282 - పంచలాంగలకదాన విధానము.

 శ్రీమత్స్యః : అథాత స్సమ్పవక్ష్యామి మహాదాన మనుత్తమమ్

పఞ్చలాజ్గలకం నామ మహాపాతకనాశనమ్

పుణ్యాం తిథి మథాసాద్య యుగాది గ్రహణాదికమ్

 భూమిదానం నరో దద్యా త్ప్చ లాజ్ఞలకాన్వితమ్

 ఖర్వటం ఖేటకం వాపి గ్రామంఐ సస్యశాలినమ్

నివర్తనశతం వాపి తదర్గం వాపి శ క్తితః

 సొర దారుమయా నృత్వా హలా నక్చ విచక్షణః

 సర్వోపకరడై ర్యుక్తా నన్యా న్ప్చచ కాజ్చినా

కుర్యా త్ప్చ పలాదూర్ధ్వ మాసహస్రపలావధి

వృషా న్లక్షణ సంయుక్తా న్ద శైవతు ధురన్తరాక్

సువర్ణశృఙ్ఞాభరణా న్ముక్తాలాజూలభూషణాక్

రూప్య పాదాగ్రతికా నక్షకౌశేయభూషితాక్

సద్దామచన్దనయుతా జ్చాలాయా మధివాసయేత్

పర్జన్యాదితరుద్రేభ్యః పాయసం నిర్వ పే చ్చరుమ్

 ఏకస్మిన్నేవ కుణేతు గురు స్తేభ్యో నివేదయేత్

పాలాశ సమిధ స్తద్వదాజ్యం కృష్ణతిలాం స్తథా

 తులాపురుషవ త్కుర్యా ల్లో కేళావాహనం బుధః

తతో మజళశబేన శుక్లమాల్యామ్బరో బుధః

 ఆహూయ ద్విజదామ్పత్యం హేమసూత్రాజ్ఞుళీయకైః

కౌశేయవస్రకటకై ర్మణిభి శ్చాపి పూజయేత్

 శయ్యాం సోషస్కరాం దద్యా ధేను మేకాం పయస్వినీమ్

 తథాష్టాదశ ధాన్యాని సమక్షా దధివాసయేత్

 తతః ప్రదక్ష్మిణీ కృత్య గృహీతకుసుమాఞ్జలిః

 ఇమ ముచ్చారయే న్మంత్ర మథ సర్వం నివేదయేత్

శ్రీమత్సుడు మనువున కిట్లు చెప్పెను:ఇపుడు ఇక అను(అత్యుత్తమమగు పంచలాంగలక దానమను మహా దానపు విధానమును తెలిపేదను; అది మహాపాతక నాశనము; యుగాది మన్వాది చంద్రసూర్యగ్రహణాది రూపమగు పుణ్య తిథియందు లాంగల పంచకముతో కూడ భూదానము చేయవలయును; దానము చేయు భూ పరిమాణము పంట పైరులతో నిండినదగు 1. ఖర్వటము (పర్వత సమీప గ్రామము) 2. ఖేటము (చిన్న పల్లెగూడేము) 3. గ్రామము 4. నూరు నివర్త నములు (1159వ పుట చూడుడు.) 5. దానిలో నగము-వీనిలో నేదయిననే యుండవలెను; విచక్షణుడగు దాత బలము గల దారువుతో ఐదు నాగళ్లను వానికి కావలసిన సర్వోపకరణములతోను - అవి కాక ఐదు పలములకు పైగా వేయి వలము లకు లోపల తూకము గల బంగరుతో ఐదు సాగళ్ల ప్రతిమలను చేయింవలయును; కొయ్య నాగళ్ల కై మంచి లక్షణములు కలవియు బాగుగ బరువు మోయగలవియునగు పది ఎద్దులను కూడ వేరుగ ఉంచి వాటికి బంగరు కొమ్ముల సొమ్ములను నాగళ్లకు ముత్తెపు సొమ్ములను వెండితో పాదాగ్రపు (గిట్టల) సొమ్ములను వెండి తిలకములను ఎర్ర పట్టువస్త్రపు గవు నె నలను మాలలను దండలను చందనాలంకారములను కూర్చి వాటిని శాలయందు నిలిపి ఆధివాసనము జరుపవలయును; వర్జన్యుని ఆదిత్యులను రుద్రుని ఉద్దేశించి గురుడు ఒకే కుండమందు చరుపాయసమును నిర్వహించి నివేదించవలయును; పలాశ సమిధలను ఆజ్యమును నల్లనూవులను కూడ వేల్చవలేను; తులాపురుష దానమందువలేనే లోకపాలావాహనము చేయ వలయును; తరువాత మంగళ వాద్య వైదిక ధ్వనులతో బ్రాహ్మణులచే స్నానము చేయించుకొని యజమానుడు తెల్లని వస్త్ర ములను పూలను ధరించి ద్వీజదంపతుల నాహ్వానించి వారిని బంగరు దండలతో ఉంగరములతో కడియములతో మురుగు లతో మణులతో పట్టు వస్త్రములతో పూజించవలయును; ఉపసరములతో కూడ శయ్యను ఒక పాడి యావును వారి కీయవలెను; అంతకు ముందే ఆష్టాదశ ధాన్యములను . ఆధివాసనము చేసియుండి ఈ చెప్పిన సర్వసామగ్రిని అగ్నిని బ్రాహ్మణులను త్రిః ప్రదక్షిణించి దోసిట పూవులు పట్టుకొని ఈ మంత్రము నుచ్చరించుచు ఆవన్ని యు ఆచార్యుడు మొద లగు వారి తీయవలెను.

యస్మా ద్దేవగణా స్సర్వే స్థావరాణి చరాణి చ

 ధురంధరాజే తిష్టంతి తస్మా ద్భక్తి శ్శివేస్తు మే

 యస్మాచ్చ భూమిదానస్య కలాం నార్హంతి షోడశీమ్

 దానానన్యాని మే భక్తి ర్ధర్మ ఏవ దృడా భవేత్

దణేన సప్తహస్తేన త్రింశ దణ్ణం నివర్తనమ్

 త్రిభాగహీనం గోచర్మ మానమాహ ప్రజాపతిః

 మానేనానేన యో దద్యా న్ని వర్తనశతం బుధ

 విధినా తేన తస్యాశు క్ష్మీయతే పాపసంహతిః

 తదర్ధ మథవా దద్యా దపి గోచర్మమాత్రకమ్

 భవనస్థానమాత్రం వా ఒపి పాపైః ప్రముచ్యతే

 యావ ని లాఙలకమార్గముఖాని భూమే రాసామ్పతే ర్దుహితు రజ్గజరోమకాణి

తావంతి శఙ్కరపురే స సమా హి తిషే ద్భూమిప్రదాన మిహ యః కురుతే మనుష్యః

గన్దర్వకిన్నరసురాసుర సిద్ధసజై రాధూత చామరము పేత్య మహ ద్విమానమ్

సమ్పూజ్యలే పితృపితామహబన్దుయుక్త శ్శమ్భోః పురం వ్రజతి చామర నాయక స్స

 ఇంద్రత్వమ్యుధిగతం క్షయమభ్యుపైతి గోభూమిలాజ్ఞలధురన్తరసమదానాత్

తస్మా దమౌఘపటలక్షయకారి భూమే ర్ధానం విధేయ మితి భూతిభవోద్భవాయ

 ఇతి శ్రీమత్స్యమహాపురాణే మహాదానానుకీర్తనే పఇ్చలాజలకప్రదానికో

నామ ద్వ్యశీత్యుత్తర ద్విశతత మోధ్యాయః

“సర్వ దేవగణములును చరస్థావర భూతములును ధురంధరమగు నాగళ్ల అవయవములందే యుండును; కావున ఆట్టివాని దయ చే సోకు శివునియందు భక్తి కలుగుగాక! ఇతర దానములేవియు భూదానములో వదారవ పాలునకు నరిపోలవు; కావున ఆ దానపు మహిమచే నాకు ధర్మమునందు దృఢభక్తి కలుగుగాక !”

ఏడు మూరల పొడవు ఒక దండము అనియు ముప్పది దండముల చదరపు భూమి నివర్తనమని వ్యవ హారమనియు దానినుండి మూడవవంతు తగ్గినది గోచర్మ పరిమాణమనియు ప్రజాపతి వ్యవస్థ చేసియుండెను; అనగా (7x30)2 =(210) 2 = 44100 చదరపు మూరలు నివర్తనము; దీని భుజమందలి మూడవవంతు- 10 దం. తగ్గించగా 7x20x7x20 = 140x140=19600 చదరపు మూరలు గోచర్మము అగును. (ప్రథమ సంపుటమున వివరణములు చూడవలెను. భాస్కరాచార్యులు 'పది మూరలు ఒక వంశ మగును; ఇరువది వంశముల చదరము నివర్తనము.' అనెను. దీని ననుసరించి 10x20x10x20 = 40000 చదరపు మూరలు నివర్తనము.) ఈ మానముల ననుసరించి నూరు నివ ర నముల భూమిని దానము చేసిన వానికి పాపరాశియంతయు శీఘ్రమే క్షీణించును; శక్తి లేనిచో ఏబది నివర్తనములో గోచర్మ మాత్రమే భవనమునకు సరిపోవు మాత్రమే ఐన నిచ్చినచో పాపము క్తి యగును; ఇట్లు భూమి ప్రదానము చేసిన మానవుడు ఆ భూమియందు ఎన్ని నాగటి చాళ్లు ఏర్పడునో దాన మిచ్చిన పాడియావు శరీరమందలి రోమము లేన్ని యుండునో అన్ని సంవత్సరములు శివనగరమున వసించును. గంధర్వ కింనర సురాసుర సిద్ధ సంఘములు చామరములు వీచుచుండు మహా విమాన మారోహించి ఆమర నాయకుడే పితృపితామహ బంధుయుక్తుడై శివపురమున కేగి ఆట సంపూజితుడై సుఖించును; గోవును భూమిని లాంగలములను వాటి ధురంధరములగు (బరువును లాగు) ఎద్దులను దాన మిచ్చుటతో కలుగు పుణ్యఫలముతో పోల్చినప్పుడు యాగాది పుణ్య కార్యములచే లభించు *ఇంద్రత్వాది పదములు కూడ క్షీణించునవియే యగును; అందు వలన పాపరాశి పటలమును క్షయింపజేయునదియు భూతిభవము (ఆభ్యుదయ నిఃశ్రేయన వృద్ధి) ఉద్భవింపజేయునదియు నగు భూదానము చేయవలయును.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున షోడశ మహాదానాను కీర్తనమునందు పంచలాంగలక ప్రదానికమను రెండు వందల ఎనుబది రెండవ అధ్యాయము.

(*"ఇంద్రత్వ మభ్యుపగతం క్షయ మభ్యుపైతి

గో-భూమి-లాంగల-ధురంధర-సంప్రదానాత్" శ్లో20

ఇందు సంప్రదానత్ అనగా ఇచ్చుటవలన అని చెప్పినచో ఇంద్రత్వ క్షయమునకు ఇది హేతువనవలయును; కాని ఇది అనంగతము; 'ఇచ్చుటను బట్టి చూచినచో -ఏతత్సంప్రదానాపేక్షేయా' అని అర్థము సంగతము. ఇది తెనుగు కారకము వలెనే యున్నది.)