితా సత్యపరా వినీతాః

తేషా మసాధ్యాః పురుషాః ప్రదిష్ణా అనువ్రతా యే సతతం చ రాజ

 ఇతి శ్రీ మత్స్య మహాపురాణే రాజధర్మే సామోపాయ కథనం నామ ఏకవింశత్యు త్తర ద్విశతతమోధ్యాయః

మహాద్యుతీ! సామము మొదలగు ఉపాయముల లక్షణములను పొని ప్రయోగ ప్రకారమును తెలుప వేడుచున్నాను; అనిన మనువుతో మత్సుడిట్లనెను: మనుజోత్తముడగు మను పార్థివా: సామము భేదము దానము దండము ఉపేక్ష మాయ ఇంద్రజాలము ఆనునవి ఏడు ఉపాయములు ప్రయోగింప దగినవి కలవు! అవి క్రమముగ నేను తెలి పెద; వినుము; సామము తథ్యము అతథ్యమునని రెండు విధములు; దీనిలో అతథ్య సొమము సాధువుల పై ప్రయోగించినచో వారాక్రోశిం కోపిం-నిందింతురు; కావున నరోత్తమా! సాధుజనులను సామము తోనే యత్నముతో సాధించవలెను; మహాకులీనులు ఋజు స్వభావులు ధర్మనిత్యులు (ధర్మనిరతులు) జితేంద్రియులు సామ(ముతో) సాధ్యులు; వారియందు అతథ్య (కపట) సామమును ప్రయోగించరాదు; తథ్యసామమునే ప్రయోగించవలెను; ఆది ఏమనగా వారి కుల శీలాదులను వర్ణించుట వారి విషయమున తనకు గల కృతజ్ఞతా భావమును తెలుపుట . ఈ విధమగు యుక్తితో ప్రయోగించు సామము తథ్యసామము; దీనితో ధర్మ తత్పరులగు ఉ త్తములను లోబరచుకొన వలయును; 'సామముతో రక్షసులను గూడ లోబరచుకొందుర'ను శుతియున్న మాట నిజమే; ఐనను దీనిని అసాధుజనులందు ప్రయోగించినచో ఉపకరించదు; తనయందు సామవచనములు పలుకు వానిని అసాధుజనులు అతి శంకితునిగా (తను జూచి చాల భయపడుచున్న వానిగా) భావన చేయుదురు; కావున వారి విషయమున ఆది విడువ వలయును. శుద్ద వంశ్యులు ఋజుస్వభావులు ధర్మస్థితులు సత్యవరులు వినీతులు అగు ప్రసిద్ధ సాధుజనులు సామసాధ్యులు: వారిని సతతము ఆనువ్రతముతో (అను కూల ప్రవర్తనముతో వశీక రించు కొనవలెను.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున రాజధర్మమున సామోపాయ కథనమను రెండు వందల ఇరువది యొకటవ అధ్యాయము.