101 - ప్రయాగ మాహాత్మ్యము

అతఃపరం ప్రవక్ష్యామి ప్రయాగ స్యోపవర్ణవమ్

 మార్కండేయేన కథితం యత్ పురా పాండు సూనవే

 భారతేతు యదా వృత్తే ప్రాప్తరాజ్యే పృథాసుతే

ఏతస్మిన్నంతరే రాజా కుంతీపుత్త్రో యుధిష్ఠిరః

 భ్రాతృశో కేన సంత ప్త శ్చింతయన్ స పునఃపునః

ఆసీ త్సుయోధన్ రాజా ఏకాదశ చమూపతిః

 అస్మాన్ సంతాప్య బహుశః సర్వే తే నిధనం గతాః

 వాసుదేవం సమాశ్రిత్య పంచ శేషాస్తు పాండవా

 హత్వా భీష్మంచ ద్రోణంచ కర్ణంచైవ మహాబలమ్

 దుర్యోధనంచ రాజానం పుత్త భాతృసమన్వితమ్

 రాజానో నిహతాః సర్వే యే చాన్యే శూర మానినః

 కిం నో రాజ్యేన గోవిందః కిం భోగై ర్జీవితేన వా

 ధిక ష్టమితి సంచింత్య రాజా వై క్లబ్య మాగతః

నిర్విచెట్టో నిరుత్సాహః కించి తిష్ట త్యధోముఖ

 లబ్దసంజ్ఞా యదా రాజా చింతయన్ స పునఃపునః

కతరో వినియోగో వా నియమం తీర్థ మేవచ

 యేనాహం శీఘ మాముచ్యే మహాపాతక కిల్బిషాత్

 యత్ర స్థిత్వా నరో యాతి విష్ణులోక మనుత్తమమ్

 కథం పృచ్ఛామి వై కృష్ణం యేనేదం కారితోస్మ్యహమ్

ధృతరాష్ట్రం కథం పృచ్చే యస్య పుత్తశతం హతమ్

 ఏవం వై క్లబ్య మాపన్నో ధర్మరాజో యుధిష్ఠిరః

 రుదంతి పాండవాః సర్వే భాతృశోకపరిప్లుతాః

 యేచ తత్ర మహాత్మానః సమేతా పాండవాః స్మృతాః

 కుంతీచ ద్రౌపదీచైవ యేచ తత్ర సమాగతాః

 భూమౌ నిపతితాః సర్వే రుదంతస్తు సమంతతః

నందికేశ్వరుడు నారదునకు ఇట్లు చెప్పెను: (స్నాన ప్రసంగమున) పూర్వము పాండుపుత్తడగు ధర్మరాజునకు మార్కండేయుడు చెప్పిన ప్రయాగ తీర్థ క్షేత్రోపవర్ణనమును తెలిపెదను.

మహాభారత యుద్ధానంతరము యుధిష్ఠిరుడు రాజ్యమును పొందియు భ్రాతృశోక సంతప్తుడయ్యెను.

మా భ్రాత దుర్యోధనుడు ఏకాదశాక్షౌహిణీ సేనా నాధుడుగా చక్రవర్తిగా నుం డేనుగదా! ఆతడును అతని వారును మమ్ములను చాల విధముల బాధించి రేకాని తుదకు పోరును మరణించిరిక దా! వాసు దేవుని ఆశ్రయించియు పాండవులము మేము ఐదుగుర మే మిగిలితిమి. భీష్మ ద్రోణ కర్ణులను పుత భ్రాతృ సహితుడగు దుర్యోధనుని చంపి తాము శూరులమను కొను మావీరులందరును తామును మరణించిరి. గోవిందా! మాకు రాజ్యముతోగాని భోగములతోగాని జీవితముతో గాని ఏమిపని? ఛీ! ఎంత దుఃఖకరమిది! అని యుధిష్ఠిరు డేమియు తోచక నిర్విచేష్టుడు నిరుత్సాహుడునునై అధోముఖుడే ఊరకుం డేను. మరల తెప్పరిల్లెను. కానీ చింత అతనిని వదలలేదు. ఏ విధానమును అనుష్టించి నియమ మవలంబించి తీర్థము సేవించి ఈ మహాపాతక దోషమునుండి విముక్తుడను కాగలుగుదును? ఏ క్షేత్రవాసము చేసినచో సర్వోత్తమ విష్ణులోక ప్రాప్తియగును? ఇవి అన్ని యు నాచే జరిపించిన కృష్ణునేమని అడుగుదును? ధృతరాష్ట్రుని నూర్గుర కొడుకులను చంపి అతనినేమడుగుదును? అని ఇట్లు ధర్మరాజు .ఏమియు తోచని వాడయ్యెను. పాండవులందరును కుంతీ ద్రౌపదులును మరియు నచట చేరిన ఇతరులగు పెద్దలును భూమి పై పడి దొరలుచు ఏడువసాగిరి. 

వారాణస్యాం మార్కండేయ స్తేన జ్ఞాతో యుధిష్ఠిరః

 యథా వై క్లబ్య మాపన్నో రుదమానస్తు దుఃఖితః

అచి రేణె వ కాలేన మార్కండేయో మహాతపాః

 సంప్రాప్తో హాస్తినపురం రాజద్వారే హ్యతిష్ఠత

 ద్వారపాలో పి తం దృష్ట్వా రాజ్ఞః కథితవాన్ ద్రుతమ్

త్వాం ద్రష్టుకా మో మార్కండో ద్వారి తిష్ఠత్యసౌ మునిః

 త్వరితో ధర్మపుత్తస్తు ద్వార మాగా దతఃపరమ్

 యుధిష్ఠిర ఉవాచ : స్వాగతం తే మహాభాగ స్వాగతం తే మహామునే

అద్య మే సఫలం జన్మ అద్య మే తారితం కులమ్

 ఆద్య మే పితర స్తుష్టా స్వయి దృషే మహామునే

అద్యా ఒహం పూత దేహోస్మి య త్వయా సహ దర్శనమ్

 నంది కేశ్వర ఉవాచ : సింహాసనే సమాస్ధాప్యపాదశా చార్చనాదిభిః

 యుధిష్ఠిరో మహాత్మా వై పూజయామాస తం మునిమ్

 తతః స తుష్టో మార్కండః పూజిత శ్చాహ తం నృపమ్

ఆఖ్యా హి త్వరితం రాజన్ కీమర్థం రుదితం త్వయా

 కేన వా విక్ల బీభూతః కా బాధా తే కిమప్రియమ్

యుధిష్ఠిర ఉవాచ : అస్మాకం చైవ యద్వృత్తం రాజ్యస్యార్దే మహామునే

 ఏతత్సర్వం విదిత్వాతు చింతావశ ముపాగతః

మార్కండేయ ఉవాచ : శృణు రాజన్ మహాబాహో క్షత్రధర్మవ్యవస్థితమ్

 నైవ దృష్టం రణే పాపం, యుధ్యమానస్య ధీమతః

 కింపునా రాజధర్మేణ క్షత్రియస్య వి శేషతః

తదేవం హృదయం కృత్వా తస్మా తాపం న చింత యేత్

తతో యుధిష్ఠిరో రాజా ప్రణమ్య శిరసా మునిమ్

 పప్రచ్ఛ వినయో పేతః సర్వపాతక నాశనమ్

యుధిష్ఠిర ఉవాచ : పృచ్ఛామి వినయో పేతః సర్వపాతకనాశనమ్

 కథయ త్వం సమా సేన యేన ముచ్యత కిల్బిషాత్

మార్కండేయ ఉవాచ : శృణు రాజన్ మహాబాహో సర్వపాతక నాశనమ్

 ప్రయాగగమనం శ్రేష్ఠం నరాణాం పుణ్యకర్మణామ్

         ఇతి శ్రీమత్యమహాపురాణే ప్రయాగమాహాత్మ్యవర్ణనం నామ ఏకోత్తర

శతత మోధ్యాయః

            ఆ సమయమున వారాణసియందుండిన మహాతపస్వి మార్కండేయుడు యుధిష్ఠిరుని ఈ స్థితిని ఎరిగి శీఘ్రమే హస్తినాపురమున కేతెంచి రాజ ద్వారమున నిలువ ద్వారపాలుడు రాజు కడకువచ్చి యాసమాచారము తెలిపినంత ధర్మజుడును త్వరితమే ద్వారము కడకు పోయెను.

అతడు ఆ మునితో మహాభాగా ! స్వాగతము. మహామునీ! స్వాగతము. మీ దర్శనమున ఇపుడు నా జన్మము సఫలమయినది. నా కులమువారు తరించిరి. నా పితరులు సంతుష్టులయిరి. నేను పవిత్ర శరీరుడనయితిని. అని పలికి లోనికి కొనిపోయి సింహాసనమున మునిని కూర్చుండ జేసి పాద ప్రక్షాళ నార్చనాదులతో మహాత్ముడు యుధిష్ఠిరుడా మునిని పూజించెను.

మార్కండేయుడు సంతుష్టుడై యుధిష్ఠిరునితో “రాజా! నీవేల ఏడిచితివి; నీవేల ఏమియు తోచని వాడ వయితివి? నీ బాధ ఏమి? నీకు కలిగిన అప్రియము ఏమి?” అని యడిగెను. అతడును “మునీ! మాకు రాజ్యము విష యమున జరిగినదంతయు తలచి తలచి చింతావశుడనయితిని." అనగా మార్కండేయుడనెను: “రాజా! క్షత ధర్మమున యుద్ధము చేయునపుడు ఇది పాపము అనునది లేదు. విశేషించి రాజధర్మముననుసరించి యుద్ధము చేయుటలో పాపము లేదని చెప్పవలసిన పనియేలేదు. క్షత్రియుడు సైనికుడై యుండి జీవనమున కే కాని దీనజన రక్షణమున కేకాని యుద్ధము చేయుట క్షత్ర ధర్మము. రాజై నయతడు తన రాజ్యమును రక్షించుకొనుటకో దానిని శత్రువులనుండి సంపాదించుటకో దీనజన రక్షణమునకో యుద్ధము చేయుట రాజధర్మము. ఇది ఎరిగి వివేకమునంది. నీవు నీకు పాపము కలుగునని ఆలో చింపకుము.” అనెను.

అంతట యుధిష్ఠిరుడు మునిని శిరసా నమస్కరించి వినయో పేతుడై “అయ్యా! తాము తైలోక్య (ధర్మ) ద్రష్టలు; మహాప్రాజ్ఞులరు; పాప మోచనమగు ఉపాయమును సం షేపమున చెప్ప మిమ్ము వేడుచున్నాను.” అనెను. ఆ మునియు "రాజా! వినుము; పుణ్య కర్మాచరణమున పాప మోచనము కోరువారికి ప్రయాగ గమనము శ్రేష్టమయినది.” అని పలికెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్య వర్ణనమను నూట ఒకటవ అధ్యాయము.