మత్స్య మహా పురాణము
259 - అర్ధనారీశ్వరాది ప్రతిమలక్షణములు:
సూతః : అధునా సమ్పవక్ష్యామి అర్ధనారీశ్వరం పరమ్ ।
ఆర్ధేన దేవదేవస్య నారీరూపం సుశోభనమ్॥
ఈశార్దే తు జటాధాగో బాలేందుక లయా యుతః ।
ఉమారే చాపి దాతవ్యో సీమ న్తతిలకా వుభౌ॥
వాసుకి ర్ధక్షిణే కర్లే వామే కుణ్డల మాది శేత్ ।
బాలికా చోపరిష్టాత్తు కపాలం దక్షిణే కరే॥
త్రిశూలం వాపి కర్తవ్యం దేవదేవస్య శూలినః ।
వామతో దర్పణం దద్యా దుత్పలం వా విశేషతః॥
వామబాహుశ్చ కర్తవ్యః కేయూరవలయాన్వితః ।
ఉపవీతం చ కర్తవ్యం మణిముక్తమయం తథా॥
స్తనభార మథార్థ తు వామే పినం ప్రకల్పయేత్ ।
హారార్ధముజ్జ్వలం కుర్యా చ్ఛోణ్యర్ధం తు తథై వచ॥
లిజార్ద మూర్ధ్వగం కుర్యా ద్వాఘాజినకృతామ్బరమ్ ।
వామే లమ్బపరీధానం కటిసూత్రత్రయాన్వితమ్, మ, పు॥
నానారత్నసమో పేతం దక్షిణే భుజగాన్వితమ్ ।
దేవస్య దక్షిణం పాదం పద్మోపరి సుసంస్థితమ్॥
కిఞ్చిదర్దే తథా వామం భూషితం నూపు రేణ తు ।
రత్నైర్విభూషితా స్కుర్యా దంగుళీష్వంగుళీయకాక్॥
సాల క్తకం తథా పాదం పార్వత్యా దర్శయే త్సదా ।
అర్ధనారీశ్వర స్వేదం రూప మస్మి న్ను దాహృతమ్॥
సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: ఇపుడు శ్రేష్టమగు అర్ధనారీశ్వరుని మూర్తిని వివరింతును; దేవ దేవుని ఆర్ద భాగముతో ఏర్పడి మిగుల శోభించు నారీరూపమిది; ఈ మూర్తియందు ఈశునికి చెందిన ఆర్థ భాగమందు బాలేందుకలతో కూడిన జటాభాగముండును; ఉమార్గమునందు సీమంతమును తిలక మును ఉంచవలయును; దక్షిణ కర్ణమందు వాసుకిని వామకర్ణమునందు కుండలమునుగానీ త్రిశూలమునుగాని వామహస్తమందు దర్పణమును ఉంచవలయును; కేయూర ములతో వలయుములతో కూడిన వామబాహువును మణి ముక్తామ్యమగు యజ్ఞోపవీతమును హమార్గమందు పీనమగు స్తనమును అమర్చవలయును; ఆపై ఎడమవైపున ఉజ్వలమగు హారార్ధమును నగము లావగు పిరుదును నిర్మించవలయును; కుడి వై పున ఊర్ద్వముఖమగు లింగార్దమును వ్యాఘజిన వస్త్రమును వామాంశ మందు వ్రేలాడు కట్టువస్త్రమును (చీరను కటి సూత్రత్రయమును చేయవలయును; అందే నానా రత్న సము పేతహార ముండగా దక్షిణమందు భుజగహారముండును; దేవుని దక్షిణపాదము వద్మము పైనుండగా ఎడమపాదము మాత్రము కొంచెము భాగము నూపురముతో భూషితమయియుండును; వామాంగుళులయందు రత్న విభూషితాంగుళీయక ములుండవలయును; వామపాదము లత్తుకరసముతో ఆలంకృతమయి యుండును; ఇది ఆర్ధ నారీశ్వర రూపము.
ఉమామహేశ్వర స్యాపి లక్షణం శృణుత ద్విజా ।
సంస్థానంకు తయో ర్వక్ష్యే లీలాలలిత విభ్రమమ్॥
చతుర్భుజం ద్విబాహుం వా జటాభా రేందుభూషితమ్ ।
లోచనత్రయ సంయుక్త ముమైకస్కన్దపాణినమ్॥
దక్షిణేనోత్పలం శూలం వామే కుచభరే కరమ్ ।
ద్వీపిచర్మపరీధానం నానారత్నోపవీతినమ్॥
సుప్రతిష్టం సు వేషం చ తథా రేనుకృతాననమ్ ।
వామే తు సంస్థితా దేవీ తస్యోరో బాహు గూతా॥
శిరోభూషణసంయుకె రల కై క్లలితాననా ।
సబాలికా కర్ణవణీ లలాటతిలకోజ్వలా॥
మణికుణెలసంయుక్తా కర్ణికాభరణా క్వచిత్ ।
హార కేయూర బహుళో హరవక్తావలోకినీ॥
వామాంసం దేవదేవస్య స్పృశ స్త్రీ లీలయా తతః ।
దక్షిణం తు బహిః కృత్వా బాహుం దక్షిణత స్తథా॥
స్కన్దం వా దక్షిణే కుక్షౌ స్పృశ న్యంగుళిభిః క్వచిత్ ।
వామే చ దర్పణం దద్యా దుత్పలం వా సుశోభనమ్॥
కటిసూత్రత్రయం చైవ నితమే స్యా త్పలమ్బకమ్ ।
జయాచ విజయా చైవ కార్తికేయవినాయకౌ॥
పార్శ్వయో ర్దర్శయే తత్ర తోరణే గణగుహ్య కా ।
మాలాంవిద్యాధరాం సద్వ ద్వీణావా నప్సరోగణః॥
శివనారాయణ ప్రతిమలక్షణమ్- ఉమా మహేశ్వర ప్రతిమాలక్షణము.
ఏతద్రూపము మేశ స్య కర్తవ్యం భూత మిచ్చతా ।
శివనారాయణం వక్ష్యే సర్వపాపప్రణాశనమ్॥
ద్వీజులారా! ఉమా మహేశ్వర ప్రతిమలక్షణమును తెలి పెదను వినుడు; లీలాలలితవిభ్రమయుక్తమగు పార్వతీ పరమేశ్వరుల ఉనికి ఆ మూర్తియందు ఎట్లుండునో చెప్పెదను; ఈ శివుడు చతుర్భుజుడుగాని ద్విబాహుడుగాని కావచ్చును; జటాభారము ఇందుఖండాలంకరణము లోచన తయము ఉండును; ఉమాన్కంధమందుంచిన ఏకపొణియు కుడి చేత శూలమును కలువపూవును ఉండగా ఎడమ చేయి పార్వతీ స్తనమును స్పృశించుచుండును; వ్యాఘ్ర చర్మ వస్త్రము నానారత్నోపవీతము కలిగి మంచినిలుకడయు చక్కని వేషమును అర్థందు సమలంకృత వదనమును ఉండును; అతని ఎడమ తొడ యందు దేవి అతని ఎడమబాహువుతో ఆలింగితురాలై ఉండును; ఆమె శిరోభూషణములతో కూడిన ముంగురు లతో అందమగు ముఖము కలిగి ఎపులందు దావీలీలు లలాటమం దు తిలకము కలిగి ప్రకాశించుచు మణికుండలములును కొన్ని ఎడల మణికర్ణిక లును ధరించి అనేక హార కేయూర ములును కలిగి శివుని ముఖమవలోకించుచుండును; ఆమే దేవ దేవునిఎడమభుజమును విలాసముగా స్పృశించుచు తన దక్షిణ బాహువును కుడి వైపుగా బయటకు వదలిఉండును. కొన్ని విగ్ర హములందు దక్ష్మిణ బాహువును శివుని స్కంధమందుగాని కుక్షి దక్షిణ పార్శ్వమందుగాని ఉంచీ ఎడమచేతియందు దర్పణ మునుగానీ సుశోభనమగు కలువనుగానీ దాల్చియుండును! ముప్పేటక టీ సూత్రము పిరుదుల మీదినుండి వేలాడుచుండును; తోరణమునందు రెండు పొర్శ్వములందును జయవిజయులు కార్తికేయ వినాయకులు గణపతులు గుహ్యకులు పంక్తులుగా విద్యాధరులు వీణాధా రేణులగు అప్సరసలు ప్రదర్శింపబడవలయును; ఇట్లు ఉమా మహేశ్వర మూర్తిని నిర్మించుట శుభ కరము; ఇక సర్వపాప ప్రణాశనమగు శివనారాయణ రూపమును వివరింతును.
వామార్దే మాధవం కుర్యా ద్క్షిణేద శూలపాణినమ్ ।
బాహు ద్వయం చ కృష్ణస్య మణి కేయూర భూషణమ్॥
శబ్ధచక్రధరం శాన్త మార క్తాంగుళీవిభ్రమమ్ ।
చక్రస్థానే గదాం వాపి పాణౌ దద్యా ద్గదాభృతః॥
శజ్ఞం చై వేతరే దద్యా తట్యర్ధం భూషణోజ్జ్వలమ్ ।
పీతవస్త్రపరీధానం చరణం మణిభూషణమ్॥
దక్షిణార్డే జటాభార మధేనుకృతభూషణమ్ ।
భుజజహారవలయం వరదం దక్షిణం కరమ్॥
ద్వితీయం చాపి కుర్వీత త్రిశూలవర ధారిణమ్ ।
వ్యాళోపవీతసంయుక్తం కట్యర్ధం కృత్తివాససమ్॥
మణిర తైశ్చ సంయుక్తం పాదం నాగవిభూషితమ్ ।
శివనారాయణ స్యైవం కర్తవ్యం రూప ముత్తమమ్॥
మహావరాహ ప్రతిమాలక్షణమ్
మహావరాహం వక్ష్యామి పద్మహస్తం గదాధరమ్ ।
తీక్షదంష్ట్రోగ్రఘోణాస్యం మేది నివామకూర్పరమ్॥
దంష్ట్రాగ్రేశోద్ధృతాం దాస్తాం ధరణీ ముత్పలాన్వితామ్ ।
విస్మయోత్బుల్లనయనా ముపరిష్ణా తకల్పయేత్॥
దక్షిణం కటిసంస్థంతు కరం తస్యాః ప్రకల్పయేత్ ।
కూర్మోపరి తథా పాద మేకం నాగేన్దమూర్ధని॥
సంస్తూయమానం లో కే శై స్సమస్తా త్పరికల్పయేత్ ।
నారసింహ ప్రతిమలక్షణమ్.
నార సింహం ప్రకర్తవ్యం భుజాష్టక సమన్వితమ్॥
రౌద్రం సింహాసనం తద్వ ద్విధారితముఖేక్షణమ్ ।
స్తబ్దపీనసటాకర్ణం దారయన్తం దితే స్సుతమ్॥
వినిర్గతా స్త్రజాలం చ దానవం పరికల్పయేత్ ।
వమన్తం రుధిరం ఘోరం ధ్రకుటీవదవేక్షణమ్॥
యుధ్యమానస్తు కర్తవ్య క్వచిత్కరణ బన్జనే ।
పరిశ్రా నేన దై జ్యేన తర్జ్యమానో ముహుర్ముహుః॥
దైత్యం ప్రదర్శయే తత్ర ఖడ్గఖేటక ధారిణమ్ ।
స్తూయమానం తథా విష్ణుం దర్శయే దమరాధివైః॥
శివ నారాయణ ప్రతిమాలక్షణము.
ఈమూర్తియందు వామార్ధమందు మాధవుడును దక్షిణార్ధమునందు శూలపాణీయు నుండును; కృష్ణుని బాహు ద్వయమునకు మణి కేయూరములు భూషణములు; శంఖ చక్రములు హస్తద్వయమందుండును; ఆ శ్రమూర్తి; అంగుళులు కొంచెమేర్రనివి; కృష్ణుని (గదాధారి) పాణియందు చక్రమునకు మారుగ గదనైన నుంచవచ్చును: కటివామార్గము భూషణములతో ఉజ్వలమును పీతాంబగయు క్షమునగును; చరణములందు మణిభూషణములు; ఇక దక్షిణార్ధమందు జటా భారమును అర్ధచంద్రాలంకరణమును భుజంగహారవలయమును వరద దక్షిణహస్తమును త్రిశూలహస్తమును సర్పయజ్ఞోప వీతమును కటియందు (దక్షిణార్ధమున) చర్మాంబర మును మణిరత్నములతోను నాగముతోను విభూషితమగు పాదమును నుండును. శివనారాయణమూర్తి ఇట్లుండును.
మహా వరాహ ప్రతిమలక్షణము.
మహా వరాహమూర్తిని వివరింతును: ఇతడు పద్మహస్తుడు.గదాధరుడు; తీక్షములగు కోరలును ఉగ్రమగు ము యైయు ముఖమును కలిగి ఎడమ మోచేయి భూదేవి పైనుంచును; ఆమెను తన కొనకోరతో పైకెత్తుచుండును; ఆమె జితేంద్రియయై చేతులందు కలువలు కలిగి విన్మయములో కన్నులు వికసించి పైభాగమందుండునట్లు నిర్మించవలెను; ఆమె కుడి చేయి తనక టి పైనుండును; అతనిని చుట్టునున్న లోకపాలురు స్తుతించుచుందురు.
నారసింహ ప్రతిమా లక్షణమ్.
నరసింహమూర్తికి ఎనిమిది భుజములు; రౌద్రమూర్తి; సింహముఖము; విప్పారిన ముఖ మును కన్నులును; నిక్క పొడిచి బలిసియున్న జూలును నిక్కపొడిచిన చేవులును; హిరణ్యకశిపుని చీల్చుచుండును; ఆ దానవుని ప్రేవులు బయటికి వచ్చుచుండును; వాడు నెత్తురు కక్కుచు కనుబొమలముడితో కూడిన ముఖమును కన్నులును కలిగియుండును; కొన్ని మూర్తులందు వాడు యుద్ధమునందు కరణ బంధములతో యుద్ధము చేయుచున్న ట్లుండును; ఆ దైత్యుడు ఆలసి మాటి మాటికి నరసింహుని బెదరించుచుండును: వాని చేతులందు ఖడ్గమును ఖేటక మునుండును; ఆ దేవుని అమర శ్రేష్ఠులు పొగడుచుందురు.
త్రివిక్రమ ప్రతిమాలక్షణమ్.
తథా త్రివిక్రమం వక్ష్యే బ్రహ్మాణక్రమణోల్బణమ్ ।
పాదపార్శ్వే తథా బాహు ముపరిష్ణా తదర్శయేత్॥
అధస్తా ద్వామనం తత్ర కల్పయే త్సకమణలుమ్ ।
దక్షిణే ఛత్త్రికాం దద్యా న్ముఖం దీనం ప్రదర్శయేత్॥
మత్స్యరూపం తథా మత్స్యం కూర్మం కూర్మాకృతిం న్య సేత్ ।
ఏవంరూపస్తు భగవా నార్యో నారాయణో హరిః॥
బ్రహ్మ ప్రతిమాలక్షణమ్.
బ్రహ్మా కమణ్డలుధరః కర్తవ్య స్స చతుర్ముఖః ।
హంసారూఢః క్వచిత్కార్య: క్వచిచ్చ కమలాసనః॥
వర్జెన పద్మగర్భాభ శ్చతుర్బాహు శ్శుభేక్షణః ।
కమజ్ఞలుం వామకరే స్రువం హ స్తేచ దక్షిణే॥
వామే దణ్ణధరం తద్వ తుచం చాపి ప్రదర్శయేత్ ।
మునిభి రేవగన్దర్వై స్తూయమానం సమ న్తతః॥
కుర్వాణ మివలోకాం స్త్రీ ఇ౦క్లామ్బరధరం విభుమ్ ।
మృగచర్మధరం వాపి దివ్య యజ్ఞోపవీతినమ్॥
ఆజ్యస్థాలీం తథా పార్శ్వే వేదాంశ్చ చతురః పునః
వామపార్శ్వే తు సావిత్రీం దక్మిణేన సరస్వతీమ్।
ఆగేచ ఋషయ సద్వ త్కార్యాః వైతామ హే పదే॥
కార్తికేయం ప్రవక్ష్యామి తరుణాదిత్యసన్నిభమ్॥
కమలోదర వర్ణాభం కుమారం సుకుమారకమ్ ।
దణ్ణ కేయూర కైర్యుక్తం మయూరవర వాహనమ్॥
స్థాపయే త్వేష్టనగరే భుజా స్ద్వాదశ కల్పయేత్ ।
చతుర్భుజః ఖర్వమే స్యా ద్వనే గ్రామే ద్విబాహుకః॥
శ క్తిః పాశ స్తథా ఖడ్గ శ్శర శ్శూలం తథైవచ ।
వరదశ్చైవ హస్త స్స్యా దథ చాభయదో భవేత్॥
ఏతే దక్షిణతో జేయాః కేయూరకటకోజ్జ్వలాః ।
ధనుః పతాకా ముష్టిశ్చ తర్జనీ తు ప్రసారితా॥
ఖేటకం తామ్రచూడం చ వామహస్తే తు శస్యతే ।
ద్విభుజస్య కరే శ క్తి ర్వామే స్యా తుక్కుటోపరి॥
చతుర్బుజే శ క్తిపాశా వామతో దక్షిణే త్వసిః।
వరదోభయదో వాపి దక్షిణ స్స్యాత్తురీయకః॥
త్రివిక్రమ ప్రతిమలక్షణము.
త్రివిక్రమమూర్తి బ్రహ్మాండములను ఆక్రమించుచు తీవ్ర రూపముతో నుండును; అతడు తన ఎత్తిన పొద మును ఒక బాహువుతో పట్టుకొనియుండును; అందే క్రింది భాగమందు ఎడమచేత కమండలువు ధరించిన వామనుని నిర్మించవలయును; అతనిచేత చిన్న గొడుగుండును; అతడు దీనముఖుడు; ఆతని పార్శ్వమందు జలధృంగారము ధరించి బలి యుండును; ఈదేవుడు ఆబలిని బంధించుచుండును; ఆతని దగ్గర నే గరుడుడుండును.
మత్స్యకూర్మ ప్రతీమాలక్షణములు.
మత్స్యని మత్స్యరూపముతో కూర్ముని కూర్మ రూపముతో నిర్మించవలయును; భగవానుడును నారాయణుడును నగు హరిరూపములిట్లుండును.
బ్రహ్మ ప్రతిమాలక్షణము.
బ్రహ్మ కమండలు ధరుడు; చతుర్ముఖుడు; హంసారూఢుడు: లేదా కమలాసనుడు; తామరపూవు లోపలి కాంతితో నుండు దేహచ్చాయ; చతుర్బాహుడు; ఒప్పిదమగు కన్ను లవాడు; ఎడమ చేతియందు కమండలువు; కుడి చేతియందు సువముండును; మరియొక ఎడమచేత దండమును మరియొక కుడి చేతియందు సుక్కునుండును; అన్ని వైపుల నిలిచి దేవతలు గంధర్వులు మునులు నిత నిని స్తుతించుచుందురు; ఇతడు త్రిలోక ములను సృజించుచుండును; శుక్ల వస్త్రధరుడు; విభుడు; మృగ చర్మధారియైన కావచ్చును; దివ్య యజ్ఞోప వీతి; దగ్గర ఆజ్యస్థాలి.నాలు వేదములు నుండును; ఎడమవై పునందు సావిత్రి కుడివైపున సరస్వతియుందురు; ముందు ఋషులుందురు.
కార్తికేయ ప్రతిమాలక్షణము.
కార్తికేయుడు (కుమారస్వామి) బాల సూర్యునివలె కాంతి కలవాడు; కమలాంతర్భాగమువలె సుకుమార చ్ఛాయ గలవాడు; సుకుమారుడగు కుమారుడు; భుజములందు కేయూరములును హ సమునందు దండమునుండును; మయూర వాహనుడు; తన ఇచ్చానుసారము ఈ దేవుడే నగర (స్థాన) మందు ఉన్న ట్లయిన చూపవచ్చును: ఆపుడతడు ద్వొదశ భుజుడు; గూడేమునందున్నట్లు చూపినచో చతుర్భుజుడు; గ్రామమందో వనమందోయున్నట్లు చూపినచో ద్విబాహుడు; కుడివైపున శ క్తి-పాశము ఖడ్గము శరము శూలము వరదహస్తము కొని అభయ హస్తము కానీయుండును; ఎడమ చేతు లందు ధనువు-పతాక పిడికిలి చాచిన చూపుడు వేలు – ఖేటకము- కోడిపుంజు- ఇవి ద్వాదశ భుజునకు; ద్విభుజునకు దక్షిణ హస్తమునందు శ క్తియు ఎడమచేతియందు కోడిపుంజు నుండును; చతుర్భుజునకు ఎడమ చేతులందు శ క్తియు పాశమును కుడి చేతులందు ఖడమును వరదహస్తముకోని అభయ హస్తముకొని యుండును.
వినాయక ప్రతిమాలగణమ్.
వినాయకం ప్రవక్ష్యామి గజవక్త్రం త్రిలోచనమ్ ।
లమ్బోదరం చతుర్బాహుం వ్యాళ యజ్ఞోపవీతినమ్॥
శూర్పకర్ణం బృహత్తుణ్డ మేకదంష్ట్రం పృథూదరమ్ ।
స్వద న్తం దక్షిణకరే ఉత్పలం చాపరే తథా॥
మోదకం పరశుం చైవ వామతః పరికల్పయేత్ ।
బృహత్త్వాత్క్షి ప్రవదనం పీనస్కంధాజ్ఘ్రిపాణికమ్॥
యుక్తం తు ఋద్ధిబుద్ధిభ్యా మధస్తా న్మూషకాన్వితమ్ ।
కాత్యాయనీ ప్రతిమాలక్షణమ్.
కాత్యాయన్యాః ప్రవక్ష్యామి రూపం దశ భుజం తథా॥
త్రయాణామపి దేవానా మనుకారానుకారిణీమ్ ।
జటాజూటసమాయుక్తా మధేన్దుకృతలక్షణామ్॥
లోచనత్రయసంయుక్తాం పద్మేన్దుసదృశాననామ్ ।
అత సీపుష్పసజాం సుప్రతిష్ఠాం సులోచనామ్॥
నవయౌవనసమ్పన్నా సర్వాభరణభూషితామ్ ।
సు చారుదశ నాం తవ్వ తీనోన్న తపయోధరామ్॥
త్రిభజసానసంస్థానాం మహిషాసురమర్ధినీమ్ ।
త్రిశూలం దక్షిణే దద్యా తడం చక్రం తథైవచ॥
తీక్ష బాణం తథా శ క్తిం వామతో ఒపి నిబోధత।
ఖేటకం పూర్ణ చాపంచ పాశ మజ్కుశ మేవచ॥
ఘణ్ణం వా పర శుం వాపి వామత స్సన్ని వేశ యేత్ ।
అధస్తా న్మహిషం తద్వ ద్విశిరస్కం ప్రదర్శయేత్ ॥
శిరచ్ఛేదోద్భవం తద్వ దానవం ఖడ్గపాణినమ్ ।
హృది శూలేన నిర్భిన్నం తిర్యగ్ర కవిభూషితమ్॥
రక్తర కీకృతాజ్ఞం చ రక్తవిస్పారితేక్షణమ్ ।
వేష్టితం నాగపా శేన భ్రుకుటిభీషణాననమ్॥
వమద్రుధిరవ క్రంచ దేవ్యా సింహం ప్రదర్శయేత్ ।
దేవ్యాస్తు దక్షిణం పాదం సమం సింహోపరి స్థితమ్॥
కిడ్చాదూర్ధ్వం తథా వామ మంగుష్ఠం మహిషోపరి ।
స్తూయమానం చ తద్రూప మమరై స్సన్ని వేశ యేత్॥
ఇంద్రదప్రతిమాలక్షణమ్.
ఇదానీం సురరాజస్య రూపం వక్ష్యే వి శేషతః ।
సహస్రనయనం దేవం మత్తవారణసంస్థితమ్॥
పృథూరువక్షవదనం సింహసనం మహాభుజమ్ ।
కిరీటకుణలధరం పీవరోరు భుజేక్షణమ్॥
వజోత్పలధరం తద్వ న్నా నాభరణ భూషితమ్ ।
పూజితం దేవగన్దర్వై రప్సరోగణ సేవితమ్,
ఛత్రచామర ధారిణ్య స్స్త్రియః పార్శ్వే ప్రదర్శయేత్ ।
సింహాసనగతం వాపి గనర్వగణ సేవితమ్॥
ఇంద్రాణీం వామత శ్చాస్య కుర్యా దుత్పలధారిణీమ్॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే అర్ధనారీశ్వర ప్రతిమాదిలక్షణం నామ ఏకోన షష్ట్యుత్తర ద్విశతతమోధ్యాయః॥
వినాయకమూర్తి లక్షణము.
వినాయకుడు గజముఖుడు- త్రిలోచనుడు-లంబోదరుడు.చతుర్భుజుడు సర్పయజ్ఞోపవీతధారి; చేటల వంటి చెవులు పేద్దతుండము ఏకదంతము పెద్దకడుపు కలవాడు; ఒక కుడి చేతియందు తన దంతమును రెండవ చేతియందు కలువ పూవును ధరించును. ఒక ఎడమ చేతియందు లడ్డులు (ఉండ్రాలు) రెండవదానియందు గండ్రగొడ్డటిని ధరించును; శరీరము చాల పెద్దదియగుటచే ముఖము చిన్న దీగా కనబడును; బలిసిన భుజమూలములు పాదములు చేతులు కలవాడు; ఋద్ధి బుద్ధి. అను భార్యలతో కూడినవాడు; క్రింది భాగమున ఎలుక యుండును.
కాత్యాయనీ ప్రతిమాలక్షణము.
ఈమె దశ భుజ; ఈ మెయందు (బ్రహ్మ విష్ణు రుద్ర) దేవతాత్రయ లక్షణములునుండును: ఈమె జటాజూటము ఆర్గ చంద్రుడు లోచనత్రయము పద్మేందు సదృశ ముఖము అవిసిపూవు చాయను పోలినయ చక్కని నిలుకడ చక్కని కన్నులు కలది; నవయౌవన సంపన్న -సర్వాభరణ భూషిత-మిగుల మనోహరములగు దంతములు కలది.పీవోన్నత స్తనయు క. త్రిభంగ స్థాన సంస్థానయుక్త (నితంబ భారముచే వేణీ భారముచే కలిగిన మూడు ఒయ్యారపు వంపులు కలది) మహిషాసుర మర్దినీ; కుడి చేతులందు త్రిశూల ఖడ్గచక్ర తీక్ష బాణ శక్తులును ఎడమ చేతులందు భేటక పూర్ణచాప పాశాంకుశములును ఘంటకాని గండ్రగొడ్డలి కానీ ఉండును! దిగువను రెండు తలలు కల మహిషమును శిర శ్చేదము కలిగిన ఖడ్గపాణియగు దానవుడు నుండును. వాని హృదయమున శూలము గ్రుచ్చబడియుండును. అడ్డముగా రక్తము స్రవించుచుండును. వాని శరీరావయవములన్నియు నెత్తుటితో ఎర్రనై విప్పారిన ఎర్రని కన్నులు కలిగి. నాగపాశ వేష్టితుడై భ్రుకుటి భీషణ ముఖుడై యుండును. రక్తము వెలికి వచ్చుచున్న నోటితో దేవీ వాహన సింహమును నిర్మించవలెను. దేవీ దక్షిణ పాదమా వాహనము పై సరి మట్టముగా నుంచబడియుండును. ఎడమ పొదము కొంచెముగ పైకెత్తి దాని బొటన వేలు. మహిషము పై నుండును. ఆమె రూపమును అమరులు స్తుతించుచుందురు.
ఇంద్ర ప్రతిమాలక్షణము.
ఇంద్రుడు సహస్రనయనుడై మత్త గజము పై నుండును. ఏళల వక్షో వద నయుతుడు. సింహమునకువలే మూపులు కలవాడు. మహాభుజుడు. కిరీట కుండలధరుడు. బలిసిన పెద్ద భుజములును పెద్ద కన్నులును కలవాడు. వజమును కలువపూవును ధరించినవాడు; సొనాభరణ భూషితుడు; దేవగంధర్వ పూజితుడు - అప్సరోగణ సేవితుడు; పార్శ్వములందు ఛత్త చామర ధారిణులగు స్త్రీలుందురు; లేదా సింహాసనగతుడు గంధర్వ గణ సేవితుడుగానైన ఇతని చూప వచ్చును; ఇతని ఎడమవైపున ఉత్పల ధారిణియగు ఇంద్రాణి (శచీదేవి) యుండును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున అర్ధనారీశ్వరాది ప్రతిమాలక్షణమను రెండు వందల ఏబది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 258 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya initiates the extensive treatise on Pratimā-lakshaṇa, the sacred science of sculpting and painting holy icons of Deities for temple installation and home devotion. Bhagavān Matsya explains that divine icons serve as physical focal points for channeling unmanifest spiritual energy into manifest forms, enabling devotees to develop deep meditation and personal devotion. The text outlines the foundational unit of measurement known as the Aṅgula and Tāla system, detailing proportions for ten-tāla, nine-tāla, and eight-tāla icons used for major Deities, minor Deities, celestial beings, and human figures, ensuring artistic perfection and spiritual potency.