మత్స్య మహా పురాణము
280 - హిరణ్యాశ్వ రథ దాన విధానము.
శ్రీమత్స్యః : ఆథాత స్సమవక్ష్యామి మహాదాన మనుత్తమమ్ ।
పుణ్య మశ్వరథం నామ మహాపాతక నాశనమ్॥
పుణ్యం దీన మథాసాద్య కృత్వా బ్రాహ్మణవాచనమ్ ।
లో కేశావాహనం కుర్యా త్తులాపురుషరుషదానవత్॥
ఋత్విజ్మణపసమ్భార భూషణాచ్చాదనాదికమ్ ।
కృష్ణాజినే తిలా నృత్వా క్చానం స్థాపయే ద్రథమ్॥
ఆష్టాశ్వం చతురశ్వంవా చతుశ్చక్రం సకూబరమ్ ।
ఐన్దనీ లేన కుమ్బేన ధ్వజరూ పేణ సంయుతమ్॥
లోకపొలాష్టకం తద్వ త్పద్మరాగదళాన్వితమ్ ।
చతురః పూర్ణకలశా స్ధాన్యాన్యష్టాద శైవ తు॥
కౌశేయవస్ర సంయుక్త ముపరిష్టా ద్వితానకమ్ ।
మాల్యేక్షుఫలసంయుక్తం పురు షేణ సమన్వితమ్॥
యో యద్భక్తః పుమాన్ కుర్యా త్స తన్నామ్నాధివాసనమ్ ।
ఛత్తచామర కౌశేయ వస్తోపానహసంయుతమ్॥
గోభిర్విభవత స్సార్గం దద్యాచ్చ శయనాదికమ్ ।
కుర్యాత్తు ప్రాపలా దూర్ధ్వం శ క్తితః కారయే ద్బుధః॥
అశ్వాష్ట కేన సంయుక్త చతుర్భి రథ వాజిభిః ।
ద్వాభ్యా మథ యుతం దద్యా వ్రేమసింహధ్వజాన్వితమ్॥
చక్రరక్షా వుభౌ తస్య తురగశౌ వథాశ్వినౌ ।
పుణ్యకాల మథా వాప్య పూర్వవ తాపితో ద్విజై కి॥
త్రిః ప్రదక్షిణ మావృత్య గృహీతకుసుమాల్టాలి ।
శుక్లమాల్యామ్బరో దద్యా దిమం మ ముదీరయేత్॥
నమో నమః పాపవినాశ నాయ విశ్వాత్మనే వేద తుర జమాయ ।
ధామ్నా మధీశాయ దివాకరాయ పాపౌఘదో వానల దేహి శా స్లిమ్॥
వస్వష్ట కాదిత్యమరుద్గణానాం త్వమేవ ధాతా పరమం నిధానమ్ ।
యత స్తతో మే హృదయం ప్రయాతు ధర్మైక తానత్వమమౌఘనాశాత్॥
ఇతి తురగరథ ప్రదాన మేకం భవభయ సూదన మత్ర యః కరోతి ।
స కలుషపటలై ర్విముక్తదేహః పరమ ముపైతి పదం పినాకపాణేః॥
దేదీప్యమానవపుషా విజితః ప్రభావ మాక్రమ్య మణ్డల మఖడ్డితచణ్డభానోః ।
సిద్దాజ్గనానయనషట్పదపీయమానవక్తామ్బుజోమ్బుజభవేన చిరం సహా స్తే॥
ఇతి పఠతి శృణోతి వా య ఏత త్తురగరథస్య మహాప్రదాన మస్మి ।
న స నరకపురం వ్రజేత్కదాచి న్నరక రిపో ర్భవనం ప్రయాతి భూయః॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే మహాదానాను కీర్తనే హిరణ్యాశ్వరథప్రదానికో
నామ అశీత్యుత్తర ద్విశతత మోధ్యాయః ॥
శ్రీమత్యుడు మనువుతో ఇట్లు చెప్పెను: ఇపుడిక అను త్తమమును పుణ్యకర మును మహాపాతక నాశనమునునగు హిరణ్యాశ్వరథ దానమను మహాదానమును వివరింతును; పుణ్యకరమగు శుభదినమందు తులాపురుష దానమందువలేనే బ్రాహ్మణులచే స్వస్తి పుణ్యాహవాచనమును లోక పాల వాహనమును జరిపించవలయును; ఋత్విజులను మండపమును సంభోరములను వస్త్రములను భూషణములను కూడ అందువలెనే సమకూర్చుకొనవలయును; కృష్ణాజినమునందు నూవు లుంచి వానిపై రథమునుంచవలెను; దానికి ఎనిమిది గాని నాలుగుగాని అశ్వములు నాలుగు చక్రములు కూబరము ధ్వజ స్థానమున ఆష్టలోకపాలుర ప్రతిమలతో పద్మరాగ దళములతో కూడిన ఇంద్రనీల కుంభమునుండవలెను; నాలుగు పూర్ణ కలశములును అష్టాదశ ధాన్యములును పట్టు వస్త్రముల జతయు వీని పై వితానకము ( మేలుకట్టు)ను పూవులును చేరకు గడలును పురుష ప్రతిమయు ఛత్రచామరములును పాదుకలు పాదరక్షలు నుండవలెను; ఎవరు ఏదేవుని భక్తులో ఆ దేవుని పేరుతో అధివాసనము జరుపవలయును; రథాదికమునకు బంగారమును మూడు వేయి పలముల నడుమ తక ముతో వాడవలెను; యథాశక్తిగ గోవులను శయనాదిక మును గూడ ఈయవలయును; ఈ రథమందు ఎనిమిది నాలుగో రెండో గురములును బంగరుతో చేసిన సింహధ్వజమును చక్రరథులుగా అశ్విదేవతలును నుండవలెను; శుభ సమయమున వేనుక చెప్పినట్లు విపులచే స్నానము చేయించుకొనిన యజమానుడు తెల్లని వస్త్రములను పూవులను ధరించి పూవులు దోసిట పట్టి దేవతాదులను బ్రాహ్మణులను ఆగ్ని ని రథమును ముమ్మారు ప్రదక్షిణించి ఇవి దాన మీయవలెను; అపుడి మంత్ర ముచ్చరించవలెను:
“పాప వినాశనుడును విశ్వాత్ముడును వేదాశ్వుడును ధామము (తేజస్సు)ల కధీరుడును పారాసులకు దావాగ్ని యు. నగు దివాకరునకు నమోనమః; దేవా! మాకు శాంతినిమ్ము; అష్ట వసువులకు ద్వాదశాదిత్యులకు మరుద్గణములకును నీవే కర్తవు-పరమాశ్రయమవు; కావున నీ దయచే మా హృదయము పాపనాశ మంది ధర్మైకాశ్రయమగుగాక !"
ఇట్లు సంసార భయనాశకమగు హిరణ్యాశ్వరథ దానమాచరించువాడు కలుష రాశి విముక్తశరీరుడై పినాక పాణియగు శివుని పరమపదమందును; దేదీప్యమాన శ రీరుడై సర్వజేతయగు ప్రభావముగల ఆఖండిత చండ భానుని మండలమాక్ర మించి సిద్దాంగనా నేత్రములను తుమ్మెదలు తన ముఖ కమలమందలి యండమను తేనెను త్రోవుచుండ బ్రహ్మతోకూడి సుచిర కాలము సుఖించును. ఇందలి ఈ హిరణ్యాశ్వ రథదాన కల్పమును చదివినను విన్న ను తత్ఫ లముగా నరక పుర మునకు పోక నరక శత్రుని పురమునకు పోవును.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమున హిరణ్యాశ్వరథ ప్రదాన విధానమను రెండు వందల ఎనుబదవ అధ్యాయము.
Summary of chapter 280 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya outlines the rules for Hiraṇyāshvaratha-dāna, the sixth Mahādāna featuring the donation of a golden war chariot pulled by four sculpted golden horses. Bhagavān Matsya describes fashioning the golden chariot with golden wheels, gemstone axles, silk banners, and a central throne carrying an icon of Sūrya Deva or Bhagavān Vishṇu. The donor circumambulates the golden chariot, offers prayers for universal peace, and presents the entire ensemble along with horses and land to learned priests, securing supreme sovereign authority and eternal spiritual glory.