మత్స్య మహా పురాణము
140 - అమావాస్యాకాల నిర్ణయము - ఐలుడు పితరులను తృప్తుల జేయుట
ఋషయః : కథం గచ్చత్యమావాస్యాం మాసమాసి దివం నృపః ।
ఐళః పురూరవా స్సూత తర్పయేచ్చ కథం పితృ॥
ఏత దిచ్చామ హే శ్రోతుం ప్రభావం తస్య ధీమతః ।
సూతః : ఏతదేవతుపప్రచ్ఛమనుస్సమధుసూదనమ్॥
సూర్యపుత్రాయ చోవాచ యథా తన్మే నిబోధత ।
శ్రీమత్స్యః : తస్య చౌహం ప్రవక్ష్యామి ప్రభావం విస్తరేణతు॥
ఐశ స్య దీవి సంయోగం సోమేన సహ ధీమతా।
సోమాచ్చైవామృతప్రాప్తి పితృణాం తర్పణం తథా॥
సో(సౌ)మ్యా బర్హిషదః కావ్యా అగ్నిష్వాత్రా స్తథైవచ ।
యదా చన్దశ్చ సూర్యశ్చ నక్షత్రేణ సమాగ తె॥
అమావాస్యా న్ని పసత ఏకరాత్రికమణలే ।
తదా స గచ్ఛతి ద్రష్టుం దివాకర నిశాక రౌ॥
అమావాస్యాంచ దేవసే మాతామహపితామహా ।
అభివాద్యతు తొ తత్ర కాలా పేక్షః స తిష్ఠతి॥
అస్కన్దమాన సోమాద్యం పిత్రర్డే స పరిశ్రమాత్ ।
ఐళః పురూరవా విద్వానమా శ్రాద్ధచికీర్షయా॥
తత స్స దివి సోమంవై హ్యుపత సే పితృనపి ।
ద్వీలవంచ కుహూమాత్రం తావుభౌచ నిధాయ సః॥
సినీప్రమాణా స్వల్పాతు కుహూమాత ముపాసతే ।
కుహూమాత్రబలో(లవో)ద్దేశం జ్ఞాత్వా కుహు ముపాసతే॥
తముస్య సదా సోమకాలా పేక్ష్మీ ప్రతీక్షతే ।
సుధామృతంతు సోమాద్వై వస(సవ శ్రం తస్య తృప్తయే॥
దశభిః పభి శ్చైవ సుధామృతపరి సవై :।
కృష్ణపక్ష భుజాం ప్రీతి రుహ్యతే పరమాంశుభిః
సద్యోఒభిక్షరతా తేన సౌమ్యేన మధునాచ సా ।
నివా పేష్వథ దత్తేషు పిత్ర్యేణ విధినాడు వై॥
సుధామృతేన సౌమ్యేన తర్పయామాసపై పితృ ।
సౌమ్యా బర్హి షదః కావ్యా అగ్నిష్వాత్తా స్తథైవచ॥
ఇలా పుత్తృడగు పురూరవసుడు ప్రతి మాసమున అమావాస్యనాడు స్వర్గమున కేగి తన పితరులకు తృప్తి చేయు విధము తెలుపుమని ఋషులు సూతునడిగిరి. పూర్వము మనువు ఇదే ప్రశ్న మడుగగా మత్స్యనారాయణుడతనికి ఈ విషయమును పురూరవసుని ప్రభావమును చెప్పెను. ఆదియే నేనిపుడు మీకు తెలి పెదసని సూతుడు ఋషులకిట్లు చెప్పనారంభించెను. పురూరవసుడు ప్రతి మాసమున స్వర్గమున కేగి సోమునితో కూడి అతని నుండి అమృతమును సంపా దించి తన పితరులకు తృప్తి కలిగించును. అతనిచే తృప్తినందు పితరులు (సౌమ్యులు) బర్హిషదులు కావ్యులు అగ్ని ష్వాత్తులునను వర్గములవారు. అమావాస్య నాడు స్వర్గమున సూర్యచంద్రులిద్దరు ఒకేరాత్రి ఒకే నక్షత్రమున ఒకటిగా ఏకమండలము (భాగ)లో కూడియుండు సమయమున పురూరవసుడుపోయి సూర్యచంద్రులను దర్శించును. అట్టి అమావాస్య నాడతడు స్వర్గమున కేగి తన మాతామహులు పితామహులు నగు రవి చంద్రులను దర్శించి నమస్కరించి తగిన సమయ మున కెదురు చూచుచుండును. అతడు సోమునినుండి క్షణము కూడ ఎటు కదలక తన పితరుల తృప్తిపరచుట కై పరిశ్రమము చేయుచుండును. అతడు శాస్త్రమును సంప్రదాయమును ఎరిగిన విద్వాంసుడు కావున అమావాస్యనాడు తన పితరులకు శ్రాద్ధము చేయగోరి తన పితరులను సోమునికూడ ఇట్లు సేవించుసు. అమావాస్యనాడు చంద్ర రేఖ కోంచెమైన కన బడుచో అది 'సినీవాలీ'.కనబడనిచో ఆది 'కుహూ' అనబడును. పురూరవసుడు 'సినీవాలి'ని విడిచి 'కుహూ' యందలి బలముకల ద్విలవ పరిమాణ పర్వసంధి' కాలమునకే కని పెట్టుకొనియుండును. ఆ సమయమున సోమునినుండి లభించు సుధ పితరులకు తృప్తి కలిగించునుకదా! ఏలయన కృష్ణపక్షమున చంద్రునినుండి లభించు పదునై డు పరిసవము (ప్రవాహ భేదములతో కూడిన చంద్రుని ఉత్తమ కిరణములతో పితరులకు తృప్తి కలుగును. అది ఎరిగిన పురూర వసుడు సోమునినుండి అమావాస్యనాడు కుహూ క్షణములందు లభించు అమృతము స్రవించుచుండగనే దానిని తానందు కొని తన పితరులకందించి తృప్తి నొందించుచుండును. దీనిచే తృప్తి నొందుదురని తెలిపిన సౌమ్యులు. అగు బరి షదులు కొవ్యులు అగ్నిష్వాకులునను పితృవర్గముల విషయము తెలి పెదను.
- (వీవరణము: 1. ఇచట ‘ఇలః పురూరవాః' అని చెప్పబడినది. అనగా 'ఇలా పుత్తుడగు పురూరవసుడు' అని అర్థము. తరువాత 'అతడు మాతామహ పితామహులను అమావాస్యనాడు దర్శించును.” అనియు చెప్పబడినది. ఆ తిథి సూర్యచంద్రులు సంగమించు ఒకే భాగ (Degree) యందు ఉండు తిథి. ఆనాడు అతడు వారికడకు పోవును. తన మాతామహ పితానుహులను దర్శించును. అనగా సూర్యచంద్ర వంశీయులగు తన పెద్దలను సూర్యచంద్రుల తా త్విక మగు దేవతాత్మక రూపమును కూడ దర్శించును. వారందరును పురూరవసునకు మాతామహులును-పీతామహులును; ఎట్లన-పురూరవసుని తల్లియగు ఇల. తాను స్త్రీత్వమును పొందుటకు మునుపు ఇలుడు. అను సూర్యవంత్యుడగు రాజు కదా! కావున ఆంతకు పైతరముల సూర్యవంశ్యులుసు సూర్యుడును అతనికి మాతామహ పక్షములోనివారు. తన తండ్రి యగు బుధుడును అతని తండ్రియగు చంద్రుడును ఇతనికి పితృపితామహులు.
2. పితరులు 'సౌమ్యులు' అనబడుదురు. ఎట్లన సోముని (చంద్రుని) నుండి లభించు అమృత పరిస్రవముతో వారు ఆప్యాయితులు - రసపానముచేత పినందినవారు. ఆగుచున్నారు. కనుక సోముడు పితరులకు ‘ఆప్యాయయి.' ‘సంతృప్తినందించువాడు. కావున-సోమః ఆప్యాయయతా ఏషాం-ఇతి-సౌమ్యాః.' “సోముడు వీరికి ఆప్యాయనము కలిగించువాడుగా నున్నాడు కావున 'సౌమ్యులు' అని పితృదేవతలకు వ్యవహారము సముచితమగును.
3. పితరులు అగ్ని ష్వాత్తులు బరిషదులు -కాప్యులు -అని మూడు వర్గముల వారుగా ఈ అధ్యాయమున చెప్ప బడినారు. కాని-లోగడ 13-14-15 అధ్యాయములలో పితరులు అమూర్తిమంతులు 1. వై రాజులు 2. అగ్ని ష్వాత్తులు. 3.బర్హిషదులు అను మూడు వర్గములవారు; మూర్తిమంతులు 1.సుకాలినులు 2.హవిష్మంతులు 3.ఆజ్యపులు 4.సోమపులు అను నాలుగు వర్గములవారు; ఇట్లు వారు మొ త్తము ఏడు వర్గములవారు. అని చెప్పబడినది. దీని సమన్వయమును ఆలోచించవలయును.
అమూర్తిమంతులలో 1. వై రాజులును 2. అగ్ని ష్వాత్తులును దేవతలకు ఆరాధ్యులగు పితరులు. కావున వీరిని ఇద్దరను అగ్ని ష్వాత్తులు అను ఒకే వర్గముగా ఈ అధ్యాయమున గ్రహించినారు. 3.బర్హిషదులు అను వర్గపు పితరులు దానవాడలకు ఆరాధ్యులు. కావున వీరినికూడ ఇచట వేరుగ గ్రహించినారు. మిగిలిన నాలుగు మూర్తి మద్వర్గములవారును మానవులలో నాలుగు వర్ణములవారిచే ఆరాధింపబడుచు వారిచే కవ్యములను.పితరులకు అందించు ఆహారాదీకమును.అందుకొందురు. కావున కొవ్యులు అనబడుదురు. ఇట్లు లోగడ తెలిపిన ఏడు వర్గముల పితరులును ఇచట మూడు వర్గములలోనికి వచ్చినారు.
ఋతురగ్ని స్మృతో విప్రై రృతు సంవత్సరం విదుః ।
జజ్ఞిరే ఋతవ స్తస్మాత్పితరోహ్యా ర్తవాభవః॥
పితరోర్ధమాసా జ్ఞజ్ఞే(జ్ఞిరే) వై యేచతే ఋతుసూనవః।
పితామహాశ్చ సు(ఋ)తవో మాసాయేహ్యష్టసూనవః॥
ప్రపితామహా స్స్మృతా దేవాః పశ్చాద్దా బ్రహ్మణస్సుతాః ।
కావ్యా సౌమ్యా బర్హిషద శ్చైవ అగ్ని ష్వాత్తాశ్చ తేత్రిధా॥
గృహస్థా యేతు యజ్వానో హవిర్యజ్ఞారపోశ్చ యే ।
స్మృతా బరి షద సేవై పురాణే నిశ్చయంగతాః॥
గృహ మేధినశ్చ యజ్వానో అగ్ని ష్వాత్రా ర్తవా స్మృతాః।
అష్ట కాపతయః కావ్యాః పడ్చాహ్యజ్ఞాని చోచ్ఛృణు)త॥
తేషు సంవత్సరో హ్యగ్ని స్సూర్యస్తు పరివత్సరః ।
సోమ స్విద్వత్సర శ్చైవ వాయు శ్చైవానువత్సరః॥
రుద్రస్తు వత్సర స్తేషాంపక్చాజ్జా యే యుగాత్మకాః ।
కాలేనాధిష్ఠిత స్తేషాం చన్దమాః స్రవతే సుధామ్॥
ఏతే స్మృతా దేవకృత్యా స్సోమపాళ్చోష్మపాశ్చయే ।
తాం సేన తర్పయామాస యావదాసీ త్పురూరవాః॥
యస్మా తసూయతే సో మో మాసిమాసి వి శేషతః ।
తత సుధామృతం తద్వై పితృణాం సోమపాయినామ్॥
ఏత త్తదమృతం సోమ సుధాచ మధు చై వహి ।
తతః పీతసుధం సోమం సూర్యోఒసా వేకర్మనా॥
యుగా నరోదితే చైవ చనరేఖోపరి స్థితే
ఆప్యాయయతి ససుధం సోమంతు సోమయినమ్॥
నిశ్శేషావై కలాః పూర్వా యుగపద్ వ్యాప్యతే పురా ।
సుషుమ్నా ప్యాయమానస్య భాగంధాగ మహఃక్రమాత్॥
దేవైః పీతసుధం సోమం పురా పశ్చా త్పిబే ద్రవిః ।
పీతం పజ్ఞ్చదశాహంతు రశ్మినై కేన భాస్కరః॥
ఆప్యాయ్య ససుషుమ్నే న భారంభాగ మహఃక్రమాత్।
సుషుమ్నా ఒప్యాయమానస్య శుక్లే వర్ధని వై కలాః॥
తస్మాదస నివై కృష్ణా శ్శుక్లా హ్యాపాయయ స్త్రీచ ।
ఏవం సా సూర్యవీర్యేణ చన్హస్యా ప్యాయతా తనుః॥
పౌర్ణమాస్యాం స దృశ్యత శుక్ల స్సమ్పూర్ణమజ్జలః ।
ఏవ మాప్యాయిత స్సోమః ఓయతేచ పునఃపునః॥
సమృద్ధిరేవ సోమస్య పక్షయో శ్శుక్షకృష్ణ యోః ।
ఇత్యేష పితృమాన్సోమ స్సృత స్తద్వ త్సుధాత్మకః॥
కాస్త పఞ్చదశై స్సార్ధం సుధామృతపరిస్రవైః ।
వీప్రులు -వేదములచే ప్రతిపాదింపబడిన సకల విషయములను తాత్వీకముగా ఎరిగినవారు-అగ్ని ని ‘ఋతువు’ అని వ్యవహరింతురు. వారే సంవత్సరమును కూడ ఋతువు అనియే తలంచుచున్నారు, (కావున సంవత్సరావయవము లగు వశములు మాసములు, రెండేసి మానములతో ఏర్పడు కాలపరిమాణము ఆయనములు కూడ ‘ఋతువు' అనదగి యున్న మీ.) ఫితరులు ఋతువులనుండి జనించినవారు కావున వారికీ ‘ఆర్తవులు' అనియు సంప్రదాయమునందు వ్వవ హారము, పితృ-పితామహ-ప్రపితామహులు అను మూడు తరములకు చెందిన పితరులకు అభిమాని దేవతలగు పితృదేవతలలో పితృ శ్రేణికి చెందినవారు సంవత్సరావయవములగు పక్షములనుండి జనించినారు. పితామహ శ్రేణికి చెందిన పితృదేవతలు 'అష్టకలు' అనబడు పర్వ కాలముతో కూడిన మాసము అనెడు సంవత్సరావయవములనుండి జన్మించినవారు. ప్రపితామహ శ్రేణికి చెందిన పితృదేవతలు పంచొజ్జా (పంచ సంవత్సరా)త్మకుడగు బ్రహ్మకు (ప్రజాపతికి) కుమారులు.
సౌమ్యులు ఆను సామాన్య నామముకల . కావ్యులు . బరైషదులు . అగ్ని ష్వాత్తులు అను చూడు వర్గముల పితరులు పైని పేర్కొనబడినారుగదా! వారి స్వరూపము చెప్పబడుచున్నది.
'గృహస్థులుగానుండి హవిర్యజ్ఞములతో ఋతురూప సంవత్సరాత్మక) ప్రజాపతిని యజించిన యజ్వలగు మహాత్ములు “బర్హిషదులు' అను వర్గమునకు చెంది అమూర్త పితృదేవతలు ఆని శాస్త్రములందు స్మరింపబడుచున్నారు.' అని ఈపురాణమునందు గడచిన అధ్యాయములందు ఈ శబ్దపు నిర్వచనముతో కూడ నిశ్చయింపబడియున్నది. ఇదే విధముగ యజ్వలుగా నుండిన గృహమేధులే అగ్ని ష్వాత్తులనబడు అమూర్త పితృదేవతా వర్గమువారు కూడను. ‘అష్టకలు’ మొదలగు పర్వదినములందు మానవులలో చతుర్వర్ణులచే జరుపబడు శాద్దములను అనుభవించుచు వాటికి పతులుగా - అధిష్టాతలుగా ఉండు మూర్త పితృదేవతా వర్గముల సమష్టియగు వారు కావ్యులు.
ఇక ఇప్పుడు ప్రపితామహ శ్రేణికి చెందిన పితరులకు జన్మ హేతువగు ప్రజాపతి రూప పంచాబ్ద (పంచ సంవత్సర) స్వరూపమును తెలిపెదను; వినుడు. *పంచ సంవత్సరాత్మకమగు యుగమునకు ఆవయవములగు ఐదు అబ్దములను వివరింతును. వానిలో మొదటిదగు 1. ‘సంవత్సరము' అగ్ని దేవతాత్మకము. 2. రెండవదియగు 'పరివత్సరము' సూర్య దేవతా రూపము 3. మూడవదియగు 'ఇద్వత్పరము' సోమాత్మకము 4. నాలుగవదియగు ‘ఆను వత్సరము' వాయుదేవతాత్మకము 5. ఐదవదియగు ‘వత్సరము' రుద్ర దేవతాత్మకము. ఈ ఐదింటితో ఏర్పడినదగు పంచ సంవత్సరమయ 'యుగము' సాక్షాత్ కాలాత్మక ప్రజాపతియే.
ఇట్లు సోముడు ప్రతి మాసమునందును చంద్రుడు వి శేష రూపమున స్రవించు అమృతము సోముని నుండి లభించు స్వధామృతమును మాత్రమే అనుభవించుటచే తృ పినందు పితరులకు ఆహారమగుచున్నది. దానిచేతనే వారికి సోమపులనియు వ్యవహారము. ఈ సోమామృతమునకు అమృతమనియు సోమమనియు మధువనియు పేరులు కలవు. పితరులు సోమపానము చేసిన తరువాత అమృత శూన్యుడై పోయిన చంద్రుని సూర్యుడు తన సుషుమ్నయను కిరణముతో మరల పూరించును. ఇట్లు దినదిన క్రమమున చంద్రుని 'కల' లన్నియు శుక్లపక్షమున పూర్ణములగుచు పోవుచుండును. కృష్ణపక్షమున క్షణములగుచు పోవును. ఈ చెప్పిన విధమున చంద్రుని శరీరము సూర్యుని వీర్యముతో నింపబడుచుండును. క్రమవృద్ధితో పూర్ణిమాతిథినాడు చంద్ర మండలము షోడశ కళలతో నిండి అతడు సంపూర్ణమండలుడై యుండును. ఇచట ఇదియొక చమత్కారము: ఏమనకృష్ణపక్షమున పితరులు చంద్రుని పానము చేయ తొవగా శుక్లపక్షమున ప్రతిపదాదిగా, రవియు చంద్ర మండలమును పానము చేయును. (వ్యాపించును; పానము అనగా ఇచట ఈ రెండర్థములు సంప్రదాయ మున వచ్చినవి.) ఇదే విధముగా శుక్లపక్షమునందును కృష్ణపక్షమునందును చంద్రుడు వృద్ధినొందుచునే యుండును. ఇచట వృద్దియను మాటకు గూడ రెండర్థములు . శరీరము బలియుట ఒక విధమగు వృద్ధి. తాను అమృతము నిచ్చి పితరులకు శరీరపుష్టి కలిగించుట మరియొక విధమగు పృది. వృద్ధి - శుభము) ఈ కారణములతోనే సోమునకు పితృమాన్ -పిత రులు కలవాడు (పితరులను పోషించువాడు)’ అనియు “సుధాత్మకుడు. అమృతము తన ఆత్మ.దేహముగా కలవాడు) అనియు పేరులు కలిగినవి. అత డిట్లు తసిసుండి స్రవించు అమృత ప్రవాహముతో పంచదశ తిధులుడును కాంతుడు.
(*సంవత్సరారంభ దినమున (చైత్ర శుక్ల పాడ్యమినాడు) సూర్యుడు ఏదేని గా చీలో లేదా మేష రాశిలో ప్రవేశించిన ఏడు సంవత్సరము గొని తరువాత పచ్చు గొలుగు ఏడులను వరుసగా పరివత్సరము ఇద్వత్సరము అసు. వత్సరము వత్సరము అందురు. ఇట్టి ఇదేండ్లు కలిసి యుగమనబడును. ఈ ఐదేండ్లకుసు వ్యష్టిగా దేవస్థలు ఇచట చెప్పబడినారు. యుగమునకు అంతటికినీ నపుష్టిగా ప్రజాపతి అధిపతి అని 'పంచ సంవత్సరముయయు గోధ్యక్షం ప్రజాపతిమ్' అని వేదాంగ జ్యోతిషమున చెప్పబడినది.)
చూచువారికి ఇంపు కలిగించువాడుగానే యుండును. (శుక్లపక్షమున మండలము పూర్ణమగుచుండుట చేత మానవులకును తమకు ఇతని నుండి అమృతము లభించును గదాయని పితరులకును చంద్రుడు ఇంపు గొలుపును. అట్లే కృష్ణపక్షమున పితరులకు అతడు చేసిన ఉపకారమును బట్టి మానవులకును పితరులకును చంద్రుని చూడగానే ఆనందము కలుగును.)
అతఃపరం ప్రవక్ష్యామి పర్వణాం సంధయశ్చ యే॥
యథా గ్రన్దిభిః పర్వాణి ఆవృతానీక్షు వేణునామ్ ।
తథార్ధమాసా స్తస్యర్తుశుక్లకృష్ణాస్తు వై స్మృతాః॥
పూర్ణమాసస్య యో భేదే గ్రన్థయ న్సన్దయస్తథా ।
అర్దమాసస్య పర్వాణి ద్వితీయాప్రభృతీనిచ॥
అగ్న్యాధాన క్రియా స్తస్మా న్నీయన్తే పర్వసన్దిషు ।
తస్మాత్తు పర్వణోహ్యాదౌ ప్రతిపద్యాదిసన్దిషు॥
సాయా హ్నే హ్యనుమత్యా యద్ద్వౌలవౌ కాల ఉచ్యతే ।
లవౌ ద్వా వేవ కాలో యః కాలో జ్ఞేయోపరాఽహ్ణికః॥
ప్రకృతిః కృష్ణపక్షస్య కాలేఽఽపన్నేఽపరాహ్ణి కే ।
సాయాహ్ణే ప్రతిపత్తశ్చ సకాలః పౌర్ణమాసకః॥
వ్యతీపాతే స్థితే సూర్యే లేఖామూర్ధం యుగా న్తరే ।
యుగా న్తరోదితే చైవ చన్ద్రలేఖోపరిస్థితే॥
పూర్ణమాసావ్యతీపాతౌ యదా పశ్యే త్పరస్పరమ్ ।
యావన్తౌతు వ్యతీపాతే యస్మిన్కాలే వ్యవస్థితా॥
తథైవ సూర్యముద్దిశ్య దృష్ట్వా సజ్ఖ్యాతు మర్హసి ।
సవై వషట్ క్రియాకాల షష్ఠః కాలోఽభిధీయతే॥
పూర్ణేన్దుః పూర్ణవ క్షేతు రాత్రిసన్దిషు పూర్ణిమా ।
తస్మా దాప్యాయతే నక్తం పూర్ణిమాస్యాం నిశాకరః ।
యథాఽన్యోన్యం వ్యతీపాతే పూర్ణిమాం పేక్షతే దివా॥
చన్ద్రాదిత్యోఽపరా హ్ణేతు పూర్ణత్వా త్పూర్ణిమా స్మృతా ।
యస్మాత్తా మసుమన్య న్తే పితరో దైవతై స్సహ॥
తస్మా దనుమతిర్నామ పూర్ణిమాఽప్రతిమా స్మృతా ।
అత్యర్ధం రాజతే యస్మా త్పౌర్ణమాస్యాం నిశాకరః॥
రజ్ఞానాచ్చైవ చన్ద్రస్య రా కేతి కవయో విదుః ।
అమా-వ సేతా- మృక్షేతు యదా చంద్రదివాకరౌ ।
ఏకా పంచదశీ రాత్రి రమావాస్యా తతః స్మృతా॥
ఉద్దిశ్య తామమావాస్యాం యదా దర్శం సమాగతౌ ।
అన్యోన్యం చంద్రసూర్యౌతు దర్శనా దర్శ ఉచ్యతే॥
ద్వౌద్వౌ లవా వమావాస్యాం సకాలః పర్వసన్దిషు ।
ద్వ్యక్షరః కుహూమాత్రశ్చ పర్వకాలస్తు స స్మృతః॥
ఇక మీదట పర్వ సంధుల విషయము తెలి పెదను. చెరకు గడలకును వేదుకుగడలకును కలకణుపులకు ముడులు ఉన్న ప్లే సంవత్సరమునకును ఆయనములు ఋతువులు మాసములు ఆర్ష మానములు తిథులు మొదలగునవియు కణుపులుగాను ఆ పర్వముల) కణుపుల నడుమ వాటిని కలుపుచు నుండు సంధికాలము ఆ కణుపుల ముడులు గాను అమరి యున్న వి. పూర్ణ (శుక్ల) కృష్ణపక్షాత్మకమగు మాసమునకు శుక్ల కృష్ణ పక్షములు కణుపులును వాటి సంధి కాలములు(పూర్ణి ఒమావాస్యలు) ముడులునై నట్లే పక్షములకును ప్రతిపత్ మొదలు పూర్ణిమా మావాస్యల వరకుగల విదియ మొదలగు). కాలము కణుపులును పూర్ణిమకును కృష్ణ ప్రతిపత్ కును-అమావాస్యకును శుక్ల ప్రతిపత్ కును నడుమగల కాలము గ్రంథులు ముడులు)ను ఆగుచున్నవి. వెదురు చేరకు మొదలగువాని యందు ముడులవలె నుండు కఠిన భాగము గ్రంథి.ఆ గ్రంథు లకు రెంటికి నడుమ నుండు భాగము పర్వము కణుపు అని తెలియవలెను.) ఇట్టి పర్వముల సంధి కాలములందు అగ్న్యా ధానము మొదలగు కర్మముల నాచరించవలయును. పూర్ణిమనాటి సాయాహ్న కాలమందలి రెండు లవముల కాలము అను మతి' అదే నాటి ఆపరాష్ట్రపు రెండు లవముల కాలము 'రాకా' అనబడును. కృష్ణ ప్రతిపత్ నాటి ఆపరాహము గడచి సాయా హ్న ము ఆరంభమగు సమయము పౌర్ణమా సేష్టికి సముచిత సమయము. ఏ పూర్ణిమనాడు రవి క్రాంతివృత్తమున సంపాత స్థానమందుండగా చంద్రుడు రవినుండి ఆరు రాసుల ( భా.),దూరములో విషువద్వృత సంధిస్థానమునందుండి అతనిని చూచుచుండునో ఆ కాలమును కృష్ణ ప్రతిపత్ 'ఆరంభము కాకుండునంతలో సూర్యుని గతిని అనుసరించి గణన చేసి తెలిసికొనవలెను. సరిగా ఆ సమయము వషట్కార సహితమగు శ్రోతస్మార్త సత్కర్మానుష్టానమునకు తగిన సమయము.
దీనినే షష్టకాలము అనియు పిలుతురు, రవి కిరణములలో నొకటగు సుషుమ్నా కిరణముతో పూరింపబడుచుండు అమ్మ తము కల చంద్రుడు పూర్ణిమనాటీ ఆర్ధరాత సమయమున నిండుగా అమృతము కలిగియుండును. అందుచే ఆ తిథికి ' పూర్ణిమా! (నిండుదనము గలది' అని పేరు. ఆ అమృతముతోనే ఆనాడు చంద్రుడు ప్రాణులకును ఆప్యా యనము (పరి తప్పి కలిగించును. ఆనాడు చంద్రుడును రవియును పగలు అపరాహ్లా సమయమున బ్రాంతి వృత్త విషువ వృత్తముల సంపాత ప్రదేశమందుండి పరస్పరము నిండు చూపుతో (పూర్ణ దృష్టి తో చూచుకొందురు. అందుచే గూడ ఈ తిథికి పూర్ణిమా యని పేరు. ఇట్టి పూర్ణిమ తిథిని పితరులును దేవతను ఆనుమతింతురు కావున దీనికి అనుమతి యనియు వ్యవహారము. ఈనాడు చంద్రుడు మిక్కిలిగా " ( మేర మీరి రాజిల్లును కావునను ప్రాణులను అతడు రంజిల్ల(ఆనందింప జేయును గావును ఈ విధమగు పూర్ణిమకు 'రాకా' అనియు నామము. చంద్రసూర్యులు కలిసి అమా-క లిసి) ఉండు తిథికి అమావాస్య (అమా-కూడి ఒకటిగా; వసత –వంతురు) అని వ్యవహారము. ఈ అమావాస్య నాడు చంద్రసూర్యులు ఒకేచోట కూడి దర్శనము ఇత్తురు. కావున ఈ తిథికి ' దర్శ’ ఆనియు పేరు కలిగినది. పూర్ణీమా-కృష్ణ ప్రతిపత్ లకు నడుమ కాని అమావాస్యా - శుక్ల ప్రతిపత్ లకు నడుమ కాని ఉండు సంధికాలము రెండు లవముల పరిమాణముతో నుండును. ఇది కోకిల కుహూ' అని రెండక్షరములు పలికినంత కాలమే; కనుక అమావాస్యనాటి ఇట్టి పర్వ సంధికాలమును 'కుహూ' అందురు. ఇది వింతగా కనబడు అర్థము. పొ స్తవమున ఈ 'కుహూ' పదము 'గుహూ' పదము నుండి మారినది; అనగా చంద్రకళ పూర్తిగా మరుగుపడి కొంచెము కూడ ఆనాడు కనబడదని అర్థము.) ఇది శ్రాత కర్మలకు తగిన పర్వకాలము.
దృష్టచన్ద్ర త్వమావాస్యా మధ్యాహ్నప్రభృతిహవై ।
దివా తదూర్ధ్వం రాత్ర్యాంతు సూర్యే ప్రాప్తేతు చన్ద్రమా:॥
సూర్యేణ సహసోద్గచ్చే తాతస్స్నానాత్తు వై తతః।
సమాగమ్య లవౌ ద్వౌతు మధ్యాహ్నా న్ని వతద్రవిః॥
ప్రతిపచ్చుక్లపక్ష స్య చన్ద్రమా స్సూర్యమణాలాత్ ।
నిర్ముచ్యమానయో ర్మధ్యే తయోర్మణ్డలయోస్తు వై ॥
తస్మా ద్దివాహమావాస్యో గృహ్యతే యే దివాకరః।
కు హేతి కోకిలే నోక్తం యస్మా త్కాల సమాప్య తే॥
తత్కాలసమ్మితా హ్యేషా అమావాస్యా కుహూ స్స్మృతా ।
సినీవాలీ ప్రమాణంతు క్షీణఏష నిశాకరః॥
అమావాస్యా విశత్యర్కం సినీవాలీ తదా స్మృతా ।
అనుమతిశ్చ రాకాచ సినీవాలీ కుహూ స్తథా॥
ఏతాసాం ద్వీలపః కాలః కుహూమాత్రా కుహూః స్మృతా ।
ఇత్యేష పర్వసన్దీనాం కాలోవై ద్విలవ స్స్మృతః॥
పర్వణాం తుల్యః కాలస్తు తుల్యాహుతివషట్క్రియా ।
చన్ద్రసూర్యవ్యతీపాతే సామవై పూర్ణిమే ఉభే॥
ప్రతిపర్ప్రత్తిపన్నస్తు పర్వకాలో ద్విమాత్రకః ।
కాలః కుహూ సినీవాల్యౌ సముదౌ ద్విలవ స్సృతః॥
అరాగ్ని మణ్డలే సోమే సర్వకాల కలా స్సమాః ।
యస్మా దాపూర్యతే సోమః పఞ్చదశ్యాం తు పూర్ణిమా॥
దశభిః పభిశ్చైవ కలాభి ర్దివస క్రమాత్ ।
తస్మా త్సఞ్చదశే సోమక లావై నాస్తి షోడశీ॥
తస్మా త్సోమస్య విప్రో కా పక్చాదశ్యాం మహఃక్షయః ।
ఇత్యేతే పితరో దేవా స్సోమపా స్సోమవర్ధ నాః॥
ఆర్తజా ఋతవోఽథాబ్ధా దేవాస్తాస్ భావయన్తిహి ।
ఆతఃపరం ప్రవక్ష్యామి పితృ కొద్దభుజస్తుయే॥
శ్రాద్దభోక్తృపితృనిర్ణయ- స్తద్గతినిర్ణయశ్చ॥
తేషాం గతించ సత్త్వంహ ప్రాప్తి శ్రాద్ధస్య చైపహి।
న మృతానాం గతిశ్శక్యా జ్ఞాతుoవా పునరాగతిః॥
అమాబాస్య నాడు వలేనే ఇతర తెడు లందును పర్వ సంధికాలము రెండు లవముల పొటే యుండును. ఇదియు కుహూ' అను కోకిల కూతయంత కాలమే యగును. ఏనాడు మధ్యాహ్న సమయమున అమావాస్య ఆగుభమగునో ఆనాడు చందు డుదయించవలసిన వేళ కే అతనితో పాటు కలిసి సూర్యుడును ఉదయించుచుండును; కనుక చంద్రునిలో మిగిలిన ఒక కళ కూడ కనబడదు. కావున ఆ అమావాస్యను 'సష్ణచంద్రా' చంద్రుడు కనబడనిది' అందురు, ఇదియే వాస్తవ మయిన 'కుహూ' అగును. ఆ మరునాడు మధ్యాహ్న సమయము మీదట చంద్రుడు రవినుండి వేరుపడుట ఆరంభము అగును. అటి పర్వ సంధికాలము (అమావాస్య ముగిసి ప్రతిపత్ ఆరంథమగు సమయము 'ఆన్వాహుతులు' అను శాత కర్మలకును 'దర్శ'యందు చేయదగిన వషట్కార (గౌతకర్మలకును సముచిత 'సమయము. ఇట్టి అమావాస్య నాటి పర్వ సమయమునను 'ఋతుముఖ 'మని వ్యవహారము. ఇట్లు ఆనాడు చంద్రుడు ఒక్క కళ కూడ బొత్తుగా కనబడకుండ పోవు ఆ అమావాస్య శుక్ల పక్షారంభమగు మధ్యాహ్న కాలము వరకు ఉండి ఆ సమయపు రవి అమావాస్యకు చెందిన రవిగా గ్రహింపబడును. కావున అది శ్రాత కర్మానుష్టానమునకు ప్రశ సకాలము. పర్వ (అమావాస్యా) శుక్ల ప్రతిపత్ సంధి కాలములో సరిగా రెండు లవముల (కోకిల ‘కుహూ' అని పలుకునంత) కొలము సరియగు కుహూ అని గ్రహించవల యును. క్షీణించినంత క్షీణించినను మిగిలిన చంద్రకళ ఎంత సేపు కనబడునో అంత కాలము ఆ అమావాస్య 'సినీవాలీ' అనబడును. అట్టి అమావాస్యతో రవికి సంబంధ ముండుటచే ఆ తిథికి ఈ పేరు వచ్చినది. ''సిని' అనగా చంద్రుడు; అతనితో సంబంధము గల తిథి 'సినీవాలి') ఈ విధముగా కుహూ' అను రెండక్షరముల ఉచ్చారణ కాలము అగు ద్వి లవముల కాలమే అనుమతి.రా కాసినీవాలీ.కుహూ అను నాలుగు పర్వ సంధులకును కాల పరిమితి అని తెలియవలెను. పర్వకాలముల పరిమితి వలెనే వాటిని ఆశ్రయించి చేయవలసిన ఆహుతి-వషట్కార పూర్వక శాతకర్మలకాల పరి మితియు సమానముగా నుండును. చంద్ర సూర్యులకు వ్యతీపాతము సంభవించుట (కాంతివృత్త విషువవృ త సంపాతము లందు ఇద్దరును భాగల దూరమందుండి పరస్పరము చూచుకొనుట) చేతనే రాకా అనుమతి - అను రెండు విధములగు పూర్ణిమలును ఏర్పడుచున్నవి. అ పూర్ణిమా కృష్ణ ప్రతిపత్ ల పర్వ సంధికాలము కూడ ద్వి లవ పరిమితమే. కుహూ - సినీవాలీ-అను రెండు వర్వముల కాల పరిమితియు ద్వి లవములే. చంద్ర సూర్యాదుల తేజః కళల సంబంధము చేతనే పర్వ సమయములు ఏర్పడును. కావున సూర్యాగ్ని తేజః క ళా సంబంధము గల చంద్రుని కళలును పర్వ కాలములందు అందులకు అనుగుణముగా అగ్ని సూర్యుల సంబంధానుసార ముండును. (అందుచేత నే చంద్ర సంబంధము పై ఆధార పడి ఏర్పడు పర్వదినములు శ్రాత కర్మలకు ప్రశ స్తము లనబడును.) సోముడు దినమున కొక కలవంతున కలా పూర్తి నొందుచు పూల్లీమనాడు పదునైదు కళలు కలవాడగును. (ఇదికాక అత నియందు ఎప్పుడును సదా తరుగక పేరుగక యుండుపదునారవ కళ యొక టి సాదా కలదు. అది వృద్ధిక్షయములలో పాలుపంచుకొనదు. ) కావున నేను పంచదశ కళల తోనే చంద్రుడు వృద్ధి క్షయములకు పాలుపడునని చెప్పితిని. సోమపులు సోముని అమృతమును త్రోవువారు) “సోమవర్గనా?” (సోమునిచే వృద్ధి నొందుచు సోముని కూడ వృద్ధి నొందించువారు) అనబడు పితరులనబడు దేవతల విషయము ఇట్లుం డును. వీరికి ఋతువులు.ఆ ర్తవులు అనియు వ్యవహారము కలదనియు వీరిని (ఆజాస-కర్మ దేవతలు కూడ కర్మాను ప్లానమున భావన చేయు చుందురనియు ఎరుగవలయును. ఇక మీదట శ్రాద్ధములను అనుభవించు పితృ దేవతలు. ఎవరో. వారి గతులు (వారి ఆశ్రయ స్థానములును ప్రవృత్తులును ఎట్టివో లోకమందలి ఆయా వర్ణములవారు ఇచ్చు శ్రాద్ధములు వారి కెట్లు అందునో తెలి పెదను; వినుము. ఏలయన ప్రాణులు మృతులైన తరువాత ఆ జీవుల గతి - లోకములందు పా రెచ్చటనంచరించుచుందురో.మరల పొ రెట్లు ఈ లోకములో ఎక్కడకు వత్తురో తెలియుట (శాస్త్ర ప్రమాణ ముతోనే తప్ప) శక్యము కాదు.
తపసా(ఽపి)హి ప్రసిద్దేన; కింపునర్మాంసచక్షుషా ।
తత్ర దేవా న్పితౄం శ్చైవ పితరౌ లౌకిక శ్రితాః॥
తేషాం తే ధర్మసామర్థ్యాత్ స్మృతాః సాయుజ్యగా ద్విజైః ।
యది చాశ్రమధర్మేణ సంప్రస్థానే ర్వ్యవస్థితాః॥
అన్యే చాత్ర ప్రసీదన్తి శ్రద్ధాయు క్తేషు కర్మసు ।
బ్రహ్మచర్యేణ తపసా యజ్ఞేన ప్రజయా భువి॥
శ్రాద్దేన విద్యయా చై వాన్న దానేనచ సప్తధా ।
కర్మ స్వేతేషు యే సత్తా వర్తన్త్యాదేహపాతనోత్॥
దేవై స్తేపితృభిస్సార్ధమూష్మపై సోమపై స్తథా ।
స్వర్గతా దివి మోద న్తే పితృమస్త ముపాసతే॥
ప్రజ్ఞావతాం ప్రసిద్ధైషా ఉక్తా శ్రాద్ధకృతాంచ వై॥
తేషాం నివా పే దత్తాని తత్కులీనైస్తు బాన్దవై: ॥
మాస శ్రాద్ధంహి భుఞ్జానా స్త్వప్యన్తే సోమలోక కైః ।
ఏతే మనుష్యాః పితరో మాసశ్రాద్ధభుజస్తు వై॥
తేభ్యః పరేతు యేత్వన్యే సజ్కీర్ణాః కర్మయోనిషు ।
భ్రష్టాశ్చాశ్రమధర్మేషు స్వధాస్వాహావివర్జితాః॥
భిన్నే దే హే దురవస్థాః ప్రేత భూతా యమక్షయే ।
స్వకర్మాణ్యనుశోచన్తో యాతనాస్థాన మాగతాః॥
దీర్ఘా శ్చైవాతిశుష్కాశ్చ శ్మశ్రులాశ్చ వివాససః ।
క్షుత్పిపాసాభిభూతా స్తే విద్రవన్తి తత స్తతః॥
సరిత్సర స్తడాగాని పుష్కరిణ్యశ్చ సర్వశః ।
పరాన్నా న్యభికాజ్ఞ స్తః కాలమానా స్తత స్తత॥
స్థానేషు పాఠ్యమానా యే యాతనా స్తేషు తేషువై ।
శాల్మల్యాం వైతరణ్యాంతు కుమ్భ్యాం కారమ్భవాలు కే॥
అసిపత్రవనేచైవ పాత్యమానా స్వకర్మభిః ।
తత్రస్థానాంతు తేషాంపై దుఃఖితానా మశాయినామ్॥
మృతులై న జీవులు ఏ గతి కేగుదురను విషయమును ప్రసిద్ధమగు మహా తపస్సుతో కూడ తెలియుట సాధ్యము కాదనిన మాంస నిర్మితమగు కంటితో చూచి ప్రత్యక్ష ప్రమాణముతో తెలియుట ఎట్లు సాధ్యమగును। .
లౌకికులగు పితరులు శ్రాద్దము చేయు యజమానుని మృత పితృ పితామహ ప్రపితామహా నలు) ద్యులోక వాసు లగు పితృదేవతలను ఆశ్రయించి వారి ద్వారమున) సద్దతిని పొందుదురు. వారు వా రాచరించిన ధర్మపు సామర్థ్యముచే ద్యులోక వాసి దేవతలును పితృ దేవతలును ఈ లౌకిక పితృ పితామహ ప్రపితామహాది పితరులకు తమతోడి సాయుజ్య మునో తమ లోకమందు వీరి నివాసమునో అను గ్రహించి సుఖింప జేయుదురు. ఈ లౌకిక పితరులు గాని వారి పుత పౌత్రాది సంతతి కాని తమ తమ ఆశ్రమ ధర్మములను ఆయా కర్మానుష్ఠాన సంప్రదాయములను చక్కగా పాటించుచు వ్యవస్థానుసారము జీవించుట చే వీరికి పరలోకమున సద్గతి కలుగును. ఈ లెక్క పితృ పితామహాదుల పుత్ర పౌత్రాం దులు వీరి నుద్దేశించి శ్ర దాయుక్తులయి కర్మల నాచరించుటచే గూడ ఈ లౌకిక పితరులకు సద్దతి కలుగును. బ్రహ్మ చర్యము -తపస్సు.యజ్ఞము ఆచరించుట. సత్సంతానమును కనుట- శ్రాద్ధకర్మలను శ్రద్ధతో ఆచరించుట - విద్యాధ్యయనము చేయుట. అన్న దానము చేయుట. ఇవి ఏడును లౌకిక పితరుల సద్దతికి హేతువులు. కావున దేహము పడిపోవు వరకును ఇవి విడువక ఆచరించుచుండవలయును. పితరులయందు శ్రద్ధాభక్తులు గల తమ పుత్ర పౌత్రాదులను ఉపాసించి ( ఆధారముగా చేసికొని) ఈ లౌకిక పితరులు లోగడ చెప్పిన సోమపులు - ఊష్మపులు అను పితృ దేవతలతోను దేవతల తోను కూడి స్వర్గలోకమున మోదముతో సుందురు. సంతానవంతులగు ఈ లౌకిక పితరులు తమ పుత్త పౌత్రాదులు చేయు శ్రాద్ధాది కర్మలతోను వారి వంశమునందలి జ్ఞాతిజనులు గాని బాంధవులుగాని ఇచ్చు తర్పణోదకము మొదలగు వానితోను వీరు జరుపు- మాస శ్రాద్ధము మొదలగు వానితో ను తృపి చేదీ సోముని అమృతము అందేడి లోకములలో ఆనందించు చుందురు. మాస శ్రాద్ధముల ననుభవించు అదృష్టము పట్టు మానవ లౌకిక)పితరుల విషయము ఇది.
ఈ చెప్పిన విధమగు ఆచరణములతో తమ జీవితము గడుపక ఆయా పుణ్యాపుణ్య సం మిశ్రమగు సంకీర్ణ కర్మ ములను (శాస్త్రవిధి ని షేధములను పట్టించుకోక తమకు తోచినట్లు చేయు కర్మలు సంకీర్ణ కర్మములు ఆచరించుచు దానిచే లభించు ఆయా వివిధ జన్మ ములందును తమ వర్ణాశ్రమ ధర్మములను శాస్త్రానుసారము పాటించక భ్రష్టులై స్వాహా.స్వధాకారములతో దేవపితృ కర్మములు ఏవియు ఆచరించక జీవించినవారు తమ దేహము పోయిన తరువాత పేత భూతులయి యముని లోకమునకు పోయి దురవస్థల పాలయి యాతనానుభవ స్థానమున కేగి తాము ఈ లోకమున చేసిన ఆయా కర్మములను తలచుకొని పశ్చాత్తాపపడుచు శోకించుచు ఉందురు. అచ్చట వీరు పొడవగు దేహములతో రక్త మాం సములు లేక శుష్కించి గడ్డములు మీసములు తెగ పెరిగి వస్త్రములు లేక ఆకలి దప్పులతో బాధ పడుచు యాతనో లోకములో ఆటు ఇటు పద గేత్తుచుందురు. ఆయా యాతనాస్థానములందు పడవేయబడుచు వారు యాతనల ననుభవింతురు. ఇతరు లేవ రైన ఆన్న ము పెట్టుదురాయని పరాన్న ములు కోరుచు నదులు సరస్సులు చెరువులు కోనేరులు (నీటి కై ) వేద కుచు పోయి పోయినచోటినుండి యమదూతలచే) తరిమివేయబడుచు తిరుగుచుందురు. అచట వీరిని ఆ దూతలు శాల్మలి (ముండ్ల బూరుగు వైతరణి నెత్తురు.చీము మొదలగు కశ్మలముతో నిండిన నది) కుంభి కారంభ వాలుకము - ఆసివత్ర మ.పు.
వనము మొదలగు యాతనా స్థానములందు తమ తమ కర్మానుసారము పడద్రోయబడుదురు. వా రచట ఎంతో దుఃఖ మనుభవించుచు పండుకొనుటకు తావు దొరుకక బాధ పడుచుందురు.
తేషాం లోకా న్తరస్థానాం బాన్దవై ర్నామగోత్రతః ।
భూమా వా స్తృతదర్భేషు దత్తాః పిణ్డా స్త్రయస్తు వై॥
ప్రాప్తాస్తు తర్పయన్త్యేవ పేతస్థానే ష్వధిష్ఠితాక్ ।
అప్రాప్తా యాతనాస్థానం ప్రభ్రష్టా యేచ పఞ్చధా॥
పశ్చాద్యే స్థావరాంతేవై భూతానీ కే ప్రయత్నతః ।
యేచాన్యే స్థావరాస్తే వై భూతదీప్తై స్వకర్మభిః॥
నానారూపాసు జాతేషు తిర్యగ్యోనిషు మూర్తిషు ।
యదాహారా భవ న్త్యేతే తాసుతాస్వితి యోనిషు॥
తస్మిం స్తస్మిం స్తదాహారే శ్రాద్ధంద తంతు ప్రీణయేత్ ।
కాలే న్యాయాగతం పాత్రే విధినా ప్రతిపాదితమ్॥
ప్రాప్నువ న్త్యమరా దత్తం యత్రయత్రచ తిష్ఠతి ।
యథా గోష ప్రతిష్ఠాసు వత్సో విన్దతి మాతరమ్॥
తద్వచ్ఛా స్త్రేషు దృష్టాన్తో మన్త్రః ప్రాపయతే పురమ్ ।
ఏవం హ్యవికలం శ్రాద్ధం శ్రద్దాదత్తం మను ర్భ్రవీత్॥
సనత్కుమారః ప్రోవాచ పశ్యన్ది వ్యేన చక్షుషా ।
గతాగతజ్ఞః ప్రేతానాం ప్రాప్తిం శ్రాద్దస్య చై వహి॥
కృష్ణ పక్ష స్త్వహస్తేషాం శుక్లే స్వప్నాయ శర్వరీ ।
ఇత్యేతే పితరో దేవా దేవాశ్చ పితరస్తు యే॥
అన్యోన్యపితరో హ్యేతే దేవాశ్చ పితరో దీవి ।
ఏతేతు పితరో దేవా మనుష్యాః పితరస్తు వై॥
పితా పితామహ శ్చైవ తథైవ ప్రపితామహః ।
ఇత్యేష విషయః ప్రోక్తో పితృణాం సోమపాయినామ్॥
ఏతత్పతృమహత్త్వంహి పురాణే నిశ్చయం గతమ్
ఇత్యేష సోమసూర్యా భ్యా మైళస్య చ సమాగమః॥
అవాప్తిః శ్రద్ధయాచైవ పితృణాం చైవ తర్పణమ్ ।
పర్వణాం చైవ యః కాలో యాతనాస్థాన మేవచ॥
సమాసా త్కీర్తిత స్తుభ్యం సర్గ ఏష సనాతనః ।
వై దుష్యాయ న తత్సర్వం కథితం త్వేక దేశ కమ్॥
అశక్యం పరిసజ్ఖ్యాతుం శ్రద్దేయం భూతి మిచ్ఛతా ।
స్వాయమ్బువస్య దేవస్య ఏష సర్గో మ యేరితః॥
విస్తరేణానుపూర్య్వాచ్చ భూయః కిం కథయామి వః॥
ఇతి శ్రీమత్స్యమహాపురాణే మన్వన్తరానుకీ ర్తనే ఆమావాస్యాకాలనిర్ణయాది కథనం సామ చత్వారింశదు త్తర శతతమోఽధ్యాయః॥
ఇట్టివారు లోకాంతరములందు యాతనా స్థానములందు ఉన్న ను వారి బాంధవులు ఈ లోకమందు ఈ పేతల నామ గోత్రముల నుచ్చరించుచు భూమిపయి దర్భలను పరచి మూడు పిండములను ఉంచగా అవి ఈ. శ్రాద్ధకర్తృ యజ మానుని పితృ పితామహ ప్రపితామహులకు అంది వారికి తృప్తి కలిగించును. ఒక వేళ ఈ శ్రాద్ధకర్తృ యజమానుని మృత లౌకిక పితరులు లోకాంతరము లందు యాతనా స్థానములందుండక అచటినుండి ఈవలకు పడి దేవాసుర మానవ తిర్యక్ స్థావర జన్మములు అను ఐదింటిలో దేనియందై న నున్న ను స్వక గ్మానుసారము స్థావర జన్మములందు భూతత్వ మాత్రమును సూచించు ఎంత క్షుద్ర జన్మమునందు ఉన్న ను తిర్యక్ పశుపక్షి మృగ) జన్మములందలి నానా రూపములు గల యోనుల (జన్మములలో ఏయోనియందు ఏ మూర్తితో నున్న ను అందు ఆ ప్రాణి ఏఆహారమును తినునదియైనచో ఈ శ్రాద్ధకర్తృ యజమానుడిచ్చిన శ్రాద్దీయాహారము ఆ ఆహారముగా మారి ఆప్రాణిని తృప్తినొందించును. ఆంతేకాక ఈ పేతప్రాణి తన జీవితకాలమందు తాను కాని అతని పుత్ర పౌత్రాదులు ఇప్పుడు కాని తమ న్యాయార్జిత ధనము నుండి సత్పాత్రమునందు శాస్త్ర విధిననుసరించి ఇచ్చిన దానపుఫలముకూడ దేవతలచే గ్రహింప (అందుకోనబడి అది పొరిచే ఈ మృత పేత ప్రాణికి -ఆ ప్రాణి ఏ జన్మమునందున్న ను. అందజేయబడును. గోవులు తప్పిపోయి ఎచ్చట ఏవిధముగా నున్నను దూడ పోయి తన తల్లిని గుర్తించగలదు. ఆళ్లీ మంత్రము శ్రాద్ధ దానాది ఫలమును ఆ పేత ప్రాణికి అంద జేయును. అను ఈ లౌకిక దృష్టాంతముతో ఇది శాస్త్రములందు చెప్పబడియున్నది. ఇట్లు శ్రద్దతో జరిపిన శ్రాద్దము అవికలము-సంపూర్ణము. సమగ్రము. అగునని మనువు చెప్పెను. అని సనత్కుమారుడు తన దివ్య తపోమయ నేత్రముతో చూచి పేతల గతాగతములను వారికి శ్రాద్ధఫలములు అందు విధమును ఎరిగి చెప్పెను. ఈ పితృలోకస్థ పితరులకు (పితృదేవతలకు; లౌకిక పితరులకు కొదు) మానవుల కృష్ణపక్షము పగలుగా- శుక్లపక్షము రాత్రిగా అగును. ఇట్లు పితృదేవతలు - దేవతలు (లౌకిక) పితరులు అను మూడు విధములగు వారి విషయమును చెప్పబడినది. పితృదేవతలును దేవతలును ద్యులోకమున వీరికి వారును వారికి వీరిని పరస్పరము పితరులుగా ఆరాధన లందుకొందురు. మనుష్య పితరులు. లేదా లౌకిక పితరులు అనగా మానవలోకమునందలి శ్రాద్ధక రృ యజమానుల పితృపితామహ ప్రపితామహులు అని తెలియవలయును. సోమ పాయులగు (సోమునినుండి లభించు అమృతమును శ్రావు) పితరుల విషయము ఇది; అన్ని శాస్త్రముల.దును ప్రవచింపబడిన దానిని నీకు చెప్పితిని. ఇదియంతయు పురాణమునందు (ఇచట పురాణము అనగా మనకు ఈనాడు లభించుచున్న పదునెనిమిది పురాణములలో ఏదో ఒకటి అని కాదు. వేదమునందలి ఒక యంశముగా పురాణము అను వాజ్మయాంశము కలదు. అది వాస్తవమున వేదమునకు పూరణము; ఈ విధమగు 'పురాణము నందలి కొన్ని వచనములను ఆపస్తంబాది మునులు తమ ధర్మ సూత్రము లందు ఇచ్చియున్నారు. మరికొన్ని ఈనాడు మనకు లభించు స్మృతులలో వైదిక రూపమును కోల్పోయి లౌకిక మగు సంస్కృతపు రూపమునకు మారి కనబడుచున్నవి.) పితృ మహత్వము ( పితరుల గొప్పదనము) అను పేరుగల ప్రకరణమునందు చెప్పబడియున్నది.
ఇట్లు నీకు ఇచట ఇలాపుత్రుడగు పురూరవసుడు తన మాతామహుడగు సూర్యుని పితామహుడగు చంద్రుని కలియుటయు శ్రద్దాయుకుడే అతడచట శ్రాద్ధకాల మెరిగి ఆకాలమునకు వేచియుండుటయు పితరుల నతడు తృప్తి నొందించుటయు పర్వకాల పరిమాణ స్వరూపమును మృత పేత ప్రాణుల యాతనాస్థాన స్థితిని నీకు " సం షేపముగ తెలిపితివి. ఇది సనాతనము నిత్యమును అతి ప్రాచీనమును) ఆగు సృష్టి వ్యవస్థ ప్రకారము. నీకు దీనియందు వై దుష్యము సంపూర్ణ పాండిత్యము) కలుగునంత విస్తరముగ కాక ఏక దేశము .ఆల్పాంశము.మాత్రము తెలిపితిని. ఇదీయంతయు పరిసంఖ్యానము చేయుట పరితః. సమగ్రముగా; సంఖ్యాయ లెస్సగా ఎరిగి-ప్రతిపాదించుట ఎట్టివారికిని శక్యముకాదు. దీనిని మానవులు వ్యవస్థ చేసిన ప్రత్యక్షానుమా నాది ప్రమాణములతో నిరూపించ అలవికాదు. నిరూ పించ రాదు. తనకు { ఇహమునను పరమునను) క్షేమము కలుగవలెనని కోరువాడు దీనిని శ్రద్దతో సర్వ సాధారణ దృష్టికందనిదియు కలదను నమ్మికతో) ఆచరించవలయును. స్వాయంభువమనుని సృష్టి వ్యవస్థా ప్రకార మిది నీకు విస్తరించి ఆను పూర్వితో (దేని తరువాత ఏది చెప్పవలెనో ఆదే క్రమమున చెప్పితిని. మీకు ఇంకేమి చెప్పవలయు నందురో అడుగుడు.
ఇది శ్రీమత్స్యమహాపురాణమున మన్వంత రాను కీర్తనమున అమావాస్యా కాలనిర్ణయాది ప్రతిపాదనమను నూట నలువదియవ అధ్యాయము .
Summary of chapter 140 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya presents a grand narrative of Mahādeva's wedding procession departing from Mount Kailāsa toward Himāvān's capital. Mahādeva rode His sacred bull Nandi, accompanied by the Ekādasha Rudras, the Vasus, Ādityas, Gandharvas, Pramathaganas, and celestial musicians. Bhagavān Brahmā served as the presiding priest, while Bhagavān Vishṇu performed the ceremonial giving away of Goddess Pārvatī amidst Vedic chants and showers of celestial blossoms.