మత్స్య మహా పురాణము
161 - హిరణ్యకశిపు ప్రభృతులు నరసింహుని పై శస్త్రాస్త్రములు వర్తించుట
అస్త్రములన్నిటిలో పెద్దది (గొప్పదియు మహాదారుణమునగు " దండాస్త్రము ఘోరమగు కాలచక్రము॥ విష్ణు చకము ఉగమును త్రిలోక దాహక మునగు ॥ పైతామహము విచిత్రాశని శుష్కాశని ఆర్గాశని ఉగ్రమగు రౌద్రము శూలము కాలము ముసలము మోహనము శోషణము సంతావనము తాపము కలిగించునది) -విలాపనము (ఏడ్పించునది॥ కన్నుల వెంట నీరు కారునట్లు చేయునది) వాయవ్యము మథనము కాపాలము కైకరము ( కేకర సంబంధి) ఆప్రతిహత మగు (ఎదురులేని శక్తి క్రౌంచము బ్రహ్మ శిరము సోమము శై శిరము (శిశిరము॥ మంచు-నకు సంబంధించినది) కంపనము (వణకించునది) శాతనము (చెక్కునది) మహాభయంకరమగు త్వాష్ట్రము అక్షోభ్యమగు (కలత పరచనలవికాని) కాల ముద్దరము మహాబలమగు తపనము సంవర్తనము మోహనము మాయాధరము ప్రీతికరమగు గాంధర్వము నూతనమగు చందనము (ఆహ్లాదకరము) ప్రస్వాపనము (నిదురింపజేయునది) ప్రమథనము వారుణము ఎదురులేని నడకగల పాకు పతము హయశిరము బ్రాహ్మము నారాయణము ఐంద్రము ఆద్బుతమగు సారము ఓటమి నెరుగని పైశాచము, శోష దము మనము మహాబలముకల భావనము ప్రస్వాపనము వికంపనము॥ఆను ఈ దివ్యాస్త్రములను హిరణ్యకశిపుడు ప్రజ్వ లించు అగ్ని పై ఆహుతినివలె నరసింహునిపయి ప్రయోగించెను॥ వేసవియందు సూర్యుడు తన కిరణములతో పామ వంతునివలే ఆ ఆసురోత్తముడు ప్రజ్వరిల్లు అస్త్రములతో సరసింహుని క్రమ్మి వేసెను॥
సహ్యమర్షానిలోద్ధూతో దైత్యానాం సైన్యసాగరః॥
క్షణేన ప్లావయామాస మైనాక మివ సాగరః।
ప్రాసైః పాశైశ్చ ఖడ్గైశ్చ గదాభి ర్ముసలై స్తథా॥
వజ్రై రశ నిభిశ్చైవ సాగ్ని భిశ్చ మహాద్రుమైః ।
ముద్గరైర్భిణ్డివాలై శ్చ శిలో లూఖలపర్వతై: ॥
శతఘ్ని భిశ్చ దీప్తాభి ర్దణ్డైరపి సుదారుణే ।
తే దానవాః పాశగృహీతహస్తా మహేన్ద్రవజ్రాశనితుల్యవేగాః॥
సమ న్తతోఽభ్యుద్యతబాహు కాయా స్థ్సీతా స్త్రీశీర్షాఇవ నాగపోతాః ।
సువర్ణమాలాకులభూషితాఙ్గౌశ్చినాంశుకాభోగవివర్తితాఙ్గౌః॥
ముక్తావలీద్మవిభూషితాఙ్గౌ హంసాఇవాణా ని విశాలపక్షాః ।
తేషాంతు వాయుప్రతిమౌజసాం వై కేయూరమౌళీవలయోత్కటానామ్॥
తాన్యు త్తమాఙ్గౌన్యభితో విభా న్తి ప్రభాతసూర్యాంకుసమప్రభాణి ।
క్షిపద్భిరుగైర్జ్వలితై ర్మహాబలై ర్మహాస్రపూగేషు సమావృతో బభౌ॥
గిరిర్యథా స నతవర్తిభిర్ఘనైః కృతాన్తకారా న్తర కన్దరో ద్రుమైః ।
తైర్హ న్యమానోపి మహాస్త్రజాలై ర్మహాబలై ర్దైత్యగణై స్సమేతై॥
నాకమ్పతాజౌ భగవాన్ప్రపాత్ స్థితః ప్రకృత్యా హిమవానివాచలః ।
సన్త్రాసీతా స్తే నరసింహరూపిణా దితేస్సుతాః పావక తుల్యతేజసా॥
భయాద్విచేలు: పవనోద్దతా యథా మహోర్మయ స్సాగరవారిసమ్భవాః॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే హిరణ్యకశిపూపాఖ్యానే నృసింహోపరి హిరణ్య కశిప్వాదికృతాస్త్రవర్షకథనం నామ ఏకషష్ట్యుత్తరశతతమోఽధ్యాయః॥
కోవమనేడు పాయువు చెల రేపగా దైత్య సేన యనెడి సాగరము॥ క్షణములోనే సముద్రము మైనాకునివలె ప్రాన, పొగ ఖడ్ల గదా మునల వజ్రాశనులతో " ఆగ్ని సహితము లై మండు మహావృక్షములతో ముద్దర భిండిఐల శిలలతో రోళ్ళ(నేడు ఆయుధములతో పర్వతములతో మండుచుండు శతఘ్ను లతో మహాభయంకర దండములతో ఆ నరసింహ దేవుని ముంచివేసెను॥ ఆ దానవులు హస్తములందు పాశములు - గ్రహించి మహేంద్ర వజ్రములతో ఆశ నులతో సమానవేగము (తీవ్రత) కలిగి పైకెత్తిన బాహువులతో ఉన్నత శరీరములతో, మూడు తలల నాగ కుమారులవలె నర సింహుని చుట్టు నిలిచిరి॥ బంగరు మాలలతో కల్లోలితముగా అలంకరించుకొన్న అవయవములతో విశాలములగు పట్టు వస్త్రములతో చుట్టబడిన శరీరములతో ము తైపుగుత్తుల నరులతో అలంకరింపబడిన దేహములతో విశాలములగు రెక్కలు గల హంనలవలె వారుండిరి॥ వాయు సమ సామర్ధ్యము కలిగి భుజకీర్తులతో శిరోవలయ (కిరీటములతో హద్దుమీరిన ఆందము గలిగి యున్న ఆ దానవ శిరములు ప్రభాత రవి కిరణ సమ తేజస్సులతో అన్ని వైపులను కనబడుచుండెను॥ ఉగ్రులై జ్వలించుచు తన పై శస్త్రాస్త్రములు విసరు ఆ మహాబలులు ప్రయోగించు మహాస్త్ర సమూహములును బాణము లును తను క్రమ్మగా ఎడ తెగక తనపయినున్న దట్టములగు చెట్లతో చీకట్లు కమ్మిన కందర ముల నడుమభాగముగల పర్వతమువలె నరసింహుడుండెను॥ మహా బలులగు దైత్యగణ ముల వారందరు కూడి మహాస్త్ర జాలములతో కొట్టు చున్న ను ఆ భగవానుడా యుద్ధమున హిమాచలమువలే తన స్వభావమందు ఉన్న వాడున్నట్లు నిలిచెనేకానీ ఏ మాత మును కంపించలేదు॥ కాని ఆ దితిసుతులు అగ్ని సమాన తేజస్కుడు సర సింహ రూపుడునగు ఆ దేవునిచే సంతా పితులయియు భయమందియు సాగర జలములతో ఏర్పడిన పెద్ద అలలు, పెనుగాలిచేవలే మిక్కిలిగ చలించిరి॥
ఇది శ్రీమత్స్యమహాపురాణమున హిరణ్య కశిపూపాఖ్యానమున హిరణ్యకశిపు ప్రభృతులు నరసింహుని పై శస్త్రాస్త్రములు వర్తించుటయను నూట అరువది ఒకటవ యధ్యాయము॥
Summary of chapter 161 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya details the historical advent of Bhagavān Vishṇu in His fierce man-lion manifestation, Bhagavān Narasimha, to protect the child-devotee Prahlāda and destroy the tyrant Hiraṇyakashipu. The Supreme Lord emerged from a stone pillar in the royal assembly hall with a terrifying roar that shattered the cosmos, possessing sharp claws, a mane shining like a thousand suns, and eyes blazing with divine wrath. This divine manifestation demonstrated that Bhagavān Vishṇu appears instantly to validate the truth of His pure devotees and uphold cosmic justice.