114 - భారతవర్ష వర్ణన విస్తరరూపమయిన పురూరవసుని పూర్వ జన్మ వృత్తాంతము 

మనుః : చరితం బుధపుత్తస్య జనార్ధన మయాశ్రుతమ్

త్రిధా శ్రాద్ధవిధిః పుణ్య స్సర్వపాపప్రణాశనః

 విమలం చైవ సర్వేషాం ఫలముచ్చై స్తథాశ్రుతమ్

 కృష్ణాజినప్రదానంచ వృషోత్సర్గం తథైవచ

 శ్రుత్వారూపం నరేన్హస్య బుధపుత్తస్య మాధవ

 కౌతూహలం సముత్పన్నం తన్మమాచవ్వ వృచ్ఛతః

కేన కర్మవిహి కేన సతు రాజా పురూరవాః

అవాప తాదృశం రూపం గతించ పరమోత్తమామ్

 దేవాం శ్రిభువన శ్రేష్టా స్టీనర్వాంశ్చ మనోరమాక్

 ఊర్వశీ సజ్ఞతా త్యక్త్వా సర్వభావేన తంతృపమ్

 శ్రీమత్స్యః : శృణు కర్మవిపా కేన యేన రాజా పురూరవాః

 అవాప తాదృశంరూపం సౌభాగ్యమపి చోత్తమమ్

అతీతే జన్మని పురా యోయం రాజా పురూరవాః

 మద్రదే శే మ హేష్వాసో భూమిప, శ్చాకు షేజ నరే

 పూర్వం స్వర్నృపగుజై ర్యుక్తః పరపురజ్జయః

నృపోసౌ ధనవాక్ జాతః కేవలంరూపవర్జిత

 ఋషయః : పురూరవా మ దపతిః కర్మణా కేన పార్థివః

 బభూవ కర్మణా కేన రూపవాం శ్చైవ భూతలే

 [ఆలోచింపగా ఇచట పురూరవసుని వృత్తాంతమును తెలుపుమని .ఋషులు సూతు నడుగవలసిన ప్రసక్తి లేదు. కాని దీనిని ఒక విధముగ సమర్థింపవచ్చును. ఇచట నవవర వర్ణనమున ఇలావృత వరము పేర్కొని వివరింపబడినది. దీని కి పేరు పురూరవసుని తల్లి యగు ఇలపుం స్వమున ఇలుడు)ను బట్టి వచ్చినదని లోగడ తెలుపబడి నది. కావున ఆ పేరు వినగానే ఋషులకు ఆలాపుత్రుడగు పురూరవసుని విషయము విన కుతూహలము కలిగియుండేననీ భావింపవచ్చును. మరియు దీని మూలమున భారతవర్షమందలి నదీపర్వతవనాది వర్ణన విస్తరమున కవకాశమును గలదు. పురాణములయందు ఇట్టివి సహజమే].

మనువు మత్స్య నారాయణు నిట్లడిగెను: జనార్ధనా! నేను బుధపుత్రుడగు - పురూరవసుని చరితమును మూడు విధములగు శ్రాద్ధముల విధానమును - సర్వపాప ప్రణాశక ములగు ఆశ్రాద్ధములన్నింటి అనుష్టానమున కలుగు సమున్నత ఫలములను కృష్ణాజిన ప్రదాన వృషోత్సర్గాది ప్రకారమును వింటిని. బుధపుత్రుడును నరేంద్రుడునగు పురూరవసుని రూప విషయమును వినినందున నాకు కుతూహలము కలిగి అడుగుచున్నాను. అది నాకు తెలుపుడు. ఏ కర్మఫలముగా ఆ పురూరవసుడను రోజు అటీ పర మా తమరూపమును పరమో త్తమగతిని పొందేను? త్రిభువన శేష్టులగు దేవతలతోను మనో రములగు గంధర్వులతోను కలయికను విడిచి ఊర్వశి ఏలసర్వ భావముతో ఆ నృపుని పొందెను? ఆసగా మత్స్య జనార్దనుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఈ పురూరవోరాజు ఏ కర్మ విపాక మున అట్టి ఉత్తమ రూప సుభగత్వములను (కామినులకు ప్రీతిపాతుడగుట సుభగత్వము) పొందేనో వినుము. ఈ పురూరవుడు అంతకు ముందటి జన్మమున బొక్షుష మన్వంతర మున మహా ధనుష్కడు సర్వ నృపలక్షణ యుక్తుడు శతుపుర (ధనరాశి) విజేత ధనవంతుడు అయియును రూపము మాత్రము లేని, మద్రదేశ రాజై యుండెను.. అనవినీ ఋషులు పురూరవుడు తత్పూర్వ జన్మమున మద్రపతిగా నుండి సపుడు అతడు అపుడు రాజగుటకును రూప రహితుడ గుటకును మరల రూపవంతుడ గుటకును హేతువులగు కర్మ ఏపాకము లేవియని సూతునడిగిరి.

సూతః : ద్విజగ్రామే ద్విజశ్రేష్టా నామ్నై వాసీ త్పురూరవాః

 నద్యాః కూలే మహారాజ పూర్వజన్మని పార్థివః

 సతు మద్రపతీ రాజా యస్తునామ్నా పురూరవాః

తస్మిన్జన్మ న్యసౌ విప్రో ద్వాదశీషు సదానఘ

 ఉపోష్య పూజయామాస రాజ్య కామో జనార్దనమ్

 ద్వాదశీషు చకారాసౌ స్నాన మభ్యజ్ఞపూర్వకమ్

 ఉపవాసఫలా లౌప్తు రాజ్యం మద్రే ష్వకఱకమ్

 ఉపోషిత స్సదాఒడ్యణో ద్రూపమానో వ్య జాయత

 ఉపోషితై ర్నరై స్తస్మా తాన మభ్య జీపూర్వకమ్

 వర్షనీయం ప్రయత్నేన రూపఘ్నం తత్పరం నృప

 ఏత త్తే కథితం తస్య యద్వృత్తం పూర్వజన్మని

మహేశ్వర త్వే చరితం శృణు తస్య మహీపతేః

 తస్య రాజగుణె స్సర్వే స్సము పేతస్య భూపతేః

 జనానురాగో నై వాసి ద్రూపహీనస్య తస్యవే

 రూపకామ స్స మద్రేశ స్తప సే కృతనిశ్చయః

రాజ్యం మ నిగతం కృత్వా జగామ హిమపర్వతమ్

వ్యవసాయద్వితీయస్తు పద్భ్యామేవ మహాయశాః

ద్రష్టుం న తీర్థ సదసం పర్వతస్యాస్య మ స కే

 ఉగ్రం తప సపు మిచ్ఛూ రాజావే స పురూరవాః

 ఇరావతీతి విఖ్యాతా మపశ్య త్సుమనోహరామ్

 తుహినగిరిభవాం మహోగ్ర వేగాం తుహినగభస్తిసమానతలామ్

తుహినసదృశరమ్యవర్ణ కాంతాం తుహినయశా స్సరితం దదర్శ రాజా

 ఇతి శ్రీ మత్స్యమహాపురాణే భూగోళే పురూరవసో హిమవద్గమనం

నామ చతుర్దశోత్తర శతత మోధ్యాయః

సూతుడు ఋషులకిట్లు చెప్పసాగెను: ఈ బుధపు త పురూరవసునకు మధ్ర పతిగా నున్న పుడును పురూర వసుడనియే నామము. ఆతడంతకు ముందటి జన్మమున ఒకనదీ తీరమందలి ఒక బ్రాహ్మణ  గ్రామమున పురూర వసుడను పేరుగల ద్విజ శ్రేష్టుడయి యుండెను. ఆ జన్మమునందా వీపుడు రాజత్వమును కోరి నిరంతరము ద్వాదశుల యందుపవసించుచు జనార్దను నారాధించెడివాడు. కాని ఆ ఉపవాస దినములందు అభ్యంగ (తల యంటు) స్నానమాడెడి వాడు. ఆ వ్రత పుణ్యమున రెండవ జన్మ మున మద్రరా జై జన్మించెను. కాని ఉపవాస దినాభ్యంగ దోషమున రూపహీను డయ్యెను. కావున ఉపవాస దినమున అభ్యంగ స్నా సమాడరాదు. ఇది ఈ బుధపు తం పురూరవసుడు. మద్రపతియగు పురూరవసుడుగా నగుటకు పూర్వ జన్మమందలి విప్ర పురూరవసుని వృత్తాంతము. ఇక మద్రపతిగానున్న యతని వృత్తాంతము వినుడు. అతడు సర్వ రాజగుణ యుక్తుడే నను రూపహీనుడగుటచే నతని విషయమున రాజ్య జనులకు అనురాగము లేకుండెను. అందున ఆతడు రూపార్టీయే తపమాచరింపగోరి రాజ్యమును మంత్రుల కప్పగించి హిమా లయమునకు ఏగేను. ఉగ తపమాచరింపగోరి నిర్మల కీ ర్తియగు . ఆ రాజు తన దృఢ సంకల్ప మాత్రము తోడుగా పాదచారియై ఆ పర్వత శిఖరమునందు తపమున కనుకూలమగు తీర్థ స్థానము వెదుక గోరి పోగాపోగా సుమనోహర మై హిమవంత మున పుట్టిన ఇరావతి (ఐరావతి-రావినది) అనునది అతనికి కనబడెను. ఆనదీ మహోగ్ర వేగయు చంద్ర సమాన శీత లయు హిమ సమాన కాంతియు కయునై యుండెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున భూగోళ వర్ణనమున జంబూద్వీపాంతర్గత భారతవర్ష వర్ణసమున పురూరవః పూర్వచరితమను నూట పదునాలుగవ అధ్యాయము.