128 - త్రిపుర నిర్మాణ కథనము

సూతః : ఇతి సఞ్చిన్య దైత్యేంద్రో దివ్యోపాయప్రభావజమ్

చకార త్రిపురం దేవ్యం మనస్సఞ్చారచారితమ్

 ప్రాకారా నరమార్గేణ ఇహ చౌతచ గోపురమ్

 రాజమార్గ ఇతశ్చాపి విపులం భవనాభి

 ఇహచాటాలక ద్వార మిహట్టాలగోపురమ్

 రథ్యోపర థ్యాశ్చ ఇత ఇహచ్చాచ చత్వరమ్

 ఇదమ స్తఃపుర స్థానం రుద్రాయతన మతచ

 ఆపటాని తమాత్రాశ్చ(తడాగాని) ఆత్ర వాప్య స్సరాంసిచ

 ఆరామాశ్చ శుభాశ్చాత ఉద్యానా స్య తచా తచ

 వినిర్గమో దానవానాం భవత్యత్ర మనోహర

 ఇత్యేవం మానసం దుర్గం(తత్రాకల్పయత్పురకర్మవిత్) కల్పత్వా సురారిణా

 మయేన తత్పురం సృష్టం త్రిపురం త్వితి విశ్రుతమ్

 కాల్షియసమయం య న్మయేన విహితం పురమ్

 తార కాక్షోభిత స్తత్ర కృతస్థానాధిపో భవత్

 యచ్చ పూర్ణేనుసఙ్కాశం రాజతం నిర్మితం పురమ్

 విద్యున్మాలి బలేతత్ర విద్యుద్దణ ఇవామ్బరే

 సుపర్ణవికృతం య త్తన్మయేన విహితం చరమ్

 స్వయంచావ న్మయ స్తత్ర గత సదధిపః ప్రభుః

 తారకస్య పురం తత్తు శతయోజనమ స్తరమ్

 విద్యున్మాలిపురం చాపి శతయోజన మ నరమ్

 మేరుపర్వతసఙ్కాశం మయస్యాపి పురంమహత్

 పుష్యసంయోగమాత్రేణ కాలేన స మయః పురా

 కృతవాం స్త్రీపురం *దైత్య నేత సేవ పుష్పకమ్

యేనయేన మయో యాతి ప్రకురాణః పురంపురాత్

 ప్రతస్థే తత్ర తత్రైవ ప్రచక్రే మాయయా స్వయమ్

(*దైత్య స్త్రినేత్రః పుష్పకంయథా.)

దైత్యేంద్రుడగు మయుడు ఇట్లాలోచించి దివ్యోపొయ ప్రభాష ఫలముగా దివ్యమగు త్రిపుర దుర్గమును నిర్మించేను. అది దాని ఆధిపునీ మనఃసంకల్పముననుసరించి సంచరించునది. రెండేసి ప్రాకారముల నడుమ అక్కడక్కడ గోపు రములు భవనాదికముతో కూడిన విశాలరాజమార్గము ఆట్టాలక మహాభపస) ద్వారములు ఆట్టాలక గోపురములు రథ్యలు (పెక్కుబాటలు కలియు చోటు) ఉపరథ్యలు చత్వరములు ఆంతఃపురస్థానములు శివాలయములు గుంటలు చెరువులు దిగుడు బావులు సరస్సులు ఆరామములు (వి శాంతిక నువగు బయళ్ళు ఊద్యాసములు దానవులు వాహ్యాళికి పోవు మనో హర ప్రదేశములు కల త్రిపురమను దుర్గమును తాను మనసున అనుకొనినట్లే మయాసురుడు నిర్మించెను. నల్లని ఉక్కుతో నిర్మించినదానికి తార కాక్షుడును వెండితో చేయగా చంద్రునివలె ప్రకాశించు రజత దుర్గమునకు ఆకాశము నందలి మెరపుల రాశివంటి బలి విద్యున్మొలియు సువర్ణమయ దుర్గమునకు మయుడును ఆధిపతులయిరి.

తార కాక్షుని పురమునకును పిద్యున్మాలి పుర మునకును నడుమ శతయోజనములును విద్యున్మాలి పురమునకును మయుని పురమునకును నడుమ శతయోజనములును అంతరముండునట్లు మయుడు ఒక పుర మునుండి మరియొక పుర మును వెలికితీయుచు పుష్యయోగ సమయమున త్రిణే తుని పుష్పకముతో సదృశమగు త్రిపుర దుర్గము నిర్మించుచు పోవుచుండ ఆపోయిన మార్గమున అతని మాయచే ఆదుర్గము అట్లే ఏర్పడెను.

కామరూపమయాన్యత శత శోథ సహస్రశః

 రత్నాన్వితానీ శోభంతే భవనాని సురద్రుహామ్

 ప్రాసాదశత జుష్టాని కూటాగారోత్కటానిచ

సర్వాణి కామగాని స్యు స్సర్వలోకమయానిచ

 సోద్యానవాపీకూపాని సపద్మసరవ నిచ

అశోకవనర మ్యాణి కోకిలారుతవ స్త్రీచ

చిత్రశాలావిశాలాని చన్దజాలో శ్రమానిచ

 సష్టాదశ భౌమాని సుకృతాని మయేనచ

 బహుస్వర్ణపతాకాని స్రగ్దామాలజ్కృతానిచ

 కిజ్కిణీజాలశబ్దాని గన్గవ స్తి మహా నీచ

సుసంయుక్తపలిత్తీని పుష్పవై వేయ్యవ నిచ

 సాజ్య ధూమాన్హకారాణి పూర్ణకలశానిచ

 గగసావరణే భా ని హంసప జొనిభానీచ

 పజ్త్కీకృతాని రాజు నే గృహాణీ త్రిపురేపురే

 ముక్తాకలాపై గ్లమ్బద్బి ర స ర్తీభి శ్శశి శ్రియమ్

 మల్లికాజాతిపుష్పాడ్యై ర్దూపగ ఛాధివాసితై :

 పథీంద్రియసులై ర్నిత్యం సమై స్సత్పురుషైరివ

 హేమరాజతలోహాశ్చ మణిరత్నా జ్ఞానాన్వితాః

 ప్రాకారా స్త్రీపురే తస్మి స్థిరీప్రకర సన్ని భాః

 ఏకై కస్మీ స్పురే తస్మి నోపురాణాం శతంశతమ్

 సపతాక ధ్వజపటం దృశ్యలే గిరిశృజవత్

 నూపురారావరమ్యా త్రిపురే నఃపురాణ్యపి

 స్వర్గాతిరిక్త శ్రీర్భాతి తత్రక న్యాపు రేషుచ

ఆరామైశ్చ విహారైశ్చ తడా కావటవల్వలై?

 సరోభిశ్చ సర్భిశ్చ పనై శ్చోపవనై రపి

దివ్యభోజ్యోపభోగ్యాని(దివ్యోపభోగభోగ్యాని) నానారత్న యుతానిచ

 పుష్పోర్కరైశ్చ సుభగా స్త్రీపురే చోపనిర్గమాః

 పరిఘాతశతగమ్భీరా కృతా మాయావినా పురా

 నిశమ్య తద్దుర్గ విధాన ముత్తమం కృతం మయే నాద్బుతకర్మణా చ

 దితేస్సుతా దైత్యవరాజవైరిణ స్సహస్రశః ప్రాపు రన స్తవికమాః

 తదాసురై ర్గర్వతపై రిమర్ధనైః కరీన్దశై లేన్దమృగేౄసన్నిభైః

 బభూవ పూర్ణం త్రిపురం భటైర్యథా యథామ్బరం భూరిజలై రనవజైః

ఇతి శ్రీమత్స్యమహా పురాణే త్రిపురోపాఖ్యానే త్రిపుర నిర్మాణకథనం నామ అష్టావింశత్యుత్తర శతతమోధ్యాయః

వానియందు నూరులకొలది వేలకొలదిగా అసురుల భవనములు శోభించసాగెను. ఆవియన్నియు కామ రూపములు -రత్నవంతములు వందలకొలది ప్రాసాదములు కూటాగారములు ఉద్యానములు దిగుడు బావులు తామర కొలకులు అశోకవనములు కోకిలారావములు విశాలములగు చిత్రశాలలు ఉ త్తమములగు చంద్రశాలలు పెక్కు బంగరు పతాక లు పూలమాలలు చిరుగంటల మువ్వల గుంపులు సుగంధములు చక్కగ కలయంపి చల్లి అలికిన ఆలుకులు పుష్పోపహారములు నేతితో వేసిన పొగల చీకట్లు పూర్ణకలశములు కలిగి సర్వలోకమయము లే రామ గమనములై ఏడెనిమి దంత స్తులు కలవిగా మయుడా అసుర భవసముల నిర్మించేను. అవి ఆకాశావరణమున హంస పంక్తులవలే (త్రిపుర దుర్గాంతర్గత పురములందు బారులు తీరి రాజిల్లుచుండెను. మల్లె జాజిపూలతో అలంకృతములయి ధూపగంధములతో వాసన వేయబడి సత్పురుషులవలే త్రోవను పోవు వారికి ఇంద్రియ సుఖము కలిగించుచు చంద్రుని శోభను పరిహసించుము తైపు బౌలరులతో ఆ భవనములు శోభిల్లుచుండెను.

ఆ త్రిపుర దుర్గమందలి ప్రతియొక పురమును బంగారుతో వెండితో ఇసుముతో చేసి మణులతో రత్నములతో కూర్పుకలపై కొండల గములవంటి ప్రాకారములు వందలకొలదిగ నుండెను. అవి పతాకాధ్వజ వస్త్రములతో కూడి కొండ కొమ్ములవలే కానవచ్చుచుండెను. దానియందలి ఆంతఃపురములు అందెల రవళులతో రమ్యములు. కన్యాపుర ముల శోభ స్వర్గ శోభను మించియుండెను. ఆరామములు విహార ప్రదేశములు చెరువులు గుంటలు చెలమలు సరస్సులు నదులు వనములు ఉపవనములు ఆటనుండెను. దివ్యములగు భోజ్య పదార్థములు నానారత్నము (శేషపదార్థము)లతో కూడిన ఉపభోగ సాధనములు కలిగి పుష్పరాసులతో హాయి గొల్పుచుండు వాహ్యాళి ప్రదేశములతో ఒప్పుచుండునట్లా మాయావియగు మయుడు వందలకొలది లోతైన అగడలతో సురక్షితమగు ఆ త్రిపుర దుర్గమును నిర్మించేను.

అద్భుత కార్యనిపుణుడగు మయుడు ఇట్టి యు తమ దుర్గ నిర్మాణము నొనరించిన సమాచారమును విని ఆనంత విక్రమ సంపన్నులగు దైత్యవరులు పేలకొలదిగ ఆటకు చేరిరి. గర్విత వేరి నాశ కులును కరీంద్ర మృగేంద్ర సమానులునగు ఆసురులతో ఆతీపుర దుర్గము-ఆకాశము మేఘ సహములతో నిండినట్లు స్కందాధాచారము పేర భటులతో నిండినట్లు నిండిపోయెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున  త్రిపుర నిర్మాణ కథనమను నూట ఇరువది ఎనిమిదవ అధ్యాయము.