275 - బ్రహ్మాండ దాన విధానము

శ్రీమత్స్యః : అథాత స్సమ్పవక్ష్యామి బ్రహ్మాణ విధి ముత్తమమ్

యచ్చేష్టం సర్వదానానాం మహాపాతకనాశనమ్

పుణ్యం దిన మథాసాద్య తులాపురుషదానవత్

ఋత్విజ్మణ్డసమ్భార భూషణాచ్చాదనాదికమ్

లో కేశావాహనం తద్వ దధివాసనకం తథా

కుర్యాద్వింశపలాదూర్ధ్వ మాసహస్రాచ్చ శ క్తిత

కలశ ద్వయసంయుక్తం బ్రహ్మాణం కాణ్చ నం బుధః

దిగ్గజాష్టక సంయుక్తం షడ్వేదాజసమన్వితమ్

లోకపాలాష్టకో పేతం మధ్యస్థిత చతుర్ముఖమ్

శివాచ్యుతార్క శిఖర ముమాలక్ష్మీసమన్వితమ్

వస్వాదిత్యమరుద్దర్భం మహారత్న సమన్వితమ్

విత స్తే రజుళశతం యావదాయామవి స్తరమ్

కౌశేయవస్రసంయుక్తం తిలద్రోణోపరి న్య సేత్

తథాష్టాదశ ధాన్యాని సమస్తా త్పరికల్పయేత్

పూర్వేణాన స్తశయనం ప్రద్యుమ్నం పూర్వదక్షిణే

ప్రకృతిం దక్షిణే దేశే సజ్కర్షణ మతఃపరమ్

పశ్చిమే చతురో వేదా ననిరుద్ద మతః పరమ్

అగ్నిము తరతో ప్రామం వాసుదేవ మతపరమ్

సమస్తా ద్గుడ పీఠస్థా నర్చయే త్కాఞ్చనా న్బుధః

స్థావయే ద్వ్భస్త్రసంవీతా న్పూర్ణకు మాంధశై వతు

శ్రీమత్యుడు మనువునకు ఇట్లు చెప్పెను; ఇపుడిక ఉత్తమమగు బ్రహ్మాండ దానమును తెలిపెదను; ఏనుము; ఇది సర్వదానములలో శ్రేష్టమును మహాపాతక నాశనమును; పుణ్యకరమగు శుభదినమున తులాపురుష దానమందువలేనే ఋత్విజులను మండపమును సం దారములను వస్త్ర భూషణాదికమును ఏర్పరచుకొనవలెను; అట్లే లోక పొలావాహనమును దేవతాధిహాసనమును జరుపవలయును; ఇరువది పలములకు తక్కువ కాకుండ వేయి పలముల వరకుగల తూకముగల బంగారుతో రెండు కలశములను బ్రహ్మాండమును చేయించవలయును; అందు అష్టదిగ్గజములు చతుర్వేద ష డ్వేదాంగ లోక పాలాష్టక చతుర్ముఖ శివ విష్ణు రవి ప్రముఖులును పార్వతీ లక్ష్మీ దేవులును అష్ట వసువులును ద్వాదశాదిత్యులును సప్తమరుత్తులును మహారత్నములును ఉండవలయును; పండ్రెండు మొదలుగా నూరు వరకు అంగుళముల పొడవు వెడల్పులు గల పట్టు వస్త్రమును పరచి దాని పై తిలద్రోణమునుంచి దాని పై ఈ బ్రహ్మాండాదుల నుంచవలయును; దాని చుట్టును పదునెనిమిది ధాన్యములుంచవలెను; తూర్పున అనంత శయనుడగు నారాయణుని ఆగ్నేయమున ప్రద్యుమ్నుని దక్షిణమున ప్రకృతి దేవిని నైరృతమున సంకర్షణుని పశ్చిమమున నాల్గు వేదములను వాయవ్యమున అనిరుద్ధుని ఉత్తరమున అగ్నిని ఈశాన్యము నందు వాసుదేవుని బంగారు ప్రతిమలు గా గుడ పీఠములయందు నిలిపి పూజించవలేను. నూతన వస్త్రము చుట్టిన పూర్ణకుంభములు పది ఆటనుంచవలెను.

దశైవ ధేనవో దేయా స్స హైమామ్బర దోహనాః

పాదుకోపానహచ్ఛత్ర చామరాసనదర్పణైః

భక్ష్యభోజ్యాన్నదీ పేక్షు ఫలమాల్యానులేపనే

హోమాధివాసనా నేతు స్నా పితో వేదపుజవేః

ఇమ ముచ్చారయేన్మం త్రిః కృత్వాథ ప్రదక్షిణమ్

నమోస్తు విశ్వేశ్వర విశ్వధామ విశ్వేశ్వరాధార జగత్సవిత్రే

సప్తర్షిలో కామర భూతలేశ గర్భేణ సార్ధం వితరాభిరక్షామ్

యే దుఃఖితా స్తే సుఖినో భవన్తు ప్రయాన్లు పాపాని చరాచ రాణామ్

త్వద్దానశహతపాతకానాం బ్రహ్మాణదోషాః ప్రళయం వ్రజస్తు

ఏవం ప్రణమ్యామర విశ్వగర్భం దద్యా ద్ద్విజేభ్యో దశధా విభజ్య

భాగ ద్వయం తత్ర గురోః ప్రకల్ప్య సమం భజే చ్ఛేష మనుక్రమేణ

స్వలేతు హోమే గురు రేక ఏవ కుర్యా దభై కాగ్ని విధానయుక్త్యా

స ఏవ సమ్పూజ్యత మోఒల్పవిత్తే రథో క్షవస్త్రాభరణాది కేన

ఇత్తం య ఏత దఖిలం పురుషోత్ర కుర్యా ద్ర్బహ్మాజ్ఞదాన మధిగమ్య మహ ద్విమానమ్

నిర్దూతకల్మషవిశుద్ధతను ర్మురారే రానన్జకృత్పద ము వైతి సహాప్సరోభిః

సత్తారయే త్పితృపితామహపుత్తపౌల్తాబన్దు ప్రియాతిథికళత్రక తాష్టకం సః

బ్రహ్మాణదానశక లీకృతపాతకౌమ మానన్దయేచ్చ జననీం కులమ వ్య శేషమ్

ఇతి పఠతి శృణోతి వా య ఇత్థం సురభవనేషు గృహేషు ధార్మి కాణామ్

మతిమపిచ దదాతి మోదతేఒసా వమరపతే ర్బవనే సహాప్సరోభిః

ఇతి శ్రీమత్స్యమహాపురాణే మహాదానానుకీర్తనే బ్రహ్మోణ్డప్రదానికో నామ పంచసప్తత్యుత్తర ద్విశతత మోధ్యాయః

ఈ పది పాడియావులను బంగరు సరిగ వస్త్రములను పొలు పిదుకు పాత్రలను పాదుకలను పాదరక్షలను ఛత్త చామరాసన దర్పణములను భవ్య భోజ్యాన్నదీ పేక్షు ఫలపుష్ప సుగంధానులేపనములను ఈయవలయును; హోమమును దేవతాధివాసనమును ముగిసిన తరువాత వేద విదులగు విప్ర పుంగవుల మంత్రములతో వారిచే స్నానము చేయించబడి యజమానుడు వారిని దేవతలను ముమ్మారు ప్రదక్షిణించి ఈ మంత్రముచ్చరించవలయును; “విశ్వేశ్వరా! (విశ్వము స్థానముగా గలవాడా!) విశ్వధామన్! విశ్వేశ్వరులకు ఆధారమా! జగత్సృష్టికర్తా! సప్తర్షులకును లోకములకును ఆమరులకును ఈశా! ఈ హిరణ్మయ గర్బముతో కూడిన నీవు మాకు అభి (సర్వ విధములగు) రక్షను దయ చేయుము. దుఃఖితులందరును సుఖితులగుదురుగాక ! చరాచర ప్రాణుల పాపములు తొలగిపోవును గాక! నీ దానమనేడు శస్త్రములతో మా పొతకములు దెబ్బలుతిని బ్రహ్మాండమందలి దోషములన్నియు నాళమందుగాక !”

ఇట్లు ఆమర విశ్వగర్భుడగు బ్రహ్మాండాధిపతిని నమస్కరించి ఈ ద్రవ్యమంతయు పది భాగములుగా విభజించి బ్రాహ్మణులకీయవలయును; అందు రెండు భాగములు గురునకును మిగిలిన ఎనిమిది భాగములును ఋత్విజులకు సమానము గాను అనుక్రమముగా పంచవలయును; హోమమును అల్పముగానే ఏకాగ్ని విధానమున జరిపినపుడు గురుడొక్కడే యుండునుగాన అతనినే పూజ్యతమునిగా గ్రహించి యథోక్త వస్త్రాభరణాదిక ముతో అతని నర్చించవలయును.

ఈ విధమగు విధాన ప్రక్రియతో బ్రహ్మాండ దానమును చేసిన పురుషుడు మహా విమానమునా శ్రయముగా చేసికొని పాపములు కడిగి వేయబడగా నిర్మలతనుమానసుడే అప్సరసలతో కూడి ఆనందకరమగు మురారి లోకమునంది యందు సుఖములందును; అతడు పితృ పితామహ పుత్ర పౌత్త బంధుప్రియాతిథి కళత్రాదులగు నూట ఎనిమిది మందిని కూడ సంసారమునుండియు నరకము నుండియు తరింపజేయును; తన తల్లి మాత్రమే కాదు.తన ఆ శేషకులము కూడ ఈ బ్రహ్మాండ దానముచే తన పొతకములు నశించగా తరించి ఆనందమునందును; దీనిని పఠించినను వినినను సురభవ నములందు సుఖించును; ధార్మికుల గృహములయందు జనించి ధర్మపరుడై జీవించును; జనులకు ఉత్తమమతి నందించి తాను అప్సరలతో కూడి ఆమరేంద్ర భవనమున ఆనందమందును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మహాదానాను కీర్తనమున బ్రహ్మాండ దానాను కీర్తనమను రెండు వందల డెబ్బదియైదవ యధ్యాయము.