మత్స్య మహా పురాణము
230 - అగ్ని వైకృతశాంతి.
గర్గః : అగ్ని రాదీప్యతే యత్ర రాష్ట్రే భృశ మనిన్దనః ।
న దీవ్యతే చేన్తనవాం స్తదాష్ట్రం పీడ్యతే నృపైః॥
*ప్రజ్వలే చ్చామ్బునా సేకా త్తదార్థం వాపి కిఞ్చన ।
ప్రాకారం తోరణం ద్వారం నృపవేశ్మ సురాలయమ్॥
ఏతాని యత్ర దీప్య స్తే తత్ర రాజభయం భవేత్ ।
విద్యుతా వా ప్రదహ్య స్తే తత్రాపి నృపతే ర్భయమ్॥
ఆనై శాని తమాంసి స్యు ర్వినా పాంసురజాంసి చ ।
ధూమ శ్చానగ్ని జో యత్ర తత్ర విన్ద్యా న్మహ దృయమ్॥
తడి ద్వినాభం గగనే నై శేవా ఋక్షవర్జితే ।
దివా సతారే గగనే తథైవ భయ మాది శత్॥
గ్రహనక్షత్రవై కృత్యే తారావికృతదర్శనే ।
పుర వాహనయానేషు చతుష్పా నృగపక్షిషు॥
స్వభావాద్వాపి హీత ధేనువత్సారికం చ యత్ ।
ఆయుధేషు చ దీ ప్లేషు ధూమాయత్సు తథైవ చ॥
నిర్గమత్సు చ కోశాచ్చ సజామ స్తుములో భవేత్ ।
వినాఒగ్నిం విస్ఫులిజ్ఞాశ్చ దృశ్య నే యత్ర కర్షి చిత్॥
ఆనారోప్యాభిపూర్య నే ధసూంషి వికృతాని చ ।
విహరాశ్చాయుధానాం చ తత్ర సఙామ మాది శత్॥
త్రిరాత్రోపోషిత సత్ర పురోధా స్సుసమాహితః ।
సమిద్భిః క్షీరవృక్షాణాం సర్ఘ పైశ్చ ఘృతేనచ॥
హోమం కుర్యా దగ్ని మంత్రై రాహ్మణాం శ్చైవ భోజయేత్ ।
దద్యా త్సువర్ణం చ తథా ద్విజేభ్యో గా శ్చైవ వస్త్రాణిత థా భువం చ॥
ఏవం కృతే పాప ము పైతి నాశం యదగ్ని వైకృత్యభవం ద్విజేంద్ర॥
ఇతి శ్రీమత్స్యపురాణే రాజధర్మే అగ్నివైకృత్యశాంతికథనం నామ ఏకోనత్రింశ దుత్తర ద్విశతత మోఽధ్యాయః॥
(* ప్రజ్వలే దప్సు మాంసం వా)
గర్గుడు అత్రితో ఇట్లు చెప్పెను: ఏ రాష్ట్రమునందు ఇంధనములు లేక యే ఆగ్ని మండునో ఇంధనములుండియు అగ్ని జ్వలించదో ఆ రాష్ట్రమున శత్రు రాజులచే పీడ కలుగును; నీటితో తడిపిన వస్తువులును పచ్చి వస్తువులును మండు టయు నీరు పోసినను మంటలారకుండుటయు ప్రాకారములు పుర ద్వారములు ద్వారములు రాజాలయ దేవాలయములు మండు టయును మెరపుల నుండి నిప్పంటుకొని వస్తువులు కాలుటయు జరిగిన చో రాష్ట్రపు రాజునకు భయము కలుగును; రాత్రి కాక యే దూళి రేగకయే చీకట్లు క్రమ్ముట ఆగ్ని లేక యే పొగ కమ్ముట జరిగినచో మహాభయము కలుగును; ఆకాశమున మేఘము లేక యే మెరపులు కనబడుట రాత్రి గగనమున నక్షత్రములు కనబడకుండుట పగలు ఆకాశమున నక్షత్రములు కనబడుట జరిగినను భయము కలుగును; గ్రహ నక్షత్ర తారలయందు పుర వాహనయాన చతుష్పాత్ మృగపక్షులందును స్వభావ విరుద్ధములగు వైకృతములు కనబడినను అవులుదూడలు మొదలగునవి ఆస్వాభావికముగ ప్రవర్తించినను ఆయుధములు మండినను పొగలు క్రమ్మినను ఒరలనుండి తమంతతాము వెలికివచ్చినను యుద్ధము సంభవించును; అగ్ని లేక యే నిప్పురవ్వలు రేగినను ఎక్కు పెట్టకయే తమంతతామే ధనువులు పూరింపబడినను ఇట్టి వికృతములింక ను ధనువుల యందును ఆయుధములందును కనబడినను యుద్ధమగును.
ఇట్టి సందర్భములలో పురోహితుడు మూడునాళ్ళుపవసించి సునమాహితుడై పాలుగల వృక్షముల సమిధలతోను ఆవలతోను నేతితోను ఆగ్ని దేవతాక మంత్రములతో హోమము చేయవలెను; బ్రాహ్మణులకు భోజనమును గోభూ సువర్ణ వస్త్రదానమును జరుపవలయును; ఇట్లు చేయుటచే ఆగ్ని వై కృతోపద్రవము శాంతించును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున ఆగ్ని వైకృత శాంతి కథనమను రెండు వందల ముప్పదియవ అధ్యాయము.
Summary of chapter 230 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon practical remedial measures, gemstone recommendations, specific fasts, and ritual charity to mitigate severe astrological afflictions. Bhagavān Matsya details how donating specific metals, grains, cows, land, and garments corresponding to afflicted planets neutralizes negative cosmic energies and restores health, wealth, and peace. The text emphasizes that genuine devotion, moral integrity, and selfless charity transcend malicious planetary influences, earning divine grace.