123 - ఖగోళ విషయము

సూతః : సూర్యాచంద్రమసా వేతౌ భ్రమన్తో యావదేవ తు

 సప్తద్వీసముద్రాణాం భూతానాం భూతివి స్తర

 విస్తరార్థం పృథివ్యాస్తు భవే దన్యత్ర బాహ్యతః

పర్యా సపరిమాణాచ్చ చన్దాదిత్యౌచ భాగశ

 పర్యాసపరిమాణాభ్యాంభూపేస్తుల్యం దివం స్మృతమ్

 ఆవతి మాత యేలోకా న్యస్మా తూర్యఃపరిక్రమక్

ఆయనాత్తు ప్రకా శేన అవనా త్స రవి స్మృతః

 భూయోభూయః ప్రవక్ష్యామీ ప్రమాణం చంద్రసూర్యయోః

 సప్తద్వీపసముద్రాయాం భ్రమణం చౄసూర్యయోః

మహతత్వా న్మహశ్శబ్లో హ్యస్మిన్న ఛే నిపాత్యతే

అస్య భారతవర్ష స్య విషమస్తుల్యతస్స్మృతః

 మణలం భాస్కరస్యాథ యోజనై స్ర న్ని బోధత

నవయోజనసాహస్రవిస్తారో మడ్డలస్యతు

విస్తారా త్రిగుణశ్చాపి పరిణాహోర్కమణలే

 విష్కమా న్మజ్ఞలాచ్చైవ భాస్కరా ద్విగుణ శ్శశీ

 అతః పృథివ్యా వక్ష్యామి ప్రమాణం యోజనైః పునః

 సప్తద్వీపసముద్రాయ విస్తారో మణెలసతు

ఇత్యేత దిహ సజ్జ్యోతం పురాణే పరిమాణత

తద్వక్ష్యామి ప్రసజ్ఞ్యాతం యావద్భి రభిమానిభిః

 అభిమానినో హ్యతీతా యే తుల్యాస్తే సామవేష్వాహ

 దేవాదేవై రతీతాస్తు రూపై ర్నా మభి రేవచ

తస్మాద్ది సామ్ర్పవై రేవై ర్వక్ష్యామి వసుధాతలమ్

దివ్యశ్చ సన్ని వేశ్వై సామవై రేవ కృత్స్నశః

 శతార్ధక్టివిస్తారా పృథివీ కృత్స్నశ స్మృతా 

 భూపరిమాణమ్

తస్యాశ్చార్ధప్రమాణేన మేరో శ్చైవోత్తరోత్తరమ్

పృథివ్యా ఆపి విస్తారా ద్యోజనానాంతు వై పునః

 భూ మేర్మధ్యం ప్రతిదిశం కోటిరేకాతు సా స్మృతా

తథా శతసహస్రాణా మేకోననవతిం పునః

 పజ్చశచ్చ సహస్రాణి పృథివ్యార్దస్య విస్తరః

పృథివ్యా విస్తరం కృత్స్నం యోజనై స్తన్ని బోధత

 తిస్రః కోట్యస్తు విస్తారా తఙ్ఞ్యాతా సా చతుర్దశమ్

 తథా శతసహస్రాణా మేకోనాశీతి రుచ్యతే

 సప్తద్వీపసముద్రాయాః పృథివ్యా స్సలువిస్తరః

 విస్తరా త్రిగుణంచైవ పృథివ్యా స్తస్య మణలమ్

 గణితం యోజనానాంతు కోట్య స్వేకాదశ స్మృతాః

తథా శత సహస్రాణి సప్త త్రింశాధికానితు

 ఇత్యేతద్వై ప్రసజ్ఖ్యాతం వృథివ్యంతరమణ్డలమ్

సప్త ద్వీపములును సప్త సముద్రములును ఆయా భూతములును వాని సంభవ విస్తరమును ఎంతవరకు కలదో అంతవరకును (అంత మేరలో) ఈ సూర్యచంద్రులు తిరుగుచునేయుందురు. పృథివీ విస్తారము ఎంతయని విచారణ చేయవలసివచ్చినచో ఈ చంద్రాదిత్యులు మొదలగువారు పృథివీ వ్యాప్తికి వెలుపల కూడ సంచరించుచునేయు న్నారు. వారి పరిమాణము కూడ పృథివీ పరిమాణము కంటే భిన్నమై ఎక్కువదిగానో తక్కువదిగానో యున్నది. కాని వ్యవహా రార్థమై మాత్రము భూమి ఉన్నంత మేర మాత్రమే సూర్యచంద్రుల ప్యా పియున్నదని భావించి భూమికిగల పరిమాణము నకు తగినట్లే అంతరిక్షపు పరిమాణము కలదని ఎంచవలెను. 'అవ' ధాతువునకును 'ఋ' ధాతువునకును గల అర్థముల ననుసరించి.రవి “రాశినుండి రాశికి సంచరించును " లోకముల నిర్మించును రక్షించును ప్రకాశింపజేయును గావున రవి (ఋ+ఆప్+ ఇ = రవి-ఇయర్తి అవతి ఇతి రవి)' అనబడును.

ఇక మీదట సప్తద్వీప సప్త సముద్ర సహిత భూమండలమున సూర్యచంద్రులగతి ప్రకారమును వారి పరి మాణమును ఈ మొదలగునవి చేప్పెదను. ఈ ‘చంద్ర సూర్యులు' అను నర్థమునందే ‘మహః' అను శబ్దము కూడ నిష్పన్న మగుచున్నది. ‘మహ్యతే ఆయం' 'ఇతడు పూజింపబడును.' 'గొప్పవాడై యుండును.' 'మహీయంతే అనేన జ్యోతీంషి' 'ఇతని చేతనే ఇతర జ్యోతిస్సులు పూజితములగును.' అని 'మహః' అను శబ్దము వ్యుత్పన్న మగుచు న్నది.

లోగడ చెప్పిన భూమండల వైశాల్యమంత యే రవి మండల వ్యాసమని చెప్పెదరు. రవి మండల వ్యాసము తొమ్మిదివేల యోజనములు; దాని చుట్టుకొలత వ్యాసమునకు మూడింతలు; చంద్రుని ప్యాసము రవి వ్యాసమునకు రెండింతలు; భూవ్యాసము (సరాసరి) ఏబది లక్షల యోజనములు. మహా మేరు ప్రాంతమున భూవృత్తము తక్కువగా నుండును. అచ్చట భూవ్యాసము ఈ సగటు వ్యాసములో సగము మాత్రమే. అనగా ఇరువది ఐదు లక్షల యోజనము లుండును. భూగోళపు మధ్య భాగమున వ్యాసము అత్యధికముగా నుండును. అది ఒక కోటి ఎనుబది తొమ్మిది లక్షల ఏబదివేల యోజనము లుండును. భూమికి దక్షిణా త్తరాగ్రముల మధ్య దూరము మూడుకోట్ల డెబ్బది తొమ్మిది లక్షల యోజనములు; దీని (ఉత్తర దక్షిణములుగా ఏర్పడెడి భూవృత్తపు) చుట్టుకొలత పదునొకండు కోట్ల ముప్పది ఏడు లక్షల యోజనములుండును. ఇది భూమికి సంబంధించిన అన్ని విధముల మండలముల వ్యాసమును చుట్టుకొలతలును.

తారకాసన్ని వేశ స్య దీవి యావత్తు మణ్డలమ్

 పర్యాససన్ని వేశస్య భూ మేర్యావత్తు మణ్డలమ్

పర్యాయపరిమాణాభ్యాం భూమే స్తుల్యం దేవం స్స్మృతమ్

 మేరోఃప్రాచ్యాం దిశాయాంతు మానసోత్తరమూర్ధని

 వస్వోక సారా మ హేంద్రపురీ హేమపరిష్కృతా

 ధక్షిణేన పునర్మేరో ర్మానస స్యైవ పృష్ఠతః

 వైవస్వతో నివసతి యమ సంయమనీపురే

ప్రతీచ్యాంచ పునర్మేరో ర్మా నస స్యైవ మూర్ధని

 సునామ పురీరమ్యా వరుణస్యాపి ధీమతః

దిత్యుత్తరాయం మేరోస్తు మానస స్యైవ మూర్ధని

తుల్యామ హేన్దపుర్యాస్తు సోమస్యాపి విభాపురీ

మానసస్యోత్తరే వృషే లోకపాలా శ్చతుర్దశమ్

 స్థితా ధర్మవ్యవస్థార్థం ధర్మసంరక్షణాయచ

సూర్యసఞ్చరకథనమ్

లోకపాలోపరిష్టాత్తు సర్వతో దక్షిణాయనే

 కాషాగతస్య సూర్యస్య గతింతస్య నిబోధత

దక్షిణో(ణా)పక్రమే సూర్యః  షిప్తేషురివ గచ్ఛతి

జ్యోతిషాం చక్ర మాదాయ సతతం పరిగచ్ఛతి

 మద్యత శ్చామరావత్యాం యదాభవతి భాస్కరః

 వై వస్వతే సంయమనే ఉద్యం సత్ర ప్రదృశ్యతే

 సుఖాయా మర్ధరాత్ర్యాంతు విభాగూ మ సమేతిచ

 వైవస్వతే సంయమనే మధ్యాహ్నేతు రవి ర్యదా

 సుఖాయా మథ వారుణ్యా ముత్తిష్ట నతు దృశ్యతే

 విభాయా మర్దరాత్రంతు మాహేంధ్ర్యామ సమేతచ

 సుఖాయా మథ వారుణ్యాం మధ్యా హ్నే చార్యమా యదా

 విభాయాం సోమపుర్యాంతు ఉత్తిష్ఠతి విభావసుః

రాత్ర్యర్ధ మమరావత్యా మ సమేతి యమస్య చ

సోమపుర్యాం విభాయాంతు మధ్యా హ్నే చార్యమా యదా

మా హేంధ్ర్యా మమరావత్యా ముద్గచ్ఛతి దివాకరః

అర్ధరాత్రం సంయమనే వారుణ్యా మ సమేతచ

తారకల (నక్షత్ర గ్రహాదుల) సన్ని వేశమున (అమరిక) కై ద్యులోకమున ఎంత ముడలము కలదో పర్యాసపు (భూమి చుట్టును గ్రహాదికము తిరుగుటకు సంబంధించిన) అమరిక కై భూలోక సమీపమున ఎంత మండలము కలదో అవి రెండును ఒక దానికి మరియొకటి సరిపోవునవిగానే ఉన్న వి. మహా మేరువునకు తూర్పున మానసో తరమను శిఖరమునకు పైభాగమున ‘వస్వోకస్తారా' అను ఇంద్రుని నగరము బంగారు ఆలంకరింపబడినది కలదు. మహా మేరువు నకు దక్షిణముగా మానసో తరమునకు పైభాగముననే కల యముని నివాసమగు 'సంయమనీ'పురము కలదు. మేరువునకు పడమటగా మానసో తరమునకు పైభాగమున “సుఖా' (ప్రాచీన పారసీక నగరమునకు 'సుసా' అని పేరు.) అను నగరము కలదు. ఇట్లే మానసో తరపు పైభాగమున మేరువునకు ఉత్తరమున సోముని 'విధా' నగరము ఉన్నది. ఇట్లు లోకపాలురు నలుగురును లోక వ్యవస్థార్థము (సూర్య సంచార గణనకై) నాలుగు దిక్కులందును . ఆయా నగరము లందు ఉన్నారు. (అని భావించవలెను.) లోకపాలుర కందరకును పైగా దక్షిణాయనమున సూర్యుడు. చివరి దశలో (ఉత్తరాయనము ఆరంభము కాబోవునప్పుడు) అప మండలమున సూర్యుడు - పయనించేడు అశ్విన్యాది నక్షత్ర మార్గమునకు అప మండలమని పేరు) ధనుస్సును వదలిన బాణమువలె మహావేగమున జ్యోతిశ్చక్ర మార్గమున పోపును. అమరావతిలో మధ్యాహ్న మయినపుడు సంయమనమున ఉదయము సుఖా నగరమున అర్ధరాతము విధా నగరియందు అ సమయము జరుగును. ఇట్లే సంయమనమున మధ్యాహ్న మయినపుడు సుఖా నగరమున ఉదయము వికా నగరమున అర్ధరాత్రము అమరావతియంద సమయము. ఇట్లే సుఖా నగరమున మధ్యాహ్న మయినపుడు విధా నగరమున ఉదయము అమరావతియందు అర్ధరాత్రి-సంయమని యంద సమయము; విభా నగరమున మధ్యాహ్న మయినపుడు అమగా వతియందుదయము సంయమని యందర్ధరాత్రి సుఖా నగరమంద స్తమయము జరుగును.

స శీఘ్రమేవ పర్యేతి భాస్కరోలాతచక్రవత్

 భ్రమత్వే భ్రమమాణాని ఋక్షాణి చలతే రవిః

 ఏవం చతుర్ షు పార్శ్వేషు దక్షిణా నేషు సర్పతి

 ఉదయే సమయేచాసా పుత్తిష్టతి పునః పునః

 పూర్వాహ్ణే చాపరాహ్ణేచ ద్వౌతు దేవాలయౌతు సః

 తపత్యేకంచ మధ్యాహ్నే మధ్యా హ్నే తాభిరేవచ

 ఉదితో వర్దమానాభి ర్మధ్యాహ్నే న తపతే రవిః

ఆతః పరం హ్రస గ్రీభి రోభి రసం స గచ్ఛతి

 ఉదయా సమయాభ్యాంతు స్మృతే పూర్వాపరేతు వై

 యద్వత్పురస్తా తపతి తద్వత్పృషే తు పార్శ్వయోః

యత్రోదయస్తు దృశ్యత తేషాం న ఉదయ స్స్మృతః

 ప్రణాశం గచ్ఛతే యత్ర తేషామ స్త స్సఉచ్యతే

 సర్వేషాం తూత్తరే మేరు ర్లోకాలోకస్తు దక్షిణే

విదూరభా వా దర్కస్య భూమే ర్లోకాగతస్యచ

 హ్రియంతే రశ్మయో యస్మా త్తేన రాత్రౌ న దృశ్యతే

 ఊర్ద్వం శతసహస్రాంశుః స్థిత స్తత ప్రదృశ్యతే

 ఏపం పుష్కరమధ్యేన యదా భవతి భాస్కరః

అంశాంశకంచ  మేదిన్యాం ముహూ రేన స గచ్ఛతి

 యోజనానాం సహస్రస్య ఇమాం సజ్జ్యాం నిబోధత

 ఊర్ధ్వం శతహసప్రాణా మేక  తింశ చ్చ సా స్మృతా

 పజ్చశచ్చ సహస్రాణి తథాన్యా న్యధికాని చ

మౌహూర్తికీ గతిర్జ్యేషా సూర్యస్యతు విధీయతే

 ఏతేన క్రమయోగేన యదా కాష్ఠంతు దక్షిణామ్

పరిగచ్ఛతి సూర్యోసౌ మాసం కాష్టాంతమేవహి

 మధ్యేన పుష్కరస్యాథ భ్రమతే దక్షిణాయనే

మానసోత్తర మేరోస్తు ఆ నరం త్రిగుణంతు తత్

 సర్వతో దక్షిణాయాంతు కాష్ఠాయాం తన్ని బోధత

సవకోట్యః ప్రస్యతా యోజనైః పరిమణ్డలమ్

 తథా శతసహస్రాణి చత్వారింశ చ్చ పఞ్చచ

అహోరాత్రా త్పతజ్గస్య గతిరేషా విధీయతే 

ఇట్లు సూర్యుడు నిరంతరమును అలాత చక్రమువలె కోరవి గిర గిర త్రిప్పుటచే ఏర్పడు చక్రమువలె తిరుగుచునేయుండును. దక్షిణము వరకు గల దిక్కులందును ఈ చెప్పిన క్రమమున తిరుగుచు సొ రేవలే తిరుగు (గుండ్రముగానున్న ) నక్షత చక్రమున అతడు నడచుచుండును. పూర్వాహ్న మధ్యాహ్నా పరాష్ట్ర కాలములందు వేరు వేరు స్థితులలో ఉండు కిరణములతో భూమిని తపింప జేయును. ఎట్లన ఉదయమునుండి అతని కిరణముల తాపము అధిక మగుచు మధ్యాహ్న మునకు అత్యధికమగును. అప్పటినుండి క్రమముగా తగ్గుచు పోవును.

సూర్యోదయ సమయముల బట్టియే తూర్పు మొదలగు దిక్కుల వ్యవస్థ జరుగును. సూర్యుడుదయించు చున్నట్లు కనబడు దిశ ఉదయదిశ (అక్కడి వారికది తూర్పు). 'ఆస్తమించుచున్నట్లు కనబడు దేశ అ స్తదిశ (అక్కడి వారికది పడమర.). అన్నిటికంటే ఉత్తరమున మేరువు-ఆన్నీ టికంటే దక్షిణమునందు లోకాలోకము (పర్వతము) ఉన్నట్లు భావన చేయవలయును; భూమియందలి ఒక భాగమును పూర్తిగా వదలి మరియొక విదూర - భాగమునకు పోవుట వలన సూర్యుడు అక్కడి వారికి రాత్రులందు కనబడడు. ఏ 'భూభాగము నకు అతడు పోవునో అక్కడ నూరు వేల కిరణములు కలవాడై ఆకాశపు ఉచ్చ స్థానమున అక్కడి వారికి కనబడును. అది వారికి పట్టపగలు.

సూర్యుడు ఒక ముహూర్త కాలములో కొన్ని ‘అంశ’ (12) భాగలదూర మాకాశమున పయనించును. ఇది ముప్పది. యొక లక్షల ఏబది వేల యోజనములగును. ఇది ముహూర్త (రెండు గడియలు = 48 నిమిషములు) కాలములో రవి గమన వేగము. ఈ గతిలో పయనించుచు రవి దక్షిణ దిశకుపోయి మాఘమాసమున- దక్షిణాయన గతిని వదలి పుష్కరద్వీప మధ్య భాగమున సంచరించుచు మేరుపర్వతమున మానసోత్తర శిఖరప్రాంతమునకు వచ్చుసరికి అచ్చట క్రాంతిమండల పరిమాణము విషువ మండలమునందు ఉండుదానికి మూడింతలగును. రవి ఒక అహోరాతము లో పయనించు దూరము తొమ్మిదికోట్ల నలువది లక్షల యోజనములగును. (3150000*30=94500000)

దక్షీణా ద్వినివృత్తాసౌ విషువస్థో యదా రవిః

క్షీరోదస్య సముద్రస్యోత్తరతోపి దిశశ్చర

 మణ్డలం విషవే చాపి యోజనై స్తన్ని బోధత

 తిస్రఃకోట్యస్తు సమ్పూర్ణం విషువస్యాపి మణలమ్

 తథా శతసహస్రాణి వింశత్యేకాధికాపునః

 శ్రావణే చోత్తరే కాష్ఠం చిత్రభాను ర్యదా భవేత్

 గోమేదకస్య ద్వీపస్య ఉత్తరాం చ దిశం చరక్

 ఉత్తరాయాః ప్రమాణేతుః కాష్ఠాయా మణ్డలస్యతు

 యోజనానాం ప్రసంఖ్యాతా కోటిరేకాతు సా ద్విజాః

 అశీతి ర్ని యుతానోహ యోజనానాం తథైవచ

 అష్ట పంచాశతంచైవ యోజనా న్యధికానీతు

దక్షిణోత్తరమధ్యాని తాని విన్ద్యా ద్యథాక్రమమ్

స్థానం జరద్ధవం మధ్యే తథై రావతము త్తరమ్

 వైశ్వానరం దక్షిణతో నిర్దిష్టమిహ తత్త్వతః

 నాగవీథ్యుత్తరావీథి రజవీథిస్తు దక్షిణే

 అశ్వినీ కృత్తికా యామ్యా నాగవీథి స్త్రయ స్స్మృతాః

రోహిణ్యాౄ మృగశిరా గజవీథితి స్మృతా

 పుష్యాశ్లేషా పునర్వస్వో ర్వీథి శ్చైరావతీ స్మృతా

 తిసస్తు వీథ యో హ్యేతా ఉత్తరో మార్గ ఉచ్యతే

 పూర్వఉత్తరఫల్గున్యౌ మఖాచై వార్ష భాభ వేత్

 పూర్వోత్తరా ప్రోష్ఠపదే గోవీథీ రేవతీ స్మృతా

 శ్రవణంచ శ్రవిష్టాచ వారుణం వా జరద్దవమ్

ఏతాస్తు వీథయ సత్ర మధ్య మో మార్గ ఉచ్యతే

హస్తా చిత్రా తథా స్వాతీ అజ వీథిరితి స్మృతా

 విశాఖా మైత్రమైౄంచ మృగవీథి రిహోచ్యతే

 మూలపూర్వోత్తరాషాడా వీథి ర్వైశ్వానరీ స్మృతా

 స్మృతా ప్రీప్రస్తు వీథ్యస్తా మా రేవై దక్షిణే పునః

 కాష్ఠయో ర నరం త్వేత ద్వక్ష్యతే యోజనైః పునః

 ఏత చ్ఛత సహస్రాణా మేక వింశత్తు వై(సహస్రాణా మేకత్రింశత్తు) స్మృతమ్

 శతాని త్రీణి చాన్యాని త్రయస్త్రింశ చ్చ యోజనైః

 కాష్ఠ యో ర నరం చైత ద్యో జనానాం ప్రకీర్తితమ్ 

దక్షిణదిశ నుండి మరలి సూర్యుడు విషువ మండలము (రాత్రింబవళ్ళు సమముగానుండు కాలమును ఏర్పరచు కాంతి వృత్త భాగము) లోనికి వచ్చియుండి అచటినుండి క్షీరోద సముదమునకు ఉత్తర దిశగా సంచరించ నారంభించునపుడు ఆ విషువ మండలపు యోజన పరిమాణము మూడుకోట్ల ఇరువది యొక లక్షలు; శ్రావణమాసమున రవి కాంతిమండలమునకు ఉత్తరమున గోమేద ద్వీపమునకు ఉ తరమున పయనించునపుడు అచ్చట మండలపు పరి మాణము ఒక కోటి ఎనుబది లక్షల ఏబది ఎనిమిది యోజనములు.

 అప మండలము అనబడు నక్షత్రచక్రము దక్షిణ భాగము ఉత్తర భాగము మధ్య భాగము అని మూడు భాగము లగును. మధ్యభాగమునకు జరచవస్థానము-ఉత్తర భాగమునకు ఐరావత స్థానము దక్షిణ భాగమునకు వైశ్వానర స్థానము అని పేరులు. స్థానమును పథము అని కూడ వ్యవహరింతురు. ఒక్కొక్క భాగములో మరల మూడేసి ఉపభాగ ములు ( వీథులు) కలవు. వానిలో నాగ వీథి ఉత్తర భాగమందును అజవీథి దక్షిణ భాగమునందును వచ్చును. ఆశ్వని - కృత్తిక -భరణి - నాగవీథి; రోహిణి- ఆర్ద్ర-మృగశిర-గజవీథి; పుష్యమి, ఆశ్లేష-పునర్వసు-ఐరావత వీథి; ఈ మూడు వీథులును కలిసి ఉత్తర మార్గము; పుబ్బ-ఉత్తర-మఖ - ఋషభ వీథి; పూర్వాభాద్ర - ఉత్తరాభాద్ర - రేవతి - గో వీథి; శ్రవణము -ధనిష్ఠ - శతభిషము- జరద్గవవీథి; ఈ మూడును కలిసి మధ్యమమార్గము; హస్త-చిత్ర-స్వాతి-అజవీథి; విశాఖ. ఆనూరాధ జ్యేష్ఠ - మృగవీథి; మూల-పూర్వాషాడ-ఉత్తరాషాడ వై శ్వానర వీథి; ఈ మూడును కలిసి-దక్షిణమార్గము. [ఇచట ఇతర పురాణములలో వేరు విధముగా నున్న ది.ఎట్లన-మఖ-పుబ్బ-ఉత్తర-ఋషభవీథి; హస్త-చిత్ర.స్వాతి-గోవీధి; విశాఖ-అనూరాధ  జ్యేష్ఠ జరద్దవవీథి; ఇది మధ్యమమార్గము; మూల-పూర్వాషాడ,ఉత్తరాషాడ-అజవీథి; శ్రవణము.ధనిష్ఠ శతభిషము -మృగవీథి; పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర-రేవతి - ఈ మూడును కలిసి వైశ్వానర వీథి అని యున్నది.

- అనువాదకుడు]

విశేషము: నాగ వీథి మొదలగు జ్యోతిర్వ్యవస్థ విషయమున శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారు ఇట్లు చెప్పి యున్నారు.

'వ్యాసవాణి' (ఆంధ్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ వారి ప్రచురణ) యందలి ‘ఆర్ష విజ్ఞానము' అను వ్యాసము నుండి:

జ్యోతీరూపము

“ముమొదట విష్ణువాయు మత్స్య పురాణములు ఈ దేవయానమునకు రూపకల్పన మొనరించెను. పిదప భాగవ తాదులు దీని ననుసరించెను.

'ఉత్తరం యదగస్త్యస్య ఆజవీథ్యాశ్చ దక్షిణమ్

 పితృయాణం సవై పంథా వైశ్వానర పఠా ద్బహిః

'నాగవీథ్యుత్తరం యశ్చ స పర్షి భ్యశ్చ దక్షిణమ్

 ఉత్తరః సవితుః పంథాః దేవయానశ్చ సస్మృతః'

పథ మన నేమి? వీథి యన నేమి? ఒక్కొక్క గ్రహమునకు మూడేసి స్థానము లున్నవి. ఉత్తరమున ఐరా వతము-దక్షిణమున వైశ్వానరము-నడుమ జారదపము; ఇవి మూడును పథములు; లేక మార్గములు; ఈ మూడిటికిని మరల మూడేసి వీథులు కలవు; ఒక్కొక్క వీథిలో మూడేసి నక్షత్రము లున్న వి.

వాయు విష్ణు పురాణము లీ యెడ సమానములు; మత్స్య పురాణము 124 అధ్యాయమున 52 నుండి 60 వరకు శ్లోకములు చూచునది; అందు కొంచెము . మార్పు కలదు; నక్షత్ర వీథి మార్గములు: - ఆశ్వని-భరణి - కృత్తిక-నాగవీథి; 2. రోహిణి-మృగశిర-ఆర్గ-గజవీధి; పునర్వసు, పుష్యమి, ఆశ్లేష-ఐరావతవీథి; ఈ మూడును ఐరావతపథము; 1. మఖ - పుబ్ప. ఉత్తర వృషభవీథి; 2. హస్త.చిత్ర.స్వాతి.గోవీథి; 8. విశాఖ. అనూరాధ జ్యేష్ట-జారడవవీథి; ఈ మూడును జరద్దవ పథము; 1. మూల పూర్వాషాఢ - ఉత్తరాషాఢ అజవీధి; 2. శ్రవణము-ధనిష్ట-శతభిషము-మృగవీథి; 8. పూర్వాభాద్ర-ఉత్తరా భాద్ర, రేవతి- వైశ్వానర వీథి; ఈ మూడును వైశ్వానర పథము; ఇవి వరుసగా ఉత్తర మధ్యమ దక్షిణ పథములు;

గర్గ మతానుసారము భరణి - కృత్తిక స్వాతి. నాగ; రోహిణి-మృగశిర ఆర్ద-గజ; పున-పుష్య.ఆ శ్లే-ఐరావత; (ఉ-మా.) మఖ, పుబ్బ ఉత్తర-వృషభ, అశ్వ-రేవ-పూ- భా; ఉభా గోవీథి; శ్ర-ధశత జరద్దవ; (మధ్యమమార్గ); అనూ-జ్యే. మూల-మృగ; హస్త-విశా-చిత్ర.అజ; పూషా-ఉషా-వైశ్వానర; దక్షిణ మార్గ); భరణ్యాది మఖాంతము ఉత్తర మార్గము. పూర్వఫల్గున్యాది మూలాంతము మధ్యమమార్గము; పూర్వాషాఢాదిగ అశ్విన్యంతము దక్షిణమార్గము - అని వరాహ మిహిరుడు.” అని.

అపమండలపు రెండు ఆంచుల నడుమ దూరము లేదా అపమండల వృత్తవ్యాసము-ఇరువదియొక లక్షల మూడు వందల ముప్పది యోజనములు.

కాష్ఠయో ర్లేఖయోశ్చైవ అయనే దక్షిణా త్తరే

 తద్వక్ష్యామి ప్రసజ్ఞ్యాయ యోజనై స్తన్ని బోధత

ఏకై క మ నరం తద్వ దుక్తాన్యేతాని సప్తభిః

సహస్రై రవియుకాని తతోన్యైః పజ్ఞ్చవింశతిః

 లేఖయోః కాష్ఠయో శ్చైవ బాహ్యాభ్య నర యో శ్చరక్

 ఆభ్య నరం స పర్యేతి మడ్డలా న్యుత్తరాయణే

 బాహ్యతో దక్షిణేచైవ సతతం సూర్యమజ్ఞలమ్

చరనశ్చాడుడీ చ్యాంతు అశీతిం మణలం శతమ్

 తరణీర్ధ క్షణే తావ డమతే మడ్డలానితు

 ప్రమాణం మణ్డలస్యాపీ యోజనానాం నిబోధత

యోజనానాం సహస్రాణి దశ చాప్టో తత స్స్కృత :

 ఆధికా న్యష్టపడ్చాక ద్యో జనానితు వైపునః

 విష్కమ్భో మట్టిల స్యైవ తిర్యక్సతు విధీయతే

 అహస్తు చరతో నాభే సూర్యోపై మఱ్ఱలక్రమాత్

 కులాలచక్రపర్యన్తో యథా చక్రీ రవి స్తథా

దక్షిణే చక్రవత్పూర్య స్తథా శీఘం నివర్తతే

 తస్మా త్ప్రకృష్టాం భూ మంతు కాలేనాల్పేన గచ్ఛతి

 సూర్యో ద్వాదశ భిశీఘం ముహూర్తె ర్దక్షిణాయనే

 త్రయోదశార్ద మృక్షాణాం మధ్యే చాంతర మణ్డలమ్

ముహూ రైస్తాని ఋక్షాణి తావదషాద శై శ్చర

 కులాలచక్రమధ్యస్థో యథా మనం ప్రసర్పతి

 ఉద గానే తథా సూర్య స్సర్పడే మన్దవిక్రమః

 తస్మా ధీరేణ కాలేన భూమిం సోల్పాం ప్రసర్పతి

సూర్యో ద్వాదశభి శీఘం ముహూర్తె ర్దక్షిణాయనే

 సూర్యోష్టాదశభి రహో ముహూర్తె రుదగాయనే

త్రయోదశార్దం మధ్యేతు కాష్టానాం చర తే రవిః

 ముహూర్తై స్తాని ఋక్షాణి రాత్రౌ ద్వాదశ శ్చర

 తతో మందతరం తాభ్యాం చక్రంతు భ్రమతే తతః

ఉత్తరాయన దక్షిణాయన రేఖల నడుమ అపమండలపు బయటి అంచులకు సమాంతరముగా ఉండుచోట ఏడు వేల ఇరువది యేడు - జనము లుండును. రవి ఆపమండలపు అంచులను దాటక ఉత్తరాయన దక్షిణాయన రేఖల నడుమ సంచరించుటతో ఉత్తరాయసమున ఈ మండలమునకు లోపలివైపుగాను దక్షిణాయనమందు ఈ మడలమునకు వెలుపలగాను సంచరించును. అతడు చేయు మండల వాస పరిమాణము పదునెనిమిది వేల ఏబది ఎనిమిది యోజనములు. సూర్యుడు పగళ్లయందు ధ్రువుని చక్ర నాభిగా చేసికొని కులాలచక్రము (కుమ్మరి-సారె) తిరుగు నపుడు .ఆ చక్రపు ఆంచు ఆ చక్రపు నాభి పై ఆధారపడియు ఒక వైపు క్రిందికి తొలుచు మరియొక వైపు పైకి లేచుచు తిరుగునట్లు తిరుగుచుండును. దానిచే రవి దక్షిణాయనమున ఎక్కువ దూరమును తక్కువ కాలములోనే అతి కమించును. అనగా పదుమూడున్నర నక్షత్రము లంత దూరమును (180 డిగ్రీలు) పండ్రెండు ముహూర్తముల కాలములోనే సంచ రించును. ఆ తరాయనమునందు గమన వేగము తగ్గి రవి ఇదే పదుడూడున్నర నక్షతముల దూరమును దాటుటకు పదు నెనిమిది ముహూర్తముల కాలము పట్టును. ఉత్తరాయనమునగాని దక్షిణాయనముగాని పగటి గతికి పోగా మిగిలిన కాలము రాత్రి గతికి పట్టును. మొ త్తము మీద అహోరాత్ర పరిమాణము ముప్పది ముహూర్తములు సరిపోవును. (30 ముహూర్తములు = 24 గంటలు).

మృత్పిణ్డఇవ మధ్యస్థో క్రమతే సౌ ధ్రువ స్తథా

ముహూర్తై స్త్రింశతా తావ దహోరాత్రం ధ్రువో భ్రమ

 ఉభయోః కాష్ఠయోర్మధ్యే శ్రమలే మణ్డలానీతు

 ఉత్తరక్రమణా త్తస్య దీవా మన్గగతి స్తత

 తస్యైవతు పునర్న క్రం శీఘ్ర సూర్యస్య వై గతిః

 దక్షిణక్రమణేచాపి, దివా శీఘం విధీయతే

 గతిస్సూర్యస్య వైనక్రం మద్ఘాజాపి పునస్స్మృతా

ఏవం గతివిశేషేణ విభజు నాత్ర్యహానితు

 అథ (జ) వీభ్యాం దక్షిణాయాం లోకాలోకస్య చోత్తరే

 లోకసస్తానతో హ్యేష వైశ్వానర పథా ధృవీ

పృషే యాతు సభా సౌరీ పురస్తాత్సమవర్తతే

పార్శ్వేభ్యో బాహ్యతస్తావుల్లోకాలోక స్పపర్వత

యోజనానాం సహస్రాణి దశోర్ధ్వం చోచ్ఛితో గిరిః

 ప్రకాశ శ్చాప్రకాశ శ్చ సర్వతః పరిమజ్ఞలమ్

 నక్షత్రచౄసూర్యాశ్చ గ్రహా స్తారాగజై స్సహ

ఆభ్య నరే ప్రకాశ నే లోకాలోక స్య వైగి రేకె

 ఏతా వానేవ లోకస్తు నిరాలోక స్తతఃపరమ్

 లోక ఆలోకనే ధాతు ర్నిరాలోక స్వలోకతః

కాలభాగాదిక థనమ్

 లోకాలో కౌతు నన్ద తే యస్మా తూర్యః పరి భ్రమః

తస్మా త్సవ్యేతి లామాహురుషా వ్యుష్యో రథా నరమ్

 ఉషా రాత్రిః స్మృతా వివై ర్వ్యుషా చాపి దినం స్మృతమ్

త్రింశత్కలా ముహూర్తస్తు అహ స్తే దశ పణ చ

 ప్రోసో వృద్ధి రహర్భాగై ఢివసానా మథో భువి

సంధ్యా ముహూర్తమా తాయా ప్రసవృద్ధితు తే స్మృతే

లేఖాప్రభృత్యథాదిత్యం త్రిముహూర్తం విదుర్బుధాః

ప్రాతఃకాల మథో విప్రా భాగశ్చాహ్న స్స పఇమః

 తస్మాత్సవకాలోహి ముహూర్తా స్సజ్ఞతా స్త్రయః

మధ్యాహ్నే త్రిముహూర్తాశ్చ తస్మాత్కాలా దన నరమ్

 తస్మా న్మధ్యస్టినా త్కాలా ఉపరాష్ట్ర ఇతి స్మృతః

త్రయఏవ ముహూర్తాస్తు సన్గ్యా కాలః స్స్మృతో బుధైః

అపరా హై వ్యతీత్తు కాల సాయం తదుచ్యతే

 దశ పళ్చి ముహూర్తాఒళ్నో ముహూర్తా స్త్రయ ఏవచ

 దశపజ్చముహూర్తా వై అహస్తు విషవం స్మృతమ్

 వర్గత్యహో రాత్రభూతో అయనే దక్మిణోత్తరే

 అహస్తు గ్రసతే రాత్రిం రాత్రిస్తు గ్రసతే త్వహః

 శరద్వస స్తయోర్మధ్యే విషువంతు విధీయతే

 ఆ లోకత స్స్మృతో లోక అలోకోలోక ఉచ్యతే

లోకపాలా స్థ్సితా స్తస్య లోకాలోకస్య మధ్యతః

రవి ఇట్లు కుమ్మరి చక్రపు అంచువలె క్రిందికి మీదకు వాలుచు లేచుచు తిరుగుచుండినను ఈ జ్యోతిర్మండలము నకు కేంద్ర స్థానమున చక్రపు నాభివలే నున్న ధ్రువుడు మాత్రము కుమ్మరి సారె నడుమ నాభి పై కుండ చేయుటకై ఉంచిన మట్టి ముద్దవలే వాలుట లేచుటలు అంతగా లేక గమనింప సాధ్యముకాని తక్కువ వేగమున తిరుగుచుండును. ఐనను అతడును ఆపమండలపు రెండు అంచులకు నడుమ మండలాకృతి నేర్పరచు భాగల గతితో కొలదిగ పొలుచు లేచుచు తిరుగుచుండును. అతని ఈగతి భేదము వలననే అతనితో బంధింపబడి. చక్రపుటంచువలే తిరుగు. సూర్యుని గతి ఉత్తరాయనమున పగలు మందముగను రాత్రి చురుకుగను దక్షిణాయనమున పగలు చురుకుగను రా, తులందు, మందము. గను సాగును.

ఇట్లు రాత్రింబవళ్ళను తన గతి విశేష వశమున విభజించుచు రవి దక్షిణమందలి అజ వీథియందు లోకాలోక పర్వతమునకు ఉత్తరమున లోక శ్రేణికి వెలుపలను వైశ్వానర వీథికి వెలుపలను కూడ సంచరించుచుండును. సూర్యుడు లోకాలోక పర్వతమునకు వెనుక వైపున నున్నపుడు అతని కాంతి ముందు వైపున ప్రసరించును. ఈ చెప్పిన ఆజవీథి మొదలగు వానికి ప్రక్క ఆంచుల కవతలగా లోకాలోక పర్వతము ఉన్నది. దాని ఎత్తు పదివేల యోజనములు. నక్షత్రములు చంద్రసూర్యులు గ్రహములు మొదలగు జ్యోతిర్దేశములన్నియు ఈ లోకాలోక పర్వతమునకు లోపలివై పున మాత్రమే నంచరించగలవు; తమ వెలుగును ప్రసరింపజేయగలవు. ఈ పర్వతమునకు అవతలివైపు ఆలోక ము వెలుతురు లేదు. ఇట్లు దీనికి ఒక వైపున ఆలోకము చూపు-చూచుటకు అవకాశము-(ప్రకాశము) ఉండుట చేతను నురియొక వైపున అది లేకపోవుట చేతను ఈ పర్వతమునకు లోకాలోకమని పేరు ఏర్పడేను. లోకము-వెలుతురు; ఆలోకము-చీకటి; రవీ. నంచారము ఈ రెంటికిని సంధానము కలిగించును. కనుక అతనిచే చెలుగు చీకటులకు సంధి నము కలిగించబడు సమయమును 'సంధ్యా' కాలము అందురు. ఉషా-వ్యుషా (వ్యుషి) అను ననుయముల ఆంతరమునకు (మధ్యకాలమునకు) 'సంధ్యా' అని పేరు. ఏలయన. ' ఉషా' అనగా రాత్రి; వ్యుషా అనగా పగలు; ఈ రెంటి నంది కాలము ‘సంధ్యా' కాలము; (ఇది వైదిక సంప్రదాయానుగతమగు వ్యుత్పత్తియును అర్థమును.)

ముప్పది 'కల'ల కాల పరిమాణమును ముహూర్తమందురు. పదునైదు ముహూర్తములు దీవ పరిమాణము; (ఇదీ విషువ దినమున); కానీ పగటి పరిమాణమునందు పెరుగు తరుగులు వచ్చుటచే ఈ పరిమాణములో మార్పులు ఉండును. సాధారణముగా సంధ్యా కాలము (ఇంచుమించు) ముహూర్తకాలమగును. దాని పరిమాణమునందును కాల భేదమును దేశ భేదమును రవి గతి భేదమును బట్టి మార్పులు కలుగవచ్చును.

సూర్యుడు లేఖ మీదకు (క్షితిజము = లేఖ=Horizon) వచ్చినది మొదలు మూడు ముహూర్తముల కాలము ప్రాతః కాలము; తరువాత మూడును సంగవ(మ) కాలము; తరువాత మూడును మధ్యాహ్నము; తరువాత మూడును ఆపరాహ్ణము; తరువాత మూడును సాయంకాలము; పగటి పరిమాణమునందును రాత్రి పరిమాణమునందును పెరుగు తరుగులు వచ్చినను సాధారణ విషువ దిన పరిమాణము ఈ పదునైదు ముహూర్తములే; ఉత్తరాయన దక్షిణా యన క్రమములో దీని మార్పులు లోగడ చెప్పబడినవి. ఆ అయన భేదములను బట్టి పగలు రాత్రిని తనలోనికి తీసి కోనుటయు.రాత్రి పగటిని తనలోనికి తీసికొనుటయు జరుగును. శరద్వసంత ఋతువుల నడుమను వసంత శరద్ ఋతుపుల నడుమను మొ త్తము రెండు మారులు విషువ దీనములు వచ్చును,

చత్వార స్తే మహాత్మాన స్తిష్ఠస్త్యాభూత సమ్ల్పవమ్

సుధామ శ్చైవ వై రాజః కర్దనుశ్చ ప్రజాపతిః

 హిరణ్యరోమా పర్జన్యః కేతుమా బ్రౌజసత్తమః

నిర్వశ్వో నిరభీమానీ నిర్మమో నిష్పరిగ్రహః:

 లోక స్యమధ్యే తపాలా స్సైతా స్వేతే చతుర్దీశమ్

 ఉత్తరం యదగ స్త్యస్య శృజం దేవని షేవితమ్

 పితృయాన స్మృతః పగ్గా వైశ్వానరపథా దృహిః

 త తొసం స్తే ప్రజా కామా ఋషయో హ్యగ్నిహోత్రిణః

లోక స్య సన్తానకరా పితృయానే పథి స్థితాః

 భూతార మకృతం కర్మ హ్యాషశ్చ విశామ్పలే

ఆర భ క్తే లోకమా స్తేషాం పర్ణా స్సదక్షిణః

 చర స్త్రీ తే పర ధర్మంస్థాపయ న్తి యుగేయుగే

*సతతం తపసా చేప చోదనాభిశ్రీతేన చ

 ఇచ్ఛో ద్వేషకృత శ్చైవ మైథునోపగతాశ్చ వై

 తథా కామకృతేనైవ సేవనా ద్విషయస్యచ

జాయమానాస్తు పూర్వేచ పశ్చిమానాం గృహేషుతే

 పశ్చిమా శ్చైవ పూ ర్వేషాం జాయ నే నిధనేష్విహ

 ఏవ మావర్తమానాస్తే వర్తస్త్యాభూతసమ్ల్పవమ్ 

(*సంతత్యా తపసా చైవ మఠ్యాదాభిస్మృతేన చ)

ఆలోకము- వెలుగు- కలది- లోకము అనబడును; ప్రకాశములేని దానిని ప్రకాశముకాని దానిని అలోక మందురు. ఇట్టి రెండు స్థితులును కలది లోకాలోక పర్వతము. దీని నడుమ (లోకాలోక మనేడు చక్రవాళ పర్వతమునకు నడుమ) లోకపాలురు సలుపుచున్నారు. వీరు భూత సంప్లవ-ప్రాకృతిక ప్రళయకాలము వరకు ఉండి లోక ప్రవృత్తికి ప్రవర్తకులుగా నుందురు. వీరు ఎవరనగా1. వైరాజుడు-విరా టత్వమునుండి జనించిన సుధాముడు 2.కర్దమ ప్రజా పతి 3. హిరణ్యరోముడనేడు పర్జన్యుడు 4. కేతుమాన్- ఆను రాజశ్రేష్ఠుడు అనువారు; వీరిలో ప్రతియొక రును ద్వంద్వము లకు సంబంధించిన చిత్తవృత్తులును వానివలని బాధలును లేని ద్వంద్వాతీ-కులు; అహంకార మమకారాద్యభిమానములు లేనివారు; పరిగ్రహము.తమకు ఇదిలేదని ఏ వస్తువునైన ఒకరినుండి ఆడిగి కాని అడుగక యేకాని తీసికొనుట-లేనివారు; వీరు ఈలోక మధ్యమందు చతుర్దిశలయందుండి లోక ప్రవృత్తి నిర్వర్తించుచుందురు.

ఉత్తర దిశ యందు దేవతల .కాశ్రయమగు ఆగ స్త్య శృంగముక లదు. . ఆది వీరికాశ్రయము. వీరందరును ప్రవృత్తి మార్గ ప్రవర్తకులై పితృయాన పథ ప్రవృత్తులై యుందురు. ఆ ప్రవృత్తికి మూలమయినదే ఈ కాలవ్యవస్థ యును కాలనియమము నాశ్రయించిన కర్మ వ్యవస్థయును. ఈ ఖగోళ వ్యవస్థను తెలియుట వలన ఒక ప్రయోజనము ఈ కర్మ మార్గ ప్రవృత్తి.

ఈ యంశమును సంప్రదాయము ఇట్లు ప్రతిపాదించుచున్నది.

 వైశ్వానర పథమునకు వెలుపల పితృయాణమను మార్గము కలదు. ప్రజా కాములు తమకు పుత్ర పౌత్రాది సంతతి కావలయునని కోరువారు) అగు అగ్ని హోత్రోపాసకులు (శ్రిత కర్మానుష్టాతలు) అగు ఋషులు ఆ మార్గమునందు ఉందురు. వీరు లోక సంతానకరులు సంతానము.ఎడ తెగక కొనసాగుచుండుట) గా నుందురు.. వీరు "పితృయాణ మార్గమందుండి భూతారంభకారులు (పర మేశ్వర మాయాశ కి వశమున ఆయా జీవుల కామ కర్మానుసారము భూత భౌతిక సృష్టిని కలిగించునది) అగు కర్మలను ఆచరించుచు తమతమ ఆషములను కామనలను ఆశ్రయించి తమకు ఆయా ఇహపర లోక సుఖములు కావలెనని కర్మల ననుష్ఠించుచుందురు. వీరు అనుసరించు ఈ ప్రవృత్తి మార్గము దక్షిణ మార్గము. వీరు యుగయుగమున ఉత్కృష్టమగు వైదిక ధర్మమును ఆచరింతురు. దానిని లోకమున ప్రతి ప్లింతురు. ఈ ధర్మ ప్రవర్తనమునకై తపస్సును (దీనినే జ్ఞానమని శ్రీశంకర భగవత్పాదాదులనిరి.) చోదనాభిశితమయిన కర్మానుష్టాన మార్గ మును పాటింతురు. - ('స్వర్గము కోరువారు జ్యోతిప్టోమయాగముతో దేవతల నారాధించవలెను.') ఈ మొదలగు రూపములతో నుండు కర్మాచరణ ప్రేరణమును చోదన, అందురు. ఈ చోదన నాశ్రయించిన మార్గము చోదనాభిశిత మార్గము). వీరి చిత్తములందు ఇచా ద్వేషములు. మైథున ప్రవృత్తి.కలవు. వీరు కామమునకు.కర్మాను షానమునకు వశులై విషయ సుఖములు సేవించుచు ఉ తమ జీవులు కూడ అధమ జీవుల గృహము దేహము) లందును జనింతురు; అధమ జీవులును ఉత్తమ జీవుల గృహము- (దేహము) లందు జనింతురు; ఈ విధముగ వీరు ప్రాకృతిక ప్రళయము జరుగు వరకు జన్మ మరణ పరంపర లో ఆవృత్తి. నొందుచుందురు.

అష్టారీతిసహస్రాణి ఋషీణాం గృహమేధినామ్

 సవితు ర్దక్షిణం మార్గ మాశ్రిత్యాభూతసమ్లవమ్

 క్రియావతాం ప్రసంఖ్యేషా యే శ్మశానాని భేజిరే

 లోకసంవ్యవహారార్థం భూతానాం ప్రకృతేనచ

 ఇచ్చాద్వేషకృతాచ్చైవ మైథునోపకమాచ్చవే

తథా కామకృతేనేహ సేవనా ద్విషయస్యచ

 ఇత్యేతైః  కారణై స్సిద్ధా శ్శ్మశానానీహ బేజారే

 ప్రజై షిణ సప్తర్షయో ద్వాపరేష్వాహ జజ్జీరే

 పన్తతిం యే జుగుప్స నే తస్మా నృ్మత్యు ర్జితస్తు తైః

 అష్టాశీతిసహస్రాణి తేపా మప్యూర్ధ్వరేతసామ్

 ఉదకమంథాన మత్యర్ధ మా శిత్యాభూతసమ్లవాత్

 అసంప్రయోగాల్లోకస్య మైథునస్య చ వర్జనాత్

 ఇచ్ఛాద్వేష నివృత్త్యాచ భూతారమ్భవిసర్జనాత్

 ఇత్యేతై కి కార జై శ్శుద్ధి క్షేమృతత్వంచ భోజిరే

 ఆభూతసమ్ల్పవస్థాన మమృతత్వం విభావ్యతే

త్రైలోక్యస్థిత కాలోహి నపునర్మార్గగామినామ్

భూణహత్యాశ్వమేధోచ పాపపుణ్య నిభౌ పరమ్

 ఆభూతసమ్లవా నేతు సంక్షయే చోర్ధ్వరేతసామ్

 ఊర్ధ్వాన్తరమృషీభిస్తు ధువో యత్రతు సంస్థితః

ఏత ద్విష్ణుపదం దివ్యం తృతీయం వ్యోమ్ని భాస్కరమ్

 యత్ర గత్వా న శోచ స్తి తద్విష్ణోః పరమం పదమ్

ధర్మే ధూవస్య తిష్టని యేతు లోకస్య కాక్టిణః

ఇతి శ్రీమత్స్య మహాపురాణే ఖగోళే సూర్యసఞ్చారాదికథనం నామ  త్రయోవింశత్యుత్తరశతత మోఽధ్యాయః

 కామనతో హిరణ్య గర్భోపానన చేసినందున సూర్యుని దక్షిణాంశ మగు చం దలోక మువరకు మాత్రమే పోగలుగు దక్షిణ మార్గాశ్రితులు అగు ఋషులు గృహస్థులగు వారు ఎనుబది ఎనిమిది వేలమంది యనియు వీరు ప్రాకృతిక ప్రళయ కాలమువరకు ఇట్లు సంసారమున ప్రవృత్తులగుచుందురనియు గణన చేయబడినది. వీరందరును : శ్రాత కర్మానుష్ఠాన పరులయి శ్మశానములను ఆశ్రయించిరి. ఆది ఎట్లనగా-లోక  వ్యవహారమును ప్రవర్తింపజేసి జనులను ఉద్దరించుటకును భూతముల ప్రకృతి ధర్మములగు త్రిగుణములకును వశులై ఇచ్ఛా ద్వేషములకు, వశీభూతులయి మైథున ప్రవృత్తియందు ప్రవర్తిల్లీ ఆయా ఇంద్రియ ప్రవృత్తులవలన కలిగిన కోరికలకు వశులయి విషయ సుఖముల ననుభవించి వీరందరును కర్మానుష్టానము వలన కలుగు సిద్ధిని మాత్రము పొంది శ్మశానములను (జన్మ మరణ ప్రవాహరూప. సంసార గతిని మాత్రము) పొందగలిగిరి. అమృతత్వమును పొందజాలక పోయిరి. ఇట్లు ప్రజా కాములగు మరీచ్యాది సప ఋషులు (ప్రజాపతులు) ఇట్లే లోకమున ‘ద్వాపరములయందు’ (అపవర్గము కలుగు నిశ్చయము లేని మార్గమునందు) జన్మించిరి.

ఎవరు లోకమునందు తమ పుత్ర పౌతాది రూపమగు. సంతానము కొనసాగవలెనను కోరిక లేక సంతతి యనిన అసహ్యపడిరో వారు మృత్యువును జయించి అమృతత్వమును పొందిరి. . ఇట్లు ఊర్ధ్వరేతస్కులు తమ రేతస్సును అధోమార్గమున మైథునమునకై వినియోగించనివారు) కూడ ఎనుబది ఎనిమిది వేలమంది కలరు. వీరందరును లోక ప్రవృత్తి హేతువులగు శ్రాత కర్మానుష్టానములను ఆచరించక పోవుట. మైథున ప్రవృత్తిని విడుచుట ఇచ్చాద్వేషములను విడుచుట. భూతారంభమునకు హేతువులగు ప్రవృత్తులను (ఇష్టా పూ ర కర్మాచరణమును వదలుట - మొడల విధానముల ననుసరించి శుద్దులె ఉత్తరాయన మార్గమున హిరణ్య గర్భలోక మును చేరి అచ్చట ప్రాకృతిక ప్రళయకాలము వరకు నిలిచియుడి హిరణ్యగర్భునితోపాటు క్రమశః ! ముక్తులై అమృతత్వమును పొందుదురు. భూతసంప్లవకాలము (ప్రాకృతిక ప్రళయము) వరకు హిరణ్యగర్భునియందుండి తరువాత ముక్తి పొందు ఆమృతత్వమునకు ఆభూతసంప్లవస్థానమగు అమృతత్వమని వ్యవహార ము. ఈ ఊర్ధ్వ రేత సులగు నిష్కామ కర్మానుష్టాతలకు కలుగు ముక్తి ఈ విధమయినది. వీరును నపునర్మార్గగాములే-పునరావృత్తిలేని మార్గమునకు ముక్తి మార్గమునకు పోపువారే. వీరికిని తై లోక్య స్థితి హేతు భూతమగు కాల స్వరూప జ్ఞానము కావలసినదే. ఇట్టివారు చేసిన భ్రూణహత్య సాంగ వేదాధ్యయనము.త ద్విహిత కర్మానుష్టానము చేసిన ఉత్తమ బ్రాహ్మణుని చంపుట) వలన కలుగు పాపము కాని అశ్వమేధాదుల వలన సంపాదించిన పుణ్యముకాని ప్రాకృతిక ప్రళయము వరకు ఉన్న ను ఆ సమయావధితో వీరికవి నశించును. ఊర్ధ్వ లోకముల నడుమ ధ్రువుని లోకమున ఋషులతోపాటు వీరు శాశ్వత స్థితి నొందుదురు. ఇదియే అంతరిక్ష లోకమున (దానికి పైగా సువర్లోకమున) ధ్రువునితో నంబడ్డు డెన బాస్కరుని రూపమున నున్న స్థానము. ఇదియే విష్ణుని తృతీయపాదనము. ఈ విష్ణుని పరమపదమును చేరినవారు జస్మ మరణ జనితమగు శోకమును మరిపొందరు. కానీ లోక సుఖ) కాంక్ష లగువారు ధ్రువుని ధర్మప్రవృత్తికి.లోక ప్రవృత్తికి. హేతువు స్థానమును మాత్రము చేరి సుఖింతురు. ఈ తత్వమును పెరుగుటకును ఈ జ్యోతిర్వ్యవస్థా జ్ఞానముపయోగించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున ఖగోళ వర్ణనమున సూర్య సంచారాది కథనమను నూట ఇరువది మూడవ అధ్యాయము.