215 - రాజాను జీవుల అనువర్తన ప్రకార వివరణము

మత్స్యః : యథానువర్తితవ్యం స్యా న్మనో రాజ్ఞానుజీవిభిః ।

సర్వదాతు సదాచారై ర్ని బోధ గదతో మమ॥

జ్ఞాత్వా సర్వాత్మనా కార్యా స్వశక్త్యా గవినన్దన ।

రాజా యత్తు వదే ద్వాక్యం శ్రోతవ్యం తత్ప్రయత్నతః॥

ఆక్షిప్య వచనం తస్య న వక్తవ్యం తథా వచః ।

అనుకూలం ప్రియం తస్య వక్తవ్యం జనసంసది॥

రహో గతస్య వక్తవ్య మప్రియం య ద్గీతం భవేత్ ।

పరార్థ మస్య వక్తవ్యం సమే చేతసి పార్థివ॥

స్వార్థ సుహృద్బి ర్వక్తవ్యో న స్వయం తు కథంచన ।

కార్యాతిపాత స్సర్వేషు రక్షితవ్యః ప్రయత్నతః॥

న చ హింస్యం ధనం కిడ్చా న్ని యు క్రేన చ కర్మణి ।

 నో పేక్ష్య స్తస్య మానశ్చ తథా రాజ్ఞః ప్రియా భవేత్॥

రాజ్ఞశ్చ న తథా కార్యం వేష భాషిత చేష్టితమ్ ।

రాజలీలా న కర్తవ్యా తద్విద్విష్టం చ వర్జయేత్॥

రాజ్ఞ స్సమాధికో వా న కార్యో వేషో విజ్ఞానతా ।

ద్యూతాదిషు తథైవాన్య కౌశలం తు ప్రదర్శయేత్॥

ప్రదర్శ్య కౌశలం చాస్య రాజానం చ వి శేషయేత్ ।

అనఃపుర జనాధ్యమై ర్వైరిదూతై ర్నిరాకృతే॥

 సంసర్గం న వజే ద్రౌజ న్వినా పార్థివశాసనాత్ ।

ని స్నేహతాం చావమానం ప్రయత్నేన తు గోపయేత్॥

యచ్చ గుహ్యం భవే ద్రాజ్ఞో న త ల్లో కే ప్రకాశ యేత్ ।

నృపేణ శ్రావితం యత్స్యా దుహ్యా దుహ్యం నృపోత్తమ॥

న త త్సంశ్రావయే ల్లో కే తథా రాజ్జాప్రియో భవేత్ ।

 ఆజ్ఞాప్యమానే చాన్యస్మి ముత్థాయ త్వరాన్వితః॥

ఆహం కిం కర వాణీతి వాచ్యో రాజా విజానతా ।

కార్యావస్థాం చ విజ్ఞాయ కార్యమేవ యథా భవేత్॥

మత్యుడు మనువుతో ఇట్లు చెప్పెను: రాజానుజీవులు సర్వదా సదాచారులయి రాజునేట్లనువర్తించవలయునో చెప్పెదను; వినుము; విషయమునేరిగి రాజాను జీవులు రవిపుత్తా! మనూ నిండు మనస్సుతో అన్ని విధముల రాజు ననువర్తించవలెను; ఎట్లన.రాజు చెప్పు వాక్యమును యత్నముతో వినవలెను; అతని మాటను నడుమనే నిలిపి తనమాట చెప్పకూడదు; జనసభలో నున్న రాజుతో అతనికి అనుకూలమును ప్రియములునగు మాట పలుకవలెను; ఏకాంతమందు మాత్రము రాజునకు అ ప్రియమైనను హితమగు వచనము పలుకవలే(చ్చు)ను; ఇతరులకు మేలుకావలసిన పని ఏదయిన నున్న ను రాజ మనస్సు సమముగా నున్నపుడు చెప్పవలెను; తన సొంతమునకు రాజు వలన కావలసినదేదైన నున్న చో ఆది అతనికి ఇతరులచే చెప్పించవలెనేకాని తాను చెప్పరాదు; ఏ పనిని గాని సమయము మించకుండ నేరవేర్చుటకు యత్నించవలెను; రాజాధికృతు డెప్పుడును రాజ ధనమును దుర్వినియుక్తము చేయరాదు; రాజు తన పై చూపు ఆదరమును అలక్ష్యము చేయక దానిచే తానతనికి ప్రియుడు కావలెను. రాజువలే తన వేష భాషా చేష్టితములాచరించరాదు; (ఎగతాళిగా) రాజుననుక రించరాదు; అతనికిష్టము కానివి విడువవలెను; రాజవేషమునకు సమము అధికమునగు వేషమును ధరించరాదు; ద్యూతము మొదలగువానియందు తనకుగల నేర్పునతనికి ప్రదర్శించవలేను; ఆట్లు ప్రదర్శించినను వాటి యందు రాజే తనకంటే గొప్పవాడని చూపవలేను; ఆంతఃపుర జనోధ్యములతో శత్రు రాజదూతలతో తన రాజుచే వేడల గొట్టబడినవారితో రాజాజ్ఞ లేనిదే సంబంధము పెట్టుకొనరాదు? తనకు ఎవరియందుగాని స్నేహ రాహిత్యము కాని అవమాన దృష్టికానియు న్నను దానిని బయల్పరచక దాచి ఉంచవలెను; రాజరహస్యములను లోకమున బయలుపరచరాదు. రాజు తనతో చెప్పిన పరమ గుహ్యములను బయలుపరచరాదు; దాని అతడు రాజునకు ఆప్రియుడగును; రాజు ఇతరుల నేదయిన ఆజ్ఞాపించుచున్నను తాను లేచి 'నేనేమి చేయుదును?' అనవలెను: కార్యస్థితి నెరిగి దానిని నెర వేర్పచూడవలేను.

సతతం క్రియమాణేసి శ్లాఘవంతు వ్రజే ద్ద్రువమ్ ।

రాజ్ఞః ప్రియాణి వాచ్యాని నచత్యర్ధం పునః పునః॥

మహాసుశీలశ్చ భవే న్న చాపి భ్రుకుటీముఖః ।

నాతివక్తా న నిర్వక్తా న చ మాత్సరిక స్తథా॥

ఆత్మసమ్భవిత శ్చైవ న భవేచ్చ కథంచన ।

దుష్కృత్యాని నరేన్తస్య న చ సజ్కీర్తయే త్వచిత్॥

వస్త్ర మ స్త్రీ మలజ్కారం రాజ్ఞా దత్తం తు ధారయేత్ ।

ఔదార్యేణ న తద్దేయ మన్యస్మే భూతి మిచ్ఛతా॥

న చై హత్యశనం కార్యం న స్వప్నం చాపి కారయేత్ ।

నానిర్దిషే తథా ద్వారే ప్రవి శేత్తు కదాచన॥

న చ ప శ్యేత్తు రాజాన మయోగ్యాసు చ భూ మిషు ।

రాజస్తు దక్షిణే పార్శ్వే వామే చోపవి శే తథా॥

పురస్తాత్తు తథా పశ్చా దాసనం తు విగర్జీ తమ్ ।

జమ్ళాం నిజ్జీవనం కాసం కోపం పర్య స్త్రీకాశ్రయమ్॥

భ్రుకుటిం వాస్త ముద్దారం తత్సమీ పే వివర్జయేత్ ।

స్వయం తథా న కుర్వీత స్వగుణాఖ్యాపనం బుధః॥

స్వగుణాఖ్యాపనే యుక్తం పర మేవ ప్రయోజయేత్ ।

హృదయం నిర్మలం కృత్వా వరాం భ క్తిల సమాశ్రితై కి॥

ఆనుజీవిగజై ర్భావ్యం నిత్యం రాజ్ఞా మతస్దాత్రే ।

శాఠ్యం లౌల్యం చ వైశున్యం నాస్తిక్యం క్షుద్రతా తథా॥ 

చాపల్యం చ పరిత్యాజ్యం నిత్యం రాజ్ఞానుజీ విభిః ।

 శ్రుతివిద్యాసుశీలైశ్చ సంయోజ్యాత్మా నమాత్మనా॥

రాజ సేవా తతః కార్యా భూతయే భూతి మిచ్చతా ।

నమస్కార్యా స్సదా చాస్య పుత్తవల్లభమ నొణః॥

సచివై శ్చాస్య విశ్వాసో న చ కార్యః కథంచన ।

ఆపృష్టశ్చాస్య న బ్రూయా తొమం బ్రూయా తథా యది॥

హితం పథ్యం వచ స్తథ్యం హితై స్సహ సునిశ్చితమ్ ।

చిత్తం చై వాస్య విజ్ఞేయం నిత్య మేవానుజీవిభిః॥

ఏవ మారాధనం కుర్యా చ్చిత్తజ్ఞో మానవ స్సుఖమ్ ।

కానీ ఈ విధముగ కూడ ఎల్లప్పుడును చేయు చున్న చో తాను ప్రభువునకు తేలిక వాడగును; రాజునకు ప్రీతి కరములగు వచనములను పలుకవలసినదే కాని అవి మిక్కిలిగాగాని మాటిమాటికి (ఎప్పుడును అదేపనిగా) కాని ఆడరాదు; మహాసుశీలుడుగా నుండవలెను; కనుబొమలు ముడిపడనీయకూడదు; ఎక్కువ మాటాడ రాదు; బొత్తుగా మాటాడకుండ రాదు; మత్సరముండ రాదు; తను తానేట్టి స్థితియందును పొగడుకొనరాదు; రాజునందుగల దుష్కృత్యములను ఎప్పుడు గానీ ఎక్కడ గానీ పేర్కొనరాదు; రాజిచ్చిన వస్త్రములను అస్త్రములను అలంకారములను తానే ధరించవలేను కొని షేమము గోరువాడెవడును వానిని ఔదార్యముతో ఇతరులకీయరాదు; తెగ తినరాదు; అతినిద్ర పోగూడదు; ప్రవేశించ వచ్చునని నిర్దేశించని (నిషిద్దమయిన) వాకిటియందు ఎన్నడును ప్రవేశించరాదు; రాజు దర్శించరాని చోటు లందుండగా దర్శించరాదు; రాజునకు కుడి ఎడమలందే కాని ముందు వెనుక లందు కూర్చుండరాదు; రాజ సమీపమున ఆవులించుట ఉమియుట దగ్గుట (ఇతరుల పైనైనను) కోపించుట వీరాసనమున కూర్చుండుట కనుబొమలు ముడి వేయుట కక్కుట కేక రించుట చేయరాదు; తన గుణములను తానే చెప్పుకొనుట తగదు; ఒక వేళ రాజునకుఆవి తెలుపవలసియున్నచో ఇతరులచే తెలిపించవలయును; రాజాను జీవులు నిర్మల హృదయులు రాజునందు పరమభక్తులు సోమరితనము లేని వారు నయి కొంటె తనము ఆయా విషయములందాస కి చాడీలు చెప్పుట నొ సికత్వము క్షుద్రత్వము చాపల్యము విడువవలెను; వేద విద్యలయందు నుశీలమునందు మనస్సు దృఢముగా నిలుపవలయును; ఇట్లుండి రాజ సేవ చేయుట చే శ్రేయస్సు కలుగును; రాజునకు పుత్రులు మంత్రులు ప్రియులునగు వారిని నమస్కరించుచుండవలెను; రాజ సచివులయందు నమ్మిక తో నుండ రాదు; రాజడుగనిదే మాటలాడరాదు; ఒక వేళ మాటలాడినను రాజహితులగు వారితో మాట కలిపి రాజునకు హితమును క్షేమకర మును సత్యమునునగు మాటనే చెప్పవలయును; సదా రాజ చిత్తమునెరిగి వర్తించవలెను; ఇట్లుండి రాజునారా ధించ ( మెప్పించ) వలెను.

విరక్త-రక్త-లక్షణమ్ - విరక్త-రక్త-లక్షణము

రాగాపరాగౌ చైవాస్య విజ్ఞాయౌ భూతి మిచ్ఛతా॥

త్యజే ద్విర క్తం నృపతీ రక్తం వృత్తింతు కారయేత్ ।

విరక్తః కారయే న్నాశం విపక్షాభ్యుదయం తథా॥

ఆశావర్గనకం కృత్వా ఫలనాశం కరోతిచ ।

ఆకోపోపి సకోపాభః ప్రసన్నో పి చ నిష్పలః॥

వాక్యం చ సమదం వక్తి వృత్తిచ్చేదం కరోతి చ ।

ప్రవేశ వాక్యముదితో న సమ్బావయతే యథా॥

ఆరాధనాసు సర్వాసు సు ప్రవచ్చ విచేష్టతే ।

కథాసు దోషం క్షిపతి వాక్యభజం కరోతి చ॥

లక్ష్యతే విముఖశ్చైవ గుణసజీర్తనే2పి చ ।

దృష్టిం క్షిపత్యథాన్యత క్రియమాణే చ కర్మణి॥

విరక్తలక్షణం హ్యేత చ్ఛృణు ర క్రస్య లక్షణమ్ ।

దృష్ట్వా ప్రసన్నో భవతి వాక్యం గృహోతి చాదరాత్॥

 కుశ లాదిపరిప్రశ్నం హృషో వదతి శోభనమ్ ।

వివి కదర్శనే చాస్య రహస్యేనం న శ జ్కతే॥

జాయతే హృష్టవదన శ్శ్రుత్వా తస్యతు త(స)త్కథామ్ ।

అప్రియాణ్యపి వాక్యాని తదుత్తా న్యభినత్లతే॥

ఉపాయనం చ గృహొతి స్తోక మవ్యాదరం తథా ।

కథా నరేషు స్మరతి ప్రహృష్టవదన స్తథా॥

ఏవం రక్తస్య కర్తవ్యా సేవా రవికులోద్వహ ।

మిత్రం న చాపత్సు తథా చ భృత్యం త్యజంతీయే నిర్గుణ మప్రమేయమ్॥

ప్రభుం విశేషేణ చ యే వ్రజంతి సురేంద్రధామామరబృందజుష్టమ్॥

ఇతి శ్రీమత్స్యమహాపురాణే రాజధర్మే రాఞోనుజీవినా మనువర్తనక్రమాది కథనం నామ పంచదశోత్తరద్విశతతమోధ్యాయః॥

రాజుకూడ తన క్షేమమును కోరుకొనినచో తన భృత్యులలో తన యందు రక్తుడెవడో విరక్తుడెవడో గురుతించి విరక్తుని వీడువవలెను; రక్తుని చేతనే సేవావర్తనము చేయించవలెను; విరక్తుడగు భృత్యుడు తన ప్రభువునకు నాశ మును శత్రుపక్షమునకు అభ్యుదయమును కలిగించును; ఆశను పెంచును; ఫలసాశము కలిగించును.

విరక్తుడగు భృత్యుని గురుతించుట ఎట్లన-

విరక్తుడగు భృత్యుడు మదముతో నిండిన మాటలు పలుకును; తుదకు తన జీవనమున కే ముప్పుతెచ్చుకొనును; వాక్యములు ఆరంభించునప్పుడు సంతోషముతోనే ఉండి ఆరంభించును; కాని అదే విధముగా తుదవరకు మాటలాడడు; రాజునారాధించ (మెప్పించ వలసిన సర్వవిషయములందును నిదుర పోవుచున్నట్లు వర్తించును; మాటలందు తప్పులు వేదకి ఎత్తి చూపుచుండును; మాటకు నడుమనే త్రుంచివేయును; తన ప్రభుని గుణములను కీర్తించునప్పుడు కూడ విము. ఖుడుగా కనబడుచుండును; తాను పనులు చేయుచుండియు తన చూపును మరియొకచోట నుంచును; విరక్తుని లక్షణములు ఇట్లుండును; ఇక-రక్తుడగు భృత్యుని లక్షణములు: తన ప్రభుని చూచినంతనే ప్రసన్ను డగును; చెప్పిన వాక్యమును ఆదరముతో స్వీకరించును; కుశలప్రశ్నా దీకము చేయునపుడు హర ములో విన ఇంపుగా మాటలాడును; ఏకాంతమునందు రహస్య వివక్ష స్థలములందు తన ప్రభువు తనకు కనబడినను జంకు గోనడు; తనప్రభుని గూర్చిన మాటలితరుల నోట వినునపుడతని మొగమున హర్షము కనబడును; తనప్రభువు తన్నే వైన ఆప్రియ వచనము లాడినను అవి మెచ్చునే కాని కోపింపడు; తన ప్రభువిచ్చిన ఆదరముగాని పారితోషికముగాని అల్పమైనను గొప్పదియను గౌరవముతో గ్రహించును; మాటల నడుమ తన ప్రభుని గూర్చిన మాట తటస్థించినచో హరము మొగమున పొడచూపును; ఇట్టివానిని రక్తుడగు సేవకునిగా గురుతించి వానిచేత సేవ చేయించుకొనవలెను; ఆపదలయందున్న భృత్యుని కాని మిత్రునికాని ఎవరు. విడువక ఆదుకొందురో అట్టి ప్రభువును తన ప్రభువును రాజును త్రిగుణా కేతుడు అప్రమేయుడు ఆగు భగవంతునిగా ఎవరు భావించి వానినాశ్రయింతురో అట్టి భృత్యులును ప్రజలును అమర బృందాశ్రితమగు దేవేంద్రస్థానమగు స్వర్గమును చేరి సుఖింతురు.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున రాజధర్మమునందు రాజానుజీవి వర్తనమను రెండు వందల పదునైదవ అధ్యాయము.