మత్స్య మహా పురాణము
264 - క్రియాయోగవిధి - అధివానన విధానము
గురుతించి వదలివేయుట) యందు నేర్పుగలవాడును ఆయా ప్రతిష్టాది శాస్త్ర తత్త్వములను ఎరిగిన వాడును వాస్తు శాస్త్ర పారంగతుడును ఏయొక దోషములును లేనివాడును ఆచార్యుడు ప్రతిష్టాకార్య ప్రక్రియయందు ఆధ్వర్యుడు ప్రధాన ఋత్విక్ గా నుండవలయును: ‘మూర్తిపులు' కూడ సద్వంశమునందు జనించి ఋజు స్వభావము కల విప్రులై యుండ వలయును; ఈ మూర్తిపులు జ్యేష్ఠ పరిమాణక లింగప్రతిష్టయందు ముప్పది ఇరువురును మధ్యమ పరిమాణక లింగప్రతిష్ఠ యందు పదునారుమందియు కనిష్ఠ పరిమాణక లింగ ప్రతిష్ఠయందు ఎనిమిదిమందియు, ఉండవలయును.
అధివాసనవిధిః.
తతో లిజ్గ మథార్చాం వా నీత్వా స్నపనమణ్డపమ్ ।
గీతమజ్గశశబేన స్నపనం తత్ర కారయేత్॥
ప్చగవ్యకషాయణ మృద్బి ర్భస్మోద కేన చ ।
శాచం తత్ర ప్రకుర్వీత వేదమంత్ర చతుష్టయాత్॥
సముద్రజ్యేష్టమంత్రేణ ఆపోదివ్యేతి చాపరః ।
యాసాంరాజేతి మన్తశ్చ ఆపోహిష్ఠతి చాపరః॥
ఏవం స్నావ్య తతో దేవం పూజ్య గస్థానులేపనైః ।
ప్రచ్ఛాద్య వస్త్ర యుగ్మేన అభివస్త్రాత్యు దాహృతమ్॥
ఉత్థాపయే త్తతో దేవ ముత్తిష్ట బ్రహ్మణస్పతే ।
ఆమూర జేతి చ తథా రణే తిష్తి చాపరః॥
రథే బ్రహ్మరథే వాఒపి ధృతాం శిల్పగణేన తు ।
ఆరోప్య చానయే ద్విద్వా నాకృష్టేన ప్రవేశ యేత్॥
అనంతరము లింగమును కానీ అర్చామూర్తిని కాని స్నపన (స్నాన) మండపమునకు తీసికొనిపోయి అచట గీత మంగళశబ్దముతో పంచగవ్యముతోను కషాయ మీ, శితోదకముతోను మృ తిక తోను (హోమ) భస్మోదకముతోను స్నానము చేయించవలయును; ఆ సందర్భమునందు శాచార్గము ఈ చేప్పబోవు నాలుగు వేదమంత్రములను జపించు (బిగ్గరగా పఠించు) చుండవలయును; ఆవి.1. సముద్ర జ్యేషాః 2. యాఆపోదివ్యా ( ?) 3. యాసాంరాజ్ 4. ఆపోహిష్ణా అనునవి; ఇట్లు దేవుని స్న పనము చేయించి గంధానులేపనములతో పూజించి 'అభివస్తా' అను మంత్రముతో వస్త్రముల చాపుతో కప్పి తరువాత 'ఉతిష బ్రహ్మణస్పతే 'ఆమూరజ' 'రణేతిష్ణన్' అను మంత్రములతో దేవుని లేవదీయవలయును; మూర్తిని తెచ్చి రథమునందుకొని బ్రహ్మరథమునందు కాని శిల్పులచే ఎక్కించి రథమును లాగించికొని తీసికొనివచ్చి మండపమునందు ప్రవేశింపజేయవలయును.
తత ఆస్తీర్య శయ్యాయాం స్థావయే చ్ఛనకై ర్బుధః ।
కుశానా స్తీర్య పుష్పాణి స్థాపయే త్రాజ్ముఖస్ తతః॥
తతస్తు నిద్రకలశం వస్త్రకాజ్చోన సంయుతమ్ ।
శిరోభాగే తు దేవస్య జపన్నే వం నిధాపయేత్॥
ఆపోదేవీతి మన్రోణ ఆప్కోస్మాన్మాత రేతిచ ।
తతో దుకూలపశ్చ ఛాద్య నేత్రోపధానకమ్,
దద్యా చ్చిరసి దేవస్య కౌశేయం వా విచక్షణః ।
మధునా సరిషాభ్యజ్య పూజ్య సిద్దార్థకే స్తతః॥
ఆప్యాయ స్వేతి మ శ్రేణ యా తే రుద్రశివేతి చ ।
ఉపవిశ్యార్చయే ద్దేవం గన్ధపు పై స్సమ స్తతః
సితం ప్రతిసరం దద్యా ద్బారస్పత్యేతి మ స్తోతః ।
దుకూలపదైః కార్పానై ర్నా నాచితై రథాపివా॥
ఆచ్ఛాద్య దేవం సర్వత్ర ఛత్రచామర దర్పణమ్ ।
పార్శ్వత స్ట్రాపయే తత్ర వితానం వుష్పసంయుతమ్॥
రత్నా న్యోషధయ సత్ర గృహోపకరణాని చ ।
భాజనాని విచిత్రాణి శయనా న్యాసనాని చ॥
అభిత్వాశూర మ శ్రేణ యథావిభవతో న్య సేత్ ।
క్షీరం షోద్రం మృతం తద్వ దృక్యభోజ్యాన్నపాయసైః॥
షడ్విధైశ్చ రసై సద్వ త్సమస్తా త్పరిపూజయేత్ ।
బలిం దద్యా తయత్నేన మ శ్రేణానేన భూరిశ ॥
‘త్య్రమ్బకం యజామహ’ ఇతి సర్వత శ్శనకై ర్భువి ।
మూర్తిపో స్థావయే త్ప త్సర్వదిక్షు విచక్షణకి॥
చతురో ద్వారపాలాంశ్చ ద్వారేషు వినివేశయేత్ ।
శ్రీసూక్తం పావమానం చ సోమసూక్తం సుమజ్జళమ్॥
తథాచ శా నికాధ్యాయ మిన్దసూక్తం తథైవచ ।
రక్షఘ్నం చ తథా సూకం పూర్వతో బహ్వృచః పఠేత్॥
రౌద్రం పురుషసూక్తం చ శ్లోకాధ్యాయం సశుక్రియమ్ ।
తథైవ మజ్జలాధ్యాయ మధ్వర్యు ర్ధక్షిణే జపేత్॥
వాసుదేవం బృహత్సామ జ్యేష్టసామ రథ స్తరమ్ ।
తథా పురుష సూక్తం చ రుద్రసూక్తం సశాస్త్రీకమ్॥
భారుజ్ఞాని చ సామాని చ్చనోగః పశ్చిమే జపేత్ ।
ఆథర్వాజీరసం తద్వన్నీలం రౌద్రం తథైవచ॥
తథాపరాజితా దేవీ సప్తసూక్తం సరౌద్రకమ్ ।
తథైవ శాంతికాధ్యాయ మాథర్వ శ్చోత్తరే జపేత్॥
అంతట ఆందు దేవుని ఆర్చామూర్తిని నెమ్మదిగా దించి ఉంచవలయును; అచట దర్బలను పరచి వాని పై పూవులను ఉంచి ఇట్లేర్పరచిన శయ్యయందు మూర్తిని ప్రాజ్ముఖముగా పండుకొన పెట్టవలయును; 'ఆపోదేవీ?' 'ఆప్కో స్మాన్ మాతర' అను మంత్రములను పఠించుచు లోపల బంగారమునుంచి పైని నూతన వస్త్రములను చుట్టిన నిద్రో కలశమును దేవుని శిరోభాగమునందుంచవలయును; తరువాత దుకూల పట్టములతో దేవుని కప్పవలయును; తరువాత ఊన్ని బట్ట పొదిగియున్న వస్త్రముతో చేసిన దిండుకొని (దొండువలె) పట్టువస్త్రమును కానీ ఉంచవలయును; తరువాత దేవుని కడ కూర్చుండి తేనెతోను నేతితోను ఆభ్యంజనము (పూయుట) చేయవలెను; తెల్ల ఆవలతో పూజించవలయును; 'ఆప్యా యస్వ' ‘యాతేరుద్ర' అను మంత్రములతో అర్చామూర్తిని అంతటను గంధ పుష్పములతో పూజించవలయును; ‘బార్ఘ స్పత్య’ అను మంత్రముతో తెల్లని ప్రతిసర మును ధరింపజేయవలెను; దూది నూలితో నిర్మించిన దుకూల పట్టములతో నో నానా విధముల చిత్రములుగల వస్త్రములతోనో దేవుని మూర్తిని కప్పవలయును; పార్శ్వములందు దగ్గరలో ఛత్తము చామరము ఆద్దము ఉంచవలయును; ఆ పడకకు పైగా పూవులతో మేలుకట్టు అమర్చవలయును; 'ఆభిత్వాళూర' అను మంత్రముతో యజమానుడు తన విభవము కొలదిని వివిధములగు పాత్రలను శయనములను ఆసనములను అచ్చట నుంచ పలయును; పొలు తేనె నేయి భక్ష్య భోజ్యాన్న పాయసములు ఇట్టివానితోను షడ్విధరనపు ఆహారములతోను 'త్ర్యంబకం యజామ ' అను మంత్రముతో పూజా పూర్వకముగా బలిని సమర్పించవలయును; తరువాత మూర్తిపులను నెమ్మదిగా ఆయా స్థానములందు నర్వదిక్కులందు కూర్చుండ బెట్టవలయును; నలుగురను ద్వారపాలురనుగా ద్వారములందు కూర్చుండ బెట్టవలయును. వీరిలో 1. తూర్పు ద్వారమందుండు బహ్వృచుడు (ఋగ్వేది ) శ్రీ-పవమాన-సోమ.శాంతి కాధ్యాయేంద్ర-రక్షోఘ్న -సూక్తములను పఠించును; దక్షిణ ద్వారమందలి అధ్వర్యుశాఖా (కృష్ణ యజుశాఖాధ్యాయి రౌద్ర సూక్త-పురుషసూక్తశుక్రియానువాకమను శ్లోకాధ్యాయములను పఠించును; పశ్చిమ ద్వారమందలి సామవే..వామదేవ - బృహత్-రథంతర జ్యేష్ఠ సామములను పురుషసూక్త రుద్ర సూక్తములను శాంతికాధ్యాయమును ధారుండ సామమును పఠించును; ఉత్తర ద్వారమందలి ఆథర్వణవేదీయుడు అథర్వాంగిరస మంత్రభాగమును నీల సూక్తమును రౌద్ర సూక్తమును అపరాజితాదేవీ నూక్ర సప్తకమును శాంతికాధ్యాయమును పఠించును.
శిరఃస్థానేతు దేవస్య స్థాపకో హోమ మాచరేత్ ।
శా నికైః పౌష్టికై స్తద్వ న్మంత్రై ర్వ్యాహృతిపూర్వకైః ॥
పలాశోదుమ్బరాశ్వత్థా ఆపామార్గ శ్శమీ తథా ।
హుత్వా సహస్ర మేకై కం దేవం పాదే తు సంస్పృ శేత్॥
తతో హోమసహ సేణ హుత్వా హుత్వా తత స్తతః ।
నాభిమధ్యం తథా వక్ష శ్శిర శ్చా ప్యాలఖే త్పునః॥
హస్తమాత్రేషు కుణ్డేషు మూ ర్తిపా స్సర్వతోదిశమ్ ।
సమేఖలేషు తే కుర్యు ర్యోనివక్త్రేషు చాదరాత్॥
ప్రతి యామమునందును చందనోదకము తో ఆవ సేచనమును ధూపమును నైవేద్యమును జరుపవలయును. ఆట్టే పర్యాయక్రమమున మరలమరల హోమమును జరుపుచు పోవలయును; ప్రతి పర్యాయమును యజమానుడు ఋత్విజు లకు దక్షిణలు తెల్లని వస్త్రములు ఏవిధములగు బంగారు కడియములు బంగరు హారములు బంగరు సూత్రములును సువర్లాంగుళీయక ములును పానుపులును ఈయవలయును; నూతన వస్త్రములును కట్టబెట్టవలయును: భోజములును బాగుగా జరుపుచుండవలయును; ఆధివాసనము ముగియువరకును ఇదియంతయు జరుపుచుండవలెను. మూడు సంధ్యలయందును అన్ని దిశలయందును భూతబలి వేయుచుండవలయును. ప్రతిపూటను మొదట బ్రాహ్మణులకును అనంతరము మిగిలిన వర్ణములవారికిని (జనులకు) భోజనములును యథేష్టముగా పెట్టుచుండవలయును. నృత్య గీతాది మంగళ లక్షణములతో రాత్రియందు మహోత్సవము (గొప్ప వేడుక ) జరుపుచుండవలెను; చతుర్థి కర్మ (క్రియా) ముగియువరకును ('చతుర్థి క్రియా' అనగా ప్రతిష్ఠాక్రియ అయియుండును.) ఎల్లరును ప్రయత్న పూర్వకముగా యథాశ క్తిగా పూజించుచుండ వలయును.
ఈ చేప్పిన ఈ అధ్యాయమందలి ప్రక్రియకు 'అధివాసప్రక్రియ' అనివ్యవహారము; ఇది ఒకటికాని మూడుకాని ఐదుకాని - ఏడుకాని - (ఆహో)రాత్రములపాటు జరుపవలయును; కొన్ని కొన్ని సందర్భములలో సద్యోధి వాసనము (ప్రతిష్టకు కొంచెము ముందుగానే) ఆధివాసము జరుపుటయును కలదు; ఈ ఆధివాసప్రక్రియా ప్రాముఖ్యము ఏమియనిన దీనిచే నర్వయజ్ఞఫలము లభించును.
ఇది శ్రీమత్స్య మహా పురాణమున దేవతా ప్రతిష్టా నిరూపణమునందు ఆధివాసవిధాన కథనమను రెండువందల ఆరువది నాలుగవ అధ్యాయము.
Summary of chapter 264 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya expounds upon the classification, structural geometry, and exact mathematical proportions for fashioning sacred Śivalingas from stone, metal, crystal, or wood. Bhagavān Matsya divides the Śivalinga into three distinct vertical sections: the lowest four-sided base buried in the ground representing Bhagavān Brahmā, the middle eight-sided section within the pedestal representing Bhagavān Vishṇu, and the upper cylindrical rounded portion projecting above representing Mahādeva Śiva. The text outlines classifications based on height and diameter ratios, detailing self-manifested Svāyambhuva Liṅgas and man-made Mānusha Liṅgas.