మత్స్య మహా పురాణము
20 - కౌశిక వంశీయులు శ్రాద్దఫలముగా విష్ణులోకమును పొందుట
ఋషయః : కథం కౌశిక దాయాదాః ప్రాప్తాస్తే యోగముత్తమo ।
పశ్చి భిర్జన్మసమృన్ధైః కథం కర్మక్షయో భవత్॥
సూతః: కౌశికో నామ ధర్మాత్మా కురుక్షేత్ర మహానృషిః ।
నామతః కర్మత స్తస్య సుతా స్సప్త నిబోధత॥
స్వసృపః క్రోధనో హింస్రో మిథునః కవిరేవచ ।
వాగ్దుష్టః పితృవర్తీచ గర్గశిష్యా స్తదాఽభవః॥
పితర్యుపర తే తేషా మభూ దుర్భిక్షముల్బణమ్ ।
అనావృష్టిశ్చ మహతీ సర్వలోకభయజ్కరీ॥
గర్గాదేశా ద్వనే దోగ్ధ్రిం చరత స్తే తపోధనాః ।
భక్ష్యామ కపిలా మేతాం వయం క్షుత్పీడితా భృశమ్॥
ఇతి చిన్తయతాం పాప మఘం ప్రాహ తదానుజః ।
యద్యవశ్యమియం వధ్యా శ్రాద్దరూ పేణ యోజ్యతామ్॥
శ్రాద్దే నియోజ్యమానేయం పాపం నశ్యతి నో ధ్రువమ్ ।
తతః కుర్వ న్న నుజ్ఞాతః పితృవర్తీ తదనుజః॥
చక్రే సమాహిత శ్శ్రాద్ధ ముపయుజ్యచ తాం పునః ।
ద్వౌ దై వే భాతరౌ కృత్వా పిత్ర్యే త్రీన వ్యనుక్రమాత్॥
తధైక మతిథిం కృత్వా శ్రాద్ధద స్స్వయమేవతు ।
చకార మన్త్రవ చ్ఛాద్దం స్మరన్పితృపరాయణః॥
నా గాం వత్స ఏకోపి గురవే తు నివేదితః ।
వ్యా ఘ్రేణ నిహతా ధేను ర్వత్సోఽయం ప్రతిగృహ్యతామ్॥
వం సా భక్షితా ధేను స్స ప్తభి స్తై స్తపోధనైః ।
వై దికం బలమాశ్రిత్య క్రూరకర్మణి నిర్భయైః॥
ఋషులు సూతునిట్లు ప్రశ్నించిరి: “కౌశిక వంశీయులు తాము జరిపిన శ్రాద్ధమునకు ఫలముగా ఉత్త్రమమగు గమును ఎట్లు పొందగలిగిరి? ఐదు జన్మముల సంబంధముతోనే వారికి కర్మక్షయము. కలిగి విష్ణులోక ప్రాప్తి ఖ కలిగెను?”
సూతుడు వారికి ఇట్లు చెప్పనారంభించెను: పూర్వము కురు క్షేత్రమునందు కౌశికుడు అను ధర్మాత్ముడగు మహర్షి ఎండెడివాడు. అతనికి ఏడుమంది కుమారులు ఉండిరి. వారు తమ పేరులకు తగిన కర్మలను ఆచరించెడివారు. ఎట్లన సృపుడు-క్రోధనుడు.హింసుడు-పిశునుడు కవి.వాగ్దుష్టుడు పితృవర్తి.అని వారి పేరులు. (తన ఇష్టముననుసరించి నడుచు నువాడు. కోపస్వభావము కలవాడు ఇతరులకు అకారణముగా బాధ కలిగించువాడు. చాడీలు చెప్పువాడు కవిత్వము అల్లగల డు. చెడునోటివాడు తండ్రియందు భక్తితోనడుచుకొనువాడు) వీరు అందరును గరమునికి శిష్యులయి విద్యలనభ్యసించిరి. తకాలమునకు వీరి తండ్రి మరణించెను పిమ్మట ఒక ప్పుడు భయంకరమగు కరవువచ్చెను. సర్వలోకములకు భయం మగు దీర్ఘ కాలిక మగు అనావృష్టి (వరపు-వానలు కురిచుక పోవుట ఏర్పడెను, ఈ ఏడుగురు తపోధనులును గర్ణుని చే ఆమునియొక్క పాడియావును మేపుచుండగా వారిలో కొందరు “మనము ఆకలితో చాల బాధపడుచున్నాము. ఈక పిల వును చంపి తిందము." అనిరి. వారిలో కడపటివాడు ఇది పాపకరమని చెప్పెను. ఒక వేళ మనము దీనిని చంపితినుట స్పనిసరిఐనచో పితృశ్రాద్ధము జరుపుదము. దానిలో దీనిని వినియోగించి తిందము. ఆ విధముగా చేసి తినినచో మనకు పము ఆంటదు. గోవధపాపము నశించును. అనికూడ అతడు (పితృవ రి పలికెను. మిగిలిన వారు అతని మాట వేయనిరి. వారి అనుమతితో అతడు శ్రద్ధతో శ్రాద్ధము జరి పేను. ఆ శ్రాద్ధమునందు ఆ గోవును అన్న మునకు మారుగా రయోగించెను. పితృస్థానమునందు ముగ్గురను దైవస్థానమునందు ఇద్దరను తన సోదరులనే అర్చించి భోక్తలుగా కూర్చుండ కి భుజింపజేసెను. మరియొకనిని అతిథిగా గ్రహించి భుజింపచే సెను. తాను శ్రాద్ధకర్త అయి శ్రాద్ధమును ఆ పితృభక్తి గాయణుడు మంత్రపూర్వకముగా శ్రాద్దము జరి పెను.
తరువాత వారు గోవులేకుండ దూడను ఒక్కదానినే గురునకు అప్పగించిరి. ఆవును పులి చంపినది. ఈ -డను మాత్రమే తీసికోనుడు. ఆని అప్పగించిరి. ఇట్లు ఆ తపోధనులు ఏడుగురును వేగవిధిని బలముగా ప్రమాణముగా! శయించి నిర్భయులై కూరకర్మము జరిపి గోవును నిరి.
తః కాలాచ్చ కృష్ణా స్తే వ్యాధా దాశ పురోఽభవ ।
జాతిస్మరత్వం ప్రాప్తాస్తే పితృభావేన భావితాః॥
యత్కృతం క్రూరకర్మాపి శ్రాద్దరూ పేణ తై స్తదా ।
తేన తే భవనే జాతా వ్యాధానాం క్రూరకర్మణామ్॥
తృణాంచైవ మాహాత్మ్యా జ్ఞాతా జాతిస్మరాస్తు తే ।
తేన వైరాగ్యయోగేన ఆస్థాయానశనం పునః॥
కౌశిక దాయాదానాం మృగాదిజన్మ న్తరప్రాప్తి:॥
తిస్మరా న్సప్తజాతా మృగాః కాళఞ్జరే గిరౌ ।
నీలకణ్ఠస్య పురతః పితృభా వాను భావితాః॥
త్రాపి జ్ఞానవైరాగ్యా తాణానుత్సృజ్య ధర్మతః ।
లో కైర వేక్ష్యమాణా స్తే తీర్థతోఽనశ నేన తు॥
రాన సే చక్రవా స్తే సంజాతా స్సప్త యోగినః ।
నామతః కర్మత స్సర్వా న్ఛృణుధ్వం ద్విజస త్త్రమాః॥
మనాః కుముద శ్శుద్ధ శ్చిద్రదర్శీ సునేత్రకః ।
అనేత్ర శ్చాంశుమాంశ్చైవ సప్తైతే యోగపార గాః॥
యోగభ్రష్టా స్త్రయస్తేషాం బభూవు శ్చాల్పచేతనాః ।
దృష్ట్వావై బ్రౌజనామాన ముద్యానే స్త్రీభి రన్వితమ్॥
క్రీడ న్తం వివిధై ర్భావై ర్మహాబలపరాక్రమమ్ ।
పాఞ్చాలాన్వయసమ్భూతం ప్రభూతబలవాహనమ్॥
రాజ్య కామోఽ భవత్త్వేక స్తేషాం మధ్యే జలౌకసామ్ ।
పితృవ ర్తీచ యో విప్రశ్శ్రాద్ధకృ త్పితృవత్సల॥
అపరౌ మన్త్రిణౌ దృష్ట్వా ప్రభూతబలవాహనౌ ।
మన్త్రిత్వే చక్రతు శేచ్ఛా మస్మిన్మర్త్యే ద్విజోత్త్రమాః॥
తన్మధ్యే యే తు నిష్కామా స్తే బభూవు ర్ద్వి జోత్త్రమాః ।
వై భ్రాజపుత్త్రస్త్వైకోభూ ద్భ్రహ్మదత్త్ర ఇతి స్మృతః ॥
మ న్త్రిపుత్రా తథోభౌచ కణ్ణరీకసువాలకౌ ।
బ్రహ్మదత్తోభిషిక్తస్స నురోహిత విపశ్చితా॥
పాంచాలరాజో విక్రాన్త స్సర్వశాస్త్రవిశారదః ।
యోగవి త్సర్వజస్తూనాం రుత వేత్తఽభవత్త్రదా॥
తరువాత కొంతకాలమునకు వారు కాలునకు వశులై మరణించిరి. మరు జన్మమున పొరు దశార్ణ దేశ రాజధా యగు దశపురమున వ్యాధులు (బోయవారు గా పుట్టిరి. పితృ శ్రాద్దము శ్రద్దతో జరిపిన శ్రద్ధాభావముతో భావితులై (సంస్కారముపొంది నందున పూర్వజన్మ స్మరణము వారికి కలిగియుండెను. వారు చేసిన క్రూరకర్మకు ఫలముగా క్రూ! కర్ములగు బోయల ఇంట జన్మించిరి. వారు వైరాగ్యముతో తమ జీవితము గడపిరి. అనశన (నిరాహార) వ్రతముతో దేహమువదలి తరువాత జన్మములో కాలంజరపర్వతమున పూర్వజన్మ స్మృతికల లేళ్లుగా జన్మించిరి. అచటను వారి శివుని సన్నిధిలో జ్ఞానవైరాగ్యములతో ధర్మముతో జీవించి తు • కు దేహమువదలిరి. వారు ఈమృగ జన్మమున తీర్థవాసవ తోను అనశన వ్రతముతోను దేహత్యా? ము చేయుటను అచటిజనులు అందరును ప్రత్యక్షముగా చూచిరి. తరువాత వాళ మానస సరస్సులో గులగు చక్రవాక పకులుగా జన్మించిరి. వారి పేరులు ఈ జన్మములో సుమనుడు కుముదుడు-శుద్దుడు-ఛిద్రదర్శి-సునేత్రుడు ఆనేత్రుడు - అంశుమంతుడు (మంచి మనస్సు కలవాడు-లోకమునకు సంతోషవ కలిగించువాడు. నిర్మలుడు - ఇతరుల దోషములను ఎత్తి చూపువాడు మంచిని చూచువాడు- ఏమియు చూడనివాడు -కిర ప్రకాశము కలవాడు) అనునవి సార్థకములై యుండెను. వారు తమ పేరునకు తగినట్లు కర్మల నాచరించుచుండి వీరు ఏడుమందియు యోగతత్వము నెరిగినవారయి యుండిరి. కాని వారిలో ముగ్గురు యోగభ్రష్టులయి తక్కువ బు శ క్తి కలవారయియుండిరి. ఒక నాడు వారు పాంచాల దేశ రాజగు వైభోజుడను నతనిని చూచిరి. ఆ రాజు ఒక ఉద్యానవనమున భార్యలరీ కూడి వివిధ విలాసభావములతో విహరించుచుండెను. అతడు మహాబలపరా కమములు కలవాడు. ఆధికమగు పరివామును వాహనములును కలవాడు.
ఈ కౌశిక కుమారులలో కడపటివాడు తండ్రియందు భక్తి కలవాడయి యుండి భక్తితో శ్రద్ధతో పితృశ్రా మును జరిపిన పితృవర్తి అను నాతడు] ఈ రాజును చూచి తానును రాజు కావలెనని సంకల్పించేను. మిగిలిన వారికీ ఇద్దరు అధికమగు పరివారమును వాహనములును కలిగియున్న రాజమ'త్రులను ఇద్దరను చూచి తామును ఆట్లు మంత్రు? కావలెనని కోరుకొనిరి. వీరు ముగ్గురును యోగభ్రష్టులు మిగిలిన నలుగురును ఏమియు కోరుకోనలేదు. తరువాత జన్మమున పితృవర్తి అను నాతడు ఈ వైబ్రౌజుడను పాంచాల రాజునకు కుమారుడయి బ్రహ్మద డను పేర పుటేను. మిగిలిన వారు ఇద్దరును కండరీక సువాలకులు అను పేర విభ్రాజుని మంత్రికి కుమారులైరి. ఏ కి కలు లేని నలుగురును బ్రాహ్మణులై పుట్టిరి.
కొంతకాలమునకు పండితుడగు పురోహితుని చేత బ్రహ్మదత్తుడు పాంచాల రాజుగా పట్టాభిషిక్తుడయ్యెను. ఆత విక్రమము కలవాడు. సర్వశాస్త్ర విశారదుడు. యోగము నెరిగినవాడు. సర్వప్రాణుల ధ్వని విశేషములను ఎరిగినవాడు.
తస్యరాజ్ఞోఽభవద్భార్యా దేవలస్యాత్మజా శుభా ।
సన్న తిర్నామ విఖ్యాతా కపిలా యాభవత్పురా॥
పితృకార్యే నియు క్తత్వా దభవ ద్భ్రహ్మవాదినీ ।
తయా చకార సహిత స్స రాజ్యం రాజనన్దనః॥
కదాచి దుద్యానగత సయా సహ స పార్థివః ।
దదర్శ కీటమిథున మనజ్గక లహాకులమ్॥
కీటమిథునసంవాదః॥
పిపీలికా మనునయ న్పరితః కీటకాముక : ।
పఞ్చబాణాభితప్తాజ్గ స్సగద్గద మువాచ హ॥
న త్వయా సదృశీ లో కే కామినీ విద్యతే క్వచిత్ ।
మధ్యే క్షామాఽతిజఘనా బృహద్వక్షోరుగామినీ॥
సువర్ణవర్ణ సుశ్రోణి మద్భక్తా చారుహాసినీ ।
సులక నేత్రర దనా గుడశర్కరవత్సలా॥
భోక్ష్యసే మయి భు త్వం స్నా సి స్నాతే తథా మయి ।
ప్రోషితే సతి దీనా త్వం క్రుద్దేపి భయచంచలా॥
కిమర్థం వద కల్యాణి సరోషవదనా స్థితా ।
సా తమాహ సకోపా తు కిమాలపసి మాం శఠ॥
త్వయా మోదక చూర్ణంతు మాంవిహాయాభిలష్యతా ।
ప్రమత్తేన వ్యతిక్రాన్తే దినేఽన్యస్యా స్సవుర్పితమ్॥
పిపీలికః : త్వత్సాదృశ్యా న్మయా దత్త్ర మన్యస్యా వర వర్ణిని ।
తదేక మపరాధం మే క్షస్తు మర్హసి భామిని॥
నై తదేవం కరిష్యామి వునఃక్వాపీహ సువ్రతే ।
స్పృశామి పాదౌ సత్యేన ప్రసీద ప్రణతస్య మే॥
సూతః : ఇతి తద్వచనం శ్రుత్వా సాప్రసన్నాఽ భవ త్తతః ।
ఆత్మాన మర్పయామాస మోహనాయ పిపీలికా॥
బ్రహ్మదతో ప్య శేషంతవ్ జ్ఞా త్వా విస్మయమాగమత్ ।
సర్వస త్వరుత జ్ఞత్వా త్ప్రభావా చ్చక్రపాణినః॥
ఇతి శ్రీమత్స్య మహాపురాణే మత్స్యమనుసంవాదే స్వసృపాదికృతశ్రాద్ద ఫలానుభవథనం నామ వింశతితమోఽధ్యాయః ॥
కౌశిక పుత్తూలు జరిపిన శ్రాద్ధమున ఉపయోగింపబడినదగు గర్గుని కపిలగోవును ఈ కాలమున దేవలుడను రాజునకు కుమార్తెగా సన్నతి అను పేరుతో జన్మించెను. పితృకార్యమున ఉపయోగింపబడిన ఫలమున ఆమె వేదత త్వ వేత్తి యయ్యెను. విభ్రాజరాజు పాలనము చేయుచుండెను.
ఒక నాడు బ్రహ్మదత్తునకు ఉద్యానవనమున కామ ప్రవృత్తి హేతువుగా కలహించుకొనుచున్న చీమల దంపతులు కనబడెను. మగచీమ కామబాణముల తాకిడి చే తన శరీరము కంపించుచుండ డగుత్తికతో సరిగా మాట రాక పోగా ఆడు చీమను బ్రతిమాలుచు ఇట్లు పలికెను: “నీతో సమానురాలగు స్త్రీ లోకమునందు ఎవ్వతేయు ఎక్కడను లేదు. నీ నడుము సన్న నిది. నీ కటి ప్రదేశము విశాలమయినది. నీ వక్షోజములు చాల పెద్దవి. నీ నడక ధీరమయినది. నీది బంగారు ఛాయ. నీ పిరుదులు చక్కనివి. నా యందు భక్తి కలదానవు. చక్కని చిరునవ్వు చక్కగా కనబడు కన్నులు దంత ములు కలదానవు. నీకు బెల్లము మీదను చక్కెర మీదను పీతి ఎక్కువ. నేను భుజించనిదే నీవు భుజించవు. నేను స్నానము చేయనిదే స్నానమాడవు. నేను దూర దేశమునకు పోయినచో నీవు దీనురాలై యుందువు. నేను కోపించినచో భయముతో వణకిపోదువు. కల్యాణీ! ఇట్టి నీవు ఇపుడు ముఖమున రోషముతో ఏల ఉన్నావు?”
మగచీమ మాటలు విని ఆడుచీమ కోపముతో ఇట్లు పలికెను: “ఇతరుల మనస్సును నొప్పించువాడా! నీవు నన్నెందులకు పలుకరింతువు? పలుకరించకుము.1 నీవు నిన్నటి దినమున చాల మత్త్రతతో లడ్డు పొడిని నాకు ఈ యక మరియొక ఆడుచీమను అభిలషించి ఆమెకు ఇచి
మగ చీమ మరల ఇట్లు పలికెను: “ఓ సుందరీ! నీ పోలిక తో ఉండుటచే తెలియక నేను ఆ లడ్డు పొడి వేరొక చీమకు ఇచ్చితిని. నీవు కోపింపకుము. నీవు నేను చేసిన ఈ ఒక అపరాధమును క్షమింపుము. ఈ జీవితములో మరీ ఇంకెప్పుడును ఇటువంటి తప్పు చేయను. సత్యము ప్రమాణముగా నీ పాదములు పట్టుకొనుచున్నాను. నమస్కరించు చున్నాను. నన్ననుగహించుము."
ఇట్లు పలికిన మగచీమ మాటలు విని ఆ ఆడుచీమ కోపము విడిచి పసన్నురాలయ్యెను. తన్ను తాను ఆమె తన పియునకు సమర్పించుకొనెను.
బహ్మదత్తుడును ఈ విషయమంతయు ఎరిగి ఆశ్చర్యము పొందెను. విష్ణుదేవుని అనుగ్రహమున సర్వపాణుల ధ్వనులను వాటి అర్థమును అతడు ఎరిగియుండుటయే ఇందులకు హేతువు.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున మత్స్యమను సంవాదమున శారిద్ద ఫలానుభవ కథనమను ఇరువదవ అధ్యాయము.
Summary of chapter 20 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya narrates an instructive historical account of the seven sons of the sage Kauśika, who were disciples of Gargāchārya and were performing penance during a severe famine. Overcome by extreme hunger while guarding their guru's cow, they committed the grave sin of slaughtering and consuming the sacred animal, though they offered its meat in a simulated ancestral rite to minimize their karmic burden. Due to the partial piety of their ancestral dedication, they were born in their next life as hunters in Dashārṇa, then as deer on Mount Kāliñjara, then as water-fowls in Sharadvīpa, and subsequently as swans in Lake Mānasa. Throughout these animal births, they retained memory of their past misdeeds and maintained spiritual detachment, ultimately taking birth as the highly enlightened sons of King Brahmadatta and attaining supreme liberation through the power of ancestral devotion.